AP Board 5th Class EVS Solutions 11th Lesson అవని నుండి అంతరిక్షానికి

Andhra Pradesh AP Board 5th Class EVS Solutions 11th Lesson అవని నుండి అంతరిక్షానికి Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 5th Class EVS Solutions Lesson 11 అవని నుండి అంతరిక్షానికి

I. విషయావగాహన:

ప్రశ్న 1.
అక్షాంశాలు, రేఖాంశాలు మధ్య భేదాలు రాయండి.
జవాబు:
అక్షాంశాలు, రేఖాంశాల మధ్య భేదాలు:-

అక్షాంశాలు:

  1. గ్లోబుమీద అడ్డుగా గీయబడిన ఊహా రేఖలను”అక్షాంశాలు” అంటారు.
  2. గ్లోబును అడ్డంగా రెండు సమాన భాగాలుగా విభజించు అక్షాంశాలను “భూమధ్యరేఖ” అంటారు.
  3. అక్షాంశాల పోడవు భూమధ్యరేఖ నుంచి ధృవాలవైపు పోయే కొద్దీ తగ్గుచూ ధృవాల వద్ద సున్న అగును.
  4. 181 అక్షాంశాలున్నాయి.

రేఖాంశాలు:

  1. గ్లోబుమీద నిలువుగా గీయబడిన ఊహా రేఖలను “రేఖాంశాలు” అంటారు.
  2. గ్లోబును నిలువుగా విభజించు రేఖాంశాన్ని “ప్రైమ్ మెరిడియన్” లేక రేఖాంశము అంటారు.
  3. మెరిడియన్స్ మధ్య దూరం భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు పోయే కొద్దీ క్రమంగా తగ్గును.
  4. 360 రేఖాంశాలున్నాయి.

AP Board 5th Class EVS Solutions 11th Lesson అవని నుండి అంతరిక్షానికి

ప్రశ్న 2.
గ్లోబు గురించి నీకు తెలిసింది రాయండి.
జవాబు:
గ్లోబు భూమి యొక్క నమూనా ఇది భూమి పై వివిధ రకాల ప్రాంతాలను గుర్తించటానికి ఉపయోగ పడుతుంది. ఇది భూమిపై ఉన్న ఖండాలు, సముద్రాల ఆకారం పరిమాణాలను ఖచ్చితంగా గుర్తించుటకు తోడ్పడుతుంది.

ప్రశ్న 3.
భూమి ఏ ఆకారంలో ఉంది?
జవాబు:
పూర్వం ప్రజలు భూమి బల్ల పరుపుగా ఉంటుంది అనుకునేవారు. కానీ ఫెడ్డిదాండ్ మాజిలాన్ అనే పోర్చుగీసు నావికుడు తన బృందంతో కొన్ని సంవత్సరాలు సముద్రప్రయాణం తర్వాత తిరిగి ఆశ్చర్యంగా ప్రయాణం మొదలు పెట్టిన ప్రాంతానికి చేరారు. దీనిని బట్టి భూమి గోళాకారంగా ఉంటుందని నిర్ధారించారు. అంతరిక్షం నుంచి తీసిన ఫోటోలు కూడా దీనిని సమర్ధిస్తున్నాయి.

AP Board 5th Class EVS Solutions 11th Lesson అవని నుండి అంతరిక్షానికి

II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:

ప్రశ్న 4.
భూమి తిరగడం ఆగిపోతే ఏమౌతుంది ?
జవాబు:

  1. భూమి తిరగటం ఆగి పోతే రాత్రి పగలు ఉండవు.
  2. భూమి పై ఉన్న రాళ్ళ, చెట్లు, నిర్మాణాలు అన్నీ ఊడ్చి వేయబడతాయి.

III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:

ప్రశ్న 5.
వివిధ పరిమాణాల బాల్ లను ఉపయోగించి సౌరకుటుంబం నమూనాను తయారు చేయండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టుల పని:

ప్రశ్న 6.
‘భారతదేశం పంపించిన కృత్రిమ ఉపగ్రహాల సమాచారాన్ని సేకరించండి. వాటి ఉపయోగాలు రాయండి.
జవాబు:

  1. రాకెట్లను ఉపయోగించి అంతరిక్ష కక్ష్యలోనికి ప్రవేశ పెట్టిన మానవ నిర్మిత ఉపగ్రహాన్ని “కృత్రిమ ఉపగ్రహం” అని అంటారు. 1975 లో భారతదేశం మొట్ట మొదట ఆర్యభట్ట ఉపగ్రహాన్ని కక్ష్యలోకి
    ప్రవేశపెట్టింది.
  2. చంద్రయాన్ – 2 అను కృత్రిమ ఉపగ్రహాన్ని జూలై 22, 2019 న శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV- MKIII-M1 ద్వారా ప్రయోగించిది. చంద్రయాన్ – I, తర్వాత భారత్ పంపించిన రెండవ కృత్రిమ ఉపగ్రహమే. చంద్రయాన్ – II దీనిలో ఆర్బిటాల్, విక్రమ్ లాండర్ మరియు ప్రగ్యాన్ రోవర్ ఉన్నాయి.
  3. మ్యూనికేషన్, ప్రసారం , వాతావరణ శాస్త్రం, సముద్ర శాస్త్రం, వనరుల సేవ మొ॥గు సేవలను . ఉపగ్రహాలు అందిస్తాయి. ఈ రోజుల్లో ఇంటర్నెట్ , మొబైల్ ఫోన్, ఆన్ లైన్ సేవలు కోసం మనం. ఈ కృత్రిమ ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నాం.

