Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 9th Lesson వ్యాపార విత్తం మూలాధారాలు – II Textbook Questions and Answers.
AP Inter 1st Year Commerce Study Material 9th Lesson వ్యాపార విత్తం మూలాధారాలు – II
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మనదేశంలో వ్యాపారస్తులకు లభించే వివిధ వ్యాపార విత్త మూలాధారాలను వివరించండి.
జవాబు:
ఒక వ్యాపార సంస్థ తన మూలధనాన్ని వివిధ మూలాధారాల నుంచి సమకూర్చుకుంటుంది. ఏ మూలాధారము నుంచి వనరులు సమకూర్చుకొనాలి అనేది సంస్థల స్వభావము, పరిమాణం మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యాపార సంస్థ తన స్థిర మూలధన అవసరాలకు నిధులను సేకరించవలసివస్తే యాజమాన్యపు నిధుల ద్వారా, ఋణపూర్వక నిధుల ద్వారా సేకరించాలి. రోజువారీ వ్యాపార నిర్వహణ కోసం స్వల్పకాలిక నిధులను సేకరించాలి. కాల వ్యవధి ఆధారముగా నిధుల మూలాలు మూడు రకాలు.
- దీర్ఘకాలిక విత్తమూలాలు,
- మధ్యకాలిక విత్తమూలాలు,
- స్వల్పకాలిక విత్తమూలాలు.
1. దీర్ఘకాలిక విత్తమూలాలు: 5 సంవత్సరాల కాలపరిమితికి మించి సంస్థలో దీర్ఘకాలిక అవసరాలకు ఉపయోగించే నిధులను దీర్ఘకాలిక మూలధనము అంటారు. వీటి ద్వారా స్థిరాస్తుల కొనుగోలు, రోజువారీ ఖర్చులకు శాశ్వత నిర్వహణ మూలధనము, వ్యాపార విస్తరణ, ఆధునీకరణకు ఉపయోగిస్తారు.
దీర్ఘకాలిక విత్తానికి మూలాధారాలు:
- ఈక్విటీ వాటాల జారీ,
- ఆధిక్యపు వాటాల జారీ
- ఋణ పత్రాల జారీ
- నిలిపి ఉంచిన ఆర్జనలు
2. మధ్యకాలిక విత్తము: ఒక సంవత్సరము నుంచి 5 సంవత్సరాలలోపు కాలపరిమితితో సేకరించే నిధులను మధ్యకాలిక విత్తము అంటారు. దీనిని యంత్రాల ఆధునీకరణ, భారీ ప్రకటనలకు, కొత్త వస్తువులు ప్రవేశపెట్టడానికి, కొత్త శాఖలను, ప్రదర్శనశాలను ఏర్పరచుకొనడానికి ఉపయోగిస్తారు.
మధ్యకాలిక విత్తానికి మూలాధారాలు:
- పబ్లిక్ డిపాజిట్లు
- బ్యాంకుల నుంచి ఋణము
- కాలవిత్తము.
3. స్వల్పకాలిక విత్తము: ఒక సంవత్సరము కంటే తక్కువ కాలానికి అనగా స్వల్పకాలానికి అవసరమయ్యే నిధులను స్వల్పకాలిక విత్తము అంటారు. ఈ విత్తము సంస్థ యొక్క నిర్వహణ మూలధన అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇది నగదు నుంచి సరుకు, సరుకు నుంచి ఋణగ్రస్తులు మరియు నగదుగా మారుతుంది.
స్వల్పకాలిక విత్తానికి మూలాధారాలు:
- బ్యాంకు ఋణము
- వర్తక ఋణము
- వాయిదా ఋణము
- ఖాతాదారుల నుంచి అడ్వాన్సులు
- వాణిజ్య పత్రాలు
ప్రశ్న 2.
కంపెనీలకు లభించే ప్రధానమైన దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఆర్థిక వనరుల గురించి చర్చించండి.
జవాబు:
దీర్ఘకాలిక విత్త వనరులు: కంపెనీ తన దీర్ఘకాలిక ఆర్థిక వనరులను దిగువ మూలాల ద్వారా సేకరిస్తుంది. 1. వాటాలు, 2. డిబెంచర్లు, 3. నిలిపి ఉంచిన ఆర్జనలు.
1. వాటాలు: కంపెనీ వ్యవస్థలో మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా లేదా యూనిట్లుగా విభజిస్తారు. ఒక్కొక్క యూనిట్ను వాటా అంటారు. పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించడానికి కంపెనీలు రెండు రకాల వాటాలను జారీ చేస్తాయి. అవి i) ఆధిక్యపు వాటాలు ii) ఈక్విటీ వాటాలు.
i) ఆధిక్యపు వాటాలు: ఆధిక్యపు హక్కులు కలిగిన వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు. చట్టము ప్రకారం వీటికి రెండు ఆధిక్యపు హక్కులుంటాయి. ప్రతి సంవత్సరం నిర్ణీతమైన లాభాంశాలను ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా పొందే హక్కు, కంపెనీ రద్దు అయినపుడు ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా మూలధనాన్ని పొందే హక్కు ఆధిక్యపు వాటాలలో సంచిత, అసంచిత, మళ్ళీ భాగాన్ని పంచుకునే, విమోచనీయ, అవిమోచనీయ, పూచీగల, మార్పుకు వీలులేని వాటాలుగా జారీ చేసి మూలధనాన్ని సేకరిస్తాయి.
ii) ఈక్విటీ వాటాలు: వీరు కంపెనీకి యజమానులు. కారణము వీరికి ఓటింగ్ హక్కు ఉంటుంది. ఆధిక్యపు వాటాదారులకు డివిడెండ్ చెల్లించిన తర్వాత వీరికి డివిడెండ్ చెల్లిస్తారు. వీరికి చెల్లించే డివిడెండు రేటు కంపెనీ గడించే లాభాలపై ఆధారపడి ఉంటుంది. లాభాలు ఎక్కువగా ఉంటే ఎక్కువ డివిడెండు, లాభాలు రాకపోతే వీరికి డివిడెండు రాకపోవచ్చు. వీరు ఎక్కువ నష్టభయాన్ని స్వీకరిస్తారు. కంపెనీ రద్దు అయినపుడు ఋణదాతలకు, ఆధిక్యపు వాటాదారులకు, చెల్లించిన తర్వాతనే వీరికి మూలధనము వాపసు చేస్తారు. ఈక్విటీ వాటాల జారీ ద్వారా కంపెనీలు శాశ్వత మూలధనాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
2. డిబెంచర్లు: వాటా మూలధనమువలె కంపెనీ డిబెంచర్లను జారీ చేస్తుంది. డిబెంచరు కంపెనీ తీసుకున్న అప్పుకు స్వీకృతి తెలిపే పత్రము, ‘అప్పును అంగీకరిస్తూ ఆ సొమ్మును భవిష్యత్తులో ఒక నిర్ణీత కాలములో, నిర్ణీత వడ్డీతో చెల్లించడానికి అంగీకరిస్తూ కంపెనీ అధికార ముద్రతో లిఖిత పూర్వకముగా వ్రాసి జారీ చేసిన పత్రాన్ని డిబెంచరు అంటారు. ఈ పత్రాన్ని కొన్నవారిని డిబెంచర్దారులు అంటారు. ఋణధ్రువ పత్రము కంపెనీ తీసుకున్న అప్పుకు ఇచ్చే రశీదు. దీనిలో ఋణపత్రదారుని పేరు, అప్పు విలువ, అప్పు షరతులు, అప్పు తీర్చే పద్ధతి’ మొదలైన వివరాలు ఉంటాయి. కంపెనీ దీర్ఘకాలిక అవసరాలకు డిబెంచర్లను జారీ చేస్తాయి.
3. నిలిపి ఉంచిన ఆర్జనలు: సాధారణముగా ఒక కంపెనీ ఆర్జించిన లాభము మొత్తాన్ని వాటాదారులకు డివిడెండుగా పంచరు. కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాలకై వేరుగా ఉంచుతారు. ఈ మొత్తాన్ని నిలిపి ఉంచిన ఆర్జన అంటారు. కంపెనీ అంతర్గత ఆర్థిక వనరులలో ఇది చాలా ముఖ్యమైనది. ఈ విధముగా లాభాల నుంచి రిజర్వునిధిగా ఏర్పరచిన మొత్తాన్ని మూలధన వనరులుగా వినియోగించుకోవడాన్ని ‘లాభాల పునరాకర్షణ’ అంటారు.
స్వల్పకాలిక విత్తవనరులు: ఒక వ్యాపారానికి అవసరమయ్యే నిర్వహణ మూలధన అవసరాలకు స్వల్పకాలిక నిధులు అవసరము. స్వల్పకాలము అంటే ఒక సంవత్సరము కంటే తక్కువ కాలము.
