AP Inter 1st Year Chemistry Notes Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు

Students can go through AP Inter 1st Year Chemistry Notes 8th Lesson హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Chemistry Notes 8th Lesson హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు

→ హైడ్రోజన్ ను ఆవర్తన పట్టికలో IA గ్రూపులో కాని, VIIA గ్రూపులో ‘ కాని ఉంచవచ్చు.

→ హైడ్రోజన్ కు మూడు ఐసోటోపులు కలవు.

  • ప్రోటియం (P)
  • డ్యుటీరియం (D)
  • ట్రిటియం (T)

→ జడవాయువులు తప్ప ఇతర మూలకాలతో హైడ్రోజన్ ఏర్పరచే ద్విగుణ సమ్మేళనాలను హైడ్రైడ్లు అంటారు. హైడ్రైడ్లు మూడు రకాలు.

  • అయానిక హైడ్రైడ్లు
  • సంయోజనీయ హైడ్రైడ్లు
  • లోహ హైడ్రైడ్లు.

→ సబ్బు నీటిలో త్వరగా నురగనివ్వని నీటిని కఠినజలం అని, త్వరగా నురగనిచ్చే నీటిని సాధుజలం అంటారు.

→ నీటి శాశ్వత కాఠిన్యత అనునది Ca, Mg క్లోరైడ్లు, సల్ఫేట్ల వలన కలుగును.

→ నీటి అశాశ్వత కాఠిన్యత Ca, Mg బై కార్బొనేట్లలో కలుగును.

AP Inter 1st Year Chemistry Notes Chapter 8 హైడ్రోజన్ - దాని సమ్మేళనాలు

→ H2O2 ను 50% H2SO4 విద్యుద్విశ్లేషణ ద్వారా గాని (లేదా) 2-ఇథైల్ ఆంత్రాక్వీనోల్ను స్వయం ఆక్సీకరణం చేసిగాని తయారుచేస్తారు.

→ H2O2, తెరచియున్న పుస్తక ఆకృతి (సమతల నిర్మాణంకానిది) కలిగి ఉండును. (వాయుస్థితి, ఘనస్థితి)

→ భారజలాన్ని న్యూక్లియర్ రియాక్టర్లలో మితకారిగా ఉపయోగిస్తారు.

→ హైడ్రోజన్ ను కలుషితం లేని ఇంధనంగా ఉపయోగించవచ్చు.

→ యువెస్ చౌఐన్
యువెన్ చెవిన్ రసాయన శాస్త్రవేత్త. 2005లో ఫ్రెంచ్ ప్రభుత్వం నోబెల్ అవార్డుతో సత్కరించింది.