AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 12th Lesson పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 12th Lesson పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒక మొక్క మెటీరియల్ అడ్డుకోత ఈ క్రింది అంతర్నిర్మాణ ముఖ్యాంశాలను చూపిస్తుంది. (i),నాళికాపుంజాలు సంయుక్తంగా చెల్లాచెదురుగా ఉంటాయి. వీటిని ఆవరించి దృఢ కణజాలయుత పుంజపు ఒర ఉంటుంది. (ii) పోషకకణజాల మృదుకణజాలం లోపిస్తుంది. మీరు దీన్ని ఏవిధంగా గుర్తిస్తారు?
జవాబు:
ఏక దళ బీజ కాండము

ప్రశ్న 2.
దారువు, పోషకకణజాలాలను సంక్లిష్ట కణజాలాలు అని ఎందుకు అంటారు?
జవాబు:
ఒకటి కంటే ఎక్కువ రకాలైన కణాలతో ఏర్పడి, కలసి పనిచేస్తాయి. కావున దారువు, పోషణ కణజాలను సంక్లిష్ట కణజాలాలు అంటారు.

ప్రశ్న 3.
మొక్కల అంతర్నిర్మాణ అధ్యయనం మనకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది?
జవాబు:
అంతర్నిర్మాణ శాస్త్రం ద్వారా, మొక్క విధులు, సాధారణ ప్రక్రియలు అయిన భాష్పోత్సేకము, కిరణజన్య సంయోగక్రియ, పెరుగుదల ఎలా జరుపుకుంటుంది. అనే విషయాలు తెల్సుకోవచ్చు, తర్వాత వృక్షశాస్త్రవేత్తలకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు, మొక్కలకు సంబంధించిన వ్యాధులు, వాటి నివారణ గూర్చి తెలియచేస్తుంది.

ప్రశ్న 4.
ప్రథమ దారువు మొదటగా ఏర్పడ్డ దారువు. ప్రథమ దారువు, పోషక కణజాలం పక్కన వ్యాసార్ధంగా అమరి ఉంటే ఆ దారువు అమరికను మీరు ఏవిధంగా పిలుస్తారు? ఇది మీకు దేనిలో కనిపిస్తుంది?
జవాబు:
వ్యాసార్థపు నాళికా పుంజము ఇది వేళ్లలోకనిపిస్తుంది.

ప్రశ్న 5.
పోషకకణజాల మృదుకణజాలం విధి ఏమిటి?
జవాబు:
పోషణ కణజాల మృదు కణజాలం పొడవైన స్థూపాకార కణాలలో, ఎక్కువ కణ ద్రవ్యంను కేంద్రకంను కల్గి ఉంటుంది. ఇది ఆహార పదార్థాలతో పాటు రెసిన్స్, లేటెక్స్, జిగురు వంటి పదార్థాలను నిల్వచేస్తుంది.

ప్రశ్న 6.
ఎ) వేరులో లోపించి, పత్రాల ఉపరితలాన ఉండి నీటి నష్టాన్ని నిరోధించేది ఏమిటి?
బి)మొక్కలలో నీటి నష్టాన్ని నిరోధించే బాహ్యచర్మకణ రూపాంతరం ఏది?
జవాబు:
ఎ) అవభాసిని
బి) ట్రైకోమ్

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

ప్రశ్న 7.
మొక్కలో ఏ భాగం ఈ కింది వాటిని చూపిస్తుంది?
ఎ) వ్యాసార్ధ నాళిక పుంజం
బి) బహుప్రథమ దారుకమైన దారువు
సి) బాగా అభివృద్ధి చెందిన దవ్వ
డి) బాహ్యప్రథమ దారుకమైన దారువు
జవాబు:
ఎ) వేరు, బి) ఏకదళ బీజ వేరు సి) ఏకదళ బీజ వేరు డి) వేరు

ప్రశ్న 8.
నీటి ప్రతిబలంసమయంలో మొక్కలలో పత్రాలు చుట్టుకొనేటట్లు చేసే కణాలు ఏవి?
జవాబు:
బుల్లి ఫార్మా కణాలు ఇవి ఏకదళబీజ పత్ర ఊర్ధ్వ బాహ్య చర్మంలో ఉంటాయి.

ప్రశ్న 9.
నాళికా విభాజ్య కణావళి వలయంలో ఉండేవి ఏమిటి?
జవాబు:
పుంజాంతస్థ విభాజ్య కణావళి, పుంజాంతర విభాజ్య కణావళి కలసి నాళిక విభాజ్య కణావళి వలయంను ఏర్పరుస్తాయి.

ప్రశ్న 10.
ఫెల్లోజన్, ఫెల్లోడర్మ్ మధ్యన ఉండే ఒక క్రియాత్మక మూల భేదాన్ని తెలపండి.
జవాబు:

ఫెల్లోజన్ ఫెల్లోడర్మ్
1. దీనిని బెండు విభాజ్య కణజాలము అని అంటారు. ఇది ఫెల్లమ్, పెల్లోడర్ ను ఏర్పరుస్తుంది. 1. బెండు విభాజ్య కణజాలము నుండి లోపలి వైపుకు ఏర్పడిన ద్వితీయ వల్కల కణాలు.
2. కణాలు పలుచని కవచాలతో దీర్ఘచతుర స్రాకారంలో ఉంటాయి. 2. కణాలు మృదుకణాలు.

ప్రశ్న 11.
ఒక వృక్షం బెరడును ఎవరైనా తొలగిస్తే, మొక్కలో ఏ భాగాలు తొలగించబడతాయి?
జవాబు:
పరిచర్మం, ద్వితీయ పోషక కణజాలము

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వివిధ రకాల విభాజ్య కణజాలాల స్థానాల్ని, విధుల్ని తెలపండి.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 1
ఎ) అగ్ర విభాజ్య కణజాలం :
ఇవి వేరు, కాండం, శాఖల కొనభాగాల్లో కనిపిస్తాయి. మొక్క పొడవు పెరగడంలో ఇవి ప్రధానపాత్ర వహిస్తాయి.

బి) మధ్యస్థ విభాజ్య కణజాలం :
ఇవి మొక్క ముదిరిన భాగాల్లో, శాశ్వత కణజాలాల మధ్యన కనిపిస్తాయి. కణపు మాధ్యమాల పీఠభాగాల్లో, గడ్డి జాతులు పత్రపీఠాల్లో ఈ కణజాలాలుంటాయి. ఇవి కొద్దికాలమే క్రియాత్మకంగా ఉండి క్రమంగా శాశ్వత కణాలుగా మారతాయి. వీటివల్ల మొక్కల భాగాలు పొడవుగా పెరుగుతాయి.

సి) పార్శ్వ విభాజ్య కణజాలం :
ఇవి మొక్క దేహం యొక్క పార్శ్వఅంచుల వద్ద ఉంటాయి. ఈ కణాలు విభజన చెంది కాండం, వేరు వంటి అంగాలు చుట్టుకొలతలో పెరగడానికి తోడ్పడతాయి. నాళికాపుంజంలో ఉండే విభాజ్య కణావళి ఈ రకానికి చెందినదే. ఇది మొక్కల్లో ద్వితీయ దారువును, ద్వితీయ పోషక కణజాలాన్ని ఉత్పత్తి చేస్తుంది. వల్కల విభాజ్యకణావళి కూడా ఈ కోవకే చెందినది. దీనిచర్య వల్ల పరిచర్మము ఏర్పడుతుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

ప్రశ్న 2.
మీతోట నుంచి తీసుకొన్న ఒక మొక్క లేత కాండం అడ్డుకోత తీసుకొని సూక్ష్మదర్శిని కింద పరిశీలించండి. దీన్ని ఏకదళబీజ కాండమా లేదా ద్విదళబీజ కాండమా అని ఏ విధంగా తెలసుకోగలుగుతారు? కారణాలు తెలపండి.
జవాబు:
ఒక మొక్కలేత కాండంను అడ్డుకోత తీసి సూక్ష్మదర్శినిలో పరిశీలించిన, కొన్ని లక్షణాలను బట్టి అది ద్విదళ బీజ కాండము, ఏకదళబీజ కాండమని చెప్పవచ్చు.

ద్విదళబీజ కాండము ఏకదళబీజకాండము
1) బాహ్య చర్మంపై ట్రైకోమ్లు ఉంటాయి. 1) ట్రైకోమ్లు ఉండవు.
2) అంతశ్చర్మం స్థూల కణజాల నిర్మితము. 2) అధశ్చర్మం దృఢకణజాలం నిర్మితం.
3) సాధారణ వల్కలం అంతశ్చర్మము ఉంటాయి. 3) సాధారణ వల్కలం అంతశ్చర్మం ఉండవు.
4) సంధాయక కణజాలం ఉండదు. 4) సంధాయ కణజాలం ఉంటుంది.
5) నాళికా పుంజాలు ఉలి లేక బొంగరం ఆకారం. 5) నాళికాపుంజాలు అండాకారము.
6) నాళికా పుంజాలు 15-20 వరకు, ఒక వలయంలా అమరి ఉంటాయి. (యూస్టీల్). 6) నాళికాపుంజాలు ఎక్కువ సంఖ్యలో సంధాయక కణజాలంతో చెల్లాచెదురుగా ఉంటాయి. (అటాక్టోస్టీల్)
7) నాళికాపుంజాలు సాధారణము. 7) నాళికాపుంజాలు తంతుయుతము.
8) నాళికాపుంజాలు సహపార్శ్వ, సంయుక్త వివృతాలు 8) నాళికాపుంజాలు సహపార్శ్వ, సంయుక్త సంవృతము
9) ప్రథమదారు అవకాశిక ఉండదు. 9) ప్రథమదారు అవకాశిక ఉంటుంది.
10) దారునాళాలు ఎక్కువ సంఖ్యలో వరుసగా ఉంటాయి. 10) దారునాళాలు తక్కువ సంఖ్యలో ‘Y’ ఆకారంలో ఉంటాయి.
11) పోషక కణజాల మృదుకణజాలము ఉంటుంది. 11) పోషక కణజాల మృదుకణజాలం ఉండదు.
12) దవ్వ, దవ్వ రేఖలు ఉంటాయి. 12) దవ్వ, దవ్వ రేఖలు ఉండవు.

పైభేదాలను బట్టి ఇచ్చిన కాండమును సూక్ష్మ దర్శినిలో పరిశీలించి చెప్పవచ్చు.

ప్రశ్న 3.
పరిచర్మం అంటే ఏమిటి? ద్విదళబీజ కాండంలో పరిచర్మం ఏ విధంగా ఏర్పడుతుంది?
జవాబు:
ఫెల్లోజన్, ఫెల్లమ్, ఫెల్లోడర్ ను కలిపి పరిచర్మము అంటారు. విభాజ్యకణావళి వలయచర్య వలన కాండము వ్యాసంలో పెరుగుతుంది. ఫలితంగా వల్కల, బాహ్యచర్మ కణాలు చితికిపోయి, కొత్తరక్షణ పొరలను ఏర్పరుచుకుంటాయి. వల్కల ప్రాంతంలో విభాజ్య కణజాలం ఏర్పడుతుంది. దీనిని ఫెల్లోజన్ అంటారు. ఇది విభజన చెంది లోపలివైపుకు ఏర్పరిచిన కణాలు ద్వితీయ వల్కలము (ఫెల్లోడర్మ్) గాను, వెలుపలి వైపుకు ఏర్పరిచిన కణాలు బెండు (ఫెల్లమ్) గాను మార్పుచెందుతాయి. బెండు కణజాలము సూబరిన్ లో నిర్మితమై ఉండుట వల్ల నీటికి అపారగమ్యంగా ఉంటుంది. ద్వితీయ వల్కల కణాలు మృదుకణజాలయుతమై ఉంటాయి. ఈ విధంగా ఏర్పడిన ఫెల్లోజన్, ఫెల్లమ్, ఫెల్లోడర్మ్ ను కలిపి పరిచర్మం (పెరీడర్మ్) అంటారు.

