SCERT AP 10th Class Biology Study Material 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు Textbook Questions and Answers.
AP State Syllabus 10th Class Biology 8th Lesson Questions and Answers అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు
10th Class Biology 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
కొత్త లక్షణాలు ఎలా ఉత్పన్నమవుతాయి?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తిలో జన్యుపదార్థాల కలయిక వలన కొత్త లక్షణాలు ఉత్పన్నమవుతాయి.
ప్రశ్న 2.
పరిణామంలో కొత్త లక్షణాలు తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వస్తాయా?
జవాబు:
పరిణామక్రమంలో జన్యు సంబంధ లక్షణాలు వారసత్వంగా వస్తాయి. జీవి సంపాదించిన కొన్ని లక్షణాలు (ఆర్జిత లక్షణాలు) వారసత్వంగా సంక్రమించవు.
ప్రశ్న 3.
పరిణామంలో కొత్త లక్షణాల పాత్ర ఏమైనా ఉంటుందా?
జవాబు:
పరిణామంలో కొత్త లక్షణాలు కీలకపాత్ర వహిస్తాయి. ఇవి జీవి మనుగడకు, అనుకూలనాలు రూపొందించుకోవటానికి, క్రొత్త జాతులు ఏర్పడటానికి తోడ్పడతాయి.
ప్రశ్న 4.
వైవిధ్యాలు అంటే ఏమిటి? జీవులకు వైవిధ్యాలు ఏ విధంగా ఉపయోగపడతాయి? (AS1)
జవాబు:
జీవుల మధ్య భేదాలను వైవిధ్యాలు అంటారు. చాలా దగ్గర సంబంధం కలిగిన జీవులలోనూ వైవిధ్యాలు కనిపిస్తాయి. వర్గీకరణలో పైకి పోయేకొలది జీవుల మధ్య వైవిధ్యాలు పెరుగుతుంటాయి.
వైవిధ్యాల ఉపయోగం :
- జీవుల మధ్యగల వైవిధ్యాల వలన వాటిని గుర్తించటానికి తోడ్పడతాయి.
- వైవిధ్యాలు కొత్త జాతుల ఆవిర్భావానికి దారితీస్తాయి.
- జీవపరిణామానికి వైవిధ్యాలు ముడిపదార్థాలు. వీటి వలనే జీవపరిణామం కొనసాగుతుంది.
- శాస్త్రవేత్తలు వర్గీకరణ విధానంలో వైవిధ్యాలను పరిగణలోనికి తీసుకొంటారు.
- ఎక్కువసార్లు వైవిధ్యాలు జీవులకు లాభదాయకంగా ఉండి మనుగడకు తోడ్పడతాయి.
ప్రశ్న 5.
ఒక విద్యార్థి (పరిశోధకుడు) శుద్ద పొడవు మొక్క (TT) ను శుద్ద పొట్టి మొక్క (tt) తో సంకరణం జరపాలనుకొన్నాడు. మరి F1 F2 తరాలలో ఎలాంటి మొక్కలు వచ్చే అవకాశం ఉంది? వివరించండి. (AS1)
జవాబు:
శుద్ధ పొడవు మొక్క (TT) ను శుద్ధ పొట్టి మొక్క (tt) తో సంకరణం చేయగా
F1 తరం :
F2 తరంలో అన్నీ పొడవు మొక్కలు వస్తాయి. కానీ ఇవి సమయుగ్మజాలు కావు. పొట్టి లక్షణ కారకం వీటిలో అంతర్గతంగా ఉంటుంది. ఇవన్నీ విషమయుగ్మజాలు (Tt).
F2 తరం :
ఈ విషమయుగ్మజ మొక్కలకు స్వపరాగ సంపర్కం జరిపితే F2 తరం మొక్కలు వస్తాయి.
- ఈ మొక్కలలో మూడవ వంతు మొక్కలు పొడవుగా ఉండగా, ఒక వంతు మొక్కలు పొట్టిగా ఉన్నాయి. కావున వీటి దృశ్యరూపాన్ని 3 :1 గా భావించవచ్చు.
- వీటి జన్యు రూపాలను పరిశీలిస్తే ఒక వంతు సమయుగ్మజ పొడవు మొక్కలు (TT), రెండు వంతులు విషమయుగ్మజ పొడవు మొక్కలు (Tt), ఒక వంతు సమయుగ్మజ పొట్టి మొక్కలు (1) ఉన్నాయి.
కావున వీటి జన్యురూప నిష్పత్తిని 1:2:1 గా నిర్ధారించవచ్చు.
ప్రశ్న 6.
ఒక శాస్త్రవేత్త జనకతరంలోని ఎలుకల తోకలను కత్తిరించాడు. మరి ఎలుకల సంతతిలో తోకలుంటాయా? ఉండవా? మీ అభిప్రాయాన్ని వివరించండి. (AS1)
జవాబు:
- జనకతరంలో తోకలు కత్తిరించబడిన లక్షణం తరువాత తరానికి అందించబడదు. కావున వాటి సంతతి ఎలుకలు తోకను కలిగి ఉంటాయి.
- జీవి శరీరంలో వచ్చిన ఈ మార్పులు తన జీవిత కాలంలో సంపాదించుకొన్నవి. ఇటువంటి లక్షణాలను ‘ఆర్జిత లక్షణాలు’ అంటారు.
- ఈ ఆరిత లకణాలు అనువంశికంగా సంక్రమించవని ‘వీస్మస్’ ఎలుక తోకల ప్రయోగంతో నిరూపించాడు.
- కేవలం, బీజకణాల జన్యుపదార్థంలోని మార్పులు మాత్రమే అనువంశికంగా సంక్రమిస్తాయి.
ప్రశ్న 7.
ఒక మామిడితోటలో ఒక రైతు మామిడి పండ్లు బాగా కాసిన చెట్టునొకదాన్ని చూశాడు. కానీ దానికి తెగుళ్లు, ఉండటం, క్రిమిసంహారక మందులను వాడినట్లు పరిశీలించాడు. అలాగే మరో మామిడి చెట్టును చూశాడు. దానికి క్రిమిసంహారకాలను ఉపయోగించలేదు. కానీ తక్కువ మామిడిపండ్లను కలిగి ఉన్నది. అయితే ఆ రైతు ఎక్కువ మామిడిపండ్లనిచ్చే, క్రిమిసంహారకాలు వాడనవసరం లేని చెట్లుంటే బాగుంటుందని అనుకున్నాడు. మరి ఆ రైతు కోరుకున్న ప్రకారం ఒక కొత్త మామిడి చెట్టును సృష్టించవచ్చా? ఏ విధంగా సాధ్యమవుతుందో వివరించండి. (AS1)
జవాబు:
- రైతు కోరుకున్న ప్రకారం కొత్త మామిడి చెట్టును సృష్టించవచ్చు. ఈ సందర్భంలో రైతు, అధిక ఫలాలను ఇచ్చే మంచి లక్షణాన్ని ఒక చెట్టు నుండి, వ్యాధి నిరోధకత కలిగిన మంచి లక్షణాన్ని మరొక చెట్టు నుండి కోరుకుంటున్నాడు.
- రెండు వేరు వేరు జీవులలోని మంచి లక్షణాలను ఒక మొక్కలోనికి తీసుకురావటానికి సంకరణం ఒక మంచి పద్దతి.
- ఈ ప్రక్రియలో ఒక మొక్క నుండి సేకరించిన పరాగరేణువులను మరొక మొక్క కీలాగ్రానికి చేర్చి పరపరాగ సంపర్కం చేస్తారు.
- ఫలితంగా వచ్చే తరం రెండింటి లక్షణాలు కలిగి కొత్త లక్షణాలు గల మొక్కగా రూపొందుతుంది.
- అంటే అధిక ఫలసాయం, వ్యాధినిరోధకత కలిగిన కొత్త రకం మొక్క ఏర్పడుతుంది.
ప్రశ్న 8.
ఏక సంకర సంకరీకరణం ప్రయోగాన్ని ఒక ఉదాహరణతో వివరించండి. అనువంశికతా సూత్రాలలో దేనిని మనం అర్థం చేసుకోవచ్చు? వివరించండి. (AS1)
జవాబు:
ఏక సంకర సంకరీకరణం :
ఒక లక్షణం ఆధారంగా నిర్వహించిన సంకరణ ప్రయోగాన్ని ఏక సంకర సంకరీకరణం అంటారు.
ఉదాహరణ :
మెండల్ బఠానీ గింజ రంగు అనే లక్షణం ఆధారంగా ఏకసంకరణ ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగంలో పసుపు (YY), ఆకుపచ్చ (y) వంటి శుద్దజాతుల బఠానీ మొక్కల మధ్య పరపరాగ చేయగా
- మొదటి తరం (F1) లో అన్నీ పసుపు రంగు గింజలే ఏర్పడినవి.
