AP Board 5th Class EVS Solutions 1st Lesson ప్రజలు – వలసలు

Andhra Pradesh AP Board 5th Class EVS Solutions 1st Lesson ప్రజలు – వలసలు Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 5th Class EVS Solutions Lesson 1 ప్రజలు – వలసలు

I. విషయావగాహన:

ప్రశ్న 1.
వలస అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలివ్వండి?
జవాబు:
వలస :-
ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుంచి మరోక ప్రాంతానికి వెళ్ళడాన్ని ‘వలస’ అంటారు.
ఉదా : 1. ఉద్యోగ బదిలీ కారణంగా జరిగే వలసలు.
2. ఉన్నత చదువుల కోసం జరిగే వలసలు.

ప్రశ్న 2.
వలస వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు రాయండి?
జవాబు:
క్రమ వలసవల్ల ప్రయోజనాలు:

 1. మెరుగైన జీవితం ఏర్పడును.
 2. వృత్తిపరమైన, కొత్త అనుభవాలు తెలుసుకోగలం.
 3. కొత్త సంస్కృతిని జ్ఞానాన్ని పొందవచ్చు

వలసవల్ల నష్టాలు:

 1. సంస్కృతి, భాషా పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాలి.
 2. సౌకర్యా ల కొరత
 3. పేదరికం.

ప్రశ్న 3.
మన జీవితంలో కొన్ని సార్లు వలస తప్పదు అని రాజు అంటున్నాడు అతని మాటలతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
జవాబు:
నేను రాజు అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే పిల్లలు ఉన్నత చదువులకోసం/ ఉన్నతోద్యాగాల కోసం ఒక ప్రాంతం నుంచి మరోక ప్రాంతానికి వలస వెళ్ళవలసి వస్తుంది. ముఖ్యంగా పెద్ద నగరాలకు లేదా వేరే దేశాలకు పై అవసరాలకోసం వలసవెళ్తారు.

AP Board 5th Class EVS Solutions 1st Lesson కుటుంబాలు - వలసలు

II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:

ప్రశ్న 4.
మీ గ్రామంలో మీకు ఒక వలస కుటుంబం కనిపిస్తే వారి వలసకి కారణాలు తెలుసుకోడానికి నువ్వు వారిని ఏయే ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
నాకు గ్రామంలో వలస కుటుంబం కనిపిస్తే క్రింది విధంగా ప్రశ్నిస్తాను.

 1. ఎందుకు మీరు వలస వచ్చారు?
 2. ఎక్కడి నుంచి వలస వచ్చారు?
 3. మీరు వలస వచ్చుటకు కారణాలేంటి?
 4. మీకు ఇక్కడ సౌకర్యంగా ఉందా?

III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:

ప్రశ్న 5.
మీ గ్రామంలో వలస కుటుంబాలను పరిశీలించండి, కోవిడ్ – 19 తో వారి అనుభవాలను పరిశీలించండి?
జవాబు:
కోవిడ్ -19 కారణంగా మా గ్రామానికి హైదరాబాదు నుంచి ఒక కుటుంబం వలసవచ్చింది. వారు అక్కడ కోవిడ్ – 19 కారణంగా జీవనోపాధిని కోల్పవటం వల్ల తిండిగడవటం కూడా కష్టమై సొంత గ్రామాలకు వ్యవసాయ పనులు చేసుకునేందుకు వచ్చారు.

ప్రశ్న 6.
మీ పరిసరాలలో పిల్లలు బడిమాని వేయటానికి గల కారణాలు రాయండి?

AP Board 5th Class EVS Solutions 1st Lesson ప్రజలు - వలసలు 3

జవాబు:
విధ్యార్థి కృత్యము.

