Andhra Pradesh AP Board 4th Class Maths Solutions 4th Lesson పరివర్తన Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class Telugu Solutions Chapter 4 పరివర్తన
Textbook Page No. 27
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్న 1.
చిత్రం చూడండి. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ? ఏం చేస్తున్నారు?
జవాబు:
ఆ చిత్రంలో చాలా మంది పిల్లలు ఉన్నారు. అందులో కొంత మంది ఆడ పిల్లలు, కొంత మంది మగ పిల్లలు. ఒక చిన్న కుక్కపిల్ల కూడా ఉంది.
ప్రశ్న 2.
మీకు తెలిసిన ఆటలు గురించి రాయండి.
జవాబు:
అంటుకునే ఆట, కోతి కొమ్మచ్చి, బంతాట, తొక్కుడు బిళ్ళ, కో, బాడ్మింటెన్, షటిల్, రింగ్, దాగుడుమూతలాట, జారుడుబండ, కళ్ళగంతలాట, కబాడీ, టైరాట మొదలగునవి.
Textbook Page No. 30
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
పరివర్తన కథను సొంత మాటల్లో చెప్ప౦డి.
జవాబు:
రాముకు ఆటలంటే ఇష్టం. బద్దకం ఎక్కువ. శ్రద్ధ తక్కువ. పుస్తకాలు కూడా సరిగా చక్కగా సర్దుకోడు. చిందర వందరగా పడేస్తాడు. ఆరోజు ఆలస్యంగా నిద్ర లేచాడు. “ రామూ! స్కూల్ టైం అయింది”. నీతోటి పిల్లలందరూ బడికి వెళ్తున్నారు. నువ్వు కూడా తోందరగా తయారయి బడికి వెళ్ళమని వాళ్ళ అమ్మ మాట వినపడింది.
కాసేపటికి రాము పుస్తకాల సంచి భుజానికి తగిలించుకుని బడికి బయలుదేరాడు. దారిలో ఒక మామిడి తోట కనపడితే వెంటనే దారి మళ్ళి .. ఆతోటలోకి వెళ్ళాడు. తోటలో వాతావరణం చాలా బాగా నచ్చింది. ఆడుకోవాలనిపించింది. బడి విషయం మర్చిపోయాడు. రాముకు ఎదురుగా ‘ కాకి’ కన్పించింది. కాకీ , కాకీ మనం ఆడుకుందామా! అని అడిగాడు రాము మాటవిని “కాకి – అమ్మో! రాబోయేది వానాకాలం నేను గూడు కట్టుకోవాలి. నాకు చాలా పని ఉంది. నేను రాను” అని చెప్పింది. కాకి మాటలకు రాము బాధ పడ్డాడు.
వెంటనే రాముకు తెనేటీగ కనపడింది. “తేనెటీగా! తేనెటీగా! మనం ఆడుకుందామా!” అని అడిగాడు, ఆమాటకు. తేనెటీగ, “ నాకు అంత తీరిక లేదు బాబూ! ‘పూల నుండి తేనెను సేకరిస్తున్నాను. పూలు వాడిపోతాయి. నేను నీతో ఆడలేను నాకు చాలా పనుంది. అని చెప్పింది. తేనేటీగ మాటలకు రాము బాధపడ్డాడు.
ఇంతలో, ఎదురుగా! ‘చీమ’ కనపడింది. వెంటనే చీమా! “చీమా! మనం ఆడుకుందామా!”అని అడిగాడు. ఆమాటకు చీమ “బాబూ! ఇది నేను గింజలు. సేకరించుకునే కాలం. రానున్నది వానకాలం అప్పుడేం తింటాం. అందుకనే ఇప్పుడు సేకరించుకుని దాచుకుంటే…. అప్పుడు తినగలను. కనుక నాకు పనుంది. నేను రాలేను. అని చెప్పింది.