- F2 తరం మొక్కలలో ఆత్మపరాగ సంపర్కం జరపగా, మూడు వంతులు పసుపు రంగు గింజలు కలిగిన మొక్కలు, ఒక వంతు ఆకుపచ్చ రంగు కలిగిన విత్తన మొక్కలు ఏర్పడ్డాయి. అంటే వాటి దృశ్య రూప నిష్పత్తి 3 : 1.
నిర్ధారణ :
(F) తరంలో బయటపడిన ఆకుపచ్చ రంగు (1) లక్షణం F1 తరంలో కనిపించలేదు. అంటే F1 తరంలో ఆకుపచ్చరంగు కలిగించే జన్యువు ఆధిపత్యం చేసింది. దీనినే బహిర్గత సూత్రం (Law of Dominance) అంటారు.
బహిర్గత సూత్రం :
ఒక లక్షణానికి కారణమైన రెండు వేరు వేరు కారకాలు (విషమయుగ్మజం) ఉన్నా వాటిలో ఒకటి మాత్రమే సంతతిలో బహిర్గతమౌతుంది. మరొకటి అంతర్గతంగా ఉండిపోతుంది. దీనినే ‘బహిర్గత సూత్రం’ అంటారు.
ప్రశ్న 9.
స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అంటే ఏమిటి? ఒక ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:
ఏ లక్షణానికైనా కారణమైన రెండు కారకాలు (యుగ వికల్పకాలు) ఒక్కొక్కటి ఒక్కో జనకుడి నుండి (తల్లి, తండ్రి) సంతతికి లభిస్తాయి. అయితే జనకుల యుగ్మవికల్పకాలలో ఏదో ఒక కారకం యథేచ్చగా (Random) సంతతికి అందించటం జరుగుతుంది.
దీనినే పృథక్కరణ లేదా అలీనత సూత్రం (Law of Segregation) అని కూడా అంటారు.
ఉదాహరణ :
మెండల్ తన ద్విసంకరణ ప్రయోగం ద్వారా స్వతంత్ర జన్యువ్యూహన సిద్ధాంతం ప్రతిపాదించాడు. ఈ ప్రయోగం నందు రెండు రకాల శుద్ధ సమయుగ్మజ మొక్కల విత్తనాలు తీసుకొన్నాడు. అవి 1. గుండ్రని పసుపు రకానికి (RY) చెందినవి. 2. ముడతలు ఆకుపచ్చ రకానికి చెందినవి (ry). వీటి మధ్య సంకరణం జరపగా
F1 తరం :
మొదటి తరంలోని మొక్కలు అన్నీ గుండ్రని పసుపు విత్తనాలే వచ్చాయి. ఎందుకంటే పసుపు (1), గుండ్రని (R) రెండు లక్షణాలు బహిర్గత లక్షణాలు కాబట్టి.
F2 తరం :
F1 తరం మొక్కలను ఆత్మపరాగ సంపర్కం జరపగా
- గుండ్రని పసుపు విత్తనాలు గల మొక్కలు : 9
- ముడతలు పడిన పసుపు విత్తనాలు : 3
- గుండ్రని ఆకుపచ్చని విత్తనాలు : 3
- ముడతలు పడిన ఆకుపచ్చని విత్తనాలు : 1 ఏర్పడ్డాయి. అంటే వీటి దృశ్యరూప నిష్పత్తి 9:3:3:1.
నిర్ధారణ :
రంగు, ఆకారం నిర్ణయించే కారకాలు F1 తరంలో చేరేటప్పుడు దేనికవి స్వతంత్రంగా వ్యవహ రించటం వలన నాలుగు రకాల మొక్కలు ఏర్పడటానికి అవకాశం కుదిరింది. దీనినిబట్టి యుగ్మ వికల్పకాలలోని జన్యువులు (కారకాలు) సంక్రమణం చెందేటప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. దీనినే ‘స్వతంత్ర జన్యువ్యూహన సిద్ధాంతం’ (Law of Segregation) అంటారు.
ప్రశ్న 10.
మానవులలో లింగ నిర్ధారణ ఎలా చోటు చేసుకుంటుంది? ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:
- ప్రతీ మానవ కణంలో 23 జతల (46) క్రోమోజోమ్ లుంటాయి. వానిలో 22 జతలను శారీరక క్రోమోజోమ్ (Autosomes) అనీ, మిగిలిన ఒక జతను లైంగిక క్రోమోజోమ్ లు (Allosomes or sex chromo somes) అనీ అంటారు.
- లైంగిక క్రోమోజోమ్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి (X) మరియు రెండవది (Y). ఈ రెండు క్రోమోజోమ్లు లింగ నిర్ధారణ చేస్తాయి.
- ఆడవారిలో రెండు XX క్రోమోజోమ్లుంటాయి. మగవారిలో XY క్రోమోజోమ్లుంటాయి.
- స్త్రీ సంయోగబీజాల (అండం) లో ఒకే ఒక X క్రోమోజోమ్ ఉంటుంది.
- పురుష సంయోగబీజాలలో (శుక్రకణాల్లో) రెండు రకాలుంటాయి. X క్రోమోజోమ్ ను కలిగినవి, Y క్రోమోజోమ్ ను కలిగినవి.
- X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఫలదీకరణ జరిగి XX క్రోమోజోమ్ లు గల అమ్మాయి అవుతుంది.
- Y క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఫలదీకరణ జరిగి XY క్రోమోజోమ్ లు గల అబ్బాయి అవుతాడు.
ప్రశ్న 11.
డార్విన్ యొక్క ‘ప్రకృతివరణం’ సిద్ధాంతాన్ని ఒక ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:
ప్రకృతివరణ సిద్ధాంతాన్ని ‘చార్లెస్ డార్విన్’ ప్రతిపాదించాడు. దీని ప్రకారం ప్రకృతి మాత్రమే ఒక జీవి మనుగడ సాగించాలా లేక నశించాలా అని నిర్ణయిస్తుంది. ఏ జీవి మనుగడకు అవసరమైన లక్షణాలు కలిగి ఉంటాయో అవి మాత్రమే ప్రకృతిలో జీవించగలిగి మిగిలినవి మరణిస్తాయి. దీనిని ‘ప్రకృతి వరణం’ (Natural Selection) అంటారు.
ఉదా : ఒక కుందేలుకు పుట్టిన ఐదు పిల్లలలో మూడు వేగంగా పరిగెత్తే ధర్మం కలిగి ఉన్నాయి. రెండు వేగంగా పరిగెత్తలేవు. శత్రువు దాడి చేసినపుడు వేగంగా పరిగెత్తే కుందేళ్లు తప్పించుకొని జీవించగలుగుతాయి. పరిగెత్తలేనివి మరణిస్తాయి.
ఈ సందర్భంలో వేగంగా పరిగెత్తటం వాటి మనుగడకు తోడ్పడింది. ఈ అనుకూలనం ఉన్న జీవులను ప్రకృతి మనుగడకు ఎన్నిక చేసింది.
ప్రశ్న 12.
వైవిధ్యాలు అంటే ఏమిటి? సరైన ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:
జీవుల మధ్యగల భేదాలను వైవిధ్యాలు అంటారు. ప్రతి రెండు జీవుల మధ్య వైవిధ్యాలు ఉంటాయి. ఈ వైవిధ్యాలు ఒక జాతి జీవుల మధ్య తక్కువగాను, వర్గీకరణ పైకి పోల్చిన కొలది వైవిధ్యాలు అధికంగాను ఉంటాయి. ఉదా : మన చుట్టూ ఉన్న మనుషులలో ఏ ఇద్దరూ ఒకే రకంగా ఉండరు. వారి మధ్య స్పష్టమైన తేడాలు ఉంటాయి. ఈ తేడాలను వైవిధ్యాలు అంటారు. ఒకే కుటుంబం వారిలో కొన్ని పోలికలు ఉంటాయి కావున వైవిధ్యాలు తక్కువగా ఉంటాయి. వేరే కుటుంబ సభ్యులతో పోల్చితే వైవిధ్యాలు అధికంగా కనిపిస్తాయి.
ప్రశ్న 13.
సాధారణంగా ఆవుల్లో మీరు పరిశీలించిన వైవిధ్యాలు ఏమిటి? (AS1)
జవాబు:
రెండు ఆవులను పరిశీలించినపుడు
1. కొమ్ములు :
ఒకదాని కొమ్ములు పొట్టిగా, లావుగా ఉంటే, మరొకదాని కొమ్ములు పొడవుగా ఉన్నాయి.
2. రంగు :
ఒక ఆవు పూర్తిగా తెల్లగా ఉంటే, మరొక ఆవు అక్కడక్కడ ఎర్ర మచ్చలతో ఉంది.
3. ఎత్తు :
ఒక ఆవు ఎత్తు ఎక్కువగా ఉంటే, మరొకటి కొంచెం తక్కువ ఎత్తులో ఉంది.
4. పరిమాణం :
ఒక ఆవు ఎత్తు బలంగా, లావుగా ఉంటే, మరొకటి బక్క పల్చగా ఉంది.
