AP Inter 1st Year Botany Study Material Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 6th Lesson ప్రత్యుత్పత్తి విధానాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 6th Lesson ప్రత్యుత్పత్తి విధానాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆవృత బీజ మొక్కల జీవిత చక్రంలో బహిర్గత దశ (Dominant phase) ఏది?
జవాబు:
ధ్వయస్థితిక సిద్ధ బీజద దశ.

ప్రశ్న 2.
భిన్న సిద్ధ బీజత అంటే ఏమిటి? ఆవృత బీజ మొక్క అభివృద్ధి చేసే రెండు రకాల సిద్ధ బీజాలను తెలపండి?
జవాబు:
ఒకటికంటె ఎక్కువ సిద్ధబీజాలు ఏర్పడుటను భిన్న సిద్ధ బీజత అంటాం. ఆవృత భీజమొక్కలలో సూక్ష్మ, స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి.

ప్రశ్న 3.
శైవలాలు, శిలీంధ్రాలలోని ప్రత్యుత్పత్తి విధానాలను తెలపండి.
జవాబు:
శైవలాలు (క్లామిడోమోనాస్) అలైంగిక ప్రత్యుత్పత్తి చలన సిద్ధ భీజాల ద్వారా, శిలీంధ్రాలలో (రైజోపస్) అలైంగిక ప్రత్యుత్పత్తి చలనరహిత సిద్ధబీజాల ద్వారా జరుగుతుంది. శైవలాలలో లైంగిక ప్రత్యుత్పత్తి పురుష, స్త్రీ సంయోగ బీజాల కలయిక వల్ల జరుగుతుంది. శిలీంధ్రాలలో లైంగిక ప్రత్యుత్పత్తి రెండు భిన్న తెగలకు చెందిన శిలీంధ్ర తంతువుల మధ్య జరుగును.

ప్రశ్న 4.
లివర్ వర్ట్స్లు (Liverworts) ఏవిధంగా శాకీయ ప్రత్యుత్పత్తిని జరుపుతాయి.
జవాబు:
లివర్ వర్ట్స్లు జెమ్మాలు ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.

ప్రశ్న 5.
బ్యాక్టీరియమ్లు, ఈస్ట్లు, అలైంగిక ప్రత్యుత్పత్తి జరపటంకోసం చూపే రెండు లక్షణాలను తెలపండి?
జవాబు:

  1. బ్యాక్టీరియమ్లలో, ఈస్ట్లలో, అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడే సంతతి ఒకదానితో ఒకటి పోలి ఉండి, జనకానికి సరియైన నకలుగా ఉంటాయి.
  2. పెరుగుదల త్వరితంగా ఉంటుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

ప్రశ్న 6.
అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి ద్వారా ఏర్పడే సంతతిని ‘క్లోన్’ అని ఎందుకు మనం అంటాము ?
జవాబు:
రెండు జనకాలు ప్రత్యుత్పత్తిలో పాల్గొనకపోవడంవల్ల, ఏర్పడే మొక్కలు జనక మొక్కలను పోలి ఉంటాయి. కావున వాటిని క్లోన్లు అంటారు.

ప్రశ్న 7.
ఏకవార్షిక, బహువార్షిక మొక్కల మధ్య దేనిలో తక్కువ శైశవ దశ (Juvenile phase) ఉంటుంది. ఒక కారణాన్ని తెలపండి.
జవాబు:
ఏకవార్షిక మొక్కలు తక్కువ శైశవదశ ఉంటుంది. ఈ మొక్కలలో శాకీయ, లైంగిక మరియు జీర్ణత దశలు చక్కగా చూపుతాయి. బహూవార్షిక మొక్కలలో ఈ దశలు స్పష్టంగా ఉండవు.

ప్రశ్న 8.
ఒక పుష్పించే మొక్కలో లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జరిగే విధానంలోని క్రింది సంభవాలను ఒక క్రమపద్ధతిలో తిరిగి పొందుపరచండి. పిండజననం, ఫలదీకరణ, సంయోగ బీజ జననం, పరాగ సంపర్కం.
జవాబు:
సంయోగ బీజ జననము, పరాగ సంపర్కం, ఫలదీకరణ, పిండజననము.

