Andhra Pradesh AP Board 4th Class Telugu Solutions 1st Lesson గాంధీ మహాత్ముడు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class Telugu Solutions Chapter 1 గాంధీ మహాత్ముడు
Textbook Page No. 1
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్ప౦డి.
ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరున్నారు వారేం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలో వీపున చిన్న పిల్లవాడి ని కట్టుకుని గుఱ్ఱం మీద స్వారీ చేస్తూ యుద్ధం చేస్తున్న వీరనారి, ఆమెతో యుద్ధం చేస్తున్న సైన్యం ఉన్నారు.
ప్రశ్న 2.
చిత్రంలో సన్నివేశం ఏమై ఉంటుంది ?
జవాబు:
స్వతంత్ర పోరాటం అయి ఉంటుంది. బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరిస్తూ చెల్లాచెదరు చేస్తున్న ఆమె, వీరనారి ఝాన్సీరాణి అయి ఉంటుంది.
ప్రశ్న 3.
మీకు తెలిసిన సమరయోధుల పేర్లు చెప్ప౦డి.
జవాబు:
సైరా నరసింహారెడ్డి, ఝాన్సీరాణి, లాలాలజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బంకిన్ చంద్రపాల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, గాంధీ, అల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభాయ్ పటేల్, టంగుటూరి ప్రకాశం పంతులు, పింగళి వెంకయ్య మొదలగువారు….
Textbook Page No. 4
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
గాంధీ గురించి జగత్తు కలకల ఎందుకు నవ్వింది?
జవాబు:
గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య సాధన కోసం బయలు దేరగా ఈ జగత్తు ఆనందంతో నవ్వింది.
ప్రశ్న 2.
స్వరాజ్యం అంటే ఏమిటి ?
జవాబు:
సొంత పరిపాలన, మనల్ని మనం పరిపాలించుకోవడం. పాలకులూ మనమే,,,, పాలితులు మనమే….
ప్రశ్న 3.
గాంధీ స్వాతంత్ర్య సమర నినాదాలే మంత్రాలుగా మారుమ్రోగాయి కదా! మీకు తెలిసిన కొన్ని స్వాతంత్ర్య నినాదాలు చెప్ప౦డి.
జవాబు:
- స్వరాజ్యం (స్వాతంత్ర్యమే) మా జన్మహక్కు – తిలక్
- జై హింద్ – సుభాష్ చంద్రబోస్
- మా కొద్దీ తెల్ల దొరతనం
- సత్యమేవ జయతే – గాంధీ
- పోరాడదాం – లేదా – చనిపోదాం (డు – ఆర్ డై) – గాంధీ
- దేశం వదిలిపోండి!…. (యూసఫ్ మెహార్లీ )
- వందేమాతరం …. (బకించంద్ర చట్టర్జీ )
- నాకు రక్తమివ్వండి – నేను స్వేచ్ఛను ఇస్తాను (సుభాష్ చంద్రబోస్)
- ఇంక్విలాబ్ జిందాబాద్ – ( భగత్ సింగ్ )
ప్రశ్న 4.
గడగడ వణకడం అంటే ఏమిటి ?
జవాబు:
భయపడిపోవడం.
ప్రశ్న 5.
గంట గణగణ మోగింది. ఇలా గంటలు ఎక్కడెక్కడ గణగణ మోగుతుంటాయో చెప్ప౦డి.
జవాబు:
దేవాలయాలలో, పాఠశాలలో, కళాశాలలో, ఆగ్నిమాపక వాహనం పై (ఫైర్ ఇంజన్) చిన్న చిన్న రైల్వే స్టేషన్లలో మొదలగు చోట్ల మోగుతుంటాయి.
కవి పరిచయం
కవి: బసవరాజు అప్పారావు
కాలము : 13-12-1894 – 10-06-1933
విశేషాలు : భావకవి, గీత కర్త, జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. ‘బసవరాజు అప్పారావు గారి గేయాలు’ పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి.
పదాలు – అర్థాలు
స్వరాజ్యం : = సొంత పాలన
మోక్షం = విడుపు, విముక్తి
కంపించుట = వణుకుట
ప్రణవం = ఓంకారం
అధర్మం = అన్యాయం (ధర్మం కానిది)
స్వస్తి = శుభం
భావం
గాంధీ మహాత్మడు స్వాతంత్ర్య సాధన కొరకు బయలుదేరగా ఈ జగత్తు ఆనందంతో నవ్వింది గాంధీ స్వాతంత్ర్య సాధన కొరకు వేగంగా నడవగా ఈ భూమి కంపించిపోయింది. మహాత్ముడు కన్నెత్తి చూడగా అధర్మం గడగడ వణికిపోయింది. జాతిపిత బోసినవ్వు నవ్వగా స్వరాజ్యం కనుల ఎదుటే కనిపించింది. బాపూజీ మాట్లాడినపుడు ఓంకారం వలె గణగణ మ్రోగింది. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనెడి మోక్షము చేతికి చిక్కింది.
