Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 12th Lesson ఆధునికతకు మార్గాలు Textbook Questions and Answers.
AP Inter 2nd Year History Study Material 12th Lesson ఆధునికతకు మార్గాలు
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
చైనాలో జరిగిన నల్లమందు యుద్ధాలకు గల కారణాలు, యుద్ధ ఫలితాలు ఏవి ?
జవాబు:
బ్రిటన్ ఉత్పత్తులకు చైనాలో గిరాకీ లేదు. కానీ చైనా పింగాణి, తేయాకు, పట్టు వస్త్రాలకు యూరప్ లో డిమాండ్ ఉండేది. అందువల్ల బ్రిటీష్వారు వారి వ్యాపార వస్తువులలో నల్లమందును కూడా చేర్చారు. భారతదేశంలో పండించే నల్లమందును రహస్యంగా బ్రిటీష్వారు ఇంగ్లాండ్కు ఎగుమతి చేసి విపరీతమైన లాభాలు పొందారు. చైనాలో నల్లమందు నిషిద్ధం. ఫలితంగా రెండు దేశాల మధ్య మొదటి నల్లమందు యుద్ధం క్రీ.శ. 1839 నవంబర్ లో ప్రారంభమై మూడు సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో చైనా ఓడిపోయింది. 1842లో నాన్ కింగ్ ఒప్పందం యూరోపియన్ల వ్యాపారానికి చైనా ద్వారాలు తెరుచుకున్నట్లయింది.
నౌకలలో దొంగ రవాణా జరుగుతోందన్న ఆరోపణలపై 12 మంది బ్రిటీష్ వారిని చైనా నిర్బంధించింది. ‘అగస్టీ చాప్ కులీన్’ అనే మత ప్రచారకుడిని తిరుగుబాటుదారుడనే అనుమానంతో చైనా ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఈ రెండు సంఘటనలు రెండవ నల్లమందు’ యుద్ధానికి దారితీసాయి. పెకింగ్ సంధితో ఆ యుద్ధం ముగిసింది. యుద్ధ
ఫలితాలు: ఈ రెండు నల్లమందు యుద్ధాల ఫలితంగా చైనీయులు పాశ్చాత్య దృక్పథానికి దగ్గరయ్యారు.
- పాశ్చాత్యులను అనుకరించడం ద్వారా బలమైన శక్తిగా ఎదగవచ్చని చైనీయులు భావించారు.
- చైనాలోని సంస్కర్తల కృషి మూలంగా చైనీయులు యూరోపియన్ల భాషలు, ఇంజనీరింగ్ విద్య, సైనిక పద్ధతులను నేర్చుకున్నారు.
- చైనాలో పారిశ్రామికీకరణ, బొగ్గు గనుల త్రవ్వకం ప్రారంభమైనాయి.
- చైనాలో ‘కాంగ్యువై “శతదిన సంస్కరణలు” ప్రారంభించాడు. పాఠశాలలో పాశ్చాత్య విద్యా విధానం, పోటీ పరీక్షల విధానం ప్రవేశపెట్టారు.
- పెకింగ్ విశ్వ విద్యాలయం స్థాపన, విదేశీ గ్రంథాల అనువాదం మొదలైన వాటి ఫలితంగా 1911లో చైనాలో విప్లవం వచ్చింది.
ప్రశ్న 2.
సన్ట్సేన్ భావాలు ఏవి ? అతడు ఆ భావాలను చైనాలో అమలుపరచిన తీరును వివరింపుము.
జవాబు:
చైనాలో 1911వ సంవత్సరంలో వచ్చిన ప్రజాతంత్ర విప్లవానికి నాయకుడు ‘సన్మెట్సేన్’. ఇతడు క్రీ.శ. |1866వ సంవత్సరంలో కాంటన్ గ్రామంలో ఒక కర్షక కుటుంబంలో జన్మించాడు. చైనా తత్త్వవేత్త కన్ఫూషియస్ సిద్ధాంతాలకు ప్రభావితుడై చైనాలో జాతీయభావం, ప్రజాస్వామ్య భావజాలం, ఆధునిక దృక్పథాన్ని పెంపొందించి రిపబ్లిక్ స్థాపన ఆశయంతో చైనాలో ‘సన్ట్సేన్’ ‘తుంగ్మెంగ్ హూయి’ అనే విప్లవ సంస్థను స్థాపించాడు. పార్లమెంటరీ ప్రభుత్వ స్థాపనే తన ధ్యేయం అని ప్రకటించాడు. విద్యార్థులు, యువకులు దీనిలో సభ్యులయ్యారు. చైనా ప్రజలను ఇసుక రేణువులతో పోల్చుతూ వాటిని అనుసంధానం చేయడానికి దృఢతరం చేసే జాతీయభావం అనే సిమెంట్ అవసరం అన్నాడు. ప్రజలకు జీవనోపాధి కల్పించే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలన్నాడు. పెట్టుబడిని క్రమబద్దీకరించి, భూమిని సమానంగా పంచాలని ప్రబోధించాడు.
