Students can go through AP Inter 1st Year Botany Notes 11th Lesson కణచక్రం, కణ విభజన will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Botany Notes 11th Lesson కణచక్రం, కణ విభజన
→ కణ సిద్ధాంతం ప్రకారము, కణాలు అంతకు ముందు ఉన్న కణాల నుండి విభజన వలన ఏర్పడతాయి.
→ లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులు తమ జీవిత చక్రమును సంయుక్త బీజంతో మొదలు పెడతాయి.
→ ఒక వరుస క్రమంలో జరిగే ప్రక్రియల ద్వారా జీనోమ్లు రెండుగా ఏర్పడుట, వివిధ అనుఘటకాల సంశ్లేషణ మరియు ఒక మాతృకణం రెండు పిల్ల కణాలుగా విభజనచెందే ప్రక్రియను కణ చక్రం అంటారు.
→ కణచక్రంలో రెండు ప్రదాన దశలు ఉంటాయి. అవి అంతార్దశ, M దశలు.
→ అంతర్దశలో G1, దశ, S దశ, G2, దశలు కలవు.
→ G. దశలో కణం నిరంతరం పెరుగుదల కొనసాగిస్తూ జీవక్రియా పరంగా అధిక క్రియాశీలత కలిగి ఉంటుంది.
→ S దశలో DNA ప్రతికృతి జరుగును.
→ G2 దశలో కణద్రవ్య పెరుగుదల జరుగును.
→ S దశలో 4 ఉప దశలు కలవు. అవి ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ మురియు అంత్య దశ.
→ ప్రథమ దశలో క్రోమోసోయల్ సంగ్రహణం జరుగుతుంది.
→ మధ్యస్థ దశలో క్రోమోసోమ్లు మద్యరేఖ వద్దకు చేరుకొని, మధ్యస్థ ఫలకం వద్ద రెండు దృవప్రాంతాలు కండెపోగులతో కలసి ఉంటాయి.
→ చలన దశలో ప్రతి క్రోమోసోమ్ చీలిపోయి రెండు క్రోమాటిడ్లుగా ఏర్పడతాయి.
→ క్రోమోసోమ్ల చుట్టూ కేంద్రక త్వచం ఏర్పడుట, కేంద్రకాంశం గాల్జి సంక్లిష్టము, అంతర్జీవ ద్రవ్యజాలము ఏర్పడుట, అంత్యదశలో కనిపిస్తాయి.
→ కణద్రవ్య విభజనను సైటోక్రినసిస్ అంటారు.
→ క్షయకరణ విభజన ధ్వయస్థితిక కణాలలో జరుగును. దీనిలో క్రోమోసోమ్ల సంఖ్య సగానికి సగం తగ్గించ బడుతుంది.
→ క్షయకరణ విభజనలో క్షయకరణ విభజన I, II లు కలవు.
→ క్షయకరణ విభజన I లో ప్రథమ దశ , మద్య దశ I, చలన దశ I, అంతిమ దశ I ఉంటాయి.
→ ప్రథమ దశ I లో లెప్టోటీన్, జైగోటీన్, పాకీటీన్, డిప్లోటీన్ డయాకైనెసిస్ కలవు.
→ పాకిటిన్ ఉప దశలో పారగతి జరుగును.
→ క్షయకరణ విభజన II, సమవిభజన వలె ఉంటుంది. దీనిలో ప్రథమ దశ II, మధ్యస్థ దశ II, చలన దశ, అంత్య దశ II ఉంటాయి.
→ క్షయకరణ విభజన అనంతరం 4 పిల్ల కణాలు ఏర్పడతాయి.
→ బైవలెంట్ : సూత్రయుగ్మనమై (synapsis) ఉన్న ఒక జత సమజాతీయ క్రోమోజోమ్లు.
→ కణచక్రం (cell cycle) : జీనోమ్ రెట్టింపవడం, చివరగా ఒక కణం విభజన చెందే ప్రక్రియలు చక్రీయంగా జరుగటను, కణాలుగా విడిపోయే ప్రక్రియను కణచక్రం అంటారు.
→ కణ ఫలకం : మొక్కల కణాలలో కణద్రవ్య విభజన చెందునప్పుడు ఏర్పడు కణకవచ పూర్వగామి.
→ కయాస్మేటా : వినిమయం లేదా పారగతి (crossing over) జరిగిన తరువాత ‘X’ ఆకారంలో ఉన్న క్రొమాటిడ్ల నిర్మాణాన్ని కయాస్మేటా అంటారు.
→ క్రొమాటిడ్ : మధ్యస్థ దశలోని ప్రతి క్రోమోసోమ్ నిలువుగా చీలిన అర్థభాగం.
→ సైటోకైనెసిస్ : కణద్రవ్య విభజనను సైటోకైనెసిస్ అంటారు.
→ డిప్లొటీన్ : క్షయకరణ విభజనలోని ప్రథమదశ | లో క్రోమోసోమ్ జతలు విడిపోవుట ప్రారంభమయ్యే దశ.
→ అంతర్దశ (Interphase) : రెండు వరుస (successive) విభజనల మధ్య ఉన్న తయారీదశ.
→ కేంద్రక విభజన (Karyokinesis) : కణవిభజనలో ఒక కేంద్రకం నుండి రెండు కేంద్రకాలుగా ఏర్పడుటను కేంద్రక విభజన అని అంటారు.
→ పాకిటీన్ (Pachytene) : క్షయకరణ విభజన | లోని దశ. దీనిలో క్రోమోసోమ్లు మందంగా స్పష్టంగా కనబడతాయి. ఈ దశలో సమజాతీయ క్రోమోసోమ్ల మధ్య జన్యు పదార్థం మార్పిడి జరుగును.
→ శాంతదశ (Quiscent state – Go) : కణ చక్రంలో కణాలు విభజన చెందకుండా ఉండే నిష్క్రియ దశను శాంత దశ అంటారు.
→ సినాప్టోనిమల్ సంక్లిష్టం (Synaptonemal complex) : క్షయకరణ విభజనలోని ప్రథమ దశ | లో సమజాతీయ క్రోమోసోమ్లను కలిపి ఉంచే ప్రోటీన్ సంక్లిష్టం.