Students can go through AP Board 9th Class Social Notes 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు
→ దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర.
→ భారతదేశంలో ప్రాచీన పరిశ్రమ చేనేత పరిశ్రమ.
→ కర్మాగారాల స్థాపనకు కావలసినవి యంత్రాలు.
→ కర్మాగారాలు నడవటానికి కావలసినది ఇంధన వనరు.
→ వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలంటారు.
→ పారిశ్రామిక ఉత్పత్తిలో వస్త్ర పరిశ్రమ వాటా 14%.
→ ప్రస్తుతం దేశంలో 1600 నూలు మిల్లులు ఉన్నాయి.
→ తొలి సంవత్సరాలలో పత్తి బాగా పండే గుజరాత్, మహారాష్ట్రలో వస్త్ర పరిశ్రమలు కేంద్రీకృతమై ఉండేవి.
→ నూలు వడకటం మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులలో కేంద్రీకృతమై ఉంది.
→ భారతదేశం జపాన్‌కు నూలు ఎగుమతి చేస్తుంది.
→ జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశానిది మొదటి స్థానం.
→ ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశానిది 2వ స్థానం.
→ బెల్లం, ఖండసారి చక్కెర ఉత్పత్తిలో మనది మొదటి స్థానం.
→ దేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో 460 చక్కెర మిల్లులు ఉన్నాయి.
→ ఇనుము – ఉక్కు కర్మాగారాలకు అవసరమైన ఖనిజాలు భారత ద్వీపకల్పభాగంలో ఉన్నాయి.
→ ఖనిజాలు, లోహాలను ముడిసరుకులుగా ఉపయోగించే పరిశ్రమలను ఖనిజ ఆధారిత పరిశ్రమలు అంటారు.
→ భారతదేశ లోహ పరిశ్రమలలో అల్యూమినియం శుద్ధి 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది.
→ భారతదేశంలో ఎనిమిది అల్యూమినియం శుద్ధి కర్మాగారాలున్నాయి.
→ నత్రజని ఎరువుల ఉత్పత్తిలో భారతదేశానిది – 3వ స్థానంలో
→ ప్రస్తుతం ప్రభుత్వరంగంలో 10 ఎరువుల కర్మాగారాలున్నాయి.
→ మొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో చెన్నైలో నిర్మించారు.
→ దేశంలో 128 పెద్ద, 332 చిన్న సిమెంటు కర్మాగారాలు ఉన్నాయి.
→ భారతదేశానికి ఎలక్ట్రానిక్స్ రాజధానిగా బెంగళూరు ఎదిగింది.
→ వలస పాలన : ముడి వస్తువులను ఎగుమతి చేసే దేశంగానూ, తయారైన వస్తువులను దిగుమతి చేసుకునే దేశంగానూ మార్చడం దీనినే “వలస పాలన” అంటారు. అనగా రాజకీయంగా ఆక్రమించుకుని ఆర్థికంగా దోపిడీ చేసే విధానం.
→ వినియోగ వస్తువులు : ప్రజలు వినియోగించుటకు సిద్ధంగా ఉన్న వస్తువులు.
→ మౌలిక సదుపాయాలు : పరిశ్రమకు ప్రాథమికంగా కావలసిన సదుపాయాలు అనగా యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు, రవాణా సౌథర్యాలు వంటి కొన్ని సదుపాయాలు.
→ మౌలిక పరిశ్రమలు మౌలిక సౌకర్యాలకు అవసరమైన యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు, రవాణా సౌకర్యాలను తయారుచేసే పరిశ్రమలు.
→ స్వయం సమృద్ధి ఇతరులపై ఆధారపడకుండా మనకు కావలసిన వస్తువులను మనమే ఉత్పత్తి చేసుకుంటే దానిని స్వయం సమృద్ధి అంటారు.
→ తలసరి వినియోగం : మొత్తం ఉత్పత్తి చేసిన వస్తువుల సంఖ్యను మొత్తం వినియోగించి వస్తువుల సంఖ్యతో భాగించగా వచ్చేది తలసరి వినియోగం.
→ సరళీకృత ఆర్థిక విధానాలు : భారతదేశంలో పారిశ్రామిక కార్యకలాపాలను ప్రత్యేకించి కొత్త వాణిజ్యవేత్తలను ప్రోత్సహించడానికి అనేక ప్రభుత్వ నియమాలను సరళీకృతం చేయటాన్ని సరళీకృత ఆర్థిక విధానాలు అంటారు.