Andhra Pradesh AP Board 5th Class Maths Solutions 10th Lesson కాలం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class Maths Solutions Chapter 10 కాలం
ఇవి చేయండి: (TextBook Page No.103)
ప్రశ్న 1.
మహిత వాళ్ళ అక్క ఉదయం 6 : 30 గం॥లకు బయలుదేరి 2 గంటలు ప్రయాణించింది. ఆమె ఏ సమయానికి రాజమండ్రి చేరింది ?
జవాబు.
మహిత వాళ్ళ అక్క బయలుదేరిన సమయం = 6:30
ఆమె ప్రయాణించిన కాలం = 2 గం||
మహిత వాళ్ళ అక్క రాజమండ్రికి చేరే సమయం = 6.30 + 2.గం|| = 8:30 గం||లు
ప్రశ్న 2.
మహిత వాళ్ళ అక్క మధ్యాహ్నం 3 : 00 గంటలకు బయలుదేరి 1 గం|| 45 ని॥లకు ప్రయాణించింది. ఆమె ఏ సమయానికి ఏలూరు చేరింది ?
జవాబు.
మహిళ వాళ్ళ అక్క ప్రారంభ సమయం = 3:00 గం||లు
ప్రయాణించిన దూరం = 1 గం|| 45 ని॥లు
మహిళ వాళ్ళ అక్క ఏలూరుకి చేరిన సమయం. = 4 : 45 ని॥లు
ప్రశ్న 3.
ఆమె మొత్తం ఎన్ని గంటలు ప్రయాణం చేసింది ?
జవాబు.
ఆమె మొత్తం ప్రయాణించిన దూరం = 2 : 00 + 1 : 45 = 3 గం|| : 45 ని||లు
ఇవి చేయండి: (TextBook Page No.111)
జతపరచండి.
జవాబు.
I. కింది పట్టికలో విజయవాడ స్టేషన్ కు సంబంధించిన కొన్ని రైళ్ళ రాకపోకలు ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క రైలు ప్రయాణించిన సమయాన్ని నమోదు చేయండి.
జవాబు.
అభ్యాసం 1:
ప్రశ్న 1.
12 గం||ల గడియారం చూపే సమయాన్ని బట్టి 24 గంటల సమయాన్ని తెలిపేలా డిజిటల్ గడియారంలో చూపండి. (రంగు నింపండి).
జవాబు.
ప్రశ్న 2.
కొండేపాడు పాఠశాలలో 10:45 am నుండి 3:45 pm వరకు ఆటల పోటీలు జరిగాయి. ఆటల పోటీలు జరిగిన
సమయాన్ని లెక్కించండి.
జవాబు.
పాఠశాలలో ఆటల పోటీలు జరిగిన సమయం = 10:45 am నుండి 3 : 45 pm
ఆటల పోటీలు జరిగిన సమయం = 10 : 45 – 3:45 = 7 గం॥లు
ప్రశ్న 3.
రాబర్ట్ విజయవాడ నుండి సింగపూర్‌కు 22 : 00 గం॥ సమయంలో బయలుదేరాడు. సమయాన్ని 12 గం॥ల గడియారంలో చూపండి.
జవాబు.
రాబర్ట్ విజయవాడ నుండి సింగపూర్ కు బయలుదేరిన సమయం = 22 : 00 గం||లు (24 గం||ల గడియారం పద్ధతిలో)
12 గం||ల గడియార పద్దతిలో ఈ సమయం = 22 : 00 – 12 : 00 = 10:00 p.m.
ప్రశ్న 4.
అభినవ్ ఒక పాఠశాలలో రాత్రి కాపలాదారుడుగా పనిచేయుచున్నాడు. అతడు ప్రతిరోజు 5:30 pm కు పనికి బయలుదేరితే, ఆ సమయాన్ని 24 గంటల రూపంలో చూపండి.
జవాబు.
అభినవ్ ప్రతిరోజు పనికి బయలుదేరే సమయం = 5:30 pm 24 గం||ల రూపంలో
ఈ సమయం విలువ = 12 : 00 + 5:30 pm = 17:30 గం||లు
ప్రశ్న 5.
హిమదాసు ప్రతిరోజూ 4:30 am నుండి 6:15 am వరకు మరియు 4:00 pm నుండి 5:30 pm వరకు యోగా చేస్తాడు. అయితే అతను ఎన్ని గంటలు యోగా చేస్తాడు ?
జవాబు.
మొదటిసారి ప్రాక్టీసు సమయం = 4:30 am నుండి 6.15 pm = 1:45 ని॥లు
రెండవసారి ప్రాక్టీసు సమయం = 4 : 00 am నుండి 5.30 pm = 1 : 30 గం||లు
మొత్తం యోగా ప్రాక్టీసు సమయం = 1:45 + 1:30 = 3:15 గం॥లు
ప్రశ్న 6.
బాబు బృందం కబడ్డీ ఆటను సోమవారం రోజు 6:15 am నుండి 7:05 am వరకు, మంగళవారం రోజు 3:25 pm నుండి 4:15 pm వరకు సాధన చేసింది. రెండు రోజులకు గాను ఎంత సమయం పాటు ప్రాక్టీసు చేశారు?