5. కళ్లు :
ఒక ఆవు కళ్లు గుండ్రంగా పెద్దవిగా ఉంటే, మరొకదాని కళ్లు చిన్నవిగా ఉన్నాయి.
6. పొదుగు :
ఒక ఆవు పొదుగు పెద్దదిగా ఉంటే, మరొక ఆవు పొదుగు చిన్నదిగా ఉన్నది.
7. వీపు :
ఒక ఆవు వీపు బల్లపరుపుగా, చదునుగా ఉంటే, మరొక ఆవు వీపు ఎత్తుగా ఉంది.
8. కాలిగిట్టలు:
ఒక ఆవు కాలిగిట్టలు పొడవుగా ఉంటే, మరొక ఆవు కాలిగిట్టలు గుండ్రంగా ఉన్నాయి.
ప్రశ్న 14.
మెండల్, బరానీ మొక్కలోని ఏయే లక్షణాలను ప్రయోగాల కోసమై ఎన్నుకున్నాడు? (AS1)
జవాబు:
లక్షణం | బహిర్గత లక్షణం | అంతర్గత లక్షణం |
1. పువ్వు రంగు | నీలి ఎరుపు | తెలుపు |
2. పువ్వు స్థానం | గ్రీవస్థం | శిఖరస్థం |
3. విత్తనం రంగు | పసుపు | ఆకుపచ్చ |
4. విత్తనం ఆకారం | గుండ్రనివి | ముడతలు గలవి |
5. ఫలం ఆకారం | నునుపైనవి | నొక్కులు గలవి |
6. ఫలం రంగు | ఆకుపచ్చ | పసుపు |
7. కాండం పొడవు | పొడవు | పొట్టి |
ప్రయోగాల కోసం మెండల్ ఎన్నుకున్న ముఖ్య లక్షణాలు :
1. పరిపక్వ విత్తనాల ఆకారంలో తేడాలను గుర్తించుటకు – విత్తనాలు గుండ్రంగా ఉన్నాయా లేదా ముడతలు కలిగి ఉన్నాయా అని పరిశీలించి, గుండ్రని మరియు ముడతలు గల వాటిని ఎంచుకున్నాడు.
2. బీజదళాలు లేదా అంకురచ్చదం రంగులో తేడాలను గుర్తించుటకు – విత్తన బీజదళాలు లేదా అంకురచ్ఛదం పాలిపోయిన పసుపు, ప్రకాశవంతమైన పసుపు మరియు ఆరెంజ్ రంగుతోగాని, ఆకుపచ్చ రంగుతో ఉన్నవి ఉన్నాయి. రంగుల్లో ఈ భేదం చూడగానే కనిపిస్తుంది. ఎందుకంటే విత్తన కవచం పారదర్శకంగా ఉంటుంది కాబట్టి.
3. వితన కవచం రంగులో తేడాను గుర్తించుట- విత్తన కవచం తెల్లగా (తెల్ల పూలు ఉన్న వానిలో) బూడిద, లేత బూడిద, ముదురు గోధుమరంగు నీలి చుక్కలు గల / లేకుండా (ధ్వజం ఊదా రంగులో, రెక్కలు నీలం, ఎరుపు కలిసిన రంగులో గల పూలున్న వానిలో) ఉంటాయి. బూడిద విత్తన కవచం గల గింజలను మరిగే నీటిలో వేస్తే అవి గాఢమైన గోధుమ వర్ణంలోకి మారుతాయి.
4. పరిపక్వ ఫలం యొక్క ఆకారంలో తేడాలు గుర్తించుట- పరిపక్వ ఫలం నిండుగా లేదా నునుపుగా మరియు నొక్కులు కలిగిగాని ఉంటుంది. నొక్కులు కలిగిన ఫలంలో గింజల మధ్యలో నొక్కులున్నందున లోపల గింజలు ముడతలుపడి ఉంటాయి.
5. అపరిపక్వ ఫలం యొక్క రంగుల్లో తేడాలు గుర్తించుటకు – అపరిపక్వ ఫలాలు ఉంటే లేత నుంచి ముదురు ఆకుపచ్చ లేదా పసుపురంగులో ఉంటాయి.
6. పుష్పాల స్థానంలో తేడాలు గుర్తించుటకు-గ్రీవస్థం లేదా శిఖరస్థం. పుష్పాలు గ్రీవాలలో ఉంటే కాండం పొడవునా గ్రీవాలలో ఉంటాయి. ఒకవేళ శిఖరస్థం అయితే శాఖల చివరలో అన్యత గుచ్చంగా, గుత్తులుగా ఉంటాయి. ఆ మొక్కల కాండం చివరి భాగం అడ్డుకోతను గమనిస్తే వెడల్పుగా మారినట్లు చూడవచ్చు.
7. కాండం పొడవులో భేదం గుర్తించుటకు- కాండం పొడవు వేర్వేరు రకాలుగా ఉంటుంది (కానీ ప్రతి మొక్కకు పొడవు స్థిర లక్షణమై ఉంటుంది).
ప్రశ్న 15.
మెండల్ ‘లక్షణాంశాలు’ (traits) అనే పదాన్ని ఏ విధంగా ఉపయోగించాడు? ఒక ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:
1. మెండల్ లక్షణాంశాలు (traits) అనే పదాన్ని, లక్షణాలు కలిగించే కారకాలుగా ఉపయోగించాడు.
2. ఈ కారకాంశములనే నేడు మనం “జన్యువులు’ అని పిలుస్తున్నాము. అనువంశికతకు ఇవి మూలకారణాలు.
3. మెండల్ ప్రకారం లక్షణాంశాలు :
- లక్షణాలను నిర్ణయిస్తాయి.
- ఒక లక్షణానికి ఒక జత కారకాలు ఉంటాయి.
- జనకతరం నుండి తరువాత తరానికి అందుతాయి.
- ఒకేరకమైన లక్షణాంశములు ఆ జాతి మిగిలిన జీవులలో కూడా ఉంటాయి.
ఉదా : ఒక పొడవు బఠానీ మొక్కను పరిశీలిస్తే
1. పొడవు లక్షణం కలిగించే కారకాలు ఒక జత ఉంటాయి.
2. పొడవు మొక్క సంతతి పొడవుగా ఉంటుంది. అంటే పొడవు లక్షణ కారకం తరువాత తరానికి అందించబడింది.
3. పొడవు మొక్కలన్నింటిలోనూ ఇటువంటి కారకాలు ఉంటాయి.
4. ఇదే విధంగా బఠానీ మొక్కలోని ప్రతి లక్షణానికి ఒక జత ‘లక్షణాంశాలు’ ఉంటాయి.
ప్రశ్న 16.
జనకతరం, F1 తరాల మధ్య మెండల్ గుర్తించిన భేదాలు ఏమిటి? (AS1)
జవాబు:
జనకతరం | F2 తరం |
1) ఇది లక్షణాల పరంగా శుద్ధమైనవి. | 1) ఇవి మిశ్రమ లక్షణాలు కల్గి ఉండవచ్చు. |
2) జన్యుపరంగా సమయుగ్మ స్థితిలో ఉంటాయి. | 2) సమయుగ్మజం మరియు విషమయుగ్మజాలు ఏర్పడతాయి. |
3) నిర్దిష్ట లక్షణాలు కల్గి ఉంటాయి. | 3) సంకరణ తేజం వలన మెరుగైన మిశ్రమ లక్షణాలు రావచ్చు. |
4) జన్యురూపం, దృశ్యరూప నిష్పత్తులు ఒకే విధంగా ఉంటాయి. | 4) దృశ్యరూప నిష్పత్తి జన్యురూప నిష్పత్తి కంటే విభిన్నంగా ఉంటుంది. |
5) అనువంశికత అధ్యయనంలో మొదటితరం జీవులు. | 5) ఇవి F1 తరం నుండి ఏర్పడే రెండవ తరం జీవులు. |
6) ఆత్మపరాగ సంపర్కం వలన ఒకే రకమైన అవే జీవులు ఏర్పడతాయి. (సమయుగ్మజాలు) | 6) ఆత్మపరాగ సంపర్కం వలన అంతర్గత జన్యువులు బయట పడతాయి (విషమయుగ్మజాలు) |
7) దృశ్యరూప నిష్పత్తి : 1 : 1 జన్యురూప నిష్పత్తి : 1 : 1 | 7) దృశ్యరూప నిష్పత్తి : 3 : 1 జన్యురూప నిష్పత్తి : 1 : 2 : 1 |
ప్రశ్న 17.
శిశువు లింగ నిర్ధారణకు కారణం మగవారే. దీనిని అంగీకరిస్తావా? మీ సమాధానాన్ని ఫ్లోచార్టు ద్వారా వివరించంది. (AS1)
జవాబు:
- శిశువు నిర్ధారణకు మగవారే కారణము అని అంగీకరిస్తాను.
- మగవారు XY అనే లింగ నిర్ధారణ క్రోమోజోమ్స్ కలిగి ఉంటారు.