ప్రశ్న 9.
బహూకణయుత జీవులలో కణవిభజన అనేది ఒక రకమైన ప్రత్యుత్పత్తి అవునా లేక కాదా అనే దానికి సరియైన కారణాలు తెలపండి ?
జవాబు:
బహూకణయుత జీవులలో కణవిభజన ప్రత్యుత్పత్తి విధానము కాదు. వాటిలో ప్రత్యుత్పత్తి శాకీయ, అలైంగిక మరియు లైంగిక విధానాలు ద్వారా జరుగుతుంది.

ప్రశ్న 10.
ఈ క్రింది వాటిలో ద్విలింగాశ్రయ, ఏకలింగాశ్రయ మొక్కలను గుర్తించండి. a) ఖర్జూరం, b) కొబ్బరి, c) కారా, d) మార్కాంషియా (Marchantia).
జవాబు:
a) ఖర్జూరం – ఏకలింగాశ్రయ
b) కొబ్బరి – ద్విలింగాశ్రయ
c) కారా – ద్విలింగాశ్రయ
d) మార్కాంషియా – ఏకలింగాశ్రయ

AP Inter 1st Year Botany Study Material Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

ప్రశ్న 11.
ఈ పట్టికలో ‘A’ లోని మొక్కలతో వాటి శాకీయ భాగాలున్న పట్టిక ‘B’ తో జతచేయండి. (IMP)

పట్టిక A పట్టిక B
1) బ్రయోఫిల్లమ్ a) ఆఫ్సెట్
2) అగేవ్ b) కళ్లు
3) బంగాళాదుంప c) పత్ర మొగ్గలు
4) గుఱ్ఱపుడెక్క d) ముక్కలు కావడం
5) కారా e) పిలక మొక్కలు
6) మెంథా f) లఘ లశునాలు

జవాబు:

పట్టిక A పట్టిక B
1) బ్రయోఫిల్లమ్ a) పత్ర మొగ్గలు
2) అగేవ్ b) లఘులశునాలు
3) బంగాళాదుంప c) కళ్ళు
4) గుఱ్ఱపుడెక్క d) ఆఫ్సెట్లు
5) కారా e) ముక్కలు కావడం
6) మెంథా f) పిలక మొక్కలు

ప్రశ్న 12.
ఈ క్రింది పుష్ప భాగాలు ఫలదీకరణ తరువాత ఏవిధంగా అభివృద్ధి చెందుతాయో తెలపండి?
a) అండాశయం
b) కేసరాలు
c) అండాలు
d) రక్షక పత్రావళి
జవాబు:
a) అండాశయము – ఫలంగా మారును
b) కేసరాలు – రాలిపోతాయి
c) అండాలు – విత్తనాలుగా మారును
d) రక్షక పత్రావళి – రాలిపోతాయి. కొన్ని మొక్కలలో ఫలాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. (వంగ)

ప్రశ్న 13.
‘వివిపారి’ (శిశు ఉత్పాదన) (vivipary) అనే దానిని ఒక ఉదాహరణతో నిర్వచించండి.
జవాబు:
కొన్ని మాంగ్రూవ్ మొక్కలలో విత్తనాలు తల్లి మొక్కలను అంటిపెట్టుకుని ఉండగానే అంకురిస్తాయి. దీనిని వివిపారి (శిశు ఉత్పాదన) అంటారు.
ఉదా : రైజోఫోరా.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉదాహరణలతో సంయోగ బీజజననం గురించి క్లుప్తంగా వ్రాయండి?
జవాబు:
ద్వయస్థితిక లేక ఏకస్థితిక పూర్వగామి కణాలు, కణ విభజన, కణవిభేదనము ద్వారా పరిపక్వ ఏకస్థితిక సంయోగ బీజాలను ఏర్పరిచే ప్రక్రియనే సంయోగ బీజజననం అంటారు. సంయోగబీజాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి

1. సమసంయోగబీజాలు :
స్త్రీ, పురుష సంయోగబీజాలు రెండు గుర్తించలేనంతగా ఒకే విధంగా ఉండే వాటిని సమ సంయోగబీజాలు అని అంటారు.
ఉదా : క్లాడోఫోరా

2. భిన్నసంయోగబీజాలు :
లైంగిక ప్రత్యుత్పత్తి ఓరిపే అనేక జీవులలో ఏర్పడే సంయోగబీజాలు రెండూ, స్వరూపంలో భిన్నంగా ఉంటాయి. ఈ జీవులలో పురుష సంయోగబీజాన్ని – చలన పురుషబీజము లేదా పురుషబీజం అని, సంయోగబీజాన్ని – స్త్రీ బీజకణం అని పిలుస్తారు.
ఉదా : ప్వునేరియా, టెరిస్, సైకస్

