Students can go through AP Board 9th Class Social Notes 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం
→ డబ్బు యొక్క ఆధునిక రూపాలు – కరెన్సీ నోట్లు, నాణాలు, బ్యాంకు జమలు.
→ బ్యాంకులు డబ్బును జమ చేసుకొని దానిపై వడ్డీని చెల్లిస్తాయి.
→ డిమాండ్ చేసినప్పుడు బ్యాంకు ఖాతాల నుండి డబ్బును వాపసు తీసుకునే సౌలభ్యం ఉండటం వలన ఈ డిపాజిట్లను “డిమాండ్ డిపాజిట్లు” అంటారు.
→ మొత్తం ద్రవ్య వ్యవస్థను ప్రభుత్వ సంస్థ అయిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తుంది.
→ జమ అయిన నగదులో అధిక భాగాన్ని రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వినియోగిస్తాయి.
→ వివిధ అత్యవసర వస్తువులైన గృహోపకరణాలు, ఫర్నిచర్ మొదలైన వస్తువులను రుణాల ద్వారా పొందవచ్చును.
→ మార్కెట్లో లభిస్తున్న వినియోగ వస్తువులు, రుణాన్ని అందించే సౌకర్యాలు పెరగడం వలన వివిధ రకాల రుణాన్ని అందించే ఏర్పాట్లు వినియోగంలోకి వచ్చాయి.
→ రుణదాత నుండి రుణాన్ని డబ్బుగా గాని, వస్తువుల లేదా సేవల రూపంలో కానీ పొందేవానిని రుణగ్రహీత అంటారు.
→ గ్రామీణ ప్రాంతాలలో అప్పు చేయడానికి ప్రధాన కారణం పంటను పండించడానికి, పంట ఉత్పత్తిలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, నీరు, విద్యుత్, పాడైన వ్యవసాయ పరికరాల రిపేర్ మొదలైనవి.
→ ఒక్కోసారి పంట పండక పోవడంతో అప్పును తిరిగి చెల్లించడం కోసం తమకు ఉన్న భూమిలో సగం భూమిని అమ్మి వేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిని అప్పుల్లో చిక్కుకోవడం అంటారు.
→ వడ్డీరేటు, పూచీకత్తు, పత్రాలు, తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విధానం వీటి అన్నింటినీ కలిపి రుణం యొక్క షరతులు అంటారు.
→ వడ్డీ తీసుకోవడంతో పాటు పంటను కూడా తనకే అమ్మేటట్లు రుణదాత రైతులు నుండి హామీని పొందుతాడు.
→ ఆరోగ్య సమస్యల కోసం లేదా ఇంటిలో జరిగే వినోదాలు, పండుగల కోసం అయ్యే ఖర్చు కూడా అప్పుల ద్వారానే సమకూర్చుకుంటారు.
→ నియత, అనియత రుణాలు అని రుణాలు రెండు విధాలుగా ఉంటాయి.
→ గ్రామీణులు పొందే ప్రతి 100 రూపాయల రుణంలో 25 రూపాయలు వాణిజ్య బ్యాంకుల నుండి వస్తాయి.
→ భారతదేశంలో అనియత రుణ వనరులలో వడ్డీ వ్యాపారులు ప్రముఖ భాగంగా ఉన్నారు.
→ బ్యాంకులు లాభాల కోసం వ్యాపారం చేసే వర్తకులకు మాత్రమే కాక ఇతర చిన్న రైతులు, చిన్న పరిశ్రమలు, తక్కువ మొత్తం అప్పు తీసుకునే వారు మొదలయిన వారికి రుణాలు ఇచ్చేటట్లు భారతీయ రిజర్వు బ్యాంకు పర్యవేక్షిస్తుంది.
→ NABARD అనగా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్.
→ నియత రుణదాతలు అప్పను తిరిగి రాబట్టడానికి రుణగ్రస్తులపై ఎటువంటి చట్టపరమైన చర్యనైనా చేపడతారు.
→ కానీ అనియత రుణదాతలు అప్పను తిరిగి రాబట్టడానికి చట్ట వ్యతిరేక మరియు ఎటువంటి చర్యనైనా చేపడతారు.
→ ప్రస్తుతం ప్రభుత్వం అందరికీ యు.ఐ.డి సంఖ్యను ఆధార్ కార్డు ద్వారా అందజేస్తున్నది.
→ 2011 సం||రంలో భారతదేశంలో రైతుల సంఖ్య 14 కోట్లు.
→ డిమాండ్ డిపాజిట్లు : డిమాండ్ చేసినప్పుడు బ్యాంకు ఖాతాల నుండి డబ్బును వాపసు తీసుకొనే సౌలభ్యం ఉండటం వలన ఈ డిపాజిట్లను “డిమాండ్ డిపాజిట్లు” అంటారు.
→ ఆర్థిక కార్యకలాపాలు : నిధులను సేకరించడం, బుణాలను ఇవ్వడం వంటి కార్యకలాపాలను “ఆర్థిక కార్యకలాపాలు” అంటారు.
→ సహకార సంస్థలు : ‘అందరి కోసం ఒకరు – ఒకరి కోసం అందరూ’ అనే స్ఫూర్తితో సహకార వ్యవస్థ కొనసాగుతుంది.
→ వాణిజ్య బ్యాంకులు : ప్రజల దగ్గర నుండి డిపాజిట్లను సేకరించి వాటిని విభిన్న పెట్టు బడులుగా మార్చే సంస్థలను బ్యాంకులు అంటారు. లాభార్జన దృష్టితో బ్యాంకింగ్ వ్యాపారం చేసే సంస్థలను “వాణిజ్య బ్యాంకులు” అంటారు.
→ అనియత రుణ వనరులు : వడ్డీ వ్యాపారస్థులు, వర్తకులు, యజమానులు, బంధువులు, స్నేహితులు మొదలగు వారిచ్చే రుణాలు అనియత రుణవనరులు.
→ నియత రుణ వనరులు : బ్యాంకుల ద్వారా, సహకార సంస్థల ద్వారా పొందే రుణాలు నియత రుణ వనరులు.
→ రుణము యొక్క షరతులు : వడ్డీరేటు, పూచీకత్తు, వివిధ పత్రాలు, తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విధానం వీటన్నింటినీ కలిపి రుణం యొక్క షరతులు అంటారు.