AP 9th Class Social Notes Chapter 1 భూమి – మనం

Students can go through AP Board 9th Class Social Notes 1st Lesson భూమి – మనం to understand and remember the concept easily.

AP Board 9th Class Social Notes 1st Lesson భూమి – మనం

→ భూ వనరులను యథేచ్ఛగా దోచుకోవటం వల్ల అడవులు, నదులు, కొండలు నాశనమయ్యాయి.

→ తోటి జంతువులు, తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటున్నారు.

→ రాళ్ళు, నేలలు, ఖనిజాలు, నీళ్ళు, గాలి, సూర్యరశ్మి, అడవులు, జంతువులు, మనుషుల మధ్య పరస్పర సంబంధాలను నిరంతరం ఒకదానినొకటి ప్రభావితం చేస్తాయి.

→ అంగారక గ్రహంపైన వ్యోమ నౌకలు దిగాయి. 5. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారినే ‘కక్ష్య’ అంటారు.

AP 9th Class Social Notes Chapter 1 భూమి – మనం

→ భూమి కక్ష్య దాదాపుగా వృత్తాకారంలో ఉంది.

→ సూర్యుడి చుట్టూ గంటకు 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతోంది.

→ భూమి, సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగిరావడానికి పట్టే సమయం 365¼ రోజులు.

→ గ్రీకు పదమైన ‘eorthe’ యొక్క అర్థం నేల, మట్టి, పొడినేల.

→ భూమి లోపలి భాగం కూడా చల్లబడుతూ సంకోచం చెందుతూ ఉంటే పై పొర ముడతలు పడి ఎత్తులు, పల్లాలు ఏర్పడ్డాయి.

→ భూమిని ప్రధానంగా మూడు పొరలుగా విభజించవచ్చును అవి :

  1. భూపటలం
  2. భూప్రావారం
  3. భూ కేంద్ర మండలం.

→ భూ పటలం యొక్క మందం 30 – 100 కిలోమీటర్లు.

→ భూప్రావారం యొక్క మందం 100 – 2900 కిలోమీటర్లు.

→ భూ కేంద్ర మండలం యొక్క మందం – 2900 – 6,376 కిలోమీటర్లు.

→ భూ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది – ఆలైడ్ జినర్

→ టెథిస్ సముద్రానికి ఉత్తరంగా ఉన్న భూ భాగాన్ని అంగారాభూమి అంటారు.

→ టెథిస్ సముద్రానికి దక్షిణంగా ఉన్న భూ భాగాన్ని గోండ్వానా భూమి అంటారు.

→ భూమికి మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని భూమధ్యరేఖ అంటారు.

→ భూమధ్యరేఖను 0° అక్షాంశంగా గుర్తిస్తారు.

→ రేఖాశాస్త్రంలో కోణాలను సూచించినట్లే అక్షాంశాలను కూడా డిగ్రీలు (°) నిమిషాలు (‘) సెకండ్ల (‘) లో సూచిస్తారు.

→ భూమధ్యరేఖకు ఉత్తర ధృవానికి మధ్య ఉన్న భూమి సగభాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు.

→ భూమధ్యరేఖకు దక్షిణ ధృవానికి మధ్య ఉన్న సగభాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు.

→ అక్షాంశాలను లాటిట్యుడ్ అంటారు. రేఖాంశాలను లాంగిట్యుడ్ అంటారు.

AP 9th Class Social Notes Chapter 1 భూమి – మనం

→ అక్షాంశాలను వృత్తాలు అని, రేఖాంశాలను అర్థవృత్తాలు అని అంటారు.

→ ఇంగ్లాండ్ లోని గ్రీన్ విచ్ – (ఉచ్చారణ గ్రీనిచ్) లోని నక్షత్రాల గుండా పోయే రేఖాంశాన్ని 0° మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటారు.

→ మొత్తం రేఖాంశాలు – 360

→ మొత్తం అక్షాంశాలు – 191

→ ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్ కి తూర్పు, పడమరలను కలిపి మొత్తం 24 కాల మండలాలుగా విభజించారు.

→ విశ్వ విస్ఫోటనం : 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వ ఆవిర్భావానికి జరిగిన పెద్ద విస్ఫోటనం.

→ గ్రిడ్ : గ్లోబు మీద అక్షాంశాలు, రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు, అడ్డుగీతలతో గళ్ళు ఏర్పడతాయి. దీనిని గ్రిడ్ అంటారు.

→ గోండ్వానా : ప్రస్తుత దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా భూభాగాలు విడిపోక పూర్వం ఉన్న భూభాగం.

→ ప్రామాణిక రేఖాంశం : దేశం గుండా వెళ్లే ఒక రేఖాంశాన్ని ఎంచుకుని ఆ రేఖాంశం వద్ద సమయాన్ని దేశమంతటికీ వర్తింపచేస్తారు. దీనిని ప్రామాణిక సమయం అంటారు.

AP 9th Class Social Notes Chapter 1 భూమి – మనం

→ కాల మండలాలు : అనేక రేఖాంశాలు ఉన్న దేశాలలో సమయాన్ని నిర్దేశించటం కష్టమౌతుంది. అటువంటి పరిస్థితిలో ఒక గంట వ్యవధితో దేశాన్ని పలు కాల మండలాలుగా విభజిస్తారు.

→ ప్రామాణిక సమయం : ప్రామాణిక రేఖాంశం వద్ద ఉన్న సమయాన్ని ప్రామాణిక సమయం అంటారు.

AP 9th Class Social Notes Chapter 1 భూమి – మనం 1