కాకి, తేనేటీగ, చీమ మాటలకు రాములో పరివర్తన వచ్చింది. నాకు కూడా పనుంది కదా! ‘నేను బడికి వెళ్ళి’ చదువుకోవడమే నా పని కదా! అనిపించి తిన్నగా పాఠశాలకు వెళ్ళాడు చక్కగా చుదువుకున్నాడు.
నీతి: ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. కాలం వృధా చేయకూడదు. బద్దకం పనికిరాదు ముందు జాగ్రత్త మంచిది.
ప్రశ్న 2.
రాము మామిడితోటలో ఎవరెవరితో మాట్లాడాడు ?
జవాబు:
రాము మామిడి తోటలో – కాకితో, తేనేటీగతో, చీమతో మాట్లాడాడు.
ప్రశ్న 3.
కాకి, తేనెటీగ, చీమ రాముతో ఆడుకోవడానికి ఎందుకు రానన్నాయి?
జవాబు:
రాబోయే కాలం వానాకాలం కాబట్టి కాకి గూడు కట్టుకునే పని ఉండబట్టి, తేనేటీగ తేనే సేకరించాలని, చీమ ఆహారం సేకరించాలనే పనులుండ బట్టి – కాలం వృధా చేయలేక రాముతో ఆడుకోవటానికి రానన్నాయి.
ప్రశ్న 4.
బడికి వెళ్ళే సమయంలో ఆట ఆడుకోవడానికి నీ స్నేహితులు పిలిస్తే నీవు ఏమంటావు?
జవాబు:
ఇప్పుడు రాలేను. బడికి వెళ్తున్నాను. సాయంత్రం బడి నుండి వచ్చాక ఆడుకుందాము. అని చెప్తాను. అంతేకాదు – నువ్వు కూడా, బడిమానకు బడికి వెళ్ళు. సాయంత్రం కలుద్దాం. అడుకుందాం. అని చెప్తాను.
చదవడం – వ్యక్త పరచడం
అ) కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
జవాబు:
రాము బడికి వెళ్ళకుండా తోటలోకి ఆడుకోవడానికి వెళ్ళాడు. అక్కడ కాకి, చీమలు కనిపించాయి. ” కాకి! కాకి! మనం ఆడుకుందామా!” అని అడిగాడు. దానికి కాకి “అయ్యోబాబూ! రానున్నది వానాకాలం. అసలే నాకు గూడులేదు. ఒక్కొక్క పుల్లను తెచ్చుకొని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను. నాకు చాలా పని ఉంది! నీతో ఆడడం కుదరదు’ అని – ఎగిరిపోయింది. “చీమా! చీమా! మనం ఆడుకుందామా!” అని ఆత్రంగా అడిగాడు. “బాబు! రానున్నది వానాకాలం ఇప్పుడు గింజ సేకరించుకోక పోతే, రాబోయే కాలంలో సుఖపడలేము” అని గింజను మోసుకుపోయింది. అదేంటి నాతో ఎవరూ ఆడుకోవడానికి రావడం లేదని రాము ఆలోచించసాగాడు.
ప్రశ్న 1.
కాకి, చీమ రాముతో ఆడుకోవడానికి ఇష్టపడ్డాయా? ఎందుకు?
జవాబు:
” ఇష్టపడలేదు. ఎందుకంటే, రాబోయే కాలం వానాకాలం కాబట్టి కాకి గూడు కట్టుకునే పని ఉండబట్టి, తేనెటీగ తేనె సేకరించుకోవాలని, చీమ ఆహారం సేకరించు కోవాలనే పనులండబట్టి, కాలం వృధా చేయలేక రాముతో ఆడుకోవడానికి ఇష్టపడలేదు.
ప్రశ్న 2.
కాకి, చీమ రాబోయే ఏ కాలం కోసం భయపడుతున్నాయి? ఎందుకు?
జవాబు:
వానాకాలం కోసం – భయపడుతున్నాయి. ఆహారం సేకరణ కష్టమవుతుందని – ఇప్పుడు కష్టపడితే… అప్పుడు సుఖపడవచ్చని.