AP Board 5th Class EVS Solutions 1st Lesson కుటుంబాలు - వలసలు

V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:

ప్రశ్న 7.
వలప కారణాలను చూపించి ఊహా చిత్రన్ని గీయండి?
జవాబు:

AP Board 5th Class EVS Solutions 1st Lesson ప్రజలు - వలసలు 4

VI. ప్రశంస:

ప్రశ్న 8.
సురేష్ బడి మాని వేశాడు, ఇప్పుడు అతను తన తండ్రితో పాటు పనికి వెళుతున్నాడు. తిరిగి బడిలో చేరటానికి నువ్వు ఏ విధంగా సురేష్ ని ప్రోత్సహిస్తావు?
జవాబు:
నేను సురేష్ ను పనికి కాకుండా బడికి వెళ్ళే విధంగా ఒప్పించే ప్రయత్నం చేస్తాను. అతనికి ప్రస్తుతం బడి పిల్లలకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి క్రింది విధంగా చెప్పి అవగాహన కల్పిస్తాను.

కొత్త రాష్ట్ర ప్రభుత్వ పధకం ” జగనన్న అమ్మ ఒడి” ద్వారా ప్రభుత్యం దిగువ తరగతి ( BPL) ప్రతివిద్యార్థి తల్లికి సంవత్సరానికి రు:15,000/- జమ చేస్తుంది. ఇది 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వర్తిస్తుంది. ఇక మధ్యహ్న భోజనం, ఉచిత యూనిఫారం, ఉచిత పాఠ్యపుస్తకాలు వంటి సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తుంది.

నెలవారీ కంటి పరీక్షలు నిర్వహిస్తుంది. రక్తహీనతను తగ్గించే ఐరన్, ఫోలిక్ మాత్రలు కూడా అందిస్తున్నారు. పై చదువుల కోసం ఉపకారవేతనాలు, విద్యారుణాలు కూడా అందిస్తున్నారు. కావున నీవు మళ్ళీ బడిలో చేరి ఈ సౌకర్యాలన్నింటిని ఉపయోగించుకోవాలి.

AP Board 5th Class EVS Solutions 1st Lesson కుటుంబాలు - వలసలు

అదనపు ప్రశ్నలు:

ప్రశ్న 1.
వలసలకు కారణాలేమిటి?
జవాబు:
వలసలకు కారణాలు 2 రకాలు : అవి

 1. సహజ కారణాలు : వరదలు, తుఫానులు, భూకంపాలు
 2. ఆర్ధిక కారణాలు :- ఉద్యోగరీత్యా వలస, పేదరికం వల్ల వలస, ఉన్నత చదువు కొరకు వలస.

ప్రశ్న 2.
“కుటుంబపద్దు” అనగానేమి? దాని వల్ల ఉపయోగాలేంటి?
జవాబు:
ఒక కుటుంబం తన ఆదాయాన్ని ఏఏ అంశాల కోసం (అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు మరియు ఇతరములు) ఖర్చు చేసారో తెలియ చేసే పట్టికనే ” కుటుంబపద్దు” అంటారు. కుటుంబపద్దు వల్ల ఉపయోగాలు: .

 1. డబ్బు ఏవిధంగా ఖర్చు పెట్టాలో తెలియచేస్తుంది.
 2. అనవసర ఖర్చులు తగ్గించుకుని తద్వారా భవిష్యత్ అవసరాలు తీర్చు కోగల్గుతాము.

II. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:

ప్రశ్న 3.
క్రింది పట్టికలో సూచించిన వాటిని (/) మార్క్ తో సూచించండి?

AP Board 5th Class EVS Solutions 1st Lesson ప్రజలు - వలసలు 5

జవాబు:

AP Board 5th Class EVS Solutions 1st Lesson ప్రజలు - వలసలు 6

AP Board 5th Class EVS Solutions 1st Lesson కుటుంబాలు - వలసలు

IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టుల పని:

AP Board 5th Class EVS Solutions 1st Lesson ప్రజలు - వలసలు 3

ప్రశ్న 1.
పై చార్ట్ అనగానేమి?
జవాబు:
” పై చార్ట్ ” అనేది వృత్తాకారంలో గీయబడిన ఒక రేఖా చిత్రం. ఇది అంకెలను భాగాల రూపంలో సూచించటానికి ఉపయోగ పడుతుంది.

ప్రశ్న 2.
పై చిత్రంలో ఎవరు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు?
జవాబు:
రాకేష్ కుటుంబం.