ప్రశ్న 2.
జీవులలో లైంగికత్వం గురించి తెలపండి.
జవాబు:
జీవుల లైంగికత్వం అనేది ఒకే జీవి లేదా విరుద్ధ లింగాలకు చెందిన భిన్న జీవుల్లో నుంచి వచ్చే సంయోగబీజాల కలయిక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. లైంగికత్వం అనేది మొక్కల్లో వైవిధ్యంగా ఉంటూ అది ఆవృతి బీజాల్లో విభిన్న పుష్పరకాలు ఏర్పడటం వల్ల ఎక్కువగా ఉంటుంది. అవి ద్విలింగాశ్రయస్థితి, ఏకలింగాశ్రయస్థితిగా నిర్వచించవచ్చు.

ద్విలింగశ్రయస్థితి :
ఒకే మొక్కపై పురుష, స్త్రీ లైంగిక అవయవాలు ఏర్పడటాన్ని ద్విలింగాశ్రయ స్థితి అంటారు.
ఉదా : కుకుర్బిటా, కొబ్బరి.

ఏకలింగాశ్రయస్థితి :
పురుష, స్త్రీ లైంగిక అవయవాలు వేరు వేరు మొక్కలపై ఏర్పడటాన్ని ఏకలింగాశ్రయస్థితి అంటారు.
ఉదా : బొప్పాయి, ఖర్జూరం.

ఆవృతబీజాలలో లైంగికత్వం ఆధారంగా పుష్పాలను రెండురకాలుగా పేర్కొనవచ్చు అవి
1) పురుషపుష్పం :
కేసరావళి మాత్రమే కలిగిన ఏకలింగపుష్పాన్ని పురుషపుష్పం అంటారు.

2) స్త్రీ పుష్పం :
అండకోశాన్ని మాత్రమే కలిగిన ఏకలింగ పుష్పాన్ని స్త్రీపుష్పం అంటారు.

AP Inter 1st Year Botany Study Material Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

ప్రశ్న 3.
“కొన్ని మొక్కలలో ఫలాలు ఏర్పడడానికి ఫలదీకరణ అనేది అవశ్యకమైన (obliga – tory) సంఘటన కాదు”. ఈ వాక్యాన్ని వివరించండి.
జవాబు:
ఫలదీకరణం జరగకుండా పుష్పంలోని అండాశయం నుంచి ఫలం ఏర్పడటాన్ని అనిషేక ఫలనం అంటారు. ఇది అరటి, ద్రాక్ష, దోసలలో సాధారణంగా జరుగుతుంది. అనిషేక ఫలనము సహజంగా గాని లేదా ప్రేరితమైగాని ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా విత్తన రహిత ఫలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడంకోసం వినియోగిస్తారు. ఫలాలనిచ్చు పంట మొక్కలలో (టమాటో) అనిషేకజననము ముఖ్యమైనది. వాటిలో పుష్పాలపై ఆక్సిన్లు, జిబ్బరెల్లిన్లు, సైటోకైనిన్లు వంటి హార్మోనులను చల్లిన ఫలదీకరణ లేకుండానే ఫలాలు ఏర్పడతాయి. దీనిని కృత్రిమ అనిషేకజననం అంటారు. సహజకారకాలైన అల్పకాంతి, శీతల పరిస్థితులు కూడా అనిషేక ఫలాలను ఏర్పరుస్తాయి.

అనిషేకఫలాలు వల్ల ఉపయోగాలు :

  1. ఫలాలు పెద్దవిగా ఉంటాయి.
  2. తినుటకు సులభంగా ఉంటాయి. వ్యర్ధం ఉండదు.
  3. షెల్ఫ్ లైఫ్ ఎక్కువ కాలము ఉంటుంది.
  4. విత్తన రహిత ఫలాల్లో ఎక్కువ కరిగే పదార్థాలు ఉంటాయి. కావున ఫలదీకరణ అనేది అవశ్యకరమైన సంఘటనకాదు.

ప్రశ్న 4.
ఆవృత బీజ పుష్పంలో పరాగసంపర్కం, ఫలదీకరణ తరువాత ఏర్పడే మార్పులను తెలపండి? [Mar. ’14]
జవాబు:
ఆవృత బీజాలలో ఫలదీకరణ తర్వాత పుష్పంలో జరిగే మార్పులను ఫలదీకరణానంతర మార్పులు అంటారు.