Textbook Page No. 31
ప్రశ్న 3.
‘ఆత్రం’ గా పదానికి అర్థం రాయండి.
జవాబు:
” ఆశగా ”
ప్రశ్న 4.
రాముతో కాకి, చీమ ఆటలు ఆడుతూ కాలం గడిపేస్తే ఏమవుతుంది?
జవాబు:
కాలం వృధా అవుతుంది. ఆహార సేకరణ కష్టమవుతుంది. వానాకాలం తిండి గడవడం కష్టమవుతుంది.
ప్రశ్న 5.
కాకి, చీమల మాటల ద్వారా రాము ఏమి ఆలోచించి ఉంటాడు?
జవాబు:
కాలం వృధా చేయడం ఎంత తప్పో తెలుసుకుని ఉంటాడు. ఇప్పుడు కష్టపడితే…రాబోయే కాలంలో సుఖపడవచ్చని తెలుసుకుని ఉంటాడు. ఎవరి పని వారు చేయకుండా బద్దకించడం తప్పని తెలుసుకుని ఉంటాడు. తాను ఎంత తప్పు చేస్తున్నాడో ఆలోచించి ఉంటాడు.
ఆ) పాఠంలోని ఆనుకరణ పదాలు గుర్తించి రాయండి, ఇలాంటి మరికొన్ని పదాలు రాయండి.
ఉదా : గల గల
_________ ______ _________
_________ ______ _________
_________ ______ _________
జవాబు:
ఇ) కింది పేరాను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
రామాపురంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. ఎప్పుడూ కబుర్లు, ఆటలు అంటూ కాలక్షేపం చేసేవాడు. బాల్యంలో చదువు పట్ల ఆశ్రద్ధగా ఉండేవాడు. అలాగే పెద్దవాడయ్యాకా పనిపట్ల శ్రద్ధ పెట్టేవాడు కాదు. తనతోటి వారు అందరూ పనిచేసి డబ్బులు కూడ పెడుతుంటే తను ఏ పని చేయలేకపోవడం రాజును బాధ పెట్టింది. “ఏపనైనా శ్రద్ధగా చెయ్యాలి. అప్పుడే విజయం చేకూరుతుంది” అని చిన్నప్పుడు గురువు గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి పని పట్ల శ్రద్ధ పెట్టాడు. అందరిలాగే తనూ సంపాదనాపరుడయ్యాడు.
ప్రశ్న 1.
రాజు కాలాన్ని ఎలా గడిపేవాడు?
జవాబు:
రాజు కాలాన్ని ఎప్పుడూ కబుర్లు, ఆటలు అంటూ గడిపేవాడు.
ప్రశ్న 2.
రాజుకి గురువుగారు చినప్పుడు ఏమిని చెప్పేవారు?
జవాబు:
ఏపనైనా శ్రద్ధగా చెయ్యాలి. అప్పుడే విజయం చేకూరుతుంది’. అని చెప్పేవారు.
ప్రశ్న 3.
‘కాలక్షేపం’ ఈ పదానికి అర్థం రాయండి.
జవాబు:
సమయం వృధా చేయడం.
Textbook Page No. 32
పదజాలం
అ) కింది పదాలు చదవండి. జతపరచండి. ఏవైనా రెండు పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి.
జవాబు:
1. పకపక నవ్వడం, చకచకు -సెలయేరు
2. గలగల సెలయేరు పకపక ఏడవడం
3. చకచక నడవడం వలవల – నవ్వడం
4. వలవల ఏడవడం టపటప నడవడం
5. టపటప – వానచినుకులు
ఉదా॥ బుజ్జాయి పకపక నవ్వుతున్నది.
1. మా ఊరి చివర గలగల సెలయేరు ప్రవహిస్తున్నది.
2. రాము చకచక నడవడం నేర్చుకున్నాడు.
3. చెల్లి వలవల ఏడవడం మొదలు పెట్టింది.
4. టపటప వానచినుకులు పడుతున్నాయి.