ప్రశ్న 3.
ఏ కుటుంబం ఆదా చేస్తుంది?
జవాబు:
వీరయ్య కుటుంబం.

ప్రశ్న 4.
పై కుటుంబాలో ఎవరు సరైన ఆర్ధిక ప్రణాళికతో ఖర్చు చేస్తున్నారు?.
జవాబు:
వీరయ్య కుటుంబం

ప్రశ్న 5.
ఏ కుటుంబ ఆర్థిక ప్రణాళికను మీరు భవిష్యత్తులో పాటిస్తారు?
జవాబు:
వీరయ్య కుటుంబం.

AP Board 5th Class EVS Solutions 1st Lesson కుటుంబాలు - వలసలు

బహుళైచ్ఛిక ప్రశ్నలు:

సరియైన సమాధానాలను గుర్తించండి:

ప్రశ్న 1.
జీవించుటకు కావలసిన కనీస అవసరాలు ……………………..
(A) అవసరాలు
(B) సౌకర్యాలు
(C) విలాసాలు
(D) ఏదీ కాదు
జవాబు:
(B) సౌకర్యాలు

ప్రశ్న 2.
ఎక్కువ ఖర్చుతో కూడిన, ఎక్కువ సుఖవంత మైన సదుపాయాలు …………………..
(A) అవసరాలు
(B) విలాసాలు
(C) సౌకర్యాలు
(D) ఏదీ కాదు
జవాబు:
(B) విలాసాలు

ప్రశ్న 3.
ప్రభుత్వం గ్రామాలలో వలసలను నివారించుటకు అమలు చేస్తున్న పధకం …………………
(A) గ్రామీణాభివృద్ధి
(B) పట్టణాభివృద్ది
(C) A మరియు B
(D) ఏదీ కాదు
జవాబు:
(A) గ్రామీణాభివృద్ధి

AP Board 5th Class EVS Solutions 1st Lesson కుటుంబాలు - వలసలు

ప్రశ్న 4.
పిల్లలు అలవరచు కోవలసిన మంచి అలవాటు ………………………
(A) పోదుపు
(B) సంపాదన
(C) ఖర్చు
(D) ఏదీ కాదు
జవాబు:
(A) పోదుపు

ప్రశ్న 5.
……………….. పిల్లలహక్కు.
(A) మనబడి
(B) చదువుకోవటం
(C) A మరియు B
(D) ఏదీ కాదు
జవాబు:
(C) A మరియు B

ప్రశ్న 6.
వలసలకు కారణాలు ……………………
(A) సహజ విపత్తులు
(B) పేదరికం
(C) నిరుద్యోగం
(D) పైవన్నీ
జవాబు:
(D) పైవన్నీ

AP Board 5th Class EVS Solutions 1st Lesson కుటుంబాలు - వలసలు

ప్రశ్న 7.
వలసల ఫలితాలు ……………………
(A) తాత్కాలిక నివాసాలు
(B) మురికివాడలు
(C) పేదరికం
(D) పైవన్నీ
జవాబు:
(D) పైవన్నీ

ప్రశ్న 8.
…………………… అనేది కుటుంబం ఆదాయాన్ని, ఖర్చుని తెలియచేయు పట్టిక.
(A) అకౌంట్
(B) పద్దు
(C) కుటుంబ పద్దు
(D) ఏదీ కాదు
జవాబు:
(C) కుటుంబ పద్దు

ప్రశ్న 9.
“మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా ” గా పేరొందినవారు. ……………………
(A) డిఆర్. ఎ.పి.జె.అబ్దుల్ కలాం
(B) నెహ్రు
(C) గాంధీ
(D) ఏదీ కాదు
జవాబు:
(A) డిఆర్. ఎ.పి.జె.అబ్దుల్ కలాం

AP Board 5th Class EVS Solutions 1st Lesson కుటుంబాలు - వలసలు

ప్రశ్న 10.
పొదుపు ద్వారా సేకరించిన ధనం పై పొందు ఆదాయాన్ని …………………… అంటారు.
(A) డబ్బు
(B) వడ్డీ
(C) అప్పు
(D) ఏదీ కాదు
జవాబు:
(B) వడ్డీ