Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 2nd Lesson వ్యాపార కార్యకలాపాలు Textbook Questions and Answers.
AP Inter 1st Year Commerce Study Material 2nd Lesson వ్యాపార కార్యకలాపాలు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
పరిశ్రమ అంటే ఏమిటి ? వివిధ రకాలైన పరిశ్రమలను సోదాహరణముగా వివరించండి. [T.S. Mar. ’15]
జవాబు:
వ్యాపారము తాలూకు ఉత్పాదనాంశమే పరిశ్రమ. వస్తువుల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల సమూహాన్ని పరిశ్రమగా పేర్కొనవచ్చు. వస్తువుల సేకరణ, ఉత్పత్తి, ప్రాసెసింగ్ నిర్మాణము మొదలైన వాటికి సంబంధించిన కార్యకలాపాలనే పరిశ్రమగా నిర్వచించవచ్చు.
తయారయ్యే వస్తువులు వినియోగ వస్తువులు లేదా ఉత్పాదక వస్తువులు కావచ్చు. వినియోగదారులు ఉపయోగించే వస్తువులు అనగా ఆహార పదార్థాలు, నూలు మొదలైనవి వినియోగిత వస్తువులు. ఉత్పాదక వస్తువులు అనగా ఉత్పత్తిదారులు వాటిని మరల ఉత్పత్తికి ఉపయోగించేవి. ఉదా : యంత్రాలు, పరికరాలు, ఎక్విప్మెంట్ మొ||నవి.
పరిశ్రమలను సాధారణముగా దిగువ విధాలుగా వర్గీకరించవచ్చును.
1) ప్రాథమిక పరిశ్రమ : ఈ పరిశ్రమ ప్రకృతి సహాయంతో వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో మానవుని శ్రమ చాలా తక్కువ. ఇది ప్రకృతిపై ఆధారపడినది. ఉదా : వ్యవసాయము, చేపలు పట్టుట, అటవీకరణ మొ||నవి.
2) ప్రజనన పరిశ్రమలు : ఈ పరిశ్రమలు వంశ క్రమానికి చెందుతాయి. కొన్ని జాతి మొక్కలను, పశువులను, పక్షులను పునరుత్పత్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జించే కార్యకలాపాన్ని ప్రజనన పరిశ్రమలు అంటారు. నర్సరీలు, కోళ్ళ పరిశ్రమ, పట్టు పురుగుల పెంపకము మొ||నవి ఈ పరిశ్రమల క్రిందకు వస్తాయి.
3) ఉద్గ్రహణ పరిశ్రమలు : ప్రకృతి వనరుల నుంచి వస్తువులను వెలికితీసే. కార్యకలపాలతో ముడిపడివున్న పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. ఖనిజాల త్రవ్వకము, బొగ్గు ఖనిజము, నూనె, ఇనుప ఖనిజము, అడవుల నుంచి కలప, రబ్బరు వెలికితీయడము ఉద్గ్రహణ పరిశ్రమకు ఉదాహరణలు.
4) వస్తుతయారీ పరిశ్రమలు : ముడి పదార్థాలు లేదా సగము తయారైన వస్తువుల నుంచి పూర్తిగా తయారైన వస్తువులను ఉత్పత్తి చేసేవాటిని వస్తు తయారీ పరిశ్రమలు అంటారు. ఈ వస్తు తయారీ పరిశ్రమ ప్రధానముగా కర్మాగారాలలో సాగుతూ ఉంటుంది. ఇనుము-ఉక్కు, యంత్ర పరికరాలు, సిమెంటు, వస్త్రాలు మొదలైనవాటికి సంబంధించిన పరిశ్రమలను వస్తు తయారీ పరిశ్రమలకు ఉదాహరణలుగా చెప్పవచ్చును. వస్తు తయారీ పరిశ్రమలను మరల వర్గీకరించవచ్చును.
- విశ్లేషణాత్మక పరిశ్రమలు
- ప్రక్రియాత్మక పరిశ్రమలు
- మిశ్రమ పరిశ్రమలు
- జోడింపు పరిశ్రమలు.
5) వస్తు నిర్మాణ పరిశ్రమలు : రోడ్లు, వంతెనలు, భవనాలు, కాలువలు, ప్రాజెక్టులు- మొదలైన నిర్మాణాలను చేపట్టేవాటిని వస్తు నిర్మాణ పరిశ్రమలుగా పేర్కొనవచ్చును. ఉద్గ్రహణ మరియు వస్తు తయారీ పరిశ్రమలలో తయారైన వస్తువులలో అధిక భాగము ఈ రకమైన పరిశ్రమలలో ముడిపదార్థముగా వాడతారు.
6) సేవారంగ పరిశ్రమలు : ప్రస్తుతము సేవారంగము ఒక దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నది కాబట్టి దీనిని సేవారంగ పరిశ్రమగా పేర్కొంటారు. సేవారంగ పరిశ్రమలకు చెందిన ఉదాహరణలు పరిశ్రమ, టూరిజం పరిశ్రమ, వినోద పరిశ్రమ, ఆసుపత్రులు, హోటల్, కళాశాలలు మొదలైనవి.
ప్రశ్న 2.
వాణిజ్యం అంటే ఏమిటి.? వాణిజ్యంలోని వివిధ భాగాలను పేర్కొనండి.
