Andhra Pradesh AP Board 4th Class EVS Solutions 5th Lesson మనం తినే ఆహారం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class EVS Solutions Lesson 5 మనం తినే ఆహారం
I. విషయావగాహన:
ప్రశ్న 1.
ప్రజలందరూ కలిసి కూర్చుని ఆహారం తీసుకునే సందర్భాలను రాయండి.
జవాబు.
ఈ సందర్భాలలో ప్రజలు అందరూ కలిసి కూర్చుని ఆహారం తీసుకుంటారు.
- వివాహాలు
- విహార యాత్రలు
- శుభకార్యాలు
- మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు
- అన్నదాన కార్యక్రమాలు
ప్రశ్న 2.
మన ఇంటిలో ఆహారం ఎప్పుడెప్పుడు వృధా అవుతుంది?
జవాబు.
- అవసరానికి మించి ఆహారం వండినపుడు
- ఆహారంలో తినే సమయంలో పళ్ళెం చుట్టూ ఆహారం చిమ్మడం వల్ల
- పళ్ళెంలో కొంత ఆహారాన్ని వదిలివేయడం వల్ల
- కొంతమంది తమ పిల్లలు తినే ఆహారం కన్నా ఎక్కువ వడ్డించడం వల్ల.
ప్రశ్న 3.
మనం తీసుకునే ఆహారం వెనుక ఎంతోమంది ప్రజల శ్రమ ఉంది కదా. వారెవరో రాయండి.
జవాబు.
- రైతులు
- రైతు కూలీలు
- కంసాలి
- వడ్రంగి
- మిల్లర్లు
- ధాన్యం అమ్మేవాళ్ళు
- వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలైనవారు.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
ఎలుకలు, కీటకాల నుండి ఆహార ధాన్యాలను ఎలా వారు సురక్షితంగా ఉంచుకుంటున్నారో తెలుసుకోవడానికి రైతును ఏమేమి ప్రశ్నలు అడుగుతారు ?
జవాబు.
- నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలను ఎలుకల నుండి కాపాడటానికి మీరు ఏమి చేస్తారు?
- కీటకాల నుండి ఆహార ధాన్యాలను కాపాడటానికి ఏమి చేస్తారు?
- ఆహార ధాన్యాలను సురక్షితంగా నిల్వ చేయడానికి మీరు ఏ పద్ధతులను పాటిస్తారు?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
మధ్యాహ్న భోజన సమయంలో వారం మెనూను పరిశీలించి, ఏయే కూరగాయలను ఉపయోగించారో రాయండి.
జవాబు.
ఈరోజు (బుధవారం) మధ్యాహ్న భోజన సమయంలో (1) క్యారెట్ ‘(2) బీన్స్ (3) బంగాళాదుంప (4) కాప్సికం (5) పచ్చిమిరప కాయలు ఉపయోగించారు.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
దీర్ఘకాలం పాటు నిల్వ చేయగలిగిన మీ ఇంటిలో ఆహార పదార్థాల జాబితాను రాయండి.
జవాబు.
క్రమ. సంఖ్య | ఆహార పదార్ధం పేరు | నిల్వచేసే విధానం |
1. | కూరగాయలు, మాంసం, చేపలు | ఫ్రీజింగ్ తాజా పండ్లు |
2. | చక్కెర పాకం లేదా జామ్ రూపంలో | ఉప్పు |
3. | ఒరుగులు లేదా వడియాలు | ఎండబెట్టి |
4. | పచ్చళ్ళు | నూనె కలిపి |
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
శాఖహారం – మాంసాహారం ఆరోగ్యకరమైన – జంక్ ఆహారాన్ని సూచిస్తున్న చెట్టు బొమ్మ తయారు చేయండి.
జవాబు.
VI. ప్రశంస:
ప్రశ్న 8.