సనీయెట్సేన్ తను స్థాపించిన ‘తుంగ్మెంగ్ హూయి’ ని రద్దుచేసి జాతీయ లక్ష్యాలతో కొమిన్టింగ్ అనే జాతీయ రాజకీయ పార్టీని స్థాపించాడు. కొమిన్టింగ్ అంటే జాతీయ పక్షం అని అర్థం. క్రమంగా కొమిన్హాంగ్ పార్టీ బలపడింది. మేధావి వర్గం అభివృద్ధి చెందింది, పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. పట్టణాలు, నగరాలు విస్తరించాయి. ఆధునిక విజ్ఞానం, ప్రజా ప్రభుత్వం, జాతీయవాదం మొదలైన వాటి ద్వారా చైనాను అభివృద్ధి పథంలో నడిపించాలని కొమిన్టంగ్ ఆకాంక్ష. కొమిన్లాంగ్ పట్టణీకరణ, పారిశ్రామికాభివృద్ధి కేంద్రంగా షాంగై నగరాన్ని వృద్ధి చేశారు. నౌకా నిర్మాణం అభివృద్ధి చెందింది. ఆధునిక పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా ఉద్యోగ, వర్తక, వ్యాపార, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. స్త్రీలు కూడా భాగస్వాములయ్యారు. ఉత్తర, దక్షిణ చైనాల ఏకీకరణకు కృషి చేసాడు. ‘సన్యాట్సన్’ చైనా జాతిపితగా ప్రసిద్ధికెక్కాడు.
ప్రశ్న 3.
మేజి పునః ప్రతిష్టకు దారితీసిన సంఘటనలను తెలపండి.
జవాబు:
టోకుగవా పాలన పట్ల సమాజంలోని అన్ని వర్గాలలో అసంతృప్తి ప్రారంభమైంది. 1866లో దైమ్యోలు కూడా తిరుగుబాటు చేసారు. 1868లో చక్రవర్తి, సైన్యాలు, దైమ్యోలు కలిసి టోకుగవా సైన్యాలను ఓడించాయి. ఆఖరి షోగున్ ‘హితోతిసుబాషి’ లొంగిపోయాడు. టోకుగవా షోగునెట్ అంతమైంది. చక్రవర్తి మత్సుహిటో సర్వాధికారాలతో ‘మెడో’ లో సింహాసనం అధిష్టించాడు.
టోకుగవా షోగునెట్ పతనమై, చక్రవర్తి తిరిగి అధికారంలోకి రావడంతో జపాన్లో మొయిజీ ప్రభుత్వ స్థాపన జరిగింది. ‘మెయిజీ’ అనగా ‘విజ్ఞతతో వ్యవహరించడం’ అని అర్థం. క్రీ.శ. 1868లో అధికారం చేపట్టిన ‘మత్సుహిటో’ రాజ్యాంగబద్ధ రాజరికాన్ని రూపొందించి, భూస్వామ్య వ్యవస్థను రద్దుచేసి, సాంప్రదాయ వ్యవస్థలకు స్వస్తిచెప్పి జపాన్ను పాశ్చాత్యీకరిస్తూ మొయిజీ పాలన సాగించాడు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా ప్రభుత్వం, ప్రజలు ఇచ్చిపుచ్చుకునే తోడ్పాటు ఫలితంగా జపాన్ స్వల్పకాల వ్యవధిలో అద్భుత ప్రగతిని సాధించింది.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
కన్ఫూషియస్
జవాబు:
ప్రపంచంలోని అత్యుత్తమ దార్శనికులలో కన్ఫూషియస్ ఒకడు. ఇతడు క్రీ.పూ. 551లో జన్మించాడు. క్రీ.పూ. 479లో మరణించాడు. కన్ఫూషియస్ అనే పేరు కుంగ్ – ఫూట్జ్ అనే యూరోపియన్ పద రూపం. కుంగ్ అనగా గురువు అని అర్థం. ఇతని శిష్యులు ఇతనిని “కుంగ్-దీ-పూ” అని పిలిచేవారు. 22 సంవత్సరాల వయసులో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి చరిత్రను, కవిత్వాన్ని, మర్యాదలను గురించిన అంశాలను బోధించాడు. ఇతడు “పంబ్లింగ్” అనే ఐదు గ్రంథాలను వ్రాశాడు. అవి.