జవాబు:
వాణిజ్యము వస్తువుల మారకానికి సంబంధించినది. వస్తువులు ఉత్పత్తి అయ్యే స్థానము నుంచి తుది వినియోగదారునకు చేరడానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలతోను వాణిజ్యానికి సంబంధము ఉంటుంది. వస్తు సేవల పంపిణీ విధానాన్ని వాణిజ్యము అంటారు. పారిశ్రామిక ప్రపంచములో వ్యక్తుల మధ్య వస్తువుల పంపిణీ కోసము ఏర్పరచిన క్రమబద్ధమైన వ్యవస్థే వాణిజ్యమని జేమ్స్ ఫెన్సన్ నిర్వచించినాడు. వాణిజ్యము ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య సత్సంబంధాలు ఏర్పరచి వస్తువుల సరఫరా సరళముగా, సులువుగా జరగడానికి సౌకర్యాలను వాణిజ్యము ఏర్పరుస్తుంది. సులభముగా వస్తుసేవలు ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారునకు చేరవేసే ప్రక్రియలో ఉన్న అవరోధాలను తొలగించి, వస్తుసేవల ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది.
వాణిజ్యములో రెండు భాగాలు ఉంటాయి. 1. వర్తకము 2. వర్తక సదుపాయాలు. వస్తుసేవల మార్పిడికి చెందినది వర్తకము. వస్తుసేవలు వినియోగదారునకు సరఫరా అయ్యేందుకు సహాయపడే పంపిణీ మార్గమే వర్తకము వర్తకము అనేది అనేక సాధక బాధకాలతో కూడిన ప్రక్రియ. ఇందులో అనేక అవరోధాలు, అడ్డంకులు ఉన్నాయి. ఇవి వ్యక్తులకు, స్థలానికి, కాలానికి, వినిమయానికి, సమాచారమునకు సంబంధించినవి కావచ్చు. వీటిని తొలగించి, వస్తు సరఫరాను సులభతరము చేయడానికి అనేక సాధనాలు ఉన్నవి. ఈ సదుపాయాల సముదాయమే వాణిజ్యము.
1) వ్యక్తులకు సంబంధించిన అవరోధాలు : ఉత్పత్తిదారులు దేశము నలుమూలలా వ్యాపించివున్న వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను ఏర్పరచుకొనలేరు. ఉత్పత్తిదారునకు, వినియోగదారునకు మధ్య అనేకమంది మధ్యవర్తులు ఉండి వాణిజ్య కార్యకలాపాలు సులభముగా జరగడానికి సహాయపడతారు. వారు ఉత్పత్తిదారుల నుంచి సరుకును కొని, వినియోగదారులకు అమ్ముతారు.
2) స్థలానికి సంబంధించిన అవరోధాలు : వస్తువులు ‘ఒక ప్రదేశములో ఉత్పత్తి అయితే వాటిని వివిధ ప్రదేశాలకు, ఇతర దేశాలకు పంపిణీ చేయవలెను. ఉత్పత్తి ప్రదేశాలకు, వినియోగ కేంద్రాలకు దూరము పెరుగుచున్నది. ఉత్పత్తి అయిన సరుకు వినియోగదారునకు చేరవేయడానికి రవాణా తోడ్పడుతుంది.
3) కాలానికి సంబంధించిన అవరోధాలు’: ఉత్పత్తిదారులు వస్తువుల ఉత్పత్తిని డిమాండునుబట్టి చేస్తారు. కొన్ని వస్తువులను డిమాండు లేని కాలములో ఉత్పత్తిచేసి, డిమాండును అనుసరించి అమ్ముతారు. కాబట్టి అవి వినియోగమయ్యే వరకు నిల్వ చేయవలసి ఉంటుంది. గిడ్డంగుల సౌకర్యాల ద్వారా ఈ అవరోధాన్ని అధిగమించవచ్చును.
4) ద్రవ్యమునకు సంబంధించిన అవరోధాలు : వస్తూత్పత్తికి, వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉంటుంది. కొన్ని వస్తువులను సంవత్సరమంతా ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. వీటికి ద్రవ్యము అవసరము. వాణిజ్యబ్యాంకులు వీరికి ఋణాలిచ్చి ద్రవ్యానికి సంబంధించిన అవరోధాలను తొలగిస్తాయి.
5) రిస్కుకు సంబంధించిన అవరోధాలు : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశానికి సరుకును రవాణా చేసేటప్పుడు నష్టభయము ఉంటుంది. దొంగతనాలు, అగ్నిప్రమాదాలు సంభవించవచ్చును. ఈ నష్టాలను, ఆస్తులను సంరక్షించుకోవడానికి బీమా కంపెనీలు తోడ్పడతాయి.
6) సమాచారానికి సంబంధించిన అవరోధాలు : వినియోగదారులకు తమకు కావలసిన వస్తువులు ఎక్కడ ఏ విధముగా లభిస్తాయో తెలియకపోవచ్చు. వస్తువుల సమాచారాన్ని ప్రజలకు తెలియజేయటానికి వ్యాపార ప్రకటనలు ఉత్తమ సాధనాలు. వస్తువుల విక్రయానికి వ్యాపార ప్రకటనలు దోహదము చేస్తాయి.
ప్రశ్న 3.
వర్తకాన్ని నిర్వచించండి. వర్తక సదుపాయాలలో రకాలను వివరించండి.