ప్రశ్న 4.
వార్షిక వలయాలు అనే ఏక కేంద్రక వలయాలను ఒక వృక్షం మాను అడ్డుకోత చూపిస్తుంది. ఈ వలయాలు ఏ విధంగా ఏర్పడతాయి? ఈ వలయాల ప్రాముఖ్యం ఏమిటి? [‘Mar. ’14]
జవాబు:
వార్షిక వలయాలు :
సమశీతోష్ణ మండలాలు, శీతల మండలాల్లో పెరుగుతున్న వృక్షాల్లో విభాజ్య కణావళి క్రియాశీలత రుతువుల్లో కలిగే మార్పుల మీద ఆధారపడి ఉంటుంది. వసంత రుతువులో ఎక్కువ పత్రాలు, పుష్పాలు ఏర్పడడం వల్ల మొక్కకు ఎక్కువ నీరు, లవణాలు అవసరం ఉంటుంది. అందువల్ల ద్వితీయ దారువులో పెద్ద పెద్ద దారునాళాలు అధిక సంఖ్యలో ఏర్పడతాయి. దీనిని వసంతదారువు (తొలిదారువు) అంటారు. ఇది తేలిక వర్ణంలో కనిపిస్తుంది.

శరదృతువులో మొక్కలో క్రియాత్మకత తగ్గి నీరు, లవణాల అవసరం ఎక్కువగా ఉండదు. అందువల్ల ఈ ఋతువులో ఏర్పడే ద్వితీయ దారువులో సన్నని దారునాళాలు తక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. దీనిని శరద్దారువు (మలిదారువు) అంటారు. ఇది గాఢ వర్ణంలో కనిపిస్తుంది. ఈ విధంగా ఒక సంవత్సరంలో రెండు రకాల దారువులు ఏర్పడతాయి. ఇవి ఏకాంతరంగా ఉన్న వలయాలుగా కనిపిస్తాయి. వీటిని వార్షిక వలయాలు (వృద్ధి వలయాలు) అంటారు. వార్షిక వలయాలను లెక్కించి ఒక వృక్షం వయస్సును సుమారుగా అంచనావేయవచ్చు. ఈ అధ్యయన్నాన్ని ‘డెండ్రోక్రోనాలజీ’ అంటారు.

మనదేశంలాంటి ఉష్ణమండలాల్లో వార్షిక వలయాలు స్పష్టంగా ఏర్పడవు. దీనికి కారణం రుతువుల్లో తీవ్రమైన మార్పులు లేకపోవడమే. ఈ ప్రాంతాలలోని వృక్షాల్లో కనిపించే వలయాలను “పెరుగుదల గుర్తులు” అంటారు.

ప్రశ్న 5.
వాయు రంధ్రాలు, పత్రరంధ్రాల మధ్య ఉండే భేదాలు ఏమిటి?
జవాబు:

వాయురధ్రాలు పత్రరంధ్రాలు
1. దారుయుత వృక్షాలు బెరడులో ఉండే కటకాకార రంధ్రాలను వాయురంధ్రాలు అంటారు. 1. లేత కాండాలు, పత్రాల బాహ్య చర్మంలో ఉన్న చిన్న రంధ్రాలను పత్ర రంధ్రాలు అంటారు.
2. వీటితోపాటు సన్నిహితంగా మృదు కణజాలము ఉంటుంది. రక్షక కణాలు ఉండవు. 2. వీటిని ఆవరించి చిక్కుడు గింజ/ ముద్దరాకారంలో ఉన్న రక్షక కణాలు ఉంటాయి.
3. ఇవి కిరణజన్య సంయోగ క్రియ జరపవు. 3. రక్షక కణాలలో ఉన్న హరితరేణువులు కిరణజన్య సంయోగ క్రియను చూపుతాయి.
4. దగ్గరగా అమరి ఉన్న బెండు కణాల ద్వారా వాయువుల వినిమయం జరుపుకుంటాయి. 4. ఇవి బాష్పోత్సేకమును నియంత్రిస్తూ, వాయువుల వినిమయానికి తోడ్పడతాయి.

ప్రశ్న 6.
వీటి సరియైన విధిని వ్రాయండి.
ఎ) చాలనీ నాళం బి) పుంజంతర విభాజ్య కణావళి సి) స్థూలకోణ కణజాలం డి) దృఢకణజాలం
జవాబు:
ఎ) చాలనీ నాళం :
ఇవి పొడవైనా గొట్టంలాగా సహ కణాలతో కలిసి ఉంటాయి. వీటి అంతిమ గోడలు జల్లెడలాగా రంధ్రయుతంగా ఉండి చాలనీ ఫలకాలను ఏర్పరుస్తాయి. పరికక్వచాలనీ నాళములో పరిధీయ కణద్రవ్యం, పెద్దరిక్తిక ఉంటాయి. ఇవి ఆహార పదార్థాల రవాణాలో తోడ్పడతాయి.

బి) పుంజాంతర విభాజ్య కణావళి :
పుంజాంతస్థ విభాజ్య కణావళి ప్రక్కన ఉన్న దవ్వరేఖలలోని కణాలు విభజన శక్తిని సంపాదించుకుని పుంజాంతర విభాజ్య కణావళిని ఏర్పరుస్తాయి.

సి) స్థూల కోణ కణజాలము :

  1. ఇది సజీవ యాంత్రిక కణజాలము.
  2. దీనిలోని కణాలు కవచాలు సెల్యులోస్, పెక్టిన్లతో నిర్మితమై ఉంటాయి.
  3. హరితరేణువులను కలిగి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాల్ని తయారుచేస్తాయి.
  4. లేత కాండం, పత్రవృంతంలాంటి పెరుగుదల చూపే భాగాలను యాంత్రిక శక్తినిస్తాయి.

డి) దృఢ కణజాలము :

  1. ఇది నిర్జీవ యాంత్రిక కణజాలము.
  2. వీటి కణకవచాలు లిగ్నిన్లో నిర్మితమై మందంగా ఉంటాయి.
  3. నారలు వస్త్ర, జోళి పరిశ్రమలలో ఉపయోగపడతాయి.
  4. దృఢ కణాలు మొక్కల భాగాలను యాంత్రిక శక్తినిస్తాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

ప్రశ్న 7.
పత్రరంధ్రాన్ని రక్షిస్తూ మూత్రపిండాకార రక్షక కణాలు ఉంటాయి. రక్షక కణాలను ఆవరించి ఉండే బాహ్యచర్మ కణాల పేరు తెలపండి. రక్షక కణం ఏ విధంగా బాహ్యచర్మ కణంతో విభేదాన్ని చూపిస్తుంది? మీ జవాబును పటం సహాయంతో విశదీకరించండి.
జవాబు:
లేత కాండాలు, పత్రాలు బాహ్యచర్మంలో ఉన్న రంధ్రాలను పత్ర రంధ్రాలు అంటారు. వీటి చుట్టూ రెండు చిక్కుడు గింజ లేక మూత్రపిండాకారంలో ఉన్న రెండు రక్షక కణాలు ఉంటాయి. రక్షక కణాల చుట్టూ ఉన్న కొన్ని బాహ్యచర్మ కణాలు ఆకారంగా ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని అనుబంధ కణాలు అంటారు.

రక్షక కణాలు అనుబంధ కణాలు
1. చిక్కుడు గింజ/ మూత్రపిండాకారంలో ఉంటాయి. 1. పీపాకారంలో ఉంటాయి.
2. హరితరేణువులు ఉంటాయి. 2. హరితరేణువులు ఉండవు.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 2

ప్రశ్న 8.
రావి (ఫైకస్ రిలిజియోసా), మొక్కజొన్న (జియామేస్) పత్రాలు అంతర్నిర్మాణంలోని భేదాలను సూచించండి. పటాలు గీసి, భేదాలను గుర్తించండి.
జవాబు:

ద్విదళ బీజపత్రం ఏకదళ బీజపత్రం
1. ఉర్ధ్వబాహ్య చర్మం కంటే అధోబాహ్యచర్మంలో పత్రరంధ్రాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 1. పత్ర రంధ్రాల సంఖ్య రెండు బాహ్య చర్మాలలో దాదాపు సమానంగా ఉంటుంది.
2. బుల్లిఫారమ్ కణాలుండవు. 2. ఊర్ధ్వ బాహ్యచర్మంలో బుల్లిఫారమ్ కణాలుంటాయి.
3. పత్రాంతరంలో స్తంభకణజాలం, స్పంజి వంటి కణజాలం ఉంటాయి. 3. పత్రాంతరంలో ఒకే రకమైన కణజాలం ఉంటుంది.
4. పుంజపు తొడుగు వ్యాపనాలు సాధారణంగా మృదు కణజాలయుతం. 4. పుంజపు తొడుగు వ్యాపనాలు సాధారణంగా దృఢ కణజాలయుతం.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 3
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 4

ప్రశ్న 9.
బెండు విభాజ్య కణావళి బెండును ఏర్పరచే కణజాలాలను ఏర్పరుస్తుంది. ఈ వ్యాఖ్యను మీరు అంగీకరిస్తారా? వివరించండి.
జవాబు:
అవును. బెండు విభాజ్య కణజాలము/ ఫెల్లోజన్ ద్విదళ బీజ కాండం ద్వితీయ వృద్ధిలో ఏర్పడి, విభజన చెంది లోపలి వైపుకు ద్వితియ వల్కలము/ ఫెల్లోడెర్ను వెలుపలి వైపుకు బెండు / ఫెల్లోయ్ను ఏర్పరుస్తుంది. బెండు కణజాలంలోని కణాల కవచంలో సూబరిన్ చేరి ఉండటం వల్ల ఈ కణజాలం నీటికి అపారగమ్యంగా ఉంటుంది. నాళికావిభాజ్య కణావళికి వెలుపల ఉన్న కణజాలన్నింటిని కలిపి బెరడు అంటారు. దీనిలో పరిచర్మం, ద్వితీయ పోషక కణజాలము ఉంటాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

ప్రశ్న 10.
పుష్పించే మొక్కలలోని మూడు మూల కణజాల వ్యవస్థల పేర్లను తెలపండి. ప్రతి కణజాల వ్యవస్థకు చెందిన కణజాలాల పేర్లను తెలపండి.
జవాబు:
పుషించు మొక్కలలో మూడు మూలకణజాల వ్యవస్థలు ఉంటాయి. అవి.

