Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 4th Lesson వృక్షరాజ్యం Textbook Questions and Answers.
AP Inter 1st Year Botany Study Material 4th Lesson వృక్షరాజ్యం
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
శైవలాల వర్గీకరణకు ఆధారం ఏమిటి?
జవాబు:
వర్ణ పదార్థాలు, నిల్వ ఆహార పదార్థ రకాలు ఆధారంగా శైవలాలు విభజితము అయ్యాయి.
ప్రశ్న 2.
లివర్వర్ట్ మాస్, ఫెర్న్, వివృతబీజ, ఆవృతబీజ మొక్కలలో క్షయకరణ విభజన ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
జవాబు:
లివర్ వర్ట్లలో :
క్షయకరణ విభజన సిద్ధబీజదంలో జరుగుతుంది. ఫలితంగా గుళికలో సిద్ధబీజాలు ఏర్పడతాయి.
మాస్ మొక్కలలో :
సిద్ధబీజదంలోని సిద్ధబీజ మాతృ కణాలలో క్షయకరణ విభజన జరుగుతుంది.
ఫెర్న్ మొక్కలలో :
క్షయకరణ విభజన స్థూల, సూక్ష్మ సిద్ధబీజాశయాలలో జరిగి, స్థూల మరియు సూక్ష్మ సిద్ధబీజాలు ఏర్పడతాయి.
వివృత బీజాలలో :
క్షయకరణ విభజనలు సూక్ష్మ, స్థూల సిద్ధబీజ మాతృకణాలలో జరుగుతాయి.
ఆవృత బీజాలలో :
క్షయకరణ విభజనలు సూక్ష్మ సిద్ధబీజ మాతృకణం (పరాగ కోసం) మరియు స్థూలసిద్ధ మాతృకణం (అండం) లో జరుగుతాయి.
ప్రశ్న 3.
సంయుక్త సంయోగానికి, త్రి సంయోగానికి గల భేదం ఏమిటి ?
జవాబు:
సంయుక్త సంయోగం | త్రిసంయోగము |
పిండకోశంలో విడుదలయిన రెండు పురుషబీజాలలో, ఒక పురుషబీజం, స్త్రీ బీజంతో కలసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. దీనిని సంయుక్త సంయోగం అని అంటారు. | పిండంలో విడుదల అయిన రెండు పురుష బీజాలలో రెండవ పురుషబీజము, ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో, కలసి ప్రాధమిక అంకు రచ్ఛదం ఏర్పడుతుంది. దీనిని త్రి సంయోగం అంటారు. |
ప్రశ్న 4.
పురుష బీజాశయం, స్త్రీ బీజాశయానికి గల తేడా ఏమిటి?
జవాబు:
పురుష బీజాశయము | స్త్రీ బీజాశయము |
i) ఇది గన ఆకారంలో ఉంటుంది. | i) ఇది కూజా ఆకారంలో ఉంటుంది. |
ii) ద్వికశాఖయుత పురుష బీజాలు ఏర్పడతాయి. | ii) ఒకే ఒక స్త్రీ బీజం ఏర్పడుతుంది. |
ప్రశ్న 5.
‘మాస్’ మొక్కల్లో గల రెండు సంయోగబీజద దశలు ఏవి? అవి వేటినుంచి వృద్ధి చెందుతాయో తెలపండి.
జవాబు:
మాస్ మొక్కలలో సంయోగబీజదంలో రెండు దశలు కలవు.
అవి :
- సిద్ధబీజం నుంచి నేరుగా ఏర్పడే శైశవదశ లేదా ప్రథమతంతువు.
- ప్రథమ తంతువు యొక్క పార్శ్వ అబ్బురపు మొగ్గ నుంచి పెరిగే ప్రౌఢ దశకు చెందిన పత్రాలు కల సంయోగ బీజదం (gametophore)
ప్రశ్న 6.
గోధుమ వర్ణ, ఎరుపు వర్ణ శైవలాల్లో ఉన్న నిలువ ఆహార పదార్థాలను తెలుపండి.
జవాబు:
గోధుమ వర్ణశైవలాలలో నిల్వ ఆహారము లామినారిన్ లేదా మానిటాల్ రూపంలో ఉంటుంది.ఎరుపువర్ణ శైవలాలలో నిల్వ ఆహారము ఫ్లోరిడియన్ పిండి పదార్థం రూపంలో ఉంటుంది.
ప్రశ్న 7.
