AP Inter 1st Year Botany Notes Chapter 4 వృక్షరాజ్యం

Students can go through AP Inter 1st Year Botany Notes 4th Lesson వృక్షరాజ్యం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 4th Lesson వృక్షరాజ్యం

→ శైవలాలు, బ్రయోఫైటా మొక్కలు, టెరిడోఫైటా క్రిప్టోగామాను, వివృత బీజాలు, ఆవృత బీజాలుగాను విభజించడం జరిగింది.

→ పత్రహరితం కల సరళమైన థాలస్ కిలిగి స్వయం పోషకమైన మంచి నీటిలో నివసించే జీవులును శైవలాలు అంటారు.

→ భూమిపై జరిగే కర్బన స్థాపనలో సగం పైగా శైవలాల ద్వారా జరుగుతుంది.

→ శైవలాలో క్లోరోఫైసీ (క్లామిడోమోనాస్, వాల్వాక్స్, స్పైరోగైరాం) ఫియోఫైసీ (ఎక్టోకార్పస్, లామినేరియా ఫ్యూకస్), రోడోఫైసీ ప్రోలీసైఫోనియా, గ్రాసిలేరియా) అను తరగతులు కలవు.

→ ఆర్కి గోనియంలు కలిగి, పిండోత్పత్తి జరిగే నాళికా కణజా రహిత పుష్పించని మొక్కలు బ్రయోఫైట్లు.

→ వీటిని వృక్షరాజ్యంలోని ఉభయ చరజీవులు అని అంటారు. ఇవి చిత్తడినేలల్లో ఉన్న ఆదిమ నేల మొక్కలు.

→ భిన్నరూప ఏకాంతర దశలను ప్రదర్శించే వీటి జీవిత చక్రమును ఏక – ద్వయస్థితిక జీవిత చక్రం అంటారు.

→ బ్రయోఫైట్లులో లివర్వర్డ్లు, హార్న్ వర్క్స్లు, మాస్లు కలవు.

→ పిండాన్ని ఏర్పరిచే, ఆర్కి గోనియంలుకల, నాళికా కణజాలయుత, పుష్పించని మొక్కలను టెరిడోఫైట్లు అంటారు.

→ టెరిడోఫైట్లులో సిలోప్సిడా, లైకాప్సిడా, స్ఫినోప్సిడా, టెరోప్సిడా అను తరగతులు కలవు.

AP Inter 1st Year Botany Notes Chapter 4 వృక్షరాజ్యం

→ పిండయుతమైన, నాళికా కణ జాలాలు కల ఆర్కిగోనియమ్లు కల పుష్పించు మొక్కలను వివృత బీజాలు అంటారు.

→ వీటిలో (వివృత బీజాలు) సైకడోప్సిడా, కోనిఫెరాప్సిడా, నీటాప్సిడా అను తరగతులు కలవు.

→ పిండాన్ని ఏర్పరిచే, స్త్రీ బీజాశయాలు లేని, నాళికా కణజాలయుతమైన, ఫలాలను కలిగి ఉన్న పుష్పించే మొక్కలను ఆవృత బీజాలు అంటారు.

→ వీటిలో (ఆవృత) విత్తనంలో ఉన్న బీజదళాల సంఖ్యను బట్టి ద్విదళ బీజాలు ఏకదళ బీజాలు అను తరగతులు కలవు.

→ వాల్వాక్స్, స్పైరోగైరా, క్లామిడోమోనాస్ వంటి శైవలాలు ఏకస్థితిక జీవిత చక్రంను చూపుతాయి.

→ టెరిడోఫైట్లు, విత్తనాలు కలిగి ఉన్న అన్ని మొక్కలు ద్వయ – ఏకస్థితిక జీవిత చక్రంను చూపుతాయి.

→ బ్రయోఫైట్లు ఏక-ద్వయ స్థితిక జీవిత చక్రాన్ని ప్రదర్శిస్తాయి.

→ అసమసంయోగం : నిర్మాణాత్మకంగాను, క్రియాత్మకంగాను ఒకదానికొకటి భిన్నమైన గమన లేదా నిశ్చల సంయోగ బీజాల మధ్య జరిగే సంయోగం.

→ ఆర్కిగోనియేట్లు : ఆర్కిగోనియం అనే స్త్రీ బీజాశయంను గల బ్రయోఫైటా, టెరిడోఫైటా, వివృత బీజ మొక్కలు.

→ సహనివేశక నిర్మాణం : ఇందులో మొక్క దేహం విశిష్ట సహనివేశ నిర్మాణం కలిగి, (coenobium) మధ్యభాగంలో గుల్లగా ఉండి చుట్టూ ఏకకణ మందంలో కణాలు సహనివేశ మాత్రికలో అమర్చబడి ఉంటాయి.