జవాబు:
వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను వర్తకము అంటారు. వర్తకము వాణిజ్యములో ప్రధాన భాగము. వస్తుసేవల ఉత్పత్తిదారులు వాటిని వినియోగించే వినియోగదారుల వద్దకు చేర్చి, వారిమధ్య సంబంధాలను నెలకొల్పేటట్లు చేస్తుంది. అనగా ఉత్పత్తిని వినియోగములోనికి తేవటమే వర్తకము. వాణిజ్య కార్యకలాపాలన్నీ వర్తకము చుట్టూ తిరుగుతాయి.
వర్తక సదుపాయాలు : వర్తకము అనేక సాధక బాధకాలతో కూడిన ప్రక్రియ. దీనిలో అనేక అడ్డంకులు ఉంటాయి. వీటిని తొలగించి వస్తు. సరఫరాను సులభతరము ‘ చేయడానికి ఉన్న సదుపాయాలే వర్తక సదుపాయాలు. వర్తక సదుపాయాలలో రవాణా, సమాచారము, గిడ్డంగులు, బ్యాంకులు, బీమా, వ్యాపార ప్రకటనలు ఉంటాయి.
1) రవాణా : ఉత్పత్తి, వినియోగ కేంద్రాలకు మధ్యదూరము పెరుగుచున్నది. ఈ అడ్డంకిని రవాణా సౌకర్యాలు తొలగిస్తున్నవి. రవాణా వస్తువులకు స్థల ప్రయోజనాన్ని కల్గిస్తుంది. ఉత్పత్తి అయిన సరుకు వినియోగదారుల వద్దకు చేర్చడానికి రవాణా తోడ్పడుచున్నది. ఆధునిక రోడ్డు, రైలు, విమాన, సముద్రయాన రవాణా సౌకర్యాల వలన వస్తు పంపిణీ వేగముగా, భద్రముగా జరుగుతున్నది.
2) కమ్యూనికేషన్ : కమ్యూనికేషన్ అనగా ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య సమాచార మార్పిడి. ఇది నోటిమాటల రూపములో లేదా వ్రాతపూర్వకముగా ఉండవచ్చు. వ్యాపారములో ఉన్న షరతులు ‘ పరిష్కరించుకోవడానికి, సమాచారం ‘ఒకరి నుండి మరొకరికి స్పష్టంగా చేరాలి.
ఉదా : వస్తువుల ధర, డిస్కౌంట్, పరపతి సౌకర్యము మొదలైన సమాచారమును కమ్యూనికేట్ చేయవలసి ఉంటుంది. టెలిఫోన్, టెలెక్స్, టెలిగ్రాం, ఈ-మెయిల్, టెలీకాన్ఫరెన్స్ మొదలైనవి వ్యాపారస్తులు, వినియోగదారుల మధ్య సంబంధాలు నెలకొల్పడానికి తోడ్పడుచున్నవి.
3) గిడ్డంగులు : ఉత్పత్తి అయిన వస్తువులన్నీ వెంటనే అమ్ముడు కాకపోవచ్చు. వస్తూత్పత్తికి, వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉంటుంది. ఈ కాలవ్యవధిలో అమ్మకము జరిగేంతవరకు వస్తువులను గిడ్డంగులలో నిల్వచేయాలి. బియ్యము, గోధుమ మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు కొన్ని మాసములలోనే జరుగుతుంది. కాని వాటి డిమాండు సంవత్సరము పొడవునా ఉంటాయి. గొడుగులు, ఉన్ని వస్తువులను సంవత్సరమంతా ఉత్పత్తి చేసినా వాటి డిమాండు కొన్ని కాలములలోనే ఉంటుంది. కాబట్టి వస్తువులకు డిమాండు వచ్చేవరకు గిడ్డంగులలో నిల్వచేయవలసి ఉంటుంది. గిడ్డంగులు కాలప్రయోజనాన్ని కల్గిస్తాయి.
4) బీమా : సరుకులు గిడ్డంగులలో ఉన్నప్పుడు, రవాణా చేస్తున్నప్పుడు అనేక కారణాల వలన సరుకు చెడిపోవడం, ప్రమాదానికి గురికావడము జరుగుతుంది. వర్తకులకు ఇలాంటి నష్టములు కలిగినపుడు బీమా సంస్థలు రక్షణ కల్పించి, వర్తకాభివృద్ధికి తోడ్పడతాయి.
5) బ్యాంకింగ్ : వాణిజ్యము అభివృద్ధి చెందేటందుకు అవసరమైన ద్రవ్యము, పరపతి, అడ్వాన్సులను అందించే ఒక వర్తక సదుపాయమే బ్యాంకింగ్. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించుటలో బ్యాంకులు ముఖ్యమైన పాత్రను వహిస్తున్నవి. ఇది ప్రధానమైన వాణిజ్య కార్యకలాపము.
6) ప్రకటనలు : ఉత్పత్తిదారులు తాము ఉత్పత్తిచేసిన వస్తువులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రకటనల ద్వారా వినియోగదారులకు తెలియజేస్తారు. ప్రకటనలు వస్తువులను కొనుగోలు చేయాలి అనే భావనను వినియోగదారులలో కలుగజేస్తుంది. టి.వి., రేడియో, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, హోర్డింగులు, ఇంటర్నెట్ ద్వారా ప్రకటనలను అందజేయడం జరుగుతుంది.
ప్రశ్న 4.
