AP Inter 1st Year Botany Notes Chapter 9 కణం: జీవప్రమాణం

Students can go through AP Inter 1st Year Botany Notes 9th Lesson కణం: జీవప్రమాణం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 9th Lesson కణం: జీవప్రమాణం

→ ఏక కణజీవులు స్వతంత్ర ఉనికిని కలిగి ఉంటాయి. ఆవశ్యక జీవ క్రియలన్నింటినీ నిర్వర్తించగలవు.

→ ఆంటానా వాన్ లీవన్ హాక్, సజీవ కణాన్ని గుర్తించారు.

→ ప్లీడన్ మరియు ష్వాన్లు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

→ ఆర్. విర్షా కణ సిద్ధాంతంను, జీవులన్ని కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడ్డాయని, అన్ని కణాలు అంతకు పూర్వము ఉన్న కణాల నుంచి పడతాయని వివరించారు.

→ మైకోప్లాస్మాలు అతి చిన్నవిగా, 0.3 μm ఉంటాయి.

→ ఆస్ట్రిచ్ పక్షి స్త్రీ బీజము అతి పెద్ద కణము.

→ కేంద్రక పూర్వ కణాలలో బాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు, మైకోప్లాస్మా PPLO లు కలవు.

→ బాక్టీరియాలు కోకస్ (గుండ్రము), బాసిల్లస్ (దండాకారము) విబ్రియో (కామా) మరియు స్ట్పైరిల్లమ్ (సర్పిలాకారం)లలో ఉంటాయి.

→ కేంద్రక పూర్వకణాలలో కేంద్రక త్వచంలేని కేంద్రకం ఉంటుంది.

→ 2 కేంద్రక పూర్వ కణాలలో జన్యు పదార్థాన్ని న్యూక్లియాయిడ్ అంటారు.

AP Inter 1st Year Botany Notes Chapter 9 కణం: జీవప్రమాణం

→ 2 కేంద్రక పూర్వ కణాలలో న్యూక్లియాయిడ్ కాకుండా, జీనోయేతర DNA లు ఉంటాయి. వాటిని ప్లాస్మిడ్లు అంటారు.

→ బాక్టీరియల్ కశాభంలో, ఫిలమెంట్, కొక్కెము, పీఠదేహము ఉంటాయి.

→ బాక్టీరియా ఉపరితలంపై ఫిలి, ఫింబ్రియాలు ఉంటాయి.

→ కేంద్రక పూర్వ కణాలలో 705 రైబోసోమ్లు ఉంటాయి.

→ కేంద్రక పూర్వ కణాలలో నిల్వ ఆహారములు పాలీ/3 హైడ్రాక్సి బ్యుటిరేట్ రూపంలో లేక గ్లైకోజన్ రేణువుల రూపంలో ఉంటాయి.

→ నిజకేంద్రక కణాలలో నిర్దిష్ట కేంద్రకం ఉంటుంది.

→ నిజకేంద్రక కణాలలో ప్లాస్మాపొర వెలుపల, నిర్జీవ రక్షణ పొర అయిన కణ కవచం ఉంటుంది.

→ కణ కవచం సెల్యులోస్, హెమిసోల్యులోస్, పెక్టిన్, ప్రోటీనులతో నిర్మితము.

→ అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టము, లైసోసోమ్లు, రిక్తికలను అంతరత్వచ వ్యవస్థ అంటారు.

→ రైబోసోమ్లు కల అంతర్జీవ ద్రవ్య జాలమును గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అంటారు.

→ కణ కవచ పదార్థాల తయారీలో పాల్గొనే కణాంగము గాల్జి సంక్లిష్టము.

→ కణ విచ్ఛిత్తికి దారితీసే కణాంగము – లైసోసోమ్.

→ రిక్తికలు కణ ద్రవాభిసరణ చర్యలను నియంత్రిస్తాయి.

→ మైటోకాండ్రియాలు వాయుసహిత శ్వాసక్రియ ప్రదేశాలు.

→ కార్బోహైడ్రేటులను నిల్వచేయు శ్వేతరేణువులను అమైలోప్లాస్ట్లు అని, ప్రోటీనులను నిల్వచేయు శ్వేతరేణువులను అల్యురోప్లాస్ట్లు అని, కొవ్వులు, నూనెలను నిల్వచేయు శ్వేతరేణువులను ఇలియోప్లాస్ట్లు అని అంటారు.