జవాబు.
సోమవారం రోజు ప్రాక్టీసు సమయం = 6:15 am నుండి 7 : 05 am
= 7:05 – 6:15 = 50 ని॥లు
మంగళవారం రోజు ప్రాక్టీసు సమయం = 3:25 pm నుండి 4 : 15 pm
= 4:15 – 3:25 = 50 ని॥లు
మొత్తం ప్రాక్టీసు చేసిన సమయం = 50 + 50 = 100 ని॥లు (రోజుకు)
ప్రశ్న 7.
ఒక బస్సు 11:20 am కు టర్మినల్ నుండి బయలుదేరి 2:40 pm కు గమ్యస్థానానికి చేరితే ఎన్ని గంటలు’ ప్రయాణం చేసినట్లు ?
జవాబు.
బస్సు బయలుదేరిన సమయం = 11 : 20 am బస్సు
గమ్యస్థానమునకు చేరిన సమయం = 2:40 pm బస్సు
ప్రయాణం చేసిన సమయం = 14 : 40 – 11 : 20 = 3:20 గం||లు
ప్రశ్న 8.
స్నేహ 4:30 pm కు ఇంటిపని మొదలుపెట్టి 80 ని॥ల పాటు చేసింది. ఆమె ఏ సమయానికి పూర్తిచేసింది?
జవాబు.
స్నేహ ఇంటిపని మొదలు పెట్టిన సమయం = 4 : 30 pm
పనిచేసిన సమయం = 80 ని॥లు = 4:30 + 30 + 50
స్నేహ ఇంటిపని పూర్తిచేసిన సమయం = 5: 50 గం॥లు.
అభ్యాసం 2:
ప్రశ్న 1.
2020 లీపు సంవత్సరం, తర్వాత వచ్చే లీపు సంవత్సరం _________
జవాబు.
2024.
ప్రశ్న 2.
2020 సంవత్సరం ముందు వచ్చిన లీపు సంవత్సరం _________
జవాబు.
2016
ప్రశ్న 3.
2300 లీపు సంవత్సరమేనా ? కారణం తెలపండి.
బి.
2300 లీపు సంవత్సరం కాదు. ఎందుకనగా ఇది శత సంవత్సరం కనుక.
ప్రశ్న 4.
ఏదైనా ఒక సంవత్సరానికి సంబంధించిన 12 నెలలలోని రోజులను కూడండి. అది లీపు సంవత్సరం కాదో తెలపండి.
జవాబు.
నేను 2019 క్యాలెండర్ ను తీసుకున్నాను. దీనిలో
జనవరి – 31,
ఫిబ్రవరి – 28,
మార్చి – 31,
ఏప్రిల్ – 30,
మే – 31,
జూన్ – 30,
జూలై – 31,
ఆగస్టు- 31,
సెప్టెంబర్ – 30,
అక్టోబర్ – 31,
నవంబర్ – 30,
డిసెంబర్ – 31.
మొత్తం రోజులు = 31 + 28 + 31 + 30 + 31 + 30 + 31 + 31 + 30 + 31 + 30 + 31
= 7 × 31 + 4 × 30 + 28
= 217+ 120 + 28 = 365
∴ 2019 లీపు సంవత్సరం కాదు.
ప్రశ్న 5.
మొరార్జీ దేశాయ్ గారు 29.02.1896 న జన్మించారు. 10.04.1995 న చనిపోయారు. ఆయన ఎన్ని పుట్టిన రోజులు జరుపుకున్నారు ?
జవాబు.
మొరార్జీ దేశాయ్ జన్మించి తేదీ = 29-02-1896
మొరార్జీ దేశాయ్ మరణించిన తేదీ = 10-04-1995
మొరార్జీ దేశాయ్ వయస్సు 99 సం||లు దేశాయ్
అతని పుట్టిన రోజును ప్రతీ 4 సం||లకు ఒకసారి చేసుకుంటారు.
1896 నుండి 1995 వరకు మధ్యన 24 లీపు సంవత్సరాలు కలవు.
కనుక దేశాయ్ అతని జీవితకాలంలో 24 . పుట్టిన రోజులు జరుపుకొని వుంటారు.
ప్రశ్న 6.
ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 22.12.1887 న జన్మించి, 26.04.1920 న మరణించారు. ఆయన జీవితకాలంలో ఎన్ని లీపు సంవత్సరాలు వచ్చి ఉంటాయి ?
జవాబు.
శ్రీనివాస రామానుజన్ పుట్టిన తేదీ = 22-12-1887
శ్రీనివాస రామానుజన్ మరణించిన తేదీ = 26-04-1920
శ్రీనివాస రామానుజన్ వయస్సు = 33 సం॥లు
33 సం॥లలో 8 లీపు సంవత్సరాలు వస్తాయి. అవి 1888, 1892, 1896, 1904, 1908, 1912, 1916, 1920.