Students can go through AP Board 9th Class Social Notes 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు
→ సేవా కార్యకలాపం అనగా సేవలు చేయడం.
→ సేవారంగంలో ఉత్పత్తి చేసే సేవలు వరి (లేక) వస్త్రం లాగా కంటికి కనిపించవు. అయినప్పటికి వీరు ఒక ప్రత్యేకమైన సేవలను తమ పనుల ద్వారా ప్రజలకు, వ్యాపారానికి అందిస్తారు.
→ సేవా కార్యకలాపాలు వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలకు అవసరమైనటువంటివి.
→ సేవా కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు : విద్య, ఆరోగ్య వైద్య సేవలు, వర్తకం, ప్రభుత్వ పరిపాలన, రక్షణ రంగం, విత్త కార్యకలాపాలు, వ్యక్తిగత సేవలు.
→ భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభివృద్ధికి ప్రోత్సాహమనేది ఎన్నో వ్యవస్థాపక సౌకర్యాలతో ముడిపడి ఉంటుంది.
→ సాంకేతిక పరిజ్ఞానంలో నిరంతర మార్పు సేవారంగాన్ని ముందుకు నడిపిస్తుంది.
→ వినోద పరిశ్రమ, వార్తా ప్రసార సంస్థలు, కేబుల్ టెలివిజన్ ఛానళ్లలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి.
→ సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు, పారిశ్రామిక రంగంలో ఉన్న గట్టి పోటీ వల్ల చాలా పరిశ్రమలు తమ కార్యకలాపాలలో అధిక భాగాన్ని సేవారంగం వైపు మళ్ళించాయి.
→ 2012 సంవత్సరం నుంచి భారతదేశంలో విదేశీ కంపెనీలు సరకులు అమ్మడానికి చిల్లర దుకాణాలను ప్రారంభించవచ్చు.
→ ఆరోగ్య రంగంలో భారతదేశం 64 లక్షల వృత్తి సేవానిపుణుల కొరతను ఎదుర్కొంటున్నది.
→ 2011లో భారతదేశంలో ప్రతి 10 వేల జనాభాకు 6 గురు డాక్టర్లు ఉన్నారు.
→ దంత సంబంధిత సాంకేతిక విజ్ఞానంలో 20 లక్షల మంది నిపుణుల కొరత ఉంది.
→ భారతదేశంలోని ప్రజలు వ్యవసాయం నుండి పరిశ్రమల, సేవా కార్యకలాపాలలోకి మారాల్సిన అవసరం ఉంది.
→ భారతదేశ నూతన ఆర్థిక విధానాలు కూడా సేవా కార్యకలాపాల విస్తరణకు ప్రాముఖ్యతను ఇస్తున్నాయి.
→ కాల్ సెంటర్స్ : ఒక దేశంలోని సమాచారాన్ని మరో దేశంలో ఉండి తెలుసు కోవటానికి అవకాశం ఉన్న ఇంటర్నెట్ తో అనుసంధానం చేయబడియున్న కార్యాలయాలు.
ఉదా : లండన్ నివాసి అయిన ఒక స్త్రీ తన బ్యాంకు డిపాజిట్లు సమాచారం లేదా తన వైద్యశాల రికార్డులను భారతదేశంలో ఉన్న ఒక నగరంలోని కాల్ సెంటర్ ద్వారా తెలుసుకుంటుంది.
→ సేవా కార్యకలాపాలు : సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు. పారిశ్రామిక రంగంలో ఉన్న గట్టి పోటీ వల్ల చాలా పరిశ్రమలు తమ కార్యకలాపాలలో అధిక భాగాన్ని సేవారంగం వైపు మళ్ళించాయి. వాటిని వారే చేయకుండా బయట నుండి జరిగేలా చూడటం.
→ పొరుగు సేవలు : ఈ రోజుల్లో వ్యయాన్ని తగ్గించడానికి, సామాజిక భద్రత అవసరాల దృష్ట్యా అత్యధిక సంఖ్యలో పరిశ్రమలు పొరుగు సేవల నుండి భద్రతా సేవలను పొందుతున్నాయి. అనేక వస్తుతయారీ సంస్థలు పరిశోధన, అభివృద్ధి, ఖాతాల నిర్వహణ, న్యాయపరమైన సేవలు, వినియోగదారుల సేవలు, ప్రజా సంబంధాలకు సంబంధించిన సేవలు, ఇతరములను పొరుగు సేవల నుండి పొందుతున్నాయి.
→ సమాచార సాంకేతిక పరిజ్ఞానం : సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావడం, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రావడం.
→ ఆర్థికాభివృద్ధి : ఆర్థిక పెరుగుదలతో పాటు సంస్థాగత మార్పులలో కూడా పెరుగుదల సాధించితే దానిని ఆర్థికాభివృద్ధి అంటారు.
→ చిల్లర వర్తకం : వినియోగదారులకు నేరుగా వస్తువులను విక్రయించే వర్తకాన్ని “చిల్లర వర్తకం” అంటారు.