వర్తకము, వాణిజ్యము, పరిశ్రమల మధ్య వ్యత్యాసాలను, అంతర్గత సంబంధాలను వివరించండి.
జవాబు:
వ్యాపారము అనే ప్రక్రియలో వర్తకము, వాణిజ్యము, పరిశ్రమ కూడా అంతర్భాగాలే. ఈ మూడు కార్యకలాపాల ఉద్దేశ్యము లాభాపేక్షయే. నిరంతరం పెరిగే మానవుని కోర్కెలను ‘సంతృప్తిపరచటమే.
పరిశ్రమ అనగా సంపద లేదా విలువల ఉత్పత్తి అని అర్ధము. వస్తువుల తయారీ, వ్యవసాయము, గనుల త్రవ్వకము, అడవుల పెంపకము, రవాణా మొదలైనవి పరిశ్రమలో ఇమిడివుంటాయి.
పరిశ్రమ కేవలము వస్తుసేవల ఉత్పత్తికి మాత్రమే సంబంధించినది. వాణిజ్యము ఉత్పత్తి అయిన వస్తువులను అంతిమ వినియోగదారులకు పంపిణీ చేయడానికి సంబంధించినది. అనగా వినియోగదారులకు వస్తువులను అమ్మడం అని అర్ధము. వాణిజ్యము, వర్తకము అనే పదాలను తరుచూ పర్యాయపదాలుగా వాడతారు. కాని వీటికి ప్రత్యేకమైన అర్థాలున్నవి. వర్తకము అనేది వాణిజ్యములో ప్రధాన అంశము. వర్తకము వస్తు సేవల కొనుగోలు, అమ్మకాలకు ప్రాతినిధ్యము వహిస్తుంది. వాణిజ్యము అనేది విస్తృతమైనది. ఇందులో వర్తకమే కాకుండా, వర్తక సహాయకములైన రవాణా, భీమా, బ్యాంకింగ్ మొదలైన కార్యకలాపాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఈ కార్యకలాపాలు కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను సుగమము చేస్తాయి.
వ్యాపార కార్యకలాపాలలో ప్రధాన రంగాలైన పరిశ్రమ, వాణిజ్యము ఒకటి తర్వాత మరొకటి సంభవిస్తుంది. . వర్తక, వాణిజ్యాలకు పరిశ్రమ వెన్నెముకలాంటిది. పరిశ్రమ లేనిదే వర్తకము, వర్తక సదుపాయాలు ఉండవు.. కేవలము పరిశ్రమ వలననే వ్యాపార ఉద్దేశ్యము నెరవేరదు. ఈ విధముగా పరిశ్రమ, వర్తక, వాణిజ్యాల అభివృద్ధి పరస్పరము | ఆధారపడి ఉంటాయి.
పరిశ్రమ, వాణిజ్యము, వర్తకముల మధ్యగల తేడాలు:
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
పరిశ్రమను నిర్వచించండి.
జవాబు:
వస్తు సేవల ఉత్పత్తికి చెందిన కార్యకలాపాల సమూహాన్ని స్థూలముగా పరిశ్రమ అని నిర్వచించవచ్చును. అందుబాటులో ఉన్న భౌతిక వనరులను వివిధ ప్రక్రియల ద్వారా తుది వినియోగదారుల కోర్కెలను సంతృప్తిపరచడానికి గాను వస్తు సేవల రూపములో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వస్తు సేవలను ఉత్పత్తి చేసి వినియోగదారులకు సౌకర్యవంతముగా ఆమోదయోగ్యముగా అందించడమే పారిశ్రామిక ప్రక్రియలో ఇమిడివున్న అంశము. ఫ్యాక్టరీలు, పారిశ్రామిక సంస్థలు, ప్రజోపయోగ సంస్థలు, వ్యవసాయ క్షేత్రాలు మొదలైనవి ఎన్నో వస్తు సేవలను అందిస్తున్నవి.
పరిశ్రమ ఆకార ప్రయోజనాన్ని సృష్టిస్తుంది. అంటే ఉత్పత్తి కారకాల ద్వారా తుది వినియోగదారునకు పనికివచ్చేటట్లు లభ్యమైన వనరులను వివిధ రూపాలలో అందజేస్తుంది.
పారిశ్రామిక సంస్థలు వివిధ ప్రయోజనాల నిమిత్తము రకరకాల వస్తువులను ఉత్పత్తిచేస్తాయి. వాటిని స్థూలముగా ప్రాథమిక వస్తువులు, తయారీలో ఉన్న వస్తువులు, తయారైన వస్తువులు అని విభజించవచ్చును. తయారైన వస్తువులను ఉత్పత్తి వస్తువులు, వినియోగదారు వస్తువులని కూడా విభజించవచ్చును.
ప్రశ్న 2.
వాణిజ్యం అంటే నీకేమి అర్థమైంది ?