గోధుమ వర్ణ, ఎరుపు వర్ణ శైవలాల్లో ఆ రంగులకు కారణమైన పదార్థాల పేర్లు తెలుపండి.
జవాబు:
‘ఫియోఫైసీ’ శైవలాలకు గోధుమ రంగు – ఫ్యూకోజాంధిన్ వల్ల కల్గుతుంది. రోడోఫైసీ శైవలాలకు ఎరుపురంగు – ఫైకోఎరిత్రిన్ వల్ల కల్గుతుంది.
ప్రశ్న 8.
బ్రయోఫైటా మొక్కల్లోని వివిధ శాకీయోత్పత్తి విధానాలను తెలపండి.
జవాబు:
బ్రయోఫైట్లులో శాఖీయ ప్రత్యుత్పత్తి ముక్కలు అగుటద్వారా, లేదా జెమ్మాల ద్వారా లేదా ద్వితీయ ప్రథమ తుంతువుపై ఏర్పడే మొగ్గల ద్వారా జరుగుతుంది.
ప్రశ్న 9.
వివృతబీజాల్లో ఉన్న అండ కవచయుత స్థూల సిద్ధబీజాశయాన్ని ఏమంటారు? స్థూల సిద్ధబీజాశయంలోపల ఎన్ని స్త్రీ సంయోగ బీజదాలు ఏర్పడతాయి?
జవాబు:
వివృత బీజాలలో అండకవచయుత స్థూల సిద్ధబీజాశయాన్ని అండము అంటారు. స్థూల సిద్ధబీజాశయంలో ఒక బహుకణయుత స్త్రీ సంయోగబీజదం ఏర్పడి రెండులేక ఎక్కువ స్త్రీ బీజాశయాలను కల్గి ఉంటుంది.
ప్రశ్న 10.
వివృత బీజ మొక్కల్లో శిలీంధ్ర మూలాలు, ప్రవాళాభ వేళ్లు ఉండే మొక్కలను వరసలో తెలపండి.
జవాబు:
వివృత బీజాల్లో శిలీంధ్ర మూలాలు కల మొక్క = పైనస్
వివృత బీజాల్లో ప్రవాళాభ వేళ్లు కల మొక్క = సైకస్
ప్రశ్న 11.
ఈ కింది వాటిలో ఏ నాలుగింటికైనా క్రోమోసోమ్ సంఖ్యా స్థితులను తెలపండి.
a) మాస్ మొక్కలోని ప్రథమ తంతుకణం
b) ద్విదళ బీజాల్లోని ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం
c) మాస్ మొక్కలోని పత్రకణం
d) ఫెర్న్ మొక్కలోని ప్రథమాంకురం
e) మార్కాంషియాలోని జెమ్మాకణం
f) ఏకదళ బీజ విభాజ్య కణం
g) లివర్ వర్ట్ లోని స్త్రీబీజ కణం
h) ఫెర్న్లోని సంయోగబీజం
జవాబు:
a) మాసె మొక్కలోని ప్రథమతంతుకణం = ఏకస్థితికణము
b) ద్విదళ బీజాల్లోని ప్రాథమిక అంకురచ్చద కేంద్రకము = త్రయస్థితికము
c) మాస్మిక్కలలో పత్రకణం = ఏకస్థితికము
d) ఫెర్న్ మొక్కలోని ప్రథమాంకురం = ఏకస్థితికము
e) మార్కంషియాలోని జెమ్మాకణం = ఏకస్థితికము
f) ఏకదళబీజ విభాజ్య కణం = ద్వయస్థితికము
g) లివర్ వర్ట్ లోని స్త్రీబీజ కణం = ఏకస్థితికము.
h) ఫెర్న్లోని సంయోగ బీజం = ద్వయస్థితికము
ప్రశ్న 12.
టెరిడోఫైటాలోని నాలుగు తరగతులను ఒకొక్క ఉదాహరణతో తెలపండి.
జవాబు:
- సిలోప్సిడా = సైలోటం
- లైకాప్సిడా = లైకోపోడియం
- స్ఫినోప్సిడా = ఈక్విజిటం
- టెరోప్సిడా = టెరిస్
ప్రశ్న 13.
రాతి ఉపరితలంపై పెరిగే మొట్టమొదటి జీవులు ఏవి ? ‘పీట్’ ను అందించే ‘మాస్’ మొక్క ప్రజాతి నామం ఏది?
జవాబు:
మాస్ మొక్కలు లైకెనులు కలసి సహానివేశానికి తోడ్పడతాయి. ఉదా : స్పాగ్నం
ప్రశ్న 14.