కావ్య కొన్ని గింజలు తెచ్చి ప్రతిరోజూ పక్షులకు వేస్తోంది. ఆమెను నీవు ఎలా అభినందిస్తావు?
జవాబు.
- కావ్య చేసే పని చాలా మంచి పని.
- పక్షులకు రోజూ గింజలు వేయడం వల్ల వాటి ఆకలిని తీర్చుతుంది.
- చాలా పక్షులు ఆహారం దొరకక చనిపోతున్నాయి.
- మనం కూడా ప్రతిరోజు పక్షులకు, మూగ జీవాలకు ఆహారాన్ని అందించి వాటిని కాపాడాలి.
కృత్యం: (TextBook page No.41)
గత కొద్ది రోజుల నుండి మీ బడిలో మధ్యాహ్న భోజనంలో ఇవ్వబడిన ఆహార పదార్థాల జాబితా రాయండి.
జవాబు.
రోజు | వడ్డించిన ఆహార పదార్థాలు |
సోమవారం | అన్నం, గుడ్డు కూర, చిక్కి |
మంగళ వారం | పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు |
బుధ వారం | కూరగాయల అన్నం, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి |
గురువారం | కిచిడి, టమాట చట్ని, ఉడికించిన గుడ్డు |
శుక్ర వారం | అన్నం, ఉడికించిన గుడ్డు, చిక్కి |
శని వారం | అన్నం, సాంబార్, తీపి పొంగళి |
కృత్యం: (TextBook page No.43)
వాడేసిన వాటర్ బాటిల్ లో పెన్ను స్టాండ్ ని తయారు చేసే విధానాన్ని రాయండి.
జవాబు.
- ఒక ఖాళీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను తీసుకోవాలి.
- దానిని అడ్డంగా మధ్యలోకి కట్ చేయాలి.
- దానికి రంగు కాగితం అతికించాలి. లేదా రంగులు వేయాలి.
- మీ పెన్ స్టాండ్ తయారయింది.
కృత్యం: (TextBook page No.43)
వాడేసిన ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిల్ లో పూలకుండీ తయారు చేసే విధానాన్ని రాయండి.
జవాబు.
- ఒక ఖాళీ ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిల్ ను తీసుకోవాలి.
- దానిని అడ్డంగా మధ్యలోకి కట్ చేయాలి.
- దానికి రంగు కాగితం అతికించండి. లేదా రంగులు వేయాలి.
- అందులో నీరు పోసి, మనీ ప్లాంట్ ఉంచాలి.
- మీ పూలకుండీ సిద్ధ అవుతుంది.
అదనపు ప్రశ్నలు:
ప్రశ్న 1.
మనం ఆహారం ఎందుకు తీసుకుంటాము ?
జవాబు.
- ఆహారం మనకు పని చేయడానికి శక్తిని ఇస్తుంది.
- ఆహారం తీసుకోకపోతే మనం జబ్బున పడతాం.
- కాబట్టి సరైన సమయానికి భోజనం తినడం అత్యవసరం.
ప్రశ్న 2.
కొందరు పిల్లలు సాంబారులోని కూరగాయ ముక్కలను, కరివేపాకును తినకుండా వదిలివేస్తారు. అది సరి అయిన పనేనా? ఎందుకని?
జవాబు.
కాయగూరలు, కరివేపాకులలో పోషక విలువలు ఉంటాయి. వాటిని తినకుండా వదిలేస్తే అన్ని పోషక విలువలు మనకు అందవు.
ప్రశ్న 3.
పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మిగిలిన ఆహారంతో మీరేం చేస్తారు?
జవాబు.
- పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మిగిలిన ఆహారాన్ని అవసరం అయిన వారికి అందిస్తాము.
- కొన్ని సార్లు ఆ ఆహారాన్ని ఆవులకు, గేదెలకు పెడతాము.
- కొన్ని ఆహార పదార్థాలను ఎరువుగా మార్చి మొక్కలకు, చెట్లకు ఎరువుగా వేస్తాము,
ప్రశ్న 4.
ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నస్టాలేమిటి? (లేదా) ఆహారాన్ని ప్లాస్టిక్ కవర్లలో నిల్వ ఉంచితే ఏమి జరుగుతుంది?
జవాబు.
- ఆహారాన్ని ప్లాస్టిక్ కవర్లలో నిల్వ ఉంచితే, ప్లాస్టిక్ రేణువులు ఆహార పదార్థాలలోకి చేరి, అవి ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి వ్యాధులను కలుగజేస్తాయి.
- ఒకవేళ వీటిలోని ఆహారాన్ని నేలపై పారవేస్తే అవి నేలను కలుషితం చేస్తాయి.
- ప్లాస్టిక్ కవర్లలోని ఆహారాన్ని కవర్లతో సహా ఆవులు, గేదెలు తిన్నట్లయితే అవి అనారోగ్యానికి గురవుతాయి.
- ఒక వేళ ప్లాస్టిక్ ను. మండిస్తే గాలి కలుషితమవుతుంది.
ప్రశ్న 5.
పచ్చళ్ళు పాడవకుండా ఎక్కువ కాలం పాటు వాటిని మనం ఎలా’ నిల్వ చేయగలం?
జవాబు.
- పచ్చళ్ళు, చట్నీలు, జామ్లు , వడియాలు మొదలైనవి. సాధారణంగా నిల్వ చేసే పదార్థాలు.
- పచ్చళ్ళు బూజు పట్టకుండా, బ్యాక్టీరియాను నిరోధించడానికి నూనెను, ఉప్పును నిలువ చేసే కారకంగా వాడతారు.
ప్రశ్న 6.
ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు, నిలువ చేసే పద్ధతులను రాయండి.
జవాబు.
- తాజా పండ్లను చక్కెర పాకంలో నిలవ ఉంచవచ్చు. లేదా జిమ్ గా తయారు చేసి నిలవ ఉంచవచ్చు.
- కొన్ని కూరగాయలు, మాంసం, చేపలను అధిక చల్లదనం కలిగి ఉన్న పెట్టెలో నిల్వ ఉంచుతారు. ఈ పద్ధతిని ఫ్రీజింగ్ అంటారు.
- పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పచ్చళ్ళుగా చేసి ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. పాలు కూడా ఎక్కువ కాలం నిలవ చేయవచ్చు.
ప్రశ్న 7.
నీవు కందిపొడిని ఎలా తయారు చేస్తావు?
జవాబు.
- కొంచెం కందిపప్పును తీసుకొని, వాటిని సన్నని మంట మీద వేయించాలి.
- కొన్ని ఎండు మిరపకాయలు, జీలకర్రను తీసుకొని వాటిని కూడా సన్నని మంట మీద వేయించాలి.
- పై విధంగా వేయించిన వాటిని ఒక మిక్సిజార్ లో తీసుకొని వాటికి కొంచెం ఉప్పు కలిపి వాటని పొడిగా పట్టాలి.
- మనకు కందిపొడి తయారువుతుంది.
ప్రశ్న 8.
నిల్వ చేసిన ఆహార ధాన్యాలు పాడవకుండా ఎలా కాపాడవచ్చు?
జవాబు.
- నిల్వ చేసిన ఆహార ధాన్యాలు పాడవకుండా ఉండడం కోసం వేపాకులను ఎండబెట్టి నిలవ ఉంచే సంచులలో ఉంచుతారు.
- మార్పిడి చేసిన ధాన్యాన్ని బాగా ఎండబెట్టి సురక్షిత ప్రదేశాలలో ఉంచి నిలవ చేస్తారు.
- స్టీల్, టిన్, అల్యూమినియం పాత్రలో, వెదురుతో చేసిన పెద్ద పెద్ద బుట్టలలో నిలవ ఉంచడం ద్వారా ఎలుకలు, చుంచులు, కీటకాల నుండి కాపాడవచ్చు.