జవాబు:
వాణిజ్యము వస్తువుల మారకానికి సంబంధించినది. వస్తువులు ఉత్పత్తి అయ్యే స్థానము నుంచి తుది వినియోగదారునకు చేరడానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలతోను వాణిజ్యానికి సంబంధము ఉంటుంది. వస్తుసేవల పంపిణీ విధానాన్ని వాణిజ్యము అంటారు. పారిశ్రామిక ప్రపంచములో వ్యక్తుల మధ్య వస్తువుల పంపిణీ కోసం ఏర్పరచిన | క్రమబద్ధమైన వ్యవస్థే వాణిజ్యమని జేమ్స్ స్టీఫెన్ సన్ నిర్వచించినాడు. వాణిజ్యము ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య సత్సంబంధాలు ఏర్పరచి వస్తువుల సరఫరా సరళముగా, సులువుగా జరగడానికి సౌకర్యాలను వాణిజ్యము ఏర్పరుస్తుంది. సులభముగా వస్తుసేవలు ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు చేరవేసే ప్రక్రియలో ఉన్న అవరోధాలను తొలగించి, వస్తుసేవల ప్రవాహాన్ని సులభతరము చేస్తుంది.
వాణిజ్యములో రెండు భాగాలు ఉంటాయి. 1. వర్తకము 2. వర్తక సదుపాయాలు. వస్తుసేవల మార్పిడికి చెందినది వర్తకము. వస్తు సేవలు వినియోగదారులకు సరఫరా అయ్యేందుకు సహాయపడే పంపిణీ మార్గమే వర్తకము. వర్తకము అనేది అనేక సాధక బాధకాలతో కూడిన ప్రక్రియ. ఇందులో అనేక అవరోధాలు, అడ్డంకులు ఉన్నాయి. ఇవి వ్యక్తులకు, స్థలానికి, కాలానికి, వినిమయమునకు, సమాచారమునకు సంబంధించినవి కావచ్చు. వీటిని తొలగించి, వస్తు సరఫరాను సులభతరము చేయడానికి అనేక సదుపాయాలున్నవి. ఈ సదుపాయాల సముదాయమే వాణిజ్యము అని చెప్పవచ్చును.
ప్రశ్న 3.
వర్తకము అంటే ఏమిటి ?
జవాబు:
వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను వర్తకము అని అంటారు. వర్తకము వాణిజ్యములో ప్రధాన భాగము. వస్తుసేవల ఉత్పత్తిదారులు వాటిని వినియోగించే వినియోగదారుల వద్దకు చేర్చి, వారి మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు తోడ్పడుతుంది. అంటే ఉత్పత్తిని వినియోగములోనికి తేవటమే వర్తకము. వాణిజ్య కార్యకలాపాలన్నీ వర్తకము చుట్టూ తిరుగుతాయి. వాణిజ్య కార్యకలాపాల వ్యాప్తికి, విజయానికి వర్తకము తోడ్పడుతుంది. వర్తకమును రెండు విధాలుగా విభజించవచ్చును.
- స్వదేశీ వర్తకము
- విదేశీ వర్తకము.
1) స్వదేశీ వర్తకము : ఒక దేశ సరిహద్దులలో జరిగే వర్తకాన్ని స్వదేశీ వర్తకము అంటారు. అమ్మకం, కొనుగోలు ఒకే దేశములో జరుగుతాయి. స్వదేశీ వర్తకాన్ని అది చేపట్టే కార్యకలాపాల ప్రాతిపదికతనుబట్టి టోకు వర్తకమని, చిల్లర వర్తకమని విభజించవచ్చును.
2) విదేశీ వర్తకము : ఇతర దేశాలతో వర్తకాన్ని కొనసాగించడాన్ని విదేశీ వర్తకము అని అంటారు. దేశ సరిహద్దులు దాటి కొనసాగించే వర్తకమే విదేశీ వర్తకము. విదేశీ వర్తకాన్ని మరల మూడు విధాలుగా విభజించవచ్చును. a) దిగుమతి వర్తకము b) ఎగుమతి వర్తకము c) మారు వర్తకము.
ప్రశ్న 4.
విదేశీ వర్తకములోని రకాలను పేర్కొనండి.
జవాబు:
ఇతర దేశాలతో వర్తకమును కొనసాగించడాన్ని విదేశీ వర్తకము అంటారు. దేశ సరిహద్దులు దాటే వర్తకమును విదేశీ వర్తకము అనవచ్చు. అనగా అమ్మకపుదారు ఒక దేశములోను, కొనుగోలుదారు మరొక దేశములోను ఉంటారు. కొనుగోలుదారు విదేశీ మారకపు ద్రవ్యాన్ని పొంది, అమ్మకపుదారుకు పంపవలెను. విదేశీ వర్తకాన్ని అంతర్జాతీయ వర్తకము అని కూడా వ్యవహరిస్తారు.
విదేశీ వర్తకాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చును.
a) దిగుమతి వర్తకము
b) ఎగుమతి వర్తకము
c) మారు వర్తకము.
a) దిగుమతి వర్తకము : ఒక దేశము మరొక దేశము నుంచి సరుకు కొనుగోలు చేయడాన్ని లేదా తెప్పించుకోవడాన్ని దిగుమతి వర్తకము అని అంటారు. ఇండియా అమెరికా నుంచి యంత్రాలను కొనుగోలు చేస్తే అది ఇండియా దృష్ట్యా దిగుమతి వర్తకము అవుతుంది.
b) ఎగుమతి వర్తకము : ఒక దేశము ఇంకొక దేశానికి సరుకును అమ్మడాన్ని ఎగుమతి వర్తకము అంటారు. ఈ రకమైన వర్తకములో వస్తువులను విదేశీయుల అవసరాలకు సరఫరా చేయడం జరుగుతుంది. ఇండియా అమెరికాకు తేయాకును అమ్మితే అది మనదేశము దృష్ట్యా ఎగుమతి వర్తకము అవుతుంది.
c) మారు వర్తకము : దీనినే ఎంట్రిపోట్ వర్తకము అంటారు. ఏదైనా ఒక దేశము తన సొంత ఉపయోగానికి కాక వేరొక దేశానికి ఎగుమతి చేసే ఉద్దేశ్యముతో మరొక దేశము నుండి సరుకును దిగుమతి చేసుకున్నట్లయితే దానిని ఎంట్రిపోట్ వర్తకము అంటారు.
