Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 2nd Lesson రాజ్యం Textbook Questions and Answers.
AP Inter 1st Year Civics Study Material 2nd Lesson రాజ్యం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
రాజ్యాన్ని నిర్వచించి, దాని ముఖ్య లక్షణాలను తెలపండి. [Mar. ’16]
జవాబు:
మానవుడు నిర్మించుకొన్న వివిధ సంస్థల్లో రాజ్యం అత్యంత ప్రధానమైనది, శక్తివంతమైనది కూడా. ఇది సాంఘిక జీవనాన్ని నియంత్రించి, క్రమబద్ధం చేస్తుంది.
క్రీ.శ. 16వ శతాబ్దంలో ఇటలీ దేశస్తుడైన మాఖియవెల్లి, తన గ్రంథమైన “ది ప్రిన్స్”లో మొదటిసారిగా ‘రాజ్యం’ అనే పదాన్ని ఉపయోగించారు. అప్పటి నుండి ఈ పదం బాగా వాడుకలోకి వచ్చింది.
అర్థం: రాజ్యాన్ని ఆంగ్లంలో ‘స్టేట్’ అంటారు. ఈ మాట ‘స్టేటస్’ అనే ట్యుటానిక్ పదం నుండి గ్రహించారు. దీనికి తెలుగులో సరైన అర్థం లేదు. కొందరు ‘స్టేట్’ అంటే ‘ప్రభుత్వం’ అని, ‘జాతి’ అని, ‘సమాజం’ అని భావిస్తున్నారు. కానీ రాజనీతి శాస్త్ర అధ్యయనం ప్రకారం స్టేట్ అంటే ‘రాజ్యం’ అనే అర్థంలో ఉపయోగిస్తున్నారు.
నిర్వచనాలు: రాజ్యాన్ని అనేకమంది రాజనీతి శాస్త్రజ్ఞులు నిర్వచించారు.
ఎ) “మానవునికి సుఖమైన, గౌరవమైన జీవనం ప్రసాదించడం లక్ష్యంగా కలిగిన కుటుంబాల, గ్రామాల సముదాయమే రాజ్యం’. – అరిస్టాటిల్
బి) ‘ఒక నిర్దిష్ట భూభాగంలో శాసనబద్ద ప్రభుత్వం గల ప్రజాసముదాయమే రాజ్యం’. – ఉడ్రోవిల్సన్
సి) “ఒక నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం”. – బ్లంటి షిలీ
డి) “ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే పౌరులు, ప్రభుత్వం ఉన్న రాజకీయ వ్యవస్థే రాజ్యం”. – రాబర్ట్ ఎ.డాల్
లక్షణాలు: పై నిర్వచనాలననుసరించి రాజ్యానికి నాలుగు ప్రధాన లక్షణాలున్నాయి. అవి 1. ప్రజలు 2. ప్రదేశం 3. ప్రభుత్వం 4. సార్వభౌమాధికారం. వీటితోపాటు ఆధునిక కాలంలో అంతర్జాతీయ గుర్తింపు రాజ్యలక్షణంగా ‘గుర్తించబడింది.
1) ప్రజలు: రాజ్యము ఒక మానవసంస్థ. ప్రజలు లేనిదే రాజ్యం లేదు. అయితే ఒక రాజ్యంలో ప్రజలు ఎంతమంది ఉండవలెననే అంశంపై రాజనీతి తత్త్వవేత్తలు ఒకే అభిప్రాయాన్ని కల్గిలేరు. ప్లేటో దృష్టిలో ఆదర్శ రాజ్య జనాభా 5,040. రూసో అభిప్రాయంలో ఆదర్శ రాజ్యానికి జనాభా 10,000 మంది. అరిస్టాటిల్ అభిప్రాయంలో ఆదర్శ రాజ్య జనాభా మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ ఉండరాదు. ప్రస్తుత కాలంలో ఆధునిక రాజ్యాలు కొన్ని తక్కువ జనాభాతోను (అండోరా, శాన్మారినో, వాటికన్ సిటీ), మరికొన్ని ఎక్కువ జనాభాతోను (చైనా, ఇండియా) ఉన్నాయి. ప్రజలు కష్టించి పనిచేసే తత్వాన్ని కల్గి ఉంటే జనాభా తక్కువగా ఉన్నా రాజ్యం అభివృద్ధి చెందుతుంది.
2) ప్రదేశము: నిర్ణీత ప్రదేశం రాజ్యానికి అవసరం. ప్రదేశము అనగా భూమి, ప్రాదేశిక వియత్తలము (ఆకాశము) మరియు ప్రాదేశిక జలాలు (సముద్రజలాలు 12 నాటికల్ మైళ్ళ వరకు) అయితే నాల్గువైపుల భూమినే సరిహద్దుగా కల్గిన, నేపాల్, భూటాన్ వంటి రాజ్యాలకు ప్రాదేశిక జలాలు ఉండవు. వాటికి ప్రదేశము అంటే భూమి, ప్రాదేశిక వియత్తలము మాత్రమే. తక్కువ ప్రదేశం ఉన్న రాజ్యాలు ఉత్తమమైనవిగా ప్లేటో, రూసో అభిప్రాయపడ్డారు. లార్డ్ ఆక్టన్, ట్రయష్కీలు పెద్ద ప్రదేశం కల్గిన రాజ్యాలు గొప్పవని విశ్వసించారు. అరిస్టాటిల్ రాజ్య ప్రదేశం మరీ ఎక్కువగాను, మరీ తక్కువగాను ఉండకూడదని తెల్పెను.
రాజ్యానికి ప్రదేశం ఎక్కువగా ఉంటే సహజవనరులు ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో నేడు ఎక్కువ భూభాగం కలిగిన రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి రాజ్యాలు, తక్కువ భూభాగం కలిగిన బ్రూనాయి, అండోరా, శాన్ మారినో వంటి రాజ్యాలు ఉన్నాయి.
3) ప్రభుత్వము: రాజ్యము యొక్క ఏజెంట్ ప్రభుత్వం. ఇది రాజ్యం యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తుంది. రాజ్యం |తరపున సార్వభౌమాధికారాన్ని వినియోగిస్తుంది. ప్రభుత్వమునకు శాసన నిర్మాణ సభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖ అను మూడు అంగములు కలవు. ప్రభుత్వం రాజ్యం కంటే ముందే ఆవిర్భవించింది. అందువలననే రాజ్య లేకుండా ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం శాశ్వతమైన సంస్థ కాదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు అనేక రకాలు. ప్రజాస్వామ్య, నియంతృత్వ, పార్లమెంటరీ, అధ్యక్షతరహా ఏకకేంద్ర, సమాఖ్య మొదలగునవి.
4) సార్వభౌమాధికారము: రాజ్యం మౌలిక లక్షణాలలో అత్యంత ముఖ్యమైనది సార్వభౌమాధికారము. లాటిన్ పదమైన ‘సుప్రానస్’ నుండి స్వార్నిటీ అను ఆంగ్లపదం ఉద్భవించినది. సార్వభౌమాధికారము వలననే రాజ్యం విశిష్టమైన, అత్యున్నతమైన రాజకీయ సంస్థగా పరిగణించబడుతోంది. సార్వభౌమాధికారము వలన రాజ్యంలో నివసించే ప్రజలు పనిచేసే సంస్థలు రాజ్యానికి విధేయులై ఉండటం జరుగుతుంది. అలా విధేయత చూపించని వ్యక్తులను, సంస్థలను రాజ్యం దండిస్తుంది. సార్వభౌమాధికారము అంతిమ అధికారం. దీనిని మించిన మరొక అధికారం రాజ్యంలో ఉండదు. ఇది విభజించుటకు, బదిలీ చేయుటకు వీలులేని అధికారము.
ప్రశ్న 2.
రాజ్యం, ప్రభుత్వం ఏ విధంగా వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి ?
జవాబు:
రాజ్యము, ప్రభుత్వము అనే మాటలు సాధారణంగా ఒకే అర్థాన్నిచ్చేవిగా వాడబడుతుంటాయి. కానీ రాజనీతి శాస్త్రంలో ఈ రెండు పదాలు ప్రత్యేక అర్థాలు కలిగి ఉన్నాయి. హాబ్స్ అనే రచయిత రాజ్యము, ప్రభుత్వాల మధ్య భేదము చూపలేదు. లాస్కీ అభిప్రాయము ప్రకారము “రాజ్యము అంటే ఆచరణలో ప్రభుత్వం”. ప్రభుత్వం రాజ్యం పేరు మీద పనిచేస్తుంది. జి.డి. హెచ్. కోల్ “ఒక సమాజంలోని ప్రభుత్వ రాజకీయ యంత్రాంగమే రాజ్యము” అని అభిప్రాయపడ్డాడు. ఈ విధంగా కొందరు రచయితలు రాజ్యము, ప్రభుత్వము ఒక్కటే అని చెప్పారు. ఇంగ్లాండ్లో స్టువర్ట్ వంశరాజులు రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని ఒకటిగా భావించారు. ఫ్రాన్స్లో 14వ లూయీ రాజు “నేనే రాజ్యము” అని వాదించి, రాజ్యానికి, ప్రభుత్వానికి భేదం లేకుండా చేశాడు.
