SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 1 పూర్ణ సంఖ్యలు Review Exercise Questions and Answers.
AP State Syllabus 7th Class Maths Solutions 1st Lesson పూర్ణ సంఖ్యలు Review Exercise
ప్రశ్న1.
కింది వాక్యాలను సరైన పూర్ణ సంఖ్యతో సూచించండి.
(i) స్నేహ తన పొదుపు ఖాతాలో ₹2000 జమ చేసినది.
సాధన.
+ ₹ 2000
(ii) జలాంతర్గామి సముద్ర మట్టము నుండి 350 అడుగుల లోతులో ఉంది.
సాధన.
– 350 అడుగులు
(iii) ఎవరెస్టు శిఖరం సముద్ర మట్టము నుండి 8848 మీ. ఎత్తులో ఉంది.
సాధన.
+ 8848 మీ.
(iv) 0°C కన్నా 14 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత ఉంది.
సాధన.
– 14°C
ప్రశ్న2.
క్రింది సంఖ్యారేఖపై లేని పూర్ణసంఖ్యలను గుర్తించండి.
సాధన.
ప్రశ్న3.
క్రింది పూర్ణ సంఖ్యలను అవరోహణ మరియు ఆరోహణ క్రమంలో వ్రాయండి.
(i) -9, -1, 0, – 10, -6
సాధన.
అవరోహణ క్రమం: 0, -1, -6, -9, -10
ఆరోహణ క్రమం: -10, -9, -6, -1, 0
(ii) -6, 6, -9, 5, 10, -3
సాధన.
అవరోహణ క్రమం: 10, 6, 5, -3, -6, -9
ఆరోహణ క్రమం: -9, -6, -3, 5, 6, 10
(iii) -15, -20, -35, 0, 2
సాధన.
అవరోహణ క్రమం: 2, 0, -15, -20, -35
ఆరోహణ క్రమం: -35, -20, -15, 0, 2
ప్రశ్న4.
క్రింది వాటిని లెక్కించుము.
(i) – 2 + 3
సాధన.
– 2 + 3 = + 1
(ii) -6 + (-2)
సాధన.
– 6 + (-2) = – 8
(iii) 8 – (-6)
సాధన.
8 – (-6) = 8 + 6 = + 14
(iv) -9 + 4
సాధన.
-9 + 4 = -5
(v) – 23 – (-30)
సాధన.
– 23 – (-30) = – 23 + 30 = + 7
(vi) 50 – 153
సాధన.
50 – 153 = – 103
(vii) 71 + (-10) – 8
సాధన.
71 + (-10) – 8 = 71 + (-18) = + 53
(viii) – 30 + 58 – 38
సాధన.
– 30 + 58 – 38 = – 68 + 58 = – 10
ప్రశ్న5.
సియాచిన్ వద్ద 5 a.m ఉష్ణోగ్రత 0°C కన్నా 10°C తక్కువ ఉంది. ఆరు గంటల తర్వాత అది 14°C పెరిగినది. 11 a.m వద్ద ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
సాధన.
సియాచిన్ వద్ద 5 a.m ఉష్ణోగ్రత = – 10°C
ఆరు గంటల తర్వాత పెరిగిన ఉష్ణోగ్రత = + 14°C
∴ 11 a.m వద్ద ఉష్ణోగ్రత = (-10) + 14 = + 4°C
ప్రశ్న6.
ఒక చేప సముద్ర ఉపరితలం నుండి 16 అడుగుల లోతులో ఉంది మరియు మరొక 17 అడుగుల కిందకు వెళ్ళింది. ప్రస్తుతం సముద్ర మట్టం నుండి చేప స్థానం ఏమిటి ?
సాధన.
సముద్రమట్టం నుండి మొదట చేపగల స్థానం = -16 అడుగులు
చేప మరొక 17 అడుగులు క్రిందకు వెళితే చేప ప్రస్తుత స్థానం = (-16) + (-17) = – 33 అడుగులు
అనగా చేప ప్రస్తుతం సముద్ర మట్టం నుండి 33 అడుగుల లోతులో ఉంటుంది.
ప్రశ్న7.
ఒక ఆకుకూరల వ్యాపారి సోమవారం నాడు ₹250 లాభం, మంగళవారం నాడు ₹ 120 నష్టం మరియు బుధవారం నాడు ₹180 నష్టం పొందాడు. మూడు రోజుల తరువాత వచ్చిన మొత్తం లాభం లేదా నష్టం ఎంతో కనుగొనుము.
సాధన.
ఆకుకూరల వ్యాపారికి
సోమవారం లాభం = ₹250
మంగళవారం నష్టం = ₹120
బుధవారం నష్టం = ₹180
∴ మూడు రోజుల తర్వాత వచ్చిన మొత్తం లాభం లేదా నష్టం = + 250 + (-120) + (-180)
= 250 + (-300) = -50
∴ వ్యాపారికి మూడు రోజుల తరువాత ₹ 50 నష్టం వస్తుంది.
ప్రశ్న8.
మొదటి పటంలో రెండు పూర్ణసంఖ్యల యొక్క సంకలనం ఆధారంగా మరియు రెండో పటంలో రెండు పూర్ణసంఖ్యల వ్యవకలనం ఆధారంగా పూర్తి చేయుము.
పాదన.