ఆ) మీరు చూసిన పూలమొక్కల పేర్ల జాబితా రాయండి.
ఉదా॥ గులాబి మొక్క ______________
_______ _______
జవాబు:
గులాబి మొక్క
బంతిపూల మొక్క
చామంతి పూలమొక్క
డిసెంబరు పూలమొక్క
చిట్టిచామంతి మొక్క.
కనకాంబరం మొక్క
సెంటుమల్లె మొక్క
లిల్లీ పూలమొక్క
ఇ) కింది పదాలను చదవండి. వేరుగా ఉన్నవాటి కింద గీత గీయండి.
1. కాకి, కోయిల పాము, పిచ్చుక
జవాబు:
పాము
2. బొద్దింక, చీమ, ఈగ, ఏనుగు
జవాబు:
ఏనుగు
3. కుక్క, పిల్లి, దోమ, గేదె
జవాబు:
దోమ
4. గులాబీ, టమాట, బెండకాయ, పొట్లకాయ
జవాబు:
గులాబీ
ఈ) పాఠంలో సంయుక్తాక్షర పదాలు గుర్తించండి. రాయండి.
ఉదా॥ ఆలస్యంగా _____ _____
____ ____ _____
జవాబు:
ఆలస్యంగా
1) వ్యక్తి
2) పడేస్తాడు
3) త్వరగా
4) ఆహ్లాదంగా
5) పక్షులు
6) శ్రమించి
7) ప్రకృతి
8) మాటల్ని
9) ఆత్రంగా
10) కష్టపడి
Textbook Page No. 33
స్వీయరచన
ప్రశ్న 1.
రాము వెళ్ళిన మామిడి తోట ఎలా ఉంది?
జవాబు:
పారుతున్న నీళ్ళ గలగలలతో, పక్షుల కిలకిలలతో, వాటి రెక్కల టపటపలతో, పచ్చని ప్రకృతితో ఆహ్లాదంగా ఉంది.
ప్రశ్న 2.
కాకి, తేనెటీగ, చీమల ద్వారా రాము ఏమి గ్రహించాడు?
జవాబు:
కాలం వృధా చేయకూడదని గ్రహించాడు. పనిమానకూడదని ఎవరి పని వాళ్ళు బద్దకించకుండా శ్రద్ధతో చేయాలని, ఇప్పుడు కష్టపడితే తరువాత సుఖపడవచ్చని గ్రహించాడు. ముందు జాగ్రత్త అవసరమని గ్రహించాడు.
ప్రశ్న 3.
ముందు జాగ్రత్త లేకుండా కాలం గడిపేస్తే ఏమవుతుందో రాయండి.
జవాబు:
తరువాత కాలం గడపటం కష్టమవుతుంది. (కాలం సహకరించదు, ఆరోగ్యం సహకరించదు పరిసరాలు సహకరించవు. తోటివారు సహకరించరు).
సృజనాత్మకత
ఖాళీలలో సరైన పదాన్ని ఉంచి కథను ఊహించి రాయండి.
ఒక రోజు కాకికి…………ముక్క దొరికింది.
జవాబు: మాంసం
అది నక్క చూచి, ఆ ముక్కను……… అనుకుంది.
జవాబు: <=u>పొందాలి
కాకిని బాగా………..
జవాబు: పొగిడింది
కాకి పొంగిపోయి…………..అన్నది.
జవాబు: కావు కావు
కాకి నోటిలో ముక్క……..
జవాబు: కిందపడింది.
నక్క …….. తీసుకొని చక్కా పోయింది.
జవాబు: ఆ ముక్కను
అది ఒక దట్టమైన అడవి ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు పైన ఒక అమాయకపు కాకి. అదే అడవిలో ఒక తెలివి గల నక్క కూడా ఉంది.
ఒక రోజు కాకికి ఒక ………. ముక్క దొరికింది.
