Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 2nd Lesson వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు Textbook Questions and Answers.
AP Inter 1st Year Economics Study Material 2nd Lesson వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరించి, పరిమితులను పరిశీలించండి. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
క్రమ క్షీణోపాంత ప్రయోజన సూత్రం మానవుని దైనందిన అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి కోరికను ఒక కాల వ్యవధిలో పూర్తిగా సంతృప్తిపరచవచ్చుననే ప్రాతిపదికపై ఈ సూత్రం ఆధారపడి ఉంది. ఈ సూత్రాన్ని ప్రథమంగా 1854వ సంవత్సరంలో హెచ్. హెచ్. గాసెన్ ప్రతిపాదించాడు. దీనిని గాసెన్ ప్రథమ సూత్రంగా జీవన్స్ పేర్కొన్నాడు. మార్షల్ దీనిని అభివృద్ధిపరిచాడు.
“ఒక వ్యక్తి తనవద్దనున్న వస్తు రాశిని పెంచుతూ పోతే అదనంగా చేర్చిన యూనిట్ల నుండి లభించే అదనపు ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది” అని క్షీణోపాంత ప్రయోజనాన్ని మార్షల్ నిర్వచించెను.
ఈ సూత్రాన్ని కొన్ని ప్రమేయాలపై ఆధారపడి రూపొందించడం జరిగింది.
ప్రమేయాలు:
- సిద్ధాంతం కార్డినల్ ప్రయోజన విశ్లేషణపై ఆధారపడింది. అంటే ప్రయోజనాన్ని కొలవవచ్చును, పోల్చవచ్చును.
- వస్తువు యూనిట్లు తగుమాత్రంగా ఉండి, మరీ చిన్న యూనిట్లుగాను, మరీ పెద్ద యూనిట్లుగాను ఉండరాదు.
- వినియోగించే వస్తువు వివిధ యూనిట్లు సజాతీయంగా ఉండాలి. అనగా పరిమాణం, నాణ్యత, రుచి మొదలైన విషయాలలో ఏ వ్యత్యాసం ఉండరాదు.
- ఒక యూనిట్ వినియోగానికి, మరొక యూనిట్ వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉండకూడదు.
- వినియోగదారుల అభిరుచులు, అలవాట్లలో మార్పు ఉండరాదు.
- వినియోగదారుల ఆదాయాలు మారకూడదు.
క్షీణోపాంత ప్రయోజన సూత్ర వివరణ: ఈ సూత్రం వస్తురాశి పరిమాణానికి తృప్తి లేదా ప్రయోజనానికి మధ్యగల సంబంధాన్ని వివరిస్తుంది. ఈ సూత్రం ప్రకారం ఒక వినియోగదారుడు తన వద్ద ఉన్న వస్తురాశిని పెంచుతూ పోతుంటే అదనపు యూనిట్వల్ల లభించే అదనపు లేదా ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. ఈ సూత్రాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా చూపించటం జరిగింది.
పట్టిక ప్రకారం ప్రతి అదనపు ఆపిల్ వల్ల లభించే ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది. అంటే మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరగటం గమనించవచ్చు. 6వ ఆపిల్ వల్ల మొత్తం ప్రయోజనం 82 యుటిల్స్, ఉపాంత ప్రయోజనం 2 యుటిల్స్, 7వ ఆపిల్ వినియోగం వల్ల మొత్తం ప్రయోజనంలో మార్పు లేదు. అంటే మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉంది. ఉపాంత ప్రయోజనం శూన్యం 7, 8 ఆపిల్ పండ్ల నుండి మొత్తం ప్రయోజనం క్షీణించి, ఉపాంత ప్రయోజనం ఋణాత్మకమైనది. మొత్తం ప్రయోజనానికి, ఉపాంత ప్రయోజనానికి మధ్య సంబంధం ఈ క్రింది విధంగా ఉంటుంది.
- మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరిగినప్పుడు ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది.
- మొత్తం ప్రయోజనం గరిష్టమైనపుడు ఉపాంత ప్రయోజనం శూన్యమవుతుంది.
- మొత్తం ప్రయోజనం తగ్గితే ఉపాంత ప్రయోజనం ఋణాత్మకమవుతుంది. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
పట్టికను రేఖాపటంలో T.U.C. మొత్తం ప్రయోజన రేఖ M.U.C. ఉపాంత ప్రయోజన రేఖ. X – అక్షముపై ఆపిల్ పండ్ల సంఖ్యను, Y – అక్షముపై మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం చూపించాము. వినియోగదారునికి ‘O’ యూనిట్ వద్ద మొత్తం ప్రయోజనం ‘0’ ఆపిల్స్ వినియోగం పెంచుతూ పోయిన కొద్దీ మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరిగింది. T.U.C. ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. M.U.C. క్రిందికి వాలుతున్నది. T.U.C. 7వ పండు వద్ద గరిష్టంగా ఉంది. M.U.C. X – అక్షాన్ని తాకి శూన్యమైంది. వినియోగదారుడు 7వ, 8వ పండ్లను వినియోగించటం వల్ల మొత్తం ప్రయోజనం క్షీణించింది. ఉపాంత ప్రయోజనం ఋణాత్మకమైంది.
