Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 7th Lesson పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి Textbook Questions and Answers.
AP Inter 1st Year Botany Study Material 7th Lesson పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
పిండకోశంలోని స్త్రీ బీజకణ పరికరంలోని కణాలేవి?
జవాబు:
- స్త్రీ బీజ కణము,
- సహకణాలు
ప్రశ్న 2.
పరాగరేణువు యొక్క అవిరుద్ధ స్థితిని తెలుసుకొనే అండకోశ భాగాన్ని తెలపండి.
జవాబు:
కీలాగ్రము
ప్రశ్న 3.
బీజదళాలు, అండాంతఃకణజాలం నిర్వహించే ఉమ్మడి విధులను పేర్కొనండి.
జవాబు:
ఇవి కొంతవరకు రసభరితంగా ఉండి, ఆహార పదార్థాలను నిల్వ ఉంచుతాయి. ఇవి అభివృద్ధి చెందే – పిండంనకు పోషణకు ఉపయోగపడతాయి.
ప్రశ్న 4.
అండకోశంలోని ఏ భాగాలు ఫలాలు? విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి?
జవాబు:
అండాశయము – ఫలంగా, అండాలు – విత్తనాలుగా మారతాయి.
ప్రశ్న 5.
బహి పిండతలో, ఒక పిండం సహాయకణాల నుంచి, మరొకటి అండాంతః కణజాలం నుంచి ఏర్పడితే, దీనిలో ఏది ఏకస్థితికం, ఏది ద్వయస్థితికం?
జవాబు:
సహాయ కణాల నుంచి ఏర్పడే పిండం ఏకస్థితికము. అండాంతఃకణజాలం నుంచి ఏర్పడే పిండం ద్వయస్థితికము.
ప్రశ్న 6.
ఫలదీకరణ జరగకుండా, అసంయోగజన్య పిండకోశం ఒక ద్వయస్థితిక పిండాన్ని ఏర్పరచగలదా? మీ సమాధానం అవును అయితే వివరించండి? ఎలా.
జవాబు:
ఫలదీకరణ జరగకుండా, అంసయోగజన్య పిండకోశం ఒక ద్వయస్థితిక పిండాన్ని ఏర్పరచగలదు. దీనివల్ల ఏర్పడిన పిండాలు జన్యురీత్యా జనకులను పోలి ఉంటాయి. ఇవి ఫలదీకరణం చెందని స్త్రీ బీజం నుండి లేక ప్రత్యక్షంగా అండాంతఃకణజాలం నుండి లేదా అండకవచాల నుండి గాని ఏర్పడతాయి.
ప్రశ్న 7.
మూడు కణాల దశలో విడుదలయ్యే పరాగరేణువులో కనిపించే మూడు కణాలు ఏవి?
జవాబు:
2 పురుష సంయోగబీజాలు, 1 శాఖీయ కణము
ప్రశ్న 8.
స్వయం విరుద్ధత (Self – incompatibility) అంటే ఏమిటి?
జవాబు:
పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రంపై పడినప్పుడు మొలకెత్తబడకుండా ఉండుటను “స్వయం విరుద్ధత” అందురు.
ప్రశ్న 9.
స్వయం విరుద్ధత చూపే మొక్కలలో ఏ రకమైన పరాగ సంపర్కం జరుగుతుంది?
జవాబు:
అబ్యూటిరాన్ – లో పరపరాగ సంపర్కము.
ప్రశ్న 10.
8-కేంద్రకాలు, 7 కణాలతో ఉన్న పక్వ పిండకోశ పటాన్ని గీసి, ఈ కింద పేర్కొన్న వాటిని గుర్తించండి. ప్రతిపాదకణాలు, సహాయ కణాలు స్త్రీ బీజకణం, కేంద్రకకణం, ధ్రువ కేంద్రకాలు.
జవాబు:
ప్రశ్న 11.
ఒక ఫలదీకరణ చెందిన అండంలో త్రయస్థితిక కణజాలం ఏది? ఈ త్రయస్థితిక స్థితి అనేది ఏ విధంగా సాధించబడింది?
జవాబు:
అంకురచ్ఛదము పిండకోశంలో 2వ పురుషబీజము ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో కలసి ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకము (3x) ఏర్పడుతుంది.
ప్రశ్న 12.
పరాగ సంపర్కం, ఫలదీకరణ అనేవి అసంయోగ జననంలో అవసరమా? కారణాలు తెల్పండి.
జవాబు:
అవసరం లేదు. ఆస్టరేసిలోని కొన్ని జాతులు, గడ్డిజాతులు ప్రత్యేక విధానం ద్వారా ఫలదీకరణ లేకుండా విత్తనాలను ఏర్పరుస్తాయి. ద్వయస్థితిక స్త్రీ బీజకణం క్షయకరణ విభజన చెందకుండా ఫలదీకరణ జరగకుండా పిండంగా అభివృద్ధి చెందుతుంది.
ప్రశ్న 13.
నీటి మొక్కలలో పరాగ సంపర్కం ఏవిధంగా జరుగుతుంది?