సైకస్లోని ఫెర్న్ లక్షణాలను తెల్పండి.
జవాబు:
- లేత పత్రాలు వలితకిసలయ విన్యాసం చూపుట
- రామెంటా కలిగి ఉండటం
- బహుశైలికాయుత పురుష సంయోగబీజాలు
- స్త్రీ బీజాశయాలను కలిగి ఉండటం
ప్రశ్న 15.
బ్రయోఫైటా మొక్కలకు వృక్షరాజ్య ‘ఉభయచరాలు’ అని ఎందుకు అంటారు?
జవాబు:
బ్రయోఫైటా తేమగల ప్రదేశాలలో పెరగడంవల్ల లైంగిక ప్రత్యుత్పత్తికి నీటిపై ఆధారపడుటవల్ల వీటిని వృక్షరాజ్యపు ఉభయచరాలు అంటారు.
ప్రశ్న 16.
a) ఏకద్వయస్థితిక, b) ద్వయస్థితిక జీవిత చక్రాలు కల్గిన శైవలాలను పేర్కొనండి.
జవాబు:
ఏకద్వయ స్థితిక జీవిత చక్రం కల శైవలము = ఎక్టోకార్పస్, ద్వయ స్థితిక జీవిత చక్రంగల శైవలము = ఫ్యూకస్
ప్రశ్న 17.
ఏకకణ, సహనివేశ, తంతురూప శైవలాలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
క్లామిడోమోనాస్, వాల్వాక్స్, స్పైరోగైరా
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఎరుపువర్ణ, గోధుమవర్ణ శైవలాల మధ్య తేడాలను తెలపండి. [Mar. ’14]
జవాబు:
ఎరుపు వర్ణ శైవలాలు | గోధుమ వర్ణ శైవలాలు |
1) ఇవి రోడోఫైసీ తరగతికి చెందుతాయి. | 1) ఇవి ఫియోఫైసీ తరగతికి చెందుతాయి. |
2) ఎక్కువ జాతులు సముద్ర జలాల్లో ఉంటాయి. | 2) ఇవి మంచి నీటిలోనూ సముద్రజలాల్లోను ఉంటాయి. |
3) కణకవచము సెల్యులోజ్ పెక్టిన్ మరియు పాలీసల్ఫైడ్ ఎస్టర్స్తో నిర్మితము. | 3) కణకవచము సెల్యులోజ్ మరియు ఆల్జిన్తో నిర్మితము. |
4) తంతు దేహం బహుకణయుతము. | 4) దేహము సరళ శాఖాయుతంగాగాని, తంతు రూపంగా గాని ఉంటుంది. |
5) కశాభాలు ఉండవు. | 5) కశాభాలు 2, అసమానము పార్శ్వము. |
6) వీటిలో క్లోరోఫిల్ a, d ఫైకోఎరిత్రిన్ వర్ణద్రవ్యాలు ఉంటాయి. | 6) వీటిల్లో క్లోరోఫిల్ a, C కరోటినాయిడ్లు, జాంథోఫిల్స్ ఉంటాయి. |
7) ఆహార పదార్థాలు ఫ్లోరిడియన్ పిండి పదార్థ రూపంలో ఉంటాయి. | 7) ఆహార పదార్థాలు లామినారిన్ లేదా మానిటాల్ రూపంలో ఉంటాయి. |
8) అలైంగిక ప్రత్యుత్పత్తి నిశ్చల సిద్ధబీజాల ద్వారా జరుగును. | 8) అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వికశాభయుత గమన సిద్ధబీజాల ద్వారా జరుగును. |
9) లైంగిక ప్రత్యుత్పత్తి నిశ్చల సంయోగ బీజాలద్వారా జరుగును. ఉదా : పాలిసైఫోనియా పోర్ఫైరా |
9) లైంగిక ప్రత్యుత్పత్తి చలన సంయోగ జరుగును. ఉదా : ఎక్టోకార్పస్, ఫ్యూకస్ |
ప్రశ్న 2.
లివర్ వర్ట్స్, మాస్ మొక్కల మధ్య తేడాలు తెలపండి.