స్వల్పకాలిక నిధులకు మూలాధారాలు:
1. బ్యాంకు పరపతి: వ్యాపార సంస్థలకు అవసరమయ్యే స్వల్పకాలిక వనరులను బ్యాంకులు ఋణాలు, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్ రూపములో ధనసహాయము చేస్తాయి.
ఎ) ఋణాలు: ఈ పద్ధతిలో బ్యాంకులు పెద్ద మొత్తములో అడ్వాన్సు చేస్తుంది. ఈ ఋణాలని చరాస్థులు లేదా స్థిరాస్థుల హామీ మీద మంజూరు చేస్తారు. అనుమతించిన ఋణం మొత్తంపై వడ్డీని చెల్లించాలి.
బి) క్యాష్ క్రెడిట్: ఇది ఒక పరపతి సదుపాయము సర్దుబాటు. బ్యాంకులు వ్యాపార సంస్థలకు ఒక పరిమితికి లోబడి పరపతిని మంజూరు చేస్తుంది. ఈ పరపతిలో ఎంత అవసరమో అంత మొత్తాన్నే వ్యాపార సంస్థ వాడుకుంటుంది. వడ్డీని వాడుకున్న మొత్తానికే చార్జి చేస్తారు.
సి) ఓవర్ డ్రాఫ్ట్: ఈ విత్త సదుపాయము ప్రకారము బ్యాంకరు వ్యాపార సంస్థ ఖాతాలో నిల్వ కంటే ఎక్కువ మొత్తాన్ని వాడుకునే అవకాశము కల్పిస్తుంది. దీనిని ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యము అంటారు. ఈ పరిమితిని బ్యాంకరు నిర్ణయిస్తాడు. నిల్వ కంటే మించి వాడిన మొత్తము మీదనే వడ్డీని చార్జి చేస్తారు.
2. వర్తక ఋణాలు: ఒక సంస్థ తన ఖాతాదారులకు అరువు ఇచ్చినట్లే తరుచుగా తన సప్లయిదారుల నుంచి అరువు సౌకర్యాన్ని పొందుతుంది. దీనిని వర్తకపు ఋణము అంటారు. దీనిని నగదు పూర్వకముగా ఇవ్వడం జరగదు. కాని కొనుగోలు చేసిన సరుకునకు వెంటనే నగదు చెల్లించనవసరము లేదు. ఆర్థికపుష్టి, గుడ్విల్ ఉన్న సంస్థలకు, ఖాతాదారులకు వర్తకపు ఋణాన్ని ఇస్తారు.
3. వాయిదా పరపతి: యంత్రాలు, యంత్రపరికరాలు సప్లయిదారుల నుంచి వ్యాపార సంస్థలు పరపతిని పొందవచ్చు. సాధారణముగా సప్లయిదారులు కొనుగోలు చేసిన ఆస్తుల విలువను 12 నెలలు అంతకంటే ఎక్కువ కాలానికి చెల్లించడానికి అంగీకరిస్తారు. నగదు ధరలో కొంత మొత్తము చెల్లించి, మిగిలినది కొన్ని వాయిదాలలో చెల్లించవలసి ఉంటుంది.
4. వినియోగదారుల నుంచి అడ్వాన్సులు: సాధారణముగా వ్యాపార సంస్థలు ఆర్డర్లతో పాటు కొంత మొత్తాన్ని | అడ్వాన్సుగా స్వీకరించవచ్చును. ఖాతాదారుల ఆర్డర్ ప్రకారము వారికి భవిష్యత్తులో సప్లయి చేసే వస్తువుల ధరలో కొంత భాగాన్ని వినియోగదారుల అడ్వాన్సు సూచిస్తుంది. ఇది స్వల్పకాలిక మూలధన వనరు.
5. వాణిజ్య పత్రాలు: ఒక సంస్థ స్వల్పకాలానికి నిధులను అంటే 90 రోజుల నుంచి 365రోజుల లోపు కాలవ్యవధితో సేకరించడానికి జారీ చేసే హామీ లేని ప్రామిసరీ నోటు “వాణిజ్య పత్రము”. దీనిని ఒక సంస్థ వేరొక సంస్థకు, భీమా కంపెనీలకు, బ్యాంకులకు, పెన్షన్నిధి సంస్థలకు జారీ చేస్తుంది. ఈ ఋణంపై హామీ లేనందున మంచి పరపతి రేటింగ్ ఉన్న సంస్థలే వీటిని జారీ చేస్తాయి.
ప్రశ్న 3.
ఒక వ్యాపారసంస్థ ఆర్థికావసరాలకు ఉపయోగపడే వివిధ పద్ధతులను తులనాత్మకంగా పరిశీలించండి.
జవాబు:
దీర్ఘకాలిక విత్త వనరులు: కంపెనీ తన దీర్ఘకాలిక ఆర్థిక వనరులను దిగువ మూలాల ద్వారా సేకరిస్తుంది. 1. వాటాలు, 2. డిబెంచర్లు, 3. నిలిపి ఉంచిన ఆర్జనలు.
1. వాటాలు: కంపెనీ వ్యవస్థలో మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా లేదా యూనిట్లుగా విభజిస్తారు. ఒక్కొక్క యూనిట్ను వాటా అంటారు. పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించడానికి కంపెనీలు రెండు రకాల వాటాలను జారీ చేస్తాయి. అవి i) ఆధిక్యపు వాటాలు ii) ఈక్విటీ వాటాలు.
i) ఆధిక్యపు వాటాలు: ఆధిక్యపు హక్కులు కలిగిన వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు. చట్టము ప్రకారం వీటికి రెండు ఆధిక్యపు హక్కులుంటాయి. ప్రతి సంవత్సరం నిర్ణీతమైన లాభాంశాలను ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా పొందే హక్కు, కంపెనీ రద్దు అయినపుడు ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా మూలధనాన్ని పొందే హక్కు ఆధిక్యపు వాటాలలో సంచిత, అసంచిత, మళ్ళీ భాగాన్ని పంచుకునే, విమోచనీయ, అవిమోచనీయ, పూచీగల, మార్పుకు వీలులేని వాటాలుగా జారీ చేసి మూలధనాన్ని సేకరిస్తాయి.
ii) ఈక్విటీ వాటాలు: వీరు కంపెనీకి యజమానులు. కారణము వీరికి ఓటింగ్ హక్కు ఉంటుంది. ఆధిక్యపు వాటాదారులకు డివిడెండ్ చెల్లించిన తర్వాత వీరికి డివిడెండ్ చెల్లిస్తారు. వీరికి చెల్లించే డివిడెండు రేటు కంపెనీ గడించే లాభాలపై ఆధారపడి ఉంటుంది. లాభాలు ఎక్కువగా ఉంటే ఎక్కువ డివిడెండు, లాభాలు రాకపోతే వీరికి డివిడెండు రాకపోవచ్చు. వీరు ఎక్కువ నష్టభయాన్ని స్వీకరిస్తారు. కంపెనీ రద్దు అయినపుడు ఋణదాతలకు, ఆధిక్యపు వాటాదారులకు, చెల్లించిన తర్వాతనే వీరికి మూలధనము వాపసు చేస్తారు. ఈక్విటీ వాటాల జారీ ద్వారా కంపెనీలు శాశ్వత మూలధనాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
మధ్యకాలిక విత్తము: ఒక సంవత్సరము నుంచి 5 సంవత్సరాల కాలపరిమితితో సేకరించే నిధులను మధ్యకాలిక విత్తమూలాలు అంటారు. దీనిని యంత్రాల ఆధునీకరణకు, భారీ ప్రకటనలకు, కొత్త వస్తువులను మార్కెట్లో ప్రవేశపెట్టడానికి, ప్రదర్శనశాలను ఏర్పరచుకోవడానికి ఉపయోగిస్తారు.
మధ్యకాలిక విత్తమూలాలు:
1. పబ్లిక్ డిపాజిట్లు: ఒక సంస్థ ప్రజల నుంచి నేరుగా వసూలు చేసే డిపాజిట్లను పబ్లిక్ డిపాజిట్లు అంటారు. ఈ పబ్లిక్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు బ్యాంకు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక సంస్థలో డిపాజిట్ చేయదలుచుకున్న వ్యక్తి నిర్దేశించిన నమూనాలో దరఖాస్తు పూర్తి చేసి సమర్పించవలెను. ఆ దరఖాస్తును కంపెనీ స్వీకరించి, తీసుకున్న డిపాజిట్కు సాక్ష్యముగా డిపాజిట్ రశీదును జారీ చేస్తుంది. ఇది మధ్యకాలిక, స్వల్పకాలిక అవసరాలను తీరుస్తుంది. ఈ డిపాజిట్ల వలన సంస్థకి, డిపాజిట్ చేసే వ్యక్తికి కూడా ఉపయోగకరముగా ఉంటుంది. పెట్టుబడిదారులకు డిపాజిట్లపై బ్యాంకు ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువగాను, కంపెనీకి ఈ డిపాజిట్ల సేకరణకు అయ్యే వ్యయం, బ్యాంకు నుంచి ఋణాలు పొందడానికి అయ్యే వ్యయము కంటే తక్కువగాను ఉంటుంది. పబ్లిక్ డిపాజిట్ల సేకరణను, రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది.