క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం, మినహాయింపులు: కొన్ని పరిస్థితులలో అదనపు యూనిట్ల నుంచి వచ్చే ప్రయోజనం క్రమంగా క్షీణించకపోవచ్చు. వీటినే ఈ సూత్రానికి మినహాయింపులుగా చెప్పటం జరుగుతుంది. అవి:
- అపూర్వ వస్తువుల విషయంలో ఈ సూత్రం వర్తించదు. ఉదా: నాణేలు, కళాత్మక వస్తువులు, తపాలా బిళ్ళలు.
- సామాజిక వస్తువుల వినియోగంలో ఈ సూత్రం వర్తించదు. ఉదా: ఒక పట్టణంలో టెలిఫోన్ల సంఖ్య పెరిగితే, టెలిఫోను ఉపయోగించటం వల్ల కలిగే ప్రయోజనం కూడా పెరుగుతుంది.
- మత్తు పదార్థాల విషయంలో ఈ సూత్రం వర్తించదు.
- ద్రవ్యం విషయంలో ఈ సూత్రం వర్తించదని కొందరి అభిప్రాయం.
క్షీణోపాంత ప్రయోజన సిద్దాంతం – ప్రాముఖ్యం:
- డిమాండ్ సూత్రానికి ఈ సూత్రం మూలాధారం.
- విలువ సిద్ధాంతానికి కూడా ఈ సూత్రం మూలాధారం. ఉదా: నీళ్ళకు ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుంది. నీటికి వినిమయ విలువ లేదు. వజ్రాలకు ఉపయోగితా విలువ ఏమీలేదు. కాని వాటి వినిమయ విలువ ఎక్కువగా ఉంటుంది. వీటికి సమాధానం ఈ సూత్రంలో లభ్యమవుతుంది.
- ఆర్థికమంత్రి పన్నుల విధానాన్ని నిర్ణయించటంలో ఈ సూత్రం చాలా ఉపయోగకారిగా ఉంటుంది. పురోగామి పన్నుల విధానానికి ఈ సూత్రం ఆధారం.
- వినియోగదారుని మిగులు భావన ఈ సూత్రంపైననే ఆధారపడి ఉంది.
- సంపద పంపిణీకి క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఆధారమని చెప్పవచ్చు.
- వినియోగదారు, తన పరిమితమైన ఆదాయం ద్వారా ఏ విధంగా ప్రయోజనాన్ని గరిష్టం చేసుకోవచ్చునో తెలుపుతుంది.
ప్రశ్న 2.
సమోపాంత ప్రయోజన సూత్రం ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు:
సమోపాంత ప్రయోజనానికి చాలా ఆచరణీయమైన ప్రాధాన్యత ఉంది. ఆర్థిక జీవనంలో ఈ సూత్రం అనేక విధాలుగా ఉపకరిస్తుంది.
1) వినియోగం: ప్రతి వ్యక్తి తనకున్న పరిమిత ఆదాయాన్ని వివిధ వస్తువులపై ఖర్చు చేయటం ద్వారా గరిష్ట ప్రయోజనాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. వినియోగదారుడు తక్కువ ప్రయోజనం లభించే వస్తువుకు బదులు అధిక ప్రయోజనం లభించే వస్తువును ప్రతిస్థాపన చేసుకుంటూ తన పరిమిత ఆదాయాన్ని ఖర్చు చేస్తాడు. కనుక ఈ సూత్రం వినియోగదారుని గరిష్ట సంతృప్తి విశ్లేషణకు తోడ్పడుతుంది.
2) ఉత్పత్తి: ఉత్పత్తిదారుడు అనేక ఉత్పత్తి కారకాలను ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించడం ద్వారా లాభం, గరిష్ట ప్రయోజనాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. వివిధ ఉత్పత్తి కారకాల నుండి గరిష్ట లాభాలను పొందటానికి ఏ విధంగా ఉత్పత్తి కారకాలను ప్రతిస్థాపన చేస్తాడో ఈ సూత్రం విశ్లేషణ చేస్తుంది.