జవాబు:
లివర్ వర్ట్సలు | మాస్లు |
1) మొక్క దేహం థాలస్ వలె, సాగిలబడి పృష్టోదర విభేదనం కలిగి ఆధారాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. | 1) ప్రౌఢదశకు చెందిన సంయోగబీజదం నిటారుగా ఉండి, సర్పిలాకారంలో ఉన్న పత్రాలను శాఖాయుతమైన బహుకణయుత రైజాయిడ్ల ద్వారా నేలలో స్థిరీకరించబడతాయి. |
2) శాకీయ ప్రత్యుత్పత్తి ముక్కలవడం వల్ల లేదా జెమ్మాల ద్వారా జరుగుతుంది. | 2) శాఖీయ ప్రత్యుత్పత్తి ముక్కలవడం వల్ల లేదా జమ్మాల లేదా ద్వితీయ ప్రథమ తంతువులోని మొగ్గల ద్వారా ద్వారా జరుగుతుంది. |
3) స్త్రీ, పురుష బీజాశయాలు ఒకే థాలస్ మీదా లేక వేర్వేరు థాలస్ల మీద ఏర్పడతాయి. | 3) లైంగిక అవయవాలు పత్రయుత గామిటోఫోర్ పైన ఏర్పడతాయి. |
4) సహతంతువులు ఉండవు. | 4) సహతంతువులు ఉంటాయి. |
5) గుళికలో ఇలేటర్లు ఉంటాయి. ఇవి సిద్ధబీజ వ్యాప్తికి సహకరిస్తాయి. | 5) గుళికలో పరిముఖ దంతాలు ఉంటాయి. ఇవి సిద్ధబీజ వ్యాప్తిలో సహకరిస్తాయి. |
6) సిద్ధబీజాలు మొలకెత్తి స్వేచ్ఛగా జీవించే సంయోగ బీజదం ఏర్పడుతుంది. ఉదా : మార్కాన్షియా |
6) సిద్ధబీజం మొలకెత్తి ఆకుపచ్చని, శాఖాయుత ప్రథమ తంతువును ఏర్పరుస్తుంది. ఉదా : ఫ్యూనేరియా |
ప్రశ్న 3.
సమసిద్ధ బీజ, భిన్న సిద్ధబీజ టెరిడోఫైట్లు అంటే ఏమిటి? రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
సమసిద్ధబీజ మొక్కలు :
ఒకేరకమైన సిద్ధబీజాలను ఏర్పరిచే మొక్కలు ఉదా : లైకోపోడియం, టెరిస్
భిన్నసిద్ధబీజ మొక్కలు :
సూక్ష్మ, స్థూల సిద్ధబీజాలును ఏర్పరిచే మొక్కలు ఉదా : సెలాజినెల్లా, సాల్వినియా.
ప్రశ్న 4.
భిన్న సిద్ధబీజత అంటే ఏమిటి ? దాని ప్రాముఖ్యం గురించి క్లుప్తంగా వ్రాయండి. రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
భిన్నమైన సిద్ధబీజాలు ఏర్పడటను భిన్నసిద్ధబీజత అంటారు.
ప్రాముఖ్యత :
- సూక్ష్మ సిద్ధబీజ మాతృకణాల నుండి ఏర్పడే సూక్ష్మసిద్ధ బీజాలు చిన్నవిగా 0.015 – 0.05mµ ఉంటాయి. స్థూల సిద్ధబీజ మాతృకణం నుంచి ఏర్పడే స్థూల సిద్ధబీజాలు పెద్దవిగా 1-5 mµ ఉంటాయి.
- సూక్ష్మసిద్ధబీజము పురుష సంయోగ బీజదంగాను, స్థూలసిద్ధబీజం స్త్రీసంయోగ బీజదంగాను ఏర్పడతాయి.
- సిద్ధబీజదంపై స్త్రీ సంయోగ బీజదం ఉంటుంది.
- స్త్రీ సంయోగ బీజదంపై సంయుక్త బీజం ఏర్పడి, పిండంగా మారుతుంది.
- స్త్రీ సంయోగ బీజదంలో ఎక్కువ ఆహారం నిల్వ ఉంటుంది. ఉదా : సెలాజినెల్లా, సాల్వినియా.
ప్రశ్న 5.
శైవలాలు, బ్రయోఫైటా మొక్కల ఆర్థిక ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు:
- శైవలాల ఆర్థిక ప్రాముఖ్యత : కిరణజన్య సంయోగక్రియ ద్వారా భూమిపై జరిగే కర్బన స్థాపనలో కనీసం సగభాగం శైవలాలద్వారా జరుగుతుంది. దీనివల్ల చుట్టు పక్కల వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి.