జవాబు:
వాలిన్నేరియాలో పరాగ సంపర్కం నీటి ఉపరితలంపై జరుగుతుంది. (ఊర్ధ్వజల పరాగ సంపర్కం). జోస్టర్లో పరాగ సంపర్కం నీటి లోపల జరుగుతుంది. (అథోః జల పరాగ సంపర్కం) గుర్రపుడెక్క నీటి కలువలలో కీటకాల ద్వారా లేదా గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది.
ప్రశ్న 14.
ఆనృత బీజ మొక్కల పుప్పొడి రేణువు ఏర్పరిచే రెండు పురుష కేంద్రకాల విధులను తెలండి.
జవాబు:
పుప్పొడి రేణువు నుండి ఏర్పడే 2 పురుషకేంద్రకాలలో, 1 స్త్రీబీజ కణంతో కలిసి సంయుక్త బీజంను ఏర్పరుస్తుంది. 2వ పురుష కేంద్రకము ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో కలసి ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకము ఏర్పడును.
ప్రశ్న 15.
ఆవృత బీజ పుష్పంలోని ఏయే భాగాలలో పురుష, స్త్రీ సంయోగ బీజదాలు అభివృద్ధి జరుగుతుంది? వాటి పేర్లను తెలపండి.
జవాబు:
పురుష సంయోగ బీజదము – పరాగకోశంను, స్త్రీ సంయోగ బీజదము అండంలోను అభివృద్ధి చెందుతాయి. సూక్ష్మ సిద్ధబీజం పురుష సంయోగబీజంగాను, స్థూలసిద్ధబీజం స్త్రీ సంయోగబీజదంగాను మారుతాయి.
ప్రశ్న 16.
ఏక సిద్ధ బీజవర్థకాల (monosporic) స్త్రీ సంయోగ బీజద అభివృద్ధి అంటే ఏమిటి?
జవాబు:
అభివృద్ధి ఒకే ఒక సిద్ధబీజం నుండి ఏర్పడితే దాని ఏకసిద్ధ బీజ వర్థక స్త్రీ సంయోగబీజద అభివృద్ధి అందురు.
ప్రశ్న 17.
ఆత్మ పరాగ సంపర్కం నివారణకు పుష్పాలు ఏర్పరుచుకొన్న రెండు ముఖ్యమైన అనుకూలన విధానాలను తెలపండి.
జవాబు:
హెర్కొగమీ :
కేసరాలు, కీలాగ్రాలు వేరు వేరు ఎత్తులలో ఉంటాయి. దీనివల్ల పరపరాగ సంపర్కం జరుగుతుంది.
ఉదా : మందార.
భిన్న కీలత :
ఒకే మొక్కపై ఉన్న పుష్పాలలోని కీలాలు వేరు వేరు ఎత్తులలో ఉంటాయి. దీని వల్ల ఆత్మ పరాగసంపర్కం జరుగును.
ప్రశ్న 18.
ఫలదీకరణ చెందిన అండంలో, సంయుక్త బీజం ఎందువల్ల కొంతకాలం సుప్తావస్థ స్థితిలో ఉంటుంది?
జవాబు:
అభివృద్ధి చెందే పిండానికి పోషణ కొరకు కొంత అంకురచ్ఛిదం ఏర్పడేంతవరకు సంయుక్త బీజం సుప్తావస్థలో ఉంటుంది. కొన్ని శిలీంధ్రాలు, శైవలాలలో సంయుక్త బీజం మందమైన కవచంను ఏర్పరుచుకొని, ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడానికి సుప్తావస్థలో ఉంటుంది. పిండంలోని సాధారణ జీవక్రియా సంబంధ చర్యలు మొదలవ్వగానే తగిన తేమ, ఆక్సిజన్ ఉన్నప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయి.
ప్రశ్న 19.
వృద్ధికారక పదార్థాల్ని ఉపయోగించి ప్రేరిత అనిషేక ఫలమును ప్రోత్సహించిన, మీరు ఏ ఫలాలను ఈ ప్రేరిత అనిషేక ఫలనము కొరకు ఎంచుకొంటారు? ఎందువల్ల?
జవాబు:
అరటి, ద్రాక్షా, వీటిలో ఎక్కువ గుజ్జు ఉండుట వల్ల జ్యూస్ తయారీ పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
ప్రశ్న 20.
స్కూటెల్లమ్ అంటే ఏమిటి? ఏరకం విత్తనాలలో అది ఉంటుంది?
జవాబు:
గడ్డిజాతి కుటుంబంలోని పిండంలో పెద్దదిగా డాలు ఆకారంలో ఉండే ఒకే బీజదళాన్ని స్కూటెల్లమ్ అంటారు. ఇది ఏకదళ బీజ విత్తనాలలో ఉంటుంది.
ప్రశ్న 21.
అంకురచ్ఛదయుతం, అంకురచ్ఛదరహిత విత్తనాలను సోదాహరణంగా నిర్వచించండి.
