Students can go through AP Board 9th Class Social Notes 2nd Lesson భూమి – ఆవరణములు to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 2nd Lesson భూమి – ఆవరణములు
→ భూమిలో ఘనీభవించిన పొర, లేదా గట్టిగా ఉండే పై పొరను “శిలావరణం” అంటారు.
→ ‘లితో’ అంటే గ్రీకు భాషలో రాయి లేదా శిల అని అర్థం. ‘స్పేయిరా’ అంటే గోళం లేదా బంతి అని అర్థం.
→ నీరు ఉండే మండలాన్ని జలావరణం అంటారు.
→ హ్యడర్ అనగా గ్రీకు భాషలో నీరు.
→ భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను “వాతావరణం” అంటారు.
→ అట్మా స్ అన్న గ్రీకు పదానికి “ఆవిరి” అని అర్థం.
→ గాలిలో ఎంతో ఎత్తున, సముద్రాలలో ఎంతో లోతున ప్రాణులు, బ్యాక్టీరియాతో సహా ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు.
→ బయోస్ అనే గ్రీకు పదానికి జీవం అని అర్థం.
→ భూమి పై పొరను ప్రాథమికంగా మహా సముద్రాలు, ఖండాలుగా విభజిస్తారు.
→ కొండలు, మైదానాలు, పీఠభూములను, రెండవ శ్రేణి భూస్వరూపాలు అంటారు.
→ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో – ఆస్ట్రేలియా, అంటార్కిటిక్, యూరేసియా, పసిఫిక్ అన్నవి పెద్ద ఫలకాలు.
→ నాజ్ కా, అరేబియా వంటివి చిన్న ఫలకాలు ఉన్నాయి.
→ తాజాగా ఏర్పడిన ఈ పై పొర ఫలకాన్ని మిట్ట నుంచి దూరంగా నెడుతుంది. సముద్రపు నేల విస్తరణ అన్న ప్రక్రియకు ఇది దారితీస్తుంది.
→ బయటికి ప్రవహించిన శిలాద్రవం ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడుతుంది. దీనిని “అగ్నిపర్వతం” అంటారు.
→ లావాలో కొంత భాగం పైకి రాకుండానే కింది పొరల్లోనే చల్లబడి, శిలలుగా గట్టి పడుతుంది. వీటిని “లోపలికి ఏర్పడిన భూస్వరూపాలు” అంటారు.
→ భూమి ఉపరితలం పైకి వచ్చిన లావాలో కొంత భాగం బయటికి చొచ్చుకు వచ్చిన భూస్వరూపాలు అంటారు.
→ నీరు, గాలి వల్ల రూపొందే భూ స్వరూపాలను భూ శాస్త్రవేత్తలు “మూడవ శ్రేణి” భూస్వరూపాలు అంటారు.
→ రాళ్ళలోని రసాయనాలతో నీళ్ళు ప్రతిచర్య చెంది వాటిని మరింత బలహీన పరుస్తాయి. రాళ్ళు బలహీనమయ్యి, పగిలిపోయే ఈ ప్రక్రియను “శిలాశైథిల్యం” అంటారు.
→ గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలం పై పొరలు కొట్టుకుపోవటాన్ని “క్రమక్షయం” అని అంటారు.
→ కోతకు గురైన రాళ్ళు కంకర, మట్టి, వండ్రు వంటి వాటిని గాలి, నీళ్ళు మోసుకుపోవటాన్ని రవాణా అంటారు.
→ సముద్రపు నేలలో ఇది పొరలు పొరలుగా నిక్షేపమై కాలక్రమంలో అవక్షేపశిలలుగా మారతాయి.
→ రాళ్ళు (శిలలు) చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి, లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని “గార్జెస్” అంటారు.
→ నదీ నీటి కోతకు మరొక ముఖ్యమైన రూపం “అగాధధరి” అంటారు.
→ జలపాతంలో నీళ్ళు ఎంతో శక్తితో కిందకు పడతాయి. ఆ నీళ్ళు కింద పడేచోట ‘దుముకు మడుగు’ ఏర్పడుతుంది.
