Students can go through AP Inter 1st Year Botany Notes 3rd Lesson మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Botany Notes 3rd Lesson మొక్కల విజ్ఞానం – వృక్షశాస్త్రం
→ జీవులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘జీవశాస్త్రం’ అంటారు.
→ ‘బోటనీ’ అనుపదము ‘బోస్కిన్’ అను గ్రీకుపదం నుంచి ఏర్పడి, బోటేన్ అను పదముగా మారి, ‘బోటనీ’గా వాడుకలో ఉన్నది.
→ క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలనాటికే ఈజిప్టు దేశస్థులు, ఆస్సీరియన్లు పైరు మొక్కల, ఫలవృక్షాల గురించిన సమాచారాన్ని చిత్రాల రూపంలో హీరోగ్లిఫిక్స్ (Heiroglyphics) నమోదుచేసారు.
→ క్రీ. పూ. 1300 సం॥ కాలంలో పరాశరుడు ‘కృషిపరాశరం’ అను గ్రంథంను రచించారు. ఇది వ్యవసాయానికి సంబంధించిన అతి ప్రాచీన గ్రంథము. దీనిలో వ్యవసాయం మరియు కలుపుమొక్కల గురించి వివరించారు.
→ ఆయన ‘వృక్షాయుర్వేదం’ అను గ్రంధంలో వివిధ రకాల అడవులు మొక్కల బాహ్య లక్షణాలు, అంతర లక్షణాలు, ఔషదమొక్కలను గురించి వివరించారు.
→ థియోఫ్రాస్టస్ (340 B.C) రచించిన “డీ హిస్టోరియా ప్లాంటారమ్ అను గ్రంథంలో 500 రకాల మొక్కల బాహ్య, అంతర లక్షణాలు వివరించారు. ఆయనను వృక్షశాస్త్ర పితగా భావిస్తారు.
→ గాస్పర్డ్ బాహిన్ (1623) 6000 మొక్కలకు సంబంధించిన వర్ణన, గుర్తింపు లక్షణాలను ప్రచురించి, మొట్టమొదట ద్వినామనామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు.
→ రాబర్ట్ హుక్ కణంను కనుక్కోవడం, 1665లో మైక్రోగ్రాఫియా అను గ్రంధంను ప్రచురించారు.
→ కామేరేరియస్ (1694) మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తిని వర్ణించారు.
→ కెరోలస్ వాన్ లిన్నెయస్ ద్వినామనామీకరణ విధానాన్ని వాడుకలోనికి తేవడమే కాకుండా లైంగిక వర్గీకరణ వ్యవస్థను ప్రతిపాదించారు.
→ గ్రెగర్ జోహన్ మెండల్, అనువంశిక సూత్రాలను ప్రవేశపెట్టారు. కావున ఆయనను జన్యుశాస్త్రపిత అంటారు.
→ చార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
→ బుక్నర్ (1898) ఈస్ట్ కణాలలో ‘జైమేజ్’ అను ఎంజైంను కనుగొన్నారు.
→ హ్యూగోడీవీస్ (1901) మొక్కలలో ఉత్పరివర్తనలను, సట్టన్ మరియు బవెరిలు (1902) అనువంశికతలో క్రోమోసోమ్ల పాత్రను కనుగొన్నారు.
→ DNA ద్విసర్పిల నమూనాను వాట్సన్ మరియు క్రిక్ లు, RNA జనుతత్వంను ఫ్రాంకిల్ మరియు కోన్రాట్లు, కృత్రిమజన్యుసంశ్లేషణను హరగోవింద్ ఖొరానా, కణజాలవర్ధనం ప్రయోగాలను హన్నింగ్, షిమకురా, స్కూగ్, వైట్లు కనుగొన్నారు.
→ FW. వెంట్ అనువారు ఆక్సిన్లను (1928) కనుగొన్నారు.
→ C3 – కరనస్వాంగీకరణ పథకాన్ని మాల్విన్ కెల్విన్, బెన్సన్, భాషమ్లు కనుగొన్నారు.
→ TCA వలయమును హన్స్ క్రెబ్స్ (1937) కనుగొన్నారు.
→ C3 – పథంను హోబ్ – స్లాక్ అనువారు కనుగొన్నారు.
