Students can go through AP Inter 1st Year Botany Notes 8th Lesson ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Botany Notes 8th Lesson ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం
→ Taxonomy అను పదమును ఎ.పి.డి. కండోల్ (1813) ప్రతి పాదించారు.
→ వర్గీకరణ శాస్త్రములో లక్షణాలను వర్ణించడం గుర్తించడం, నామీకరణ మరియు వర్గీకరణ అను అంశాలు కలవు.
→ కార్ల్ లిన్నేయసన్ను వర్గీకరణ శాస్త్ర పితామహుడుగా కీర్తిస్తారు.
→ స్వరూప లక్షణాలమీద ఆధారపడి చేసిన వర్గీకరణ శాస్త్రాన్ని అల్ఫా వర్గీకరణ శాస్త్రము అంటారు.
→ స్వరూప లక్షణాలతోపాటు, పిండోత్పత్తి శాస్త్రము, కణశాస్త్రము, పరాగరేణు శాస్త్రము, వృక్ష రసాయనశాస్త్రము, సిరాలజి వంటి అనేక శాఖలనుండి సేకరించిన సమాచారం ఆధారంగా చేసిన వర్గీకరణను ఒమేగా వర్గీకరణ శాస్త్రము అంటారు.
→ ఒకటి లేక రెండు లక్షణాలను ఆధారంగా చేసుకొని ఇచ్చిన వర్గీకరణను కృత్రిమ వర్గీకరణ అంటారు.
→ అన్ని లక్షణాలను పరిగణలోనికి తీసుకొని చేసిన వర్గీకరణను సహజ వర్గీకరణ అంటారు.
→ పరిణామక్రమ ప్రవృత్తులను పరిగణలోనికి తీసుకొని చేసిన వర్గీకరణను వర్గవికాస వర్గీకరణ అంటారు.
→ వర్గీకరణలో పుష్పలక్షణాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇవి వాతావరణ కారకాల ప్రభావం వల్ల మార్పుచెందవు.
→ గణితశాస్త్ర పద్ధతులను ఉపయోగించి, వర్గీకరణ సముదాయాల మధ్యగల గమనించ దగ్గ విభేదాలను, పోలికలను లెక్కగట్టే శాస్త్రాన్ని సాంఖ్యక వర్గీకరణ శాస్త్రం అంటారు.
→ క్రోమోసోమ్ల సంఖ్య, నిర్మాణంలాంటి కణ లక్షణాలను ఉపయోగించి వర్గీకరణ సమస్యలను పరిష్కరించే శాఖను కణాధార వర్గీకరణ శాస్త్రము అంటారు.
→ మొక్కలలో ఉండే రసాయన పదార్థాల సమాచారాన్ని ఉపయోగించి వర్గీకరణ సమస్యలను పరిష్కరించే శాఖను రసాయనిక వర్గీకరణశాస్త్రం అంటారు.
→ థియోఫ్రాస్టస్ మొక్కలను, ఆకారంపై ఆధారపడి గుల్మములు పొదలు, వృక్షంలుగా తన గ్రంధమైన హిస్టోరియా ప్లాంటేరంలో వర్ణించారు.
→ బెంథామ్ మరియు హుకర్ల వర్గీకరణను సహజవర్గీకరణ అంటారు.
→ APG- ఆంజియోస్పెర్మిక్ ఫైలోజెనిటిక్ గ్రూప్ అనే వ్యవస్థ ఆధునిక వర్గ వికాస వర్గీకరణ.
→ ఫాబేసిలో పైసం సటైవ, సొలనేసిలో సొలానం నైగ్రమ్, లిలియేసిలో అల్లియం సెపాలు ముఖ్య ఉదాహరణలు.
→ పుష్పచిత్రంలో పుష్ప భాగాల సంఖ్య, వాటి అమరిక, ఒక భాగానికి మరొకభాగానికి మధ్య సంబంధాలను తెలియచేస్తుంది.
→ పుష్పసంకేతం, పుష్పంలోని వివిధ భాగాలను కొన్ని సంకేతాల ద్వారా చూపిస్తుంది.
→ అల్ఫా వర్గీకరణ శాస్త్రం : స్వరూప లక్షణాల మీద మాత్రమే పూర్తిగా ఆధారపడే వర్గీకరణ శాస్త్రం.
→ కృత్రిమ వ్యవస్థ : ఇది సులభంగా పోల్చదగిన కొన్ని స్వరూప లక్షణాల మీద ఆధారపడి ఉండే వర్గీకరణ వ్యవస్థ.
→ ద్వినామ నామీకరణం : ప్రజాతి నామం (generic name), జాతినామం (specific name or specific epithet) అనే రెండు అనుఘటకాలతో పేరుని ఇవ్వడం.