జవాబు:
అంకురచ్ఛదయుత విత్తనాలు | అంకురచ్చదరహిత విత్తనాలు |
పరిపక్వమైన విత్తనంలో కోంతి అంకురచ్ఛిదం మిగిలి ఉంటుంది. ఆ విత్తనాలను అంకురచ్ఛదయుత విత్తనాలు అంటారు. ఉదా : ఆముదం, కొబ్బరి | విత్తనం పరిపక్వం చెందేముందే అభివృద్ధి చెందుతున్న పిండం అంకురచ్ఛధాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఆ విత్తనాలను అంకురచ్ఛద రహిత విత్తనాలు అంటారు. ఉదా : బఠాని, వేరుశనగ, చిక్కుడు. |
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఆత్మ పరాగ సంపర్కం (ఆత్మ ఫలదీకరణ) నిరోధించడానికి ఒక వికసించే ద్విలింగ పుష్పం ఏర్పరుచుకున్న అనుకూలనాలలో మూడింటిని గురించి వ్రాయండి.
జవాబు:
1) భిన్నకాలిక పక్వత :
కొన్ని జాతులలో పుప్పొడి విడుదల కీలాగ్రం దాన్ని స్వీకరించుట సమకాలికంగా ఉండదు. సూర్య కాంతం మొక్కలో కీలాగ్రం పక్వదశకు చేరక ముందే పుప్పొడి విడుదల కావడం (పుంభాగ ప్రథమోత్పత్తి) లేదా దతూరలో కీలాగ్రం పక్వదశకు చేరినా పుప్పొడి విడుదల కాకపోవడం (స్త్రీ భాగ ప్రథమోత్పత్తి) జరుగుతుంది.
2) హెర్కోగమి :
ఒక పుష్పంలోని పరాగకోశాలు, కీలాగ్రము వేరు వేరు స్థానాలలో (మందార) లేదా వేరు వేరు దిశలలో (గ్లోరియోస) ఉండుట వల్ల ఆత్మ పరాగ సంపర్కం జరుగుతుంది.
3) ఆత్మ వంధ్యత్వము :
ఒక పుష్పంలోని పుప్పొడి అదే పుష్పంలోని కీలాగ్రం పై పడినప్పుడు అది మొలకెత్తబడకుండా లేదా పరాగనాళాలు పెరగకుండా అండాలలో ఫలదీకరణ నిరోధించబడును.
ప్రశ్న 2.
కృత్రిమ సంకరణ పద్ధతిలో ఈ కింది సంభవాలను పరిశీలించడం జరిగింది. సంకరణ పద్ధతిలో పాటించే విధంగా, వీటిని ఒక సరియైన వరుస క్రమంలో అమర్చండి.
ఎ) రీ – బ్యాగింగ్, బి) జనకుల ఎంపిక, సి) బ్యాగింగ్, డి) కీలాగ్రంపై పుప్పొడి చల్చుట, ఇ) విపుం సీకరణ, ఎఫ్) పురుష మొక్క నుండి పుప్పొడిని సేకరించుట.
జవాబు:
ఎ) జనకుల ఎంపిక
బి) విపుంసీకరణ
సి) బ్యాగింగ్
డి) పురుషమొక్క నుండి పుప్పొడిని స్వీకరించుట
ఇ) కీలాగ్రంపై పుప్పొడిని చల్చుట
ఎఫ్) రీ – బ్యాగింగ్.
ప్రశ్న 3.
అండంలోనికి పరాగనాళం ప్రవేశించే వివిధ పద్ధతులను, పటాల సహాయంతో చర్చించండి.
జవాబు:
పరాగనాళం అండాశయం నుంచి అండంలోకి 3 రకాలుగా ప్రవేశిస్తుంది.
1) రంధ్ర సంయోగం :
పరాగనాళం అండంపై భాగంలో ఉన్న అండ ద్వారం ద్వారా అండంలోకి ప్రవేశించడాన్ని “రంధ్ర సంయోగం” అంటారు.
ఉదా : ఒట్టీలియ, హైబిస్కస్.
2) చలజో సంయోగం :
కొన్ని మొక్కలలో పరాగనాళం చలాజా ద్వారా అండంలోకి ప్రవేశిస్తుంది.
ఉదా : కాజురైనా. దీనిని ట్రూబ్ అనే శాస్త్రవేత్త కనిపెట్టారు.
3) మధ్య సంయోగం :
ఒక్కొక్కసారి పరాగనాళం అండకవచం ద్వారా గాని, అండవృంతం ద్వారా గాని అండంలోకి ప్రవేశిస్తుంది. దీనినే మధ్య సంయోగం అంటారు.
ఉదా : కుకుర్బిట.
ప్రశ్న 4.
సూక్ష్మ సిద్ధ బీజ జననం, స్థూల సిద్ధబీజ జననంల మధ్య వ్యత్యాసాన్ని తెలపండి. వీటిలో ఏ రకమైన కణవిభజన జరుగుతుంది? ఈ రెండు సంఘటనలకు చివరగా ఏర్పడే నిర్మాణాలు ఏవి?
జవాబు:
సూక్ష్మ సిద్ధబీజ జననం | స్థూల సిద్ధ బీజ జననం |
సూక్ష్మ సిద్ధబీజ మాతృకణం క్షయకరణ విభజన చెంది సూక్ష్మసిద్ధ బీజ చతుష్కాలు ఏర్పడే ప్రక్రియను సూక్ష్మ సిద్ధ బీజక జననం అంటారు. | స్థూల సిద్ధ బీజమాతృ కణము క్షయకరణ విభజన చెంది స్థూల సిద్ధబీజాలను ఏర్పరిచే ప్రక్రియను స్థూల సిద్ధబీజ జననం అంటారు. |
పై రెండు సంఘటనలలో క్షయకరణ విభజన జరుగుతుంది. ఈ సంఘటనల చివర. సూక్ష్మ, స్థూల సిద్ధబీజములు ఏర్పడతాయి.