  1. అండాశయం బాగా ఆహార పదార్థాలను సేకరించి ఫలంగా మారుతుంది.
  2. ఫలదీకరణం చెందిన అండాలు విత్తనాలుగా మారతాయి.
  3. సంయుక్త బీజం-పిండంగాను మారతాయి.
  4. ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం – అంకురచ్ఛదంగాను మారతాయి.
  5. సహకణాలు, ప్రతిపాద కణాలు క్షీణిస్తాయి.
  6. అండవృంతము విత్తనవృంతంగాను మారుతుంది.
  7. బాహ్య అండకవచం బాహ్య బీజ కవచంగాను, (టెస్ట్గా), అంతర అండకవచం అంతర బీజకవచం (టెగ్మన్) గాను
  8. అండ ద్వారం – విత్తన ద్వారంగాను మారును.
  9. విత్తుచార- విత్తనచారగాను మారతాయి.
  10. పుష్పంలోని రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, కీలం, కీలాగ్రం వడలి రాలిపోతాయి.

ప్రశ్న 5.
ఈ క్రింది పదాలను వివరించండి.
a) శైశవదశ
b) ప్రత్యుత్పత్తి దశ.
జవాబు:
శైశవ దశ :
అన్ని జీవులు జీవితంలో కొంత పెరిగి పక్వస్థితిలో ప్రత్యుత్పత్తి దశకు చేరుకునే ముందు దశను శాకీయ లేక శైశవ దశ అంటారు.

ప్రత్యుత్పత్తి దశ :
శైశవదశ తర్వాత, మొక్కలలో పుష్పాలు ఏర్పడుట ద్వారా గుర్తించేదశను ప్రత్యుత్పత్తి దశ అంటారు.

ప్రశ్న 6.
అలైంగిక, లైంగిక ప్రత్యుత్పత్తుల మధ్య తేడాలను గుర్తించండి. శాకీయ ప్రత్యుత్పత్తిని కూడా ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి రకంగా ఎందుకు పరిగణిస్తారు?
జవాబు:

అలైంగిక లైంగిక
1) ఒక జనకుడు పాల్గొంటారు. 1) ఇద్దరు జనకులు పాల్గొంటారు.
2) సంతతి ఒకదానితో ఒకటి పోలి ఉండి జనకానికి నకలుగా ఉంటాయి. 2) సంతతిలో వైవిద్యాలు ఉంటాయి.
3) బాహ్య, అంతర ఫలదీకరణలు ఉండవు. 3) ఫలదీకరణ జరుగును.
4) సంయోగ బీజాలు ఏర్పడవు. 4) సంయోగ బీజాలు ఏర్పడతాయి.
5) అనువంశిక పదార్థాల కలయిక ఉండదు. 5) అనువంశిక పదార్థాల కలయిక జరుగును.

బహూకణయుత లేదా సహనివేశక శైవలాలు, బూజులు, పుట్టగొడుగులలోని శరీరం కొంతభాగం ముక్కలై చిన్న చిన్న ఖండితాలుగా విడిపోతాయి. ఈ ఖండితాలు ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతాయి. ఈ విధానమును ముక్కలు కావడం (fragmentation) అంటారు. కొన్ని మొక్కలలో ప్రత్యేక నిర్మాణాలు ఏర్పడి ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి. ఉదా : లివర్ వర్ట్స్లోని జెమ్మాలు.

పుష్పించే మొక్కలలో రన్నర్లు, స్టోలన్లు, పిలకమొక్కలు, ఆఫ్సెట్లు, భూగర్భ కాండాలైన కొమ్ము, కందం, దుంపకాండం లశునం, పత్ర రూపాంతరాలైన లఘులశునాలు, ప్రత్యుత్పత్తి పత్రాలు వంటి శాకీయ నిర్మాణాలు కూడా శాకీయ వ్యాప్తి ద్వారా కొత్త సంతతిని అభివృద్ధి చేసుకోగలవు. ఈ నిర్మాణాలను శాకీయ వ్యాప్తికారకాలు అంటారు. ఇవి ఏర్పడటానికి రెండు జనకాలు పాల్గొనకపోవడం వల్ల ఇది కూడా అలైంగిక పద్దతే.

