Students can go through AP Inter 1st Year Botany Notes 5th Lesson పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Botany Notes 5th Lesson పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం
→ పుష్పించు మొక్కలు – ఆకారం, పరిమాణంలో, నిర్మాణం, పోషణ విధానము, జీవితకాలం, ఆకృతి, ఆవాసాలలో వైవిధ్యాన్ని చూపుతాయి.
→ ద్విదళ బీజాలలో తల్లివేరు వ్యవస్థ, ఏకదళ బీజాలలో పీచువేరు వ్యవస్థ ఉంటాయి.
→ కొన్ని మొక్కలలో వేరు రూపాంతరం చెంది, ఆహార నిల్వకు, అదనపు శక్తికి, శ్వాసక్రియలోను, కిరణజన్య సంయోగ క్రియలోను తోడ్పడతాయి.
→ ప్రకాండ వ్యవస్థలో కాండము, పత్రాలు, పుష్పాలు, ఫలాలు ఉంటాయి.
→ కాండంపై కణుపులు, కణుపు నడిమిలు, బహుకణయుత కేశాలు కలిగి ధనాత్మక కాంత అనువర్తనం చూపుతుంది.
→ కాండం రూపాంతరం చెంది, ఆహారపు నిల్వలోను, శాకీయ ప్రత్యుత్పత్తికి రక్షణకు తోడ్పడతాయి.
→ కాండపై పార్శ్వంగా ఉద్భవించే బల్లపరుపుగా ఉన్న నిర్మాణమును పత్రం అంటారు.
→ కిరణజన్య సంయోగ క్రియకాకుండా, వత్రాలు ఎగబ్రాకుటకు, రక్షణకు శాకీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి.
→ ద్విదళ బీజపత్రాలలో జాలాకార ఈనెల వ్యాపనం, ఏకదళ బీజాలపత్రాలలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటాయి.
→ పుష్ప విన్యాసాక్షం మీద పుష్పాలు అమరి ఉండుటను పుష్పవిన్యాసం అంటారు.
→ ప్రత్యుత్పత్తి కొరకు రూపాంతరం చెందిన ప్రకాండన్ని పుష్పం అంటారు.
→ పుష్పాలు నిర్మాణంలోను, సౌష్టంలోను, ఇతర పుష్ప భాగాలతో పోల్చినపుడు అండాశయస్థానము, రక్షక ఆకర్షణ పత్రాల అమరిక, అండాల అమరికలో వైవిధ్యం చూపుతాయి.
→ పుషం మొగ్గదశలో ఉన్నప్పుడు రక్షక, ఆకర్షణ పత్రాలు అమరికను పుష్పరచన అంటారు.
→ అండాన్యాసస్థానంపై అండాలు అమరికను అండాన్యాసం అంటారు.
→ ఫలదీకరణ చెందిన అండాశయాన్ని ఫలం అంటారు.
→ ఫలధీకరణం లేకుండా అండాశయం నుండి ఏర్పడే ఫలాలను అనిషేక ఫలాలు అంటారు.
→ ఆపిల్, జీడిమామిడి వంటి ఫలాల్లో, అండాశయంతో పాటు పుష్పాసనం, పుష్పవృంతం ఫలాలుగా మారతాయి. వీటిని అనృత ఫలాలు అంటారు.
→ పక్వసమయంలో రసభరితంగా ఉండే ఫలాలను కండగల ఫలాలు అంటారు. ఉదా : మృధుఫలం (టొమేటో) పోమ్ (ఆపిల్) పెపో (దోస) హెస్పిరీడియమ్ (నిమ్మ), టెంకెగల ఫలం (మామిడి)
→ పక్వ సమయంలో ఎండిపోయిన ఫలాలను శుష్కఫలాలు అంటారు. ఇవి విదారకంగా గాని, అవిధారకంగా గాని, భిదుర ఫలాలుగా ఉంటాయి.
→ ఫలదీకరణ తర్వాత అండాశయం ఫలంగాను, అండాలు- విత్తనాలుగాను మారతాయి.
→ విత్తనంను ఆవరించి విత్తన కవచం, లోపల పిండం, ఒకటి లేక 2 బీజదళాలు ఉంటాయి.
→ పరిపత్ర రహితం : ఆవశ్యకాంగాలు (లేదా పరిపత్రం) లోపించిన పుష్పం. దీన్ని నగ్న పుష్పం అని కూడ అంటారు.
→ అగ్రాభిసార అమరిక : అక్షంపై పార్శ్వ నిర్మాణాలు ఆధారం నుంచి అగ్రంవైపుకు ఏర్పడటం.
→ సౌష్టవయుత పుష్పం : పుష్పాలను ఏ తలం నుంచైనా నిలువుగా అక్షం గుండా రెండు సమ భాగాలుగా విభజించవచ్చు.