- పోరైరా, లామినేరియా, సర్గాసమ్లాంటి శైవలాలు ఆహారంగా ఉపయోగపడతాయి.
- కొన్ని గోధుమ, ఎరుపు వర్ణ సముద్ర శైవలాలు నీటిని పట్టి ఉంచే హైడ్రోకార్బన్లను ఉత్పత్తి చేస్తాయి.
ఉదా : ఆల్జిన్, కర్రాజీన్. - జెలిడియం, గ్రాసిలేరియా వంటి శైవలాల నుండి జున్నుగడ్డి (Agar) లభిస్తుంది. ఇది సూక్ష్మజీవులను పెంచడానికి ఐస్క్రీమ్లు, జెల్లీల తయారీలోను వాడతారు.
- లామినేరియా వంటి కెలనుండి అయోడిన్ను సేకరిస్తారు.
- క్లోరెల్లా, స్పైరులినా వంటి ఏకకణ శైవలాలను అంతరిక్షయాత్రికులు ఆహారంగా ఉపయోగిస్తున్నారు.
బ్రయోఫెట్లు ఆర్థిక ప్రాముఖ్యత :
- కొన్ని మాస్లు శాకాహారులైన క్షీరదాలకు, పక్షులకు ఇతర జంతువులకు ఆహారంగా ఉపయోగపడతాయి.
- స్ఫాగ్నం అనేమాస్ జాతులు ఇంధనంగా వాడబడుతున్న “పీట్” ను ఇస్తాయి. ఇది నీటిని నిలుపుకునే శక్తిని కల్గిఉంటుంది.
కావున జీవ పదార్థాలను ఇతర ప్రదేశాలకు రవాణా చేయడంలో ఉపయోగిస్తారు. - మాస్ మొక్కలు, లైకేన్లతో కలిసి బండరాళ్ళపై సహనివేశానికి తోడ్పడే మొట్టమొదటి జీవులు.
- ఇవి రాతిముక్కలను విచ్ఛిన్నం చేసి, మొక్కల అనుక్రమకంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.
- మాస్ మొక్కలు మృత్తిక ఉపరితలంపైన ఒక మందమైన చాప వంటి నిర్మాణంగా ఏర్పడి, మృత్తిక క్రమక్షయాన్ని నివారిస్తాయి.
ప్రశ్న 6.
ఏకదళ, ద్విదళ బీజాలను ఏ విధంగా గుర్తిస్తారు?
జవాబు:
ఏకదళబీజాలు | ద్విదళ బీజాలు |
1) విత్తనంలో ఒకే ఒక బీజదళం ఉంటుంది. | 1) విత్తనంలో బీజదళాలు ఉంటాయి. |
2) పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. | 2) తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. |
3) పత్రాలలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. | 3) పత్రాలలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. |
4) పుష్పాలు త్రిభాగయుతము | 4) పుష్పాలు చతుర్భాగ లేక పంచ భాగయుతము. |
5) పుష్పాలు ఏక పరి పత్రయుతము | 5) పుష్పాలు ద్విపరి పత్రియుతము. |
ప్రశ్న 7.
ప్రథమాంకురం గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
టెరిడోఫైట్లలో సిద్ధబీజాలు మొలకెత్తి అతిచిన్న బహుకణయుత స్వయం పోషక థాలస్ వంటి నిర్మాణం కల “ప్రథమాంకురం” అనే సంయోగ బీజదంగా అభివృద్ధి చెందుతాయి. ఇవి పెరగటానికి చల్లని, తేమగల, నీడ ప్రాంతాలు అవసరము. ఈ పరిస్థితులు, ఫలదీకరణకు నీటి అవసరం దృష్ట్యా. టెరిడోఫైటా మొక్కల వ్యాప్తి అతి తక్కువ భౌగోళిక ప్రాంతాలకు పరిమితమై ఉంటుంది. సంయోగబీజదాలు ఆంథరీడియం, ఆర్కీగోనియం అనే పురుష, స్త్రీ లైంగికావయవాల్ని కలిగి ఉంటాయి. ఇవి బహుకణ యుతాలు, కంచుక యుతాలు, వృంత రహితాలు.
ప్రశ్న 8.
ఈ కింది వాని పటాలు గీసి, భాగాలను గుర్తించండి.
a) లివర్ వర్ట్ స్త్రీ, పురుష థాలస్లు
b) ఫ్యునేరియా మొక్క సంయోగ బీజదం, సిద్ధబీజదం.