  1. బాహ్య చర్మ కణజాల వ్యవస్థ
  2. సంధాయక కణజాల వ్యవస్థ
  3. నాళిక కణజాల వ్యవస్థ

1. బాహ్య చర్మ కణజాల వ్యవస్థ :
దీనిలో బాహ్య చర్మము అవభాసిని, పత్రరంధ్రాలు, కేశాలు (వేర్లు), ట్రైకోమ్లు (కాండము) ఉంటాయి.

2. సంధాయక కణజాల వ్యవస్థ :
దీనిలో సరళకణజాలాలు అయిన మృదుకణజాలము, స్థూలకోణ కణజాలము, దృఢ కణజాలము ఉంటాయి. ఇవి వేర్లు, కాండాల వల్కలం పరిచక్రం, దవ్వ, దవ్వ రేఖలలో ఉంటాయి. పత్రాలలో సంధాయక కణాల హరిత రేణువులను కలిగి పలుచని కవచాలతో ఉంటాయి.

3. నాళికా కణ జాల వ్యవస్థ :
దీనిలో ప్రసరణ కణజాలాలు అయిన, దారువు, పోషక కణజాలము ఉంటాయి.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పటాల సహాయంతో దారుయుత ఆవృతబీజాల కాండాలలో జరిగే ద్వితీయ వృద్ధి పద్ధతిని వివరించండి. దీని ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:
I. ప్రసరణ స్తంభం లోపల జరిగే ద్వితీయవృద్ధి :
1. నాళికా విభాజ్య కణావళి వలయం ఏర్పడటం :
ద్విదళ బీజకాండం ప్రాథమిక నిర్మాణంలో నాళికాపుంజాలు వలయంలాగా అమరి ఉంటాయి. ప్రతి నాళికాపుంజంలో దారువు, పోషక కణజాలాల మధ్య విభాజ్యకళావళి ఉంటుంది. దీనిని ‘పుంజాంతర విభాజ్యకణావళి’ అంటారు. నాళికాపుంజాల మధ్య దవ్వరేఖలుంటాయి. ద్వితీయవృద్ధి మొదలైనపుడు దవ్వరేఖల నుంచి విభాజ్యకణావళి ఏర్పడుతుంది. దీనిని పుంజాల మధ్య విభాజ్య కణావళి అంటారు. ఈ రెండు కణాల విభాజ్యకణావళులు ఒకదానితో మరొకటి కలిసిపోయి ఒక సంపూర్ణ విభాజ్యకణావళి వలయం రూపొందుతుంది. దీనినే నాళికా విభాజ్యకణావళి ఉంది అంటారు.

2. విభాజ్యకణావళి వలయం క్రియాశీలత :
విభాజ్యకణావళి వలయంలోని కణాలు పరివేష్టిత విభజనలు జరిపి రెండువైపులా కొత్తకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ కణాలు ద్వితీయ ప్రసరణ కణజాలాలుగా విభేదనం చెందుతాయి. వెలుపలివైపుకు ఏర్పడ్డ కణజాలం ద్వితీయ పోషకకణజాలంగా మారుతుంది. లోపలివైపుకు ఏర్పడిన కణజాలము ద్వితీయ దారువుగా రూపొందుతుంది. ద్వితీయ దారువులో దారునాళాలు, దారుకణాలు, దారు నారలు, దారు మృదుకణజాలం ఉంటాయి. ద్వితీయ పోషక కణజాలంలో చాలనే నాళాలు, సహయక కణాలు, పోషక కణజాల నారలు, పోషక మృదు కణజాలము ఉంటాయి. ద్వితీయ దారువు నిరంతరంగా తయారయ్యి సంచయనం చెందుట వల్ల ప్రాథమిక, ద్వితీయ పోషక కణజాలాలు క్రమేపి చేతికి పోతాయి. కొన్ని ప్రదేశాలలో విభాజ్యకణావళి మృదుకణాలను సన్నసి వరసల రూపంలో ఉత్పత్తి చేస్తుంది. ద్వితీయ దారువు, ద్వితీయ పోషక కణజాలం గుండా వ్యాపించి ఉంటాయి. వీటిని ద్వితీయ దవ్వరేఖలు అంటారు.

వార్షిక వలయాలు :
సమశీతోష్ణ మండలాలు, శీతల మండలాల్లో పెరుగుతున్న వృక్షాల్లో విభాజ్య కణావళి క్రియాశీలత రుతువుల్లో కలిగే మార్పుల మీద ఆధారపడి ఉంటుంది. వసంత రుతువులో ఎక్కువ పత్రాలు, పుష్పాలు ఏర్పడడం వల్ల మొక్కకు ఎక్కువ నీరు, లవణాలు అవసరం ఉంటుంది. అందువల్ల ద్వితీయ దారువులో పెద్ద పెద్ద దారునాళాలు అధిక సంఖ్యలో ఏర్పడతాయి. దీనిని వసంతదారువు (తొలిదారువు) అంటారు. ఇది తేలిక వర్ణంలో కనిపిస్తుంది.

శరదృతువులో మొక్కలో క్రియాత్మకత తగ్గి నీరు, లవణాల అవసరం ఎక్కువగా ఉండదు. అందువల్ల ఈ ఋతువులో ఏర్పడే ద్వితీయ దారువులో సన్నని దారునాళాలు తక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. దీనిని శరద్దారువు (మతిదారువు) అంటారు. ఇది గాఢ వర్ణంలో కనిపిస్తుంది. ఈ విధంగా ఒక సంవత్సరంలో రెండు రకాల దారువులు ఏర్పడతాయి. ఇవి ఏకాంతరంగా ఉన్న వలయాలుగా కనిపిస్తాయి. వీటిని వార్షిక వలయాలు (వృద్ధి వలయాలు) అంటారు. వార్షిక వలయాలను లెక్కించి ఒక వృక్షం వయస్సును సుమారుగా అంచనావేయవచ్చు. ఈ అధ్యయనాన్ని ‘డెండ్రోక్రోనాలజి’ అంటారు. మనదేశంలాంటి ఉష్ణమండలాల్లో వార్షిక వలయాలు స్పష్టంగా ఏర్పడవు. దీనికి కారణం రుతువుల్లో తీవ్రమైన మార్పులు లేకపోవడమే. ఈ ప్రాంతాలలోని వృక్షాల్లో కనిపించే వలయాలను “పెరుగుదల గుర్తులు” అంటారు.

అంతర్దారువు, రసదారువు :
చేవదేరిన కాండంలోని ద్వితీయదారువు రెండు రకాలుగా ఉంటుంది. మధ్యభాగం ముదురువర్ణంలో కనిపిస్తుంది. దీనిని అంతర్దారువు (డ్యూరమెన్) అంటారు. టానిన్లు, రెసిన్లు, నూనెలు, జిగుర్లు, రంగుపదార్థాలు, సువాసన పదార్థాలు మొదలైన వాటితో అంతర్దారువు పూర్తిగా నిండి ఉంటుంది. దారునాళాల్లోకి అనేక ‘టైలోసిస్లు’ కూడా పెరిగి ఉంటాయి. దారువులోని మృదుకణాల కవచాలు లిగ్నిన్ పూరితమై ఉంటాయి. అంతర్దారువుకి ఎక్కువ మన్నిక ఉంటుంది. ఇది నీటి ప్రసరణలో ఉపయోగపడదు. కేవలం మొక్కలకు యాంత్రిక ఆధారాన్నిస్తుంది. అంతర్దారువు గట్టిగాను, శ్రేష్ఠంగాను ఉంటుంది. వాణిజ్యపరంగా దీనికి ఎక్కువ విలువ ఉంటుంది.. దీనిని గృహోపకరణాల తయారీకి వాడతారు.

కాండంలో అంతర్దారువు చుట్టూ కనిపించే తేలిక వర్ణంగల దారువును రసదారువు (ఆల్బర్నమ్) అంటారు. ఇది కొత్తగా ఏర్పడ్డ దారువు. ఇది మాత్రమే నీరు, లవణాల ప్రసరణలో పాల్గొంటుంది. రసదారువులోని గట్టిదనం అంతగా ఉండకపోవడం వల్ల వాణిజ్యపరంగా అంతర్దారువంత విలువైంది కాదు. వృక్షం వయస్సు పెరుగుతున్న కొద్దీ రసదారువు క్రమంగా అంతర్దారువుగా మారుతుంది. అందువల్ల రసదారువు మందం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది.

ప్రసరణ స్తంభం వెలుపల ద్వితీయవృద్ధి వల్కలంలో జరుగుతుంది. ప్రసరణ స్తంభంలో విభాజ్యకణావళి క్రియాశీలత వల్ల ద్వితీయదారువు, ద్వితీయపోషకకణజాలం ఏర్పడి ప్రసరణ స్తంభం పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా బాహ్యచర్మంపై ఒత్తిడి అధికం కావడం వల్ల అది పగిలిపోయి లోపలి సున్నితమైన వల్కల కణాలు బహిర్గతమవుతాయి. వాటి రక్షణకోసం వల్కలంలో ద్వితీయ రక్షణకవచం నిర్మితమవుతుంది. దీనిని ‘పరిచర్మం’ అంటారు. వల్కలం మధ్య వరుసల నుంచి గాని, లోపలి వరుసల నుంచి గాని ఏర్పడే విభాజ్య కణావళిలో వల్కలంలో జరిగే ద్వితీయవృద్ధి ప్రారంభం అవుతుంది. ఈ విభాజ్యకళావళిని ‘బెండు విభాజ్యకణావళి’ (ఫెల్లోజన్) అంటారు.

దీనిలోని కణాలు పరివేష్టిత విభజనలు జరిపి రెండు వైపులా క్రొత్త కణాలను ఏర్పరుస్తాయి. వెలుపలి వైపు ఏర్పడ్డ కణాలు ‘బెండు కణజాలం’ (ఫెల్లమ్)గా రూపొందుతాయి. లోపలివైపు ఏర్పడ్డ మృదుకణాలు ద్వితీయవల్కలంగా (ఫెల్లోడెర్మ్) రూపొందుతాయి. లోపలివైపుకంటే వెలుపలివైపు ఎక్కువ కణాలు ఏర్పడతాయి. బెండు, బెండు విభాజ్యకణావళి, ద్వితీయవల్కలాలను కలిపి పరిచర్మం అంటారు. బెండుకణాలు ఘనచతురస్రాకారంగా, అడ్డు వరుసల్లో ఉంటాయి. ఇవి నిర్జీవకణాలు. ద్వితీయ వల్కలంలో సజీవకణాలుంటాయి. వీటి మధ్య కణాంతరావకాశాలు కనిపిస్తాయి. ఈ కణాల్లో హరితరేణువులుంటాయి. దీనిలో పిండి పదార్థాల సంశ్లేషణ జరుగుతుంది.

నాళికా విభాజ్య కణావళి వెలుపలి కణజాలాలన్నింటిని కలిపి బెరడు అంటారు. దీనిలో పరిచర్మము, ద్వితీయ పోషక కణజాలము ఉంటాయి. ఒక ఋతువులో మొదట ఏర్పడే బెరడును మృదు బెరడు అని, ఋతువు చివర్లో ఏర్పడే వానిని దృఢ బెరడు అని అంటారు.
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 5

కొన్ని ప్రదేశాలలో ఫెల్లోజన్ వెలుపలి వైపు బెండు కణాల బదులు దగ్గరగా అమరి ఉన్న మృదు కణాలను (సంపూరక కణాలు) ఏర్పరుస్తుంది. ఇవి క్రమేపి బాహ్యచర్మాన్ని పగలగొట్టి కలుకార రంధ్రాలను ఏర్పరుస్తాయి. వీటిని వాయురంధ్రాలు అంటారు. వీటి ద్వారా కాండంలోపలి కణజాలం వెలుపలి వాతావరణం మధ్య వాయువుల వినిమయం జరుగుతుంది.