2. వాణిజ్య బ్యాంకులు: కంపెనీలకు అవసరమైన వివిధ అవసరాలకు వివిధ కాలపరిమితులున్న రుణాలు అందించడములో బ్యాంకులు ప్రధాన పాత్రను పోషిస్తున్నవి. బ్యాంకులు వివిధ సంస్థలకు ఋణాల ద్వారా, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్లు, వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేసుకోవడం, పరపతి లేఖలు జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సమకూరుస్తాయి. బ్యాంకులు వివిధ కారకాలపై ఆధారపడి మంజూరు చేసిన ద్రవ్య సహాయముపై వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. మంజూరు చేసిన ఋణాన్ని ఒకే మొత్తముగాగాని, వాయిదాల రూపములోగాని వసూలు చేస్తుంది. సాధారణముగా బ్యాంకులు మధ్యకాలిక, స్వల్పకాలిక అవసరాలనే తీరుస్తాయి. ఋణాన్ని పొందిన సంస్థ ఋణాన్ని పొందడానికి ఆస్తులను తాకట్టు పెట్టవలసి ఉంటుంది.
3. కౌలు ద్రవ్యము: ఒక ఆస్తికి యజమాని అయిన వ్యక్తి తన ఆస్తిని వాడుకోవడానికి వేరొకరికి హక్కును ఇచ్చి, ఆ హక్కును బదిలీ చేసినందుకుగాను కొంత ప్రతిఫలము పొందడానికి చేసుకున్న. ఒప్పందమే కౌలు ఒప్పందము. ఆస్తి యజమానికి లెస్సార్ (కౌలు యజమాని) గాను, అద్దెకు తీసుకున్న వ్యక్తిని లెస్సీ (కౌలుదారని) అని పిలుస్తారు.
కౌలుదారు ఆస్తిని వాడుకున్నందుకు నిర్ణీత కాలవ్యవధులలో యజమానికి కౌలు అద్దెను చెల్లిస్తాడు. కౌలు ఒప్పందానికి సంబంధించిన షరతులు, నిబంధనలు కౌలు ఒప్పందములో ఉంటాయి. కాలపరిమితి పూర్తికాగానే ఆస్తిపై గల హక్కులు యజమానికి బదిలీ అవుతాయి. సంస్థల ఆధునీకరణ, వినూత్నముగా మార్చడానికి అవసరమయ్యే ద్రవ్యము కౌలు ద్రవ్యము. సాంకేతిక పరిజ్ఞానములో వస్తున్న శీఘ్ర మార్పుల కారణముగా కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పాతబడి పోతాయి. కౌలు ద్రవ్యముతో నిర్ణయాలు తీసుకునే ముందు సొంత ఆస్తులను అమర్చుకోవడానికయ్యే వ్యయాన్ని కౌలుకయ్యే వ్యయముతో పోల్చి నిర్ణయాలు తీసుకోవాలి.
4. ప్రత్యేకత ఉన్న ఆర్థిక సహాయ సంస్థలు అంటే ఏమిటో వివరించండి. వాటి ఆవశ్యకతల గురించి తెలపండి.
జవాబు:
దేశములో ఆర్థిక కార్యకలాపాలు వేగముగా విస్తరించడం వలన విత్తరంగములో ఎన్నో వ్యవస్థాపూర్వక మార్పులు చోటుచేసుకున్నాయి. వర్తక, వాణిజ్యాలకు అనుగుణముగా వెంచర్ మూలధనము, క్రెడిట్ రేటింగ్, కౌలు విత్తములాంటి విత్త అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కొత్త విత్తసంస్థలు ఏర్పడినాయి. వీటిని ప్రత్యేక విత్తసంస్థలుగా వ్యవహరిస్తారు.
1. IFCI వెంచర్ మూలధన నిధుల లిమిటెడ్: కొత్త ఉద్యమదారులు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక ప్రాజెక్టులను ప్రారంభించడం కోసం వారికి వడ్డీలేని ఋణాలుగాని, తక్కువ వడ్డీకి ఋణాలుగాని ఇవ్వడం ద్వారా వారిని ప్రోత్సహించే ఉద్ద్యేశముతో 1975లో భారత పారిశ్రామిక సంస్థ I.F.C.I రిస్క్ కాపిటల్ను ప్రారంభించినది. 1988 జనవరిలో రిస్క్ కాపిటల్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ లిమిటెడ్గా మార్చడమైనది. ఈ సంస్థ ప్రాధాన్యము ఉన్న నూతన సాంకేతిక పద్ధతులు, ఉత్పత్తులు,’ ప్రక్రియలు, మార్కెట్ సేవలు, సాంకేతిక పరమైన పెంపుదల, శక్తి సంరక్షణ ఏర్పాట్లకు ప్రాధాన్యతనిస్తూ విత్తసహాయం అందిస్తుంది.
2. ICICI వెంచర్ ఫండ్స్ లిమిటెడ్: 1989లో టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక సంస్థను స్థాపించినారు. కొత్తగా సాహసంతో ప్రాజెక్టులకు విత్త సహాయము అందించడం దీని ప్రధాన ఆశయము. కంప్యూటర్లు, రసాయనాలు, పాలిమర్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెలికాం, పర్యావరణం, ఇంజనీరింగ్ రంగాలకు సహాయాన్ని అందించినది. ప్రస్తుతం ఈ సంస్థను ICICI వెంచర్ ఫండ్స్ పేరుతో పిలవబడుతున్నది.
3. టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: దేశములో పర్యాటక పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యముతో కేంద్ర ప్రభుత్వము టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడు నెలకొల్పినది. సంప్రదాయ పర్యాటక ప్రాజెక్టులకే కాకుండా అమ్యూజ్మెంట్ పార్కులు, రోప్వలు, కార్ రెంటల్ సేవలు, నీటి రవాణా, ఫెర్రీలు లాంటి సంప్రదాయేతర పర్యాటక ప్రాజెక్టులకు కూడా ఈ సంస్థ విత్త సహాయాన్ని అందిస్తుంది.
ప్రశ్న 5.
వివిధ రకాల వాటాల జారీవల్ల (ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు) కలిగే ప్రయోజనాలను, పరిమితులను విమర్శనాత్మకంగా వివరించండి.
జవాబు:
ఆధిక్యపు వాటాల వలన కలిగే ప్రయోజనాలు:
- పెట్టుబడి మీద స్థిర ఆదాయముతో పాటు, పెట్టుబడి సురక్షితముగా ఉండాలని కోరుకునే వారికి ఇవి లాభదాయకము.
- తక్కువ నష్ట భయముతో, పెట్టుబడి మీద స్థిర ఆదాయమును కోరుకునే వారికి ఈ వాటాలు అనువైనవి.
- కంపెనీ దీర్ఘకాలిక మూలధనాన్ని పొందవలసివస్తే ఈ వాటాల జారీ దోహదపడుతుంది.
- కంపెనీకి శాశ్వత మూలధనము అవసరము లేకపోతే, అభివృద్ధి తరువాత విమోచనీయ ఆధిక్యపు వాటాలను వాపసు చేయవచ్చు.
- కంపెనీకి అధిక లాభాలు వచ్చినపుడు, వీటి డివిడెండు రేటు స్థిరము కాబట్టి కంపెనీ ఈక్విటీలో ట్రేడింగ్ చేయవచ్చు.
- కంపెనీని రద్దు చేసినపుడు ఈక్విటీ వాటాదారుల కంటే ముందు ఆధిక్యపు వాటాదారులకు మూలధనం వాపసు చేస్తారు.
- ఆధిక్యపు వాటాల జారీకి ఆస్తుల తనఖా అవసరము లేదు.
ఆధిక్యపు వాటాలకు గల పరిమితులు:
- ఈ వాటాలపై డివిడెండు రేటు స్థిరము కాబట్టి కంపెనీపై శాశ్వత భారాన్ని మోపుతుంది.
- ఈ వాటాలపై ఓటింగ్ హక్కు ఉండదు, కాబట్టి ఆధిక్యపు వాటాదారులు నిర్వహణలో పాల్గొనలేరు.
