Andhra Pradesh AP Board 4th Class EVS Solutions 1st Lesson కుటుంబం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class EVS Solutions Lesson 1 కుటుంబం
I. విషయావగాహన:
ప్రశ్న 1.
చిన్న కుటుంబాలు పెరగడానికి రెండు కారణాలు రాయండి?
జవాబు.
- వివాహాలు, మరొక ఊరికి బదిలీ అవడం వల్ల, కుటుంబంలోని వ్యక్తుల మరణం వల్ల.
- వ్యాపారాలు, చదువులు, ఉద్యోగాల వల్ల, కుటుంబ స్థితిగతులో మార్పుల వల్ల చిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి.
ప్రశ్న 2.
కుటుంబాలలో కలిగే మార్పులకు కారణాలను రాయండి?
జవాబు.
- వివాహము, కొత్తగా శిశు జననం మరియు ఉద్యోగంలో బదిలీ మొదలైనవి కుటుంబ నిర్మాణంలో కలిగే మార్పులకు కారణాలు.
- వ్యాపారము, చదువు, ఉద్యోగం, కుటుంబంలోని వ్యక్తుల మరణం వంటి కారణాల వల్ల కూడా కుటుంబంలో మార్పులు జరుగుతున్నాయి.
ప్రశ్న 3.
గృహోపకరణాలు వినియోగం మనిషి యొక్క జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేసిందో రాయండి?
జవాబు.
- పూర్వం ప్రజలు ఇంటి పనులన్నింటిని స్వహస్తాలతోనే చేసుకొనేవారు.
- ఈ రోజుల్లో ప్రజలు అనేక రకాల గృహోపకరణాలను ఉపయోగిస్తూ తమ పనులను తేలికగాను, వేగంగాను చేసుకోగలుగుతున్నారు.
- గృహోపకరణాలు మనం పని చేసే విధానాన్ని మార్చి వేశాయి. దీని వలన మనం విద్యుత్ను ఎక్కువగా ఉపయోగిస్తూ శారీరక శ్రమను తగ్గించుకుంటున్నాం.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
మీ గ్రామంలోకి ఒక కొత్త కుటుంబం వచ్చింది. వారి గురించి తెలుసుకొనుటకు వారిని ఏయే ప్రశ్నలు అడుగుతావు?
జవాబు.
- మీరు ఎక్కడి నుండి వచ్చారు?
- మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?
- మీరు ఏం చేస్తారు?
- మీ కుటుంబ సభ్యులు ఎవరు?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
ఏదైనా కొన్ని గృహోపకరణాలు చిత్రాలను గీయండి వాటిని ఉపయోగాలు రాయండి?
జవాబు.
కొన్ని గృహోపకరణాలు – వాటి ఉపయోగాలు. క్రమ సంఖ్య గృహోపకరణం – పటం
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
మీ కుటుంబ సభ్యులందరి పేర్లను సేకరించి, మీ వంశ వృక్షాన్ని గీయండి?
జవాబు.
అమ్మ వాళ్ళ తల్లిదండ్రులు : వెంకటేశ్వర రావు, శ్రీదేవి.
నాన్న వాళ్ళ తల్లిదండ్రులు : లక్ష్మయ్య, నారాయణమ్మ.
తండ్రి : ప్రభాకర్,
తల్లి : పద్మ,
అక్క : భవిష్య,
నేను : ధాత్రి
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
కాగితాలను ఉపయోగించి మీ వంశ వృక్షాన్ని తయారు చేయండి?
జవాబు.
విద్యార్థి కృత్యము.
VI. ప్రశంస:
ప్రశ్న 8.
మీ కుటుంబంలో నీకు అత్యంత ఇష్టమైన వారు ఎవరు? వారి గురించి రాయండి?
జవాబు.
మా కుటుంబంలో నాకు అత్యంత ఇష్టమైన వారు మా అమ్మ మరియు నాన్న. మా , అమ్మ. మాకు కావలసిన, ఇష్టమైన ఆహారాన్ని వండి పెడుతుంది. మా అమ్మ మాకు చదువులో సహాయం చేస్తుంది. మా నాన్న మాకు కావలసిన పుస్తకాలు, బట్టలు ఇంట్లోకి కావలసిన వస్తువులను కొంటారు.
మనం చేద్దాం: (TextBook Page No.3)
జతపరచండి.
జవాబు.
1. ఈ
2. అ
3. ఇ
4. ఆ
కృత్యం 1: (TextBook Page No.4)
మీ కుటుంబ సభ్యుల పేరు రాసి, వారితో మీ వంశ వృక్షాన్ని తయారు చేయండి.
జవాబు.
విద్యార్థ కృత్యము.
బృంద కృత్యం: (TextBook Page No.9)
మీ స్నేహితులలో చర్చించి వారు ఏ రకమైన కుటుంబానికి చెందిన వారో రాయండి.
జవాబు.
క్రమ సంఖ్య | స్నేహితుని పేరు | ఏ రకమైన కుటుంబం |
1. | రాజు | ఉమ్మడి కుటుంబం |
2. | దుర్గ | తల్లి పై ఆధారపడిన కుటుంబం |
3. | రవి | ఏక సంరక్షణ కుటుంబం |
4. | రమ్య | చిన్న కుటుంబం |
ఆలోచించండి చర్చించండి: (TextBook Page No.10)
ప్రశ్న 1.
ప్రజలు ఈ ఉపకరణాలను ఎందుకు ఉపయోగిస్తున్నారు?
జవాబు.
ప్రజలు తమ పనులను తేలికగాను, వేగవంతంగాను చేసుకోవడానికి వివిధ రకాల ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు…
ప్రశ్న 2.
