Andhra Pradesh AP Board 5th Class EVS Solutions 4th Lesson అవయవ వ్యవస్థలు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class EVS Solutions Lesson 4 అవయవ వ్యవస్థలు
I. విషయావగాహన:
ప్రశ్న 1.
రక్త ప్రసరణ వ్యవస్థలో భాగాలను తెలుపండి.
జవాబు:
- గుండె
- రక్తం
- రక్తనాళాలు కలిపి రక్త ప్రసరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి.
గుండె రక్తాన్ని రక్త నాళాల ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు పంపు చేస్తుంది. శరీర భాగాల నుంచి రక్తాన్ని స్వీకరిస్తుంది.
ప్రశ్న 2.
మన శరీరంలో కదలికకు శరీరంలోని ఏ వ్యవస్థ కారణం అవుతుంది ?
జవాబు:
అస్థి పంజర వ్యవస్థ కండరాలు కలిపి శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తాయి. అవి శరీరంలోని అవయవాల కదలికకు తోడ్పడతాయి.
ప్రశ్న 3.
ఉఛ్వాస, నిశ్వాసాలు అంటే ఏమిటి ?
జవాబు:
ఉఛ్వాసం : శ్వాసక్రియలో భాగంగా గాలి లోపలికి పీల్చడాన్ని “ఉఛ్వాసం” అంటారు.
నిశ్వాసం : శ్వాసక్రియలో భాగంగా గాలి బయటకు వదలడాన్ని ‘నిశ్వాసం’ అంటారు. ఒక ఉఛ్వాసం, నిశ్వాసం కలిస్తే ఒక పూర్తి శ్వాస ఔతుంది.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
నీకు ఒక డాక్టరును (హృద్రోగ నిపుణుడు) కలుసుకునే అవకాశం వస్తే గుండె గురించి తెలుసుకోవడానికి ఎటువంటి ప్రశ్నలు అడుగుతుంటావు?
జవాబు:
- “కార్డియాలజీ” అనగా ఏమిటి ?
- గుండె శరీరంలో ఎక్కడ ఉంటుంది?
- గుండె ఎలా పని చేస్తుంది?
- గుండెకు రక్షణ ఎలా ఉంటుంది?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
మీ చేతులను మీ గుండెపై ఉంచి హృదయ స్పందన వినండి. కాసేపు పరిగెత్తండి. అప్పుడు మళ్ళీ హృదయ స్పందన వినండి. మీరు మీ హృదయ స్పందనలో ఏదైనా తేడా గమనించారా? తేడాలు రాయండి. వాటికి కారణాలు చెప్పండి.
జవాబు:
నా గుండె పై చేయి ఉంచి హృదయ స్పందన అనగా సాధారణ పరిస్థితుల్లో నిమిషానికి 60-100 సార్లు గుండె కొట్టుకోవడం గమనించాను. కొంత సేపు పరిగెట్టిన తర్వాత పరిశీలిస్తే గెండె చప్పుడు సాధారణం కంటే ఎక్కువగా పెరిగినట్లు గమనించండి.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
మీ దగ్గరలోని డాక్టరును గానీ, నర్పును గానీ సంప్రదించి శరీరంలో ముఖ్య భాగాల విధులు తెలుసుకోండి. ఒక సంక్షిప్త నివేదిక తయారు చేయండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
క్రింది వాటి బొమ్మలు గీసి, భాగాలు గుర్తించి మీ తరగతి గదిలో ప్రదర్శించండి.
1) జీర్ణ వ్యవస్థ
2) మూత్ర పిండాలు
జవాబు:
విద్యార్థి కృత్యము.
VI. ప్రశంస:
ప్రశ్న 8.
మీ శరీరంలో మిమ్మల్ని ఆశ్చర్య పరిచే శరీర భాగాలు ఏమిటి? వాటి గురించి రాయండి.
జవాబు:
మానవ శరీరం ఒక అద్భుతమైన యంత్రం. మనల్ని ఆరోగ్యంగా ఉంచటానికి మన శరీరంలోని అన్ని భాగాలు సమన్వయంతో పని చేస్తాయి. జీర్ణవ్యవస్థ ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడును.
