AP Inter 1st Year Accountancy Study Material Chapter 1 పుస్తక నిర్వహణ – గణకశాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Accountancy Study Material 1st Lesson పుస్తక నిర్వహణ – గణకశాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 1st Year Accountancy Study Material 1st Lesson పుస్తక నిర్వహణ – గణకశాస్త్రం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అకౌంటింగ్ లాభాలను, పరిమితులను వివరించండి.
జవాబు:
నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన సమాచారము తెలియజేయడానికి, వాటిని ఉషయోగించేవారి కోసం ఆ వ్యవహారములు, సంఘటనలను నమోదు చేసి, వర్గీకరించి, సంక్షిప్తపరిచే ప్రక్రియను అకౌంటింగ్ అంటారు.
అకౌంటింగ్ వలన లాభాలు:
1. శాశ్వతమైన విశ్వసనీయమైన నమోదు: మానవ మేధస్సు గుర్తుంచుకోవడానికి సాధ్యము కాని అసంఖ్యాక వ్యాపార సంస్థ ఆర్థిక కార్యకలాపములు నమోదు చేసి అవసరమైన వ్యక్తులకు విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తుంది.

2. ఆర్థిక ఫలితాలు: నిర్దిష్ట కాలములో సంస్థ ఆర్జించిన లాభము లేదా నష్టము కనుక్కోవడానికి అకౌంటింగ్
సహాయపడుతుంది.

3. ఆర్థిక పరిస్థితి: కేవలము లాభనష్టాలను వెల్లడించడమే కాక, సంస్థ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. దీనివలన సంస్థలు తమ వనరుల ఆధారముగా భవిష్యత్ వ్యాపార ప్రణాళికలు తయారుచేసుకోవచ్చు.

AP Inter 1st Year Accountancy Study Material Chapter 1 పుస్తక నిర్వహణ – గణకశాస్త్రం

4. సరిపోల్చుకోవడానికి: సంస్థ కార్యకలాపాలు లేదా వస్తు ఉత్పాదనలో ఏవి లాభదాయకమైనవో తెలుస్తుంది. దీనివలన భవిష్యత్తులో ఏఏ కార్యకలాపాలు కొనసాగించాలి, ఏఏ వస్తువుల ఉత్పాదన జరపాలో తెలుసుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించిన లాభాలు, అమ్మకాలు, ఖర్చులు గత సంవత్సరం ఫలితాలతో పోల్చుకొని అవసరమైన సర్దుబాట్లు చేసుకోవచ్చు.

5. నియంత్రణ: సంస్థలు వ్యాపార కార్యకలాపాలు కొనసాగించే క్రమములో సేకరించిన భూములు, భవనాలు, యంత్రాలు మొదలైన “ఆస్తులు సమర్థవంతంగా నియంత్రించడానికి, వాటి సక్రమ వినియోగానికి సహాయపడుతుంది.

అకౌంటింగ్ పరిమితులు:
1. ద్రవ్య సంబంధ వ్యవహారాల నమోదు: అకౌంటింగ్ కేవలం ద్రవ్య సంబంధమైన వ్యవహారాలను మాత్రమే నమోదు చేస్తుంది. ఇది గుణాత్మకమైన అంశాలు అయిన మానవ వనరులు, నైపుణ్యం, యాజమాన్య సామర్థ్యము మొదలైన వాటిని పరిగణలోకి తీసుకోవు.

2. చారిత్రాత్మక స్వభావము: వ్యవహారము జరిగిన తేదీ నుంచి ఖాతా పుస్తకాలలో వ్రాయడం జరుగుతుంది. వ్యవహారాలకు సంబంధించిన భవిష్యత్ అంచనాలు, విలువలను రికార్డు చేయరు.

3. ధరల మార్పులు: ధరల స్థాయిలో వచ్చే మార్పులు, ప్రస్తుత విలువలు ఆర్థిక ఖాతాలలో ప్రతిబింబించవు. 4. వాస్తవిక పరిస్థితులను తెలియజేయలేదు: అకౌంటెంట్ పక్షపాత ధోరణి సంస్థల వార్షిక ఖాతాలను ప్రభావితం చేయడానికి అవకాశమున్నది. అందువలన వాస్తవిక పనితీరును, ఆర్థిక పరిస్థితులను అంచనా వేయలేరు.

ప్రశ్న 2.
అకౌంటింగ్, బుక్ కీపింగ్ మధ్య ఉన్న వ్యత్యాసాలు తెలపండి.
జవాబు:
బుక్ కీపింగ్, అకౌంటింగ్ మధ్య దిగువ వ్యత్యాసాలు ఉన్నవి.
AP Inter 1st Year Accountancy Study Material Chapter 1 పుస్తక నిర్వహణ – గణకశాస్త్రం 1
AP Inter 1st Year Accountancy Study Material Chapter 1 పుస్తక నిర్వహణ – గణకశాస్త్రం 2

AP Inter 1st Year Accountancy Study Material Chapter 1 పుస్తక నిర్వహణ – గణకశాస్త్రం

ప్రశ్న 3.
అకౌంటింగ్ ప్రక్రియలో ఉన్న దశలను వివరించండి.
జవాబు:
పరిజ్ఞానము గల సిబ్బంది అవసరము.
అకౌంటింగ్ ప్రక్రియలో వ్యాపార వ్యవహారాలను గుర్తించడము, నమోదు చేయడము, వర్గీకరించడము, సంక్షిప్తపరచడము, నివేదన, విశ్లేషణ, వివరణ ఇవ్వడం మొదలైన దశలుంటాయి.

