Andhra Pradesh AP Board 4th Class EVS Solutions 9th Lesson సమాచార ప్రసారం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class EVS Solutions Lesson 9 సమాచార ప్రసారం
I. విషయావగాహన:
ప్రశ్న 1.
భావ ప్రసారం అనగా నేమి? భావ ప్రసారం ఎన్ని రకములు?
జవాబు.
- ఇతరులతో తమ భావనలను, అనుభూతులను పంచుకోవడాన్ని భావ ప్రసారం అంటారు.
- భావ ప్రసారం రెండు రకాలు :
- వ్యక్తిగత భావ ప్రసారం
- బహుళ సమాచార ప్రసారం
ప్రశ్న 2.
వేగంగా భావ ప్రసారం సాగించడానికి ఏఏ మార్గాలున్నాయో తెలపండి.
జవాబు.
- మొబైల్ ఫోన్
- ఇ-మెయిలింగ్ వేగంగా భావ ప్రసారం సాగించే మార్గాలు.
ప్రశ్న 3.
బహుళ ప్రసార మాధ్యమం ఉపయోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏవి ?
జవాబు.
- అదే పనిగా T.V. లేదా మొబైల్ ఫోన్ చూడడం కంటి చూపును దెబ్బ తీస్తుంది.
- T.V. ని మన నుండి కనీసం 6 మీటర్లు దూరం నుండి చూడాలి.
- అదే పనిగా ఇయర్ఫో న్స్ సంగీతాన్ని వినడం వినికిడి శక్తిని దెబ్బ తీస్తుంది.
- T.V., రేడియో, మొబైల్ ఫోన్ వాల్యూమ్ ని తగ్గించి వినాలి.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
పోస్టల్ సేవలను గురించి పోస్టు మాస్టర్ ను ఏమేమి ప్రశ్నలు అడుగుతారు.
జవాబు.
- పోస్టాఫీసులో ఏయే సేవలు అందించబడతాయి?
- పోస్టల్ సేవల ద్వారా డబ్బును కూడా పంపవచ్చా?
- పోస్టల్ సేవల ద్వారా సమాచారాన్ని త్వరగా పంపించడానికి ఏమి చేయాలి?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్ళి పోస్టల్ సేవలమ గురించి తెలుసుకొని క్లుప్తంగా రాయండి.
జవాబు.
పోస్టాఫీసులో ఈ క్రింది పేదలు ఉన్నాయి.
- ఉత్తరాలను, మెయిల్ లను పార్సిలను బట్వాడా చేయడం.
- రిజిస్టర్ పోస్ట్ సౌకర్యం
- నగదు బదిలీ సౌకర్యం
- ప్రభుత్వ ఫారాలను డబ్బు కట్టించుకోవడం.
- వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం.
- పోస్టాఫీసులో డబ్బును దాచుకోనే అవకాశం.
- పోస్టల్ జీవిత భీమా మొదలైనవి.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
సెల్ ఫోన్ల ఉపయోగాలు గురించిన సమాచారాన్ని సేకరించి, తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు.
- ఒకరితో ఒకరు వేగంగా సంభాషించడానికి సెల్ ఫోన్ ఉపయోగపడుతుంది.
- అత్యవసర పరిస్థితులో సంక్షిప్త సమాచారాన్ని (SMS) పంపవచ్చు.
- వీడియో కాల్ మరియు కారెన్స్ కాల్స్ ద్వారా సంభాషించవచ్చు.
- ప్రయాణ సమయంలో దిక్చూచిగా ఉపయోగపడుతుంది.
- ఆన్లైన్ బ్యాంకింగ్, టికెట్ బుకింగ్ కొరకు ఉపయోగపడుతుంది.
- కావలసిన జ్ఞానాన్ని వివిధ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
అట్టముక్క లేక మట్టితో సెల్ ఫోన్ మోడల్ ను తయారు చేయండి.
జవాబు.
విద్యార్ధికృత్యము.
VI. ప్రశంస:
ప్రశ్న 8.
మీ ఇంటికి ఏదైనా ఒక వేడుకకు రమ్మని ఆహ్వానిస్తూ నీ స్నేహితునికి ఉత్తరం రాయండి.