- ఆడవారు XX అనే లింగ నిర్ధారణ క్రోమోజోమ్స్ కలిగి ఉంటారు.
- కావున పురుష సంయోగబీజాలు X లేదా Y క్రోమోజోమ్స్ కలిగి ఉంటే, స్త్రీ సంయోగబీజాలు మాత్రం X క్రోమోజోమ్స్ కలిగి ఉంటాయి.
- స్త్రీ సంయోగబీజం (1)తో పురుష X క్రోమోజోమ్ కలిగిన సంయోగబీజం కలిస్తే సంయుక్తబీజం XX క్రోమోజోమ్స్ కలిగి ఆడశిశువు ఏర్పడుతుంది.
- స్త్రీ సంయోగబీజం (1) తో పురుష Y క్రోమోజోమ్ కలిగిన సంయోగబీజం కలిస్తే సంయుక్తబీజం XY క్రోమోజోమ్స్ కలిగి మగశిశువు ఏర్పడుతుంది.
- దీనిని బట్టి ఆడ, మగ వ్యత్యాసం స్త్రీ సంయోగబీజంతో కలిసే పురుష సంయోగబీజంపై ఆధారపడి ఉంటుంది. అంటే లింగ నిర్ధారణకు మగవారే కారణం.
ప్రశ్న 18.
సమరూప, అనురూప అవయవాలను గురించి క్లుప్తంగా వివరించండి. (AS1)
(లేదా)
నిర్మాణ సామ్య అవయవాలు అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సమరూప (లేదా) నిర్మాణ సామ్య అవయవాలు :
ఒకే రకమైన ప్రాథమిక నిర్మాణం కలిగి వేరు వేరు విధులను నిర్వర్తించే అవయవాలను సమరూప అవయవాలు అంటారు.
ఉదా :
తిమింగలంలోని వాజాలు – ఈదడానికి
గబ్బిలం రెక్కలు – ఎగరడానికి
చిరుత ముందరి కాళ్ళు – పరుగెత్తడానికి
అనురూప లేదా క్రియాసామ్య అవయవాలు :
ఒకే రకమైన విధులను నిర్వర్తిస్తూ, వేరు వేరు నిర్మాణాలను కలిగిన అవయవాలను అనురూప లేదా క్రియాసామ్య అవయవాలు అంటారు.
ఉదా :
పక్షి రెక్కలు – ఎగురుటకు
గబ్బిలం రెక్కలు – ఎగురుటకు
ప్రశ్న 19.
శిలాజాలకు సంబంధించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు ఎలా ఉపయోగిస్తారు? (AS1)
జవాబు:
- శిలాజాల అధ్యయనాన్ని “పురాజీవశాస్త్రం” (Palaeontology) అంటారు .
- శిలాజాలపై పరిశోధన చేసే శాస్త్రవేత్తలను “జియాలజిస్టు ” (Geologists) అంటారు.
- జియాలజిస్టు శిలాజాలను అధ్యయనం చేసి…..
1. గత కాలంలో జీవించిన జీవుల వివరాలు తెలుపుతారు.
2. అంతరించిపోయిన జీవ జాతుల గురించి తెలుపుతారు.
3. జీవ పరిణామ క్రమం గురించి నిదర్శనాలు చూపుతారు.
4. ఒకప్పటి భూమి మీద జీవన పరిస్థితులు వివరిస్తారు.
5. మానవ ఆవిర్భావక్రమము తెలుపుతారు.
6. రెండు వర్గాల జీవుల మధ్యగల సంబంధాలను తెలుపుతారు.
7. జీవులు అంతరించిపోవటానికి గల కారణాలు తెలుపుతారు.
8. సంధాన సేతువుల ద్వారా వర్గవికాసక్రమాన్ని వివరిస్తారు.
ప్రశ్న 20.
మెండల్ తన ప్రయోగాల కోసం బఠానీ మొక్కను ఎన్నుకున్నాడు. అందుకు గల కారణాలు ఏమై ఉంటాయని మీరు భావిస్తున్నారు? (AS2)
జవాబు:
మెండల్ తన ప్రయోగాల కోసం బఠానీ మొక్కను ఎన్నుకోవటానికి గల కారణాలు :
1. బఠానీ అధిక వైవిధ్యాలు కలిగిన మొక్క :
మెండల్ తన ప్రయోగాల కోసం దాదాపు ఏడు విభిన్న లక్షణాలను ఎన్నుకున్నాడు. ఇవన్నీ స్పష్టంగా ఉండి పరిశీలించటానికి అనువుగా ఉన్నాయి. ఉదా : పువ్వురంగు, పువ్వుస్థానం.
2. బఠానీ ద్విలింగ పుష్పం కలిగిన మొక్క :
కావున ఇది పరపరాగ సంపర్కం, ఆత్మపరాగ సంపర్కం జరపటానికి వీలుగా ఉంటుంది.
3. పుష్ప నిర్మాణం :
పుష్పంలో కేసరావళి, అండకోశం పెద్దవిగా ఉండుట వలన పరాగ సంపర్కం సులభం.
4. బఠానీ మొక్క ఏకవార్షికం :
కావున ప్రయోగ ఫలితాలు త్వరగా తెలుస్తాయి. తక్కువ కాలంలో ఎక్కువ ప్రయోగాలు నిర్వహించవచ్చు.
ప్రశ్న 21.
లామార్క్ ప్రతిపాదించిన ఆర్జిత గుణాల అనువంశికతా సూత్రం ఒకవేళ సరైనదే అయితే ప్రపంచం ఎలా ఉండేది? (AS2)
జవాబు:
లామార్క్ ప్రతిపాదించిన ఆర్జిత గుణాల అనువంశికత సూత్రం సరైనది కాదు. ఇది సరైనది అయితే ఒక జీవి జీవితకాలంలో పొందిన మార్పులు తరువాత తరానికి అందుతాయి.
- కాళ్లు, చేతులు లేనివారికి కాళ్లు, చేతులు లేని పిల్లలే పుడతారు.
- ఆడవాళ్లు ముక్కు చెవులు కుట్టించుకుంటారు. లామార్క్ సూత్రం నిజమైతే, పుట్టే పిల్లలకు ముక్కు, చెవులు కుట్టిన పిల్లలు పుడతారు.
- ఎండలో పనిచేసే రైతులు, శ్రామికులు నల్లని చర్మం కలిగి ఉంటారు. వారి పిల్లలందరూ నల్లగానే పుడతారు.
- మనిషి తన జీవితంలో అనేక నైపుణ్యాలు సంపాదిస్తాడు. లామార్క్ సూత్రం ప్రకారం ఈ నైపుణ్యాలన్నీ పిల్లలకి చేరతాయి. అంటే ఏ శిక్షణా లేకుండానే పెయింటర్ కొడుకు పెయింట్ వేస్తాడు, శిల్పి కొడుకు శిల్పాలు చెక్కుతాడు.
- ఒక వ్యక్తి జిమ్ కి వెళ్ళి దారుడ్య దేహం సంపాదిస్తే అతని సంతతి దారుడ్య దేహంతో పుడతారు. కానీ ఇవన్నీ అసాధ్యాలు.
ప్రశ్న 22.
మీ పరిసరాలలో పెరిగే పూలమొక్కలను పరిశీలించండి. వాటి మధ్య పోలివున్న, వేరువేరుగా ఉన్న లక్షణాలను గుర్తించి రాయండి. (AS3)
జవాబు:
మా పరిసరాలలో పెరిగే ప్రధాన పూలమొక్కలు మల్లి, మందార.
భేదాలు :
మల్లి | మందార |
1. పుష్పం తెలుపురంగులో ఉంటుంది. | 1. పుష్పం ఎరుపురంగులో ఉంటుంది. |
2. పరిమాణం చిన్నదిగా ఉండును. | 2. పరిమాణం పెద్దదిగా ఉండును. |
3. సువాసన కలిగి ఉంటుంది. | 3. వాసన ఉండదు. |
4. ఆకర్షకపత్రాలు చిన్నవి. | 4. ఆకర్షకపత్రాలు పెద్దవి. |
5. కేసరావళి విడిగా ఉంటాయి. | 5. కేసరావళి కీలానికి అంటి ఉన్నాయి. |
6. కీలాగ్రం శాఖారహితంగా ఉంది. | 6. కీలాగ్రం ఐదు శాఖలుగా చీలి ఉంది. |
7. రాత్రిపూట వికసిస్తాయి. | 7. పగలు వికసిస్తాయి. |
8. రక్షకపత్రాలు చిన్నవి. | 8. రక్షకపత్రాలు పెద్దవి. |
పోలికలు :
- మల్లి, మందార రెండూ కూడా ద్విలింగ పుష్పాలు,
- ఈ రెండు పుష్పాలు సంపూర్ణ పుష్పాలు.
ప్రశ్న 23.
