Students can go through AP Inter 1st Year Chemistry Notes 7th Lesson రసాయనిక సమతాస్థితి, అమ్లాలు – క్షారాలు will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Chemistry Notes 7th Lesson రసాయనిక సమతాస్థితి, అమ్లాలు – క్షారాలు
→ ఒకే సమయంలో రెండు దిశలలో జరిగే చర్యలను ద్విగత చర్యలని, క్రియాజనకాలు పూర్తయ్యేవరకు ఒకే దిశలో జరిగే చర్యలను అద్విగత చర్యలని అంటారు.
→ పురోగామి చర్య మరియు తిరోగామి చర్య సమాన వేగాలతో జరిగే స్థితిని సమతాస్థితి అంటారు. రసాయన సమతాస్థితి గతిక స్వభావాన్ని కలిగి ఉంటుంది.
→ సమతాస్థితి వద్ద క్రియాజనకాలు మరియు క్రియాజన్యాలు వేర్వేరు ప్రావస్థలలో ఉంటే ఆ సమతాస్థితిని విజాతీయ సమతా స్థితి అని, ఒకే ప్రావస్థలో ఉంటే ఆ సమతాస్థితిని సజాతీయ సమతాస్థితి అంటారు.
→ మోలార్ గాఢతను క్రియాశీల ద్రవ్యరాశి అంటారు. దీనిని మోల్/ లీటర్తో సూచిస్తారు.
→ ద్రవ్యరాశి క్రియా నియమం ప్రకారం చర్యావేగం క్రియాజనకాల క్రియాశీల ద్రవ్యరాశుల లబ్దానికి అనులోమానుపాతంలో ఉంటుంది. 6 స్థిర ఉష్ణోగ్రత వద్ద సమతాస్థితి స్థిరాంకం విలువ స్థిరంగా ఉంటుంది.
→ సమతాస్థితిని ప్రభావితం చేసే అంశాలు గాఢత, పీడనం, ఉష్ణోగ్రత, ఉత్ప్రేరకం.
→ సమతాస్థితిలో ఉన్నటువంటి వ్యవస్థను పీడనం మార్పు లేదా ఉష్ణోగ్రత మార్పు లేదా గాఢత మార్పునకు గురిచేస్తే ఈ మార్పు రద్దయ్యే దిశలో సమతాస్థానం మారుతుంది. ఇదే లీచాట్లియర్ సూత్రం.
→ ఏకాంక కాలంలో క్రియాజనకాల గాఢతలో తగ్గుదల లేదా క్రియాజన్యాల గాఢతలో పెరుగుదలను చర్యావేగం అంటారు. దీనికి ప్రమాణాలు లీటర్” సెకన్”‘.
→ సమతాస్థితి వద్ద ఉష్ణోగ్రతను పెంచితే ఉష్ణగ్రాహక చర్య ప్రోత్సహించబడుతుంది.
→ సమతాస్థితి వద్ద పీడనాన్ని పెంచినపుడు ఎక్కువ ఘ.ప. దిశనుండి తక్కువ ఘ.ప. దిశకు చర్య జరుగుతుంది.
→ క్రియాజనకాల గాఢత పెరుగుదల, క్రియాజన్యాల గాఢత తగ్గుదల వలన పురోగామి చర్య ప్రోత్సహించబడుతుంది.
→ పురోగామి మరియు తిరోగామి చర్యలపై ఉత్ప్రేరకం ఒకేరకమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
→ క్రియాజనకాల గాఢతలకు మరియు చర్యావేగానికి మధ్యగల సంబంధాన్ని సూచించే సమీకరణాన్ని చర్యావేగ సమీకరణం అంటారు.
→ బ్రాన్సెడ్ – లౌరి నిర్వచనం ప్రకారం ప్రోటాన్ దాత ఆమ్లం, ప్రోటాన్ గ్రహీత క్షారం.
→ ఒక ప్రోటాన్ తేడా గల ఆమ్ల క్షార జంటను సంయుగ్మ ఆమ్ల క్షార జంట అంటారు. ఈ జంటలో ఒకటి బలమైనది అయితే రెండవది బలహీనమైనది.
→ జలద్రావణంలోని అన్ని బలమైన ఆమ్లాల బలాలు సమానం అవటాన్ని స్థాయీ ప్రభావం అంటారు.
→ NH3, H2O లు ద్విస్వభావ పదార్థాలు కనుక ఆమ్లత, క్షారతలను రెంటినీ సూచిస్తాయి.
→ బ్రానెడ్ – లౌరి సిద్ధాంతంలో ఆమ్లం నుండి, క్షారానికి ప్రోటాన్ మార్పిడి జరిగే ప్రక్రియను తటస్థీకరణం
→ లూయిస్ సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్ జంట స్వీకర్త ఆమ్లం, ఎలక్ట్రాన్ జంట దాత క్షారం.
→ లూయిస్ సిద్ధాంతం ప్రకారం సమన్వయ సంయోజనీయ బంధం ఏర్పడే చర్మ తటస్థీకరణ చర్య.
→ లూయిస్ క్షారాలన్నీ బ్రానెడ్ క్షారాలే. కానీ అన్ని లూయీ ఆమ్లాలు బ్రాన్సైడ్ ఆమ్లాలు కావు.