ప్రశ్న 5.
బ్యాగింగ్ పద్ధతి అంటే ఏమిటి? మొక్కల ప్రజనన కార్యక్రమంలో ఈ విధానం ఉపయోగాన్ని తెలపండి?
జవాబు:
విపుంసీకరణ చేసిన పుష్పాలను సరియైన పరిమాణంలో ఉన్న బట్టర్పేపర్తో తయారయిన సంచులతో మూసి వేయుటను బాగింగ్ (bagging) అంటారు.
కృత్రిమ ప్రజనన కార్యక్రమంలో స్త్రీ జనక మొక్కను ఎన్నుకొని దీనిలో ద్విలింగ పుష్పాలను మొగ్గదశలో ఉన్నప్పుడు పరాగ కోశాలను శ్రావణంతో తీసివేయుటను విపుంసీకరణ అంటారు. వెంటనే విపుంసీకరణ చేసిన పుష్పాలను బట్టర్పేపర్తో తయారుచేసిన సంచులతో మూసివేయాలి. దీనిని బాగింగ్ అంటారు. దీనివల్ల అవాంఛనీయ పరాగ కేశవులు కీలాగ్రంను చేరకుండా నిరోధించవచ్చు.
ప్రశ్న 6.
త్రిసంయోగం అంటే ఏమిటి? ఇది ఎక్కడ, ఎలా జరుగుతుంది? ఈ త్రిసంయోగంలో పాల్గొనే కేంద్రకాల పేర్లను పేర్కొనండి.
జవాబు:
పిండకోశంలోనికి ప్రవేశించిన 2 పురుషబీజాలలో, రెండవ పురుష బీజము, ద్వితీయ కేంద్రకము (2 ధృవ కేంద్రకాలు కలయిక) తో కలిసి ప్రాథమిక అంకురచ్చ కేంద్రకంను ఏర్పరుచుటను త్రి సంయోగము అంటారు. ఇది పిండ కోశంలో జరుగుతుంది. దీనిలో పురుషకేంద్రకము. 2 ధృవ కేంద్రకాలు పాల్గొంటాయి.
ప్రశ్న 7.
ఈ క్రింది వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపండి.
a) అధోబీజదళం ఉపరి బీజదళం
b) ప్రాంకుర కంచుకం, మూలాంకుర కంచుకం
c) అండ కవచం, బాహ్యబీజ కవచం (టెస్ట్రా)
d) పరిచ్ఛదం, ఫలకవచం
జవాబు:
a) అథోబీజదళం పిండాక్షంలో బీజదళాల క్రింద ఉన్న స్థూపాకార భాగంను అథోబీజదళం అంటారు. | ఉపరి బీజదళం పిండాక్షంలో బీజదళాలకు పైన ఉన్న భాగాన్ని ఉపరి బీజదళము అంటారు. |
b) ప్రాంకుర కంచుకం ఉపరిబీజదళంలోని ఒక ప్రకాండపు మొగ్గ కొన్ని పత్ర ఆద్యాలును కప్పుతూ బోలుగా ఉన్న పత్రం వంట నిర్మాణంను ప్రాకుర కంచుకం అంటారు. | మూలాంకుర కంచుకం ప్రథమమూలం, వేరు తొడుగును కప్పుతూ ఉన్న విభేదనం చూపని పొరను మూలాంకుర కంచుకం అంటారు. |
c) అండకవచం అండమును కప్పుతూ ఉన్న రక్షణ కవచమును అండకవచం అంటారు. | బాహ్య బీజకవచం (టెస్టా) ఫలదీకరణ తర్వాత, అండంలోని వెలుపలి అండ కవచము నుండి ఏర్పడేపొరను టెస్టా అంటారు. |
d) పరిచ్ఛదం అండాంతః కణజాలములో మిగిలిన దానిని పరిచ్ఛదం అంటారు. అంటారు. | ఫలకవచం ఫలమునకు ఉన్న కవచమును ఫలకవచం దీనిలో బాహ్య, మధ్య, అంతర ఫలకవచాలు అంటారు. |
ప్రశ్న 8.
విపుంసీకరణ అంటే ఏమిటి? మొక్కల ప్రజనన కర్త ఎప్పుడు, ఈ పద్ధతిని ఉపయోగిస్తాడు? ఎందువలన?
జవాబు:
తల్లి మొక్కలుగా ఎంచుకున్న మొక్కలపై ఉన్న ద్విలింగ పుష్పాలు మొగ్గదశలో ఉన్నప్పుడు పరాగకోశాలు స్ఫోటనం చెందకముందే వాటిలోని పరాగ కోశాలను శ్రావణం సహాయంతో తీసి వేయుటను విపుంసీకరణ అంటారు.