- లీ – ఛీ: ప్రాచీన శాస్త్ర విధులను తెలియజేస్తుంది.
- ఈ-జింగ్: ఆత్మతత్త్వ విద్యలకు చెందినది.
- జింగ్: మానవుని నైతిక విలువలను వివరిస్తుంది.
- చూన్ చ్యూ: ఇది ‘లూ’ రాష్ట్ర చరిత్రను వివరిస్తుంది.
- ఘాజింగ్: చైనా ప్రాచీన చరిత్రను తెలియజేస్తుంది.
ప్రశ్న 2.
మావోజెడాంగ్
జవాబు:
ఆధునిక చైనా నిర్మాత మావోసెటుంగ్ (మావోజెడాంగ్) 1893 డిసెంబర్ 26న హూనాన్ రాష్ట్రంలోని ఒక సంపన్న కర్షక కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం అనంతరం 1918లో పెకింగ్ గ్రంథాలయ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసాడు. అక్కడ మార్కిస్ట్ సిద్ధాంతాలను బాగా ఆకళింపు చేసుకున్నాడు. మావో 1911 విప్లవం వలన ప్రభావితుడయ్యాడు. పెకింగ్ యూనివర్సిటీలో ఉన్న కాలంలో మావో మార్కిస్టు లెనినిస్ట్ భావాలకు ఆకర్షితుడయ్యాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా స్థాపించడంలో కీలకపాత్ర వహించాడు. రష్యాలో ఏర్పడిన కర్షక సోవియట్ల స్ఫూర్తితో కియాంగీని రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని చైనా సోవియట్లను ఏర్పరచాడు. భూమి మొత్తం కమ్యూనిస్ట్ల వశమైంది. తరువాత కాలంలో 1949 అక్టోబర్ లో జరిగిన కమ్యూనిస్ట్ విప్లవం విజయవంతమై మావోజెడాంగ్ అధ్యక్షుడిగా, చౌఎన్ ప్రధానిగా చైనాలో ప్రజా రిపబ్లిక్ ఏర్పడింది.
ప్రశ్న 3.
టోకుగవా షోగునెట్
జవాబు:
1603లో టోకుగవా వంశీయులు షోగున న్ను చేజిక్కించుకుని 1868 వరకు పాలించాయి. ఈ కాలాన్ని ‘టోకుగవా ‘షోగునెట్’ అంటారు. 265 సంవత్సరాల వీరి పాలనలో భూస్వామ్య వ్యవస్థను, దైమ్యోలను అదుపులో ఉంచింది. సైనిక శక్తి మీద ఆధారపడి టోకుగవా అధికారాన్ని చెలాయించింది. పరిపాలన కోసం ఉద్యోగస్వామ్యాన్ని ఏర్పరిచింది. టోకుగవా పాలనలో శాంతి, సుస్థిరత ఉన్నా క్రమంగా సమాజంలోని అన్ని వర్గాలలో అసంతృప్తి ఏర్పడింది. టోకుగవా రాజధాని ‘యెడో’ కాగా చక్రవర్తి ‘క్యోటో’ లో నివసించాడు. ఇంగ్లండ్, రష్యాలతో కుదుర్చుకున్న ఒప్పందంతో టోకుగవా అప్రదిష్టపాలైంది. 1866లో దైమ్యోలు తిరుగుబాటు చేసారు. 1868లో చక్రవర్తి సైన్యాలు, దైమ్యోలు కలిసి టోకుగవా సైన్యాలను ఓడించాయి. ఆఖరి షోగున్ ‘హితోతి సుబాషి’ లొంగిపోయాడు. టోకుగవా షోగునెట్ అంతమైంది.