జవాబు:
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
‘ఆర్కిగోనియం’ ను కలిగిన మూడు విభాగాలను తెలుపుతూ వాటిలో ఒకదాని జీవితచక్రం గురించి సంగ్రహంగా వివరించండి.
జవాబు:
బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, వివృత బీజాలులో ఆర్కిగోనియాలు కలవు.
బ్రయోఫైట్లలో జీవిత చక్రం :
బ్రయోఫైటా మొక్కల ప్రధాన దేహం ఏకస్థితికము. ఇది సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. కనుక సంయోగ బీజదం అంటారు. వీటిలోని లైంగిక అవయవాలు బహుకణయుతంగా, కంచుకాన్ని, వృంతాన్ని కలిగి ఉంటాయి. పురుషబీజాశయాన్ని ఆంథరీడియం అంటారు. ఇది ద్వికశాభయుత చలన పురుష బీజాలను ఉత్పత్తి చేస్తాయి. స్త్రీ బీజాశయము (ఆర్కిగోనియం) కూజా ఆకారంలో ఉండి ఒక అండకణాన్ని ఉత్పత్తి చేస్తుంది. చలన పురుష బీజాలు నీటిలో విడుదలై స్త్రీ బీజాశయాన్ని చేరతాయి. ఒక చలన పురుష బీజం ఒక స్త్రీ బీజకణంతో సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. దీనిని జాయిడోగమి అంటారు.
సంయుక్త బీజము బహుకణ నిర్మతమైన సిద్ధబీజదంను ఏర్పరుస్తుంది. సిద్ధబీజదం, సంయోగ బీజదం నుంచి ఆహారాన్ని గ్రహిస్తుంది. దీనిలోని కొన్ని కణాలు సిద్ధబీజ మాతృకణాలుగా మారి, క్షయకరణ విభజన చెంది ఏకస్థితిక సిద్ధబీజాలును ఏర్పరుస్తాయి. ఇవి మొలకెత్తి సంయోగబీజదాన్ని ఏర్పరుస్తాయి. సంయోగబీజదాలు, సిద్ధబీజదాలు చాలా విభేదాన్ని చూపిస్తాయి. కావున బ్రయోఫైట్లు బిన్నరూప ఏకాంతర జీవితదశలను ప్రదర్శిస్తాయి. ఇటువంటి జీవిత చక్రాన్ని “ఏకద్వయస్థితిక జీవిత చక్రం” అంటారు.
ప్రశ్న 2.
వివృత బీజాల ముఖ్యలక్షణాలను వివరించండి.
జవాబు:
- ఇవి పిండయుతమైన, నాళికా కణజాలంగల ఆర్కిగోనియమ్లను కలిగిన పుష్పించే మొక్కలు.
- ఇవి మధ్యరకపు వృక్షాలు లేక పొడవైన వృక్షాలు లేక పొదలుగా ఉంటాయి.
- తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. పైనస్లో వేళ్ళలో శిలీంధ్ర మూలాలు ఉంటాయి. సైకస్ వంటి జాతులలో సయనో- బాక్టీరియమ్లు కల ప్రత్యేకమైన ప్రవాళాల వేర్లు ఉంటాయి.
- కాండము శాఖారహితం (సైకస్) లేక శాఖాయుతంగా (పైనస్) ఉంటాయి.
- పత్రాలు సరళంగాగాని, సంయుక్తంగాగాని, ఉంటాయి.
- అంతర్నిర్మాణంలో కాండంలో నిజమైన ప్రసరణ స్థంభం ఉంటుంది. నాళికాపుంజాలు సంయుక్తం, సహపార్శ్వం, వివృతం.
- దారువులో దారునాళాలు, పోషక కణజాలంలో సహకణాలు ఉండవు.
- కాండం, వేరులలో ద్వితీయ వృద్ధి జరుగుతుంది.
- వివృత బీజాలలో సూక్ష్మ, స్థూల సిద్ధబీజాలు (భిన్నసిద్ధ బీజత) కలిగి ఉంటాయి.
- సిద్ధబీజాలు, సిద్ధబీజాశయాలలోను, ఇవి సిద్ధబీజాశయ పత్రాలపై ఉంటాయి. ఈ పత్రాలు ఒక అక్షంపై సర్పిలాకారంలో అమరి శంకువు లేక స్ట్రోబిలస్ గా ఉంటాయి.