ప్రశ్న 2.
వీటి మధ్యన ఉండే అంతర్నిర్మాణ భేదాలను తెలిపే పటాలను చిత్రీకరించండి.
జవాబు:

ఏకదళ బీజవేరు ద్విదళ బీజవేరు
1) వల్కలము పెద్దదిగా ఉంటుంది. 1) వల్కలము చిన్నదిగా ఉంటుంది.
2) పరిచక్రం నుంచి పార్శ్వవేర్లు మాత్రమే ఏర్పడతాయి. 2) పరిచక్రం నుంచి పార్శ్వ వేర్లు, ద్వితీయ వృద్ధి సమయంలో విభాజ్య కణావళి ఏర్పడతాయి.
3) దారువు బహు ప్రథమదారుకము. 3) దారువు చతుః ప్రథమదారుకము.
4) దవ్వ ఎక్కువగా ఉంటుంది. 4) దవ్వ తక్కువగా ఉంటుంది.
5) ద్వితీయ వృద్ధి జరుగదు. 5) ద్వితీయ వృద్ధి జరుగుతుంది.
ఏకదళ బీజకాండము ద్విదళ బీజకాండము
1) బాహ్య చర్మంపై ట్రైకోమ్లు ఉంటాయి. 1) ట్రైకోమ్లు ఉండవు.
2) అదృశ్చర్మం స్థూల కణజాల నిర్మితము 2) అదఃశ్చర్యం దృఢకణజాలం నిర్మితం.
3) సాధారణ వల్కలం అంతఃశ్చర్మము ఉంటాయి. 3) సాధారణ వల్కలం అంతశ్చర్మం ఉండవు.
4) సంధాయక కణజాలం ఉండదు. 4) సంధీయకణజాలం ఉంటుంది.
5) నాళికా పుంజాలు ఉలి లేక బొంగరం ఆకారం. 5) నాళికాపుంజాలు అండాకారము.
6) నాళికా పుంజాలు 15-20 వరకు, ఒక వలయంలా -అమరి ఉంటాయి. (యూస్టీల్). 6) నాళికాపుంజాలు ఎక్కువ సంఖ్యలో సంధాయక కణజాలంతో చెల్లాచెదురుగా ఉంటాయి. (అటాక్టోస్టీల్)
7) నాళికాపుంజాలు సాధారణము. 7) నాళికాపుంజాలు తంతుయుతము.
8) నాళికాపుంజాలు సహపార్శ్వ, సంయుక్త వివృతాలు 8) నాళికాపుంజాలు సహపార్శ్వ, సంయుక్త సంవృతము
9) ప్రథమదారు అవకాశిక ఉండదు. 9) ప్రథమదారు అవకాశిక ఉంటుంది.
10) దారునాళాలు ఎక్కువ సంఖ్యలో వరుసగా ఉంటాయి. 10) దారునాళాలు తక్కువ సంఖ్యలో ‘Y’ ఆకారంలో ఉంటాయి.
11) పోషక కణజాల మృదుకణజాలము ఉంటుంది. 11) పోషక కణజాల మృదుకణజాలం ఉండదు.
12) దవ్వ, దవ్వ రేఖలు ఉంటాయి. ఉంటాయి. 12) దవ్వ, దవ్వ రేఖలు ఉండవు.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

ప్రశ్న 3.
సరళ కణజాలాలు అంటే ఏమిటి ? వివిధ రకాల సరళ కణజాలాలను వర్ణించండి.
జవాబు:
నిర్మాణంలోను, విదిలోను ఒకే రకంగా ఉండే కణాలను కలిగిన శాశ్వత కణజాలను సరళ కణజాలాలు అంటారు. ఇవి మూడు రకాలు : అవి

  1. మృదు కణజాలము
  2. స్థూలకోణ కణజాలము,
  3. దృఢ కణజాలము.

1) మృదు కణజాలము :
మొక్కలలో అధిక భాగము దీనితో తయారయి ఉంటుంది. కణాలు సమవ్యాసంలో, గోళాకారంగా అండాకారంగా, బహుభుజితాకారంగా లేదా పొడవుగా ఉంటాయి. వీటి కణ కవచాలు పలుచగా, సెల్యులోస్తో నిర్మితమై ఉంటాయి. ఇట్టి కిరణజన్య సంయోగక్రియకు ఆహారపదార్థాల నిల్వకు, స్రావాలను స్రవించడంలోను పాల్గొంటాయి.

2) స్థూలకోణ కణజాలము :
ఇది సజీవ యాంత్రిక కణజాలము. ఇది బాహ్య చర్మం దిగువన ఒకే రకమైన పొరగా లేక మాసికలుగా ఉంటుంది. ఈ కణాల మూలాల వద్ద సెల్యూలోస్ హెమీ సెల్యూలోస్, పెక్టిన్లు ఉంటాయి. కణాలు అండాకారం, గోళాకారం లేదా బహుభుజి ఆకారంలో ఉండి తరచుగా హరిత రేణువులను కల్గి ఉంటాయి. ఇవి ఆహార పదార్థాల తయారీలోను, లేత కాండం, పత్రవృంతంలాంటి పెరుగుదల చూపే భాగాలకు యాంత్రిక శక్తినివ్వడంలో తోడ్పడతాయి.

3) దృఢకణజాలము :
ఇవి నిర్జీవ యాంత్రిక కణజాలము వీటి కణ కవచాలు లిగ్నిన్తో నిర్మితమై, మందంగా ఉంటాయి. కణాలలో జీవ పదార్థం ఉండదు. రూపం, నిర్మాణం ఆధారంగా ఇది రెండు రకాలుగా ఉంటుంది.

a) నారలు :
సన్నగా, పొడవుగా మొనదేలిన కొనలతో మందమైన కవచాలతో ఉంటాయి. ఇవి యాంత్రిక శక్తినిస్తాయి. వస్త్ర పరిశ్రమలలో ఉపయోగపడతాయి.
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 6

b) దృఢ కణాలు గోళాకారం, అండాకారం లేదా స్థూపాకారంగా ఉంటాయి. వీటి కవచాలు మందంగా ఉండి, సన్నని అవకాశిక కల్గి ఉంటాయి. ఇవి నట్స్ ఫలకవచాలలో, జామ, సపోటా వంటి ఫలాల గుజ్జులలో, లెగ్యూమ్ల బీజకవచాలలో ఉంటాయి.

ప్రశ్న 4.
సంక్లిష్ట కణజాలాలు అంటే ఏమిటి? వివిధ రకాల సంక్లిష్ట కణజాలాలను వర్ణించండి.
జవాబు:
ఒకటి కంటే ఎక్కువ రకాలైన కణాలతో తయారయిన కణజాలంను సంక్లిష్ట కణజాలాలు అంటారు. ఇవి అన్ని కలసి ఒకే ప్రమాణంగా పనిచేస్తాయి. ఇవి 2 రకములు అవి దారువు, పోషక కణజాలము.
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 7

1. దారువు :
వేరు నుంచి కాండానికి, పత్రానికి నీరు, ఖనిజాలను సరఫరా చేస్తూ, మొక్క భాగాలకు యాంత్రిక బలాన్ని సమకూరుస్తుంది. ఇది నాలుగు రకాల మూలకాల్ని కలిగి ఉంటుంది. అవి దారుకణాలు, దారునాళాలు, దారు నారలు, దారు మృదుకణజాలము. దారుకణాలు. పొడవుగా, గొట్టంలాగా, కొనలు సన్నగా, వాడిగా ఉంటాయి. కవచాలు లిగ్నిన్ పూరితమై మందంగా ఉంటాయి.

ఇవి నిర్జీవ కణాలు. దారుకణాలు పొడవుగా, స్థూపాకార గొట్టంలాంటి నిర్మాణాలు వాటి కవచం లిగ్నిన్ పూరితమై, లోపల పెద్ద అవకాశిక కల్గి ఉంటుంది. ఇవి వాటి ఉమ్మడి కవచాలలో ఉన్న రంధ్రాల ద్వారా ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. దారు నారలు సన్నగా, పొడవుగా, మందమైన కవచంతో ఉంటాయి. అవకాశికలు సన్నగా, ఇరుకుగా ఉంటాయి. దారువులోని సజీవ కణాలు దారు మృదుకణజాలము వీటి కణకవచాలు సెల్యులోస్తో తయారై పలుచగా ఉంటాయి. ఇవి పిండిపదార్థము, కొవ్వులాంటి ఆహార పదార్థాలను టానిన్స్న నిల్వ చేస్తాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 8
పోషక కణజాలము :
పత్రాల నుంచి మొక్క ఇతర భాగాలకు ఆహారపదార్థాలను రవాణా చేస్తుంది. దీనిలో చాలనీనాళ మూలకాలు, సహ కణాలు, పోషక మృదుకణజాలము, పోషక కణజాల నారలను కలిగి ఉంటుంది. చాలనీ నాళ మూలకాలు పొడవుగా గొట్టంలాగా ఉండే నిర్మాణాలు. ఇవి నిలువు వరసలలో అమరి, సహకణాలతో కలిసి ఉంటాయి. వీటి అంతిమ కుడ్యాలు జల్లెడలాగా రంధ్రయుతంగా ఉండే చాలనీ మూలకంలో పరిధీయ కణద్రవ్యం, పెద్దరికిక ఉంటాయి. కాని కేంద్రకం ఉండదు. సహకణాలు, చాలనీ నాళమూలకాలలో అతి దగ్గరగా కలిసి, ఉమ్మడి అనుదీర్ఘాక్ష కవచాలలోని గర్త క్షేత్రాల ద్వారా సంబంధాన్ని కలిగి ఉంటాయి.

పోషక మృదుకణజాలము పొడవైన స్థూపాకార కణాలతో తయారు చేయబడి ఉంటుంది. వీటి కవచాలు పలుచగా సెల్యులోస్తో నిర్మితమై ఉంటాయి. కణాలు ఆహార పదార్థాల నిల్వకు, రెసిన్లు, లేటెక్స్, జిగురు లాంటి పదార్థాలను నిల్వచేయుటకు తోడ్పడతాయి. పోషక కణజాల నారలు, దృఢకణజాల కణాలతో తయారవుతాయి. ఇవి పొడవుగా, శాఖారహితంగా ఉండే కణాలు. వీటి కొనలు సన్నగా మొనదేలి ఉంటాయి. వీటి కవచాలు మందంగా లిగ్నిన్తో ఉంటాయి. పరిపక్వ దశలో నారలు నిర్జీవమవుతాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

ప్రశ్న 5.
భాగాలను గుర్తించిన పటం సహాయంతో పృష్టోదర పత్రం అంతర్నిర్మాణాన్ని వర్ణించండి. [Mar. ’14]
జవాబు:
పృష్టోదర పత్రం (ద్విదళ బీజపత్రం) అడ్డుకోతలో 1) బాహ్యచర్మం, 2) పత్రాంతరం, 3) నాళికాపుంజాలు అనే మూడు నిర్దిష్టమయిన భాగాలు కన్పిస్తాయి.