మీ కుటుంబ సభ్యుల అనువంశికతా సూత్రం లక్షణాలు/ గుణాలను గురించిన సమాచారాన్ని సేకరించండి. సమాచారాన్ని విశ్లేషించి రాయండి. (AS4)
జవాబు:
- నా పేరు గోపి. మా నాన్న ఆరు అడుగుల ఎత్తుతో శారీరకంగా దృఢంగా ఉన్నారు. మా తాత కూడా బాగా ఎత్తు ఉండి దృఢంగా ఉండేవాడని చెప్పారు. దీనినిబట్టి ఎత్తు, శారీరక దృఢత్వం అనువంశికంగా సంక్రమించాయని భావిస్తున్నాను. నేను కూడా భవిష్యత్ లో ఎత్తుగా, దృఢంగా పెరుగుతాను.
- మా అమ్మ జుట్టు పొడవుగా, నునుపుగా ఉంటుంది. మా నాన్న జుట్టు ఒత్తుగా, ఉంగరాలు తిరిగి ఉంటుంది. మా చెల్లెలు మా అమ్మలా పొడవైన జుట్టు కలిగి ఉంది. మా నాన్నలా నేను ఉంగరాల జుట్టు కలిగి ఉన్నాను. ఈ లక్షణం మా తల్లిదండ్రుల నుండి సంక్రమణ చెందిందని భావిస్తున్నాను.
- మా అమ్మ మంచి రంగుతో ఉండగా, మా నాన్న రంగు తక్కువగా ఉంటాడు. నేను మా అమ్మలా మంచి రంగు కలిగి ఉండగా, మా పెద్ద అన్నయ్య నాన్న వలె తక్కువ రంగుతో ఉన్నాడు. కావున రంగు లక్షణంగా నేను మా అమ్మ నుండి పొందితే, మా అన్నయ్య నాన్న నుండి పొందాడు.
- నా ముక్కు మొనతేలి పొడవుగా ఉంటుంది. మా అమ్మ నీది అచ్చము ‘మీ తాత ముక్కు’ అంటుంది. కానీ ఇటువంటి ముక్కు మా నాన్నకు కాని, అమ్మకు కాని లేదు. ఈ లక్షణం మా తాత నుండి, నాన్న ద్వారా నాకు సంక్రమించిందని భావిస్తున్నాను.
ప్రశ్న 24.
జీవ పరిణామ నిదర్శనాలకు సంబంధించిన కింది సమాచారంపై మీ అభిప్రాయాన్ని రాయండి.
“పక్షులు, సరీసృపాలు, ఉభయచరాల మాదిరిగానే క్షీరదాలు నాలుగు కాళ్లు కలిగి ఉన్నాయి. వీటన్నింటిలో పూర్వాంగాల” నిర్మాణం ఒకే విధంగా ఉన్నప్పటికి అవి చేయాల్సిన పనులకు అనుగుణంగా అవయవాలు రూపాంతరం చెందాయి. (AS4)
జవాబు:
- ఒకే రకమైన నిర్మాణం కలిగిన జీవులు ఒకే పూర్వపు జీవి నుండి పరిణామం చెంది ఉంటాయి.
- ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాల ముందు కాళ్ల నిర్మాణం ఒకే రకంగా ఉంది. అంటే ఈ జీవులు ఒకే రకమైన జీవి నుండి పరిణామం చెందాయి.
- పరిణామక్రమంలో జీవులు వివిధ పరిసరాలకు అలవాటుపడటం వలన వాటి జీవన విధానానికి తగినట్టు, ముందు కాళ్లు మార్పు చెందాయి.
- కప్పలలో దుమకటానికి, సరీసృపాలలో పాకటానికి, పక్షులలో ఎగరటానికి, క్షీరదాలలో నడవటానికి అనుగుణంగా ముందరి కాళ్లు మార్పు చెంది జీవన అనుకూలనాలు పొందాయి.
- అయినప్పటికి ఇవన్నీ ఒకే జీవి నుండి పరిణితి చెందాయని వాటి నిర్మాణం ఆధారంగా నిర్ణయించవచ్చు.
ప్రశ్న 25.
“కార్బన్ డేటింగ్ పద్దతి” గురించిన సమాచారాన్ని సేకరించండి. భౌతిక శాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయులతో ఈ విషయమై ఏమేమి చర్చించారో రాయండి. (AS4)
జవాబు:
- శిలాజాల వయస్సును నిర్ధారించటానికి పురాజీవ శాస్త్రవేత్తలు ‘కార్బన్ డేటింగ్ పద్ధతి’ అనే ప్రక్రియను ఉపయోగిస్తారు.
- సాధారణ కార్బన్ 6C12 గా ఉండగా, కార్బన్ ఐసోటోప్ 6C14 గా ఉంటుంది.
- 6C14 కార్బన్ ఐసోటోప్ రేడియోధార్మిక స్వభావం కలిగి విఘటనం చెందుతూ ఉంటుంది.
- ఒక గ్రాము పదార్థం విఘటనం చెంది అరగ్రాము పదార్థంగా మారటానికి పట్టే కాలాన్ని ‘అర్జజీవిత కాలు’ అంటారు.
- లభించిన శిలాజంలో సాధారణ కార్బన్, ఐసోటోప్ కార్బన్ నిష్పత్తిని గణించి, మిగిలిన ఐసోటోప్ కార్బన్ ఆధారంగా శిలాజం ఎంత కాలం నాటిదో అంచనా వేస్తారు.
- శిలాజాల వయస్సును నిర్ణయించే ప్రక్రియను ‘కార్బన్ డేటింగ్ పద్దతి’ అంటారు.
- ఇది ఒక రేడియోమెట్రిక్ డేటింగ్ పద్దతి. ఈ ప్రక్రియలో 58,000-62,000 సం||రాల నుండి నేటి వరకు శిలాజ వయస్సు నిర్ణయించవచ్చు.
- ఈ ప్రక్రియను “విల్లర్డ్ లిల్లి” 1949 సం||లో కనిపెట్టి నోబెల్ బహుమతిని పొందాడు.
- ఈ ప్రక్రియ ద్వారా సముద్ర గర్భ శిలాజాలను, ఈజిప్ట్ మమ్మీల వయస్సును నిర్ధారించగలిగినారు.
- పురాజీవ శాస్త్రంలో ఇది ఒక కీలక ప్రక్రియ.
ప్రశ్న 26.
స్వంతత్ర వ్యూహన సిద్ధాంతాన్ని చూపే గదుల చిత్రాన్ని బట్టి ఒక ఫ్లోచార్టును గీయండి. నిష్పత్తిని వివరించండి. (AS5)
జవాబు:
ప్రశ్న 27.
మెండల్ ప్రయోగాలలోని ఏక సంకర సంకరణం జరిపే విధానాన్ని గురించి గళ్ల చదరాన్ని గీసి వివరించండి. (AS5)
జవాబు:
- మెండల్ తన ఏక సంకరణ ప్రయోగానికి శుద్ధవంశపు పొడవు (TT), పొట్టి (tt) మొక్కలను ఎన్నుకొన్నాడు.
- వాటి సంకరణం వలన F, తరం ఏర్పడింది. ఇవన్నీ పొడవుగా ఉన్నాయి. అంటే పొట్టి లక్షణం అంతర్గతం.
- F1 తరం మొక్కల మధ్య ఆత్మ పరాగ సంపర్కం జరపగా F2 తరం లభించింది.
- F2 తరంలో మూడు వంతులు పొడవు మొక్కలు, ఒక వంతు పొట్టి మొక్కలు ఏర్పడ్డాయి. అంటే వీటి దృశ్యరూప నిష్పత్తి 3:1, మరియు జన్యురూప నిష్పత్తిని 1:2:1 గా నిర్ధారించాడు.
ప్రశ్న 28.
గడిచిపోయిన జీవ మహాయుగాలలో మానవ పరిణామం ఎలా జరిగిందో తెలిపేందుకు ఒక చార్టును తయారు చేయండి. (AS5)
జవాబు:
ఎప్స్ — రామాపిథికస్ + ఆస్ట్రియోపిథికస్ – + హెూమోఎరక్టస్ + నియాండర్ఆల్ + సూమో సెపియన్
ప్రశ్న 29.
ప్రకృతి ఉపయోగకరమైన లక్షణాలను మాత్రమే ప్రోత్సహిస్తుందని తెలియజేసేలా ఒక కార్టూను తయారుచేయండి. (AS6)
జవాబు:
ప్రశ్న 30.
‘మనుగడ కోసం పోరాటం’ను అర్థం చేసుకోవటానికి మీ పరిసరాలలోని ఏయే ఉదాహరణలను లేదా ఏయే సందర్భాలను మీరు పరిశీలించారు? (AS7)
జవాబు:
మనుగడ కోసం పోరాటాన్ని మన నిత్యజీవితంలో అనేక సందర్భాలలో పరిశీలిస్తాము.