ప్రశ్న 5.
పరిశ్రమల వర్గీకరణను వివరించండి.
జవాబు:
పరిశ్రమలను సాధారణముగా దిగువ విధాలుగా వర్గీకరించవచ్చు.
1) ప్రాథమిక పరిశ్రమలు : ఈ పరిశ్రమ ప్రకృతిపై ఆధారపడి, ప్రకృతి సహాయముతో వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఉదా : వ్యవసాయము, చేపలు పట్టుట, అటవీకరణ మొదలైనవి.
2) ప్రజనన పరిశ్రమలు : ఈ పరిశ్రమలు వంశ క్రమానికి చెందిన కొన్ని జాతి మొక్కలను, పశువులను, పక్షులను పునరుత్పత్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జిస్తాయి. ఉదా : నర్సరీలు, కోళ్ళ పరిశ్రమ, పట్టు పురుగుల పరిశ్రమ.
3) ఉద్గ్రహణ పరిశ్రమలు: ప్రకృతి వనరుల నుంచి వస్తువులను వెలికితీసే కార్యకలాపాలతో ముడిపడివున్న పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. ఉదా : ఖనిజాల త్రవ్వకము, బొగ్గు, ఇనుప ఖనిజము మొదలైనవి. గనుల నుంచి వెలికితీయడము మొదలైనవి.
4) వస్తు తయారీ పరిశ్రమలు : ముడిపదార్థాలు లేదా సగం తయారైన వస్తువుల నుంచి పూర్తిగా తయారైన వస్తువులుగా ఉత్పత్తిచేసే వాటిని వస్తు తయారీ పరిశ్రమలు అంటారు. ఉదా : ఇనుము – ఉక్కు, యంత్ర పరికరాలు, సిమెంటు మొదలైనవి.
5) వస్తు నిర్మాణ పరిశ్రమలు : రోడ్లు, వంతెనలు, భవనాలు, ప్రాజెక్టులు మొదలైనవాటి నిర్మాణాన్ని చేపట్టే పరిశ్రమలను వస్తు నిర్మాణ పరిశ్రమలుగా చెప్పవచ్చును.
6) సేవారంగ పరిశ్రమలు : ప్రత్యక్షముగా గాని, పరోక్షముగా గాని ప్రజలకు ఆవశ్యకమైన సేవలను అందజేసే ప్రజోపయోగ సంస్థలను సేవా పరిశ్రమలు అంటారు. ఉదా : హోటల్ పరిశ్రమ, టూరిజమ్ పరిశ్రమ మొదలైనవి.
ప్రశ్న 6.
మారు వర్తకం (ఎంట్రీపోట్) ను నిర్వచించండి.
జవాబు:
దీనినే ఎంట్రిపోట్ వర్తకము అంటారు. ఏదైనా ఒక దేశము తన సొంత ఉపయోగానికి కాక వేరొక దేశానికి ఎగుమతి చేసే ఉద్దేశ్యముతో మరొక దేశము నుండి సరుకును దిగుమతి చేసుకున్నట్లయితే దానిని ఎంట్రిపోట్ వర్తకము అంటారు.
అదనపు ప్రశ్నలు
ప్రశ్న 7.
వాణిజ్యము యొక్క ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
1) మానవుల కోర్కెలకు అంతము లేదు. వాణిజ్యము వస్తువుల పంపిణీ మార్గాన్ని సులభతరము చేసింది. ప్రపంచములో ఏ మూల ఉన్నా వినియోగదారుడు వస్తువులను కొనుక్కోగలుగుతున్నాడు.
2) జీవన ప్రమాణము అనగా సమాజములోని సభ్యులు నాణ్యమైన జీవనాన్ని గడపడమే. వాణిజ్యము వస్తువులను అవసరమయ్యే సమయములో, ప్రదేశములో, సరసమైన ధరలకు లభ్యమయ్యేటట్లు చేయడం వలన వారి జీవన ప్రమాణము పెరుగుతుంది.
3) వస్తూత్పత్తి వినియోగించడం కోసమే జరుగుతుంది. వాణిజ్యము ఉత్పత్తిదారులను, వినియోగదారులను, టోకు వర్తకుల, చిల్లర వర్తకుల మరియు వర్తక సదుపాయాల ద్వారా అనుసంధానము చేస్తుంది.
4) పరిశ్రమ, వర్తకము మరియు వాణిజ్యము అభివృద్ధి చెందడం ద్వారా వర్తక ఏజెన్సీలైన బ్యాంకింగ్, బీమా, రవాణా, ప్రకటనలు మొదలైనవి కూడా అభివృద్ధి చెంది ప్రజలకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయి.
5) ఉత్పత్తి పెరగడం ద్వారా జాతీయ ఆదాయము పెరుగుతుంది. దిగుమతులపై డ్యూటీని విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించవచ్చును.