1) బాహ్యచర్మం :
బాహ్యచర్మం ఒకే కణ మందంలో ఉంటుంది. పత్రంపై భాగాన ఉన్న బాహ్యచర్మాన్ని ఊర్ధ్వ బాహ్య చర్మమనీ, క్రింది భాగాన ఉన్న బాహ్యచర్మాన్ని అధోబాహ్యచర్మమని అంటారు. బాహ్యచర్మంలో కణాలు పీపాకారంలో ఉండి ఒత్తుగా కణాంతరావకాశాలు లేకుండా అమరి ఉంటాయి. కణాలు సజీవకణాలు, కణాల్లో రిక్తికాయుత కణద్రవ్యం, ఒక కేంద్రకం ఉంటాయి. బాహ్యచర్మంలో పత్రరంధ్రాలుంటాయి. పత్రరంధ్రాలు ఊర్ధ్వ బాహ్యచర్మంలో కన్న అధోబాహ్య చర్మంలో ఎక్కువగా ఉంటాయి. పత్ర రంధ్రానికి ఇరువైపులా రక్షక కణాలు, మూత్రపిండాకారంలో కనిపిస్తాయి. ఇవి పత్రరంధ్రం తెరుచుకోవడాన్ని, మూసుకోవడాన్ని నియంత్రిస్తాయి. బాహ్యచర్మంపై అవభాసిని ఉంటుంది. బాహ్యచర్మం రక్షణనిస్తుంది. వాయువినిమయాన్ని, బాష్పోత్సేకాన్ని నియంత్రణ చేయడానికి సహకరిస్తుంది. బాహ్యచర్మంపైన బహుకణయుత, ఏకశ్రేణియుత కేశాలు ఉంటాయి. ఇవి క్యూటిన్తో నిర్మితమై ఉంటాయి. వీటిలో నీరు నిల్వ ఉంటుంది. ఇవి సూర్యరశ్మిలోని వేడిని పీల్చుకుని, లోపలి కణజాలాలకు రక్షణ ఇస్తాయి మరియు పత్రం నుండి నీరు ఆవిరికాకుండా కాపాడతాయి.

2) పత్రాంతరం :
ఊర్థ్వ అధోబాహ్యచర్మాల మధ్యగల భాగాన్ని పత్రాంతరం అంటారు. దీనిలో ఎ) స్తంభమృదుకణజాలం, బి) స్పంజిమృదుకణజాలం అనే భాగాలు ఉంటాయి.

ఎ) స్తంభమృదుకణజాలం :
ఇది ఊర్థ్వ బాహ్యచర్మం క్రింద 1 · 3 నిలువు వరుసలలో స్తంభ మృదు కణజాలం ఉంటుంది. దీనిలో కణాలు పొడవుగా, స్తంభాకారంగా ఉంటాయి. ఆ స్తంభాకార కణాలు ఊర్ధ్వ బాహ్యచర్మానికి సమకోణంలో అమరి ఉంటాయి. ఈ కణాలలో హరితరేణువులు ఎక్కువగా ఉంటాయి. ఈ కణాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా పిండి పదార్థాన్ని తయారుచేస్తాయి.

బి) స్పంజిమృదుకణజాలం :
స్తంభమృదుకణజాలము కిందనుండి అధోబాహ్యచర్మం వరకు అమరిఉన్న మృదుకణజాలాన్ని స్పంజిమృదుకణజాలం అంటారు. ఈ కణాలు అపక్రమంగా, 3-5 వరుసల్లో, వదులుగా అమరి ఉంటాయి. కణాల మధ్య కణాంతరావకాశాలు పెద్దవిగా ఉంటాయి. పత్రరంధ్రాల దిగువన ఉన్న కణాంతరావకాశాలు గాలి గదులుగా ఏర్పడి ఉంటాయి. కణాలలో తక్కువ సంఖ్యలో హరితరేణువులుంటాయి. కణజాలం ప్రధానంగా వాయువుల ప్రసరణలో పాల్గొంటుంది. కొంతవరకు కిరణజన్యసంయోగక్రియను జరుపుతుంది.

సి) నాళికాపుంజాలు :
ఇవి పత్రాంతరంలో ఈనెలుగా విస్తరించి ఉంటాయి. ఈనెలు పత్రానికి తన్యతా బలాన్ని కల్పిస్తాయి. పత్రం అన్ని వైపులకు నీరు, ఖనిజ లవణాలను సరఫరా చేస్తాయి.

నాళికా పుంజము గుండ్రంగా ఉంటుంది. దీనిలో దారువు, పోషక కణజాలాలు ఒకే వ్యాసార్థంపైన అమరి ఉంటాయి. దారువు ఊర్ధ్వ బాహ్య చర్మంవైపు, పోషక కణజాలము అధోబాహ్య చర్మంవైపు ఉంటాయి. వీటి మధ్య విభాజ్య కణావళి ఉండదు. కావున వీటిని సహపార్శ్వ, సంయుక్త, సంవృత నాళికాపుంజాలు అంటారు. నాళికాపుంజాల చుట్టూ మృదుకణాల నిర్మిత తొడుగు ఉంటుంది. దీనిని పుంజపు తొడుగులేక సరిహద్దు మృదుకణజాలము అంటారు. పుంజపు తొడుగు నుండి నాళికాపుంజము పైవైపు క్రిందవైపు బాహ్య చర్మాలను కలుపుతూ పుంజపు తొడుగు వ్యాపనాలు ఉంటాయి. ఇవి పత్రాంతరం నుండి నాళికాపుంజాలకు ఆహార పదార్థాలను సరఫరా చేయుటకు తోడ్పడతాయి.
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 9

ప్రశ్న 6.
భాగాలను గుర్తించిన పటం సహాయంతో సమద్విపార్శ్వ పత్రం అంతర్నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
ఏకదళ బీజపత్రం అడ్డుకోతలో బాహ్యచర్మము, పత్రాంతరము, నాళికాపుంజాలు అను మూడు భాగాలు కనిపిస్తాయి.

i) బాహ్యచర్మం :
పత్రానికి అభ్యక్షతలంలో ఊర్థ్వబాహ్యచర్మము మరియు ఉపాక్షతలంలో అథోఃబాహ్య చర్మము ఉంటాయి. బాహ్యచర్మ కణాలు పీపా ఆకారంలో దట్టంగా, ఒక వరుసలో అమరి ఉంటాయి. కణాలలో రిక్తికాయుత కణద్రవ్య కేంద్రకము ఉంటాయి. హరిత రేణువులు ఉండవు. బాహ్యచర్మం వెలుపలివైపు క్యూటిన్ తో నిర్మితమైన అవభాసిని ఉంటుంది. పత్రరంధ్రాలు ఊర్ధ్వ, అథోఃబాహ్య చర్మాలలో సమానంగా ఉంటాయి. పత్రరంధ్రానికి ఇరువైపులా ఉన్న రక్షక కణాలు ముద్గరాకారంలో ఉంటాయి. బాహ్యచర్మంపై కేశాలు ఉండవు. ఊర్ధ్వబాహ్య చర్మంలో (గడ్డి జాతులలో ) అక్కడక్కడ పెద్ద కణాలు గుంపులుగా కనిపిస్తాయి. వీటిని బుల్లిఫార్మ్ కణాలు లేక మోటారు కణాలు అంటారు. ఇవి నీటితో నిండి ఉంటాయి. నీటి లభ్యతను బట్టి పత్రం ముడుచుకొనడానికి, విప్పారుటకు తోడ్పడతాయి. బాహ్యచర్మం రక్షణకు, బాష్పోత్సేకానికి, వాయువుల వినిమయానికి తోడ్పడుతుంది.

ii) పత్రాంతరము :
ఊర్ధ్వ, అధో బాహ్యచర్మాల మధ్యన స్పాంజికణజాలం మాత్రమే ఉంటుంది. దీనిలోని కణాలు వదులుగా కణాంతరావకాశాలతో ఉంటాయి. వీటిలో హరితరేణువులు సమాన సంఖ్యలో ఉంటాయి. కావున వీటిని సమద్విపార్శ్వ పత్రాలు అంటారు. పత్రాంతరం పిండి పదార్థ సంశ్లేషణలో పాల్గొంటుంంది.
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 10

3) నాళికా పుంజాలు :
అనేక నాళికాపుంజాలు ఒకదానికొకటి పత్రాంతరంలో ఈనెలుగా వ్యాపించి ఉంటాయి. నాళికాపుంజాలు సంయుక్తంగా, సహపార్శ్వంగా, సంవృతంగా ఉంటాయి. దారువు ఊర్ధ్వబాహ్యచర్మం వైపు, పోషక కణజాలం అధోబాహ్యచర్మం వైపు ఉంటాయి. నాళికాపుంజాల చుట్టూ నాళికాపుంజపు తొడుగు, సరిహద్దు మృదుకణజాలం ఉంటుంది. ఇది మృదుకణజాలంతో గాని, దృఢకణజాలంతోగాని నిర్మితమై ఉంటుంది. నాళికాపుంజంపైన, కింద పుంజపు తొడుగు వ్యాపనాలు ఉంటాయి. ఇవి నాళికాపుంజాన్ని ఊర్ధ్వ, అధో బాహ్యచర్మాలతో కలుపుతాయి. ఇవి ఆహారపదార్థాల ప్రసరణలోనే కాకుండా యాంత్రిక ఆధారాన్నివ్వడంలో కూడా తోడ్పడతాయి. ఏకదళ పత్రాలలో ఇవి నిర్జీవ దృఢ కణజాలంతో ఏర్పడి ఉంటాయి. ఇవి ఈనెలకు యాంత్రిక బలాన్ని కల్పిస్తాయి.