సంకరణ ప్రయోగాలలో వాంఛనీయమైన పరాగ రేణువులను మాత్రమే పరాగసంపర్కం కోసం ఉపయోగిస్తూ కీలాగ్రాన్ని పంకిల పరిచే అవాంఛనీయ లేదా అవసరం లేని పుప్పొడి రేణువుల నుండి కాపాడటానికి విపుంసీకరణ చేస్తారు.
ప్రశ్న 9.
అసంయోగ జననము అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యతను తెలపండి.
జవాబు:
ఫలదీకరణ లేకుండా విత్తనాలు ఏర్పడుటను అసంయోగ జననము అంటారు. ఇది లైంగిక ప్రత్యుత్పత్తిని పోలిన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానము. కొన్ని జాతులలో ద్వయస్థితిక స్త్రీ బీజకరణం క్షయకరణ విభజన చెందకుండా ఏర్పడి, ఫలదీకరణ జరగకుండా పిండంగా అభివృద్ధి చెందుతుంది. పరాగ సంపర్క సహకారులు లేకుండా, తీవ్ర వాతావరణ పరిస్థితులలో ఇది నిశ్చయంగా జరిగే ప్రత్యుత్పత్తి విధానము.
ప్రాముఖ్యత :
- దీనిలో క్షయకరణ విభజన జరగదు కావున లక్షణాల పృథక్కరణ, జన్యువున : సంయోజనాలు ఏర్పడదు, కావున వాటి లక్షణాలు కొన్ని తరాలు స్థిరంగా ఉంటాయి.
- సంకరజాతి విత్తనాలు పరిశ్రమలో అసంయోగ జననానికి మంచి ప్రాముఖ్యత ఉన్నది.
ప్రశ్న 10.
వివిధ రకాల అండాల గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
కవచయుత స్థూల సిద్ధబీజాశయాలను అండము అంటారు. ఆవృత బీజాలలో ముఖ్యంగా 3 రకాల అండాలు కనబడతాయి.
అవి.
1) నిర్వక్ర అండం :
ఇది నిటారుగా ఉండే అండం. ఈ రకం అండంలో అండద్వారం, చలాజీ, అండవృంతం ఒకే నిలువ రేఖపై అమరి ఉంటాయి.
ఉదా : పాలిగోనమ్, పైపరేసి
2) వక్ర అండం :
ఇది తలకిందులైన అండం. దీనిలో అండ దేహం 180° కోణంలో వంపు తిరుగుటచే అండం తల కిందులై అండద్వారం అండవృంతానికి దగ్గరగా వస్తుంది.
ఉదా : సూర్యకాంతం కుటుంబం, ఆస్ట్రరేసి
3) కాంపైలోట్రోపస్ అండాలు: ఈ రకం అండాలలో అండదేహం అండవృంతానికి లంబకోణంలో ఉంటుంది. కాని అండాంతి కణజాలం మధ్య భాగంలో నోక్కుకోని పోవుట వల్ల అండద్వారం వైపుగల భాగం కిందికి వంపు తిరిగి ఉంటుంది. దీనిలో పిండకోశం కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది.
ఉదా : చిక్కుడు కుటుంబం, (బాసికేసి).
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ద్విదళబీజ మొక్కలోని సంయుక్త బీజం నుంచి వివిధ పిండాభివృద్ధి దశలను పటాలుగా గీయండి.
జవాబు:
ప్రశ్న 2.
వికసించే పుష్పాలలో సాధ్యమయ్యే పరాగ సంపర్క రకాలను తెలపండి. వాటికి కారణాలను తెల్పండి.
జవాబు:
ఛాస్మోగమీ :
వికసించే పుష్పాలలో జరిగే పరాగ సంపర్కాన్ని వివృతసంయోగం (ఛాస్మోగమి) అంటారు. ఎక్కువ పుష్పాలలో అతి సాధారణ పరాగ సంపర్క విధానము, దీనిలో 2 రకాలు కలవు.
1) ఆత్మపరాగసంపర్కము :
ఒక పుష్పంలోని పరాగకోశాలలో గల పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రం మీద పడుటను ఆత్మపరాగసంపర్కం అంటారు. ఇది జరగడం కోసం, పుష్పాల పుప్పొడి విడుదలలోను, కీలాగ్రం వాటిని గ్రహించుటలోను సమకాలీనతను పాటించాలి. అలాగే కీలాగ్రం, పరాగకోశాలు ఒకదానికొకటి దగ్గరగా ఉండాలి. ఇది వివృత సంయోగ, సంవృత సంయోగ పుప్పాలలోను జరుగుతుంది.
2) పరపరాగ సంపర్కము :
ఒక పుష్పంలోని పరాగరేణువులు వేరొక పుష్పంలోని కీలాగ్రం చేయుటను పరపరాగ సంపర్కం అంటారు. దీనిలో 2 రకాలు కలవు.
ఎ) భిన్నవృక్ష పరాగసంపర్కం :
ఒక పుష్పంలోని పరాగ కోశాలలోగల పరాగరేణువులు అదే మొక్క పై ఉన్న వేరొక పుష్పంలోని కీలాగ్రం మీద పడతాయి. ఇది క్రియాత్మక పరపరాగ సంపర్కమైనప్పటికి, పరాగరేణువులు అదే మొక్క నుండి రావటం వల్ల ఇది జన్యుపరంగా ఆత్మపరాగ సంపర్కం వంటిదే.
