Students can go through AP Board 9th Class Social Notes 23rd Lesson విపత్తుల నిర్వహణ to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 23rd Lesson విపత్తుల నిర్వహణ
→ ప్రకృతి వైపరీత్యాలకు అన్నిసార్లు ప్రకృతే కారణం కాదని, అందులో మానవుల పాత్ర ఉంటుందని చెప్పవచ్చును.
→ మానవుల నిర్లక్ష్యం వల్ల లేదా కావాలని ఒక వ్యక్తి లేదా బృందం చేసే పనుల వల్ల ఏర్పడే వైపరీత్యాలను మానవ కారక వైపరీత్యాలు అంటారు.
→ భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో 80,000 మంది చనిపోతున్నారు.
→ ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారిలో భారతదేశంలో చనిపోతున్న వారి శాతం 13 శాతం.
→ రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారిలో సగం కంటే ఎక్కువమంది 15-44 సం||రాల మధ్య వయసున్నవాళ్ళు.
→ 2000 సంవత్సరంలో ప్రమాదాల కారణంగా సూల జాతీయోత్పత్తిలో 3 శాతం నష్టపోయుంటామని అంచనా.
→ 2006లో రోడ్డు భద్రతా వారోత్సవాలకు ‘ప్రమాదాలు లేకుండా ఉండటమే రోడ్డు భద్రత’ అన్న అంశాన్ని ఎంచుకున్నారు.
→ 18 సం॥రాలు నిండి, చట్టబద్ద లైసెన్సు ఉంటేనే వాహనాలను నడపాలి.
→ ట్రాఫిక్ సిగ్నళ్ళు ఉన్నచోట, జీబ్రా క్రాసింగ్ ఉన్నచోట మాత్రమే రోడ్డు దాటాలి.
→ బస్సు పూర్తిగా ఆగిన తరవాత నెట్టుకోకుండా, తోసుకోకుండా ఎక్కాలి. క్యూ పద్ధతి పాటించాలి.
→ సైకిలు తొక్కుతుంటే మీ తలకి రక్షణగా హెల్మెట్ ధరించాలి.
→ వాహనం ఆగినపుడు, వెళ్తున్నప్పుడు చేతులు బయట పెట్టరాదు.
→ మద్యం సేవించి వాహనాలను నడపరాదు.
→ రోడ్డు ప్రమాదానికి గురైన వారిని మీరు చూసినప్పుడు స్థానిక ప్రజల, పోలీసుల సహాయం కోరండి.
→ బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో 150 సం||రాల పురాతన ఉల్లాపూల్ అనే వంతెన 2006 డిసెంబర్ 1న దాని కిందగా వెళుతున్న హౌరా – జమాల్‌పూర్ సూపర్‌ఫాస్ట్ రైలు మీద కూలిపోయి కనీసం 35 మంది చనిపోయారు.
→ రైల్వే క్రాసింగ్ వద్ద గేటు కింద నుంచి దూరి పట్టాలు దాటరాదు.
→ రైలులో పొగ తాగకూడదు. ఎవరైనా పొగ తాగుతుంటే ఆపెయ్యమని అడగవచ్చు.
→ 1985 జూన్ 23న ఎయిర్ ఇండియా విమానం కనిష్క 182 బాంబు కారణంగా పేలిపోయింది.
→ తమిళనాడులోని కుంభకోణంలోని పాఠశాలలో 2004లో అగ్గి ప్రమాదం జరిగింది.
→ ప్రతి సంవత్సరం అగ్నిప్రమాదాల కారణంగా సుమారు 30,000 విలువైన ప్రాణాలను కోల్పోతున్నాం.
→ అగ్నిప్రమాదం జరిగినపుడు 101 కి ఫోన్ చెయ్యండి.
→ ప్రజలు, సమూహాలు, దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి మహాత్మాగాంధీ సత్యం, అహింసతో కూడిన మార్గాన్ని చూపించాడు.
→ ప్రపంచ ప్రజలంతా “వసుధైక కుటుంబం” మాదిరి సుఖ సంతోషాలతో విలసిల్లాలి.
→ భారతదేశంలో ఉగ్రవాదం సాధారణం కావడం వల్ల పిల్లలు నిత్యం దాడులకు భయపడుతూ గడుపుతుంటారు.
→ ప్రపంచ సమాజం : ప్రపంచంలోని మానవుల సమూహాలను ప్రపంచ సమాజం అంటారు.
→ ఉగ్రవాదం : సంఘ విద్రోహక చర్యలను చేపట్టుట.
→ నిఘా : నేరుసులు, అవినీతిపరులు, అనుమానాస్పద వ్యక్తులపై ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలు ఏర్పాటుచేసే నిరంతర పరిశీలనా ప్రక్రియ
→ హైజాకింగ్ : ఆకాశంలో ఎగిరే విమానాన్ని దుండగులు దారి మళ్ళించడాన్ని హైజాకింగ్ అంటారు.
→ విపత్తు : సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ, అకస్మాత్తుగా లేదా తీవ్రంగా కలిగే ఆపదే విపత్తు.
→ రైల్వే క్రాసింగ్ : పాదచారులు, వాహన చోదకులు రైలు పట్టాలు దాటే చోట చేసే రక్షణ ఏర్పాటు.