Students can go through AP Board 9th Class Social Notes 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు
→ అక్రమ రవాణా : ఇష్టానికి విరుద్ధంగా తరలించటం, బలవంతంగా లొంగదీసుకోవడం, ఆశ చూపించి, ఇతర ప్రాంతాలకు తరలించి వెట్టిచాకిరి చేయించడం.
→ గృహ హింస : అదే కుటుంబంలోని వ్యక్తుల (తన) వల్ల హింసాపూరిత చర్యలు, ఇబ్బందులు కలిగినట్లయితే దానిని గృహహింస అంటాం.
→ బాల్య వివాహం : బాలురకు 21 సం||లు, బాలికలకు 18 సం||లు నిండకుండా జరిపించే వివాహం బాల్య వివాహం.
→ వరకట్నం : వివాహ సందర్భంలో వరునికి వధువు తండ్రి కట్నకానుకల రూపంలోగాని, ఆస్తి రూపంలోగాని అందచేసే కానుకలు, ధనమే వరకట్నం.
→ లోక్ అదాలత్ : ఆర్థిక కారణాలు, ఇతర బలహీనతల కారణంగా న్యాయం పొందని వారికి ఉచితంగా అందించే న్యాయ సహాయం.
→ మహిళా రక్షణ చట్టాలు : ఆడ పిల్లలు, మహిళలు ఇంటాబయట, హింసావేధింపుల నుండి వరకట్న, గృహహింస అక్రమ రవాణా, అత్యాచార, లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించే చట్టాలు.
→ వరకట్నం : వివాహ సందర్భంలో వధువు తండ్రి వరునికి ఇచ్చే కట్నకానుకలు
→ గృహ హింస : వధువుని అత్తింటివారు పెట్టే హింస
→ లోక్ అదాలత్ : ప్రజా న్యాయస్థానం
→ లైంగిక అత్యాచారం : బలవంతపు లైంగికదాడి
→ బలవంతపు వ్యభిచారం : స్త్రీ ఇష్టం లేకుండా బలవంతంగా లోబరుచుకోవడం
→ గోష్యంగా : రహస్యంగా
→ వేధింపులు : ఇబ్బందులు
→ వైఖరులు : అభిప్రాయాలు
→ లింగభేదం : స్త్రీ, పురుష భేదం
→ ఎగతాళి చేయడం : తక్కువ చేసి మాట్లాడటం
→ నిరోధించడం : ఆపడం
→ సుమోటో : తనంతటతానే
→ ఆధిపత్యం : పెద్దరికం
→ అశ్లీలదృశ్యాలు : అసభ్యకర సన్నివేశాలు