→ కాలక్రమంలో మెలిక తిరిగిన భాగం నది నుంచి తెగిపోయి ఒక చెరువులాగా ఏర్పడుతుంది. ఇటువంటి వాటిని “ఆక్స్ బౌ సరస్సు” అంటారు.
→ సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో మేటవేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేట వేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది. ఈ ప్రాంతం గ్రీకు అక్షరం డెల్టా (∆) రూపంలో ఉంటుంది.
→ గంగానది జన్మస్థానం – గంగోత్రి.
→ హిమానీనదాలు ‘U’ ఆకారపు లోయలను సృష్టిస్తాయి.
→ హిమానీనదం మోసుకుపోలేని ఈ పదార్థాలను వివిధ ప్రాంతాలలో మేటవేసిన వాటిని మెరైన్లు అంటారు.
→ సముద్రపు నీళ్లు తొలుచుకుంటూ ఈ రంధ్రాన్ని పెద్దగా చేయటం వల్ల గుహ పై భాగం మాత్రమే మిగిలి సముద్రపు తోరణాలు ఏర్పడతాయి.
→ సముద్రపు నీటి నుంచి దాదాపు నిటారుగా లేచే రాతి తీరాన్ని “సముద్ర బృగువు” అంటారు.
→ సముద్ర అలలు తీరం వెంట మేటవేసే పదార్థాల వల్ల బీచ్ వంటివి ఏర్పడతాయి.
→ వాతావరణ ప్రభావం, నిరంతర గాలి చర్యల వల్ల చాలా ఎడారులలో సన్నటి ఇసుక దిబ్బలుగా ఏర్పడతాయి.
→ ఫలకాల కదలికలు : ఫలకాలు వాస్తవంగా మధ్యపొర మీద తేలుతూ ఉంటాయి. ఇవి నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి. అందుకే అవి మెల్లగా కదులుతూ ఉంటాయి.
→ అగ్ని శిలలు : కరిగిన పదార్థం చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడుతుంది. వీటిని “అగ్నిశిలలు” అంటారు.
→ అవక్షేప శిలలు : సముద్రపు నేలలో ఇవి పొరలు పొరలుగా నిక్షేపమై కాలక్రమంలో “అవక్షేప శిలలు” గా మారతాయి.
→ లోయస్ మైదానాలు : లోయస్ మేటతో ఏర్పడిన మైదానాలను లోయస్ మైదానాలు అంటారు.
→ ‘U’ ఆకారపు లోయలు : కొయ్యముక్క నుంచి బరకకాగితం చిన్న రేణువులను తొలగించినట్లు – హిమానీనదం కూడా అది ప్రవహిస్తున్న రాతి పొరను కోతకు గురిచేస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా హిమానీ నదాలు ‘U’ ఆకారపు లోయలను సృష్టిస్తాయి.
→ మోరైన్లు : హిమానీనదం మోసుకుపోలేని ఈ పదార్థాలను వివిధ ప్రాంతాలలో మేట వస్తుంది. ఇలా మేట వేసిన వాటిని మెరైన్లు అంటారు.
→ పేరుడు స్తంభాలు : కోతకు గురైతే పై కప్పు కూడా పోయి పక్కగోడలు మాత్రమే మిగులుతాయి. ఈ గోడల లాంటి వాటిని పేరుడు స్తంభాలు అంటారు.
→ సముద్ర బృగువు : సముద్రపు నీటి నుంచి దాదాపు నిటారుగా లేచే రాతి తీరాన్ని సముద్ర బృగువు (శిఖరం) అంటారు.
→ పుట్టగొడుగు రాయి : రాయి పై భాగంలో కంటే కింది భాగం ఎక్కువగా కోతకు గురి అవుతుంది. అందువల్ల ఇటువంటి రాళ్లు కింద సన్నగా, పైన వెడల్పుగా ఉంటాయి. పుట్టగొడుగుల్లా ఉంటాయి కాబట్టి వీటిని పుట్టగొడుగు రాళ్లంటారు.