→ పుష్పంచని మొక్కలు : ఇవి పుష్పించని, బీజరహిత సిద్ధబీజాలు గల మొక్కలు.

→ పిండోత్పత్తి చేసే మొక్కలు (ఎంబ్రియోఫైట్లు) : సంయుక్త బీజం నుంచి సమవిభజన ద్వారా పిండం ఏర్పడే బ్రయోఫైటా, టెరిడోఫైటా, వివృత, ఆవృత బీజ మొక్కలు.

→ యూస్పోరాంజియేట్ సిద్ధబీజాశయ అభివృద్ధి : ఉపరితలంలోని కణాల సముదాయం నుంచి సిద్ధబీజాశయం ఏర్పడటం. సంయోగబీజదం : మొక్క జీవిత చక్రంలో ఏకస్థితికంగా ఉన్న, సంయోగ బీజాన్ని ఏర్పరచే (లైంగిక) దశ.

→ భిన్న సిద్ధ బీజత : ఒక జాతిలో భిన్నమైన సిద్ధబీజాలు ఏర్పడే స్థితి.

→ సమసిద్ధ బీజత : ఒక జాతిలో ఒకే రకమైన సిద్ధబీజాలు మాత్రమే ఏర్పడే స్థితి.

→ సమసంయోగం : నిర్మాణాత్మకంగాను, క్రియాత్మకంగాను ఒకే రకమైన సంయోగ బీజాల మధ్య జరిగే సంయోగం.

→ ‘కెల్ప్’లు : స్థాపనాంగ కణం, వృంతం, పత్రదళంతో కూడిన మొక్క దేహం కలిగిన ఫియోఫైసీ (గోధుమ వర్ణ శైవలాలు) కి చెందిన పెద్ద శైవలాలు.

→ లెప్టోస్పొరాంజియేట్ అభివృద్ధి : సిద్ధ బీజాశయం ఒకేఒక్క ఉపరితల కణం నుంచి అభివృద్ధి చెందడం.

→ అండసంయోగం : ఇందులో చిన్నదైన చలనశీలమైన లేదా చలన రహిత పురుషసంయోగబీజం పెద్దదైన నిశ్చలమైన స్త్రీ సంయోగ బీజంతో జరిగే సంయోగం.

→ పుష్పించే మొక్కలు : ఇవి పుష్పించే, విత్తనాలను ఉత్పత్తి చేసే ట్రాకియోఫైటా మొక్కలు.

→ సైఫనోగమీ : స్త్రీ బీజకణంతో పరాగనాళం ద్వారా రవాణా చెందిన పురుష సంయోగబీజం సంయోగం చెందడం.

→ బీజయుత మొక్కలు (స్పెర్మటోఫైట్లు) : ఫలయుత లేదా ఫలరహిత విత్తనాలు గల మొక్కలు.

→ సిద్ధబీజదం : మొక్క జీవితచక్రంలో ద్వయస్థితికంగా ఉండి సిద్ధబీజాలను ఏర్పరిచే అలైంగిక దశ. ఇది సిద్ధబీజ మాతృకణాలలో జరిగే క్షయకరణ విభజన ద్వారా ఏకస్థితిక బీజాలను ఏర్పరుస్తుంది.

→ శంకు (స్ట్రోబిలస్) : దగ్గరగా అమర్చబడిన సిద్ధబీజాశయ పత్రాలను కలిగిన నిర్మాణం.

AP Inter 1st Year Botany Notes Chapter 4 వృక్షరాజ్యం

→ సంయుక్త సంయోగము : “ఒక పురుష బీజము, స్త్రీ బీజముతో కలియుట”.

→ థాలస్ : వేరు, కాండం, పత్రం అనే విభేదన చూపని మొక్కదేహం.

→ త్రి సంయోగము : “పిండకోశంలోని రెండవ పురుష బీజము, ద్వితీయ కేంద్రకముతో కలియుట”.

→ ట్రాకియోఫైట్లు : ఇవి టెరిడోఫైటా, వివృత బీజాలు, ఆవృత బీజాలకు చెందిన మొక్కలు. ఇవి నాళికా కణజాలం కలిగి ఉంటాయి.

→ జాయిదోగమీ : చలనశీల పురుష సంయోగబీజం నిశ్చల స్త్రీ బీజకణంతో సంయోగం చెందడం

→ గమనసిద్ధబీజం : కొన్ని శైవలాలు, శిలీంధ్రాలలో కశాభాల సహాయంతో చలించగల అలైంగిక సిద్ధబీజం. దీనిని చలత్కసిద్ధబీజం (swarm spore) అని కూడా అంటారు.