కానీ ప్రభుత్వం రాజ్యానికి ఒక లక్షణము. రాజ్య ఆశయాలు ప్రభుత్వం ద్వారా తీర్చబడతాయి. రాజ్యంలో ప్రజలంతా భాగం. ప్రభుత్వంలో కొందరు ప్రజలే పనిచేస్తారు. మెకైవర్ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం రాజ్య ప్రతినిధి. ఈ విధంగా రాజ్యం, ప్రభుత్వాల మధ్య భేదాలున్నాయి.
భేదాలు:
రాజ్యం
- రాజ్యం శాశ్వతమైన రాజకీయ సంస్థ. మానవ సమాజం ఉన్నంతకాలం అది ఉంటుంది.
- రాజ్యమునకు 5 లక్షణాలుంటాయి. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపు దాని లక్షణాలు.
- రాజ్యము యజమాని వంటిది.
- రాజ్యానికి సార్వభౌమాధికారం సహజంగానే ఉంటుంది. అది ఉన్నతాధికారాలు చెలాయిస్తుంది.
- ప్రపంచంలోని అన్ని రాజ్యాలకు ముఖ్య లక్షణాలు ఒక్కటే.
- పౌరులంతా రాజ్యంలో సభ్యులే. రాజ్యంలో. ప్రజలకు సభ్యత్వం, తప్పనిసరిగా ఉంటుంది.
- రాజ్యానికి స్వతసిద్ధమైన రూపం లేదు. అది ప్రభుత్వ రూపంలోనే కనిపిస్తుంది.
- రాజ్యానికి ప్రదేశము ఒక ముఖ్య లక్షణము. ప్రదేశంలేని రాజ్యం ఉండదు.
- ప్రజలకు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కు లేదు.
- రాజ్యానికి మౌలికమైన అధికారాలున్నాయి.
ఉదా: పార్లమెంటరీ, అధ్యక్షతరహా యూనిటరీ, సమాఖ్య మొదలగు ప్రభుత్వాలు.
ప్రభుత్వం
- ప్రభుత్వం ఎన్నికల వలనగానీ, విప్లవాల వలనగానీ మారవచ్చు. అందువలన అది శాశ్వతమైనది కాదు.
- ప్రభుత్వం రాజ్య లక్షణాలలో ఒకటి మాత్రమే. అది రాజ్య ప్రతినిధి, ఒక భాగము.
- ప్రభుత్వం రాజ్యానికి సేవకుని వంటిది. రాజ్యం పనులను ప్రభుత్వం చేస్తుంది.
- ప్రభుత్వం రాజ్యం తరపున సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తుంది.
- ప్రపంచంలో ప్రభుత్వాలన్నీ ఒకే విధమైనవి కావు.
- ప్రభుత్వంలో కొద్దిమంది మాత్రమే సభ్యులు. సభ్యత్వం తప్పనిసరి కాదు.
- ప్రభుత్వము ఒక స్పష్టమైన రూపంలో కనిపిస్తుంది.
- ప్రభుత్వం నిర్దిష్ట ప్రదేశం లేకుండా పనిచేస్తుంది. అది ఎక్కడినుండైనా పనిచేస్తుంది.
- ప్రజలు తమకు నచ్చని ప్రభుత్వాన్ని ప్రతిఘటించ గలరు. న్యాయస్థానాల ద్వారా కూడా వ్యతిరేకించగలరు.
- ప్రభుత్వానికి రాజ్యాంగము ఇచ్చే అధికారాలే ఉంటాయి.
ప్రశ్న 3.
రాజ్యం, సమాజం మధ్యగల సంబంధం, వ్యత్యాసాలను వివరించండి.
జవాబు:
పరిచయం: రాజ్యం, సమాజం అనేవి ప్రముఖమైన మానవసంస్థలు. మేకైవర్ అభిప్రాయంలో రక్త సంబంధం సమాజ అవతరణకు దారితీస్తే, సమాజం రాజ్య ఆవిర్భావానికి నాంది పలికింది.
రాజ్యం: “ఒక నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం” – బ్లంటి సమాజం: “కొన్ని ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకై సమైక్యం చెందిన వ్యక్తుల సమూహం”.
రాజ్యానికి, సమాజానికి మధ్యగల సంబంధం (Relationship between State and Society):
1) ఒకే రకమైన లక్షణాలు (Common features): రాజ్యం, సమాజం రెండింటికి ఒకే తరహా లక్షణాలు ఉంటాయి. సాధారణంగా రాజ్యం, సమాజాలలో ప్రజలే ఉంటారు. సమాజంలోని సభ్యులే రాజ్యంలో సభ్యులుగా కొనసాగుతారు.
2) పరస్పర పూరకాలు (Complementary): రాజ్యం, సమాజం రెండూ పరస్పర పూరకాలు. ఒకదానికొకటి సహకరించుకొంటాయి. సమాజ ప్రగతి రాజ్య ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. రాజ్య కార్యకలాపాలు లేదా పనితీరు సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి.
3) పర్యాయపదాలు (Synonymous terms): రాజ్యం, సమాజం అనే పదాలను అనేక సందర్భాలలో పర్యాయపదాలుగా వినియోగించడమైంది. గ్రీకు రాజనీతితత్త్వవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్లు, తరువాతి కాలంలో హెగెల్, బొసాంకేలు రాజ్యం, సమాజం రెండూ ఒకటే అని భావించారు. గ్రీకు రాజనీతి పండితులు నగర రాజ్యాలను, సమాజాన్ని పర్యాయపదాలుగా ఉపయోగించడం జరిగింది.
4) పరస్పర సంబంధం (Inter-relation): రాజ్యం, సమాజం మధ్యగల సంబంధాన్ని ఎవ్వరూ విస్మరించలేరు. రాజ్యం తాను రూపొందించిన చట్టాల ద్వారా సమాజంలో వ్యక్తుల బాహ్య ప్రవర్తనను నియంత్రిస్తుంది. సామాజిక వ్యవస్థకు విస్తృత పునాదిని ఏర్పరుస్తుంది. అందుచేత రాజ్యం సమాజాలను రెండు విభిన్న వ్యవస్థలలో విడదీయలేం. సమాజ ఆర్థిక, సాంస్కృతిక, మత, మానవతాపరమైన కార్యకలాపాల ద్వారా రాజ్యాన్ని పరిపుష్టంగావిస్తుంది.
రాజ్యం, సమాజం మధ్య వ్యత్యాసాలు (Differences between State and Society): రాజ్యం, సమాజాల మధ్య సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ, ఈ రెండూ ఒకదానికొకటి వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి. వాటిని కింది పట్టిక ద్వారా తెలపవచ్చు.
రాజ్యం (State)
- రాజ్యం అనేది రాజకీయ సంస్థ.
- రాజ్యం వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మాత్రమే నియంత్రిస్తుంది. ఈ విషయంలో అది కొన్ని నిబంధనలను రూపొందిస్తుంది.
- రాజ్యానికి దండనాధికారం ఉంది. రాజ్యశాసనాన్ని అతిక్రమించినవారు శిక్షార్హులుగా పరిగణించ బడతారు.
- రాజ్యం చేసే చట్టాలు రాజ్యానికి బలం చేకూరుస్తాయి.
- రాజ్యం అనేది ప్రాదేశిక సంస్థ. దానికి స్వీయ నిర్దిష్ట భూభాగం ఉంటుంది. ప్రాదేశికత అనేది రాజ్యానికి చెందిన ప్రధాన లక్షణంగా పేర్కొనవచ్చు.
- రాజ్యం ఒక్కటే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. తన సార్వభౌమాధికారాన్ని వినియోగించి ప్రజల సంబంధాలను నిర్దేశించే అనేక చట్టాలను రూపొందించి, అమలు పరుస్తుంది.
- రాజ్యం సహజంగా ఏర్పడిన సంస్థ కాదు. అది మానవనిర్మితమైంది. దానిలో సభ్యత్వం వ్యక్తులకు నిర్బంధమైంది.