AP Inter 1st Year Botany Notes Chapter 9 కణం: జీవప్రమాణం

→ హరితరేణువులు కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి.

→ నిజకేంద్రక కణాలలో 80 S రైబోసోమ్లు ఉంటాయి.

→ కణవిభజనలో సెంట్రియోలు కండెపరికరం ఏర్పాటులో పాల్గొంటాయి.

→ కేంద్రకం, కణ మేధస్సు, కణంలోని అన్ని జీవక్రియలను నియంత్రిస్తుంది.

→ క్రొమాటిన్ లో DNA మరియు హిస్టోన్ ప్రోటీనులు ఉంటాయి.

→ పెరాక్సీసోమ్లు, గ్లై ఆక్సీసోమ్లను సూక్ష్మదేహాలు అంటారు.

→ సక్రియరవాణా : ATP రూపంలోని శక్తి ఉపయోగంతో త్వచం ద్వారా జరిగే రవాణా

→ సూక్ష్మ జీవనాశకాలు (Antibiotics) : కొన్ని సూక్ష్మజీవుల నుంచి ఉత్పత్తి అయి, ఇతర సూక్ష్మజీవులను నశింపచేసే పదార్థాలు

→ ఆక్సోనీమ్ : సూక్ష్మనాళికలను 9 + 2 అమరికలో కలిగి ఉన్న శైలిక లేక కశాభం యొక్క కోర్ (కేంద్ర) భాగం.

→ కెరోటినాయిడ్లు : వర్ణ రేణువులలో సమృద్ధిగా ఉంది పసుపు, నారింజ లేదా ఎరుపు వర్ణాలను కలిగించే, టర్పినాయిడ్ వర్ణద్రవ్యాలు,

→ కణాంగాలు : కణద్రవ్యంలో కనిపించే త్వచయుత లేదా త్వచరహిత నిర్మాణాలు.

→ క్రొమాటిన్ : నిజకేంద్రక జీవకణంలోని కేంద్రకంలో కనిపించే వర్ణయుతమైన సూక్ష్మ పోగుల లాంటి పదార్థం.

→ కణ అస్థిపంజరం : నిజకేంద్రక జీవకణంలో కనిపించే విస్తారమైన ప్రోటీన్ యుత తంతు రూప నిర్మాణాలు.

→ గ్లైకోకాలిక్స్ : బాక్టీరియా కణకవచానికి వెలుపల పాలిశాఖరైడ్తో నిర్మించబడిన పొర.

→ హిస్టోనులు : DNA తో కలిసి ఉండే క్షార ప్రోటీనులు

→ కైనిటోకోర్ : క్రోమోజోమ్ యొక్క సెంట్రోమియర్ భాగంలో కనిపించే రెండు బిళ్ళలలాంటి నిర్మాణాలు.

→ మిసోసోమ్ : కొన్ని బాక్టీరియాలలో కణకవచం నిర్మాణానికి, DNA ప్రతికృతికి తోడ్పడే త్వచ అంతర్వలనాలు (infoldings)

→ నిష్కియా రవాణా : శక్తి వినియోగింపబడకుండా త్వచం ద్వారా జరిగే రవాణా అంటే గాఢతా ప్రవణతననుసరించి జరిగే చర్య.

→ ప్లాస్మిడ్లు : అనేక బాక్టీరియమ్లలో జీనోమిక్ DNA కు వెలుపల కనిపించే చిన్న వృత్తాకార DNA అణువులు.

→ శాటిలైట్ : కొన్ని క్రోమోజోమ్లలో ద్వితీయ కుంచనానికి ఆవల క్రోమోసోమ్ చివరిభాగంలో కనిపించే గుండ్రని నిర్మాణం.

AP Inter 1st Year Botany Notes Chapter 9 కణం: జీవప్రమాణం

→ అంతరత్వచ వ్యవస్థ : సమన్వయం చెందిన విధులతో ఏర్పడిన కణాంగాల (అంతర్జీవ ద్రవ్యజాలం ER, గాల్జీ సంక్లిష్టం, లైసోజోమ్లు, రిక్తికలు) సమూహం.

→ థైలకాయిడ్లు : హరిత రేణువులలో కనిపించే చదునైన త్వచయుత కోశాలు.