- స్వభావరీత్యా ఎంతటి నష్టాన్నైనా భరించగలిగే ధైర్యసాహసాలు ఉన్న పెట్టుబడిదారులు, సముచితమైన ప్రతిఫలాన్ని పొందాలనే ఆసక్తి ఉన్నవారు ఈ ఆధిక్యపు వాటాలను అంతగా ఇష్టపడరు.
- కంపెనీ ఆస్తులపై ఈక్విటీ వాటాదారులకు ఉన్న హక్కు ఆధిక్యపు వాటా మూలధనము వలన పలచబడే అవకాశమున్నది..
- ఈక్విటీ వాటాలతో పోలిస్తే ఆధిక్యపు వాటాల జారీకయ్యే ఖర్చు తక్కువైనా డిబెంచర్లతో పోలిస్తే వీటిపై ఖర్చు ఎక్కువ.
- ఈ వాటాలపై డివిడెండును కంపెనీ లాభాలను ఆర్జించినపుడే చెల్లిస్తారు. కంపెనీకి లాభాలు రాకపోతే -పెట్టుబడిదారులకు ఎలాంటి హామీ ఉండదు. అందువలన పెట్టుబడిదారులను ఆకర్షించవు.
ఈక్విటీ వాటాల వలన కలిగే ప్రయోజనాలు:
- ఈక్విటీ వాటాలపై స్థిరమైన రేటు ప్రకారము డివిడెండ్ చెల్లించనవసరము లేదు. కంపెనీకి తగినన్ని లాభాలు వచ్చినపుడే డివిడెండ్ చెల్లిస్తారు. అందువలన కంపెనీకి శాశ్వత భారాన్ని మోపవు.
- ఈ రకమైన వాటాల జారీకి కంపెనీ ఆస్తులను తనఖా పెట్టనక్కర్లేదు.
- కంపెనీని మూసివేస్తే తప్ప ఈక్విటీ మూలధనమును వాపసు చేయనవసరము లేదు.
- ఈక్విటీ వాటాదారులు కంపెనీ యజమానులు. వీరికి ఓటు హక్కు ఉంటుంది. నిర్వహణలో పాల్గొనవచ్చు.
- కంపెనీ అధిక లాభాలు గడించినపుడు ఎక్కువ డివిడెండుతో పాటు వాటా విలువ పెరిగినందు వలన కలిగే లాభాన్ని కూడా పొందవచ్చును.
ఈక్విటీ వాటాలకు గల పరిమితులు:
- స్థిరమైన, నిలకడ ఉన్న ఆదాయాన్ని కోరుకునేవారు, ముందుచూపుగల పెట్టుబడిదారులు ఈక్విటీ వాటాలలో పెట్టుబడి పెట్టటానికి అంతగా ఇష్టపడరు.
- ఇతర వనరుల ద్వారా లభించే విత్త సేకరణకు అయ్యే వ్యయం కంటే ఈక్విటీ వాటాల ద్వారా సేకరించే నిధులకు అయ్యే వ్యయం ఎక్కువ.
- కంపెనీకి తగినంత లాభాలు రాకపోతే వీరికి డివిడెండ్ ఉండదు.
- ఎక్కువ సంఖ్యలో అదనముగా ఈక్విటీ వాటాలను జారీ చేస్తే, ఓటింగ్ హక్కులు తగ్గి, వారి ఆర్జన కూడా తగ్గుతుంది.
- ఈక్విటీ వాటాల జారీపై ఎక్కువగా ఆధారపడితే అతి మూలధనీకరణ జరిగే ప్రమాదము ఉన్నది.
- కంపెనీ ఎక్కువ లాభాలు సంపాదించినపుడు, డివిడెండ్ రేటు పెరిగి, స్పెక్యులేషన్కు దారితీయవచ్చు.
- ఎక్కువ ఈక్విటీ వాటాలు కలిగిన కొద్దిమంది కంపెనీపై నియంత్రణ సాధించవచ్చును.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
స్వల్పకాలిక విత్తానికి ఉన్న వనరులు ఏవి ? [A.P. & T.S. Mar. ’15]
జవాబు:
ఒక సంవత్సరము కంటే తక్కువ కాలానికి అనగా స్వల్ప కాలానికి అవసరమయ్యే నిధులను స్వల్పకాలిక విత్తము అంటారు. ఈ విత్తము సంస్థ యొక్క నిర్వహణ మూలధన అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇది నగదు నుంచి సరుకు, సరుకు నుంచి ఋణగ్రస్తులు మరియు నగదుగా మారుతుంది.
స్వల్పకాలిక విత్తానికి మూలాధారాలు:
1. బ్యాంకు పరపతి: వ్యాపార సంస్థలకు అవసరమయ్యే స్వల్పకాలిక వనరులను బ్యాంకులు ఋణాలు, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్ రూపములో ధనసహాయము చేస్తాయి.
ఎ) ఋణాలు: ఈ పద్ధతిలో బ్యాంకులు పెద్ద మొత్తములో అడ్వాన్సు చేస్తుంది. ఈ ఋణాలని చరాస్థులు లేదా స్థిరాస్థుల హామీ మీద మంజూరు చేస్తారు. అనుమతించిన ఋణం మొత్తంపై వడ్డీని చెల్లించాలి.
బి) క్యాష్ క్రెడిట్: ఇది ఒక పరపతి సదుపాయము సర్దుబాటు. బ్యాంకు వ్యాపార సంస్థలకు ఒక పరిమితికి లోబడి పరపతిని మంజూరు చేస్తుంది. ఈ పరపతిలో ఎంత అవసరమో అంత మొత్తాన్నే వ్యాపార సంస్థ వాడుకుంటుంది. వడ్డీని వాడుకున్న మొత్తానికే ఛార్జి చేస్తారు.
సి) ఓవర్ డ్రాఫ్ట్: ఈ విత్త సదుపాయము ప్రకారము బ్యాంకరు వ్యాపార సంస్థ ఖాతాలో నిల్వ కంటే ఎక్కువ మొత్తాన్ని వాడుకునే అవకాశము కల్పిస్తుంది. దీనిని ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యము అంటారు. ఈ పరిమితిని బ్యాంకరు నిర్ణయిస్తాడు. నిల్వ కంటే మించి వాడిన మొత్తము మీదనే వడ్డీని ఛార్జి చేస్తారు.
2. వర్తక ఋణాలు: ఒక సంస్థ తన ఖాతాదారులకు అరువు ఇచ్చినట్లే తరుచుగా తన సప్లయిదారుల నుంచి అరువు సౌకర్యాన్ని పొందుతుంది. దీనిని వర్తకపు ఋణము అంటారు. దీనిని నగదు పూర్వకముగా ఇవ్వడం జరగదు. కాని కొనుగోలు చేసిన సరుకునకు వెంటనే నగదు చెల్లించనవసరము లేదు. ఆర్థికపుష్టి, గుడ్ విల్ ఉన్న సంస్థలకు, | ఖాతాదారులకు వర్తకపు ఋణాన్ని ఇస్తారు.
3. వాయిదా. పరపతి: యంత్రాలు, యంత్రపరికరాలు సప్లయిదారుల నుంచి వ్యాపార సంస్థలు పరపతిని పొందవచ్చు. సాధారణముగా సప్లయిదారులు కొనుగోలు చేసిన ఆస్తుల విలువను 12 నెలలు అంత కంటే ఎక్కువ కాలానికి చెల్లించడానికి అంగీకరిస్తారు. నగదు ధరలో కొంత మొత్తము చెల్లించి, మిగిలినది కొన్ని వాయిదాలలో చెల్లించవలసి ఉంటుంది.
4. వినియోగదారుల నుంచి అడ్వాన్సులు: సాధారణముగా వ్యాపార సంస్థలు ఆర్డర్లతో పాటు కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా స్వీకరించవచ్చును. ఖాతాదారుల ఆర్డర్ ప్రకారము వారికి భవిష్యత్తులో సప్లయి చేసే వస్తువుల ధరలో కొంత భాగాన్ని వినియోగదారుల అడ్వాన్సు సూచిస్తుంది. ఇది స్వల్పకాలిక మూలధన వనరు.
5. వాణిజ్య పత్రాలు: ఒక సంస్థ స్వల్పకాలానికి నిధులను అంటే 90 రోజులనుంచి 365 రోజుల లోపు కాలవ్యవధితో సేకరించడానికి జారీ చేసే హామీ లేని ప్రామిసరీ నోటు “వాణిజ్య పత్రము”. దీనిని ఒక సంస్థ వేరొక సంస్థకు, భీమా కంపెనీలకు, బ్యాంకులకు, పెన్షన్నిధి సంస్థలకు జారీ చేస్తుంది. ఈ ఋణంపై హామీ లేనందున మంచి పరపతి రేటింగ్ ఉన్న సంస్థలే వీటిని జారీ చేస్తాయి.
