Andhra Pradesh AP Board 5th Class EVS Solutions 7th Lesson మనకు ఎవరు సేవ చేస్తారు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class EVS Solutions Lesson 7 మనకు ఎవరు సేవ చేస్తారు
I. విషయావగాహన:
ప్రశ్న 1.
మన దేశంలో మూడు స్థాయిలలో గల ప్రభుత్వాలు ఏవి?
జవాబు:
మన దేశంలో మూడు స్థాయిలలో ప్రభుత్వాలు ఉన్నాయి. :
- స్థానిక ప్రభుత్వం
- రాష్ట్ర ప్రభుత్వం
- కేంగ ప్రభుత్వం
ప్రశ్న 2.
గ్రామ పంచాయితీ యొక్క ఏవేని 5 ముఖ్యమైన విధులు రాయండి.
జవాబు:
- త్రాగునీటి అవసరాలు కల్పించటం.
- రోడ్లు, మురికి కాలువలు, సాగునీటి కాలువల నిర్మాణం మరియు వాటి నిర్వహణ.
- ప్రజారోగ్యం , పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వటం.
- వీధి దీపాల ఏర్పాటు
- స్థానికంగా పన్నులు వసూలు చేయుట.
ప్రశ్న 3.
నీది ఏ మండలం? మీ మండల స్థాయి అధికారులను పేర్కొనండి?
జవాబు:
మాది కృష్ణా జిల్లాలోని మైలవరం మండలం. వివిధ జిల్లా స్థాయి అధికారులు:
- మండల పరిషత్ అధికారి – మండల అభివృద్ధి అధికారి (MDO)
- పోలీసుశాఖ మండల అధికారి – సబ్ ఇన్ స్పెక్టర్ (SI)
- మండల రెవిన్యూశాఖ అధికారి – తహసీల్దార్ లేక మండల రెవిన్యూ అధికారి (MRO)
- విద్యాశాఖ మండల అధికారి – మండల విద్యాశాఖాధికారి (MEO) II.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
గ్రామ పంచాయితీ విధులు తెలుసుకోవడానికి మీ గ్రామ కార్యదర్శిని ఏఏ ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
గ్రామ పంచాయితీ విధులు తెలుసుకోవటానికి గ్రామ కార్యదర్శిని క్రింది ప్రశ్నలు అడుగుతాను.
- గ్రామ పంచాయితీ అనగా నేమి?
- గ్రామ పంచాయితీ పెద్ద ఎవరు?
- గ్రామ పంచాయితీ ప్రజలకు ఏఏ సౌకర్యాలు కల్పిస్తుంది?
- గ్రామ పంచాయితీ విధులేవి.
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
క్రింది సమాచారాన్ని సేకరించండి. క్రింది పట్టికలో పొందు పరచండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
IV. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 6.
మీ పంచాయితీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడండి. మీ పరిశీలనలను రాయండి.
జవాబు:
నేను మా వీధిలో పనిచేసే పారిశుధ్య కార్మికురాలితో మాట్లాడి పరిశీలించిన విషయాలు:
- పారిశుధ్య కార్మికులు ఉదయాన్నే నిద్రలేచి విధులకు హాజరౌతారు.
- మురికి కాలువలు శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లుతారు.
- చెత్తను తడి, పొడి చెత్తలుగా వేరు చేస్తారు.
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
మీ గ్రామము యొక్క పటం గీచి, అందులో ప్రభుత్వ సంస్థలను గుర్తించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
VI. ప్రశంస:
ప్రశ్న 8.
మీ బడి ఒక ప్రభుత్వ సంస్థ. అది ప్రభుత్వ ఆస్థి. కాబట్టి మీ బడిని రక్షించుకోడానికి నీవు ఎటువంటి చర్యలు తీసుకుంటావు?
జవాబు:
- పాఠశాల ప్రజా ఆస్థి. దానిని మన సొంత ఆస్థిలాగా కాపాడు కోవటం మన అందరి బాధ్య త.
- తరగతి గోడల పై, బెంచీల పై పిచ్చి వ్రాతలు వ్రాయకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.
- తరగతి కిటికీలు, ద్వారాలు, గోడలకు ఎలాంటి డామేజీ కాకుండా చూచుకోవాలి.
- ప్రజల అవసరాలు తీర్చే ఇట్టి ఆస్తులను కాపాడుకొని తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిది.
అదనపు ప్రశ్నలు:
I. విషయావగాహన:
ప్రశ్న 1.
మండల పరిషతు గురించి వ్రాయండి.
జవాబు:
- దీనికి మండల అభివృద్ధి అధికారి అధిపతి.
- ప్రాధమిక విద్య అందేలా చూస్తుంది.
- వ్యవసాయం, పశువుల పెంపకం, చేపల పెంపకం, కోళ్ళ పరిశ్రమలు అభివృద్ధి.
- రోడ్లు, నీటి పారుదల నిర్మాణం మరియు మరమ్మత్తులు.
- రక్షిత మంచినీరు అందించటం, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, మురికి నీటి సౌకర్యం మొ||వి కల్పిస్తుంది.