→ వర్గీకరణ : మొక్కలకు వాటి మధ్యగల సారూప్యతలు, విభేదాలు ఆధారంగా నిర్దిష్టమైన సముదాయాలుగా అమర్చడం.
→ సంపూర్ణ పుష్పం : రక్షకపత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం అనే నాలుగు భాగాలున్న పుష్పం.
→ ద్విబంధక కేసరావళి : కేసరాలు సంయుక్తమై రెండు పుంజాలుగా ఏర్పడే స్థితి.
→ ఫ్లోరా : ఒక ప్రదేశంలో ఉన్న మొక్కల ఆవాసం, వితరణల సమాచారాన్ని, మొక్కల జాబితాను ఒక క్రమపద్ధతిలో కలిగి ఉంటుంది.
→ పుష్పచిత్రం : ప్రధాన అక్షం పరంగా పుష్పభాగాల సంఖ్య, నిర్మాణం, అమరిక, పుష్పరచన, సంసంజనం, అసంజనం, స్థానాలను సూచించే చిత్రం.
→ ప్రజాతి : సన్నిహిత సంబంధం ఉన్న జాతులు.
→ భూఫలనం : మృత్తిక కింద ఫలం అభివృద్ధి చెందడం.
→ హెర్బేరియమ్ : సేకరించిన మొక్కల నమూనాలను ఎండిన తరవాత గట్టిగా వత్తి, గట్టి అట్టలపై భద్రపరచి, సేకరణ వివరాలతో వర్గీకరణ వ్యవస్థపరంగా నిల్వ చేయడం.
→ అసంపూర్ణ పుష్పం : పరిపత్రాలు లేదా కేసరాలు లేదా ఫలదళాలలో ఏదో ఒక వలయం లోపించిన పుష్పం.
→ సహజ వర్గీకరణ వ్యవస్థ : సులభంగా పోల్చదగిన కొన్ని స్వరూప లక్షణాలమీద ఆధారపడి చేసిన వర్గీకరణ వ్యవస్థ.
→ సాంఖ్యక వర్గీకరణశాస్త్రం : వివిధ వర్గీకరణ సముదాయాల మధ్య గమనించదగిన పోలికలు, తేడాలను గణితశాస్త్ర పద్ధతులను ఉపయోగించి విలువకట్టే వర్గీకరణ శాస్త్ర విభాగం.
→ ఒమేగా వర్గీకరణశాస్త్రం : స్వరూప లక్షణాల మీదనే కాకుండా పిండోత్పత్తి శాస్త్రం, కణశాస్త్రం, వృక్ష రసాయన శాస్త్రం, పరాగరేణుశాస్త్రం మొదలైన అనేక ఇతర వృక్షశాస్త్ర శాఖల నుంచి లభించే సమాచారం మీద ఆధారపడి ఉండే వర్గీకరణశాస్త్రం.
→ పిస్టన్ యాంత్రికం : ధ్వజ పత్రం కీటకాలను ఆకర్షిస్తుంది. కీటకం పుష్పం మీద వాలినప్పుడు, దాని బరువువల్ల బాహువులు, ద్రోణిపత్రాలు కిందకు నొక్కబడి కీలాగ్రం, కేసరాలు బహిర్గతమవుతాయి. మొదటగా బయటకు వచ్చే కీలాగ్రం కీటకం ఉదరభాగాన్ని తాకి అక్కడ అంటి ఉన్న పరాగరేణువులను గ్రహిస్తుంది. ఈ కీటకం పుష్పాన్ని వదిలినప్పుడు ఆవశ్యకాంగాలు తిరిగి యథాస్థానాన్ని చేరతాయి.
→ మొక్కల సిస్టమాటిక్స్ (Plant Systematics) : మొక్కల వైవిధ్యాన్ని, చరిత్రను, మొక్కల మధ్య పరిణామ సంబంధాలను అధ్యయనం చేయడం.
→ వృక్ష వర్గీకరణశాస్త్రం : మొక్కల లక్షణాలు, గుర్తించడం, నామీకరణ, వర్గీకరణలను చర్చించడం.
→ వర్గవికాస వ్యవస్థ : వివిధ టాక్సా మధ్య ఉండే జన్యుపరమైన, పరిణామ క్రమమైన సంబంధాల మీద ఆధారపడే వర్గీకరణ వ్యవస్థ.
→ టాక్సన్ (Taxon) : వర్గీకరణ వ్యవస్థలోని ఏ స్థాయికి చెందిన ప్రమాణాన్నైనా లేదా రకాన్నైనా టాక్సాన్ అంటారు. ఈ టాక్సా (బహువచనం) లను వృక్షరాజ్యం నుంచి ఉపజాతుల వరకు క్రమ స్థాయిలో అమరుస్తారు.