జవాబు.
కృత్యము: (TextBook Page No.74)
క్రింది వాక్యములను చదివి, వాటిని ఆధునిక సమాచారం ప్రసార సాధనాల వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలుగా వర్గీకరించి రాయండి.
-
- బద్దకం కలిగించటం
- జ్ఞానమును పెంచటం
- తల్లిదండ్రులతో గడపకపోవటం
- చదువుకు ఉపయోగం
- భావ వ్యక్తీకరణ సామర్ధ్యాన్ని పెంపొందించటం
- తోటి ప్రజలతో సంబంధాలు తగ్గిపోవటం
- పుస్తకాలు చదవకపోవటం
- జ్ఞాపక శక్తి తగ్గటం
- ఇతరులతో మాటలాడకపోవడం
- చదివే గంటలు తగ్గిపోవటం
- అత్యధిక సమాచారాన్ని గ్రహించగలగటం.
జవాబు.
ప్రయోజనాలు | నష్టాలు |
జ్ఞానమును పెంచడం | బద్ధకం కలిగించడం |
చదువుకు ఉపయోగం | చదివే గంటలు తగ్గిపోవడం |
భావ వ్యక్తీకరణ సామార్థ్యాన్ని పెంపొందించడం | తల్లిదండ్రులతో సమయం గడపకపోవడం |
తోటి ప్రజలతో సంబంధాలు తగ్గిపోవడం | |
అత్యధిక, సమాచారాన్ని గ్రహించగలగడం | ఇతరులతో మాట్లాడకపోవడం |
పుస్తకాలు చదవకపోవడం |
అదనపు ప్రశ్నలు:
ప్రశ్న 1.
పిన్ (PIN) కోడ్ అనగా నేమి?
జవాబు.
- దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి పోస్టాఫీసుకు ఒక సంఖ్య ఇవ్వబడుతుంది. దీనినే పిన్కోడ్ అంటారు. (Postal Index Number).
- పిన్కోడ్ సంఖ్య చిరునామాను కలిగి ఉన్న ప్రదేశమును సులభంగా గుర్తించడానికి వీలయ్యేలా చేస్తుంది.
ప్రశ్న 2.
బహుళ సమాచార ప్రసారం అంటే ఏమిటి? బహుళ సమాచార ప్రసారంలో వేటిని ఉపయోగిస్తారు?
జవాబు.
బహుళ సమాచార ప్రసారం అనేది ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించే మాధ్యమం.
వార్తా పత్రికలు, T.V., రేడియో వంటివి బహుళ ప్రసార సాధనాలుగా ఉపయోగపడతాయి.
ప్రశ్న 3.
వివిధ బహుళ సమాచార ప్రసార సాధనాల గురించిన సమాచారాన్ని సేకరించండి.
జవాబు.
వార్తాపత్రికలు :
వార్తలు, వివిద వ్యాసాలు, ప్రకటనలు వంటి అనేక అంశాలు వార్తాపత్రికలో ఉంటాయి.
రేడియో:
వినికిడికి సంబంధించిన పరికరం. వార్తలు, అభిప్రాయాలు ప్రసంగాలు రేడియో ద్వారా వినవచ్చు. తుఫానులు, వరదలు, సమయంలో వాటి గురించిన సమాచారాన్ని గంట గంటకు రేడియో ద్వారా తెలుసుకోవచ్చు.
టెలివిజన్ (T.V) :
వినికిడి మరియు దృష్టికి సంబంధించిన సమాచార ప్రసార సాధనం. T.V.లో వార్తలు, సినిమాలు ఇంక అనేక కార్యక్రమాలు చూడవచ్చు.
ప్రశ్న 4.
సామాజిక మాధ్యమం అంటే ఏమిటి?
జవాబు.
సామాజిక మాధ్యమం అనేది సమాచార ప్రసార మాధ్యమంలో ఆధునికమైనవి. ఇంటర్నెట్ ద్వారా మన అభిప్రయాలను, సమాచారాన్ని ఇతరులతో పంచుకునే అవకాశాన్ని కల్పిస్తాయి..