→ మొక్కల పోషణలో మూలకాలపాత్ర తెలియుటవల్ల, రసాయన ఎరువులు ఉపయోగించి, మౌలిక లోపాలను అధిగమించి అధిక దిగుబడులు సాధించవచ్చు. (వృక్ష శరీర ధర్మశాస్త్రం)
→ వృక్ష వ్యాధి శాస్త్రంలో పరిశోధనలవల్ల మొక్కలలో వచ్చే అనేక వ్యాధులను నివారించడం, నిర్మూలించడానికి ఉపయోగపడతాయి.
→ పర్యావరణ సంబంధ సమస్యలు అయిన హరితగృహ ప్రభావాన్ని విరివిగా మొక్కలు నాటడంవల్ల నియంత్రించడం, బయోరెమిడియేషన్ ద్వారా మృత్తికా కాలుష్యాన్ని తగ్గించడం, పూతికాహారుల ద్వారా పోషక పదార్థాల పునశ్చక్రీయం సాధ్యపడుతుంది.
→ మొక్కలలోని వివిధ భాగాల అధ్యయనము, వర్ణనకు సంబంధించిన శాస్త్రంను స్వరూపశాస్త్రం అంటారు.
→ స్త్రీ, పురుష సంయోగ భీజదాలు ఏర్పడుట, సంయోగ భీజాల ఉత్పత్తి, ఫలదీకరణ విధానం, పిండం, అంకురచ్చదం, విత్తనాలు, ఏర్పడుటను గురించి చదివే శాస్త్రంను పిండోత్పత్తి శాస్త్రం అంటారు.
→ పరాగ రేణువుల ఉత్పత్తి, నిర్మాణంలాంటి అంశాల గురించిన అద్యయనంను పేలినాలజీ అంటారు.
→ మొక్కల శిలాజాల గురించి అద్యయనం చేయుటను పురాజీవ శాస్త్రం అంటారు.
→ గత, ప్రస్తుత కాలాల్లో, భూమండలంలోని వివిధ ప్రాంతాలలో మొక్కల వితరణ గురించి అధ్యయనంను వృక్ష భౌగోళికశాస్త్రం అంటారు.
→ ఒక శైవలం, ఒక శిలీంధ్రం పరస్పరం ఆధారపడుతూ సహజీవనం గడిపే ప్రత్యేకవర్గం మొక్కల అధ్యయనంను లైకెనాలజి అంటారు.
→ జున్నుగడ్డి (Agar-agar) : ఇది ఎరుపురంగు శైవలాల నుంచి నిష్కర్షించబడే జడ పాలిశాఖరైడ్. పాక్షిక ఘనీభవన యానకాలలో ఇది ఒక భాగం.
→ పానీయాలు : ఇవి ఉల్లాసం కోసం ఆల్కహాల్ ఉన్న లేదా ఆల్కహాల్ లేని తాగే పదార్థాలు.
→ జీవ ఎరువులు : ఇవి మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలను సరఫరా చేసే జీవ సంబంధ పదార్థాలు.
→ హెర్బల్స్ : ఇవి ఔషధ మొక్కల గురించిన వర్ణన ఉన్న పుస్తకాలు.
→ పేలినాలజీ : పరాగ రేణువుల ఉత్పత్తి, నిర్మాణము వంటి అంశాలను గురించి చదివే శాస్త్రము.
→ వృక్షకణజాల, అంగవర్ధనం : ఇది కృత్రిమ పోషకయానకం మీద, కణాలను కణజాలాలను, అంగాలను పెంచే ప్రక్రియ.
→ వృక్షవ్యాధి శాస్త్రము : మొక్కలలోని వ్యాధి కారకాలు, లక్షణాలు, నియంత్రణ చర్యలను గురించి చదివే శాస్త్రము.
→ ఏకకణ ప్రోటీన్లు : ఆహారంలోని ప్రోటీన్ల మూలం కోసంవాడే ఒకేజాతికి చెందిన సూక్ష్మజీవుల శుష్క జీవ ద్రవ్యరాశి.
→ సుగంధ ద్రవ్యాలు, కాండిమెంట్లు : వివిధ రకాలైన ఆహార పదార్థాలకు రుచికరమైన వాసనల కోసం వాడేవి, జీర్ణరసాల ఉత్పత్తిని పెంచేవి సుగంధ ద్రవ్యాలు. కాండిమెంట్లు ఆహారం వండిన తరువాత ఆహారానికి చేర్చే సుగంధ ద్రవ్యాలు.