జవాబు: మాంసం
అది అక్కడే తిరుగుతున్న ఆనక్క చూచింది. ఎలాగైనా ఆ ముక్కను ……… అనుకుంది. ఎలాగా! అని ఆలోచించింది. వెంటనే మనసులో ఒక ఆలోచన వచ్చింది.
జవాబు: పొందాలి
కాకిని బాగా ………….
జవాబు: పొగిడింది
నక్క పొగడ్తలకు ఆ అమాయకపు కాకి …………
జవాబు: పొంగిపోయింది
కాకి పొంగిపోయి ………… అన్నది అనందంతో, అంతే.
జవాబు: కావుకావు
వెంటనే కాకినోటిలో ముక్క ……….
జవాబు: కిందపడింది.
దానికోసం చెట్టుకింద ఎదురుచూస్తున్న తెలివిగల ఆనక్క ………… తీసుకుని చక్కాపోయింది.
జవాబు: ఆముక్కను
ప్రశంస
ప్రశంస అందరికి చదువు అవసరం. తరగతి పుస్తకాలు చదవడం వల్ల, వార్తా పత్రికలు చదవడం వల్ల, గ్రంథాలయ పుస్తకాలు చదవడం వల్ల మనకు తెలివితేటలు పెరుగుతాయి. మీ తరగతిలో బాగా చదివే పిల్లల్ని అభినందించండి.
జవాబు:
విద్యార్థికృత్యము.
భాషాంశాలు
అ) కింది పేరాను చదవండి. (. ,) గుర్తులను సరైన చోట గుర్తించండి. అలాగే నామవాచక, సర్వనామ పదాలు గుర్తించండి. పట్టికలో రాయండి.
రఘు, వర్షిణి, ఆయేషా, ఆసిఫ్, మీరా, హర్షిత, మేరీ సంతోష్ జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు. వాళ్ళు అక్కడ సింహం, పులి, ఏనుగు, జిరాఫీ, కోతి, నెమలి, రామచిలుక, పావురం, నిప్పుకోడి మొదలైన జంతువులను, పక్షులను చూశారు. వారందరూ వాటిని చూసి, ఆనందించారు. జంతు ప్రదర్శనశాల ముందు ఉన్న బండి పై జామ, బత్తాయి, అరటిపండ్లు, చూశారు. అవి కొని తిన్నారు. ఆటో ఎక్కి ఇంటికి వచ్చారు.
జవాబు:
ఆ) పాఠంలో (. ,) గుర్తుల ముందున్న పదాలు గుర్తించి రాయండి.
[. ] గుర్తుకు ముందున్న పదాలు: ______ _____ ____
____ _____ _____
[, ] గుర్తుకు ముందున్న పదాలు: ______ _____ ____
____ _____ _____
జవాబు:
కవి పరిచయం
వెంకట పార్వతీశ కవులు బాలాంత్రపు వెంకటరావు
జననం : 1882 మరణం 1955
తల్లిదండ్రులు : సూరమ్మ, వెంకట నరసింహం
జన్మస్థలం : ముల్లాము
తూర్పుగోదావరి జిల్లా
ఓలేటి పార్వతీశం
జననం : 1880 మరణం 1970
తల్లిదండ్రులు : వెంకమ్మ
తచ్యుతరామయ్య
జన్మస్థలం : పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా
పదాలు – అర్థాలు
పరివర్తన = మార్పు
చిందరవందర = క్రమ పద్ధతిలో లేకపోవడం
ఆహ్లాదంగా = సంతోషంగా
ఆసక్తిగా = ఇష్టంగా
ఆత్మీయంగా = ప్రేమగా
చిన్నబుచ్చుకొను = నిరాశపడు
ఈ మాసపు గేయం
పడవ నడపవోయి
ప|| పడవనడపవోయి పూలపడవ నడపవోయి
చ|| చుట్టిన తెరచాపనెత్తి
గట్టిగ చుక్కానిపట్టి
ఒరగనీక సురగనీక
తరగలపై తేలిపోవ
ప||
చ|| చక్కని రాయంచనంచు
చుక్కల తళుకెంచుకొంచు
మిన్నుమన్ను కలుపుచున్న
కన్నులలో సాగునంట
ప||
చ॥ ఊరుదాటి ఏరుదాటి
కడలినాలు కడలను దాటి
చీకుచింతలేని వింత
లోకానికి చేరునంట
ప||
కవి పరిచయం
కవి : వింజమూరి శివరామారావు
కాలము : 1908 – 1982
రచనలు : ‘ గోర్కి కథలు, కల్పవల్లి,
విశేషాలు : ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. ఈయన బిరుదు “కళాప్రపూర్ణ”.
