Students can go through AP Inter 1st Year Botany Notes 6th Lesson ప్రత్యుత్పత్తి విధానాలు will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Botany Notes 6th Lesson ప్రత్యుత్పత్తి విధానాలు
→ తరతరాలుగా జాతి మనుగడను సాధ్యమగునట్లు చేయుటకు ప్రత్యుత్పత్తి తోడ్పడుతుంది.
→ ప్రత్యుత్పత్తిలో అలైంగిక మరియు లైంగిక పద్ధతులు కలవు.
→ అలైంగిక ప్రత్యుత్పత్తిలో – సంయోగబీజాల పాత్ర ఉండదు.
→ సరళ నిర్మాణంలో ఉన్న శైవలాలు, శిలీంధ్రాలలో అలైంగిక ప్రత్యుత్పత్తి సర్వసాధారణము.
→ అలైంగిక ప్రత్యుత్పత్తి వల్ల ఏర్పడే సంతతి, ఒకదానిలో ఒకటి పోలికతో ఉండి, జనకానికి నకలుగా (క్లోన్లు) ఉంటాయి.
→ అనేక శైవలాలు, శిలీంధ్రాలలో అలైంగిక ప్రత్యుత్పత్తి గమనసిద్ధ బీజాలు లేదా కొనీడియమ్ల ద్వారా జరుగుతుంది.
→ యూగ్లినా, బాక్టీరియాలలో అలైంగిక ప్రత్యుత్పత్తి – ద్విధావిచ్ఛిత్తి ద్వారా జరుగును.
→ ఈస్ట్లలో అలైంగిక ప్రత్యుత్పత్తి – ప్రరోహోత్పత్తి ద్వారా జరుగును.
→ బ్రయోఫైటా, టేరిడోఫైటా మొక్కల సిద్ధబీజాలు ఏకస్థితికాలు. ఇవి అంకురణ చెంది సంయోగ బీజదాలుగా అభివృద్ధి చెందుతాయి.
→ బహుకణయుత లేదా సహనివేశ శైవలాలు, బూజులు, పుట్ట- గొడుగులలో అలైంగిక ప్రత్యుత్పత్తి ‘ముక్కలు కావడం’ పద్దతి ద్వారా జరుగుతుంది.
→ లివర్ వర్క్స్ లలో జెమ్మాల ద్వారా అలైంగికోత్పత్తి జరుగును.
→ పుష్పించే మొక్కలలో రన్నర్లు, స్టోలన్లు, పిలకమొక్కలు, ఆఫ్సెట్లు, కొమ్ము, కందం, దుంపకాండం, లశునం, లఘులశునాలు శాకీయంగా కొత్త మొక్కలను ఉత్పత్తి చెయ్యగలవు.
→ ఒకజీవి లేదా విరుద్ధ లింగాలకు చెందిన భిన్న జీవుల్లో, పురుష, స్త్రీ సంయోగ బీజాలు ఏర్పడటం, వాటి కలయికను లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు.
→ ఏకవార్షిక, ద్వివార్షిక రకాలకు చెందిన మొక్కలు శాకీయ లైంగిక మరియు జీర్ణత దశలను చక్కగా చూపుతాయి.
→ వరి, గోధుమ, మొక్కజొన్న, వెదురు లాంటి గడ్డి మొక్కలు జీవిత కాలంలో ఒకేసారి పుష్పిస్తాయి.
→ సెంచరీ మొక్క (అగేవ్ అమెరికనా) మరియు వెదురు వాటి చరమ దశలో పుష్పిస్తాయి..
→ స్టోబిలాంథస్ కుంతియానా (నీలకురంజి) 12 సం॥లకు ఒక్కసారి మాత్రమే పుష్పిస్తుంది.
→ లైంగిక ప్రత్యుత్పత్తి – స్త్రీ, పురుష బీజాల కలయిక, సంయుక్త బీజం పిండోత్పత్తి వంటి లక్షణాలతో కూడినది.
→ కొన్ని శైవలాలలో రెండు సంయోగబీజాలు ఒకేవిధంగా ఉంటాయి. వీటిని సమసంయోగ బీజాలు అంటారు. ఉదా : క్లాడోఫోరా.
→ అనేక జీవులలో ఏర్పడే సంయోగ బీజాలు రెండూ స్వరూపంలో భిన్నంగా ఉంటాయి. వీటిని భిన్న సంయోగ భీజాలు అంటారు. ఉదా : ఫ్యూనేరియా, టెరిస్, సైకాస్
→ మొనీరా, శిలీంధ్రాలు, శైవలాలు మరియు బ్రయోఫైట్ ఏకస్థితిక దేహంను కల్గి ఉంటాయి.