ప్రశ్న 7.
ఈ కింది వాటి మధ్యగల భేదాలను తెలియజేయండి.
ఎ) ప్రథమదారువులోని బాహ్య ప్రథమ దారుక, అంతర ప్రథమ దారుక స్థితి
బి) ప్రసరణస్థంభం, నాళికా పుంజం
సి) ప్రథమదారువు, అంతరదారువు
డి)పుంజాంతర విభాజ్యకణావళి, పుంజాంతస్థ విభాజ్యకణావళి
ఇ) వివృత, సంవృత నాళికాపుంజాలు
ఎఫ్) కాండకేశం, మూలకేశం
జి)అంతర్దారువు, రసదారువు
హెచ్) వసంతదారువు, శరద్దారువు
జవాబు:

a) బహుప్రథమ దారుక స్థితి
– ప్రథమ దారువు పరిధివైపున అంత్యదారువు లోపలికి అమరి ఉండుట.
ఉదా : వేర్లు
అంతర ప్రథమ దారుక స్థితి
– ప్రథమ దారువు లోపలికి, అంత్యదారువు వెలుపలి వైపున అమరి ఉండుట.
ఉదా : కాండాలు
b) ప్రసరణ స్థంభం

– పరిచక్రము, నాళికా పుంజాలు దవ్వ, దవ్వ రేఖలు కలిపి ప్రసరణ స్థంభం అంటారు.
– వేరు కాండంలలో మధ్య భాగము

నాళికా పుంజము
– దారువు, పోషక కణజాలమును కలిపి నాళికా పుంజము అంటారు.
– ప్రసరణ కణజాలాలు కల భాగము
c) ప్రథమ దారువు
– మొదటిగా ఏర్పడే ప్రాథమిక దారు మూలకాలను ప్రథమ దారువు అంటారు.- అవకాశిక చిన్నది.
అంత్యదారువు
– ప్రథమ దారువు తర్వాత ఏర్పడే దానిని అంత్యదారువు అంటారు.
– అవకాశిక పెద్దది.
d) పుంజాంతస్థ విభాజ్య కణావళి ప్రక్కన
– పుంజాంతర విభాజ్య కణావళి ఉన్న దవ్వ రేఖలలోని కణాలు విభజన శక్తిని పెంచుకొని విభాజ్య కణావళిగా మారతాయి.
పుంజాంతస్థ విభాజ్య కణావళి

– ప్రాథమిక దారువు, ప్రాథమిక పోషక కణజాలము మధ్యన ఉన్న విభాజ్య కణజాలము.

e) వివృత నాళికా పుంజము
– దారువు పోషక కణజాలము మధ్య విభాజ్య కణ జాలము ఉంటుంది. దానిని వివృత నాళికా పుంజము అంటారు.
ఉదా : ద్విదళ బీజ కాండము
సంవృత నాళికా పుంజము
దారువు పోషక కణజాలము మధ్య విభాజ్య కణ జాలము ఉండదు. దీనిని సంవృత నాళికా పుంజము అంటారు.
ఉదా : ఏకదళ బీజకాండము
కాండకేశము
1) ఇవి బహుకణయుతము.
2) ఇవి బాష్పోత్సేక వేగాన్ని తగ్గిస్తాయి.
మూలకేశము
1) ఇవి ఏకకణయుతము.
2) ఇవి నేల నుండి నీటిని గ్రహించడానికి తోడ్పడతాయి.
g) అంతర్దారువు
1) కాండం మధ్యలో ఉన్న, ముదురు గోధుమ వర్ణంలో ఉన్న దారువు.
2) ఇది నీటి ప్రసరణలో పాల్గొనదు.
3) ఇది ఎక్కువ మన్నిక కల్గి ఉంటుంది.
రసదారువు
1) కాండం వెలుపల లేత వర్ణంలో ఉన్న దారువు. ప్రథమదారువు
2) ఇదినీటి ప్రసరణలో పాల్గొంటుంది.
3) ఇది తక్కువ మన్నిక కల్గి ఉంటుంది.
h) వసంత దారువు
1) వసంత ఋతువులో ఏర్పడు దారువు, పెద్ద అవకాశికను కల్గి ఉంటుంది.
2) తేలిక వర్ణంలో ఉంటుంది.
శరద్దారువు
1) శరదృతువులో ఏర్పడు దారువు, సన్నని అవకాశిక కలిగి ఉంటుంది.
2) ముదురు వర్ణంలో ఉంటుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

ప్రశ్న 8.
పత్రరంధ్ర పరికరం అంటే ఏమిటి? భాగాలను గుర్తించిన పటంతో పత్రరంధ్రం నిర్మాణాన్ని వర్ణించండి.
జవాబు:
పత్ర రంధ్రము, రక్షక కణాలు వాటిని చుట్టి ఉన్న అనుబంధ కణాలను కలిపి పత్రరంధ్ర పరికరం అంటారు.

పత్రరంధ్రము నిర్మాణము :
లేత కాండాలు, పత్రాల బాహ్య చర్మములో ఉన్న రంధ్రాలను పత్రరంధ్రాలు అంటారు. ఇవి బాష్పోత్సేక ప్రక్రియను, వాయు వినిమయాన్ని నియంత్రిస్తాయి. ప్రతి పత్రరంధ్రం చుట్టూ రెండు చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న కణాలు ఉంటాయి. వాటిని రక్షక కణాలు అంటారు. గడ్డి మొక్కలలో రక్షక కణాలు ముద్గురాకారంలో ఉంటాయి. రక్షక కణాల వెలుపలి కుడ్యాలు పలుచగాను, వెలుపలి కుడ్యాలు ఎక్కువ మందంలోను ఉంటాయి. ఈ కణాలు హరిత రేణువులను కల్గి ఉంటాయి. ఇవి పత్ర రంధ్రాలు తెరుచుకోవడాన్ని, మూసుకోవడాన్ని నియంత్రిస్తాయి. రక్షక కణాల సమీపంలో ఉన్న కొన్ని బాహ్య చర్మకణాలు ఆకారంలోను, పరిమాణంలోను ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని అనుబంధకణాలు అంటారు.
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 11

ప్రశ్న 9.
ద్విదళబీజ కాండం అడ్డుకోతను వివరించండి.
జవాబు:
లేక ద్విదళ బీజ కాండము అడ్డుకోతలో బాహ్యచర్మము, వల్కలము మరియు ప్రసరణ మండలము అను మూడు భాగాలు కనిపిస్తాయి.
A) బాహ్యచర్మము :
కాండము వెలుపల ఏకకణమందంలో, దీర్ఘచతురస్రాకార లేక చదునుగా ఉన్న కణాలతో, కణాంతరావకాశాలు లేకుండా ఉన్న పొరను బాహ్యచర్మం అంటారు. దీనిని కప్పుతూ వెలుపల క్యూటిన్ నిర్మితమైన అవభాసిని ఉంటుంది. బాహ్యచర్మంలో అక్కడక్కడా పత్రరంధ్రాలుంటాయి. బాహ్యచర్మంపై అనేక బహుకణయుత, ఏకశ్రేణి లేక బహుశ్రేణియుత కేశాలు ఏర్పడతాయి. అవభాసిని, కేశాలు, కాండం నుండి నీరు ఆవిరైపోకుండా నిరోధిస్తాయి. మరియు అధిక ఉష్ణోగ్రత ప్రభావం నుండి కాండంను కాపాడతాయి. కేశాలు, వ్యాధికారక సూక్ష్మజీవులు మొక్కలలోనికి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. పత్రరంధ్రాలు వాయువుల వినిమయానికి, బాష్పోత్సేకానికి తోడ్పడతాయి. బాహ్యచర్మం లోపలి కణజాలాలకు రక్షణ కలిగిస్తుంది.

B) వల్కలము :
బాహ్య చర్మానికి ప్రసరణస్తంభానికి మధ్య కనిపించే భాగాన్ని వల్కలం అంటారు. దీనిలో 3 ఉపభాగాలు ఉంటాయి. అవి :
i) అధశ్చర్మము :
బాహ్య చర్మం క్రింద 3-6 వరుసలలో స్థూలకోణ కణజాలముతో నిర్మితమైన పొర. కణాలు దట్టంగా అమరి ఉంటాయి. కణాలలో రిక్తికాయుత కేంద్రకాయుత జీవద్రవ్యం ఉంటుంది. అథఃశ్చర్మం కాండానికి తన్యతా బలాన్నిస్తుంది. హరిత రేణువులను కల్గి ఆహార పదార్థాల సంశ్లేషణలో కూడా పాల్గొంటుంది.

ii) సామాన్యవల్కలము :
అథఃశ్చర్మం క్రింద 5-10 వరుసలలో మృదుకణజాలయుత సామాన్య వల్కలము ఉంటుంది. కణాల కవచాలు పలుచగా ఉండి, కణాల మధ్యకణాంతరావకాశాలు ఉంటాయి. వల్కలంలోని వెలుపలి వరుస కణాలలో హరిత రేణువులు, లోపలి వరుస కణాలలో శ్వేత రేణువులు ఉంటాయి. సామాన్య వల్కలం ముఖ్యంగా ఆహార పదార్థాల తయారీలో, వాటిని నిల్వచేయటంలో తోడ్పడతాయి.

iii) అంతశ్చర్మము :
వల్కలంలోని లోపలి వరుస. దీనిలో పీపా ఆకారం గల కణాలు ఒక వరుసలో కణాంతరావకాశాలు లేకుండా అమరి ఉంటాయి. కణాలలో రిక్తికాయుత కణద్రవ్యము, అనేక పిండిరేణువులు ఉంటాయి. అందువల్ల అంతశ్చర్మమును పిండివర అని కూడా అంటారు. కణాల వ్యాసార్థ కవచాల పైన మరియు అడ్డు కవచాల పైన కాస్పేరియన్ పట్టీలు ఉంటాయి.

C) ప్రసరణ స్తంభము :
కాండం కేంద్ర భాగంలో కనిపించే స్థూపం వంటి నిర్మాణము. ఇది వల్కలం కంటే ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉంటుంది. దీనిలో పరిచక్రము, నాళికాపుంజాలు, దవ్వ, దవ్వ రేఖలు అను నాలుగు భాగాలుంటాయి.
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 12

i) పరిచక్రము :
ఇది విచ్ఛిన్న వలయంలా ఉంటుంది. దీనిలో 3 5 వరుసల దృఢ కణజాలము, నాళికా పుంజాల పైభాగంలో అర్థచంద్రాకార మాసికలుగా ఉంటుంది. వీటి మధ్య మృదుకణజాలయుత మాసికలు ఉంటాయి. ఇది ప్రసరణ స్థంభానికి యాంత్రికశక్తిని ఇస్తుంది.

ii) నాళికాపుంజాలు :
ప్రసరణ స్తంభములో 15-20 నాళికాపుంజాలు వలయంలాగా అమరి ఉంటాయి. దీనిని నిజ ప్రసరణ స్తంభం అంటారు. ప్రతి నాళికాపుంజం ఉలిలేక బొంగరం ఆకారంలో ఉంటుంది. నాళికాపుంజంలో దారువు, పోషక కణజాలము ఒకే వ్యాసార్థరేఖపై అమరి ఉంటాయి. (సహపార్శ్వ) దారువు, పోషక కణజాలాల మధ్య విభాజ్య కణజాలము ఉంటుంది. ఈ నాళికా పుంజాలను సహపార్శ్వ, సంయుక్త, వివృత నాళికాపుంజాలు అంటారు. వీటిలో దారువు క్రింద వైపున, పోషక కణజాలం పైవైపున ఉంటాయి.

దారువులో దారునాళాలు, దారుకణాలు, దారునారలు, దారు మృదుకణజాలము ఉంటాయి. ప్రథమ దారువు లోపలివైపు, అంత్యదారువు వెలుపలి వైపు ఉంటాయి. కావున దీనిని అంతర ప్రథమ దారుకస్థితి అంటారు. పోషక కణజాలంలో చాలనీ నాళాలు, సహకణాలు మరియు పోషక కణజాలాల మృదుకణజాలం ఉంటాయి. నాళికాపుంజాలు నీరు, ఆహార పదార్థాల ప్రసరణలో పాల్గొంటాయి.

దవ్వ :
ప్రసరణ స్థంభంలోని మధ్యభాగము. ఇది మృదు కణజాలానిర్మితమై ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంది.