→ అబ్బురపు వేరు : ప్రథమ మూలం నుంచి కాకుండా మొక్కలోని ఇతర భాగాలనుంచి ఏర్పడిన వేరు.
→ కేసరావళి : పుష్పంలో పురుషప్రత్యుత్పత్తి నిర్మాణాలుగా ఉండే కేసరాల వలయం.
→ గ్రీవం : గ్రీవపు మొగ్గను కలిగి ఉండి, పత్రానికీ, కాండానికీ మధ్య ఉండే పై కోణం.
→ ఆధారాభిసారి అమరిక : అక్షంపై పార్శ్వ నిర్మాణాలు అగ్రం నుంచి ఆధారం వైపుకు ఏర్పడటం.
→ పుష్పపుచ్ఛం : గ్రీవంలో పుష్పాన్ని ఏర్పరచే పలచని, పత్రంలాంటి నిర్మాణం.
→ లఘు పుష్పపుచ్ఛాలు : కొన్ని పుష్పాల పుష్పవృంతాలపై ఏర్పడే పలచని, త్వచం లాంటి నిర్మాణాలు.
→ సంపూర్ణ పుష్పం : రెండు పరిపత్ర వలయాలను కనీసం ఒక వలయం కేసరావళి, ఒక వలయం అండకోశాలను కలిగిన
→ కందం : నిలువుగా కిందికి పెరిగే భూగర్భ కాండం.
→ అంకురచ్ఛదం : అభివృద్ధి చెందుతున్న పిండాన్ని చుట్టి ఉండి పోషణనిచ్చే కణజాలం. ఆవృతబీజాలలో ఇది త్రయ స్థితికంగా ఉంటుంది.
→ పత్రోపరిస్థితి మొగ్గ : పత్రాలమీద ఏర్పడే అబ్బురపు మొగ్గలు. అవి శాకీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి.
→ పత్రోపరిస్థిత కేసరాలు : పరిపత్ర భాగాలతో సంయుక్తమైన కేసరాలు.
→ పీచువేర్లు : ప్రథమ మూలం నుంచి కాకుండా మొక్కలోని ఇతర భాగల నుంచి ఉద్భవించే వేళ్ల సముదాయం.
→ గురుత్వానువర్తనం : పెరుగుదలపై గురుత్వాకర్షణ ప్రభావం.
→ అండకోశం : ఫలదళాలతో కూడిన, పుష్పంలోని చివరి వలయం.
→ హాస్టోరియమ్లు (పరాన్నజీవుల వేళ్ళు) : ఆతిథేయి నుంచి ఖనిజాలను లేదా సేంద్రియ పదార్థాలను లేదా రెండింటిని శోషించే రూపాంతరం చెందిన ప్రత్యేకమైన అబ్బురపు వేర్లు.
→ అసంపూర్ణ పుష్పం : పరిపత్రాలు లేదా కేసరాలు లేదా ఫలదళాలలో ఏదో ఒక వలయం లోపించిన పుష్పం.
→ పరిచక్రపుచ్ఛావళి : పుష్పవిన్యాసం చుట్టూ ఉండి, రక్షణ కలగచేసే పుచ్చాల వలయం. అది యుఫర్బియేసి కుటుంబ మొక్కలలో మాదిరిగా సంయుక్త పుష్ప పుచ్ఛాలుగా లేదా అంబెల్లిఫేరే కుటుంబ మొక్కలలోలాగ అసంయుక్త పుచ్ఛాలుగా గాని ఉంటుంది.
→ బిలం : అడ్డుగోడ (పటలం) ఏర్పడటం వల్ల అండాశయంలో ఉద్భవించిన గదులు.
→ ఫలాంశం : షైజోకార్పిక్ (బిదుర) ఫలాల్లోని ఒకే విత్తనం గల భాగాలు.
→ విభాజ్య కణజాలం : ఇవి మొక్కలలో చురుకుగా కణ విభజన జరిగే ప్రత్యేకమైన ప్రదేశాలు.
→ రూపాంతరం : కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి గాను మొక్కల్లోని అంగంలో ఏర్పడే నిర్మాణాత్మకమైన, శాశ్వత మార్పు.
→ ఆఫ్సెట్ : ప్రతి కణుపువద్ద అబ్బురపు పేర్లను, పత్రాల గుంపును కలిగిన, ఒకే కణుపు మధ్యమంతో ఏర్పడిన శాఖ.
→ పాపిలియోనేషియస్ ఆకర్షణపత్రావళి : పాపిలియోనేసి (ఫాబేసి కుటుంబ మొక్కలలోని ఆకర్షపత్రాల అమరిక పద్ధతి. దీనిలో పరాంతంలో ఉన్న ధ్వజ పత్రం కీటకాలను ఆకర్షిస్తుంది. పార్శ్వంగా ఉండే బాహుపత్రాలు లేదా ఆలేపై కీటకాలు వాలతాయి, పూర్వాంతంలోని పడవ ఆకార ఆకర్షణ పత్రాలను ద్రోణి పత్రాలు (keel or carina) అంటారు. అవి ఆవశ్యకాంగాలను కప్పి ఉంటాయి.