→ టెరిడో ఫైట్లు, వివృత బీజాలు, ఆవృత బీజ మొక్కలు ధ్వయస్థితిక దేహంతో ఉంటాయి.
→ ద్వయస్థితిక జీవులలో క్షయకరణ విభజనకు లోనయ్యే కణాలను మియోసైట్ అంటారు.
→ పురుష, స్త్రీ సంయోగ బీజాలు కలయికను సంయుక్త సంయోగము అంటారు. ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది.
→ ఫలదీకరణం చెందని స్త్రీ సంయోగ బీజదం నుండి పిండము ఏర్పడుటను అనిషేక జననం అంటారు.
→ ఎక్కువ శైవలాలలో సంయుక్త సంయోగము జీవి దేహం వెలుపల జరుగును దీనిని బాహ్యఫలదీకరణ అంటార
→ బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, వివృత బీజాలు మరియు ఆవృత బీజాలులో సంయుక్త సంయోగము జీవి దేహంలో జరుగును దీనిని అంతరఫలదీకరణ అంటారు.
→ సంయుక్తబీజం నుండి పిండం ఏర్పడుటను పిండజననం అంటారు.
→ ఫలదీకరణ తర్వాత, అండాశయం, ఫలంగాను, అండాలు విత్తనాలుగాను మారతాయి.
→ మాంగ్రూవ్ లలో విత్తనాలు తల్లి మొక్కను అంటిపెట్టుకుని ఉండగానే అంకురిస్తాయి. దీనిని వివిపారి అంటారు.
→ అసంయోగజననం (Apomixis) : సాధారణ లైంగిక ప్రత్యుత్పత్తికి బదులుగా ఫలదీకరణ లేకుండా జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి లేదా విత్తనాభివృద్ధి.
→ అలైంగిక ప్రత్యుత్పత్తి : పురుష, స్త్రీ సంయోగ బీజాల సంయోగం లేకుండా శాకీయ ప్రత్యుత్పత్తి, విచ్ఛిత్తి (fission) లేదా ప్రరోహోత్పత్తి ద్వారా జరిగే ప్రత్యుత్పత్తి విధానం.
→ ప్రరోహాలేర్పడటం : ఇది ఏక కణజీవుల (ఉదా : ఈస్ట్) అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతులలో ఒకటి. ఈ పద్ధతిలో పక్వస్థితిలో గల జనకుల నుంచి బహిర్జనితంగా పెరిగిన భాగం, కుంచనం ఏర్పడటం ద్వారా వేరై కొత్తజీవిగా అభివృద్ధి చెందుతుంది.
→ క్లోన్ : లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా కాకుండా ఇతర ప్రత్యుత్పత్తి విధానాల ద్వారా ఏర్పడి స్వరూపాత్మకంగా, జన్యుపరంగా ఒకే విధంగా ఉండే సంతతి.
→ కొనిడియోఫోర్ : కొనిడయమ్ సిద్ధబీజాలను ఏర్పరచే ప్రత్యేకమైన వృంతాలు.
→ కొనిడియోస్పోర్/కొనీడియమ్ : శిలీంధ్రాలలోని అలైంగిక పద్ధతి ద్వారా కొనిడియో ఫోర్పై ఏర్పడే చలన రహిత సిద్ధబీజం. వీటినే ‘మైటోస్పోర్లు’ అని కూడా అంటారు.
→ ఏకలింగాశ్రయ మొక్క (Dioecious) : ఒక మొక్కపై ఒకే రకమైన అంటే పురుష లేదా స్త్రీ లైంగికావయవాలు ఏర్పడే స్థితి.
→ విచ్ఛిత్తి : ఏకకణజీవులలో కేంద్రకం, కణద్రవ్య విభజనల వల్ల రెండుగానీ, అంతకంటే ఎక్కువగానీ కొత్త కణాల్ని (జీవుల్ని) ఏర్పరిచే అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి.