- రాజ్యం సమాజంలోని అతి ముఖ్యభాగం. సమాజంలోని రాజకీయంగా వ్యవస్థీకృతమైన భాగాన్ని అది సూచిస్తుంది.
- సాంఘిక వ్యవస్థ అభివృద్ధి చెందిన రూపమే రాజ్యం. అది సమాజం నుంచి ఆవిర్భవించింది.
- రాజ్యం శాశ్వతమైంది కాకపోవచ్చు. అది అంతరించి పోయే అవకాశం ఉంది. వేరొక రాజ్యం దానిని బలవంతంగా ఆక్రమించుకోవచ్చు.
- రాజ్య చట్టాలు, విధి, విధానాలు ఖచ్చితంగాను, స్పష్టంగాను ఉంటాయి.
- రాజ్యంలోని చట్టాలు ఒకే విధంగా ఉంటాయి. ఒకే చట్టాన్ని అతిక్రమించిన వ్యక్తులందరూ తారతమ్యం లేకుండా శిక్షకు గురవుతారు.
- రాజ్యానికి ప్రభుత్వం అనే రాజకీయ వ్యవస్థ ఉంటుంది. అది రాజ్యం తరపున చట్టాలను రూపొందించి, అమలుచేస్తుంది.
సమాజం (Society)
- సమాజం అనేది సాంఘిక వ్యవస్థ.
- సమాజం మానవుల బాహ్య, అంతర్గత ప్రవర్తనలు రెండింటిని నియంత్రిస్తుంది. వ్యక్తుల సామాజిక జీవనాన్ని ఇది క్రమబద్దం చేస్తుంది.
- సమాజానికి దండనాధికారం లేదు. సాంఘిక ఆచారాలను అతిక్రమిస్తే వారిని సమాజం శిక్షించ లేదు.
- సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు సమాజానికి బలం చేకూరుస్తాయి.
- సమాజానికి నిర్దిష్టమైన భౌగోళిక హద్దులు లేవు. అది రాజ్యం కంటే విశాలమైంది కావచ్చు లేదా చిన్నదైనా కావచ్చు. సమాజం విశ్వమంతా విస్తరించి ఉంటుంది.
- సమాజానికి నిర్బంధ అధికారాలు అంటూ ఏవీ లేవు. సమాజం మానవ సామాజిక ప్రవర్తనను క్రమబద్దం చేసే నియమాలను రూపొందించి నప్పటికీ వాటికి చట్టబద్ధత ఉండదు.
- సమాజం సహజంగా, స్వతఃసిద్ధంగా ఏర్పడిన సంస్థ. వ్యక్తులు తమ విచక్షణను అనుసరించి దీనిలో సభ్యులుగా కొనసాగుతారు.
- రాజ్యం కంటే సమాజం విస్తృతమైంది. అనేక సంఘాలు, సంస్థలు, వ్యవస్థల ద్వారా అది ఏర్పడి అభివృద్ధి చెందుతుంది.
- సమాజం పెద్దది. రాజ్యం దానిలో అంతర్భాగం మాత్రమే. సమాజం రాజ్యం కంటే ముందు అవతరించింది. మానవుడు స్వభావరీత్యా సంఘ జీవి.
- సమాజం శాశ్వతమయింది. ఇది నిరంతరం కొనసాగుతుంది.
- సమాజ సూత్రాలు అస్పష్టమైనవి. అవి సాధారణంగా అనిర్దిష్టంగా ఉంటాయి. అవి సంప్రదాయాలు, కట్టుబాట్లపై ఆధారపడి ఉంటాయి.
- సమాజం నియమాలు ఒకే విధంగా ఉండవు. ఒక వర్గ నియమాలకు, వేరొక వర్గ నియమాలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. వివిధ సామాజిక వర్గాలు ఒకే రకమైన నేరానికి పాల్పడితే విధించే శిక్షలు వేరువేరుగా ఉంటాయి.
- సమాజ నియమాలను అమలుపరచడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగమంటూ ఏదీ లేదు. ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల ద్వారా అది మానవ ప్రవర్తనను నియంత్రిస్తుంది.
ప్రశ్న 4.
రాజ్యం, సంస్థల మధ్యగల సంబంధం, వ్యత్యాసాలను వర్ణించండి.
జవాబు:
పరిచయం: మానవుని సామాజిక స్వభావం, అతడి విభిన్న అవసరాలను తీర్చే అనేక సంఘాల, సముదాయాల ద్వారా వెల్లడవుతుంది. మానవుడు ఒంటరి జీవితాన్ని గడపలేడు. తన అభివృద్ధికి ఇతరుల సహాయ సహకారాలను కోరతాడు. కొన్ని నిర్దిష్ట ప్రయోజనాలను సాధించుకొనేందుకు సన్నిహిత సామాజిక సంబంధాలనేవి సంఘాల ఏర్పాటుకు దారితీస్తాయి.
రాజ్యం: “ఒక నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం” – బ్లంట్ల
సంఘం: మేకైవర్ నిర్వచనం ప్రకారం ‘సాధారణమైన లేదా ఉమ్మడి ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు మానవుడు తన ప్రయోజనాన్ని ఆశించి ఏర్పాటు చేసుకున్నదే సంఘం.”
రాజ్యం-సంఘాల మధ్య సంబంధం (Relationship between State and Association): రాజ్యం, సంఘం రెండూ కూడా వ్యక్తులతో కూడుకొన్న వ్వవస్థలే. రాజ్యం, సంఘంలో వ్యక్తులే సభ్యులు. ఈ రెండూ కూడా వ్యక్తుల అనేక అవసరాలను తీర్చేందుకు ఏర్పాటైనాయి. సమిష్టి ప్రయోజనాలను సాధించుకొనే లక్ష్యంతో రాజ్యం, సంఘాలు ఏర్పాటవుతాయి. రాజ్యం, సంఘంల మధ్యగల సంబంధాన్ని కింది విధంగా వివరించవచ్చు.
- ఒకేరకమైన సభ్యత్వం (Same membership): రాజ్యం, సంఘాలు రెండూ కూడా మానవ సమూహాలే. వ్యక్తులందరూ ఆ రెండింటిలో సభ్యులుగా ఉంటారు.
- ఉమ్మడి ప్రయోజనాలు (Common Interests): వ్యక్తులు తమ సమిష్టి ప్రయోజనాలను సాధించుకోవడానికి రాజ్యాన్ని, సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు.
- వ్యవస్థాపరమైనవి (Organisation): రాజ్యం, సంఘాలు రెండూ కూడా తమ ప్రయోజనాలను సాధించుకోవడానికి వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలే.
- ప్రవర్తనా నియమావళి (Code of conduct): రాజ్యం, సంఘాలు రెండూ తమ సభ్యులను నియంత్రించేందుకుగాను ప్రవర్తనా నియమావళిని కలిగి ఉన్నాయి. అటువంటి నియమావళి సభ్యులను ఒకతాటిపైన ఉంచుతాయి. అంతేకాకుండా అది వ్యవస్థకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది.
- కార్యనిర్వహణశాఖ (Executive): ప్రతి రాజ్యానికి కార్యనిర్వాహకశాఖ ఉంటుంది. దీనినే ప్రభుత్వంగా పిలువబడుతుంది. ప్రతి సంఘానికి కూడా కార్యనిర్వాహక మండలి ఉండి, తమ విధివిధానాలను అమలుపరుస్తుంది.
రాజ్యం, సంఘాల మధ్యగల వ్యత్యాసాలు (Differences between State and Association):
రాజ్యం (State)
- రాజ్యం సభ్యత్వం నిర్బంధమైంది.
- రాజ్యం శాశ్వతమైంది.
- రాజ్యం ప్రజలందరి శ్రేయస్సు, ప్రగతి కోసం కృషి చేస్తుంది.
- రాజ్యం అనేది భౌగోళిక సంస్థ. దానికి నిర్దిష్టమైన సరిహద్దులు ఉంటాయి.
- రాజ్యం సార్వభౌమాధికారం గల సంస్థ.
- ఒక పౌరుడికి ఒకే సమయంలో ఒక రాజ్యంలో మాత్రమే సభ్యత్వం ఉంటుంది. తనకు సభ్యత్వం ఉన్న రాజ్యం పట్ల మాత్రమే విధేయత కనబరుస్తాడు.
- రాజ్య పరిధి విస్తృతమైనది.
- సంఘం కార్యకలాపాలలో రాజ్యం జోక్యం చేసుకోవచ్చు.
- రాజ్యం సంఘాల కంటే ఉన్నతమైంది.
- రాజ్యానికి పౌరులందరూ తప్పనిసరిగా విధేయులై ఉంటారు.