ప్రశ్న 2.
దీర్ఘకాలిక విత్తానికి ఉన్న వనరులు ఏవి ?
జవాబు:
5 సంవత్సరాల కాలపరిమితికి మించి సంస్థలో దీర్ఘకాలిక అవసరాలకు ఉపయోగించే నిధులను దీర్ఘకాలిక మూలధనము అంటారు. వీటి ద్వారా స్థిరాస్తుల కొనుగోలు, రోజువారీ ఖర్చులకు శాశ్వత నిర్వహణ మూలధనము, వ్యాపార విస్తరణకు ఆధునీకరణకు ఉపయోగిస్తారు.
దీర్ఘకాలిక విత్తానికి మూలాధారాలు:
i) ఆధిక్యపు వాటాలు: ఆధిక్యపు హక్కులు కలిగిన వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు. చట్టము ప్రకారం వీటికి రెండు ఆధిక్యపు హక్కులుంటాయి. ప్రతి సంవత్సరం నిర్ణీతమైన లాభాంశాలను ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా పొందే హక్కు “కంపెనీ రద్దు అయినపుడు ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా మూలధనాన్ని పొందే ” హక్కు” ఆధిక్యపు వాటాలలో సంచిత, అసంచిత, మళ్ళీ భాగాన్ని పంచుకునే, విమోచనీయ, అవిమోచనీయ, పూచీగల, మార్పుకు వీలులేని వాటాలుగా జారీ చేసి మూలధనాన్ని సేకరిస్తాయి.
ii) ఈక్విటీ వాటాలు: వీరు కంపెనీకి యజమానులు. కారణము వీరికి ఓటింగ్ హక్కు ఉంటుంది. ఆధిక్యపు వాటాదారులకు డివిడెండ్ చెల్లించిన తర్వాత వీరికి డివిడెండ్ చెల్లిస్తారు. వీరికి చెల్లించే డివిడెండు రేటు కంపెనీ గడించే లాభాలపై ఆధారపడి ఉంటుంది. లాభాలు ఎక్కువగా ఉంటే ఎక్కువ డివిడెండు, లాభాలు రాకపోతే వీరికి డివిడెండు రాకపోవచ్చు. వీరు ఎక్కువ నష్టభయాన్ని స్వీకరిస్తారు. కంపెనీ రద్దు అయినపుడు ఋణదాతలకు, ఆధిక్యపు వాటాదారులకు చెల్లించిన తర్వాతనే వీరికి మూలధనము వాపసు చేస్తారు. ఈక్విటీ వాటాల జారీ ద్వారా కంపెనీలు శాశ్వత మూలధనాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
డిబెంచర్లు: వాటా మూలధనమువలె కంపెనీ డిబెంచర్లను జారీ చేస్తుంది. డిబెంచరు కంపెనీ తీసుకున్న అప్పుకు స్వీకృతి తెలిపే పత్రము, ‘అప్పును అంగీకరిస్తూ ఆ సొమ్మును భవిష్యత్తులో ఒక నిర్ణీత కాలములో, నిర్ణీత వడ్డీతో చెల్లించడానికి అంగీకరిస్తూ కంపెనీ అధికార ముద్రతో లిఖిత పూర్వకముగా వ్రాసి జారీ చేసిన పత్రాన్ని డిబెంచరు అంటారు. ఈ పత్రాన్ని కొన్నవారిని డిబెంచర్దారులు అంటారు. ఋణధ్రువ పత్రము కంపెనీ తీసుకున్న అప్పుకు ఇచ్చే రశీదు. దీనిలో ఋణపత్రదారుని పేరు, అప్పు విలువ, అప్పు షరతులు, అప్పు తీర్చే పద్ధతి మొదలైన వివరాలు ఉంటాయి. కంపెనీ దీర్ఘకాలిక అవసరాలకు డిబెంచర్లను జారీ చేస్తాయి.
3. నిలిపి ఉంచిన ఆర్జనలు: సాధారణముగా ఒక కంపెనీ ఆర్జించిన లాభము మొత్తాన్ని వాటాదారులకు డివిడెండుగా పంచరు. కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాలకై వేరుగా ఉంచుతారు. ఈ మొత్తాన్ని ‘నిలిపి ఉంచిన ఆర్జన’ అంటారు. కంపెనీ అంతర్గత ఆర్థిక వనరులలో ఇది చాలా ‘ముఖ్యమైనది. ఈ విధముగా లాభాల నుంచి రిజర్వునిధిగా ఏర్పరచిన మొత్తాన్ని మూలధన వనరులుగా వినియోగించుకోవడాన్ని ‘లాభాల పునరాకర్షణ’ అంటారు.
ప్రశ్న 3.
మధ్యకాలిక విత్తానికి ఉన్న వనరులు ఏవి ?
జవాబు:
ఒక సంవత్సరము నుంచి 5 సంవత్సరాలలోపు కాలపరిమితితో సేకరించే నిధులను మధ్యకాలిక విత్తము అంటారు. దీనిని యంత్రాల ఆధునీకరణ, భారీప్రకటనలకు, కొత్త వస్తువులు ప్రవేశపెట్టడానికి, కొత్త శాఖలకు, ప్రదర్శనశాలను ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగిస్తారు.
మధ్యకాలిక విత్తానికి మూలాలు:
1. పబ్లిక్ డిపాజిట్లు: ఒక సంస్థ ప్రజల నుంచి నేరుగా వసూలు చేసే డిపాజిట్లను పబ్లిక్ డిపాజిట్లు అంటారు. ఈ పబ్లిక్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు బ్యాంకు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటు కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక సంస్థలో డిపాజిట్ చేయదలుచుకున్న వ్యక్తి నిర్దేశించిన నమూనాలో దరఖాస్తు పూర్తి చేసి సమర్పించవలెను. ఆ దరఖాస్తును కంపెనీ స్వీకరించి, తీసుకున్న డిపాజిటు సాక్ష్యముగా డిపాజిట్ రశీదును జారీ చేస్తుంది. ఇది మధ్యకాలిక, స్వల్పకాలిక అవసరాలను తీరుస్తుంది. ఈ డిపాజిట్ల వలన సంస్థకి, డిపాజిట్ చేసే వ్యక్తికి కూడా ఉపయోగకరముగా ఉంటుంది. పెట్టుబడిదారులకు డిపాజిట్లపై బ్యాంకు ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువగాను, కంపెనీకి ఈ డిపాజిట్ల సేకరణకు అయ్యే వ్యయం, బ్యాంకు నుంచి ఋణాలు పొందడానికి అయ్యే వ్యయము కంటే తక్కువగాను ఉంటుంది: పబ్లిక్ డిపాజిట్ల సేకరణను రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది.
2. వాణిజ్య బ్యాంకులు: కంపెనీలకు అవసరమైన వివిధ అవసరాలకు వివిధ కాలపరిమితులున్న రుణాలు అందించడములో బ్యాంకులు ప్రధాన పాత్రను పోషిస్తున్నవి. బ్యాంకులు వివిధ సంస్థలకు ఋణాల ద్వారా, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్లు, వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేసుకోవడం, పరపతి లేఖలు జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సమకూరుస్తాయి. బ్యాంకులు వివిధ కారకాలపై ఆధారపడి మంజూరు చేసిన ద్రవ్య సహాయముపై వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. మంజూరు చేసిన ఋణాన్ని ఒకే మొత్తముగాగాని, వాయిదాల రూపములోగాని వసూలు చేస్తుంది. సాధారణముగా బ్యాంకులు మధ్యకాలిక, స్వల్పకాలిక అవసరాలనే, తీరుస్తాయి. ఋణాన్ని పొందిన సంస్థ ఋణాన్ని పొందడానికి ఆస్తులను తాకట్టు పెట్టవలసి ఉంటుంది.
3. కౌలు ద్రవ్యము: ఒక ఆస్తికి యజమాని అయిన వ్యక్తి తన ఆస్తిని వాడుకోవడానికి వేరొకరికి హక్కును ఇచ్చి, ఆ హక్కును బదిలీ చేసినందుకుగాను కొంత ప్రతిఫలము పొందడానికి చేసుకున్న ఒప్పందమే కౌలు ఒప్పందము. ఆస్తి యజమానికి లెస్సార్ (కౌలు యజమాని) గాను, అద్దెకు తీసుకున్న వ్యక్తిని లెస్సీ (కౌలుదారని) అని పిలుస్తారు.