బి) ఏక వృక్ష పరాగసంపర్కం :
ఒక మొక్కపై ఉన్న పుష్పంలోని పరాగ రేణువులు అదే జాతికి చెందిన వేరొక మొక్క సై ఉన్న పుష్పంలోకి కీలాగ్రం మీద పడతాయి. దీనివల్ల జన్యుపరంగా వివిధ రకాల పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరతాయి.
ప్రశ్న 3.
భాగములు గుర్తించిన చక్కటి పట సహాయంతో ఆవృతబీజ పక్వాదశలోని పిండకోశమును వర్ణించండి. సహాయకణాల పాత్రను సూచించండి. [Mar. ’14]
జవాబు:
స్థూల సిద్ధబీజ మాతృకణంలో క్షయకరణ విభజన వల్ల ఏర్పడిన 4 స్థూల సిద్ధబీజాలలో 3 నశించి, ఒకటి క్రియత్మకంగా ఉంటుంది. ఇది పిండకోశం అభివృద్ధిలో పాల్గొంటుంది. దీనిలోని కేంద్రకం సమవిభజన చెంది రెండు కేంద్ర కాలనిస్తుంది. ఇది పిండకోశంలో వ్యతిరేక ధృవాలవైపుకు చేరి; 2 కేంద్రకాల పిండకోశాన్ని ఏర్పరుస్తాయి. ఈ రెండు కేంద్రకాలలో మరొక 2 సమవిభజనలు జరిగి కేంద్రాలలో ఉన్న పిండకోశం ఏర్పడుతుంది. తర్వాత, వీటి చుట్టూ కవచాలు ఏర్పడి ఒక నమూనా స్త్రీ సంయోగబీజదం లేక పిండకోశం ఏర్పడుతుంది. మొత్తం 8 కేంద్రకాలలో ఆరుకేంద్రకాలచుట్టూ కణకవచాలు ఏర్పడి కణాలుగా అభివృద్ధి చెందుతాయి.
మిగిలిన రెండు స్త్రీబీజకణం కింద ఉన్న కేంద్ర కణంలో ఉంటాయి. వీటిని దృవ కేంద్రకాలు అంటారు. అండద్వారం కొనవైపు ఉన్న కణాలను స్త్రీబీజపరికరం అంటారు. దీనిలో ఒక స్త్రీ బీజకణం, రెండు సహాయకణాలు ఉంటాయి. సహాయకణాలలో పై వైపున ప్రత్యేక కణమందాలు ఉంటాయి. వీటిని ఫిలిఫారమ్ పరికరం అంటారు. ఇవి పరాగనాళాలు సహాయ కణాలలోనికి ప్రవేశించుటలో త్రోవచూపిస్తాయి. ఛలాజా వైపున ఉన్న 3 కణాలను ప్రతిపాదకకణాలు అంటారు. పక్వదశలో ఒక ఆవృత బీజ పిండకోశం 8 కేంద్రకాలతో ఉన్నప్పటికి, 7 కణాలతోనే ఉంటుంది. ఇది ఒకే ఒక స్థూలసిద్ధబీజం నుండి ఏర్పడుతుంది. కావున ఏకసిద్ధబీజవర్ధక పిండకోశం అంటారు.
ప్రశ్న 4.
సూక్ష్మసిద్ధబీజాశయ పటంగీసి, దానిని ఆవరించిన కుడ్య పొరలను గుర్తించండి. కుడ్యపొరల గూర్చి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
ఒక నమూనా ఆవృతబీజ పరాగకోశం ద్విలంబికంగా ఉండి, ప్రతి లంబికలో రెండు తమ్మెలు కలిగి ఉంటుంది. దీనిని ద్విక్షియుత పరాగకోశాలు అంటారు. పరాగకోశం అడ్డుకోతలో నాలుగు పార్శ్వాల నిర్మాణంగా కనిపిస్తుంది. దీని మూలల వద్ద 4 సూక్ష్మ సిద్ధబీజాశయాలు ఉంటాయి.
ప్రతి సూక్ష్మ సిద్ధబీజాశయము గుండ్రంగా కనిపిస్తుంది. ఇది నాలుగు పొరల కుడ్యంతో కప్పబడి ఉంటుంది. అవి 1) బాహ్యచర్మం 2) ఎండోదీసియమ్ 3) మధ్యవరుస 4) టపెటమ్
1) బాహ్య చర్మము :
ఇది ఏకకణ మందంలో ఉంటుంది. పుప్పొడి సంచుల మధ్యన ఉన్న కణాలు మాత్రం పలుచని గోడలతో ఉంటాయి. ఈ ప్రదేశాన్ని స్టోమియమ్ అంటారు. ఇది పుప్పొడి సంచుల స్ఫోటనంలో ఉపయోగపడతాయి.
2) ఎండోథీసియమ్ :
బాహ్య చర్మం క్రింద ఉన్న పొర. దీనిలోని కణాలు వ్యాసార్ధంగా సాగి తంతుయుత మందాలను కల్గి ఉండి, పక్వదశలో నీటిని కోల్పోయి కుచించుకుని పుప్పొడి సంచుల స్ఫోటనానికి సహకరిస్తాయి.