1. గుర్తించడము: సంబంధిత ఫలితాల ఆధారముగా వ్యాపార వ్యవహారాలను గుర్తించాలి.

2. నమోదు చేయడము: వ్యాపార వ్యవహారాలు జరిగిన వెంటనే శాస్త్రీయముగా, ఒక క్రమ పద్ధతిలో చిట్టా మరియు సహాయక చిట్టాలలో నమోదు చేయవలెను.

3. వర్గీకరించడము: నమోదు చేసిన వ్యాపార వ్యవహారములను వర్గీకరించి, ఒకే స్వభావము కలిగిన వ్యవహారాలను ప్రత్యేక ఆవర్జాలో ఒకే శీర్షిక కింద చూపవలెను. ఖాతాల మొత్తాలను, నిల్వలను కనుగొనవలెను.

4. సంక్షిప్తపరచడం: ఖాతాల నిల్వల ఆధారముగా అంకణాను తయారు చేయడం జరుగుతుంది. 5. నివేదించుట: అంకణా సహాయముతో లాభనష్టాల ఖాతాను ఆస్తి-అప్పుల పట్టికను తయారుచేసి, ఆ ఆర్థిక నివేదికలను అవసరమైన వ్యక్తులకు అందజేయవలసి ఉంటుంది.

6. విశ్లేషణ: లాభనష్టాల ఖాతా, ఆస్తి-అప్పుల పట్టికలోని వివిధ అంశాల మధ్య సంబంధాన్ని నెలకొని విశ్లేషణ చేయడము వలన వ్యాపార సంస్థ ఆర్థిక పటిష్టతను, లోపాలను తెలుసుకొనవచ్చును. ఈ సమాచారము భవిష్యత్తులో ఒక అంశాన్ని మరొక అంశముతో పోల్చడానికి పనికి వస్తుంది. అంతేగాక వ్యాపార సంస్థకు చెందిన వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది.

7. వివరణ: యాజమాన్యము, నిర్వాహకులు నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా అకౌంటింగ్ సమాచారము విశ్లేషణ ద్వారా నెలకొల్పిన సంబంధాల అర్థాన్ని, ప్రాముఖ్యతను వివరించడం జరుగుతుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బుక్ కీపింగ్ అంటే ఏమిటి ?
జవాబు:
సంస్థ ఆర్థిక వ్యాపార వ్యవహారములను ఒక నిర్దిష్టమైన క్రమపద్దతిలో కాలానుక్రమముగా వ్రాసే ప్రక్రియను బుక్ కీపింగ్ అంటారు. ద్రవ్య సంబంధమైన వ్యాపార వ్యవహారాలు మాత్రమే గణకశాస్త్రము రికార్డు చేస్తుంది. అన్ని వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన శాశ్వతమైన రికార్డును రూపొందించడానికి బుక్ కీపింగ్ తోడ్పడుతుంది. బుక్ కీపింగ్ను ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చును.

ద్రవ్య లేదా ద్రవ్యముతో సమానమైన వ్యాపార వ్యవహారములను శాస్త్రీయ పద్ధతిలో వ్యాపారసంస్థ వ్రాసే ప్రక్రియ లేదా కళనే బుక్ కీపింగ్ అంటారు.

ప్రశ్న 2.
అకౌంటింగ్ను నిర్వచించండి.
జవాబు:
రికార్డు చేసిన వ్యవహారాలను సంక్షిప్తపరచి, వర్గీకరణ చేసి, ఫలితాలను నివేదించటాన్ని అకౌంటింగ్ అనవచ్చు. – కార్టర్

వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి వ్యక్తులకు ఈ ఆర్థిక సమాచారము, నివేదికలు ఎంతో ఉపయోగపడతాయి. అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్ వారి నిర్వచనము ప్రకారము “అకౌంటింగ్ అంటే ఆర్థిక సమాచారాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని గుర్తించి, కొలిచి తెలియజేసే ప్రక్రియ”. అమెరికన్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ సంస్థ అకౌంటింగ్ను ఈ విధంగా నిర్వచించినది “పూర్తిగా గాని, కొంతమేరకు అయినా గాని ఆర్థిక సంబంధమున్న వ్యవహారాలను శాస్త్రీయ పద్ధతిలో నమోదు చేసి, వర్గీకరించి, సంక్షిప్తపరచి, వ్యాపార నిర్వాహకులకు, యజమానులకు వాటి ఫలితాలను వివరించే కళ గణకశాస్త్రము”.

AP Inter 1st Year Accountancy Study Material Chapter 1 పుస్తక నిర్వహణ – గణకశాస్త్రం

ప్రశ్న 3.
అకౌంటింగ్ చక్రం అంటే ఏమిటి ?
జవాబు:
‘అకౌంటింగ్ చక్రం అనేది వ్యాపార వ్యవహారములు నమోదు చేయడముతో ప్రారంభమై ఆర్థిక నివేదికలు |తయారు చేయడముతో ముగిసే ప్రక్రియ.
అకౌంటింగ్ చక్రములో ఈ క్రింది దశలు ఉంటాయి.

  1. చిట్టాలో నమోదు చేయడము
  2. ఆవర్జాలో నమోదు చేయడము
  3. ఖాతాల నిల్వలను తేల్చడం
  4. అంకణా తయారుచేయడము
  5. లాభనష్టాల ఖాతా తయారుచేయడము
  6. అప్పుల పట్టిక తయారుచేయడము