6) వర్తక, వాణిజ్యాల అభివృద్ధి జరిగినపుడు విస్తృతి, ఆధునీకరణ ఆవశ్యకము అవుతుంది. వీటిద్వారా వర్తక సదుపాయాలైన బ్యాంకింగ్, బీమా, రవాణా మొదలైనవి విస్తృతి చెంది వాణిజ్య కార్యకలాపాలు సజావుగా జరగడానికి తోడ్పడతాయి.
7) రవాణా, సమాచార వ్యవస్థలు అభివృద్ధి చెందితే దేశాలు మిగులు వస్తువులను విదేశాలకు అమ్మి, విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించవచ్చు.
8) వెనుకబడిన దేశాలు. నైపుణ్యము గల పనివారిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవచ్చు. అలాగే అభివృద్ధి చెందిన దేశాలు ఈ దేశాల నుంచి ముడిసరుకు దిగుమతి చేసుకోవచ్చు. వెనుకబడిన దేశాలలో పారిశ్రామికీకరణ జరుగుతుంది.
ప్రశ్న 8.
వస్తు తయారీ పరిశ్రమలలో గల రకాలను తెలపండి.
జవాబు:
ముడిపదార్థాలు, సగం తయారైన వస్తువుల నుంచి పూర్తిగా తయారైన వస్తువులను ఉత్పత్తిచేసే వాటిని వస్తు. తయారీ పరిశ్రమలు అంటారు. ఇనుము-ఉక్కు, యంత్రపరికరాలు, సిమెంటు, వస్త్రాలు మొదలైనవి ఈ పరిశ్రమక ఉదాహరణలుగా చెప్పవచ్చును.
వస్తు తయారీ పరిశ్రమలో గల రకాలు :
1) విశ్లేషణాత్మక పరిశ్రమ ముఖ్యమైన ముడిపదార్థాలను వివిధ ప్రక్రియల ద్వారా విశ్లేషణ చేసి, విడ వివిధ వస్తువులను ఈ పరిశ్రమలు తయారుచేస్తాయి.
ఉదా : ముడిచమురును నూనె బావుల నుంచి తీసి, శుభ్రపరిచి, పెట్రోలు, డీజిల్, కిరోసిన్ మొదలైనవి తయారుచేయుట.
2) ప్రక్రియాత్మక పరిశ్రమలు : ముడిపదార్థాలను వివిధ దశలలో, వివిధ ప్రక్రియలను జరపడం ద్వారా వస్తువులను తయారుచేయడం ఈ పరిశ్రమల ద్వారా జరుగుతుంది.
ఉదా : వస్త్రపరిశ్రమ, కాగితం, పంచదార పరిశ్రమలు.
3) మిశ్రమ పరిశ్రమలు : వివిధ రకాల ముడిపదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో వివిధ నిష్పత్తులలో మిశ్రమము చేసి కొత్త వస్తువులను తయారుచేసే పరిశ్రమలను మిశ్రమ పరిశ్రమలు అంటారు.
ఉదా : కాంక్రీట్, జిప్సమ్, బొగ్గు కలిపి సిమెంటు తయారుచేయుట.
4) జోడింపు పరిశ్రమలు : వివిధ పరిశ్రమలలో తయారైన వస్తువులను నిర్దిష్ట పద్ధతిలో, క్రమములో జతపరిచి కొత్త వస్తువులను తయారుచేసే పరిశ్రమలను జోడింపు పరిశ్రమలు తయారుచేస్తాయి.
ఉదా : టెలివిజన్, స్కూటర్, సైకిల్ మొదలైన వస్తువులను తయారుచేసే పరిశ్రమలు.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
పరిశ్రమ
జవాబు:
వ్యాపారము తాలూకు ఉత్పాదనాంశమే పరిశ్రమ. వస్తువుల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల సమూహాన్ని పరిశ్రమగా పేర్కొనవచ్చు. వస్తువుల సేకరణ, ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిర్మాణము మొదలైనవాటికి సంబంధించిన కార్యకలాపాలను పరిశ్రమగా నిర్వచించవచ్చును.
ప్రశ్న 2.
వాణిజ్యము
జవాబు:
వాణిజ్యము వస్తువు రక్తానికి సంబంధించినది. వస్తువులు ఉత్పత్తి జరిగే ప్రదేశము నుంచి తుది వినియోగదారునకు చేరే వరకు జరిగే అన్ని కార్యకలాపాలతోను వాణిజ్యానికి సంబంధము ఉంటుంది. జేమ్స్ ఫెన్సన్ అభిప్రాయం ప్రకారము వాణిజ్యము అనగా “వస్తుసేవల మార్పిడిలో వ్యక్తులకు, స్థలానికి, కాలానికి సంబంధించి తలెత్తే అవరోధాలను తొలగించడానికి సహాయపడే కార్యకలాపాల సముదాయమే వాణిజ్యము”.
ప్రశ్న 3.
వర్తకము [T.S. Mar. ’15]
జవాబు:
వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను వర్తకము అంటారు. వర్తకము వాణిజ్యములో ప్రధాన భాగము. వస్తు సేవల ఉత్పత్తిదారులు వాటిని వినియోగించే వినియోగదారుల వద్దకు చేర్చి వారి మధ్య సంబంధాలను నెలకొల్పేటట్లు చేస్తుంది. అనగా ఉత్పత్తిని వినియోగములోనికి తేవటమే వర్తకము, వాణిజ్య కార్యకలాపాలన్నీ వర్తకము చుట్టూ తిరుగుతాయి.