ఉదా : ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొదలైనవి.
ప్రశ్న 5.
ఇ-మెయిల్ అంటే ఏమిటి?
జవాబు.
ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు పంపే సంక్షిప్త సమాచారాన్ని ఇ-మెయిల్ అంటారు.
సూచనలు చేయడానికి డాక్యుమెంట్లు, ఫైళ్ళు, పంపడానికి ఇ-మెయిల్ను ఉపయోగిస్తారు.
ప్రశ్న 6.
ఒక ఉత్తరం రాసిన చిరునామాకి చేరడంలో ఉన్న వివిధ దశలను రాయండి.
జవాబు.
- ఉత్తరం రాయడం
- పోస్టుబాక్స్ లో వేయడం
- పోస్ట్మ న్ ఉత్తరాలను పోస్టుబాక్స్ నుండి తీయడం
- చిరునామాలననుసరించి ఉత్తరములను వేరుపరచడం
- వాహనంలో వాటి గమ్య స్థానాలకు చేర్చడం
- పోస్ట్మ న్ ద్వారా ఇంటికి ఉత్తరాల పంపిణీ.
ప్రశ్న 7.
ఉత్తరంలో చేరవలసిన చిరునామాలో ఏఏ సమాచారాన్ని రాస్తారో తెలపండి.
జవాబు.
‘ఉత్తరంలో చేరవలసిన వ్యక్తి యొక్క పూర్తి చిరునామాను రాయాలి. చిరునామాలో పేరు, డోర్ నెంబర్, గ్రామం, మండలం, జిల్లా మరియు పిన్ కోడ్ ను రాయాలి.
ప్రశ్న 8.
ఫోన్ ద్వారా ఇతరులతో మాట్లాడటం ఎలా?
జవాబు.
- మొదటిగా అవతలి వారిని హలో లేదా గుడ్ మార్నింగ్ తో పలకరించాలి.
- మీ పేరును వారికి తెలియజేయాలి.
- కాల్ పూర్తయిన తరువాత ధన్యవాదాలు లేదా ” నైస్ టాకింగ్ టు యు” అని చెప్పాలి.
- అవతలి వారి స్వరం సరిగా వినిపనించనపుడు ‘సారీ నాకు సరిగా వినబడలేదు’ ” అని అనాలి.
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
ఇతరులతో తమ భావనలను అనుభూతులను పంచుకోవడాన్ని …………… అంటారు.
A) భావ ప్రసారం
B) సమాచారం.
C) నిజ నిరూపణ
D) మార్పిడి
జవాబు.
A) భావ ప్రసారం
ప్రశ్న 2.
క్రింది వానిలో బహుళ సమాచార ప్రసార సాధనం ……….
A) వార్తాపత్రికలు
B) రేడియో
C) టెలివిజన్
D) పైవన్నీ
జవాబు.
A) వార్తాపత్రికలు
ప్రశ్న 3.
PIN అనగా…………….
A) Personal index number
B) Postal index number
C) Phone identification number
D) Post information number
జవాబు.
B) Postal index number
ప్రశ్న 4.
ఈ రోజుల్లో అత్యంత వేగవంతమైన ప్రసార సాధనం …………..
A) వార్తాపత్రికలు
B) రేడియో
C) ఇ-మెయిలింగ్
D) పోస్టల్
జవాబు.
C) ఇ-మెయిలింగ్
ప్రశ్న 5.
అదే పనిగా ఇయర్ ఫోన్ తో వినడం వల్ల ……………. దెబ్బ తింటుంది.
A) వినికిడి శక్తి
B) కంటి చూపు
C) భావ వ్యవక్తీకరణ
D) సమాచారాన్ని గ్రహించేశక్తి
జవాబు.
A) వినికిడి శక్తి
ప్రశ్న 6.
అదే పనిగా మొబైల్ ఫోన్ చూడడం. …………….. వల్ల దెబ్బ తింటుంది.
A) వినికిడి శక్తి
B) కంటి చూపు
C) భావ వ్యవస్తీకరణ శక్తి
D) సమాచారాన్ని గ్రహించేశక్తి
జవాబు.
B) కంటి చూపు