ఈ మాసపు కథ
ఉపాయం
పిల్లలూ! మన తెలివితేటలు మనకు మంచి కీర్తి, ప్రతిష్ఠలు అందిస్తాయి. మనకు సమాజంలో మంచి పేరును తెస్తాయి. ఇలాంటి కథను మనం తెలుసుకుందాం.
పూర్వం. భరతవంశానికి చెందిన రాకుమారులు అందరూ కలసి సరదాగా బంతి ఆట ఆడుకుంటున్నారు. ఒకరి తరువాత ఒకరు బంతిని తంతున్నారు. అట్లా బంతి భీముడి దగ్గరకు వచ్చింది. భీముడు బంతిని గట్టిగా తన్నాడు. దెబ్బకి బంతి పైకి ఎగిరి అల్లంత దూరాన ఉన్న బావిలో పడింది. అందరూ ఆ నూతి చుట్టూ చేరి బంతిని పైకి తీయటానికి ప్రయత్నించారు. చివరకు సాధ్యం కాదని బిక్క మొహం వేశారు.
ఇంతలో ఆ దారిన పోతున్న ఒక వ్యక్తి రాకుమారులను చూసి, విషయం అడిగి తెలుసుకున్నాడు. అతను చాలా సన్నగా పీలగా, బాణాలు పట్టుకుని ఉన్నాడు. ఆ వ్యక్తి అక్కడ ఉన్నవారంతా రాకుమాలని గ్రహించాడు. “మీరంతా విలువిద్యలో ఆరితేరిన రాకుమారుల్లా ఉన్నారు. బంతిని ఎలా తియ్యాలో తెలియడం లేదా” అని ఆశ్చర్యంతో అడిగాడు.
రాకుమారులందరూ తెలియదు అన్నట్లుగా తలలూపారు. అయితే చూడండి అంటూ విల్లు అందుకొని ఒక బాణాన్ని నేరుగా బంతికి తాకేలా వేశాడు. ఆ బాణానికి తాకేలా మరొక బాణం వేశాడు. అట్లా ఒక బాణం తరువాత మరొక బాణం వదిలాడు. అట్లా బాణాల గొలుసు తయారయింది. దాంతో బంతిని పైకి లాగి రాకుమారులకు అందించాడు.
ఇంతలో విషయం తెలుసుకున్న భీష్ముడు అక్కడికి చేరుకున్నాడు. అక్కడున్న ఆ వ్యక్తి విలువిద్యలో గొప్ప గురువు ద్రోణాచార్యుడు అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఆయన అప్పటికే ద్రోణుని ప్రతిభ గూర్చి విని ఉన్నాడు. వెంటనే ద్రోణాచార్యునికి నమస్కరించి “మీవంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడడం మా పూర్వ జన్మ సుకృతం. ఈ పిల్లలు మా మనుమలు. వీరిని మీ శిష్యులుగా స్వీకరించి విలువిద్య నేర్పండి” అన్నాడు.
ద్రోణుడు అంగీకరించగానే అర్జునుడు పరుగున వచ్చి ద్రోణునికి పాదాభివందనం చేశాడు. ఆ విధంగా ద్రోణుడు భరతవంశీయులకు విలువిద్య గురువుగా ప్రసిద్ధి కెక్కాడు.
పిల్లలూ! మన ప్రతిభా పాటవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి అని గ్రహించారు కదా!