- పురుష మొక్కపై ఉండే సూక్ష్మ సిద్ధబీజాశయాలను కల్గిన సూక్ష్మసిద్ధబీజాశయ పత్రాలు పురుష శంకుగా ఏర్పడతాయి.
- సూక్ష్మ సిద్ధబీజాలు/పరాగరేణువులు పురుషసంయోగబీజదాన్నిస్తాయి.
- అండాలు కల స్థూల సిద్ధబీజాశయ పత్రాలు కలిగిన శంకును స్త్రీ స్ట్రోబిలస్ అంటారు.
- స్థూల సిద్ధబీజము స్త్రీ సంయోగ బీజదంగా పని చేస్తుంది.
- పరాగ సంపర్కం : ప్రత్యక్షం, గాలి ద్వారా జరుగును.
- దీనిలో సైకడోప్సిడా, కోనిఫెరాప్సిడా, నీటాప్సిడా అను 3 తరగతులు కలవు.
ప్రశ్న 3.
టెరిడోఫైటా మొక్కల ముఖ్యలక్షణాలను తెలపండి.
జవాబు:
- నాళికా కణజాలాలను కలిగిన నేల మీద నివసించే మొక్కలలో మొట్ట మొదటవి.
- ఇవి పిండాన్ని ఏర్పరచే, ఆర్కిగోనియంలు గల నాళికా కణజాలయుత పుష్పించని మొక్కలు.
- ఇవి చల్లని, తేమ నీడగల ప్రాంతాలలో, కొన్ని ఇసుక నేలల్లో పెరుగుతాయి.
- టెరిడోఫైట్లలో ప్రధాన మొక్క నిజమైన వేర్లు, కాండము పత్రాలు కల సిద్ధ బీజదము.
- అబ్బురపు వేర్లు వ్యవస్థ కలిగి ఉంటాయి.
- ప్రథమ ప్రసరణ స్థంభం లేదా నాళాకార ప్రసరణ స్థంభం లేదా సొలెనోస్టీల్ లేదా డిస్ట్రియోస్టీల్ ఉంటుంది.
- పత్రాలు చిన్నవిగా లేదా పెద్దవిగా (ఫ్రెర్న్లు) ఉంటాయి.
- సిద్ధబీజదాలలో సిద్ధబీజాశయాలు ఉన్న ఫలవంతమైన పత్రాలను సిద్ధ బీజాశయ పత్రాలు అంటారు.
- ఎక్కువ టెరిటోఫైటా మొక్కలు సమసిద్ధబీజయుతాలు – కాని సెలాజినెల్లా, సాల్వినియాలలో భిన్న సిద్ధబీజత ఉంటుంది.
- సిద్ధబీజం మొలకెత్తి స్వయంపోషక ప్రధమాంకురం ఏర్పడుతుంది.
- ప్రధమాంకురంపై పురుష, స్త్రీ బీజాశయాలు ఏర్పడతాయి.
- లైంగిక అవయవాలు బహుకణ యుతాలు, కంచుకయుతాలు, వృంత రహితాలు.
- చలన పురుషబీజము, స్త్రీ బీజకణంతో సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది.
- సంయుక్త బీజం మొలకెత్తి సిద్ధబీజదంగా వృద్ధి చెందుతుంది.
ప్రశ్న 4.
మొక్కల జీవితచక్రాలు, ఏకాంతర దశల గురించి వివరించండి.
జవాబు:
మొక్కలలో ఏకస్థితిక, ద్వయస్థితిక కణాలు సమవిభజన ద్వారా విభజన చెందుతాయి. దీనివల్ల రెండు విభిన్నమైన ఏకస్థితిక ద్వయస్థితిక మొక్కల దేహాలు ఏర్పడతాయి. ఏకస్థితిక మొక్క దేహం సమవిభజన ద్వారా సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. దీనిని సంయోగ బీజదం అంటారు. ఫలదీకరణ తర్వాత సంయుక్తబీజం కూడ సమవిభజన ద్వారా ద్వయస్థితిక సిద్ధబీజదాన్ని ఇస్తుంది. సిద్ధబీజదాలు క్షయకరణ విభజన ద్వారా సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సమవిభజనలు చెంది ఏకస్థితిక మొక్కను ఏర్పరుస్తాయి. ఈ విధంగా ఏకస్థితిక సంయోగ బీజదం, ద్వయ స్థితిక సిద్ధబీజదంతో ఏకాంతరంగా ఉంటాయి. వివిధ రకాల మొక్కలు వివిధ రకాల జీవిత చక్రాలు చూపుతాయి.