3) మన్యవరుసలు :
ఎండోథీషియం క్రింద 1 5 వరుసలలో పలుచని గోడలు కల కణాలు వరుసలు ఉంటాయి. ఇవి పరాగకోశ స్ఫోటనానికి సహకరిస్తాయి.
4) టపెటమ్ :
పరాగకోశ కుడ్యంలోని లోపలి పొర; దీనిలోని కణాలు పెద్దవిగా, ఎక్కువ కణ ద్రవ్యంలో, ఒకటికంటే ఎక్కువ కేంద్రకాలతో ఉంటాయి. ఇది అభివృద్ధిచెందుచున్న పరాగ రేణువులకు పోషకపదార్థాలను సరఫరాచేస్తుంది.
పుప్పొడి సంచి కుడ్యంలోపల సిద్ధబీజ జనక కణజాలం ఉంటుంది. దీనిలో క్షయకరణ విభజనలు జరిగి సూక్ష్మసిద్ధబీజ చతుష్కాలు ఏర్పడతాయి. దీనిని సూక్ష్మ సిద్ధబీజజననం అంటారు.
ప్రశ్న 5.
ఆవృతబీజ మొక్కలలో జరిగే ఫలదీకరణ విధానాన్ని వివరించండి.
జవాబు:
స్త్రీ, పురుష సంయోగబీజాల కలయికను ఫలదీకరణ అంటారు. ఆవృతబీజాలలో స్త్రీ సంయోగబీజదం అండంలో ఇమిడి ఉంటుంది. పురుష సంయోగబీజదం అయిన పరాగ రేణువులు పరాగ సంపర్కం ద్వారా సామాన్యంగా కీలాగ్రం మీద చేరతాయి. ఇవి కీలాగ్రంపైన మొలకెత్తి పరాగనాళాలను ఏర్పరుస్తాయి. ఈ పరాగనాళాలు కీలం ద్వారా పెరిగి అండాన్ని ప్రవేశించి, పిండకోశంలో పురుష సంయోగబీజాన్ని విడుదల చేస్తాయి.
ఫలదీకరణ జరిగే విధానం :
ఆవృద బీజాలలో ఫలదీకరణ ఐద దశలలో పూర్తి అవుతుంది.
A. పరాగనాళం అండాశయం నుంచి అండము లోనికి ప్రవేశించడం :
పరాగనాళం అండాశయం నుంచి అండంలోకి మూడు రకాలుగా ప్రవేశిస్తుంది.
1. రంధ్ర సంయోగం :
పరాగ నాళం అండంపై భాగంలో ఉన్న అండ ద్వారా అండంలోకి ప్రవేశించడాన్ని రంధ్రసంయోగం అంటారు. ఇది చాలా మొక్కలలో సర్వసాధారణంగా జరిగే సంయోగం.
ఉదా : ఒట్టీలియ.
2. కలాజా సంయోగము :
పరాగనాళం కలాజా ద్వారా అండంలోనికి ప్రవేశిస్తుంది. దీనిని ట్రూబ్ అనే శాస్త్రవేత్త కాజురైనాలో కనిపెట్టారు.
3. మధ్య సంయోగము :
పరాగనాళం అండకవచం ద్వారా గాని, అండవృంతం ద్వారా గాని అండంలోనికి ప్రవేశిస్తుంది. ఉదా : కుకుర్భిటా.
B. పరాగనాళం పిండకోశములోనికి ప్రవేశించడం :
పై 3 పద్ధతులలో ఒక పద్ధతి ద్వారా పరాగనాళం అండంలోనికి ప్రవేశించిన తర్వాత, పిండకోశంలోనికి అండద్వార ప్రాంతం ద్వారా కాని స్త్రీ బీజకణం, సహాయ కణం మధ్య ద్వారా కాని, సహాయకణాన్ని ధ్వంసం చేసి కాని ప్రవేశిస్తుంది. పరాగనాళం పిండకోశంలోనికి చలించడానికి ఫిలిపార్మ్ పరికరం దిశాత్మక నిర్మాణంగా పనిచేస్తుంది.
C. పురుష సంయోగ బీజాలు పిండకోశములోనికి విడుదల కావటం :
పరాగనాళం పిండకోశంలోనికి ప్రవేశించిన తర్వాత పరాగనాళం కొన విచ్ఛిన్నం కావడం వల్ల లేదా నాళం చివరి భాగం నశించి పోవడం వల్ల కాని, పరాగనాళం అగ్రంలో రంధ్రం ఏర్పడుట వల్ల కాని, పరాగనాళంలో ఉన్న రెండు పురుష సంయోగబీజాలు, శాఖీయ కేంద్రకం పిండకోశంలోనికి విడుదలవుతాయి.
D. సంయోగ బీజాల సంపర్కము :
ఒక పురుష సంయోగబీజము (మొదటిది) స్త్రీ బీజకణంతో సంయోగం చెంది ద్వయస్థితిక కణమైన సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. దీనిని నిజమైన ఫలదీకరణ అంటారు. దీనిని స్ట్రాస్ బర్జర్ 1884లో కనుక్కొన్నారు.
