SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 3 సామాన్య సమీకరణాలు Ex 3.1 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 7th Class Maths Solutions 3rd Lesson సామాన్య సమీకరణాలు Exercise 3.1
ప్రశ్న 1.
కింది గణిత ప్రవచనాలను సామాన్య సమీకరణాలుగా వ్రాయండి.
(i) x నుండి 5 తీసివేయగా ఫలితం 14.
సాధన.
x – 15 = 14.
(ii) y యొక్క 8 రెట్లకు 3 కలిపిన – 5.
సాధన.
8y + 3 = – 5
(iii) Z లో నాలుగవ వంతుకు 3 కలిపితే 7 వస్తుంది.
సాధన.
\(\frac{z}{4}\) + 3 = 7.
(iv) m యొక్క 3 రెట్ల నుండి 5ని తీసివేస్తే, మీకు 11 వస్తుంది.
సాధన.
3m – 5 = 11
(v) 2x, (x – 30) కోణాల మొత్తం లంబకోణం.
సాధన.
2x + (x – 30) = 90°
⇒ 3x – 30 = 90° (లంబకోణం = 90°)
(vi) ఒక చతురస్ర భుజం ‘a’ దీని చుట్టుకొలత 14 మీ.
సాధన.
చతురస్ర భుజం = a
∴ చతురస్ర చుట్టుకొలత = a + a + a + a
= 14 మీ.
4a = 14 మీ.
ప్రశ్న 2.
క్రింది సామాన్య సమీకరణాలను గణిత ప్రవచనాలుగా మార్చండి.
(i) m – 5 = 12
సాధన.
m నుండి 5 ను తీసివేయగా ఫలితం 12.
(ii) \(\frac{a}{3}\) = 4
సాధన.
a లో 3 వ వంతు 4.
(iii) 4x + 7 = 15
సాధన. X యొక్క 4 రెట్లకు 7 కలిపిన 15 వస్తుంది.
(లేదా)
X యొక్క 4 రెట్లు మరియు 7 ల మొత్తం 15.
(iv) 2 – 3y = 11
సాధన.
2 నుండి y యొక్క 3 రెట్లును తీసివేయగా 11 వస్తుంది.
ప్రశ్న 3.
బ్రాకెట్లలో ఇచ్చిన విలువ ఇచ్చిన సమీకరణానికి సాధనా? కాదా ? సరిచూడండి. –
(i) 5n – 7 = 23 (n = 6)
సాధన.
L.H.S = 5(6) – 7 = 30 – 7 = 23 = RHS
కావున, n = 6 సాధన అవుతుంది.
(ii) \(\frac{p}{4}\) – 1 = 5 (p = 8)
సాధన.
LHS = \(\frac{8}{4}\) – 7 = 2 – 7 = – 5 ≠ RHS
కావున, p = 8 సాధన కాదు.
(iii) 5 – 2x = 19 (x = – 7)
సాధన.
LHS = 5 – 2(- 7) = 5 + 14 = 19 = RHS
కావున, X = – 7 సాధన అవుతుంది.
(iv) 2 + 3(m – 1) = 5 (m = -2)
సాధన.
LHS = 2 + 3(- 2 – 1)
= 2 + 3(-3)
= 2 – 9 = – 7 ≠ RHS
కావున, m = – 2 సాధన కాదు.
ప్రశ్న 4.
యత్న దోష పద్ధతి ద్వారా క్రింది సమీకరణాల యొక్క సాధన కనుగొనండి.
(i) 3x – 7 = 5
సాధన.
x = 4 అయినపుడు LHS = RHS. కావున, సాధన x = 4
(ii) 5 – y = – 1
సాధన.
y = 6 అయినపుడు LHS = RHS. కావున,
సాధన y = 6