కౌలుదారు ఆస్తిని వాడుకున్నందుకు నిర్ణీత కాలవ్యవధులలో యజమానికి కౌలు అద్దెను చెల్లిస్తాడు. కౌలు ఒప్పందానికి సంబంధించిన షరతులు, నిబంధనలు కౌలు ఒప్పందములో ఉంటాయి. కాలపరిమితి పూర్తికాగానే ఆస్తిపై గల హక్కులు యజమానికి బదిలీ అవుతాయి. సంస్థల ఆధునీకరణ, వినూత్నముగా మార్చడానికి అవసరమయ్యే ద్రవ్యము కౌలు ద్రవ్యము. సాంకేతిక పరిజ్ఞానములో వస్తున్న శీఘ్ర మార్పుల కారణముగా కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పాతబడి పోతాయి. కౌలు ద్రవ్యముతో నిర్ణయాలు తీసుకునే ముందు సొంత ఆస్తులను అమర్చుకోవడానికయ్యే వ్యయాన్ని కౌలుకయ్యే వ్యయముతో పోల్చి నిర్ణయాలు తీసుకోవాలి.
ప్రశ్న 4.
ప్రత్యేక ఆర్థిక సహాయ సంస్థల ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక సంస్థల పాత్ర కీలకమైనది. ఒక దేశ ఆర్థికాభివృద్ధి కేవలము స్వల్పకాలిక రుణ సదుపాయాన్ని అందించే సంస్థలు ఉంటే సరిపోదని వివిధ రకాలైన మూలధన స్వరూపాలతో, వివిధ ధ్యేయాలతో ప్రత్యేకీకరణలతో వివిధ సంస్థలను, పెట్టుబడి సంస్థలను స్థాపించడం జరిగినది. పారిశ్రామిక విత్తాన్ని చౌకగా, సులువుగా లభ్యమయ్యేటట్లు చూడడానికి ప్రభుత్వము అనేక కార్పొరేషన్లను స్థాపించినది. వాటిలో ముఖ్యమైనది.
1. భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు: భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకును 1964 జూలై 1న స్థాపించినారు. మన దేశములో పారిశ్రామికాభివృద్ధి కోసం ఏర్పడిన పారిశ్రామిక విత్త సంస్థలలో ఇది శిఖర సంస్థ. ప్రత్యక్ష ధన సహాయముతో పారిశ్రామిక సంస్థలకు ప్రాజెక్టు ఋణాలు, సరళ ఋణాలు, పరికరాలు కొనుగోలు చేయడానికి ఋణాల
మంజూరు, పారిశ్రామిక వాటాలు, డిబెంచర్ల జారీకి, చందాపూచీ ఇవ్వడం, పారిశ్రామిక సంస్థలు తీసుకున్న ఋణాలకు హామీలు ఇవ్వడం. పరోక్ష విత్త సహాయము అంటే పారిశ్రామిక సంస్థలకు ఇచ్చిన ఋణాలకు రీఫైనాన్సింగ్, వాటి వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేసుకుంటుంది.
2. భారత పారిశ్రామిక ద్రవ్య సహాయ సంస్థ: భారత పారిశ్రామిక ద్రవ్య సహాయక చట్టము, 1948 ప్రకారము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగినది. పరిశ్రమలకు అవసరమైన దీర్ఘకాలిక, మధ్యకాలిక ఋణాలను అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యము. మన దేశ, విదేశీ కరెన్సీలతో విత్త సహాయాన్ని చేయడం, పారిశ్రామిక సంస్థల సెక్యూరిటీలకు, ఋణాలకు చందాపూచీదారుగా ఉండడమేకాక వారి వాటాలను, బాండ్లను, ఋణపత్రములను ప్రత్యక్షముగా కొనుగోలు చేస్తుంది. మర్చంట్ బ్యాంకింగ్ సేవలు, పునరావాస కార్యక్రమాలు, కంపెనీల సంయోగాలు మొదలైనవి అందించడం ఈ సంస్థ చేస్తుంది.
3. భారత చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు: భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు 100% ప్రభుత్వ అనుబంధ సంస్థగా, పార్లమెంటులో ప్రత్యేక శాసనము ద్వారా 1990లో భారత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థను కేంద్ర ప్రభుత్వం స్థాపించినది. చిన్నతరహా పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి అవసరమయ్యే ఆర్థిక సహాయం చేసే సంస్థలలో ఇది ప్రధానమైనది. చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయము చేసే సంస్థలను సమన్వయపరచడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి, సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడటం ఈ సంస్థ ముఖ్య ధ్యేయాలు.
4. భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు ఖాయిలాపడిన (Sick) పరిశ్రమల పునర్నిర్మాణం, ఆధునీకరణ, పునర్వ్యవస్థీకరణ, విస్తరణ లాంటి కార్యకలాపాలను నిర్వర్తించడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేయడం ప్రధాన లక్ష్యముగా భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకును స్థాపించారు. 1973లో పారిశ్రామిక పునర్నిర్మాణ కార్పొరేషన్గా ప్రారంభమై 1985లో ప్రత్యేక చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వము పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంకుగాను, మరల 1997 భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకుగా స్థిరపరిచినారు.
ప్రశ్న 5.
విత్త మూలాధారముగా ఈక్విటీ వాటాలకు ఉన్న ప్రయోజనాలను, పరిమితులను వివరించండి.
జవాబు:
ఈక్విటీ వాటా వలన కలుగు ప్రయోజనాలు:
- ఈక్విటీ వాటాలపై స్థిరమైన రేటు ప్రకారము డివిడెండు చెల్లించనవసరము లేదు. కంపెనీకి తగినన్ని లాభాలు వచ్చినపుడే డివిడెండ్ చెల్లిస్తారు. అందువలన కంపెనీకి శాశ్వత భారాన్ని మోపవు.
- ఈ రకమైన వాటాల జారీకి కంపెనీ ఆస్తులను తనఖా పెట్టనక్కర్లేదు.
- కంపెనీని మూసివేస్తే తప్ప ఈక్విటీ వాటా మూలధనాన్ని వాపసు చేయనవసరము లేదు.
- ఈక్విటీ వాటాదారులు కంపెనీకి యజమానులు. వీరికి ఓటు హక్కు ఉంటుంది. నిర్వహణలో పాల్గొనవచ్చు.
- కంపెనీకి అధిక లాభాలు గడించినపుడు ఎక్కువ డివిడెండ్ తోపాటు వాటా విలువ పెరిగినందు వలన కలిగే లాభాన్ని కూడా పొందవచ్చును.
ఈక్విటీ వాటాలకు గల పరిమితులు:
- స్థిరమైన నిలకడ ఉన్న ఆదాయాన్ని కోరుకునేవారు, ముందుచూపుగల పెట్టుబడిదారులు ఈక్విటీ వాటాలలో పెట్టుబడి పెట్టడానికి అంతగా ఇష్టపడరు.
- ఇతర వనరుల ద్వారా లభించే విత్తసేకరణకు అయ్యే వ్యయము కంటే ఈక్విటీ వాటాల ద్వారా సేకరించే నిధులకు వ్యయం ఎక్కువ.
- కంపెనీకి తగినంత లాభాలు రాకపోతే వీరికి డివిడెండ్ ఉండదు.
- ఎక్కువ సంఖ్యలో అదనముగా ఈక్విటీ వాటాలను జారీచేస్తే ఓటింగ్ హక్కులు తగ్గి, వారి ఆర్జన కూడా తగ్గుతుంది.
- ఈక్విటీ వాటాల జారీపై ఎక్కువగా ఆధారపడితే అతి మూలధనీకరణ జరిగే ప్రమాదము ఉన్నది.
- కంపెనీ ఎక్కువ లాభాలు సంపాదించినపుడు డివిడెండ్ రేటు పెరిగి, స్పెక్యులేషన్కు దారి తీయవచ్చు.
- ఎక్కువ ఈక్విటీ వాటాలు గల కొద్దిమంది కంపెనీపై నియంత్రణను సాధించవచ్చు.
ప్రశ్న 6.
ఈక్విటీ వాటాలకు, ఆధిక్యపు వాటాలకు ఉన్న వ్యత్యాసాలను తెలపండి.
జవాబు:
ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలకు గల వ్యత్యాసాలు:
ప్రశ్న 7.
వాటాలకు డిబెంచర్లకు మధ్య ఉన్న తేడాలను వివరించండి. [A.P. Mar. 15]
జవాబు:
వాటాలకు, డిబెంచర్లకు మధ్య ఉన్న వ్యత్యాసము:
వాటాలు
- వాటా యాజమాన్యపు మూలధనములో ఒక భాగము.
- వాటాలపై వాటాదారులకు డివిడెండు చెల్లిస్తారు.
- విభాజనీయ లాభాలపై చెల్లించవలసిన డివిడెండ్ రేటు డైరెక్టర్ల బోర్డు నిర్ణయించిన విధముగా మారుతూ ఉంటుంది.