4. త్రిసంయోగం, ద్విఫలదీకరణం :
రెండవ పురుష సంయోగబీజ కేంద్రకము పిండకోశం మధ్యలో ఉన్న ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందుతుంది. ఫలితంగా త్వయస్థితిక ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం ఏర్పడుతుంది. ఈ సంయోగంలో ఏకస్థితికంగా ఉన్న పురుష సంయోగబీజం, ద్వయస్థితిక దశలో ఉండే ద్వితీయ కేంద్రకంతో కలుస్తుంది. కాబట్టి దీనిని “త్రిసంయోగం” అంటారు.
దీనిని మొదట నవాషిన్ అను శాస్త్రవేత్త లిల్లియమ్ ఫ్రిటిల్లేరియాలలో కనుగొనెను.
ఈ విధంగా ఆవృత బీజాల్లో పరాగనాళం నుంచి వెలువడ్డ రెండు సంయోగ బీజాలు సంయోగంలో పాల్గొంటాయి. మొదటి పురుష సంయోగబీజ కేంద్రకం స్త్రీ బీజకణంతోను, రెండవ పురుష సంయోగబీజ కేంద్రకం ద్వితీయ కేంద్రకం తోను కలిసి వరుసగా సంయుక్త బీజాన్ని, ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకాన్ని ఏర్పరచడం వల్ల రెండు సంయోగాలు జరిగినట్లు భావించారు.
దీనినే ద్విఫలదీకరణ అంటారు. దీనివలన ఫలవంతమైన అంకు రఛ్ఛదయుత విత్తనాలు ఏర్పడతాయి.
ప్రశ్న 6.
పరాగ సంపర్కానికి తోడ్పడే సహకారాల గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
పరాసంపర్కం జరగడానికి రెండు నిర్జీవ మరియు జీవ సహకారాల సహాయాన్ని మొక్కలు ఉపయోగించుకుంటాయి. ఎక్కువ శాతం మొక్కలు జీవసహకారుల ద్వారా పరాగ సంపర్కాన్ని జరుపుకుంటాయి.
I) నిర్జీవ పరాగసంపర్క సహకారులు :
గాలి, నీరు మొదలగునవి సహయపడతాయి.
a) వాయు పరాగసంపర్కం :
గాలి జరిగే పరాగ సంపర్కాన్ని వాయు పరాగ సంపర్కం అంటారు. ఇది సర్వ సామాన్యమైన నిర్జీవ పరాగ సంపర్కరకం. పుష్పాలు చిన్నవిగా, వర్ణరహితమైన, సువాసన లేకుండా, ద్విలింగకాలై, పుంభాగ ప్రధమోత్పతులు వంటి లక్షణాలు వాయు పరాగ సంపర్కానికి అనుకూలంగా ఉంటాయి.
ఉదా : గడ్డి జాతులలో వాయు పరాగ సంపర్కం సర్వసాధారణం
b) జలపరాగ సంపర్కం :
నీటిద్వారా మొక్కల్లో జరిగే పరాగ సంపర్కాన్ని జలపరాగ సంపర్కం అంటారు. ఇది రెండు
రకాలు అవి
1) ఊర్థ్వజల పరాగ సంపర్కం :
వాలిస్ నేరియా వంటి నీటిమొక్కల్లో స్త్రీ పుష్పాలు పొడవైన వృంతాల సహయంతో నీటిపై భాగానికి చేరగా పురుషపుష్పాలు లేదా పుప్పొడి రేణువులు నీటిపై విడుదలవుతాయి. ఇవి నీటి ప్రవాహంతో నిష్క్రియాత్మకంగా కదులుతూ చివరికి కొన్ని, స్త్రీ పుష్పాలను, కీలాగ్రాన్ని చేరతాయి. ఈ విధానాన్ని ఊర్థ్వజల పరాగ సంపర్కం అంటారు.
2) అథోజల పరాగ సంపర్కం :
నీటి యొక్క అడుగుతతిలంలో జరిగే పరాగ సంపర్కాన్ని అథోజల పరాగ సంపర్కం అంటారు.
ఉదా : సముద్రగడ్డిమొక్క జోస్టెరా.
II) జీవ పరాగ సంపర్క సహకారులు :
దీనిలో కీటకాలు, పక్షులు, గబ్బిలాలు, నత్తలు, జంతువులు మొదలగునవి పరాగ సంపర్కానికి సహాయపడతాయి.
a) కీటక పరాగ సంపర్కం :
కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కం
ఉదా : తేనేటీగలు, చీమలు, పట్టుపురుగులు
b) పక్షి పరాగ సంపర్కం (ఆర్నిథోఫిలి) :
పక్షులు ద్వారా జరిగే పరాగ సంపర్కం ఉదా : తీతువు పిట్టలు, సన్బర్డ్స్
c) కీరోష్టిలిఫెలీ :
గబ్బిలాలు వల్ల జరిగే పరపరాగ సంపర్కాన్ని ‘కిరోస్టిలిఫెలీ’ అంటారు.
d) తెరోఫిలీ :
ఉడుతలు వల్ల జరిగే పరపరాగ సంపర్కాన్ని తెరోఫిలీ అంటారు.
e) ఒఫియోఫిలీ :
పాములు వల్ల జరిగే పరపరాగ సంపర్కాన్ని ఒఫియోఫిలీ అంటారు.