Students can go through AP Board 9th Class Social Notes 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు
→ ప్రాథమిక హక్కులు : కులం, మతం, జాతి, లింగ భేదం లేకుండా వ్యక్తులందరి హక్కులను రాజ్యాంగం కాపాడుతుంది. అయితే వ్యక్తికి మౌలికమైన కొన్ని హక్కులు ఉన్నాయి. ఈ హక్కులే ప్రాథమిక హక్కులు.
→ సమానత్వపు హక్కు : చట్టరక్షణలో, సామాజిక సమానత్వంతో, అవకాశాలలో సమాన ప్రాధాన్యతనిచ్చి, అంటరాన్నితనాన్ని, అస్పృశ్యతను రూపుమాపి, బ్రిటిష్ ప్రభుత్వ బిరుదులను సైతం రద్దుచేసి సమానత్వ విలువలను రాజ్యాంగం కల్పించింది.
→ స్వాతంత్ర్యపు హక్కు : వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛలతో, శాంతియుత సమావేశాలతో, సంఘాలు, సభలుగా ఏర్పడే హక్కును కల్పించి, స్వేచ్ఛగా సంచరించే , హక్కుతో, ఎక్కడైనా నివసించే అవకాశంతో, ఏ వృత్తి, ఉపాధి, వాణిజ్యం చేపట్టే హక్కుతో, జీవించే హక్కు కల్పిస్తుంది.
→ పీడనాన్ని నిరోధించే హక్కు : బలవంతపు చాకిరీలు నిషేధిస్తుంది. పౌరులు దోపిడీకి గురి కాకుండా చూస్తుంది. 14 సం||ల లోపు బాలలను ప్రమాదకర పనులలో పెట్టుకోవడం నిషేధమని వివరిస్తుంది.
→ మత స్వాతంత్ర్యపు హక్కు : మనదేశంలో లౌకికవాద స్పూర్తిని ఈ హక్కు కాపాడుతుంది. పౌరులందరూ తమ అంతరాత్మను అనుసరించి ఏ మతాన్ని అయినా అవలంబించడానికి, మత ఆచారాలను పాటించుకోడానికి, మతాన్ని మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
→ సాంస్కృతిక, విద్యావిషయక హక్కు : భాషాపరమైన, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు తాము ఎంచుకున్న విద్యాసంబంధ సంస్థలు స్థాపించి, నిర్వహించే హక్కు కల్పిస్తుంది. తమ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తుంది.
→ రాజ్యాంగ పరిహారపు హక్కు : ప్రభుత్వం ఈ హక్కులు ఉల్లంఘించినపుడు ఆ వ్యక్తి రాష్ట్రాల, దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు కల్పిస్తుంది. ప్రభుత్వం విఫలమైనపుడు రక్షణగా నిలుస్తుంది.
→ ప్రాథమిక హక్కులు : అణచివేతకు పాల్పడే ప్రభుత్వాల నుంచి ప్రజలకు ఈ హక్కులు రక్షణనిస్తాయి.
→ మానవ హక్కులు – ప్రజల మౌలిక హక్కులను రక్షించేవి.
→ వ్యాజ్యం / దావా – తమకు జరిగిన అన్యాయాలు ఉల్లంఘనలను తెలియజేస్తూ కోర్టుకు సమర్పించే ఒక విజ్ఞాపన పత్రం.
→ బిరుదులు : వ్యక్తులు వారి వారి రంగాలలో చేసిన కృషికి గుర్తింపుగా అందించే గౌరవాలు.
→ మధ్యవర్తిత్వం : రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్గాల మధ్య సంధి / సయోధ్య కుదిర్చే ప్రక్రియ.
→ ఉల్లంఘించబడుట : పొందలేకపోవుట / అతిక్రమించబడుట
→ రిట్ : న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసే అధికారం
→ వ్యక్తపరచుట : తెలియజేయుట
→ విశ్వవ్యాప్తం : ప్రపంచం మొత్తంగా
→ దోషి : తప్పు చేసినవాడు
→ నేపథ్యం : పూర్వచరిత్ర
→ ఉమ్మడి కుటుంబం : తాత, తండ్రులు, పిల్లలు అందరూ కలిసుండేది.
→ అభ్యున్నతి : ప్రగతి
→ ప్రాతినిధ్యం : ప్రాధాన్యత
→ వ్యక్తపరచడం : తెలియజేయడం
→ ప్రజాహితం : ప్రజా ప్రయోజనం