ఉదా :1) వాల్వాక్స్, స్పైరోగైరా, కొన్ని క్లామిడోమోనస్ వంటి శైవలాలు ఏకస్థితిక జీవిత చక్రంను చూపుతాయి. దీనిలో సంయుక్త బీజంలో క్షయకరణ విభజన వల్ల ఏకస్థితిక సిద్ధబీజాలు ఏర్పడతాయి. ఇవి సమవిభజన చెంది సంయోగ బీజదాన్నిస్తాయి. కావున ఈ మొక్కలలో స్వతంత్ర జీవనం గడిపే సంయోగ బీజదమే ప్రధానమైన దశ.
2) కొన్ని జాతులలో ద్వయస్థితిక సిద్ధబీజదం స్వయం పోషకంగా స్వతంత్ర జీవనం కలిగి ప్రబలంగా ఉంటుంది.
ఏకస్థితికదశ సంయోగ బీజాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. దీనిని ద్వయస్థితిక జీవితచక్రం అంటారు. ఉదా : కొన్ని టెరిడోఫైటా మొక్కలు, విత్తనాలు కల అన్ని మొక్కలలో సంయోగ బీజదము కొన్ని కణాలు కలిగి ఉంటుంది. దీనికి ద్వయ – ఏక స్థితికం అంటారు.
3) బ్రయోఫైటా మొక్కలు ఏక ద్వయ స్థితిక జీవిత చక్రంను చూపుతాయి. దీనిలో బహుకణ నిర్మిత ప్రబలమైన సంయోగ బీజదశ, సంయోగ బీజదంపై ఆధారపడి ఉండే సిద్ధబీజద దశ కలిగి ఉంటాయి. ఉదా : ఎక్టోకార్పస్, లామినేరియా.
ప్రశ్న 5.
వివృత బీజాలు, ఆవృత బీజాలు రెండూ విత్తనాలను కలిగిన మొక్కలైనప్పటికీ వాటిని వేర్వేరుగా ఎందుకు వర్గీకరించారు?
జవాబు:
వివృత బీజాలు, ఆవృతబీజాలు విత్తనాలు కలిగి ఉన్నప్పటికి వాటి మధ్య బాహ్యంగా అంతరంగా మార్పులు కలవు. అవి :
వివృత బీజాలు | ఆవృత బీజాలు |
1) గుల్మములు ఉండవు. | 1) ఎక్కువ మొక్కలు గుల్మములు. |
2) ప్రత్యుత్పత్తి భాగాలను శంఖువులు అంటారు. | 2) ప్రత్యుత్పత్తి భాగాలు పుష్పాలు. |
3) శంఖువులు ఏక లింగములు. | 3) పుష్పాలు ఏక లేక ద్విలింగాశ్రయులు. |
4) అండాలు నగ్నంగా ఉంటాయి. | 4) అండాలు అండాశయంలో దాగి ఉంటాయి. |
5) పరాగ రేణువులు అండాలను ప్రత్యక్షంగా చేరతాయి. | 5) పరాగ రేణువులు కీలాగ్రంను చేరతాయి. |
6) పురుష సంయోగ బీజదంలో ప్రథమాంకుర కణాలు ఉంటాయి. | 6) ప్రథమాంకుర కణాలు ఉండవు. |
7) స్త్రీ బీజాశయాలు ఉంటాయి. | 7) స్త్రీబీజాశయాలు ఉండవు. |
8) ఫలదీకరణ ఒక్కసారి జరుగును. | 8) ఫలదీకరణ 2 సార్లు జరుగును. |
9) స్త్రీ సంయోగ బీజదమే అంకురచ్చదంగా వ్యవహరిస్తుంది. ఫలదీకరణకు ముందు ఏర్పడుతుంది. ఇది ఏకస్థితికము. | 9) అంకురచ్చదం ఫలదీకరణకు తర్వాత ఏర్పడుతుంది. ఇది త్రయ స్థితికము |
10) పిండ జననంలో స్వేచ్ఛా కేంద్రక విభజనలు జరుగుతాయి. | 10) స్వేచ్ఛాకేంద్రక విభజనలు ఉండవు. |
11) దారునాళాలు, సహకణాలు ఉండవు. | 11) దారు నాళాలు సహకణాలు ఉంటాయి. |
12) శాఖీయ ప్రత్యుత్పత్తి అరుదుగా జరుగుతుంది. | 12) శాఖీయ ప్రత్యుత్పత్తి సాధారణము. |