3) వినిమయం: ఒక వస్తువుకు బదులుగా మరో వస్తువు ద్రవ్యము ద్వారా వినిమయం చేయడంలో ఈ సూత్రం ఉపయోగపడుతుంది. వినిమయానికి ప్రాతిపదిక ప్రతిస్థాపన సిద్ధాంతము.
4) పంపిణీ: వివిధ ఉత్పత్తుల ఉత్పత్తి కారకాలకు వాటి ప్రతిఫలాలను పంపిణీ చేయటాన్ని వివరించే ‘ఉపాంత ఉత్పాదకతా సిద్ధాంతానికి’ ఈ సూత్రం ప్రాతిపదిక.
5) ప్రభుత్వ విత్తము: ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై ఖర్చు చేసేటప్పుడు సమాజపు ప్రయోజనం గరిష్టంగా ఉండాలని భావిస్తుంది. అందువల్ల అధిక ప్రయోజనం కోసం వృధా వ్యయాలను తగ్గించి ప్రభుత్వం వ్యయం చేస్తుంది.
ఇంతేకాకుండా ఆదాయ పునఃపంపిణీకి ఒక వ్యక్తి తన పొదుపు లేదా పెట్టుబడి వివిధ రకాల ఆస్తుల మధ్య విభజించటానికి ఒక వ్యక్తి తన కాలాన్ని పని, విశ్రాంతి మధ్య కేటాయించడానికి మొదలైన అంశాల విశ్లేషణకు ఈ సూత్రం తోడ్పడుతుంది. పన్నుల విధానానికి ఈ సూత్రం సహాయపడుతుంది.
6) ఆదాయ పునఃపంపిణీ, వ్యయ విధానం: సంపన్నులపై ఎక్కువ స్థాయిలో పన్నులు విధించి, పేదవారికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యయ విధానాన్ని అనుసరిస్తోంది. సంపన్నుల ఖర్చు విధానానికి, పేదవారికి ఖర్చు విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి ఆదాయ పునఃపంపిణీ జరిగే విధానాన్ని, అందువలన కలిగే ఆదాయాన్ని వ్యయం చేసే పద్ధతిని ఈ సూత్రం ఆధారంగా ప్రభుత్వం తన విధానాన్ని నిర్ణయించుకొని సమాజ శ్రేయస్సును పెంపొందిస్తుంది.
7) ధరలపై ప్రభావం: ఈ సూత్రం వస్తువు ధరలపై ప్రభావం చూపుతుంది. వస్తువు కొరతగా ఉంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి బదులుగా కొరతలేని వస్తువును ప్రతిస్థాపన చేయటం ద్వారా ఉపాంత ప్రయోగం- తగ్గకుండా ప్రయత్నించటం జరుగుతుంది. అందువల్ల కొరత వస్తువు ధర తగ్గుతుంది.
సమోపాంత ప్రయోజన సూత్ర ప్రాముఖ్యం:
- ఉద్యమదారు వివిధ ఉత్పత్తి సాధనాలకు నియమించేటప్పుడు, అన్ని ఉత్పత్తి సాధనాల నుంచి వచ్చే ఉపా ఉత్పాదకత సమానంగా ఉన్నప్పుడు మొత్తం ఉత్పత్తిని గరిష్టం చేసుకుంటాడు. అంటే కనిష్ట వ సముదాయాన్ని నిర్ణయించుకోవడానికి ఈ సూత్రం ఉపకరిస్తుంది.
- పంపిణీ విషయంలో కూడా ఈ సూత్రం ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఒక రకమైన వస్తువును ని వ్యక్తుల మధ్య పంపిణీ చేసినప్పుడు, అందరికీ కలిగే ఉపాంత ప్రయోజనంగా ఉంటే, పం సక్రమంగా జరిగిందని చెప్పవచ్చు.
- ఆదాయాన్ని వినియోగం, పొదుపు మధ్యన కేటాయించడంలో కూడా ఈత్రం ఉపకరిస్తుంది.
- వ్యక్తులు తమ పొదుపును లేదా సంపదను వివిధ రకాల ఆస్తుల రూపంలో ఎంతెంత ఉంచుకో నిర్ణయించుకోవడానికి ఈ సూత్రం ఉపయోగకరంగా ఉంటుంది.
- కుటుంబాలు తమ పరిమిత ఆదాయాన్ని వివిధ రకాల వస్తువులపై కేటాయించడం ద్వారా, తమ సంక్షేమాన్ని ఎలా గరిష్టం చేసుకుంటారో ఈ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రశ్న 3.