- ప్రపంచంలోని రాజ్యాలన్నింటికి ఒకే తరహా లక్షణాలు ఉంటాయి.
- రాజ్యం తనకున్న అధికారాన్ని చెలాయిస్తూ, రాజ్య చట్టాలను నిర్బంధంగా అమలుపరుస్తుంది.
- శాంతి భద్రతల నిర్వహణలో రాజ్యం బల ప్రయోగానికి పాల్పడవచ్చు.
సంఘాలు (Associations)
- సంఘంలో సభ్యత్వం ఐచ్ఛికమైంది.
- సంఘాలు శాశ్వతమైనవిగానూ, తాత్కాలికంగానూ ఉంటాయి.
- సంఘాలు తమ సభ్యుల ప్రయోజనాలను నెరవేర్చేం దుకు ప్రయత్నిస్తాయి.
- సంఘాలకు ఖచ్చితమైన సరిహద్దులు ఉండవు.
- సంఘాలకు సార్వభౌమాధికారం ఉండదు.
- ఒక వ్యక్తికి ఒకేసారి అనేక సంఘాలలో సభ్యత్వం ఉండవచ్చు.
- సంఘాల పరిధి పరిమితమైంది.
- రాజ్య కార్యకలాపాలలో సంఘం జోక్యం చేసుకో రాదు.
- సంఘాలు రాజ్యం కంటే ఉన్నతమైనవి కావు.
- సంఘాల నియమ నిబంధనలను సభ్యులు సమయం సందర్భాలను బట్టి ఆమోదించేందుకు లేదా అతిక్రమించేందుకు వీలుంటుంది.
- సంఘాలకు నిర్మాణం, స్వభావం, లక్ష్యాలు లేదా ఉద్దేశ్యాలలో వ్యత్యాసం ఉంటుంది.
- సంఘాలు తమ నియమ నిబంధనలను బలవంతంగా సభ్యులపైన రుద్దలేవు. సభ్యుల సహకారం పైన సంస్థల నియమావళి అమలు జరుపబడుతుంది.
- సభ్యుల అంగీకారంపై ఆధారపడి సంఘాలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
రాజ్యానికి గల ఏవైనా రెండు ముఖ్య లక్షణాలను వివరించండి. [Mar. ’18, ’17]
జవాబు:
లక్షణాలు: రాజ్యానికి నాలుగు ప్రధాన లక్షణాలున్నాయి. అవి 1. ప్రజలు 2. ప్రదేశం 3. ప్రభుత్వం 4. సార్వభౌమాధికారం. వీటితోపాటు ఆధునిక కాలంలో అంతర్జాతీయ గుర్తింపు రాజ్యలక్షణంగా గుర్తించబడింది.
1) ప్రజలు: రాజ్యము ఒక మానవసంస్థ. ప్రజలు లేనిదే రాజ్యం లేదు. అయితే ఒక రాజ్యంలో ప్రజలు ఎంతమంది ఉండవలెననే అంశంపై రాజనీతి తత్త్వవేత్తలు ఒకే అభిప్రాయాన్ని కల్గిలేరు. ప్లేటో దృష్టిలో ఆదర్శ రాజ్య జనాభా 5,040. రూసో అభిప్రాయంలో ఆదర్శ రాజ్యానికి జనాభా 10,000 మంది. అరిస్టాటిల్ అభిప్రాయంలో ఆదర్శ రాజ్య జనాభా మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ ఉండరాదు. ప్రస్తుత కాలంలో ఆధునిక రాజ్యాలు కొన్ని తక్కువ జనాభాతోను (అండోరా, శాన్ మారినో, వాటికన్ సిటీ), మరికొన్ని ఎక్కువ జనాభాతోను (చైనా, ఇండియా) ఉన్నాయి. ప్రజలు కష్టించి పనిచేసే తత్వాన్ని కల్గి ఉంటే జనాభా తక్కువగా ఉన్నా రాజ్యం అభివృద్ధి చెందుతుంది.
2) ప్రదేశము: నిర్ణీత ప్రదేశం రాజ్యానికి అవసరం. ప్రదేశము అనగా భూమి, ప్రాదేశిక వియత్తలము (ఆకాశము) మరియు ప్రాదేశిక జలాలు (సముద్రజలాలు 12 నాటికల్ మైళ్ళ వరకు) అయితే నాల్గువైపుల భూమినే సరిహద్దుగా కల్గిన, నేపాల్, భూటాన్ వంటి రాజ్యాలకు ప్రాదేశిక జలాలు ఉండవు. వాటికి ప్రదేశము అంటే భూమి, ప్రాదేశిక వియత్తలము మాత్రమే. తక్కువ ప్రదేశం ఉన్న రాజ్యాలు ఉత్తమమైనవిగా ప్లేటో, రూసో అభిప్రాయపడ్డారు. లార్డ్ ఆక్టన్, ట్రయమ్మీలు పెద్ద ప్రదేశం కల్గిన రాజ్యాలు గొప్పవని విశ్వసించారు. అరిస్టాటిల్ రాజ్య ప్రదేశం మరీ ఎక్కువగాను, మరీ తక్కువగాను ఉండకూడదని తెల్పెను.
ప్రశ్న 2.
రాజ్యానికి గల ఇతర లక్షణాలు ఏవి ?
జవాబు:
ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారంతో పాటు రాజ్యం కొన్ని ఇతర లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అవి:
1) అంతర్జాతీయ గుర్తింపు (International Recognition): అంతర్జాతీయ గుర్తింపు అంటే ఒక రాజ్య ఉనికిని, ప్రభుత్వాన్ని ప్రపంచంలోని ఇతర రాజ్యాలు గుర్తించడం. ఆధునిక యుగంలో ప్రపంచ రాజ్యాల మధ్య సంబంధాలు పెరగడంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి. కొంతమంది రాజనీతి పండితుల అభిప్రాయంలో అంతర్జాతీయ గుర్తింపు కూడా రాజ్య మౌలిక లక్షణంగా పరిగణించడమైంది.
ప్రపంచంలోని ప్రతి రాజ్యం ఇతర సార్వభౌమ రాజ్యాల చేత గుర్తింపు పొందాలి. ఐక్యరాజ్యసమితి వంటి కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఆ రకమైన గుర్తింపును ఇస్తున్నాయి. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వమున్నదంటే ఆ రాజ్యానికి చెందిన సార్వభౌమాధికారం గుర్తించబడినట్లుగా భావించవచ్చు. ఒక కొత్త రాజ్యం ఆవిర్భవించినప్పుడు, అది మిగతా ప్రపంచ రాజ్యాలతో పాటు ఐక్యరాజ్యసమితి చేత గుర్తించబడటం అత్యంత ఆవశ్యకం.
అంతర్జాతీయ గుర్తింపు అనే లక్షణం రాజకీయ దృక్కోణంతో కూడుకొని ఉంది. 1945 లో ఐక్యరాజ్యసమితి ఏర్పడక ముందునుంచే చైనా ఒక సమగ్రమైన రాజ్యం. 1949 నాటికి చైనా కమ్యూనిస్టుల వశమైంది. ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావం వల్ల చైనా ఒక సార్వభౌమ రాజ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల చేత గుర్తించబడలేదు. చైనా-అమెరికాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధ ఛాయలు తొలగిన తరువాత 1970వ దశకంలో ఐక్యరాజ్యసమితి చైనాను ఒక సార్వభౌమ రాజ్యంగా గుర్తించింది.
2) శాశ్వతత్వం (Permanence): రాజ్యం శాశ్వతమైన సంస్థ. ప్రాచీన కాలం నుంచి పరిశీలిస్తే ప్రజలు ఏదో ఒక రాజ్యంలో ప్రజాజీవనం సాగించడంతో పాటు తమ కార్యకలాపాలను నిర్వర్తించారు. రాజ్యానికున్న శాశ్వతత్వమనే లక్షణాన్ని రూపుమాపలేం. దురాక్రమణల ద్వారా ఒక రాజ్యం మరొక రాజ్యపరమైనప్పటికీ, దాని శాశ్వతత్వం అంతరించదు. ఒక రాజ్యం మరొక రాజ్యంలో విలీనమై కొత్త రాజ్యమేర్పడితే సార్వభౌమాధికారం బదిలీ అవుతుందే తప్ప రాజ్యం అంతరించదు. ఉదాహరణకు 1990వ దశకంలో సోవియటయూనియన్ విడిపోయి 15 స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి.
