AP 9th Class Social Notes Chapter 3 జలావరణం

Students can go through AP Board 9th Class Social Notes 3rd Lesson జలావరణం to understand and remember the concept easily.

AP Board 9th Class Social Notes 3rd Lesson జలావరణం

→ నీళ్లు పునరావృతమయ్యే వనరు.

→ నీరు వివిధ రూపాలలో అంటే ద్రవ, ఘన, వాయు రూపాలలో ప్రసరణ కావటాన్ని ‘నీటి చక్రం’ అంటారు.

→ నీరు ద్రవరూపంలో నుంచి వాయు రూపంలోకి మారే ప్రక్రియను ‘బాష్పీభవనం’ అంటారు.

→ వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరటాన్ని ‘అవపాతం’ అంటారు.

→ లోపలికి ఇంకిన నీరు భూగర్భ జలమవుతుంది.

AP 9th Class Social Notes Chapter 2 భూమి – ఆవరణములు

→ మొత్తం నీటిలో 97.25% ఉప్పునీరుగా మహాసముద్రాలలో ఉంది. 2.75% మాత్రమే మంచినీరు. మంచినీటిలో 29.9% భూగర్భజలంగా ఉంది.

→ భూమి మీద ఖండాలను, మహాసముద్రాలను మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు.

→ అతిపెద్దవైన జలభాగాలనే మహాసముద్రాలంటారు.

→ చుట్టూ లేదా కనీసం ఒకవైపున భూమి ఉండే ఉప్పునీటి భాగాన్ని సముద్రం అంటారు.

→ మహాసముద్రాలు అయిదు :

  1. పసిఫిక్ మహాసముద్రం
  2. అట్లాంటిక్ మహాసముద్రం
  3. హిందూ మహాసముద్రం
  4. అంటార్కిటిక్ మహాసముద్రం
  5. ఆర్కిటిక్ మహాసముద్రం.

→ ఇప్పటి మహాసముద్రాలన్నీ కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక్క మహాసముద్రంగా ఉండేవి. దీన్నే పాంథాలా అనేవారు.

→ బ్రిటిష్ ఓడ ఛాలెంజర్తో లోతైన సముద్రాలను అన్వేషిస్తూ విజయవంతంగా ప్రపంచాన్ని చుట్టిరావడంతో మహాసముద్రాల అధ్యయనం ప్రారంభమైనది.

→ మహాసముద్రాల యొక్క ఉపరితలం నాలుగు రకాలుగా ఉంటుంది. అవి :

  1. ఖండతీరపు అంచు
  2. ఖండతీరపు వాలు
  3. మహాసముద్ర మైదానాలు
  4. మహాసముద్ర అగాధాలు.

→ సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత 35% లేదా 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల ఉప్పు ఉంటుంది.

→ అత్యధిక లవణీయత ఉన్న సరస్సు – వాన్ సరస్సు – టర్కీ

→ పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడే ఎల్ నినో ‘లా నినా’ల వల్ల భారతదేశ నైరుతి రుతుపవనాలు ప్రభావితమౌతాయి.

→ సాధారణంగా మహాసముద్రం ఉష్ణోగ్రత 2° నుంచి 29°C మధ్య ఉంటుంది.

AP 9th Class Social Notes Chapter 2 భూమి – ఆవరణములు

→ ఒక కచ్చితమైన దిశలో చాలా దూరం ప్రవహించే మహాసముద్రపు నీటిని మహాసముద్ర ప్రవాహాలు అంటారు.

→ మహాసముద్రాలు వేగంగా ప్రవహిస్తే ‘స్టీం’ అనీ నిదానంగా ప్రవహిస్తే ‘డ్రిఫ్ట్’ అనీ అంటారు.

→ సముద్రాలు అనంతమైన ఉప్పు, మత్స్య సంపదను అందిస్తాయి.

→ క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ వంటి ఖనిజాలను మానవులు సముద్రాల నుంచి వెలికితీస్తున్నారు.

→ సముద్రగర్భం నుంచి చమురు వెలికితీస్తున్నారు. 23. సముద్రం నుంచి ముత్యాలు, వలు కూడా లభిస్తాయి.

→ స్టీమ్ : ఈ వేగంగా ప్రవహించే సముద్ర ప్రవాహాలను మ్ అంటారు.

→ డ్రిఫ్ట్ : నిదానంగా ప్రవహించే సముద్ర ప్రవాహాలను డ్రిఫ్ట్ అంటారు.

→ సముద్ర ప్రవాహాలు : ఒక కచ్చితమైన దిశలో చాలాదూరం ప్రవహించే మహాసముద్ర నీటిని మహాసముద్ర ప్రవాహాలు అంటారు.

→ బాష్పోత్సేకం : భూమి, చెరువులు, నదులు, సముద్రాల నుంచి నిరంతరం నీటి ఆవిరి వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. మొక్కల నుండి కూడా నీరు బాప్ట్పోత్సేకం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది.

→ లవణీయత : సముద్రపు నీటిలో కరిగిన ఉప్పు ఎంత ఉందో తెలియచేయటానికి లవణీయత అనే పదాన్ని ఉపయోగిస్తారు.

AP 9th Class Social Notes Chapter 2 భూమి – ఆవరణములు

→ ఎల్ నినో లానినో : భూమితో పోలిస్తే సముద్రాల మీద ఉష్ణోగ్రతలలో అంత తేడా ఉండదు. కావున ఈ కొద్దిపాటి తేడాలే ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడే ‘ఎల్ నినో’, ‘లా నినో’ల వల్ల భారతదేశ నైరుతి రుతుపవనాలు ప్రభావితమౌతాయి.

→ అపకేంద్ర బలం : భూమి తనచుట్టూ తాను తిరుగుతున్న క్రమంలో ధృవాలతో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద అపకేంద్ర శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిలో తేడా కారణంగా భూమధ్య రేఖా ప్రాంతం నుంచి మహాసముద్రాల నీళ్లు ధృవాలవైపు ప్రవహిస్తాయి.

→ సమలవణీయతా రేఖ : సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖ. దీనిని ఇంగ్లీషులో Isohaline (సమ లవణీయతా రేఖ) అంటారు.

AP 9th Class Social Notes Chapter 3 జలావరణం 1