- వాటాదారులకు ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి వాళ్ళు కంపెనీని నియంత్రించగలరు.
- కంపెనీ తన జీవిత కాలములో వాటాలను (విమోచనీయ ఆధిక్యపు వాటాలను తప్ప) విమోచనము చేయనవసరము లేదు.
- కంపెనీ పరిసమాప్తి చెందినపుడు బయట వారికి అప్పులను చెల్లించిన తర్వాత వాటా మూలధనాన్ని చెల్లిస్తారు.
- వాటాదారులకు కంపెనీ ఆస్తులపై ఎటువంటి ఛార్జ్ ఉండదు.
- సాహసోపేతమైన పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉంటాయి.
డిబెంచర్లు
- తీసుకున్న అప్పుకు సాక్ష్యముగా డిబెంచర్ ఉంటుంది.
- డిబెంచర్లపై డిబెంచర్ దారులకు వడ్డీని చెల్లిస్తారు.
- లాభనష్టాలతో నిమిత్తము లేకుండా డిబెంచర్లపై ఒక స్థిరమైన రేటు ప్రకారము వడ్డీని చెల్లిస్తారు.
- డిబెంచర్దారులకు ఓటు హక్కు లేదు. వీరు కేవలము కంపెనీకి ఋణదాతలు మాత్రమే.
- ఒక నిర్దిష్ట కాలము తర్వాత డిబెంచర్లను విమోచనము చేయవలసి ఉంటుంది.
- వాటా మూలధనము కంటే ముందుగానే డిబెంచర్లను చెల్లించవలసి ఉంటుంది.
- డిబెంచర్దారులకు కంపెనీ ఆస్తులపై ఛార్జ్ ఉంటుంది.
- జాగ్రత్తపరులైన పెట్టుబడిదారులు ఇష్టపడతారు.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వ్యాపార విత్తం
జవాబు:
ఆధునిక వ్యాపార సంస్థలకు విత్తము ప్రధానమైనది. వ్యాపారము, విత్తము ఒకదానిపై మరొకటి ఆధారపడి పరస్పరము సహకరించుకుంటూ పని చేస్తాయి. వ్యాపార సంస్థకు అవసరమైన మూలధనాన్ని సేకరించి, భద్రపరిచి, నిర్వహించి, తద్వారా లాభార్జన లక్ష్యాన్ని సాధించుటకు సంబంధించిన కార్యకలాపములను వ్యాపార విత్తం అంటారు. ఒక వ్యాపారాన్ని ప్రారంభించటానికి, విస్తరించడానికి, మార్కెట్లో తన వాటాను పదిలపరుచుకోవడానికి ప్రతి సంస్థకు
విత్తం అవసరము.
ప్రశ్న 2.
బ్యాంకు ఋణము
జవాబు:
ఏదైనా ఆస్తిని హామీగా ఉంచుకొని, బ్యాంకు వారు కొంత నిర్దిష్ట మొత్తాన్ని నేరుగా అందజేస్తే దానిని బ్యాంకు ఋణము అంటారు. బ్యాంకు అప్పుకు సంబంధించి బ్యాంకరు ఖాతాదారుకు నిర్దిష్టమైన మొత్తాన్ని కేటాయిస్తారు. బ్యాంకువారు ఇచ్చిన అప్పును ఖాతాదారునకు నగదు రూపములోగాని, ఖాతాదారుని, ఖాతాకు జమచేయడం జరుగుతుంది. ఖాతాదారుడు అప్పు మొత్తాన్ని వాయిదాల పద్ధతిలోగాని లేదా ఒకే మొత్తముగాగాని వడ్డీ కలుపుకొని చెల్లిస్తాడు.
ప్రశ్న 3.
డిబెంచర్లు
జవాబు:
అప్పును ఒప్పుకుంటూ అధికార ముద్ర వేసి ఇచ్చిన పత్రాన్ని డిబెంచర్ అంటారు. ఈ పత్రము కంపెనీ తీసుకున్న అప్పుకు సాక్ష్యంగా ఉంటుంది. ఈ పత్రములో కంపెనీ పేరు, డిబెంచర్ దారుని పేరు, అప్పు మొత్తము, వడ్డీరేటు, కాలపరిమితి, పూచీలు, షరతులు మొదలైనవి స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది. వాటాల మాదిరిగా డిబెంచర్లను కూడా నిర్ణీతమైన విలువతో జారీ చేస్తారు. వీటిని కూడా సమమూల్యముతోగాని, ప్రీమియంతోగాని, డిస్కాంటుకు జారీ చేయవచ్చు. డిబెంచరు ముద్రిత మూల్యాన్ని దరఖాస్తు, కేటాయింపు, పిలుపులపై వసూలు చేయవచ్చు. కాని ఆచరణలో డిబెంచర్ మూల్యాన్ని ఒకేసారి వసూలు చేయడం జరుగుతుంది.
ప్రశ్న 4.
వర్తక ఋణము
జవాబు:
ఒక వర్తకుడు తన ఖాతాదారులకు అరువు ఇచ్చినట్లే తరుచుగా తన సప్లయిదారుల నుంచి అరువు సౌకర్యాన్ని’ పొందుతాడు. దీనినే వర్తక ఋణము అంటారు. దీనిని నగదు పూర్వకముగా ఇవ్వడం జరగదు. కాని కొనుగోలు చేసిన సరుకునకు వెంటనే నగదు చెల్లించనవసరము లేదు. కొన్ని వాయిదాలుగా చెల్లించవచ్చు. ఆర్థిక పుష్టి, గుడ్విల్ ఉన్న సంస్థలకు, ఖాతాదారులకు వర్తకపు ఋణాన్ని ఇస్తారు.
ప్రశ్న 5.
ఈక్విటీ వాటా [A.P. Mar. ’15]
జవాబు:
యాజమాన్యపు మూలధనములో ప్రధానమైనది ఈక్విటీ వాటా మూలధనము. ప్రతి కంపెనీ మూలధన సేకరణ కోసం తప్పనిసరిగా ఈక్విటీ వాటాలను జారీ చేస్తుంది. కంపెనీ నిర్వహణ లోపాలు పంచుకునేందుకు ఓటు హక్కు కలిగిన నిజమైన యజమానులు ఈక్విటీ వాటాదారులు. కంపెనీ వైఫల్యము చెంది, నష్టాలు పొందితే అధికముగా నష్టపోయేది ఈక్విటీ వాటాదారులే. వీరికి కంపెనీ వ్యవహారాలు నిర్వహించి, నియంత్రించే డైరెక్టర్లను ఎన్నుకొనుటకు ఓటు హక్కు ఉంటుంది. డివిడెండుకు సంబంధించి ఎటువంటి ఆధిక్యతగాని, గ్యారంటీగాని లేదు. కంపెనీకి లాభాలు వస్తేనే డివిడెండు చెల్లిస్తుంది.
ప్రశ్న 6.
ఆధిక్యపు వాటా
జవాబు:
ఈక్విటీ వాటాదారుల కంటే కొన్ని ఆధిక్యమైన హక్కులు, ప్రత్యేక సదుపాయాలు కలిగి ఉన్న వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు. భారత కంపెనీల చట్టం, 1956లోని సెక్షన్ 85 ప్రకారం దిగువ పేర్కొన్న రెండు లక్షణాలు కలిగి ఉన్న వాటాలను ఆధిక్యపు వాటాలు అంటారు.
- స్థిరమైన డివిడెండు చెల్లించే విషయములో ఆధిక్యపు హక్కు కలిగి ఉండటము.
- కంపెనీ పరిసమాపన సమయములో వాటాదారులకు వారి మూలధనాన్ని తిరిగి చెల్లించడంలో ఆధిక్యపు హక్కు కలిగి ఉండటము. వీరికి డివిడెండును స్థిరమైన రేటు ఈక్విటీ వాటాదారుల కంటే ముందు చెల్లిస్తారు. అలాగే కంపెనీ రద్దయినపుడు ఈక్విటీ వాటాదారుల కంటే ముందు మూలధనము వాపసు పొందుతారు.
ప్రశ్న 7.
నిలిపి ఉంచిన ఆర్జనలు [T.S. Mar. ’15]
జవాబు:
సాధారణముగా ఒక కంపెనీ ఆర్జించిన లాభము మొత్తాన్ని వాటాదారులకు డివిడెండ్గా పంచరు. కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాలకు వేరుగా ఉంచుతారు. ఈ మొత్తాన్ని నిలిపి ఉంచిన ఆర్జనలు అంటారు. కంపెనీ అంతర్గత ఆర్థిక వనరులలో ఇది చాలా ముఖ్యమైనది. ఈ విధముగా లాభాల నుంచి రిజర్వు నిధిగా ఏర్పరచిన మొత్తాన్ని మూలధన వనరులుగా వినియోగించడాన్ని ‘లాభాల పునరాకర్షణ’ అంటారు.