ఉదాహరణ 1 :
ఒక కుండీలో అధిక విత్తనాలు పోసినపుడు అవి నేల, నీరు, సూర్యరశ్మి కోసం తీవ్రంగా పోటీపడతాయి. ఈ పోటీలో సరైన అనుకూలనాలు కలిగిన, సమర్థవంతమైన విత్తనాలు మాత్రమే పోటీని తట్టుకొని మొలకెత్తుతాయి.
ఉదాహరణ 2 :
మా బజారులో వీధి కుక్కలు ఐదు ఉన్నాయి. ఎవరైనా అన్నం పారేసినపుడు ఆ ఐదు కుక్కలూ గుమికూడి కొట్లాడుకుంటాయి. వాటిలో బలంగా ఉన్న కుక్క మిగిలిన వాటిని పారద్రోలి ఆహారం సంపాదించుకొంటుంది.
ఉదాహరణ 3 :
మా క్లాసులో 40 మంది విద్యార్థులం ఉన్నాము. అందరం బాగా చదువుతాము. మొదటి ర్యాంకు కొరకు పోటీపడతాము. కానీ ఒక్కడే మొదటి ర్యాంక్ పొంది స్కూల్ లీడర్‌గా ఎన్నిక అవుతాడు.
ఉదాహరణ 4 :
మా పట్టణంలో ఒకే బజారున అనేక బట్టల షాపులు ఉన్నాయి. వారి మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. వారిలో ఎవరైతే వినియోగదారుల్ని ఆకర్షించగలరో వారు మాత్రమే లాభదాయక వ్యాపారం చేయగలరు.
ప్రశ్న 31.
మానవ పరిణామం గురించి స్వగతం తయారుచేయండి. (AS7)
జవాబు:
భూమి మీద అత్యున్నత మేధాసంపత్తి గల జీవిగా పిలవబడే మానవుడు అను నేను అన్ని సాధారణ జీవులవలె పరిణామం చెంది ఈ స్థాయికి వచ్చానంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆదిమానవుని వలె 7 లక్షల 50 వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన నా పరిణామం వేడు నన్ను అగ్రస్థాయిలో నిలిపింది. మొదట ‘హోమో హెబిలస్’ గా పిలవబడిన నేను మిగిలిన ప్రేమేట్స్ మాదిరిగా ఒక జంతువుగా అడవిలో సంచరించటం ప్రారంభించాను. ఇది సుమారు 1.6 నుండి 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం మాట.
తరువాత నేను చింపాంజి, గొరిల్లాల వలె కాకుండా నిటారుగా నిలబడటం నేర్చుకొన్నాను. ఇది నా జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన. దీనివలన నా రెండు చేతులు ఉపయోగంలోకి వచ్చాయి. అప్పుడు నన్ను ‘హోమో ఎరెక్టస్’ అన్నారు. తరువాత జంతువులతో వేరైన నేను మనిషిగా అడుగులు వేశాను. సంఘజీవనం స్థాపించాను. నన్ను అపుడు ‘నియాండర్తలెన్సిస్’ గా పిలిచారు. తరువాత 12.5 లక్షల సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఇపుడు ఆధుని మానవుడిగా ‘ హోమో సెపియన్’గా పిలవబడుతూ, నా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాను.
10th Class Biology 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు Textbook InText Questions and Answers
10th Class Biology Textbook Page No. 177
ప్రశ్న 1.
ఎన్ని లక్షణాలలో నీవు నీ తల్లిదండ్రులను పోలి ఉన్నావు?
జవాబు:
రంగు, ముఖం, ఆకారం, జుత్తు, కళ్ళు వంటి లక్షణాలలో నేను నా తల్లిదండ్రులను పోలి ఉన్నాను.
ప్రశ్న 2.
మీ తల్లిదండ్రుల ఇరువురిలో లేకుండా నీలో మాత్రమే కనిపిస్తున్న పోలికలు ఏమైనా ఉన్నాయా? అని ఏమిటి?
జవాబు:
ఉన్నాయి. నా చెవి తమ్మెలు, ఆకారం నా తల్లిదండ్రులలో ఎవరికి లేవు.
ప్రశ్న 3.
అవి ఎక్కడి నుండి వచ్చి ఉంటాయని నీవు భావిస్తున్నావు?
జవాబు:
ఈ లక్షణం మా తాత నుండి నాన్న ద్వారా నాకు సంక్రమించిందని భావిస్తున్నాను.
10th Class Biology Textbook Page No. 178
ప్రశ్న 4.
వైవిధ్యాలన్నీ గుర్తించగలిగేలా ఉంటాయా?
జవాబు:
కొన్ని వైవిధ్యాలు చాలా సూక్ష్మంగా ఉండి గుర్తించటానికి వీలుగా ఉండవు. పెద్ద పరిమాణంలో ఉండే వైవిధ్యాలు గుర్తించడానికి వీలుగా ఉంటాయి.
10th Class Biology Textbook Page No. 189
ప్రశ్న 5.
X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిసి ఫలదీకరణం జరిగితే ఏమి జరుగుతుంది?
జవాబు:
X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమ్ జోమ్ ఉన్న అండంతో కలిసి ఫలదీకరణం జరిగితే XX క్రోమోజోములతో ఏర్పడిన అమ్మాయి పుడుతుంది.
ప్రశ్న 6.
శిశువు లింగ నిర్ధారణ చేసేది అమ్మానాన్నలలో ఎవరు?
జవాబు:
శిశువు లింగనిర్ధారణ చేసేది నాన్న.
ప్రశ్న 7.
ఆడపిల్ల పుట్టిందని స్త్రీని నిందించడం సరైనదేనా?
జవాబు:
సరికాదు.
ప్రశ్న 8.
లింగం అనేది ఒక లక్షణమా? గుణమా? దీనికి మెండల్ ప్రతిపాదించిన బహిర్గతత్వ సూత్రం వర్తిస్తుందా?
జవాబు:
లింగం అనేది ఒక లక్షణము లేదా గుణము. దీనికి “మెండల్” ప్రతిపాదించిన బహిర్గతత్వ సూత్రం వర్తిస్తుంది.
ప్రశ్న 9.
మనలో ఉన్న లక్షణాలన్నీ మన తల్లిదండ్రులను పోలి ఉంటాయా?
జవాబు:
మనలో ఉన్న లక్షణాలన్నీ మన తల్లిదండ్రులను పోలి ఉండవు.
10th Class Biology Textbook Page No. 197
ప్రశ్న 10.
కప్ప టాడ్ పోల్ డింభకం. కప్ప కన్నా ఎక్కువగా చేపను పోలి ఉంటుంది. ఇది దేనిని సూచిస్తుంది? అంటే చేపల నుండి కప్పలు పరిణామక్రమం ఫలితంగా ఏర్పడ్డాయని భావించవచ్చా?
జవాబు:
- జీవులు తమ పిండాభివృద్ధిలో తమ పూర్వీకుల లక్షణాలను ప్రదర్శిస్తాయి.
- జీవుల పిండాభివృద్ధిని పరిశీలించి వాటి పూర్వీకులను అంచనా వేయవచ్చు.
- కప్ప టార్పాల్ డింభకం ఎక్కువగా చేపను పోలి ఉంటుంది.
- దీనినిబట్టి కప్పలు (ఉభయచరాలు) చేపల నుండి ఏర్పడ్డాయని నిర్ధారించవచ్చు.
ప్రశ్న 11.
సుప్రసిద్ధ పిండాభివృద్ధి శాస్త్రవేత్త అయినా తొలిదశలో ఉన్న ఒక పిండాన్ని వేరొకదాని నుండి వేరుగా గుర్తించటం కష్టం. ఈ విషయం ఏమి తెలియజేస్తుంది?
జవాబు:
- జీవుల పిండాభివృద్ధిలో పిండాలన్నీ ఒకే విధంగా ఉండుటవలన పిండాభివృద్ధి శాస్త్రవేత్తలు వాటిని గుర్తించలేరు.
- దీనినిబట్టి జీవులన్నీ ఒకేరకమైన ఉమ్మడి జీవి నుండి పరిణామం చెందాయని నిర్ధారించవచ్చు.
- జీవులలోని ఈ ఐక్యతా నిదర్శనం పరిణామవాదానికి బలమిస్తుంది.
ప్రశ్న 12.
ప్రతిజీవి జీవితచరిత్ర పూర్వీకుల నిర్మాణాత్మక లక్షణాలను ప్రదర్శిస్తోందా?
జవాబు:
ప్రతిజీవి జీవిత అభివృద్ధి దశలో తన పూర్వీకుల ‘లక్షణాలను ప్రదర్శిస్తుంది. దీనినిబట్టి, నేడు మనం చూస్తున్న జీవులు, ఇంతకు ముందు ఉన్న జీవుల పరిణామ ఫలితం అని నిర్ధారించవచ్చు. పరిణామానికి పిండాభివృద్ధి ఒక నిదర్శనం.
10th Class Biology Textbook Page No. 199
ప్రశ్న 13.