→ కేశగుచ్ఛం : ఫలాలు లేదా విత్తనాలను గాలి ద్వారా వ్యాప్తి చెందించడానికి, ఆస్టరేసి కుటుంబ మొక్కలలో గల దీర్ఘ కాలిక (శాశ్వత) రక్షక పత్రావళి (రక్షక పత్రాలు).
→ అనిషేకఫలనం : ఫలదీకరణ లేకుండా, విత్తన రహిత ఫలాలను ఏర్పరచే పద్ధతి.
→ పుష్పవృంతం : పుష్పానికి ఉండే కాడ.
→ పుష్పవిన్యాసవృంతం : పుష్పాలను ఏర్పరచే పుష్ప విన్యాసాక్షం.
→ పరిపత్రం : రక్షకపత్రాలు, ఆకర్షణపత్రాలు కలిగిన పుష్పంలో బయటి రెండు వలయాలు.
→ ఫలకవచం : ఫలకుడ్యం, కండగల ఫలంలో వెలుపలవైపు బాహ్యఫలకవచం, మధ్యలో మధ్యఫలకవచం, లోపలివైపు అంతఃఫలకవచం అనే విభేదనం చూపుతుంది.
→ పత్రవృంతం : పత్రానికి గల కాడ
→ కాంతిఅనువర్తనం : పెరుగుదలపై కాంతి ప్రభావం
→ స్త్రీ పుష్పం (Pistillate flower) : ఫలదళాలను కలిగి, కేసరాలు లోపించిన ఏకలింగక పుష్పం.
→ ప్రథమకాండం : పిండాక్ష పైభాగనున్న ఉపరి బీజదళకొనభాగం. ఇది ప్రకాండ వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది.
→ విన్యాసాక్షం (Rachis) : పత్రవృంతం నుంచి విస్తరించిన పిచ్ఛాకార సంయుక్త పత్రంలోని అక్షం. ఇది హస్తాకార సంయుక్త పత్రంలో ఉండదు.
→ ప్రథమమూలం : విత్తన అంకురణ సమయంలో మొదట వెలువడి వేరు వ్యవస్థగా అభివృద్ధి చెందే పిండాక్షపు అధోబీజదళ కొన.
→ కొమ్ము : మృత్తికలో, భూమికి సమాంతరంగా పెరుగుతూ, పృష్టోదర విభేదనాన్ని కలిగి బల్లపరుపుగా ఉండే భూగర్భ కాండం.
→ రన్నర్ : భూమికి సమాంతరంగా పెరుగుతూ, ప్రతి కణుపు దగ్గర అబ్బురపు వేర్లను ఏర్పరచే బలహీనకాండం లేదా దాని శాఖ.
→ షైజోకార్ప్ : ఒకే విత్తనం గల ఫలాంశాలుగా విడిపోయే శుష్కఫలం. అవి అవిదారకంగా ఉండి ఫలకవచం పూర్తిగా క్షీణించిన తరువాత ఫలాంశంలోని విత్తనాలు విడుదలవుతాయి.
→ వృంతరహిత స్థితి : కాడలేని పత్రం లేదా పుష్పాన్ని వృంతరహితం అంటారు.
→ సోరోసిస్ : కంకి పుష్పవిన్యాసం నుంచిగాని, స్పాడిక్స్ నుంచి గాని, కాట్కిన్ పుష్పవిన్యాసం నుంచిగాని ఏర్పడే సంయోగఫలం (బహుళ ఫలం).
→ పురుషపుష్పం : ఫలదళాలు లేకుండా, కేసరాలను కలిగిన ఏకలింగక పుష్పం.
→ దుంప కాండం : ఆహారపదార్థాలు నిలవ చేయడం వల్ల ఉబ్బిన భూగర్భ శాఖల కొన.
→ సైకోనస్ : హైపన్ థోడియమ్ పుష్పవిన్యాసం నుంచి ఏర్పడే సంయోగ (బహుళ) ఫలం
→ పుష్పాసనం : పుష్పవృంతం కొనభాగం
→ వెలమిన్ వేరు : వృక్షోపజీవి మొక్కలలో ఏర్పడి, వాతావరణంలోని తేమను పీల్చే వేరు.
→ పాక్షికసౌష్ఠవయుత పుష్పం : ఏదో ఒక నిలువు తలం నుంచి మాత్రమే మధ్యనుంచి కోస్తే రెండు సమభాగాలుగా ఏర్పడే పుష్పం.