→ ముక్కలవడం : ఇది తంతురూప జీవులలో సాధారణంగా గుర్తించబడే శాకీయ ప్రత్యుత్పత్తి పద్ధతి. దీనిలో మొక్క దేహం చిన్న చిన్న ముక్కలుగా యాంత్రిక పద్ధతుల ద్వారా విరిగి, ప్రతి ముక్కా కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది. సంయోగబీజం : లైంగికంగా ప్రత్యుత్పత్తి జరుపుకొనే జీవుల ఫలదీకరణ సమయంలో వేరొక కణంతో సంయోగం చెందే కణం. సంయోగ బీజ జననం : ద్వయస్థితిక లేక ఏకస్థితిక పూర్వగామి కణాలు (Precursor cells), కణ విభజన, కణ విభేదనము ద్వారా పరిపక్వ ఏకస్థితిక సంయోగ బీజాలను ఏర్పరచే ప్రక్రియ.
→ జెమ్మాలు (Gemmae) : అనేక మొక్కలలో, శిలీంధ్రాలలో ఏర్పడే గిన్నె వంటి అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు.
→ ఏకలింగాశ్రయి (Heterothallic) : పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు వేరు వేరు థాలస్లపై అభివృద్ధి చెందడం.
→ ద్విలింగాశ్రయి (Homothallic) : ఒకే థాలస్పై పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఏర్పడటం.
→ కేంద్రక సంయోగం (Karyogamy) : సంయుక్త సంయోగం, ఫలదీకరణ లేదా బ్యాక్టీరియమ్ల సంయుగ్మంలో భాగంగా రెండు కేంద్రకాలు లేదా రెండు కణాలలోని జన్యు పదార్ధాల సంయోగం.
→ ద్విలింగాశ్రయ మొక్క (Monoecious) : ఒకే మొక్కపై పురుష, స్త్రీ లైంగిక అవయవాలు ఏర్పడటం.
→ అనిషేక జననం (Parthenogenesis) : మొక్కలలో ఫలదీకరణ జరగకుండా స్త్రీ బీజకణం పిండంగా అభివృద్ధి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం.
→ ప్రోపగ్యూల్ (Propagule) : శాకీయ వ్యాప్తికి ఉపయోగించే మొక్క పదార్థం లేదా భాగం.
→ సిద్ధబీజాశయం (Sporangium) : (బహువచనం : సిద్ధ బీజాశయాలు -pl-sporangia); ఆధునిక లాటిన్, గ్రీక్లో స్ఫోరా (Spora) = “స్పోర్” (spore) + అన్జిజియాన్ (angeion) “గిన్నెలాగా” (vessel) సిద్ధబీజాలు ఏర్పరచే వాటిని ఆవరించే భాగం.
→ సిద్ధబీజం : ఇది ప్రత్యక్షంగా కొత్తమొక్కగా అభివృద్ధి చెందగల అలైంగిక ఏకకణ ప్రత్యుత్పత్తి ప్రమాణం. ఇది వ్యాప్తి చెందడంకోసం అనుకూలనాలను ఏర్పరచుకొని ప్రతికూల పరిస్థితులలో కూడా అనేక కాలాలపాటు జీవించి ఉండగలదు. సిద్ధబీజాలు అనేక బాక్టీరియమ్లు, మొక్కలు, శైవలాలు, శిలీంధ్రాలు, కొన్ని ప్రోటోజోవన్ల జీవిత చక్రంలో ఒక భాగంగా ఉంటాయి. ఉన్నతశ్రేణి మొక్కలలో సిద్ధబీజ మాతృకలలో క్షయకరణ విభజన అనంతరం ఏర్పడే సిద్ధబీజాలను ‘మియోస్పోరులు” అంటారు. ధాలోఫైటాలో సిద్ధబీజాలు సమవిభజన ఫలితంగా ఏర్పడవచ్చు. అట్టి వాటిని ‘మైటోస్పోరులు’ అంటారు.
→ సంయుక్త సంయోగం (syngamy) : ఫలదీకరణలో రెండు సంయోగ బీజాల సంయోగం. ఆవృత బీజాలలో ఇది ప్రాథమిక ఫలదీకరణ.
→ శాకీయ వ్యాప్తి : మొక్కలలో ఇది ఒక అలైంగిక పద్ధతి. దీనిలో బహుకణయుత నిర్మాణాలు జనక మొక్కల నుంచి విడివడి కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. ఇవి జన్యుపరంగా జనక మొక్కలతో సమరూపకంగా (Identical) ఉంటాయి.
→ గమనసిద్ధబీజం : కొన్ని శైవలాలు, శిలీంధ్రాలలో కశాభాల సహాయంతో చలించగల అలైంగిక సిద్ధబీజం. దీనిని చలత్కసిద్ధబీజం (swarm spore) అని కూడా అంటారు.