ఆర్కియోప్టెరిక్స్ అనే సంధాన సేతువు దేనిని పోలి ఉంటుంది? పక్షులనా లేక సరీసృపాలనా?
జవాబు:
ఆర్కియోప్టెరిక్స్ ఒక శిలాజము. దీని లక్షణాలు పరిశీలించినపుడు, అది సరీసృపాలు, పక్షుల రెండింటి లక్షణాలను కలిగి ఉంది. కావున దీనిని సరీసృపాలకు, పక్షులకు సంధాన సేతువులా భావిస్తారు. సరీసృపాల నుండి పక్షులు పరిణామం చెందాయని చెప్పటానికి ఆర్టియోప్టెరిక్స్ ఒక శిలాజ నిదర్శనం.
ఆర్కియోప్టెరిక్స్ పొడవైన తోక, పొలుసులు వంటి సరీసృపాల లక్షణాలను, ఈకలు, దంతాలు కలిగిన దవడలు, రెక్కలు వంటి పక్షుల లక్షణాలను కలిగి ఉంది.
ప్రశ్న 14.
ఒక అడవిలో రెండు రకాలైన జింకలు ఉన్నాయనుకుందాం. ఒక రకం చాలా వేగంగా పరుగెత్తగలవు. కానీ రెండవ రకం అంత వేగంగా పరుగెత్తలేవు. సింహాలు, పులులు, జింకలను వేటాడి ఆహారంగా తీసుకొంటాయి. మరి ఏ రకం జింకలు మనుగడ సాగిస్తాయో ఊహించండి. ఏ రకం జింకల జనాభా క్రమంగా అనువంశికత తగ్గిపోతుంది? ఎందుకు?
జవాబు:
- సింహాలు, జింకలను వేటాడినపుడు వేగంగా పరిగెత్తేవి తప్పించుకొని జీవించగలుగుతాయి.
- వేగంగా పరిగెత్తలేని జింకలు సింహాలకు పులులకు ఆహారం కావటం వలన వాటి జనాభా తగ్గిపోతుంది. క్రమేణ ఆ వీటి జనాభా అడవి నుండి తొలగించబడుతుంది.
- వేగంగా పరిగెత్తటం అనే అనుకూలనం జీవుల మనుగడకు తోడ్పడింది.
- ఇంకా చెప్పాలంటే ప్రకృతి, వేగంగా పరిగెత్తే జీవులను ఎంపిక చేసుకొంది. ఈ సహజ ప్రక్రియనే ‘ప్రకృతివరణం’ అంటారు.
10th Class Biology 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు Textbook Activities (కృత్యములు)
కృత్యం – 1
నీలో ఉన్న లక్షణాలను మీ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో పోల్చి పట్టికలో రాయండి.
1) నీలోనూ, మీ అమ్మలోనూ, మీ అమ్మమ్మలోనూ కనిపించే లక్షణాలు ఏమిటి?
జవాబు:
నా చర్మ రంగు తెలుపు. ఇది అమ్మలోనూ, అమ్మమ్మలోనూ కనిపిస్తుంది.
2) నీలో, మీ అమ్మమ్మలో కనిపించే లక్షణాలు ఏవి?
జవాబు:
చర్మం రంగు
3) మీ అమ్మమ్మ నుండి ఆ లక్షణాలు నీకు ఎలా సంక్రమించాయని నీవు అనుకొంటున్నావు?
జవాబు:
మా అమ్మమ్మలోని లక్షణం నాకు అమ్మ ద్వారా సంక్రమించింది.
4) నీలోనూ, మీ అమ్మలోనూ ఉంది మీ అమ్మమ్మలో కనిపించని లక్షణాలు ఏవైనా ఉన్నాయా?
జవాబు:
పొడవు ముక్కు లక్షణం నాలోనూ మా అమ్మలోనూ ఉంది. కాని అమ్మమ్మలో కనిపించలేదు.
5) మీ అమ్మ ఈ లక్షణం ఎక్కడి నుండి పొంది ఉంటుందని నీవు అనుకుంటావు?
జవాబు:
మా అమ్మ ఈ లక్షణాన్ని తాతయ్య నుండి పొంది ఉంటుంది.
కృత్యం – 2
మీ తరగతిలోని స్నేహితులలో ఎవరైనా ఆరుగురిని ఎంపిక చేసుకోండి. క్రింది పట్టికలో ఇచ్చిన లక్షణాలను పరిశీలించి రాయండి.
1) మీలోని లక్షణాలు ఎక్కువగా మీ తల్లిదండ్రులను పోలి ఉంటాయా? మీ స్నేహితులను పోలి ఉంటాయా?
జవాబు:
మాలోని లక్షణాలు ఎక్కువగా మా తల్లిదండ్రులను పోలి ఉంటాయి.
2) మీరు మీ తల్లిదండ్రుల కంటే భిన్నంగా ఉండటం, మీ స్నేహితుని కంటే భిన్నంగా ఉండటం ఒకటే అని భావిస్తున్నారా? ఎందుకు?
జవాబు:
రెండూ ఒకటిగా నేను భావించటం లేదు. నేను మా తల్లిదండ్రులను పోలి ఉండి కేవలం కొన్ని లక్షణాలలో మాత్రమే విభేదిస్తున్నాను. అయితే నా స్నేహితుడికి నాకు ఏ మాత్రం పోలికలు లేవు, పూర్తి భిన్నంగా ఉన్నాను.
కృత్యం – 3
బరాని లేదా చిక్కుడు కాయలోని విత్తనాలను పరిశీలించండి. ఒక నిర్ణయానికి రావటానికి (సామాన్యీకరణ కోసం) ఎక్కువ కాయలను, విత్తనాలను పరిశీలించండి.
1) ఒకే రకంగా ఉన్న రెండు విత్తనాలు గమనించగలిగారా?
జవాబు:
లేదు. విత్తనాలు విభిన్నంగా ఉన్నాయి.
2) ఇవి వేరుగా ఉండటానికి కారణమేమి?
జవాబు:
విత్తనాలు లైంగిక ప్రత్యుత్పత్తి వలన ఏర్పడతాయి. ఈ ప్రక్రియలో పురుష, స్త్రీ జన్యు పదార్థం కలసి విభిన్న లక్షణాలు ఏర్పడతాయి. ఈ కొత్త లక్షణాలనే వైవిధ్యాలు అంటారు.
3) వైవిధ్యాలు ఎందువలన ముఖ్యమైనవిగా భావించాలి? ఒక జీవికి లేదా జనాభాకు వైవిధ్యాలు ఏ విధంగా ఉపయోగం కలిగిస్తాయి?
జవాబు:
- వైవిధ్యాలు జీవుల మనుగడకు తోడ్పడతాయి.
- వైవిధ్యాలు అనుకూలనాలను పెంపొందిస్తాయి.
- వైవిధ్యాలు జీవులను, ఇతర జీవుల నుండి వేరుగా గుర్తించటానికి తోడ్పడతాయి.
- వైవిధ్యాలు జాతి అభివృద్ధికి దోహదపడతాయి.
- విచ్చిన్న వైవిధ్యాలు వలన కొత్త జీవులు ఏర్పడతాయి.
- జాతుల ఉత్పత్తిలో వైవిధ్యాలు తోడ్పడతాయి.
కృత్యం – 4
మెండల్ అనువంశికతా సూత్రాలను సులభంగా అర్థం చేసుకోడానికి ఒక కృత్యం చేద్దాం.
కావలసిన పరికరాలు :
- 3 సెం.మీ. పొడవు మరియు 1 సెం.మీ. వెడల్పు గల చార్టు ముక్కలు-4 12
- 2 సెం.మీ. పొడవు మరియు 1 సెం.మీ. వెడల్పు గల చార్టు ముక్కలు-4
- ఎరుపు గుండీలు – 4
- తెల్ల గుండీలు – 4
- చార్టు, స్కేలు, స్కెచ్ పెన్, పెన్సిల్.
పద్దతి : 2 × 2 గడులుండేలా చార్టుపై గీసి అంకెలు, గుర్తులను రాయండి.
ఆట – 1 : శుద్ధజాతి (Pure breed) :
మీరు తయారు చేసిన 4 పొడవు 4 పొట్టిగా ఉండే చార్లు ముక్కల్ని తీసుకోండి. జతలుగా ఏర్పరచేటపుడు ప్రతిజతలో పొట్టివిగానీ, పొడవుగానీ లేదా రెండూగాననీ ఉంటాయి.
ఇపుడు రెండు సంచులు తీసుకోండి. ప్రతి సంచిలో 4 కాగితం పట్టీలు ఉండేలా రెండు సంచులలో వేయండి. ప్రతి సంచిలో 2 పొడవు, 2 పొట్టి పట్టీలు ఉంటాయన్నమాట.