3) సాధారణ విధేయత (General Obediance): రాజ్య భౌగోళిక సరిహద్దులలో నివసించే ప్రజలందరి మీద రాజ్యాధికారం చెల్లుబాటవుతుంది. రాజ్యం ప్రజల నుండి, వారు ఏర్పాటుచేసుకున్న సంస్థల నుంచి విధేయతను కోరుకుంటుంది. రాజ్యంలోని ప్రజలు, వర్గాలన్నింటికీ విధేయత సూత్రం వర్తిస్తుంది. రాజ్యంలోని ప్రజలుగాని, సంస్థలు గాని రాజ్యాధికారానికి అతీతులమని భావించడానికి వీలులేదు. ప్రజలకు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను విమర్శించే హక్కు ఉంటుందే తప్ప, రాజ్యాన్ని విమర్శించే అధికారం వారికి ఉండదు. రాజ్యాధికారానికి లోబడిఉండటం ప్రజలకు తప్పనిసరి.
4) ప్రజాభీష్టం (Popular Will): విల్లోభి ప్రకారం ప్రజాభీష్టం రాజ్యానికి గల అత్యంత ముఖ్యమైన లక్షణం. ప్రజాసమ్మతి ఉన్నంతకాలం రాజ్య మనుగడకు ప్రమాదం ఉండదు. దురాక్రమణదారుల నుంచి రాజ్యాన్ని రక్షించుకోవాలన్నా, అంతర్గతవిప్లవాల నుంచి రాజ్యాన్ని తప్పించాలన్నా పటిష్టమైన ప్రజాభీష్టం అవసరం.
3. రాజ్య ముఖ్య లక్షణాలైన ప్రభుత్వం, సార్వభౌమాధికారం గురించి మీకు తెలిసింది రాయండి. జవాబు: ప్రభుత్వము: రాజ్యము యొక్క ఏజెంట్ ప్రభుత్వం. ఇది రాజ్యం యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తుంది. రాజ్యం తరపున సార్వభౌమాధికారాన్ని వినియోగిస్తుంది. ప్రభుత్వమునకు శాసన నిర్మాణ సభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖ అను మూడు అంగములు కలవు. ప్రభుత్వం రాజ్యం కంటే ముందే ఆవిర్భవించింది. అందువలననే రాజ్యం లేకుండా ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం శాశ్వతమైన సంస్థ కాదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు అనేక రకాలు. ప్రజాస్వామ్య, నియంతృత్వ, పార్లమెంటరీ, అధ్యక్షతరహా ఏకకేంద్ర, సమాఖ్య మొదలగునవి.
సార్వభౌమాధికారము: రాజ్యం మౌలిక లక్షణాలలో అత్యంత ముఖ్యమైనది సార్వభౌమాధికారము. లాటిన్ పదమైన ‘సుప్రానస్’ నుండి సావిర్నిటీ అను ఆంగ్లపదం ఉద్భవించినది. సార్వభౌమాధికారము వలననే రాజ్యం విశిష్టమైన, అత్యున్నతమైన రాజకీయ సంస్థగా పరిగణించబడుతోంది. సార్వభౌమాధికారము వలన రాజ్యంలో నివసించే ప్రజలు పనిచేసే సంస్థలు రాజ్యానికి విధేయులై ఉండటం జరుగుతుంది. అలా విధేయత చూపించని వ్యక్తులకు, సంస్థలను రాజ్యం దండిస్తుంది. సార్వభౌమాధికారము అంతిమ అధికారం. దీనిని మించిన మరొక అధికారం రాజ్యంలో ఉండదు. ఇది విభజించుటకు, బదిలీ చేయుటకు వీలులేని అధికారము.
ప్రశ్న 4.
రాజ్యం, సమాజం మధ్యగల సంబంధాన్ని వర్ణించండి.
జవాబు:
రాజ్యానికి, సమాజానికి మధ్యగల సంబంధం (Relationship between State and Society):
1) ఒకే రకమైన లక్షణాలు (Common features): రాజ్యం, సమాజం రెండింటికి ఒకే తరహా లక్షణాలు ఉంటాయి. సాధారణంగా రాజ్యం, సమాజాలలో ప్రజలే ఉంటారు. సమాజంలోని సభ్యులే రాజ్యంలో సభ్యులుగా కొనసాగుతారు.
2) పరస్పర పూరకాలు (Complementary): రాజ్యం, సమాజం రెండూ పరస్పర పూరకాలు. ఒకదాని కొకటి సహకరించుకొంటాయి. సమాజ ప్రగతి రాజ్య ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. రాజ్య కార్యకలాపాలు లేదా పనితీరు సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి.
3) పర్యాయపదాలు (Synonymous terms): రాజ్యం, సమాజం అనే పదాలను అనేక సందర్భాలలో పర్యాయపదాలుగా వినియోగించడమైంది. గ్రీకు రాజనీతి తత్త్వవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్లు, తరువాతి కాలంలో హెగెల్, బొసాంకేలు రాజ్యం, సమాజం రెండూ ఒకటే అని భావించారు. గ్రీకు రాజనీతి పండితులు నగర రాజ్యాలను, | సమాజాన్ని పర్యాయపదాలుగా ఉపయోగించడం జరిగింది.
4) పరస్పర సంబంధం (Inter-relation): రాజ్యం, సమాజం మధ్యగల సంబంధాన్ని ఎవ్వరూ విస్మరించలేరు. రాజ్యం తాను రూపొందించిన చట్టాల ద్వారా సమాజంలో వ్యక్తుల బాహ్య ప్రవర్తనను నియంత్రిస్తుంది. సామాజిక వ్యవస్థకు విస్తృత పునాదిని ఏర్పరుస్తుంది. అందుచేత రాజ్యం సమాజాలను రెండు విభిన్న వ్యవస్థలలో విడదీయలేం. సమాజ ఆర్థిక, సాంస్కృతిక, మత, మానవతాపరమైన కార్యకలాపాల ద్వారా రాజ్యాన్ని పరిపుష్టంగావిస్తుంది.
ప్రశ్న 5.
రాజ్యం, సమాజం మధ్యగల వ్యత్యాసాలను పేర్కొనండి.
జవాబు:
రాజ్యం, సమాజం మధ్య వ్యత్యాసాలు (Differences between State and Society): రాజ్యం, సమాజాల మధ్య సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ, ఈ రెండూ ఒకదానికొకటి వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి. వాటిని కింది పట్టిక ద్వారా తెలపవచ్చు.
రాజ్యం (State)
- రాజ్యం అనేది రాజకీయ సంస్థ.
- రాజ్యం వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మాత్రమే నియంత్రిస్తుంది. ఈ విషయంలో అది కొన్ని నిబంధనలను రూపొందిస్తుంది.
- రాజ్యానికి దండనాధికారం ఉంది. రాజ్యశాసనాన్ని అతిక్రమించినవారు శిక్షార్హులుగా పరిగణించ బడతారు.
- రాజ్యం చేసే చట్టాలు రాజ్యానికి బలం చేకూరుస్తాయి.
- రాజ్యం అనేది ప్రాదేశిక సంస్థ. దానికి స్వీయ నిర్దిష్ట భూభాగం ఉంటుంది. ప్రాదేశికత అనేది రాజ్యానికి చెందిన ప్రధాన లక్షణంగా పేర్కొనవచ్చు.
- రాజ్యం ఒక్కటే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. తన సార్వభౌమాధికారాన్ని వినియోగించి ప్రజల సంబంధాలను నిర్దేశించే అనేక చట్టాలను రూపొందించి, అమలు పరుస్తుంది.
- రాజ్యం సహజంగా ఏర్పడిన సంస్థ కాదు. అది మానవనిర్మితమైంది. దానిలో సభ్యత్వం వ్యక్తులకు నిర్బంధమైంది.
- రాజ్యం సమాజంలోని అతి ముఖ్యభాగం. సమాజంలోని రాజకీయంగా వ్యవస్థీకృతమైన భాగాన్ని అది సూచిస్తుంది.
- సాంఘిక వ్యవస్థ అభివృద్ధి చెందిన రూపమే రాజ్యం. అది సమాజం నుంచి ఆవిర్భవించింది.
- రాజ్యం శాశ్వతమైంది కాకపోవచ్చు. అది అంతరించి పోయే అవకాశం ఉంది. వేరొక దానిని బలవంతంగా ఆక్రమించుకోవచ్చు.
- రాజ్య చట్టాలు, విధి, విధానాలు ఖచ్చితంగాను, స్పష్టంగాను ఉంటాయి.
- రాజ్యంలోని చట్టాలు ఒకే విధంగా ఉంటాయి. చట్టాన్ని అతిక్రమించిన వ్యక్తులందరూ తారతమ్యం లేకుండా శిక్షకు గురవుతారు.
