AP Inter 1st Year Botany Notes Chapter 10 జీవ అణువులు

Students can go through AP Inter 1st Year Botany Notes 10th Lesson జీవ అణువులు will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 10th Lesson జీవ అణువులు

→ జీవకణాలలోనైనా భూ పటలంలో కంటే అధికంగా కర్బనం ఉదజని ఉంటాయి.

→ సజీవ కణజాలాల నుంచి లభించే అన్ని కర్బన సమ్మేళనాలను జీవాణుద్రలు అంటారు.

→ సజీవ కణజాలంలో అమైనో ఆమ్లాలు, న్యూక్లియోటైడ్ క్షారాలు కొవ్వుఆమ్లాలు ఉంటాయి.

→ అమైనో ఆమ్లాలు ఒక అమైనోగ్రూప్, ఒక ఆమ్ల గ్రూప్/కార్బోక్సిలిక్ గ్రూప్ రెండు ఒకే QL – కార్టన్ మీద కలిగి ఉన్న కర్బన సమ్మేళనాలు కనుక వీటిని QC – అమైనో ఆమ్లాలు అంటారు.

→ అమైనో, కారక్సిల్ గ్రూప్ సంఖ్యను అనుసరించి ఇవి ఆమ్ల (ఉదా : గుటామిక్ ఆమ్లము) క్షార (లైసిన్) తటస్థ (వాలిన్) స్వభావాన్ని కలిగి ఉంటాయి.

→ లిపిడ్లు సాధారణంగా నీటిలో కరగవు.

→ లిపిడ్లు కొవ్వు ఆమ్లాలు, గ్లైకోలిపిడ్లు మరియు ఫాస్ఫోలిపిడ్లు రూపంలో ఉంటాయి.

→ అడినిన్, గ్వానిన్, సైటోసిన్, యురాసిల్ మరియు థైమిన్లను నత్రజని క్షారాలు అంటారు.

→ ఎడినిలిక్ ఆమ్లం, థెమిడిలిక్ ఆమ్లం, గ్వాని కామ్లం యురిడిలిక్ ఆమ్లము, సైటిడిలిక్ ఆమ్లములను న్యూక్లియోటైడ్లు అంటారు.

AP Inter 1st Year Botany Notes Chapter 10 జీవ అణువులు

→ అమైనో ఆమ్లాలు, చక్కెరలు ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు

→ ఆల్కలాయిడ్లు, ఫ్లావానాయిడ్లు, రబ్బరు, యాంటీబయోటిక్స్, జిగురులు ద్వితీయా జీవక్రియోత్పన్నాలు

→ 1000 డాల్టన్ల కన్నా తక్కువ అణుభారం కల అణువులను సూక్ష్మ అణువులు అంటారు.

→ ఆమ్ల అద్రావణీయ భాగంలో ఉన్న బృహదణువులను స్థూల అణువులు లేదా జీవ బృహదణువులు అంటారు.

→ ప్రోటీన్లు పొలిపెప్టైడు, వీటిలో గల అమైనో ఆమ్లాలు ఒక సరళ శృంఖలంలో ఒకదానితో ఒకటి కలపబడి ఉంటాయి.

→ మనం తినే ప్రోటీన్లు ద్వారా అవశ్యక అమైనో ఆమ్లాలు లభిస్తాయి.

→ కొల్లాజెన్ జంతు ప్రపంచంలో అత్యంత సమృద్ధిగా ఉండే ప్రోటీను RUBISCO సమస్థ జీవావరణంలోనే అత్యంత సమృద్దిగా ఉన్న ప్రోటీను.

→ పాలిశాఖరైడ్లు చక్కెరతో కలిసి ఏర్పడిన పొడవైన గొలుసులు.

→ సెల్యులోస్ ఒక సమజాతీయ బహ్వణువు. ఉదా : పత్తిదారం

→ న్యూక్లియోటైడ్ అనేది కేంద్రకామ్లంలోని నిర్మాణ ప్రమాణం.