AP Inter 1st Year Botany Study Material Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

ప్రశ్న 7.
ఈ క్రింది పుష్పించే మొక్క భాగాలను గుర్తించి, అవి ఏకస్థితికాలా (n) లేక ద్వయ స్థితికాలా (2n) అనేది వ్రాయండి.
a) అండాశయము
b) పరాగకోశం
c) స్త్రీ బీజకణం
e) పురుషసంయోగబీజం
d) పరాగరేణువు
f) సంయుక్తబీజం
జవాబు:
అండాశయము : ద్వయస్థితికము
పరాగకోశం : ద్వయస్థితికము
పురుష సంయోగ బీజకణం : ఏకస్థితికము
స్త్రీబీజకణం : ఏకస్థితికము
పరాగరేణవు : ఏకస్థితికము
సంయుక్త బీజము : ద్వయస్థితికము

ప్రశ్న 8.
ఆవృత బీజ మొక్క జీవిత చక్రంలోని దశల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
ఆవృతబీజ మొక్క జీవిత చక్రములో రెండు దశలు ఏకాంతరంగా ఏర్పడుతూ ఉంటాయి. అవి :
1) సిద్ధ బీజదదశ
2) సంయోగ బీజదదశ.

1) సిద్ధ బీజద దశ :
జీవిత చరిత్రలో ఇది ద్వయస్థితిక దశ. సంయుక్త బీజం నుండి ఏర్పడుతుంది. ఈ మొక్కపై ప్రత్యుత్పత్తి అంగాలు ఏర్పడతాయి.

2) సంయోగ బీజదదశ :
ఇది ఏకస్థితిక దశ. సిద్ధబీజ మాతృ కణాలు క్షయకరణ విభజన ఫలితంగా ఏర్పడిన సిద్ధబీజం నుంచి ఈ దశ ఏర్పడుతుంది. ఆవృతబీజాలలో సిద్ధబీజ మాతృ కణాలు రెండు రకములు. సూక్ష్మ సిద్ధబీజ మాతృకణాలు పరాగకోశములోను, స్థూలసిద్ధబీజ మతృకణాలు అండములోని అండాంతః కణజాలంలోను అభివృద్ధి చెందుతాయి. ఈ మతృకణాలలో క్షయకరణ విభజన జరగటం ద్వారా సూక్ష్మ, స్థూల సిద్ధబీజాలు ఏర్పడతాయి. సూక్ష్మ, స్థూల సిద్ధబీజాలు వరుసగా పురుష, స్త్రీ సంయోగ బీజదాలను ఏర్పరుస్తాయి. పురుష, స్త్రీ సంయోగ బీజదాలు వరుసగా పురుష, స్త్రీ బీజ కణాలను ఏర్పరుస్తాయి. పురుష సంయోగ బీజము, స్త్రీ బీజ కణముతో సంయోగము చెంది ద్వయస్థితిక సంయుక్త బీజము ఏర్పడుతుంది. అనేక సమవిభజనల అనంతరము విత్తనములో సంయుక్త బీజము పిండముగా ఏర్పడును. విత్తనము మొలకెత్తి సిద్ధబీజద మొక్క ఏర్పడును.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అలైంగిక, లైంగిక ప్రత్యుత్పత్తుల మధ్య తేడాలను గూర్చి రాయండి. ఏకకణ జీవులు చూపే అలైంగిక ప్రత్యుత్పత్తి రకాలను వివరించండి?
జవాబు:

అలైంగిక లైంగిక
1) ఒక జనకుడు పాల్గొంటారు. 1) ఇద్దరు జనకులు పాల్గొంటారు.
2) సంతతి ఒకదానితో ఒకటి పోలి ఉండి జనకానికి నకలుగా ఉంటాయి. 2) సంతతిలో వైవిద్యాలు ఉంటాయి.
3) బాహ్య, అంతర ఫలదీకరణలు ఉండవు. 3) ఫలదీకరణ జరుగును.
4) సంయోగ బీజాలు ఏర్పడవు. 4) సంయోగ బీజాలు ఏర్పడతాయి.
5) అనువంశిక పదార్థాల కలయిక ఉండదు. 5) అనువంశిక పదార్థాల కలయిక జరుగును.

ప్రొటిస్టా, మొనెరా జీవులలో జనక కణం రెండుగా విభజన చెంది కొత్త సంతతిని ఉత్పత్తి చేస్తుంది. (ద్విధావిచ్ఛిత్తి) అనేక ఏకకణజీవులలో ద్విధావిచ్ఛిత్తి ద్వారా కణం రెండు భాగాలుగా విభజన చెంది, ప్రతి భాగము త్వరితంగా ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతుంది. యూగ్లినా, బాక్టీరియం ఈస్ట్లలో అలైంగికోత్పత్తి ప్రరోహోత్పత్తి ద్వారా జరుగుతుంది.