- రాజ్యానికి ప్రభుత్వం అనే రాజకీయ వ్యవస్థ ఉంటుంది. అది రాజ్యం తరపున చట్టాలను రూపొం దించి, అమలుచేస్తుంది.
సమాజం (Society)
- సమాజం అనేది సాంఘిక వ్యవస్థ.
- సమాజం మానవుల బాహ్య, అంతర్గత ప్రవర్తనలు రెండింటిని నియంత్రిస్తుంది. వ్యక్తుల సామాజిక జీవనాన్ని ఇది క్రమబద్ధం చేస్తుంది.
- సమాజానికి దండనాధికారం లేదు. సాంఘిక ఆచారాలను అతిక్రమిస్తే వారిని సమాజం శిక్షించ లేదు.
- సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు సమాజానికి బలం చేకూరుస్తాయి.
- సమాజానికి నిర్దిష్టమైన భౌగోళిక హద్దులు లేవు. అది రాజ్యం కంటే విశాలమైంది కావచ్చు లేదా చిన్నదైనా కావచ్చు. సమాజం విశ్వమంతా విస్తరించి ఉంటుంది.
- సమాజానికి నిర్బంధ అధికారాలు అంటూ ఏవీ లేవు. సమాజం మానవ సామాజిక ప్రవర్తనను క్రమబద్దం చేసే నియమాలను రూపొందించి నప్పటికీ వాటికి చట్టబద్ధత ఉండదు.
- సమాజం సహజంగా, స్వతఃసిద్ధంగా ఏర్పడిన సంస్థ. వ్యక్తులు తమ విచక్షణను అనుసరించి దీనిలో సభ్యులుగా కొనసాగుతారు.
- రాజ్యం కంటే సమాజం విస్తృతమైంది. అనేక సంఘాలు, సంస్థలు, వ్యవస్థల ద్వారా అది ఏర్పడి అభివృద్ధి చెందుతుంది.
- సమాజం పెద్దది. రాజ్యం దానిలో అంతర్భాగం మాత్రమే. సమాజం రాజ్యం కంటే ముందు అవతరించింది. మానవుడు స్వభావరీత్యా సంఘజీవి.
- సమాజం శాశ్వతమయంది. ఇది నిరంతరం కొనసాగుతుంది.
- సమాజ సూత్రాలు అస్పష్టమైనవి. అవి సాధారణంగా అనిర్దిష్టంగా ఉంటాయి. అవి సంప్రదాయాలు, కట్టుబాట్లపై ఆధారపడి ఉంటాయి.
- సమాజం నియమాలు ఒకే విధంగా ఉండవు. ఒకే ఒక వర్గ నియమాలకు, వేరొక వర్గ నియమాలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. వివిధ సామాజిక వర్గాలు ఒకే రకమైన నేరానికి పాల్పడితే విధించే శిక్షలు వేరువేరుగా ఉంటాయి
- సమాజ నియమాలను అమలు పరచడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగమంటూ ఏదీ లేదు. ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల ద్వారా అది మానవ ప్రవర్తనను నియంత్రిస్తుంది.
ప్రశ్న 6.
రాజ్యం, సంస్థల మధ్య సంబంధం ఏమిటో తెలపండి.
జవాబు:
రాజ్యం-సంఘాల మధ్య సంబంధం (Relationship between State and Association): రాజ్యం, సంఘం రెండూ కూడా వ్యక్తులతో కూడుకొన్న వ్వవస్థలే. రాజ్యం, సంఘంలో వ్యక్తులే సభ్యులు. ఈ రెండూ కూడా వ్యక్తుల అనేక అవసరాలను తీర్చేందుకు ఏర్పాటైనాయి. సమిష్టి ప్రయోజనాలను సాధించుకొనే లక్ష్యంతో రాజ్యం, సంఘాలు ఏర్పాటవుతాయి. రాజ్యం, సంఘంల మధ్యగల సంబంధాన్ని కింది విధంగా వివరించవచ్చు.
1) ఒకేరకమైన సభ్యత్వం (Same membership): రాజ్యం, సంఘాలు రెండూ కూడా మానవ సమూహాలే. వ్యక్తులందరూ ఆ రెండింటిలో సభ్యులుగా ఉంటారు.
2) ఉమ్మడి ప్రయోజనాలు (Common Interests): వ్యక్తులు తమ సమిష్టి ప్రయోజనాలను సాధించుకోవడానికి రాజ్యాన్ని, సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు.
3) వ్యవస్థాపరమైనవి. (Organisation): రాజ్యం, సంఘాలు రెండూ కూడా తమ ప్రయోజనాలను సాధించుకోవడానికి వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలే.
4) ప్రవర్తనా నియమావళి (Code of conduct): రాజ్యం, సంఘాలు రెండూ తమ సభ్యులను నియంత్రించేందుకుగాను ప్రవర్తనా నియమావళిని కలిగి ఉన్నాయి. అటువంటి నియమావళి సభ్యులను ఒకతాటిపైన ఉంచుతాయి. అంతేకాకుండా అది వ్యవస్థకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది.
5) కార్యనిర్వహణ శాఖ (Executive): ప్రతి రాజ్యానికి కార్యనిర్వాహకశాఖ ఉంటుంది. దీనినే ప్రభుత్వంగా పిలువబడుతుంది. ప్రతి సంఘానికి కూడా కార్యనిర్వాహక మండలి ఉండి, తమ విధివిధానాలను అమలు పరుస్తుంది.
ప్రశ్న 7.
రాజ్యం, సంస్థ మధ్యగల వ్యత్యాసాలను పేర్కొనండి.
జవాబు:
రాజ్యం, సంఘాల మధ్యగల వ్యత్యాసాలు (Differences between State and Association):
రాజ్యం (State)
- రాజ్యం సభ్యత్వం నిర్బంధమైంది.
- రాజ్యం శాశ్వతమైంది.
- రాజ్యం ప్రజలందరి శ్రేయస్సు, ప్రగతి కోసం కృషి చేస్తుంది.
- రాజ్యం అనేది భౌగోళిక సంస్థ. దానికి నిర్దిష్టమైన సరిహద్దులు ఉంటాయి.
- రాజ్యం సార్వభౌమాధికారం గల సంస్థ.
- ఒక పౌరుడికి ఒకే సమయంలో ఒక రాజ్యంలో మాత్రమే సభ్యత్వం ఉంటుంది. తనకు సభ్యత్వం ఉన్న రాజ్యం పట్ల మాత్రమే విధేయత కనబరుస్తారు.
- రాజ్య పరిధి విస్తృతమైనది.
- సంఘం కార్యకలాపాలలో రాజ్యం జోక్యం చేసు కోవచ్చు.
- రాజ్యం సంఘాల కంటే ఉన్నతమైంది.
- రాజ్యానికి పౌరులందరూ తప్పనిసరిగా విధేయులై ఉంటారు.
- ప్రపంచంలోని రాజ్యాలన్నింటికి ఒకే తరహా లక్షణాలు ఉంటాయి.
- రాజ్యం తనకున్న అధికారాన్ని చెలాయిస్తూ, రాజ్య చట్టాలను నిర్బంధంగా అమలుపరుస్తుంది.
- శాంతి భద్రతల నిర్వహణలో రాజ్యం బల ప్రయోగానికి పాల్పడవచ్చు.
సంఘాలు (Associations)
- సంఘంలో సభ్యత్వం ఐచ్ఛికమైంది.
- సంఘాలు శాశ్వతమైనవిగానూ, తాత్కాలికంగానూ ఉంటాయి.
- సంఘాలు తమ సభ్యుల ప్రయోజనాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాయి.
- సంఘాలకు ఖచ్చితమైన సరిహద్దులు ఉండవు.
- సంఘాలకు సార్వభౌమాధికారం ఉండదు.
- ఒక వ్యక్తికి ఒకేసారి అనేక సంఘాలలో సభ్యత్వం ఉండవచ్చు.
- సంఘాల పరిధి పరిమితమైంది.
- రాజ్య కార్యకలాపాలలో సంఘం జోక్యం చేసుకోరాదు.
- సంఘాలు రాజ కంటే ఉన్నతమైనవి కావు.
- సంఘాల నియమ నిబంధనలను సభ్యులు సమయం సందర్భాలను బట్టి ఆమోదించేందుకు లేదా అతిక్రమించేందుకు వీలుంటుంది.
- సంఘాలకు నిర్మాణం, స్వభావం, లక్ష్యాలు లేదా ఉద్దేశ్యాలలో వ్యత్యాసం ఉంటుంది.