దవ్వరేఖలు :
నాళికాపుంజాల మధ్య ఉన్న మృదు కణజాలాన్ని దవ్వ రేఖలు అంటాం. వీటిలోని కణాలు వ్యాసార్థంగా సాగి పలుచని కవచాలతో ఉంటాయి. ఇవి ఆహారపదార్థాల పార్శ్వ ప్రసరణకు సహాయపడతాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

ప్రశ్న 10.
ఏకదళ బీజకాండం అడ్డుకోతను వివరించండి.
జవాబు:
ఏకదళ బీజకాండం అడ్డుకోతలో 4 భాగాలను గుర్తిస్తారు. అవి 1) బాహ్యచర్మము, 2) అధశ్చర్మము, 3) సంధాయక కణజాలము, 4) నాళికా పుంజాలు.

1. బాహ్యచర్మం :
ఇది వెలుపలి పొర. దీనిలో దీర్ఘచతురస్రాకార లేదా చదునైన సజీవ మృదుకణాలు దగ్గరదగ్గరగా ఒకే వరుసలో, దట్టంగా, కణాంతరావకాశాలు లేకుండా అమరి ఉంటాయి. కణాల్లో రిక్తికాయుతమైన కణద్రవ్యం ఉంటుంది. కణాల్లో హరితరేణువులుండవు. ఒకే స్పష్టమైన కేంద్రకం చిన్నదిగా ఉంటుంది. బాహ్యచర్మంలో పత్రరంధ్రాలుంటాయి. బాహ్యచర్మాన్ని కప్పుతూ, అవభాసిని పొర ఉంటుంది. బాహ్యచర్మం మీద కేశాలుండవు. బాహ్యచర్మం లోపలి కణజాలాలకు రక్షణనిస్తుంది, బాష్పోత్సేకాన్ని నిరోధిస్తుంది. నీరు ఆవిరి కాకుండా నిరోధిస్తుంది. పత్ర రంధ్రాల ద్వారా వాయువుల వినిమయంలో. తోడ్పడుతుంది.

2. అథఃశ్చర్మం :
బాహ్య చర్మం క్రింద 3-4 వరుసలలో దృఢకణజాలంతో ఉంటుంది. ఈ కణాలు మందంగా లిగ్నిన్పరిత కవచాలను కలిగి, దట్టంగా అమరి ఉంటాయి. ఇది కాండానికి యాంత్రిక బలాన్నిస్తుంది.

3. సంధాయక కణజాలము :
కాండంలో ఎక్కువ భాగము విశాలమైన, మృదువైన సజీవ కణజాలముతో ఉంటుంది. దీనిని సంధాయక కణజాలము అంటారు. పరిధీయంగా ఉన్న కణాలు చిన్నవిగాను, లోపలి కణాలు పెద్దవిగాను ఉంటాయి. పరిధీయ కణాలు హరిత రేణువులను కలిగి, ఆహార పదార్థాల సంశ్లేషణలో పాల్గొంటాయి. లోపలి కణాలు ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి.

4. నాళికా పుంజాలు :
సంధాయక కణజాలంలో అనేక నాళికా పుంజాలు చెల్లాచెదురుగా అమరి ఉంటాయి. దీనిని అంటాక్టోస్టీల్ అంటారు. అథఃశ్చర్మానికి దగ్గరగా ఉన్న నాళికాపుంజాలు చిన్నవిగా, దగ్గర దగ్గరగాను ఉంటాయి. కాండం మధ్యలో ఉన్న నాళికాపుంజాలు పెద్దవిగా, దూరంగాను ఉంటాయి.

ప్రతీ నాళికాపుంజము అండాకారములో ఉంటుంది. ప్రతీ నాళికాపుంజం చుట్టూ దృఢకణజాల నారలు ఒక తొడుగులాగా ఏర్పడి ఉంటాయి. అందుకే ఈ నాళికా పుంజాలను తంతుయుత నాళికా పుంజాలు అంటారు.

నాళికా పుంజాలు సంయుక్తం, సహపార్శ్వం, సంవృతం. ప్రతి నాళికాపుంజంలో దారువు లోపలివైపు, పోషకకణజాలం వెలుపలి వైపు ఒకే వ్యాసార్థం పైన అమరి ఉంటాయి. వీటి మధ్యన విభాజ్యకణావళి ఉండదు. దారువులో దారునాళాలు, దారుకణాలు, దారునారలు, దారు మృదుకణజాలం ఉంటాయి. దారువులో దారునాళాలు అతి తక్కువ (4) సంఖ్యలో ఉంటాయి. దారువులోని ప్రథమదారునాళాలు లోపలివైపు ‘Y’ ఆకారంలో అమరి ఉంటాయి. దారువు అంతర ప్రథమ దారుకంగా ఉంటుంది. కాండం త్వరగా పెరగడం వల్ల ప్రథమదారునాళం, దానిచుట్టూ ఉన్న కొన్ని మృదుకణాలు చితికిపోయి ఒక లయజాతకుహరం ఏర్పడుతుంది. దీనిని ప్రథమదారు అవకాశం అంటారు. దీనిలో నీరు నిలువ ఉంటుంది. పోషకకణాజాలంలో చాలనీ నాళాలు, సహకణాలు మాత్రమే ఉంటాయి. పోషక కణజాల మృదుకణజాలం ఉండదు. ఏకదళ బీజాలకాండంలో దవ్వ, దవ్వరేఖలుండవు. పరిచక్రం కూడా కనిపించదు.
AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 13

ప్రశ్న 11.
ద్విదళబీజ వేరు అంతర్నిర్మాణాన్ని వర్ణించండి.
జవాబు:
1) బాహ్యచర్మం :
ఇది అన్నిటికన్నా వెలుపల ఉండే పొర. దీనిలో కణాలు ఒకే వరుసలో దగ్గర దగ్గరగా ఆనుకొని కణాంతరావకాశాలు లేకుండా అమరి ఉంటాయి. కణాలు దీర్ఘచతురస్రంగా పలుచని కవచాలు కలిగి జీవద్రవంతో నిండి ఉంటాయి. బాహ్య చర్మంపై అవభాసిని అనే మైనపు పొర ఉండదు. అట్లే పత్రరంధ్రాలు ఉండవు. బాహ్య చర్మంలోని కొన్ని కణాలు గొట్టాలలాగా ఉండే ఏకకణయుత మూలకేశాలను ఏర్పరుస్తాయి. అందుకే వేరులోని బాహ్యచర్మాన్ని “కేశధారిస్తరం” లేదా “బాహ్యమూల చర్మం” అంటారు. మూలకేశాలను ఉత్పత్తి చేసే బాహ్య చర్మ కణాలు మిగిలిన కణాలకంటే చిన్నవిగా ఉంటాయి. వీటిని “రోమకోరకాలు” అంటారు. మూలకేశాలు మృత్తికావకాశాల మధ్యలోకి పెరిగి నీటిని పీల్చుకుంటాయి. బాహ్యచర్మం రక్షణ పొరగా పనిచేస్తుంది.

2) వల్కలం :
బాహ్యచర్మానికి, ప్రసరణ స్తంభానికి మధ్య విస్తరించియున్న మండలాన్ని వల్కలం అంటారు. దీని యందు బాహ్యోపరిచర్మం, సామాన్యవల్కలం, అంతశ్చర్మం అనే భాగాలు ఉంటాయి. సాధారణంగా వేరులో వల్కలం, ప్రసరణ స్తంభం కంటే ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉంటుంది.

i) బాహ్యోపరిచర్మం :
ఇది వల్కలంలోని వెలుపలి 2-3 వరుసల కణాలతో ఏర్పడి ఉంటుంది. దీనిలోని కణాలు మందమైన, సుబరిన్ పూరితమైన కవచాలను కలిగి నిర్జీవంగా ఉంటాయి. బాహ్యచర్మం తొలగిపోయినప్పుడు వేరును రక్షిస్తుంది. అట్లే వల్కలం నుండి నీరు వెలుపలికి పోకుండా నిరోధిస్తుంది. సాధారణంగా బాహ్యపరిచర్మం ముదిరిన వేర్లలో కనిపిస్తుంది.

ii) సామాన్య వల్కలం :
ఇది బాహ్యపరిచర్మం దిగువన కనిపిస్తుంది. దీనిలో అనేక వరుసల సజీవ మృదుకణజాలం నిండి ఉంటుంది. ఈ కణాలు పలుచని కవచాలను కలిగి అండాకారంగా లేదా గోళాకారంగా కనిపిస్తాయి. కణాల మధ్య కణాంతరావకాశాలు ఉంటాయి. కణాలలో శ్వేత రేణువులు ఉంటాయి. ఇవి ఆహార పదార్థాలను నిలవచేస్తాయి. సామాన్య వల్కలంలోని కణాలు మూలకేశం నుండి నీరు పార్శ్వ దిశలో ప్రయాణించి దారునాళాలలోనికి ప్రవేశించుటలో తోడ్పడతాయి.

iii) అంతశ్చర్మం :
ఇది వల్కలానికి చెందిన లోపలి కణాలతో ఏర్పడిన పొర. దీనిలోని కణాలు పీపా ఆకారం కలిగి ఒకే వరుసలో దట్టంగా కణాంతరావకాశాలు లేకుండా అమరి ఉంటాయి. అంతశ్చర్మ కణాల వ్యాసార్థ మరియు అడ్డు కవచాలపై, ‘కాస్పేరియన్ మందాలు’ కనిపిస్తాయి. ఈ మందాలు లిగ్నిన్, సూబరిన్లతో నిర్మితమై ఉంటాయి. ఇవి నీరు పార్శ్వ స్థానాంతరణ చెందకుండా నిరోధిస్తాయి. అందుకే అంతశ్చర్మమును వల్కలానికి మరియు ప్రసరణ స్తంభానికి మధ్య వారధిగా పరిగణిస్తారు.

అంతశ్చర్మంలో అక్కడక్కడా కొన్ని కణాలు కాస్పేరియన్ మందాలు లేకుండా పలుచని కవచాలను కలిగి ఉంటాయి. ఈ కణాలను ‘వాహక కణాలు’ అంటారు. ఇవి ప్రథమదారు కణాలకు అభిముఖంగా ఉంటాయి. వల్కలం నుండి నీరు, ఖనిజ లవణాలు ప్రసరణ స్తంభంలోనికి ప్రయాణించడానికి ఇవి తోడ్పడతాయి.

3) ప్రసరణ స్తంభం :
వేరు మధ్య భాగంలో ఉండే స్థూపం వంటి భాగాన్ని ప్రసరణ స్తంభం అంటారు. ఇది పరిమాణంలో వల్కలం కంటే చిన్నగా ఉంటుంది. దీనిలో మూడు ఉపభాగాలను గుర్తించవచ్చు. అవి :
i) పరిచక్రం :
ప్రసరణ స్తంభమును చుట్టి ఉన్న కణాల వరుసను పరిచక్రం అంటారు. ఇది సాధారణంగా ఏకశ్రేణియుతమై పలుచని కవచాలు కలిగి దీర్ఘచతురస్రాకార సజీవ కణాలతో ఏర్పడి ఉంటుంది. దీనిలోని కణాలు చురుకుగా విభజన చెందుతాయి. పరిచక్రం నుంచి పార్శ్వ వేర్లు ఉత్పత్తి అవుతాయి. పరిచక్రంలోని కొన్ని కణాలు ప్రతి విభేదనం చెంది విభాజ్య కణావళిని ఏర్పరుస్తాయి. దీనివల్ల వేరులో ద్వితీయ వృద్ధి జరుగుతుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 14
ii) నాళికా పుంజాలు :
ప్రాథమిక దారువు మరియు పోషక కణజాల పుంజాలు వలయాకారంగా వేరువేరు వ్యాసార్థ రేఖల మీద ఏకాంతరంగా అమరి ఉంటాయి. వీటిని కేంద్రీకృత నాళికా పుంజాలు అంటారు. ప్రథమ దారువు పరిచక్రము వైపున ఏర్పడి ‘బాహ్య ప్రథమదారుకం’గా ఉంటుంది. అంత్యదారువు దవ్వ వైపున ఏర్పడి ఉంటుంది. ఈ రకమైన అమరిక వేర్లలో కనిపించే ముఖ్య లక్షణం.