ప్రశ్న 8.
విలంబిత వాటాలు
జవాబు:
విలంబిత వాటాదారులకు ఈక్విటీ వాటాదారులకు డివిడెండ్ చెల్లించిన తర్వాతనే చెల్లిస్తారు. మూలధన వాపసు విషయములో ఇదే పద్ధతిని అవలంబిస్తారు. కంపెనీపై విశ్వాసము ఎక్కువగా ఉన్నవారు ఈ వాటాలను తీసుకుంటారు. సాధారణముగా వ్యవస్థాపకులే ఈ వాటాలను తీసుకోవడం జరుగుతుంది. అందువలన వీటిని వ్యవస్థాపక వాటాలు అంటారు. 1956 భారత కంపెనీల చట్టము ప్రకారము పబ్లిక్ కంపెనీలు ఈ వాటాలను జారీ చేయడానికి వీలు లేదు. సెక్షన్, 90 (2) ప్రకారము స్వతంత్రమైన ప్రైవేటు కంపెనీలు మాత్రమే ఈ రకమైన వాటాలను జారీ చేయవచ్చును.
ప్రశ్న 9.
రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థ
జవాబు:
చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయము అందించే ఉద్దేశ్యముతో 1951లో భారతదేశ ప్రభుత్వము రాష్ట్ర ఆర్థిక సహాయక సంస్థల చట్టమును రూపొందించినది. కారణము ఈ సంస్థలకు ధన సహాయము భారత పారిశ్రామిక ఆర్థిక సంస్థ పరిధిలో లేదు. ఈ సంస్థలు నూతన కంపెనీల స్థాపనకు, అమలులో ఉన్న పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడతాయి. ప్రస్తుతము ప్రతి రాష్ట్రములో రాష్ట్ర ద్రవ్య సహాయక సంస్థలను ఏర్పాటు చేయడం జరిగినది.
ప్రశ్న 10.
వాణిజ్య బ్యాంకులు
జవాబు:
కంపెనీలకు అవసరమైన వివిధ అవసరాలకు వివిధ కాలపరిమితులున్న ఋణాలు అందించడములో వాణిజ్య బ్యాంకులు ప్రధాన పాత్రను పోషిస్తున్నవి. బ్యాంకులు వివిధ సంస్థలకు రుణాల ద్వారా క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్, వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేసుకోవడం, పరపతి లేఖలను జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సమకూరుస్తాయి. బ్యాంకు తాను మంజూరు చేసిన ద్రవ్య సహాయముపై వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఋణగ్రహీత వాణిజ్య బ్యాంకుల నుంచి ఋణాన్ని పొందడానికి హామీగా ఆస్తులను తాకట్టు పెట్టవలసి ఉంటుంది.
ప్రశ్న 11.
ద్రవ్య సహాయక సంస్థలు
జవాబు:
భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక సంస్థల పాత్ర కీలకమైనది. ఒక దేశ ఆర్థికాభివృద్ధి కేవలము స్వల్పకాలిక ఋణ సదుపాయాన్ని అందించే సంస్థలుంటే సరిపోదని, వివిధ రకాలైన మూలధన స్వరూపాలతో, వివిధ ధ్యేయాలతో, ప్రత్యేకీకరణలతో వివిధ సంస్థలను, పెట్టుబడి సంస్థలను స్థాపించడము జరిగినది. పారిశ్రామిక విత్తాన్ని చౌకగా, సులభముగా లభ్యమయ్యేటట్లు చూడడానికి ప్రభుత్వము అనేక కార్పొరేషన్లను స్థాపించడం జరిగినది.
అదనపు ప్రశ్నలు
ప్రశ్న 12.
భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు
జవాబు:
భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకును 1964 జూలై 1న స్థాపించినారు. మన దేశములో పారిశ్రామికాభివృద్ధి కోసం ఏర్పడిన పారిశ్రామిక విత్త సంస్థలలో ఇది శిఖర సంస్థ. ప్రత్యక్ష ధన సహాయముతో పారిశ్రామిక సంస్థలకు ప్రాజెక్టు ఋణాలు, సరళ ఋణాలు, పరికరాలు కొనుగోలు చేయడానికి ఋణాల మంజూరు, పారిశ్రామిక వాటాలు, డిబెంచర్ల జారీకి, చందాపూచీ ఇవ్వడం, పారిశ్రామిక సంస్థలు తీసుకున్న ఋణాలకు హామీలు ఇవ్వడం. పరోక్ష విత్త సహాయము అంటే పారిశ్రామిక సంస్థలకు ఇచ్చిన ఋణాలకు రీఫైనాన్సింగ్, వాటి వినిమయ బిల్లులను రీడిస్కౌంట్ చేసుకుంటుంది.
ప్రశ్న 13.
భారత పారిశ్రామిక ద్రవ్య సంస్థ
జవాబు:
భారత పారిశ్రామిక ద్రవ్య సహాయక చట్టము, 1948 ప్రకారము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగినది. పరిశ్రమలకు అవసరమైన దీర్ఘకాలిక, మధ్యకాలిక ఋణాలను అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యము. మన దేశ,. విదేశీ కరెన్సీలతో విత్త సహాయాన్ని చేయడం, పారిశ్రామిక సంస్థల సెక్యూరిటీలకు, ఋణాలకు చందాపూచీదారుగా ఉండడమేకాక వారి వాటాలను, బాండ్లను, ఋణపత్రములను ప్రత్యక్షముగా కొనుగోలు చేస్తుంది. మర్చంట్ బ్యాంకింగ్ సేవలు, పునరావాస కార్యక్రమాలు, కంపెనీల సంయోగాలు మొదలైనవి అందించడం ఈ సంస్థ చేస్తుంది.
ప్రశ్న 14.
భారత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ
జవాబు:
భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు 100% ప్రభుత్వ అనుబంధ సంస్థగా, పార్లమెంటులో ప్రత్యేక శాసనము ద్వారా 1990లో ‘భారత చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థను కేంద్ర ప్రభుత్వం స్థాపించినది. చిన్నతరహా పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి అవసరమయ్యే ఆర్థిక సహాయం చేసే సంస్థలలో ఇది ప్రధానమైనది. చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయము చేసే సంస్థలను సమన్వయపరచడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి, సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడటం ఈ సంస్థ ముఖ్య ధ్యేయాలు.
ప్రశ్న 15.
భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు
జవాబు:
ఖాయిలాపడిన (Sick) పరిశ్రమల పునర్నిర్మాణం, ఆధునీకరణ, పునర్వ్యవస్థీకరణ, విస్తరణ లాంటి కార్యకలాపాలను నిర్వర్తించడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేయడం ప్రధాన లక్ష్యముగా భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకును స్థాపించారు. 1973లో పారిశ్రామిక పునర్నిర్మాణ కార్పొరేషన్ ప్రారంభమై 1985లో ప్రత్యేక చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వము పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంకుగాను, మరల 1997 భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకుగా స్థిరపరిచినారు.
ప్రశ్న 16.
గ్లోబల్ డిపాజిటరీ రశీదులు
జవాబు:
విదేశీ కంపెనీలలో వాటాల కోసం ఈ గ్లోబల్ డిపాజిటరీ రశీదులను (GDR) ఒకటి కంటే ఎక్కువ దేశాలలో జారీ చేస్తారు. ఈ GDR ఒక బ్యాంకు రశీదు. ప్రపంచవ్యాప్తముగా 900 GDR లను స్టాక్ ఎక్స్ఛేంజ్లలో చేర్చబడినవి. ఈ GDR లు ఫ్రాంక్ ఫర్ట్ స్టాక్ ఎక్స్ఛేంజ్, లక్సెంబర్గ్ స్టాక్ ఎక్స్ఛేంజి, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లలో చేర్చబడినవి. ఈ GDR లు వాటాలలో వర్తకానికి అనువుగా ఉంటాయి. వీటిని పలు అంతర్జాతీయ బ్యాంకులు అంటే సిటీ బ్యాంకు, జె.పి. మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మొదలైనవి జారీ చేస్తాయి. GDR కలిగి ఉన్న వారికి ఓటింగ్ హక్కులు ఉండవు. ఈ GDR కలిగి ఉన్న వ్యక్తులు వాటిని వాటాలుగా (GDR లపై సూచించే సంఖ్య ప్రకారం) మార్చుకోవచ్చు. GDR లను ఈక్విటీ వాటాలుగా మార్చుకోవడానికి ఎలాంటి చెల్లింపులు అవసరము లేదు.