AP Board 5th Class EVS Solutions 11th Lesson అవని నుండి అంతరిక్షానికి

V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:

ప్రశ్న 7.
ఒక బంతిపై అక్షాంశాలు, రేఖాంశాలు గీయండి.
జవాబు:
విద్యార్ధి కృత్యము.

VI. ప్రశంస:

ప్రశ్న 8.
భూమి మాత్రమే మానవులకు నివాసయోగ్యమైన గ్రహం ఎందుకు?
జవాబు:
సౌర కుటుంబంలో భూమి మాత్రమే నీరు (74%) మరియు మనుషులు, జంతువులు నివశించుటకు కావలసిన వాతావరణం కల్గిన ఏకైక గ్రహం. దీనిని ” బ్లూ ప్లానెట్” అంటారు మనుషులు జీవించే సరిస్థితులు కల్గిన ఏకైక గ్రహం భూమి.

అదనపు ప్రశ్నలు:

ప్రశ్న 1.
భూభ్రమణం అనగానేమి?
జవాబు:
భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుటను “భూభ్రమణం” అంటారు. భూమి భ్రమణానికి 24 గం||ల సమయం పట్టును. భూభ్రమణం వల్లనే పగలు రాత్రులు ఏర్పడుతాయి.

ప్రశ్న 2.
భూ పరిభ్రమణం అనగానేమి?
జవాబు:
భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుటను “భూ పరిభ్రమణం” అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే వలయాకార మార్గాన్ని కక్ష్య అంటారు. భూ పరిభ్రమణానికి 365 రోజులు పడుతుంది. భూ పరిభ్రమణం వలన ఋతువులు ఏర్పడతాయి.

AP Board 5th Class EVS Solutions 11th Lesson అవని నుండి అంతరిక్షానికి

బహుళైచ్ఛిక ప్రశ్నలు:

సరియైన సమాధానాలను గుర్తించండి:

ప్రశ్న 1.
భూమి యొక్క సహజ ఉపగ్రహం ………………………
(A) అంగారకుడు
(B) చంద్రుడు
(C) శుక్రుడు
(D) ఏదీకాదు
జవాబు:
(B) చంద్రుడు

ప్రశ్న 2.
గ్రహాల చుట్టూ పరిభ్రమించేవి ………………………
(A) ఉపగ్రహాలు
(B) గ్రహాలు
(C) భూమి
(D) చంద్రుడు
జవాబు:
(A) ఉపగ్రహాలు

ప్రశ్న 3.
సూర్యుడు మరియు సూర్యుని చూట్టూ పరిభ్రమించే గ్రహాలను కలిప ……………………… అంటారు.
(A) గ్రహాలు
(B) విశ్వం
(C) సౌరకుటుంబం
(D) ఏదీకాదు
జవాబు:
(C) సౌరకుటుంబం

AP Board 5th Class EVS Solutions 11th Lesson అవని నుండి అంతరిక్షానికి

ప్రశ్న 4.
గ్లోబు పై నిలువు గా గీయబడిన ఊహారేఖలు
(A) రేఖాంశాలు
(B) అక్షాంశాలు
(C) ఎ మరియు బి
(D) ఏదీకాదు
జవాబు:
(A) రేఖాంశాలు

ప్రశ్న 5.
గ్లోబు పై అడ్డంగా గీయబడిన ఊహారేఖలు ………………………
(A) రేఖాంశాలు
(B) అక్షాంశాలు
(C) ఎ మరియు బి
(D) ఏదీకాదు
జవాబు:
(B) అక్షాంశాలు

ప్రశ్న 6.
భూ పరిభ్రమణంవల్ల ఏర్పడేవి ………………………
(A) పగలు
(B) రాత్రి
(C) బుతువులు
(D) ఏదీకాదు
జవాబు:
(C) బుతువులు

AP Board 5th Class EVS Solutions 11th Lesson అవని నుండి అంతరిక్షానికి

ప్రశ్న 7.
భూ భ్రమణం వల్ల ఏర్పడేవి ………………………
(A) పగలు
(B) రాత్రి
(C) ఎ మరియు బి
(D) ఏదీకాదు
జవాబు:
(C) ఎ మరియు బి

ప్రశ్న 8.
చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగటానికి ……………………… సమయంపడుతుంది.
(A) 10 రోజులు
(B) 30 రోజులు
(C) 25 రోజులు
(D) 27 రోజులు
జవాబు:
(D) 27 రోజులు

ప్రశ్న 9.
చంద్రయాన్ -2′ ను ప్రయోగించిన సమయం ………………………
(A) జూలై 22, 2019
(B) జూన్ 22, 2019
(C) జూలై 22, 2018
(D) ఏదీకాదు
జవాబు:
(A) జూలై 22, 2019

AP Board 5th Class EVS Solutions 11th Lesson అవని నుండి అంతరిక్షానికి

ప్రశ్న 10.
భూమిని రెండు సమాన భాగాలుగా విభజించు రేఖాంశం ………………………
(A) భూమధ్యరేఖ
(B) ప్రైమ్ మెరిడియన్
(C) రేఖాంశము
(D) ఏదీకాదు
జవాబు:
(B) ప్రైమ్ మెరిడియన్