Andhra Pradesh BIEAP AP Inter 1st Year Accountancy Study Material 10th Lesson అంకణా Textbook Questions and Answers.
AP Inter 1st Year Accountancy Study Material 10th Lesson అంకణా
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
అంకణా అంటే ఏమిటి ? దానిని ఏ విధంగా తయారుచేస్తారు ?
జవాబు:
సంవత్సరాంతాన ముగింపు లెక్కలు తయారుచేయడానికి ముందు ఆవర్జా ఖాతాల నిల్వల అంకగణితపు ఖచ్ఛితాన్ని ఋజువు చేసుకోవడానికి తయారుచేసే పట్టికను అంకణా అంటారు. అంకణా ముగింపు లెక్కలు, ఆవర్జా ఖాతాలను కలిపే ఒక లింక్ లాంటిది.
అంకణాను తయారుచేసే ముందు దిగువ విషయాలను గుర్తుంచుకొనవలసి ఉంటుంది.
- అంకణాను ఒక నిర్దిష్ట తేదీన తయారుచేస్తారు. కాబట్టి ఆ తేదీని అంకణా హెడ్డింగ్లో చూపాలి.
- శీర్షికతో అంకణా నమూనాను గీయవలెను.
- అంకణా ఒక నివేదిక అయినందున, దీనిని To మరియు By అనే పదాలు వాడకూడదు. అంకణాలో క్రమసంఖ్య, ఖాతా పేరు, ఆవర్జా పుట సంఖ్య, డెబిట్ మరియు క్రెడిట్ నిల్వలు ఉంటాయి.
- అన్ని ఆస్తుల ఖాతాలు, ఖర్చుల ఖాతాలు, నష్టాలకు సంబంధించిన ఖాతాలు, కొనుగోలు ఖాతా మరియు అమ్మకాల వాపసుల ఖాతా డెబిట్ నిల్వను చూపుతాయి.
- అన్ని అప్పుల ఖాతాలు, ఆదాయాలు లాభాలకు సంబంధించిన ఖాతాలు, రిజర్వులు, ఏర్పాట్లు, అమ్మకాలు మరియు కొనుగోలు వాపసుల ఖాతా క్రెడిట్ నిల్వను చూపుతాయి. అంకణాలో డెబిట్ నిల్వను చూపే ఖాతాలను డెబిట్ వైపు, క్రెడిట్ నిల్వను చూపే ఖాతాలను క్రెడిట్ వైపు చూపాలి.
- అంకగణిత ఖచ్చితమును రుజువు చేసేందుకు అంకణాలో డెబిట్ నిల్వల మొత్తము క్రెడిట్ నిల్వలతో సరిపోవాలి.
ప్రశ్న 2.
అంకణా లాభనష్టాలను వివరించండి.
జవాబు:
అంకణా వలన లాభాలు :
- అంకణా ద్వారా ఆవర్జాలోని ఖాతాల అంకగణితపు ఖచ్చితాన్ని కనుగొనుటకు సహాయపడుతుంది.
- అంకణా ఆధారముగా వర్తకపు, లాభనష్టాల ఖాతా మరియు ఆస్తి-అప్పుల పట్టికను తయారుచేయవచ్చు.
- వ్యవహారాల నమోదులో దొర్లిన పొరపాట్లను, తప్పులను గుర్తించడానికి తోడ్పడుతుంది.
- అంకణా ద్వారా అన్ని ఖాతాల నిల్వలు ఒకేచోట కనుగొనటానికి సహాయపడుతుంది.
అంకణా వలన నష్టాలు :
- ఖాతా పుస్తకాలలో తప్పులు ఉన్నప్పటికి అంకణా డెబిట్, క్రెడిట్ మొత్తాలు సరిపోవచ్చు.
- జంటపద్దు విధానాన్ని అవలంబిస్తున్న సంస్థలు మాత్రమే అంకణామ తయారుచేయగలుగుతాయి. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది మరియు ఎక్కువ సమయము కావలెను.
- కొన్ని వ్యవహారాలను నమోధు చేయనప్పటికి, అంకణా సమానత్వానికి భంగము కలగదు.
- అంకణాను క్రమపద్ధతిలో తయారు చేయనపుడు, దాని మీద ఆధారపడి ముగింపు లెక్కలను తయారుచేసినపుడు, సంస్థ యొక్క నిజమైన ఆర్థిక పరిస్థితి వెల్లడి కాకపోవచ్చును.
లఘు సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
అంకణాను నిర్వచించండి.