నాళికా పుంజాల సంఖ్యను దారువు పుంజాల సంఖ్య ఆధారంగా నిర్ణయిస్తారు. సాధారణంగా ద్విదళ వేరులో నాలుగు దారువు పుంజాలు, నాలుగు పోషక కణజాలపుంజాలు ఒకదాని ప్రక్కన మరొకటి ఏకాంతరంగా అమరి ఉంటాయి. దీనిని “చతుప్రథమదారుకం” అంటారు.

నాళికా కణజాలాల మధ్య విభాజ్య కణావళి ఉండదు. దారువు, పోషక కణజాల పోచల నడుమ కనిపించే మృదు కణజాలాన్ని సంశ్లేషక కణజాలం అంటారు. దీనిలో ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయి. ద్వితీయ వృద్ధి జరిగేటపుడు ఈ కణజాలం నుండి ద్వితీయ విభాజ్య కణావళి ఏర్పడుతుంది.

iii) దవ్వ :
వేర్లలో దారుపుంజాల అభివృద్ధి కేంద్రాభిసారంగా జరుగుతుంది. అంత్యదారునాళాలు మధ్యభాగం వరకూ పెరిగి కలిసిపోవడం వల్ల సాధారణంగా ద్విదళ వేరులో దవ్వ ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికీ అతి చిన్నదిగా ఉంటుంది. దీనిలో మృదు కణాలు ఉంటాయి. ఇవి వదులుగా అమరి కణాంతరవకాశాలను చూపిస్తాయి. ఇవి నీరు, ఆహార పదార్థాలను నిల్వ చేయడంలో తోడ్పడతాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

ప్రశ్న 12.
ఏకదళబీజ వేరు అంతర్నిర్మాణాన్ని వర్ణించండి.
జవాబు:
ఏకదళబీజ వేరు అడ్డుకోతలో బాహ్యచర్మం, వల్కలం, ప్రసరణస్తంభం అనే మూడు మండలాలు కనిపిస్తాయి.
I. బాహ్యచర్మం :
బాహ్యచర్మం ఒకే వరుసలో అమరి ఉన్న కణాలతో నిర్మితమవుతుంది. కణాల మధ్య కణాంతరావకాశాలుండవు. కణకవచాలు పల్చగా ఉంటాయి. అవభాసిని, పత్ర రంధ్రాలు ఉండవు. కొన్ని బాహ్యచర్మ కణాల మీద మూలకేశాలుంటాయి. మూలకేశాలను ఉత్పత్తి చేసే బాహ్యచర్మ కణాలను రోమ కోరకాలు అంటారు. మూలకేశాలు నేల నుండి నీటిని, లవణాలను శోషిస్తాయి. వేరు బాహ్యచర్మాన్ని కేశదారిస్తరం అంటారు. బాహ్యచర్మం సాధారణంగా లోపలి కణజాలాలకు రక్షణనిస్తుంది.

II. వల్కలం :
బాహ్యచర్మానికి, ప్రసరణ స్తంభ మండలానికి మధ్య గల భాగాన్ని వల్కలం అంటారు. ఇది ప్రసరణస్తంభం కన్నా ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉంటుంది. దీనిలో 1. బాహ్యోపరిచర్మం, 2. సాధారణ వల్కలం, 3) అంతఃశ్చర్మం అనే భాగాలుంటాయి.

1) బాహ్యోపరిచర్మం :
బాహ్యచర్మం క్రింది 1-2 వరుసలతో నిర్మితమైన వల్కలపు భాగాన్ని బాహ్యోపరిచర్మం అంటారు. దీనిలో కణాలు వత్తుగా, నిర్జీవంగా, సుబరిన్ నిర్మితంగా ఉంటాయి. ఈ పొర వేరులోనికి వచ్చిన నీరు బయటకి పోకుండా కాపాడుతుంది. బాహ్యచర్మం నశించినపుడు, బాహ్యోపరిచర్మం రక్షణ కవచంలాగా వ్యవహరిస్తుంది.

2) సాధారణ వల్కలం :
బాహ్యోపరిచర్మానికి, అంతఃశ్చర్మానికి మధ్యనున్న భాగాన్ని సాధారణ వల్కలం అంటారు. ఇది అనేక వరుస మృదుకణజాలంతో నిర్మితమై ఉంటుంది. ఈ కణాలు పలుచని కణకవచాలను కణాంతరావకాశాలను కలిగి ఉంటాయి. వల్కల కణాలలో ఉన్న శ్వేతరేణువులు ఆహారంను నిల్వ చేస్తాయి. నీరు, లవణాల పార్శ్వ ప్రసరణకు తోడ్పడుతుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం 15
3) అంతశ్చర్మం :
వల్కలంలోని ఆఖరి పొరను అంతశ్చర్మమంటారు. ఇది ఒకే కణ మందంలో పీపా ఆకార కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కణాల అడ్డుగోడలు, వ్యాసార్థపు గోడలపై కాస్పేరియన్ బట్టీలను చూపిస్తాయి. ఇవి లిగ్నిన్ మరియు నుబరిన్తో నిర్మితమై ఉంటాయి. ప్రథమదారునాళములకు అభిముఖంగా ఉన్న అంతఃశ్చర్మ కణాలు కాస్పేరియన్ మందం లేకుండా పలుచని కవచాలతో ఉంటాయి. వీటిని వాహక కణాలు అంటారు. వీటి ద్వారా నీరు, వల్కలం నుండి ప్రసరణ స్థంభం లోనికి పార్శ్వముఖంగా ప్రయాణిస్తుంది.

III. ప్రసరణ స్తంభం :
ఇది వేరు మధ్యలో స్థూపంలాగా ఉంటుంది. దీనిలో మూడు భాగాలు ఉంటాయి. అవి : పరిచక్రం, నాళికాపుంజాలు, దవ్వ.

1) పరిచక్రం :
అంతశ్చర్మానికి క్రిందభాగాన ఒకే కణమందంలో వలయాకారంగా అమరియున్న మృదుకణజాలాన్ని పరిచక్రం అంటారు. కణాలు చిన్నవిగా ఉండి పలుచని కణకవచాలను కలిగి ఉంటాయి. కణాలు సజీవంగా ఉండి విభజన శక్తిని కలిగి పార్శ్వవేళ్ళను ఏర్పరుస్తాయి. ముదిరిన వేళ్ళలో పరిచక్రం దృఢకణాలుగా మారి యాంత్రికబలాన్ని చేకూర్చుతాయి.

2) నాళికా పుంజాలు :
దారువు, పోషకనాళం వేరువేరు పుంజాలుగా వేరువేరు వ్యాసార్థాల్లో, కేంద్రీకృతమైనదిగా అమరి ఉంటాయి. వీటిని కేంద్రీకృత లేక భిన్నమైన నాళికాపుంజాలు అంటారు. దారువు ఎక్కువ సంఖ్యలో ఉండడం వలన ఏకదళబీజవేరు బహు ప్రథమదారుకంగా ఉంటుంది. పుంజాలు సంవృతాలు దారువ బాహ్య ప్రథమ దారుకం. దారువు, పోషక కణజాలాల మధ్య ఉండే మృదుకణజాల నిర్మితమైన భాగాన్ని సంశ్లేషక కణజాలం అంటారు. ఇది ఆహార పదార్థాలను నిలువ చేస్తుంది.

3) దవ్వ :
ఏకదళబీజ వేరులో ప్రసరణస్తంభానికి మధ్యస్థ భాగంలో స్థూలమైన, మృదుకణజాల నిర్మితమైన దవ్వ భాగముంటుంది. కొన్ని వేళ్ళలో ఈ కణాలలోనికి లిగ్నిన్ చేరి, మందమైన దృఢకణయుత భాగంగా ఉంటుంది. దవ్వలో పదార్థాలు నిలువ ఉంటాయి. యాంత్రిక శక్తిని అందిస్తుంది.

Intext Question and Answers

ప్రశ్న 1.
బెరడులో ఉండే వివిధ రకాల కణాల పొరల పేర్లు తెలపండి.
జవాబు:
పరిచర్మము, ద్వితీయ పోషక కణజాలము.

ప్రశ్న 2.
ఒక వృక్షంలో మృత్తిక ఉపరితలం నుంచి సరిగా 1m పైన ఒకే లోతులో ప్రతి 50 సంవత్సరాలకి, 200 సంవత్సరాల పాటు రంధ్రం చేసి ఒక మేకును కొట్టడం జరిగింది. (భూమి మట్టుంలో మార్పు లేదనుకోండి) వృక్షంమీద నాలుగు మేకుల అమరిక రకం ఏమిటి ? మీ సమాధానానికి కారణం తెలుసా? మీ జవాబు అవును అయితే కారణం తెలపండి.
జవాబు:
వృక్షం మీద నాలుగు మేకుల అమరిక మొక్క పెరుగుదల వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. లేదా 4 మేకులు ఒకేవరుసలో అమరి ఉంటాయి.

ప్రశ్న 3.
చెక్క (Wood) పోషక కణజాలంతో గాక దారువుతో ఎందుకు నిర్మితమై ఉంటుంది?
జవాబు:
ద్వితీయ దారువు లోపల టానిన్లు, రెసిన్లు, జిగురులు, నూనెలు, సుగంధ తైలాలు ఉండుటవల్ల ఈ భాగము గట్టిగాను చాలాకాలం చెడిపోకుండా ఎక్కువ మన్నికగా ఉండి, సూక్ష్మజీవులకు కీటకాలకు ప్రతిరోధకత చూపిస్తుంది. ఈ ద్వితీయ దారువు లిగ్నిన్ అధికంగా గల గోడలు, నిర్జీవ మూలకాలను కల్గి ఉంటుంది. అందువల్ల చెక్క దారువుతో మాత్రమే నిర్మితమై ఉంటుంది.

ప్రశ్న 4.
విద్యార్థి ఒక వృక్షం వయస్సును 300 సంవత్సరాలుగా అంచనావేశాడు. ఈ వృక్షం వయస్సును అతను ఏవిధంగా అంతర్నిర్మాణ పరంగా అంచనా వేసి ఉంటాడు?
జవాబు:
వార్షిక వలయాల సంఖ్యను లెక్కించి మొక్క వయస్సును అంచనా వెయ్యవచ్చు. దీనిని డెండ్రోక్రోనాలజీ అంటారు.

AP Inter 1st Year Botany Study Material Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

ప్రశ్న 5.
మీరు ఒక వృక్షం డ్యూరమెన్ భాగాన్ని తొలగించారని అనుకోండి. వృక్షం బతుకుతుందా లేదా చనిపోతుందా?
జవాబు:
బతుకుతుంది.