ఈ మాసపు గేయం : తేనెల తేటల మాటలతో
పల్లవి :
తేనెల తేటల మాటలతో
మన దేమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకుని
ఇక జీవనయానం చేయుదమా
||తేనెల॥
చ|| 1)
సాగరమేఖల చుట్టుకొని
సురగంగ చీరగా మలచుకొని
గీతాగానం పాడుకోని
మనదేవికి యివ్వాలి హారతులు
||తేనెల॥
చ|| 2)
గాంగ జటాధర భావనతో
హిమశైల రూపమే నిలబడగా
గలగల పారే నదులన్నీ
ఒక బృందగానమే చేస్తుంటే
||తేనెల॥
చ|| 3)
ఎందరో వీరుల త్యాగఫలం
మన నేటి స్వేచ్చకే మూలధనం
వారందరినీ తలచుకొని
మన మానస వీథిని నిలుపుకొని
||తేనెల॥
కవి పరిచయం
కవి : ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
కాలము : (29-5-1944 – 25-07-2019)
రచనలు : ‘అనుభూతి గీతాలు’
విశేషాలు : కవి, కథకులు, విమర్శకులు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. ఈయన కవితా సంపుటి. లలితగీత కర్త. ఆకాశవాణిలో పని చేశారు.
ఈ మాసపు కథ : తెలివైన దుప్పి
బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు. అతనికి ఒక చెట్టు పండ్లంటే ఇష్టం. ఒక వేటగాడు ఇదంతా గమనించాడు. చెట్టు కింద బుట్టలో పండ్లు అమర్చాడు. దానికి ఒక ఉచ్చు అల్లాడు. చెట్టు మీద కూర్చోని దుప్పి కోసం ఎదురు చూస్తున్నాడు. దుప్పి వచ్చి పండు నోటితో అందుకోగానే వేటగాడు తాడు లాగుతాడు. దుప్పి ఉచ్చులో పడిపోతుంది. ఇది వాడి ఆలోచన.
దుప్పి రానే వచ్చింది. కాని దూరంగా ఆగింది. పండ్లు బాగా మగ్గి తీయని వాసన వస్తోంది. ఒక వైపు పండు తినాలని అనిపిస్తున్నది. కాని పండ్లు ఉన్న తీరు దుప్పికి సందేహం కలిగించింది. అది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉంది.
వేటగాడు దుప్పిని చూశాడు. అది ఆగి, నిలబడి ఉండడం గమనించాడు. వాడికి తొందరయిపోతోంది. దుప్పి వెనక్కి వెళ్లి పోతుంఏదేమో, దానికి పండ్లు కనబడాలని చెట్టు మీద నుండి కొన్ని పండ్లు విసిరాడు. ఒక్కొక్కటే తింటూ అది బుట్ట దగ్గరకు వస్తుందని వాడి ఆశ.
కాని దుప్పి చాలా తెలివైంది. చెట్టు నుంచి పండ్లు రాలితే సూటిగా కింద పడుతాయి. అంతేగాని ఎవరో విసిరినట్లు పడవు ‘కదా! ఏదో తిరకాసు ఉందని అర్థమయింది. చెట్టు మీద ఉన్న వేటగాణ్ణి చూసింది. కాని చూడనట్లే చెట్టుతో అన్నది. చెట్టూ! చెట్టూ! పండ్లు విసురుతున్నావేంటి? నీ అలవాటు మార్చుకున్నావా? అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను. ఇక నీ దగ్గరకి పండ్ల కోసం రాను, అంటూ వెనుదిరిగి పోబోయింది. వేటగాడికి దుప్పి చిక్కలేదని కోపం వచ్చింది. గట్టిగా ఆరిచాడు. ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు? రేపు నిన్ను వదిలేదు. లేదు.
వేటగాడు పూర్తిగా బయట పడి పోయాడు. మళ్లీ నీకు దొరుకుతానా అనుకుంటూ దుప్పి దట్టమైన అడవిలో మాయమై పోయింది. మోసగాళ్లుంటారు. వాళ్ల మాయలో పడకూడదు. ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది. జాగ్రత్తగా ఉండాలి.