ప్రశ్న 2.
మునిసిపాలిటీ (పురపాలక సంస్థ), మునిసిపల్ కార్పోరేషన్ (నగర పాలక సంస్థ)ల ను పోల్చండి.
జవాబు:
ప్రశ్న 3.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గురించి సంక్షిప్తంగా వ్రాయండి.
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వం :
- అన్ని రాష్ట్రాలు తమ సొంత ప్రభుత్వాలను కలిగి ఉంటాయి.
- రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మరియు మంత్రుల మండలిని కలిగి ఉంటుంది.
- ముఖ్యమంత్రి సలహా మేరకు, గవర్నర్ మంత్రి మండలిని నియమిస్తారు.
- రాష్ట్రంలోని ప్రజలందరి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి.
కేంద్ర ప్రభుత్వం :
- కేంద్ర ప్రభుత్వానికి అధిపతి రాష్ట్రపతి. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు.
- ప్రధాన మంత్రి సలహా మేరకు మంత్రి మండలిని రాష్ట్రపతి నియమిస్తారు.
- తపాలా, రైల్వేలు, టెలికాం, విమానాశ్రయాలు, మరియు ప్రకృతి విపత్తుల నిర్వహణ వంటి సేవలను అందిస్తుంది.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టు పని:
ప్రశ్న 4.
క్రింది వారి పేర్లను తెల్పండి ?
- గవర్నర్ : ……………………….
- ముఖ్యమంత్రి : ……………………..
- ప్రధాన మంత్రి : ……………………
- రాష్ట్రపతి : ………………………..
జవాబు:
- గవర్నర్ : బిశ్వ భూషణ్ హరిచందన్
- ముఖ్యమంత్రి : వై.స్.జగన్మోహన్ రెడ్డి
- ప్రధాన మంత్రి : నరేంద్ర మోది
- రాష్ట్రపతి : ద్రౌపది ముర్ము
ప్రశ్న 5.
క్రింది భవనాల పేర్లు పేర్కొనండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
ప్రశ్న 6.
పురపాలక సంస్థలు, నగర పాలక సంస్థల విధులను మైండ్ మాక్ల పూరించండి.
జవాబు:
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
క్రింది వానిలో స్వచ్ఛతే సేవ పురస్కారాన్ని అందుకున్న గ్రామం ………………………
(A) కర్నూలులోని అల్లూరు
(B) కర్నూలులోని పీలేరు
(C) మైలవరం
(D) ఏదీకాదు
జవాబు:
(A) కర్నూలులోని అల్లూరు
ప్రశ్న 2.
ప్రతి గ్రామ సచివాలయంలో ఎంతమంది గ్రామ సచివాలయ సిబ్బంది ఉంటారు ………………………
(A) 12 మంది
(B) 11 మంది
(C) 14 మంది
(D) ఏదీకాదు
జవాబు:
(B) 11 మంది
ప్రశ్న 3.
కొన్ని గ్రామాలు కలిసి ……………………… ఏర్పడును.
(A) మండలం
(B) జిల్లాపరిషత్
(C) రాష్ట్రం
(D) ఏదీకాదు
జవాబు:
(A) మండలం
ప్రశ్న 4.
మన రాష్ట్రంలోని మండలాల సంఖ్య ……………………….
(A) 600
(B) 700
(C ) 676
(D) 766
జవాబు:
C ) 676
ప్రశ్న 5.
మండలాలలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు పరిచేది ………………………
(A) ప్రాథమిక ఆరోగ్య కేంద్రము
(B) మండల రెవిన్యూ కార్యాలయం
(C) బ్యాంక్
(D) మండల విద్యావనరుల కేంద్రము
జవాబు:
(A) ప్రాథమిక ఆరోగ్య కేంద్రము
ప్రశ్న 6.
కొన్ని మండలాలు కలిసి ……………………… ఏర్పరుస్తాయి.
(A) గ్రామం :
(B) జిల్లా
(C) రాష్ట్రం
(D) ఏదీకాదు
జవాబు:
(B) జిల్లా
ప్రశ్న 7.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల విధులను పర్యవేక్షించునది ………………………
(A) MEO
(B) డాక్టర్
(C) కలెక్టర్
(D) ఎవరూకాదు
జవాబు:
(C) కలెక్టర్
ప్రశ్న 8.
గ్రామ పంచాయితీ అధిపతి ………………………
(A) మేయర్
(B) ఛైర్ పర్సన్
(C) సర్పంచ్
(D) ఎవరూకాదు
జవాబు:
(C) సర్పంచ్
ప్రశ్న 9.
మునిసిపల్ కార్పోరేషన్ అధిపతి ………………………
(A) మేయర్
(B) ఛైర్ పర్సన్
(C) సర్పంచ్
(D) ఎవరూకాదు
జవాబు:
(C) సర్పంచ్
ప్రశ్న 10.
మునిసిపాలిటి అధిపతి ………………………
(A) మేయర్
(B) ఛైర్ పర్సన్
(C) సర్పంచ్
(D) ఎవరూకాదు
జవాబు:
(B) ఛైర్ పర్సన్