ప్రశ్న 4.
స్వదేశీ వర్తకము
జవాబు:
ఒక దేశ సరిహద్దులకు లోబడి జరిపే వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను స్వదేశీ వర్తకము అంటారు. వర్తకానికి తోడ్పడే అనుషంగిక కార్యకలాపములైన రవాణా, బీమా, గిడ్డంగులు మొదలైనవి కూడా ఒక దేశానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. స్వదేశీ వర్తకాన్ని దాని స్థల పరిధి ఆధారముగా స్థానిక, ప్రాంతీయ వర్తకము అనికూడా వర్గీకరించవచ్చు.
ప్రశ్న 5.
మారు వర్తకము (ఎంట్రిపోట్)
జవాబు:
వర్తకమును ఒక దేశము నుంచి వస్తువులను దిగుమతి చేసుకొని వాటిని మరొక దేశానికి ఎగుమతి చేయడాన్ని ఎంట్రిపోట్ వర్తకము లేదా మారు వర్తకము అంటారు. ఉదా : తైవాన్ లో తయారైన కాలిక్యులేటర్లను భారతదేశము దిగుమతి చేసుకొని, వాటిని ఆఫ్రికా దేశాలకు మళ్ళీ ఎగుమతి చేయడాన్ని ఎంట్రిపోట్ వర్తకము అంటారు. ఈ ఆయా దేశాల మధ్య మంచి సంబంధాలు లేనప్పుడు, కొన్ని రవాణా తదితర సౌలభ్యాల వలన కూడా జరుగుతుంది.
ప్రశ్న 6.
రవాణా
జవాబు:
ఉత్పత్తి, వినియోగ కేంద్రాలకు మధ్యదూరము పెరుగుతున్నది. ఈ అడ్డంకిని రవాణా సౌకర్యాలు తొలగిస్తున్నవి. రవాణా వస్తువులకు స్థల ప్రయోజనాన్ని కల్గిస్తుంది. ఉత్పత్తి అయిన సరుకు వినియోగదారుల వద్దకు చేర్చడానికి రవాణా తోడ్పడుతున్నది. ఆధునిక రోడ్లు, రైలు, విమాన, సముద్రయాన రవాణా సౌకర్యాల వలన వస్తు పంపిణీ వేగముగాను, భద్రముగా జరుగుతుంది.
ప్రశ్న 7.
గిడ్డంగులలో దాయటం
జవాబు:
వస్తూత్పత్తికి, వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉంటుంది. ఈ కాలవ్యవధిలో అమ్మకము జరిగేంతవరకు వస్తువులను గిడ్డంగులలో నిల్వ చేయాలి. బియ్యము, గోధుమ మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు కొన్ని మాసాలలోనే జరుగుతుంది. కాని వాటి డిమాండు సంవత్సరమంతా ఉంటుంది. గొడుగులు, ఉన్ని వస్తువులను సంవత్సరమంతా ఉత్పత్తి చేసినా వాటి డిమాండు కొన్ని కాలాలలోనే ఉంటుంది. కాబట్టి వస్తువులకు డిమాండు వచ్చే వరకు గిడ్డంగులలో నిల్వ చేయాలి. గిడ్డంగులు కాల ప్రయోజనాన్ని కల్గిస్తాయి.
ప్రశ్న 8.
ప్రజనన పరిశ్రమలు [A.P. Mar. ’15]
జవాబు:
ఈ పరిశ్రమలు వంశ క్రమానికి చెందుతాయి. కొన్ని జాతుల మొక్కలను, పశువులను, పక్షులను పునరుత్పత్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జించే కార్యకలాపాన్ని ప్రజనన పరిశ్రమ అంటారు.. నర్సరీలు, చేపల పెంపకము, కోళ్ళ పరిశ్రమ ఇందుకు ఉదాహరణలు.
ప్రశ్న 9.
ఉద్గ్రహణ పరిశ్రమలు
జవాబు:
ప్రకృతి వనరుల నుంచి వస్తువులను వెలికితీసే కార్యకలాపాలతో ముడిపడివున్న ఉన్న పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. ఖనిజాల త్రవ్వకము, బొగ్గు, నూనె, అడవుల నుంచి కలప, రబ్బరు వెలికితీయడం ఉద్గ్రహణ పరిశ్రమలకు ఉదాహరణలు.
ప్రశ్న 10.
బ్యాంకింగ్
జవాబు:
వాణిజ్యము అభివృద్ధి చెందేందుకు అవసరమైన ద్రవ్యము, పరపతి అడ్వాన్సులను అందజేసే ఒక వర్తక సదుపాయమే బ్యాంకింగ్. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించడములో బ్యాంకులు ముఖ్యపాత్ర వహిస్తున్నవి. బ్యాంకింగ్ ఒక ప్రధానమైన వాణిజ్య కార్యకలాపము.
ప్రశ్న 11.
టోకు వర్తకము
జవాబు:
వస్తు, సేవల కొనుగోళ్ళు, అమ్మకాలు పెద్ద మొత్తములో జరిగితే దానిని టోకు వర్తకము అంటారు. – టోకు వర్తకుడు ఉత్పత్తిదారుల నుంచి పెద్ద మొత్తాలలో సరుకును కొనుగోలు చేసి చిన్న మొత్తాలలో చిల్లర వర్తకులకు అమ్ముతారు.