జవాబు:
జె.ఆర్. బాట్లిబాయ్ ప్రకారము “ఖాతా పుస్తకాల అంకగణిత ఖచ్చితాన్ని రుజువు చేసే నిమిత్తము ఖాతాల డెబిట్, క్రెడిట్ నిల్వలతో తయారుచేసిన నివేదికయే అంకణా”.
కార్టర్ ప్రకారము “అంకణా అనేది ఆవర్జా ఖాతాల నుంచి తీసుకున్న డెబిట్, క్రెడిట్ నిల్వల జాబితా. అంతేకాకుండా అంకణాలో నగదు పుస్తకము నుంచి గ్రహించిన నగదు, బ్యాంకు నిల్వలు కూడా చేర్చబడి ఉంటాయి”.
స్పెసర్ సెగ్లర్ అభిప్రాయములో ఆవర్జా ఖాతాల నిల్వలు, నగదు నిల్వ బ్యాంకు నిల్వ సహాయముతో తయారుచేయబడిన జాబితాను అంకణా అనవచ్చు.
ప్రశ్న 2.
అంకణా నమూనా తెలపండి.
జవాబు:
అంకణా నమూనా దిగువ విధముగా ఉంటుంది.
ప్రశ్న 3.
అంకణా ధ్యేయం తెలపండి.
జవాబు:
అంకణాను ఈ క్రింది ధ్యేయాల నిమిత్తం తయారుచేస్తారు.
- ఇది ఖాతా పుస్తకాల నిల్వల జాబితా. దీనిలో నగదు పుస్తకము నిల్వలు కూడా ఉంటాయి. ముగింపు లెక్కలను తయారు చేయడానికి ఇది తోడ్పడుతుంది.
- అంకణా తయారుచేయడంలో ముఖ్య ఉద్దేశ్యము లెక్కలలోని అంకగణితపు ఖచ్చితాన్ని రుజువు చేసుకోవడం.
- అంకణా సహాయముతో ఖాతాల నిల్వలను రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలతో పోల్చి చూడవచ్చును.
- ఏ ఆవర్జా ఖాతా నిల్వ అయినా అవసరమైనపుడు తేలికగా కనుగొనవచ్చును.
ప్రశ్న 4.
అంకణా తయారుచేసే పద్ధతులను వివరించండి.
జవాబు:
అంకణాను రెండు పద్ధతులలో తయారుచేస్తారు. 1. మొత్తాల పద్ధతి 2. నిల్వల పద్ధతి.
1) మొత్తాల పద్ధతి : ఆవర్జాలోని ప్రతి ఖాతా డెబిట్, క్రెడిట్ వరుసలు విడివిడిగా కూడి అంకణాను తయారుచేసే పద్ధతిని మొత్తాల పద్ధతి అంటారు. ఈ పద్ధతి ప్రకారము ఆవర్జా ఖాతాలోని డెబిట్ మొత్తాన్ని, క్రెడిట్ మొత్తాన్ని కూడాలి. అయితే ఈ పద్ధతి ప్రస్తుతము వాడుకలో లేదు.
2) నిల్వల పద్ధతి : ఇది బాగా వాడుకలో ఉన్న పద్ధతి. ఈ పద్ధతిలో ప్రతి ఆవర్జాలోని ఖాతా నిల్వను తీసుకుంటారు. అంకణాలో డెబిట్ నిల్వను డెబిట్వైపు, క్రెడిట్ నిల్వను క్రెడిట్వైపు చూపుతారు. ఈ రెండు వరుసల మొత్తాలు సమానముగా ఉంటే, అంకగణిత దోషాలు లేవని చెప్పవచ్చును.
TEXTUAL PROBLEMS
ప్రశ్న 1.
కింద ఇచ్చిన నవీనా ఖాతాల నిల్వల నుంచి డిసెంబర్ 2013 నాటి అంకణా తయారుచేయండి.
సాధన.
డిసెంబర్ 2013 నాటి నవీనా అంకణా
ప్రశ్న 2.
కింద ఇచ్చిన స్వాతి పుస్తకాల నిల్వల నుంచి 31 మార్చి 2013 నాటి అంకణా తయారుచేయండి.
సాధన.
31 మార్చి 2013 నాటి స్వాతి అంకణా
ప్రశ్న 3.
అనుభవం లేని గణకుడు తయారుచేసిన అంకణా కింది ఇవ్వడమైంది. సవరించిన అంకణా తయారు చేయండి.
సాధన.
సవరించిన అంకణా
ప్రశ్న 4.
రుత్విక్ ఖాతా పుస్తకాల నుంచి సేకరించిన నిల్వల నుంచి 31-03-2013 నాటి అంకణా తయారు చేయండి.