ప్రశ్న 2.
పుష్పంలోని ఫలదీకరణాంతర మార్పుల గూర్చి వివరించండి.
జవాబు:
ఆవృత బీజాలలో ఫలదీకరణ తర్వాత పుష్పంలో జరిగే మార్పులను ఫలదీకరణానంతర మార్పులు అంటారు.

  1. అండాశయం బాగా ఆహార పదార్థాలను సేకరించి ఫలంగా మారుతుంది.
  2. ఫలదీకరణం చెందిన అండాలు విత్తనాలుగా మారతాయి.
  3. సంయుక్త బీజం-పిండంగాను మారుతుంది.
  4. ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం అంకురచ్ఛదంగా మారుతుంది.
  5. సహకణాలు, ప్రతిపాద కణాలు క్షీణిస్తాయి.
  6. అండవృంతము విత్తనవృంతంగా మారుతుంది.
  7. బాహ్య అండకవచం బాహ్య బీజ కవచంగాను, (టెస్ట్గా), అంతర అండకవచం అంతర బీజకవచం (టెగ్మన్) గాను విత్తన ద్వారంగాను మారుతుంది.
  8. అండ ద్వారం
  9. విత్తుచార-విత్తనచారగాను మారతాయి.
  10. పుష్పంలోని రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, కీలం, కీలాగ్రం వడలి రాలిపోతాయి.

అంకురచ్ఛదము :
ఆవృత బీజాలలో ఫలదీకరణ అనంతరం ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం నుండి అంకురచ్ఛదం ఏర్పడుతుంది. ఇది అభివృద్ధి చెందే పిండాలకు పోషకాలను అందిస్తుంది. ఇది త్రయ స్థితికం కాని వివృత బీజాలలో అంకురచ్ఛదం ఫలదీకరణకు ముందుగా స్త్రీ సంయోగబీజకణజాలం నుంచి నేరుగా ఏర్పడుతుంది. ఇది ఏకస్థితికం.

పరిచ్ఛదము :
విత్తనం పక్వమయ్యేసరికి అంకురచ్ఛదంవలె, అండాంత కణజాలం హరించుకుపోతుంది. కాని కొన్ని విత్తనాలలో కొంత అండాంతకణజాలం మిగిలిపోతుంది. దానిని పరిచ్ఛదము అంటారు.
ఉదా : మిరియాలు, కలువ గింజలు.

Intext Question and Answers

ప్రశ్న 1.
జీవులకు ప్రత్యుత్పత్తి అనేది ఎందుకు అవసరం?
జవాబు:
ప్రత్యుత్పత్తి ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇది జరగనిదే, జీవుల సంతతి అంతరించిపోతుంది. తరతరాలు పెంపొందటానికి ప్రత్యుత్పత్తి అవసరము.

AP Inter 1st Year Botany Study Material Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

ప్రశ్న 2.
లైంగిక లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో ఏది మేలైనది? ఎందువల్ల?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తి మేలైనది. వీటివల్ల ఏర్పడిన సంతతిలో ఉన్న వైవిధ్యాలవల్ల, అవి ఎక్కువకాలం జీవిస్తాయి.

ప్రశ్న 3.
అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి ద్వారా ఏర్పడే సంతతిని ‘క్లోన్’ అని ఎందుకంటారు?
జవాబు:
అలైంగిక విధానంలో ఏర్పడే సంతతి ఒకదానితో ఒకటి పోలి ఉండి, జనకానికి సరిఅయిన నకలుగా ఉంటాయి. కావున వాటిని ‘క్లోన్’లు అంటారు.