శ్వాస వ్యసస్థ మనకు ఆక్సిజన్‌ను అందిస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థ ఆక్సిజన్, పోషకాలను అన్ని శరీర భాగాలకు సరఫరా చేయడంలో తోడ్పడుతుంది. విసర్జక వ్యవస్థ శరీరంలో అధికమైన నీటిని, రక్తంలోని మలినాలను శరీరం నుండి వసర్జిస్తుంది. నాడీ వ్యవస్థ అన్ని వ్యవస్థలూ సక్రమంగా పని చేసేలా చూస్తుంది.
అదనపు ప్రశ్నలు:
ప్రశ్న 1.
మన శరీరంలో పనిచేసే వేర్వేరు వ్యవస్థలు వాటి భాగాలు, వాటి విధులను టేబుల్ రూపంలో వ్రాయండి.
జవాబు:
II. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టుల పని:
ప్రశ్న 2.
మూడు బుడగలు, ఒక ప్లాస్టిక్ సీసా, సీసామూత ఉపయోగించి కింది చిత్రంలో చూపిన విధంగా ఊపిరితిత్తుల నమూనా తయారు చేయండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
III. ప్రయోగాలు – నమునాల తయారీ పట్టికను నింపండి:
ప్రశ్న 3.
మన శరీరంలో పనిచేసే వేర్వేరు వ్యవస్థలు వాటి భాగాలు, వాటి విధులను టేబుల్ రూపంలో వ్రాయండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
బహుళైచ్ఛిక ప్రశ్నలు సూచన :
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
మన శరీరంలో ఉండే భాగాలను ………….. అంటారు.
(A) అంతరావయవాలు
(B) బాహ్యావయవాలు
(C) భాగాలు
(D) ఏదీకాదు
జవాబు:
(A) అంతరావయవాలు
ప్రశ్న 2.
అంతరావయవాలను కాపాడే వ్యవస్థ ………….
(A) శ్వాస వ్యవస్థ
(B) అస్థిపంజర వ్యవస్థ
(C) నాడీ వ్యవస్థ
D) ఏదీకాదు
జవాబు:
(B) అస్థిపంజర వ్యవస్థ
ప్రశ్న 3.
…………. శరీరాన్ని నిటారుగా ఉండేటట్లు చేస్తుంది.
(A) కపాలం
(B) ఉర:పంజరం
(C) వెన్నెముక
(D) ఏదీకాదు
జవాబు:
(C) వెన్నెముక
ప్రశ్న 4.
మన శరీరంలో …………. ఎముకలు ఉంటాయి. .
(A) 200
(B) 204
(C) 208
(D) 206
జవాబు:
(D) 206
ప్రశ్న 5.
…………. ఎముకలకు అతికి ఉంటాయి.
(A) నాళాలు
(B) కండరాలు
(C) ధమనులు
(D) గుండె
జవాబు:
(B) కండరాలు
ప్రశ్న 6.
…………. వ్యవస్థ శరీరానికి ఆధారాన్నిస్తుంది.
(A) నాడీ
(B) అస్థిపంజర
(C) శ్వాస
(D) రక్తప్రసరణ
జవాబు:
(B) అస్థిపంజర
ప్రశ్న 7.
బాహ్యచెవి / ముక్కు …………. తో నిర్మితమై ఉంటాయి.
(A) ఎముక
(B) మృదులాస్థి
(C) ప్రక్కటెముక
(D) ఏదీకాదు
జవాబు:
(B) మృదులాస్థి
ప్రశ్న 8.
సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా మారడాన్ని ………….అంటారు.
(A) జీర్ణక్రియ
(B) నమలడం
(C) మింగటం
(D) ఏదీకాదు
జవాబు:
(A) జీర్ణక్రియ
ప్రశ్న 9.
చిన్న ప్రేగు పొడవు ………….
(A) 4 మీ.
(B) 8 మీ.
(C) 6 మీ.
(D) 10 మీ.
జవాబు:
(C) 6 మీ.
ప్రశ్న 10.
గుండె చప్పుడు …………. తో కొలుస్తారు.
(A) స్టెతస్కోప్
(B) స్పిగ్మో మానోమీటర్
(C) ధర్మామీటర్
(D) ఏదీకాదు
జవాబు:
(A) స్టెతస్కోప్
ప్రశ్న 11.
శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే భాగం ………….