ప్రశ్న 9.
మనం తింటున్న ఆహారం వెనుక ఉన్న వివిధ వ్యక్తులు వారి పనులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి పట్టిక రూపంలో రాయండి.
జవాబు.
మనం తింటున్న ఆహారం వెనుక వివిధ వ్యక్తుల పని ఇమిడి ఉంది.
ప్రశ్న 10.
రైతులు ఆహార ధాన్యాలను ఎలుకలు, చుంచులు కీటకాల నుండి కాపాడటాన్ని ఏమి చేస్తారు?
జవాబు.
రైతులు ఆహార ధాన్యాలను టిన్, స్టీల్, అల్యూమినియం పాత్రలో లేదా వెదురుతో చేసిన పెద్ద పెద్ద బుట్టలో నిల్వ ఉంచడం ద్వారా ఎలుకలు, చుంచులు, కీటకాల నుండి కాపాడగలుగుతారు.
బహుళైచ్ఛిక ప్రశ్నలు సూచన:
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
క్రింది వానిలో నిలవ చేసే కారకం ___________
A) ఉప్పు
B) కారం
C) నీరు
D) పైవన్నీ
జవాబు.
A) ఉప్పు
ప్రశ్న 2.
పచ్చళ్ళు బూజు పట్టకుండా, బ్యాక్టీరియా నిరోధకంగా ___________ ను వాడతారు.
A) ఉప్పు
B) నూనె
C) నీరు
D) పైవన్నీ
జవాబు.
B) నూనె
ప్రశ్న 3.
ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వాడే పద్ధతి ___________
A) ఫ్రీజింగ్
B) జామ్ తయారీ
C) పచ్చళ్ళ తయారీ
D) పైవన్నీ
జవాబు.
D) పైవన్నీ
ప్రశ్న 4.
ఆహార ధాన్యాలు, వేరుశనగ వంటి నూనె గింజలు కీటకాలు, బూజుల చేత పాడవకుండా ___________ లను నిల్వ ఉంచే సంచులలో ఉంచుతారు …
A) కూరగాయలను
B) నీరు
C) ఎండబెట్టి వేపాకులు
D) పైవేవి కావు
జవాబు.
C) ఎండబెట్టి వేపాకులు
ప్రశ్న 5.
మధ్యాహ్న భోజనం అనేది పిల్లల ___________
A) అవసరం
B) అనవసరం
C) హక్కు
D) అలవాటు
జవాబు.
C) హక్కు
ప్రశ్న 6.
మాంసము, చేపలను ___________ లలో ఉంచడం ద్వారా కొన్ని రోజులు నిల్వ చేయవచ్చు.
A) నీటి
B) ఫ్రీజర్
C) ఆరు బయట
D) పైవన్నీ
జవాబు.
B) ఫ్రీజర్
ప్రశ్న 7.
తాజా పండ్లను ___________ రూపంలో నిల్వ చేయవచ్చు.
A) పచ్చళ్ళు
B) ఒరుగుల
C) జామ్
D) పండ్ల రసాల
జవాబు.
C) జామ్
ప్రశ్న 8.
ప్లాస్టిక్ ను మండిస్త ___________ కలుషితం అవుతుంది.
A) నేల
B) గాలి
C) నీరు
D) ఏదీకాదు
జవాబు.
B) గాలి
ప్రశ్న 9.
క్రింది వారిలో నాగలిని తయారు చేసేది ___________
A) కంసాలి
B) వడ్రంగి
C) మిల్లర్లు
D) ధాన్యం అమ్మేవాళ్ళు
జవాబు.
B) వడ్రంగి
ప్రశ్న 10.
కింద పడకుండా ఆహార తినడం _________
A) మంచి అలవాటు
B) చెడు అలవాటు
C) మానుకోవాలి
D) పైవన్నీ
జవాబు.
A) మంచి అలవాటు