ప్రశ్న 4.
అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే సంతతి, లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే సంతతితో ఏవిధంగా విభేదిస్తుంది?
జవాబు:
అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే సంతతి ఒకదానితో ఒకటి పోలివుండి జనకానికి సరిఅయిన నకలుగా ఉంటాయి. ఇవి వివిధ వాతావరణ పరిస్థితులలో జీవించే అవకాశం తక్కువగా ఉంటుంది.
లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే సంతతిలో వైవిధ్యాలు ఎక్కువగా ఉంటాయి మరియు జనకులను పోలి ఉండవు. ఇవి వివిధ వాతావరణ పరిస్థితులలో జీవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 5.
శాకీయ వ్యాప్తి అనగానేమి? సరియైన రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
పుష్పించు మొక్కలలో శాకీయ వ్యాప్తి ఒకరకమైన అలైంగిక విధానము. జనకమొక్కలపై కొన్ని బహుకణయుత నిర్మాణాలు ఏర్పడి, రాలి నేలపై పడి ప్రౌఢ మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. ఇవి జన్యురీత్యా, బాహ్యస్వరూప రీత్యా జనకమొక్కలను పోలి ఉంటాయి. ఉదా : రణపాల, అల్లం, పసుపు, చామదుంప, జెమ్మా.

ప్రశ్న 6.
ఉన్నతమైన జీవులు సంక్లిష్టమైన నిర్మాణంలో ఉన్నప్పటికి లైంగిక ప్రత్యుత్పత్తిని ఆశ్రయిస్తాయి. ఎందువల్ల?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల ఏర్పడిన సంతతిలో వైవిధ్యాలు ఎక్కువగా ఉండుటవల్ల, అవి వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని జీవించగల్గుతాయి.

ప్రశ్న 7.
క్షయకరణ విభజన, సంయోగ బీజ జననంల మధ్య పరస్పర బంధం అనేది ఎల్లప్పుడు ఉంటుంది. ఎందువల్ల? వివరించండి.
జవాబు:
ఆవృత బీజాలలో క్షయకరణ విభజన సూక్ష్మ, స్థూలసిద్ధబీజ మాతృకణాలలో తప్పనిసరిగా జరగాలి. లేకుంటే పురుష స్త్రీ సంయోగబీజాలు ఏర్పడవు.

ప్రశ్న 8.
బాహ్య ఫలదీకరణాన్ని నిర్వచించండి. దీనిలోని నష్టాలను తెలపండి.
జవాబు:
జీవి దేహం బయట జరిగే సంయోగ బీజాల సంయోగాన్ని బాహ్య ఫలదీకరణ అంటారు. ఈ ప్రక్రియలో సంయుక్త బీజము జీవి దేహం వెలుపల ఏర్పడుతుంది. అవి అభివృద్ధిచెందే అవకాశాల వాతావరణ పరిస్థితులమీద ఆధారపడి ఉంటాయి.

ప్రశ్న 9.
గమన సిద్ధబీజం, సంయుక్త బీజంల మధ్య తేడాను తెలపండి.
జవాబు:
గమనసిద్ధబీజం 1) చలనసహిత, అలైంగిక సిద్ధబీజము. 2) కశాభాలు ఉంటాయి. ఉదా : శైవలాలు, శిలీంధ్రాలు. సంయుక్త బీజం 1) చలనరహిత, లైంగిక ప్రక్రియవల్ల ఏర్పడును. 2) కశాభాలు ఉండవు. ఉదా : లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు.

క్రియాశీలత

ప్రశ్న 1.
కుకుర్బిటా మొక్కలోని కొన్ని పుష్పాలను పరిశీలించి, పురుష, స్త్రీ పుష్పాలను గుర్తించండి. ఏకలింగ పుష్పాలను కలిగి ఉండే మరొక మొక్క మీకేదైనా తెలుసా?
జవాబు:
లూఫా సిలిండ్రికా, సిట్రుల్లస్, లాజినేరియా, కుకుమిస్లలో ఏకలింగ పుష్పాలు ఉంటాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

ప్రశ్న 2.
ద్విలింగక పుష్పం అంటే ఏమిటి? మీ దగ్గరి పరిసరాల నుంచి 5 ద్విలింగక పుష్పాలను సేకరించి మీ ఉపాధ్యాయుని సహాయంతో వాటి సాధారణ, శాస్త్రీయ నామాలను తెలుసుకోండి.
జవాబు:
పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఒకే మొక్కపై పుష్పంలో ఉంటే దానిని ద్విలింగక పుష్పం అంటారు.
ఉదా : 1) హైబిస్కస్ రోజా సైనెన్సిస్ మందార
2) గ్లోరియోసా సుపర్భా – అడవినాభి
3) ఉమ్మెత్త – దతూరమెటల్
4) చిక్కుడు – డాలికాస్ లాబ్లబ్
5) సోలానం మెలోంజినా వంగ