సాధన.
31-03-2013 నాటి రుత్విక్ అంకణా
ప్రశ్న 5.
కింద ఇచ్చిన వివరాల నుంచి 31.12.2013 నాటి హర్షిణి అంకణా తయారుచేయండి.
సాధన.
31-12-2013 నాటి హర్షిణి అంకణా
ప్రశ్న 6.
31.8.2013 న సరసు పుస్తకాల నుంచి కింది నిల్వలు తీసుకోవడమైంది వాటి నుంచి అంకణా తయారుచేయండి.
సాధన.
31-08-2013 నాటి సరసు అంకణా
ప్రశ్న 7.
31.01.2014 నాటి వర్షిణి ఖాతా పుస్తకాల నిల్వల నుంచి అంకణా తయారుచేయండి.
సాధన.
31-01-2014 నాటి వర్షిణి అంకణా
ప్రశ్న 8.
31.12.2013 నాటి రేనిష్ అంకణా తయారుచేయండి. `
సాధన:
31-12-2013 నాటి రేనిష్ అంకణా
n
ప్రశ్న 9.
31.12.2013 నాటి మానస్ అంకణా తయారుచేయండి.
సాధన.
31-12-2013 నాటి మానస్ అంకణా
ప్రశ్న 10.
కింద ఇచ్చిన మృదుల పుస్తకాల నిల్వల నుంచి 31.12.2013 నాటి అంకణా తయారుచేయండి.
సాధన.
31-12-2013 నాటి మృదుల అంకణా
ప్రశ్న 11.
31.12.2013 న ఉన్న ప్రఫుల్ల అంకణా తయారుచేయండి.
సాధన.
31-12-2013 నాటి ప్రఫుల్ల అంకణా
ప్రశ్న 12.
కింద ఇచ్చిన నిల్వల నుంచి 31.12.2013 న ఉన్న సుచిత్ర అంకణా తయారుచేయండి.
సాధన.
31-12-2013 నాటి సుచిత్ర అంకణా
ప్రశ్న 13.
కింద ఇచ్చిన నిల్వల నుంచి రాధా అంకణా తయారుచేయండి.
సాధన.
31-12-2013 నాటి రాధా అంకణా
ప్రశ్న 14.
కింది నిల్వల నుంచి స్నిగ్ధ అంకణా తయారుచేయండి.
సాధన.
స్నిగ్ధ అంకణా
ప్రశ్న 15.
కింది వివరాల నుంచి 31-03-2010 నాటి నైమిష అంకణా తయారుచేయండి.
సాధన.
అభ్యాసము 11ను చూడండి.
ప్రశ్న 16.
రోహిత అంకణా తయారుచేయండి.
సాధన.
రోహిత అంకణా
ప్రశ్న 17.
31-03-2013 నాటి సుస్మిత అంకణా తయారుచేయండి.
సాధన.
31.03.2013 నాటి సుస్మిత అంకణా
ప్రశ్న 18.
కింద ఇచ్చిన వివరాల నుంచి సుధ అంకణా తయారుచేయండి.
సాధన.
సుధ అంకణా
గమనిక : ప్రారంభ సరుకు 10,000, కొనుగోళ్ళు 20,000 తప్పుగా ఇవ్వడమైనది. ఇవి 19వ లెక్కకు సంబంధించినవి.
ప్రశ్న 19.
కింద ఇచ్చిన వివరాల నుంచి భారతి అంకణా తయారుచేయండి.
సాధన.
భారతి అంకణా
TEXTUAL EXAMPLES
ప్రశ్న 1.
కింద ఇచ్చిన నిల్వల నుంచి జూన్ 30, 2013 నాటి కుషాల్ అంకణా తయారుచేయండి.
సాధన.
జూన్ 30, 2013 నాటి కుషాల్ అంకణా
ప్రశ్న 2.
సంధ్యారాణి ఖాతా పుస్తకాల నుంచి తీసుకొన్న నిల్వల నుంచి 31 మార్చి 2007, నాటి అంకణా తయారు చేయండి.
సాధన.
31 మార్చి 2007 నాటి సంధ్యారాణి అంకణా
గమనిక : అంకణాలో ముగింపు సరుకు చూపరాదు, కారణం దాన్ని ఖాతాలోకి తీసుకోలేదు.
ప్రశ్న 3.
అనుభవం లేని గణకుడు తయారుచేసిన అంకణా కింద ఇవ్వడమైంది. దాని నుంచి సరియైన అంకణా తయారుచేయండి.
సాధన.
సరిచేసిన అంకణా