‘A’ సంచిని పురుషబీజకణంగానూ ‘B’ సంచిని స్త్రీ బీజకణంగానూ భావించండి. ఇప్పుడు ‘A’ సంచిలో నుండి చేతికి అందిన ఒక పట్టీని తీసుకుని గళ్ళచదరంలో 1వ గడిలో ఉంచండి. అలాగే ‘B’ సంచిలో నుండి కూడా చేతికి అందిన ఒక కాగితం పట్టీని తీసుకుని 1వ గడిలో ఉంచండి. మీ సంచుల్లో కాగితం పట్టీలు అయిపోయేదాకా ప్రతి గడిలో రెండు చొప్పున ఉంచుతూ ఆడండి. మీ సంచి ఖాళీ అయ్యేసరికి ప్రతి గడిలో రెండేసి కాగితం పట్టీలు ఉంటాయన్నమాట. వాటిని గమనించినట్లయితే రెండు పొడవు, రెండు పొట్టి, ఒకటి పొడవు, ఒకటి పొడవు, ఒకటి పొట్టి జతలు కనిపిస్తాయి.
1) రెండూ పొడవు పట్టీల జతలు ఎన్ని ఉన్నాయి?
జవాబు:
రెండూ పొడవు పట్టీ జతలు – 1 వచ్చింది.
2) రెండూ పొట్టి పట్టీల జతల సంఖ్య ఎంత?
జవాబు:
రెండు పొట్టి పట్టీ జతలు – 1 వచ్చింది.
3) ఒకటి పొట్టి, ఒకటి పొడవు కలిగిన జతలు ఎన్ని ఉన్నాయి?
జవాబు:
ఒకటి పొట్టి, ఒకటి పొడవు కలిగిన జతలు – 2 వచ్చాయి.
4) ప్రతి రకం ఎంత శాతంగా ఉన్నాయి? వాటి నిష్పత్తి ఎంత?
జవాబు:
ఈ ఆట ద్వారా పొడవు, పొట్టి పట్టీల జతలు ఏర్పడడం యాదృచ్ఛికంగా జరుగుతుంది అని గమనించాను.
5) ఈ ఆట ద్వారా మీరు ఏమి గమనించారు?
జవాబు:
- ప్రతిసారి పొడవు పట్టీ జతల సంఖ్య పొట్టి పట్టీ జతల సంఖ్యకు సమానంగా ఉండటం గమనించాను.
- పొడవు, పొట్టి పట్టీ జతల కంటే, పొట్టి పొడవు పట్టీ జతల సంఖ్య అధికంగా ఉండటం గమనించాను.
కృత్యం – 5
రెక్కల పురుగుల జనాభా క్రమంగా పెరుగుతూ ఉంది. అనుకోకుండా హఠాత్తుగా అవి ఉండే పొదలకు ఏదైనా తెగులు సోకిందనుకోండి. అప్పుడు ఆకులు నశించడం లేదా వాటి సంఖ్య తగ్గిపోవటం వలన రెక్క పురుగులకు సరైన ఆహారం లభించదు. పస్తులు ఉండాల్సివస్తుంది. కనుక రెక్కల పురుగు బరువు తగ్గిపోతుంది. కాని ఈ మార్పు జన్యు పదార్థమైన DNA ను మార్చలేదు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు మొక్కల తెగుళ్ళు తగ్గి పొదలు మునిపటిలా ఆరోగ్యంగా మారిపోయాయి.
1) అప్పుడు రెక్క పురుగుల బరువులో ఎలాంటి తేడాలు వస్తాయని నీవు భావిస్తున్నావు?
జవాబు:
రెక్కల పురుగులకు ఆహారం సంవృద్ధిగా దొరకటం వలన తిరిగి అవి బలంగా లావుగా తయారవుతాయి. ఈ మార్పు జన్యుపరమైనది కాదు కావున ఈ లక్షణం వాటి తరువాత తరానికి అందించబడదు.
కృత్యం – 6
వెన్నెముక గల జీవుల పిండాభివృద్ధిలోని వివిధ దశలను పరిశీలిద్దాం. వాటిలోని పోలికలు, భేదాలను గుర్తించి మీ మిత్రులతో చర్చించండి.
జవాబు:
- వెన్నుముక వెన్నెముక గల జీవుల పిండాభివృద్ధి దశలు ఆసక్తికరంగా ఉన్నాయి.
- ప్రాథమిక దశలో అన్ని జీవుల పిండాలు ఒకే విధంగా ఉండి, వేరు వేరుగా గుర్తించటం అసాధ్యంగా ఉంది.
- దీనినిబట్టి ఈ జీవులన్నీ ఒకే పూర్వజీవి నుండి పరిణామం చెందాయని భావించవచ్చు.
- రెండవ దశలో చేప, సాలమాండర్ పిండాలు పొడవుగా ఉండి కొంచెం విభిన్నంగా ఉన్నాయి.
- మిగిలిన జీవులైన తాబేలు, కోడి, పంది, ఆవు, కుందేలు, మనిషి యొక్క పిండాలు ఒకే విధంగా ఉండి, వేరుగా గుర్తించటం కష్టంగా ఉంది.
- మూడవ దశలో చేప, సాలమాండర్ పిండాలు ఒక విధంగా ఉంటే, పక్షులు, సరీసృపాల పిండాలు ఒక విధంగా, క్షీరదాల పిండాలు ఒక విధంగా ఉన్నాయి.
- దీనినిబట్టి జీవుల మధ్యగల సంబంధాలను, సారూప్యతను అంచనా వేయవచ్చు.
- జీవులన్నీ ఒకే పూర్వపు జీవి నుండి పరిణామం చెందాయని చెప్పటానికి పిండోత్పత్తిశాస్త్రం తిరుగులేని నిజాలను ఇస్తుంది.
కింది ఖాళీలను పూరించండి
1. జీవులలో మార్పులకు దారితీసే విధానాన్ని .. …………. అంటారు. (పరిణామం)
2. మెండల్ ప్రయోగాలు …………… ………… ను వివరిస్తాయి. (అనువంశికత)
3. స్వతంత్ర వ్యూహన సిద్ధాంతాన్ని వివరించే ప్రయోగాలలో పరిశీలించిన లక్షణాలు (గుండ్రని, ముడతలు, పసుపు, ఆకుపచ్చ)
4. ఎరుపు రంగు పుష్పాలున్న మొక్కతో తెలుపు రంగు పుష్పాలున్న మొక్కను పరాగ సంపర్కం చేసినపుడు ఏర్పడే మొక్కల్లో ……………….. శాతం అంతర్గత లక్షణం గల మొక్కలుంటాయి.
(100)
5. TT, YY లేదా TE, Yy లలో వ్యక్తమయ్యే లక్షణం …………. (బహిర్గత లక్షణం)
6. ఆడ శిశువులలో 23 జతల క్రోమోజోములుంటాయి. ఆమెకు 18 సంవత్సరాల వయసు వచ్చినపుడు ఆమెలో జతల శారీరక క్రోమోజోములు, ………………. జతల లైంగిక క్రోమోజోములుంటాయి. (22, ఒక)
7. జనాభా ………… శ్రేణిలో పెరుగుతుంటే ఆహార వనరులు ……….. శ్రేణిలో పెరుగుతాయి. (గుణశ్రేణి, అంకశ్రేణి)
8. సరిగా నడవలేని మేక ఎక్కువకాలం జీవించలేదు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఇది …………. ను తెలియజేస్తుంది. (ప్రకృతివరణం)
9. తిమింగలంలో ఈదడానికి ఉపయోగపడే వాజముగా మారిన ముంజేతి నిర్మాణం గుర్రంలో ………………… కు ఉపయోగపడేలా మార్పు చెంది ఉంటుంది. (పరుగెత్తడానికి)
10. శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని ………………… అంటారు. (శిలాజశాస్త్రం)
సరైన సమాధానాన్ని గుర్తించండి
1. కింది వానిలో గులాబి మొక్కకు సంబంధించి వైవిధ్యానికి దోహదపడనిది
A) రంగులు గల ఆకర్షక పత్రాలు
B) ముళ్లు
C) తీగలు
D) పత్రం
జవాబు:
A) రంగులు గల ఆకర్షక పత్రాలు
2. మెండల్ ప్రకారం యుగ్మవికల్పకాలలో ఉండే లక్షణం
A) జన్యువులు జతలుగా ఉండడం
B) లక్షణానికి బాధ్యత వహించడం
C) బీజకణాల ఉత్పత్తి
D) అంతర్గ లక్షణంగా ఉండడం
జవాబు:
A) జన్యువులు జతలుగా ఉండడం
3. ప్రకృతి వరణం అనగా
A) ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేయడం
B) జీవులతో ప్రకృతి ప్రతిచర్య జరపడం
C) ఉపయోగంలేని లక్షణాలను ప్రకృతి వ్యతిరేకించడం
D) A మరియు B
జవాబు:
A) ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేయడం
4. పురాజీవ శాస్త్రవేత్త దీనితో సంబంధం కలిగి ఉంటాడు
A) పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు
B) శిలాజ నిదర్శనాలు
C) అవశేష అవయవ నిదర్శనాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