- సంఘాలు తమ నియమ నిబంధనలను బలవంతంగా సభ్యులపైన రుద్దలేవు. సభ్యుల సహకారం పైన సంస్థల నియమావళి అమలు జరుపబడుతుంది.
- సభ్యుల అంగీకారంపై ఆధారపడి సంఘాలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి.
ప్రశ్న 8.
రాజ్యం, ప్రభుత్వం మధ్య ఏ విధమైన సంబంధం ఉందో తెలపండి.
జవాబు:
రాజ్యం, ప్రభుత్వం అనే పదాలను సామాన్య పరిభాషలో పర్యాయపదాలుగా ఉపయోగించడమైంది. సామాన్య ప్రజలు ఈ రెండింటిని ఒకేరకంగా పరిగణిస్తారు. అట్లాగే అనేకమంది పాలకులు రాజ్యానికి, ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని విస్మరించారు. ఉదాహరణకు ఫ్రాన్స్ చక్రవర్తి 14వ లూయీ ప్రకారం “నేనే రాజు, నేనే రాజ్యం” అని ప్రకటించాడు. రాజ్యాధికారాన్ని ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న అతడు ఈ విధంగా పరిగణించాడని చెప్పవచ్చు. రాజనీతి శాస్త్రజ్ఞులు రాజ్యం, ప్రభుత్వం మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపారు. తద్వారా అనేక క్లిష్టసమస్యలకు పరిష్కారం తెలిపారు.
రాజ్యం – ప్రభుత్వం మధ్య సంబంధం (Relationship between State and Government): రాజ్యం, ప్రభుత్వం మధ్య సంబంధాన్ని కింద చర్చించడమైంది.
1) వ్యక్తులచే ఏర్పాటు (Established by Individuals): రాజ్యం – ప్రభుత్వం రెండూ వ్యక్తులచే ఏర్పాటయినాయి. ఈ రెండు ప్రజలను రక్షించేందుకై, ప్రజల మధ్య సంబంధాలను క్రమబద్దం చేసేందుకై కృషి చేస్తాయి. వివిధ రంగాలలో ప్రజాప్రయోజనాలను పెంపొందించేందుకు అవి ఏర్పాటై, కొనసాగుతున్నాయి.
2) పరస్పర పోషకాలు (Complementary): రాజ్యాన్ని అన్ని రకాలుగా ఆచరణలో ప్రభుత్వంగా పరిగణించ డమైంది. ప్రభుత్వ కార్యకలాపాలు అన్నింటిని రాజ్యం పేరుతో నిర్వహిస్తారు. ఇంగ్లాండ్కు చెందిన స్టూవర్ట్ రాజులు, ఫ్రాన్స్కు చెందిన 14వ లూయీ చక్రవర్తి రాజ్యం, ప్రభుత్వాలను పరస్పర పోషకాలుగా భావించారు.
3) రాజ్య అభీష్టం ప్రభుత్వంచే వెల్లడవటం (Will of State expressed by the Government): ప్రభుత్వమనేది రాజ్యానికి సంబంధించిన అతి ముఖ్య లక్షణం. అది రాజ్య లక్ష్యాలు, ఆశయాలను వెల్లడించి అమలు చేస్తుంది. రాజ్య లక్షణాలను సాధించడంలో ప్రభుత్వం కీలకమైన పాత్రను నిర్వహిస్తుంది. అందువలన ‘ప్రభుత్వాన్ని రాజ్యానికి చెందిన మెదడు’ గా భావిస్తారు. రాజ్యం లక్ష్యాలను ప్రతిబింబించే చట్టాలను ప్రభుత్వం రూపొందించి, అమలుచేస్తుంది.
రాజ్యానికి చెందిన ప్రతిచర్య ప్రభుత్వచర్యగా భావించాల్సి ఉంటుందని లాస్కీ ప్రకటించాడు. రాజ్యాభిష్టం చట్టాల రూపంలో ఉంటుంది. అయితే అటువంటి చట్టాలకు జవసత్వాలు, ప్రయోజనాలను ప్రభుత్వం చేకూర్చుతుంది.
ప్రశ్న 9.
రాజ్యం, ప్రభుత్వం మధ్యగల వ్యత్యాసాలను గుర్తించండి. [Mar. ’18, ’17, ’16]
జవాబు:
రాజ్యం:
- రాజ్యం శాశ్వతమైన రాజకీయ సంస్థ. మానవ సమాజం ఉన్నంతకాలం అది ఉంటుంది.
- రాజ్యమునకు 5 లక్షణాలుంటాయి. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపు దాని లక్షణాలు.
- రాజ్యము యజమాని వంటిది.
- రాజ్యానికి సార్వభౌమాధికారం సహజంగానే ఉంటుంది. అది ఉన్నతాధికారాలు చెలాయిస్తుంది.
- ప్రపంచంలోని అన్ని రాజ్యాలకు ముఖ్య లక్షణాలు ఒక్కటే.
- పౌరులంతా రాజ్యంలో సభ్యులే. రాజ్యంలో ప్రజలకు సభ్యత్వం, తప్పనిసరిగా ఉంటుంది.
- రాజ్యానికి స్వతసిద్ధమైన రూపం లేదు. అది ప్రభుత్వ రూపంలోనే కనిపిస్తుంది.
- రాజ్యానికి ప్రదేశము ఒక ముఖ్య లక్షణము. ప్రదేశంలేని రాజ్యం ఉండదు.
- ప్రజలకు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కు లేదు.
- రాజ్యానికి మౌలికమైన అధికారాలున్నాయి.
ప్రభుత్వం:
- ప్రభుత్వం ఎన్నికల వలనగానీ, విప్లవాల వలనగానీ మారవచ్చు. అందువలన అది శాశ్వతమైనది కాదు.
- ప్రభుత్వం, రాజ్య లక్షణాలలో ఒకటి మాత్రమే. అది రాజ్య ప్రతినిధి, ఒక భాగము.
- ప్రభుత్వం రాజ్యానికి సేవకుని వంటిది. రాజ్యం పనులను ప్రభుత్వం చేస్తుంది.
- ప్రభుత్వం రాజ్యం తరపున సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తుంది.
- ప్రపంచంలో ప్రభుత్వాలన్నీ ఒకే విధమైనవి కావు. ఉదా: పార్లమెంటరీ, అధ్యక్ష తరహా యూనిటరీ, సమాఖ్య మొదలగు ప్రభుత్వాలు.
- ప్రభుత్వంలో కొద్దిమంది మాత్రమే సభ్యులు. సభ్యత్వం తప్పనిసరి కాదు.
- ప్రభుత్వము ఒక స్పష్టమైన రూపంలో కనిపిస్తుంది.
- ప్రభుత్వం నిర్దిష్ట ప్రదేశం లేకుండా పనిచేస్తుంది. అది ఎక్కడినుండైనా పనిచేస్తుంది.
- ప్రజలు తమకు నచ్చని ప్రభుత్వాన్ని ప్రతిఘటించ గలరు. న్యాయస్థానాల ద్వారా కూడా వ్యతిరేకించగలరు.
- ప్రభుత్వానికి రాజ్యాంగము ఇచ్చే అధికారాలే ఉంటాయి.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
రాజ్యానికి గల ఏవైనా రెండు నిర్వచనాలను ఉదహరించండి.
జవాబు:
‘రాజ్యం’ అనే పదాన్ని అనేకమంది రాజనీతిశాస్త్ర పండితులు అనేక రకాలుగా నిర్వచించారు. వారిలో కొందరు ఇచ్చిన నిర్వచనాలను కింది విధంగా పేర్కొనడమైంది.
- అరిస్టాటిల్: “మానవునికి సుఖప్రదమైన, గౌరవప్రదమైన జీవనాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగిన కుటుంబాలు, గ్రామాల సముదాయమే రాజ్యం”.
- బ్లంటి: “ఒక నిర్ణీత ప్రదేశంలో నివసిస్తూ రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజల సముదాయమే రాజ్యం”.
ప్రశ్న 2.
రాజ్యానికి ఎన్ని మౌలిక లక్షణాలుంటాయి? అవి ఏవి?
జవాబు:
రాజ్యానికి నాలుగు మౌలిక లక్షణాలుంటాయి. అవి:
- ప్రజలు
- ప్రదేశం
- ప్రభుత్వం
- సార్వభౌమాధికారం.
ప్రశ్న 3.
ప్రభుత్వం అంటే ‘ఏమిటి ?
జవాబు:
రాజ్యం యొక్క ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చే సాధనమే ప్రభుత్వం. ప్రభుత్వం మూడు అంగాలను కలిగి ఉంటుంది. అవి: 1) శాసనశాఖ 2) కార్యనిర్వాహక శాఖ 3) న్యాయ శాఖ.