ఈ ఉపకరణాలు లేని కాలంలో ప్రజలు వివిధ పనులను ఎలా చేసుకొని ఉంటారు?
జవాబు.
ఈ ఉపకరణాలు లేని కాలంలో ప్రజలు వివిధ పనులను తమ స్వహస్తాలతోనే చేసుకునేవారు.
అదనపు ప్రశ్నలు:
ప్రశ్న 1.
చిన్న కుటుంబం అంటే ఏమిటి?
జవాబు.
తల్లి, తండ్రి, పిల్లలతో ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారు.
ప్రశ్న 2.
ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటి?
జవాబు.
తాతయ్య, నాయనమ్మ, తల్లిదండ్రులు, పెద్దనాన్నలు, అత్తలు, పిల్లలు ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు.
ప్రశ్న 3.
నాయనమ్మ తాతయ్యల కుటుంబం అని దేనిని అంటారు?
జవాబు.
పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయి వాళ్ళ నాయనమ్మ, తాతయ్యలతో నివసిస్తుంటే ఆ కుటుంబాలను నాయనమ్మ, తాతయ్యల కుటుంబం అంటారు.
ప్రశ్న 4.
మీ తాతగారిని అడిగి వారి కాలంలో ప్రజలు ఏ విధంగా నిద్రించేవారో కనుక్కోండి. అప్పటికి ఇప్పటికి ఏ తేడాలను గమనించారో రాయండి?
జవాబు.
ఆ రోజుల్లో ప్రజలు వరండాలలో, వసారాలలో నిద్రించేవారు. తాటాకులు, వెదురుతో చేసిన విసన కర్రలనుండి వచ్చే గాలిని ఆస్వాదించేవారు.
ప్రస్తుత రోజుల్లో ప్రజలు ఇంటిలోపలే నిద్రిస్తున్నారు. సిలింగ్ ఫ్యాను, ఎయిర్ కూలర్లను ఉపయోగిస్తున్నారు.
ప్రశ్న 5.
ఏక సంరక్షణ కుటుంబం అంటే ఏమిటి?
జవాబు.
కుటుంబంలో తండ్రి మరణించి, ఆ కుటుంబ సంరక్షణ బాధ్యతను తల్లి చూస్తు ఉంటే ఆ కుటుంబాన్ని ఏక సంరక్షణ కుటుంబం అంటారు.
ప్రశ్న 6.
అమ్మమ్మ, నాయనమ్మ అని ఎవరిని పిలుస్తారు?
జవాబు.
తల్లి యొక్క తల్లిని అమ్మమ్మ అని తండ్రి యొక్క తల్లిని నాయనమ్మ అని పిలుస్తారు.
ప్రశ్న 7.
సమాజంలో ఉండే రెండు రకాల కుటుంబాలు ఏవి?
జవాబు.
సమాజంలో ఉండే రెండు రకాల కుటుంబాలు:
- ఉమ్మడి కుటుంబం
- చిన్న కుటుంబం.
ప్రశ్న 8.
మీ ఇంటిలో విద్యుత్ తో పనిచేసే గృహోపకరణాలను కొన్నింటిని రాయండి?
జవాబు.
- ఫ్రిడ్జ్
- వాషింగ్ మెషిన్
- టివి
- మిక్సి
- మొబైల్ ఫోన్
- ఫ్యాన్.
ప్రశ్న 9.
అంగవైకల్యంతో బాధపడుతున్న ఒక స్నేహితుడు మీకు ఉంటే అతనికి, మీరు ఎలా సహాయంచేస్తారు?
జవాబు.
- అతనికి హోంవర్క్ చేయడంలో సహాయం చేస్తారు.
- భోజనం చేసే సమయంలో సహాయం చేస్తాను.
- అతని పుస్తకాల సంచిని తరగతి గదికి తీసుకు వస్తాను.
- ఆటలు ఆడేటపుడు అతనితో ఉంటాను.
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
మన బంధువులు కూడా మన కుటుంబలో భాగమే వారిని __________ కుటుంబం అంటారు.
A) ఉమ్మడి
B) విస్తరించిన
C) చిన్న
D) ఏక సంరక్షణ
జవాబు.
B) విస్తరించిన
ప్రశ్న 2.
తల్లి, తండ్రి పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని __________ కుటుంబం అంటారు.
A) చిన్న
B) ఉమ్మడి
C) ఏక సంరక్షణ
D)తల్లి పై ఆధారపడ్డ
జవాబు.
A) చిన్న
ప్రశ్న 3.
కుటుంబ నిర్మాణంలో కలిగే మార్పుకు కారణం
A) వివాహం
B) ఉద్యోగంలో బదిలీ
C) శిశు జననం
D) పైవన్నీ
జవాబు.
D) పైవన్నీ
ప్రశ్న 4.
రవి వాళ్ళ నాన్నా గారు అనారోగ్య కారణం వల్ల వారి తల్లి మాత్రమే కుటుంబ సంరక్షణ బాధ్యతను చూస్తుంది వారిది __________ కుటుంబం.
A) చిన్న
B) ఉమ్మడి
C) తల్లి పై ఆధారపడిన
D) ఏక సంరక్షణ
జవాబు.
C) తల్లి పై ఆధారపడిన
ప్రశ్న 5.
తండ్రి అక్కను __________ గా పిలుస్తారు.
A) పద్దమ్మ
B) నాయనమ్మ
C) అమ్మమ్మ
D) అత్తయ్య
జవాబు.
D) అత్తయ్య
ప్రశ్న 6.
పెద్దనాన్న అని ఎవరిని సంబోదిస్తారు __________
A) నాన్న తండ్రిని
B) అమ్మ తండ్రిని
C) నాన్న అన్నను
D) అమ్మ అన్నను
జవాబు.
C) నాన్న అన్నను