(A) రక్తనాళాలు
(B) సిరలు
(C) ధమనులు
(D) గుండె
జవాబు:
(D) గుండె
ప్రశ్న 12.
గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు చేర్చేవి ………….
(A) ధమనులు
(B) సిరలు
(C) A మరియు B
(D) ఏదీకాదు
జవాబు:
(A) ధమనులు
ప్రశ్న 13.
గుండెకు చేడు రక్తాన్ని చేర్చేవి
(A) ధమనులు
(B) సిరలు
(C) A మరియు B
(D) ఏదీకాదు
జవాబు:
(B) సిరలు
ప్రశ్న 14.
ఆక్సిజన్ మరియు పోషకాలను …………. శరీర భాగాలకు సరఫరా చేస్తుంది.
(A) గుండె
(B) ఊరిపితిత్తులు
(C) రక్తం
(D) ధమనులు
జవాబు:
(C) రక్తం
ప్రశ్న 15.
…………. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
(A) గుండె
(B) ఊరిపితిత్తులు
(C) ధమనులు
(D) రక్తం
జవాబు:
(D) రక్తం
ప్రశ్న 16.
రక్తం ఎర్రగా ఉండుటకు కారణం ………….
(A) హి మోగ్లోబిన్
(B) గ్లూకోస్
(C) ఆక్సిజన్
(D) ఏదీకాదు
జవాబు:
(A) హి మోగ్లోబిన్
ప్రశ్న 17.
మన శరీరంలోని అధికమైన, అనవసరమైన పదార్థాలను బయటకు పంపించే వ్యవస్థను …………… అంటారు .
(A) నాడీ వ్యవస్థ
(B) విసర్జక వ్యవస్థ
(C) శ్వాసవ్యవస్థ
(D) రక్తప్రసరణ వ్యవస్థ
జవాబు:
(B) విసర్జక వ్యవస్థ
ప్రశ్న 18.
చిక్కుడు గింజ ఆకారం కల్గిన శరీరభాగం …………
(A) ఊపిరితిత్తులు
B) కిడ్నీలు
C) గుండె
D) ముక్కు
జవాబు:
B) కిడ్నీలు
ప్రశ్న 19.
………….. రక్తాన్ని వడగట్టి రక్తంలోని మలినాలను తొలగిస్తాయి.
(A) కిడ్నీలు
(B) ఊపిరితిత్తులు
(C) గుండె
(D) రక్తనాళాలు
జవాబు:
(A) కిడ్నీలు
ప్రశ్న 20.
………… స్పాంజి నిర్మాణం కల్గి ఉండి ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్-డై-ఆక్సైడ్ ను విడుదల చేస్తుంది.
(A) గుండె
(B) కిడ్నీ
(C) ఊపిరితిత్తులు
(D) చర్మం
జవాబు:
(C) ఊపిరితిత్తులు
ప్రశ్న 21.
శరీరంలో …………… పైకి కనిపించే అతి పెద్ద అవయవం.
(A) ఊపిరితిత్తులు
(B) గుండె
(C) కిడ్నీలు
(D) చర్మం
జవాబు:
(D) చర్మం
ప్రశ్న 22.
………….. శరీరంలో అదనపు నీటిని, లవణాలను విసర్జిస్తుంది.
(A) ఊపిరితిత్తులు
(B) చర్మం
(C) గుండె
(D) ఏదీకాదు
జవాబు:
(B) చర్మం
ప్రశ్న 23.
………….. వ్యవస్థ శరీరం మరియు జ్ఞానేంద్రియాలను శాసిస్తుంది
(A) విసర్జక వ్యవస్థ
(B) నాడీ వ్యవస్థ
(C) శ్వాస వ్యవస్థ
(D) ఏదీకాదు
జవాబు:
(B) నాడీ వ్యవస్థ
ప్రశ్న 24.
అవయవాలు ………….. ద్వారా మెదడుతో అనుసంధానమై ఉంటాయి.
(A) ధమనులు
(B) సిరలు
(C) నాడులు
(D) ఏదీకాదు
జవాబు:
(C) నాడులు
ప్రశ్న 25.
క్రింది శరీర భాగాలను, వాటి పనులతో జతపరచండి.
జవాబు:
1. B
2. D
3. E
4. C
5. A