ప్రశ్న 4.
రాజ్యానికి గల ఇతర లక్షణాలు ఎన్ని? వాటిని తెలపండి.
జవాబు:
ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారంతోపాటు రాజ్యానికి నాలుగు ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అవి:
- అంతర్జాతీయ గుర్తింపు,
- శాశ్వతత్వం,
- సాధారణ విధేయత,
- ప్రజాభీష్టం.
ప్రశ్న 5.
“సమాజం” అంటే ఏమిటి ?
జవాబు:
సమాజం ప్రాచీనమైనది. రాజ్యం కంటే ముందు ఏర్పడినది. మానవుడు సంఘజీవి. సమాజంలో మాత్రమే వ్యక్తి సంపూర్ణ వికాసాన్ని, సుఖవంతమైన జీవితాన్ని గడపగలడు. “సమిష్టి జీవనాన్ని గడుపుతున్న మానవ సముదాయమే” సమాజము. సమాజంలో సభ్యత్వం లేని మానవుడిని ఊహించలేము. వలలాగా అల్లబడిన వివిధ రకాల మానవ సంబంధాలను ‘సమాజం’ అని చెప్పవచ్చు. అయితే రాజ్యంలాగా సార్వభౌమాధికారము, దండనాధికారం ఉండదు. సాంఘిక ఆచార సంప్రదాయాల ఆధారముగా శిక్షలు ఉంటాయి.
ప్రశ్న 6.
“సంస్థ” అంటే ఏమిటి ? [Mar. 2017]
జవాబు:
“ఒక లక్ష్యసిద్ధికి గాని, కొన్ని ఆశయాల సాధనకు గాని నిర్ణీత పద్ధతిలో ఐక్యతతో కృషి చేయుటకు ఏర్పడిన వ్యక్తుల సముదాయమే సంస్థ. మానవుడు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి వివిధ రకాలైన సంస్థలను నిర్మించుకొన్నాడు. ఉదా: మత సంస్థలు, రాజకీయ సంస్థలు, ఆర్థిక సంస్థలు, సాంఘిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు మొ||నవి.
ప్రశ్న 7.
రాజ్యంలోని జనాభా గుణాత్మక ధృక్పధాన్ని వ్రాయండి.
జవాబు:
రాజ్యం జనాభా గుణాత్మకంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ఒక రాజ్యం ఎటువంటి స్వభావంగల ప్రజలను కలిగి ఉంటుంది ? అక్కడి ప్రజలు విద్యావంతులు, అక్షరాస్యులు సాంస్కృతికంగా పురోగతి సాధించినవారై ఉంటారా ? అనే అంశాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ సందర్భంలో ఉత్తమ పౌరులు, ఉత్తమ రాజ్య రూపకల్పనకు దోహదకారిగా ఉంటారని అరిస్టాటిల్ చెప్పాడు. అందుచేత రాజ్యానికి సంబంధించిన ప్రజల స్వభావం, సంస్కృతి, అంకిత భావాలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. అట్లాగే ప్రజల క్రమశిక్షణ, కష్టించి పనిచేసే గుణం, నిజాయితీ, వివేకం వంటి గుణాలను కలిగి ఉన్నట్లయితే, ఆ రాజ్యం శీఘ్రగతిన ప్రగతిని సాధించగలుగుతుంది.
ప్రశ్న 8.
రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపు అవసరమా ?
జవాబు:
అంతర్జాతీయ గుర్తింపు (International Recognition): అంతర్జాతీయ గుర్తింపు అంటే ఒక రాజ్య ఉనికిని, ప్రభుత్వాన్ని ప్రపంచంలోని ఇతర రాజ్యాలు గుర్తించడం. ఆధునిక యుగంలో ప్రపంచ రాజ్యాల మధ్య సంబంధాలు పెరగడంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి. కొంతమంది రాజనీతి పండితుల అభిప్రాయంలో అంతర్జాతీయ గుర్తింపు కూడా రాజ్య మౌలిక లక్షణంగా పరిగణించడమైంది.
ప్రపంచంలోని ప్రతి రాజ్యం ఇతర సార్వభౌమ రాజ్యాల చేత గుర్తింపు పొందాలి. ఐక్యరాజ్యసమితి వంటి కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఆ రకమైన గుర్తింపును ఇస్తున్నాయి. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వమున్నదంటే ఆ రాజ్యానికి చెందిన సార్వభౌమాధికారం గుర్తించబడినట్లుగా భావించవచ్చు. ఒక కొత్త రాజ్యం ఆవిర్భవించినప్పుడు, అది మిగతా ప్రపంచ రాజ్యాలతో పాటు ఐక్యరాజ్యసమితి చేత గుర్తించబడటం అత్యంత ఆవశ్యకం.
అంతర్జాతీయ గుర్తింపు అనే లక్షణం రాజకీయ దృక్కోణంతో కూడుకొని ఉంది. 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పడకముందు నుంచే చైనా ఒక సమగ్రమైన రాజ్యం. 1949 నాటికి చైనా కమ్యూనిస్టుల వశమైంది. ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావం వల్ల చైనా ఒక సార్వభౌమ రాజ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల చేత గుర్తించబడలేదు. చైనా-అమెరికాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధ ఛాయలు తొలగిన తరువాత 1970వ దశకంలో ఐక్యరాజ్యసమితి చైనాను ఒక సార్వభౌమరాజ్యంగా గుర్తించింది.
ప్రశ్న 9.
రాజ్యానికి గల నాలుగు ఇతర లక్షణాల పేర్లను రాయండి.
జవాబు:
- ప్రజలు
- ప్రదేశ
- ప్రభుత్వం
- సార్వభౌమాధికారం.
ప్రశ్న 10.
రాజ్యం, సమాజం మధ్యగల ఏవైనా రెండు వ్యత్యాసాలను పేర్కొనండి. [Mar. ’16]
జవాబు:
రాజ్యం (State)
- రాజ్యం అనేది రాజకీయ సంస్థ.
- రాజ్యం వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మాత్రమే నియంత్రిస్తుంది. ఈ విషయంలో అది కొన్ని నిబంధనలను రూపొందిస్తుంది.
సమాజం (Society)
- సమాజం అనేది సాంఘిక వ్యవస్థ.
- సమాజం మానవుల బాహ్య, అంతర్గత ప్రవర్తనలు రెండింటిని నియంత్రిస్తుంది. వ్యక్తుల సామాజిక జీవనాన్ని ఇది క్రమబద్ధం చేస్తుంది.
ప్రశ్న 11.
రాజ్యం, ప్రభుత్వం మధ్యగల ఏవైనా రెండు వ్యత్యాసాలను వ్రాయండి.
జవాబు:
రాజ్యం
- రాజ్యం శాశ్వతమైన రాజకీయ సంస్థ. మానవ సమాజం ఉన్నంతకాలం అది ఉంటుంది.
- రాజ్యమునకు 5 లక్షణాలుంటాయి. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపు దాని లక్షణాలు.
ప్రభుత్వం
- ప్రభుత్వం ఎన్నికల వలన గానీ, విప్లవాల వలన గానీ మారవచ్చు.’ అందువలన అది శాశ్వత మైనది కాదు.
- ప్రభుత్వం, రాజ్య లక్షణాలలో ఒకటి మాత్రమే. అది రాజ్య ప్రతినిధి, ఒక భాగము.
ప్రశ్న 12.
ప్రభుత్వ అంగాలు ఎన్ని ? వాటి విధులను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ప్రభుత్వంలో మూడు అంగాలుంటాయి. అవి:
- శాసనశాఖ: ఇది పరిపాలనకు కావలసిన శాసనాలను రూపొందిస్తుంది.
- కార్యనిర్వాహకశాఖ: ఇది శాసనాలను అమలుచేస్తుంది.
- న్యాయశాఖ: ఇది శాసనాలను వ్యాఖ్యానించి అవి న్యాయబద్ధంగా ఉన్నాయో లేదో చెబుతుంది. ప్రజలకు న్యాయం చేస్తుంది.
ప్రశ్న 13.
రాజ్యం, సంస్థల మధ్యగల ఏవైనా రెండు వ్యత్యాసాలను పేర్కొనండి. [Mar. ’18]
జవాబు:
రాజ్యం (State)
- రాజ్యం సభ్యత్వం నిర్బంధమైంది.
- రాజ్యం శాశ్వతమైంది.
సంఘాలు (Associations)
- సంఘంలో సభ్యత్వం ఐచ్ఛికమైంది.
- సంఘాలు శాశ్వతమైనవిగానూ, తాత్కాలికం గానూ ఉంటాయి.