AP Inter 1st Year Chemistry Notes Chapter 1 పరమాణు నిర్మాణం

Students can go through AP Inter 1st Year Chemistry Notes 1st Lesson పరమాణు నిర్మాణం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Chemistry Notes 1st Lesson పరమాణు నిర్మాణం

→ కాథోడ్ కిరణాలలో ఋణవిద్యుదాత్మక కణాలుంటాయి. వీటినే ఎలక్ట్రాన్లు అంటారు.

→ ఎలక్ట్రాన్ ఆవేశానికి ద్రవ్యరాశికి గల నిష్పత్తి (e/m) విలువ 1.75 88 × 1011 e kg-1.

→ మార్పు చేసిన కాథోడ్ కిరణ నాళికలో ధారగా పోయే ధనావేశ కణాలను కెనాల్ కిరణాలు (లేదా) ప్రోటాన్లు అంటారు.

→ రూథర్ ఫర్డ్ పరమాణు నమూనా సౌరకుటుంబాన్ని పోలి ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు గుండ్రంగా తిరుగు తుంటాయి. ఎలక్ట్రాన్లు తిరిగే మార్గాలను కక్ష్యలు అంటారు.

→ రూథర్ ఫర్డ్ నమూనా పరమాణువులో ఎలక్ట్రాన్ నిర్మాణాన్ని విశదీకరించలేదు.

→ విద్యుదయస్కాంత వికిరణం : అయస్కాంత క్షేత్రం మరియు విద్యుత్ క్షేత్రాలు పరస్పరం అంబ దిశలో కలిగి ఉన్న వికిరణాలను విద్యుదయస్కాంత వికిరణాలు అంటారు. అట్టి తరంగాన్ని విద్యుదయస్కాంత తరంగం అంటారు.

→ విద్యుదయస్కాంత వర్ణపటం : తరంగ దైర్ఘ్య క్రమంలో అమర్చబడిన విద్యుదయస్కాంత తరంగాలను విద్యుదయస్కాంత వర్ణపటం అంటారు.

→ తనపై పడ్డ శక్తిని పూర్తిగా శోషించుకొని, మరలా మొత్తాన్ని ఉద్గారం చేసే వస్తువును కృష్ణవస్తువు లేక నల్లని వస్తువు అంటారు.

→ ప్లాంక్ భావన ప్రకారం, శక్తి ఉద్గారం విచ్ఛిన్నంగా ‘క్వాంటం’ అని పిలువబడే చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో జరుగుతుంది.

→ ఐన్స్టీన్ భావన ప్రకారం, శక్తి ఉద్గారం ఫోటాన్ల రూపంలో జరుగుతుంది. ఈ ఫోటానన్ను ఆయన తరంగ కణంగా భావన చేశాడు.

AP Inter 1st Year Chemistry Notes Chapter 1 పరమాణు నిర్మాణం

→ దగ్గరదగ్గరగా ఉన్న రేఖలను కలిగి ఉన్న వర్ణపటాన్ని పట్టీ వర్ణపటం అంటారు. ఇది అణువుల అభిలాక్షణిక ధర్మం.

→ సునిశితమైన, విడివిడిగా ఉండే రేఖలను కలిగి ఉండే వర్ణపటాన్ని రేఖావర్ణపటం అంటారు. ఇది పరమాణువుల అభిలాక్షణిక ధర్మం.

→ శక్తిని ఉద్గారం చేసుకొనడం వలన ఏర్పడే వర్ణపటాన్ని ఉద్గార వర్ణపటం అంటారు. దీనిలో నల్లని పట్టీపై తెల్లని గీతలు ఏర్పడతాయి.

→ శక్తిని శోషణం చేసుకొనడం వలన ఏర్పడే వర్ణపటాన్ని శోషణ వర్ణపటం అంటారు. దీనిలో తెల్లని పట్టీపై నల్లని గీతలు ఏర్పడతాయి.

→ హైడ్రోజన్ యొక్క ఉద్గార వర్ణపటంలో లైమన్, బామర్, పాషన్, బ్రాకెట్ మరియు ఫండ్ శ్రేణులుంటాయి.

→ బోర్ నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు నిర్ణీతమైన శక్తి విలువలు కలిగిన స్థిర కర్పరాలు అనబడే వృత్తాకార మార్గాలలో తిరుగుతూ ఉంటాయి.

→ బలమైన అయస్కాంత క్షేత్రంలో పరమాణు వర్ణపటంలోని ప్రతి ఒక్క గీత మరలా చిన్నచిన్న గీతలుగా విభజింపబడటాన్ని జీమన్ ఫలితం అంటారు.

→ బలమైన విద్యుత్ క్షేత్రంలో పరమాణు వర్ణపటంలోని ప్రతిఒక్క గీత మరలా చిన్నచిన్న గీతలుగా విభజింపబడటాన్ని స్టార్క్ ఫలితం అంటారు.

→ సోమర్ఫెల్డ్ నమూనా ప్రకారం ఎలక్ట్రాన్ వృత్తాకార మార్గాలలోనే కాకుండా, దీర్గ వృత్తాకార మార్గాలలో కూడా తిరుగుతాయి.

→ ప్రధాన క్వాంటం సంఖ్య పరమాణువు యొక్క సైజును మరియు కర్పరం శక్తిని తెలియచేస్తుంది.

→ ఎజిమ్యుథల్ క్వాంటం సంఖ్య, ఆర్బిటాల్ యొక్క ఆకృతిని సూచిస్తుంది. అయస్కాంత క్వాంటం సంఖ్యఆర్బిటాళ్ళ ప్రాదేశిక విన్యాసాన్ని సూచిస్తుంది. స్పిన్ క్వాంటం సంఖ్య ఎలక్ట్రాన్ యొక్క భ్రమణ దిశను తెలియచేస్తుంది.

→ డీబ్రౌలీ ఎలక్ట్రాన్కు తరంగస్వభావం ఉంటుందని ప్రతిపాదించాడు.

→ పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క వేగాన్ని మరియు స్థానాన్ని ఒకేసారి ఖచ్చితంగా నిర్ణయించి చెప్పలేము. దీనినే హైసన్బర్గ్ అనిశ్చితత్వ నియమం అంటారు.

→ Ψ ను తరంగ ప్రమేయం అనీ, Ψ2 ను సంభావ్యతా ప్రమేయం అని అంటారు.

→ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రానన్ను కనుగొనే సంభావ్యత గరిష్ఠంగా గల ప్రదేశాన్ని ఆర్బిటాల్ అంటారు.

→ సమానశక్తి గల ఆర్బిటాళ్ళను సమశక్తి ఆర్బిటాళ్ళు (డీజనరేట్ ఆర్బిటాళ్ళు) అంటారు.

AP Inter 1st Year Chemistry Notes Chapter 1 పరమాణు నిర్మాణం

→ ఆర్బిటాల్ గోళాకారంలోను, P – ఆర్బిటాల్ ముద్గరాకృతిలోను, d – ఆర్బిటాల్ ద్విముద్దరాకృతిలోను ఉంటాయి.

→ నీల్స్ బోర్ (1885-1962)
నీలో బోర్ డెన్మార్డ్ భౌతిక శాస్త్రవేత్త. – 1911లో కోపెన్ హాగన్ విశ్వ విద్యాలయం నుంచి పిహెచ్.డి. పొందాడు. 1922 భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.