→ న్యూక్లియోటైడ్లో నత్రజని క్షారము, చక్కెర, ఫాస్ఫేట్ అణువు ఉంటాయి.

→ ప్రోటీన్లులో ఏ అమైనో ఆమ్లం మొదటిది. ఏది రెండవది అనే సమాచారాన్ని ప్రోటీను ప్రాథమిక నిర్మాణము అంటారు.

→ ప్రోటీను పోగులలో వేర్వేరు విధాలుగా మడతలు పడిన, దానిని ద్వితీయ నిర్మాణం అంటారు.

→ పొడవైన ప్రోటీనుగొలుసు దానిమీద అదే మడతలు పడి ఒక డొల్లగా ఉన్న ఊలు బంతి వంటి తృతీయ నిర్మాణంగా ఏర్పడుతుంది.

→ ప్రోటీనులో అమైనోఆమ్లాలు పెప్టైడ్ బంధాలతో ఉంటాయి. పాలిశాఖరైడ్లో మోనోశాఖరైడ్లు గ్లైకోసైడిక్ బంధాలతో ఉంటాయి.

AP Inter 1st Year Botany Notes Chapter 10 జీవ అణువులు

→ DNA ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. ఉదా : వాట్సన్ క్రిక్ నమూనా

→ ప్రతి రసాయన చర్య – ఒక ఉత్ప్రేరకచర్య.

→ జీవవ్యవస్థలో ముఖ్యమైన శక్తి రూపము = ATP.

→ ATP : అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, సాధారణంగా శక్తి ద్రవ్య రూపంగా వర్ణించబడుతుంది.

→ బయో ఎనర్జిటిక్స్ : జీవకణాల్లో శక్తి పరివర్తనాల అధ్యయనం

→ బయోమాక్రోమోలిక్యూల్స్ : జీవకణజాలాల్లోని ఆమ్ల అద్రావణీయతగల, అధిక అణుభారం కలిగిన పదార్థాలు.

→ జీవాణువులు : జీవకణాజాలాల నుంచి లభించే సమస్త కర్బన సమ్మేళనాలు.

→ ఆవశ్యక అమైనో ఆమ్లాలు : ఆహారం ద్వారా సరఫరా చేయబడే, ఆరోగ్యానికి అవసరమైన ఆమ్లాలు.

→ గ్లైకోసైడిక్ బంధం : పక్క పక్క నుండే చక్కెర అణువులలోని కార్బన్ల మధ్య ఉండే రసాయన బంధం.

→ జీవక్రియ : ఒక జీవి శరీరంలో జరిగే అన్ని రసాయనిక చర్యలను కలిపి జీవక్రియగా పేర్కొంటారు. సరళమైన అణువుల నుంచి సంక్లిష్టమైన అణువులు ఏర్పడే నిర్మాణాత్మక జీవక్రియను నిర్మాణక్రియ (anabolism) అంటారు. సంక్లిష్టమైన అణువులు సరళమైన అణువులుగా విడగొట్టబడే విచ్ఛిన్న జీవక్రియను విచ్ఛిన్న క్రియ (catabolism) అని అంటారు.

→ కేంద్రకామ్లాలు : న్యూక్లియోటైడ్ల బహ్వణువులు.

→ పెప్టైడ్ బంధం : ప్రొటీన్లలోని రెండు అమైనో ఆమ్లాల మధ్యగల బంధం.

→ పాలిశాఖరైడ్లు : చక్కెర అణువుల పొడవైన జీవ బహ్వణువు శృంఖల.

→ ద్వితీయ జీవక్రియోత్పన్నాలు : అతిథేయిలో చెప్పుకోదగ్గ విధులు లేని జీవక్రియ ఉత్పన్నాలు.

→ తృతీయ నిర్మాణ ప్రోటీన్లు జీవక్రియలకి ఆవశ్యకమైన త్రిమితీయ ప్రోటీన్ నిర్మాణం.