→ pHకొలమానాన్ని ప్రతిపాదించినది ‘సొరెన్సన్’ (Sorensen).
→ నీటి అయానిక లబ్ధం విలువ (2.5°C వద్ద) Kw = 1.0 × 10-4 మోల్/లీటరు
→ హైడ్రోజన్ అయాన్ గాఢతకు ఋణ గుర్తు ఉన్న సంవర్గమానాన్ని pH అంటారు.
→ pH విలువ 0 నుండి 7 వరకు ఉన్నవి ఆమ్లాలు కాగా 7 నుండి 14 వరకు ఉన్నవి క్షారాలు.
→ pH విలువ ఖచ్చితంగా ఉండే ద్రావణాలు తటస్థంగా ఉంటాయి.
→ ఒక లీటరు బఫర్ ద్రావణపు ఒక ప్రమాణ pH ని మార్చటానికి కావలసిన ఆమ్ల లేదా క్షార మోల్ సంఖ్యను బఫరా సామర్థ్యం అంటారు.
→ రంగు మార్పుల వలన తటస్థీకరణ చర్య పూర్తయినట్లు సూచించే బలహీన సేంద్రీయ ఆమ్లాలను లేదా క్షారాలను ఆమ్ల – క్షార సూచికలంటారు.
→ బలమైన ఆమ్ల, క్షారాల మధ్య జరిపే అంశమాపనాలలో ఫినాఫ్తలీన్ ను, బలమైన ఆమ్లం, బలహీన క్షారాల మధ్య జరిపే అంశమాపనాలలో మిథైల్ ఆరంజన్ను సూచికలుగా ఉపయోగిస్తారు.
→ లవణం నుండి ఏర్పడే అయాన్లకు నీటి నుండి ఏర్పడే అయాన్లకు మధ్య జరిగే చర్యను జలవిశ్లేషణ అంటారు.
→ సమతాస్థితి వద్ద మొత్తం లవణంలో జలవిశ్లేషణకు లోనైన భాగాన్ని జలవిశ్లేషణ విస్తృతి అంటారు.
→ బలమైన ఆమ్లం, బలహీనమైన క్షారం నుండి ఏర్పడిన లవణాల జలవిశ్లేషణ వలన ఏర్పడిన ద్రావణం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది.
→ బలమైన క్షారం, బలహీనమైన ఆమ్లం నుండి ఏర్పడిన లవణాల జలద్రావణాలు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి.
→ బలమైన ఆమ్ల, క్షారాల తటస్థీకరణ వలన ఏర్పడిన లవణాలు జలవిశ్లేషణలో తటస్థ ద్రావణాలనిస్తాయి.
→ బలహీనమైన ఆమ్ల, క్షారాల తటస్థీకరణ వలన ఏర్పడిన లవణాలు స్వల్ప ఆమ్ల ధర్మాన్ని గాని, స్వల్ప క్షార ధర్మంగాని ప్రదర్శిస్తాయి లేక తటస్థంగా ఉంటాయి.
→ pH విలువ స్థిరంగా ఉండే ద్రావణాలను బఫర్ ద్రావణాలంటారు. ఇవి రెండు రకాలు.
- ఆమ్ల బఫర్ ద్రావణాలు
- క్షార బఫర్ ద్రావణాలు.
→ బలహీనమైన ఆమ్లం మరియు అది బలమైన క్షారంతో ఏర్పరచిన లవణ ద్రావణ మిశ్రమాన్ని ఆమ్ల బఫర్ ద్రావణం అంటారు.
→ బలహీన క్షారం మరియు అది బలమైన ఆమ్లంలో ఏర్పరచిన లవణ ద్రావణ మిశ్రమాన్ని క్షార బఫర్ ద్రావణం అంటారు.
→ బఫర్ సామర్థ్యం (0) : ‘ఒక లీటరు ద్రావణం pH విలువలో ఒక యూనిట్ మార్పు తేవడానికి కలుపవలసిన బలమైన ఆమ్లం లేదా బలమైన క్షారం మోల్ల సంఖ్యను ఆ బఫర్ సామర్ధ్యం అంటారు”.
→ బఫర్ సామర్థ్యం విలువ ఎక్కువ గల బఫర్ ద్రావణం మంచిది.
→ ద్రావణీయత లబ్ధం (Ksp) : “గది ఉష్ణోగ్రత వద్ద ఒక లవణం సంతృప్త ద్రావణంలో కాటయాన్ల గాఢతకు మరియు ఆనయాన్ల గాఢతకు మధ్యగల లబ్దం లవణ ద్రావణీయతా లబ్దం.
→ ఉభయ సామాన్య అయాన్ ప్రభావము “ఉమ్మడి అయాన్ వున్న బలమైన విద్యుత్ విశ్లేష్య పదార్థ సమక్షంలో బలహీన విద్యుత్ విశ్లేష్య పదార్థము యొక్క అయనీకరణ తగ్గుట”.
→ రసాయన గుణాత్మక విశ్లేషణలో ద్రావణీయతా లబ్దానికి మరియు ఉభయ సామాన్య అయాన్ ప్రభావానికి చాలా ప్రాముఖ్యత వుంది.
→ మైకేల్ ఫారడే:
మైకేల్ ఫారడే లండన్ సమీపంలో జన్మించెను. అతనికి లభించిన అన్ని పురస్కారాలను తిరస్కరించాడు.