సమోపాంత ప్రయోజన సూత్రం సహాయంతో వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు:
వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించే సూత్రమే సమోపాంత ప్రయోజన మాత్రము. వినియోగదార గరిష్ట సంతృప్తిని పొందడానికి తన దగ్గర ఉన్న పరిమిత ఆదాయాన్ని వివిధ వస్తువులపై ఏ విధంగా ఉపయోగిస్తాని సూత్రం వివరిస్తుంది. సమోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం ఒక వినియోగదారుడు తన దగ్గరున్న ద్రవ్యాన్ని . వస్తువులపై వాటి ఉపాంత ప్రయోజనాలు సమానమయ్యే వరకు ఒకదానికి బదులుగా మరొకటి ప్రతిస్థాపన చేస్తా ఈ ప్రతిస్థాపన గరిష్ట సంతృప్తిని సాధించేవరకు సాగుతుంది. ఉపాంత ప్రయోజనాలు సమానమైనప్పుడు ప్రయోజనం గరిష్టంగా ఉంటుంది. మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు వినియోగదారుడు సమతౌల్య ఉంటాడు.
ఈ సూత్రాన్ని ప్రప్రధమంగా 1854వ సంవత్సరంలో హెచ్. హెచ్. గాసెన్ ప్రతిపాదించాడు. దీనిని గా ద్వితీయ సూత్రంగా జీవన్స్ పేర్నొన్నాడు. దీనిని మార్షల్ అభివృద్ధిపరిచాడు.
“ఒక వ్యక్తి దగ్గర ఉన్న ఒక వస్తువుకు అనేక ఉపయోగాలున్నప్పుడు అతడు ప్రతి ఉపయోగం నుండి ఉపాంత ప్రయోజనం సమానంగా ఉండేటట్లు ఆ వస్తువును వినియోగించడం జరుగుతుంది” అని మార్షల్ ఈ సూ నిర్వచించెను.
సూత్రం వివరణ:
ఉదా: ఒక వ్యక్తి వద్ద ఉన్న వస్తువు పరిమిత ద్రవ్యం ఐదు రూపాయలు అనుకుందాం. ఆ పరిమిత ప్ర X – y అనే వస్తువులపై ఖర్చు చేయటం ద్వారా ఏ విధంగా సమతౌల్యంలో ఉన్నాడో ఈ క్రింది పట్టిక పరిశీలించవచ్చును.
x − y ధరలు ఒక యూనిట్ వస్తువు ఒక రూపాయిగా భావించాలి. ప్రతి రూపాయికి లభించే ఉపాంత ప్రయోజనాలను పట్టికలో పరిశీలించవచ్చును.
బ్రాకెట్లలో చూపిన అంకెలు వినియోగదారుడు 5 రూపాయలను ఏ విధంగా ఖర్చు చేశాడో తెలియజేయును. పట్టికననుసరించి x, y వస్తువుల ఉపాంత ప్రయోజన వస్తు వినియోగం పెరుగుతున్న కొద్దీ క్షీణిస్తుంది. ఒకటో రూపాయి వల్ల వచ్చే ఉపాంత ప్రయోజనం y వస్తువు కంటే x వస్తువు వల్ల ఎక్కువగా ఉంది. అందువల్ల మొదటి రూపాయితో X వస్తువును కొనుగోలు చేస్తాడు. అదే విధంగా 2వ రూపాయిని x మీద వినియోగిస్తే ఉపాంత ప్రయోజనం 20 యుటిల్స్. అదే 2వ రూపాయిని y మీద వినియోగిస్తే ఉపాంత ప్రయోజనం 21 యుటిల్స్. కనుక 2వ రూపాయిని y వస్తువుపై ఖర్చు చేస్తాడు. 3వ రూపాయిని y వస్తువు మీద ఖర్చు చేస్తే, 15 యుటిల్స్ ఉపాంత ప్రయోజనము. అదే 3వ రూపాయిని X వస్తువుపై ఖర్చు చేస్తే ఉపాంత ప్రయోజనం 20 యుటిల్స్ కనుక 3వ రూపాయితో X వస్తువు 2వ యూనిట్ను కొనుగోలు చేస్తాడు. 4వ రూపాయితో y ని కొనుగోలు చేసినా ఉపాంత ప్రయోజనం 15 యుటిల్స్. 5వ | రూపాయిని X వస్తువు 3వ యూనిట్పై ఖర్చు చేస్తే ఉపాంత ప్రయోజనం 15 యుటిల్స్. 5 రూపాయలను X వస్తువుపై ఖర్చు చేస్తే 75 యుటిల్స్ ప్రయోజనం వస్తుంది. 5 రూపాయలను y వస్తువుపై ఖర్చు చేస్తే మొత్తం ప్రయోజనం 52 యుటిల్స్. కాని పైన పేర్కొన్న విధంగా ఖర్చు చేస్తే మొత్తం ప్రయోజనం 96 యుటిల్స్ [25 + 21 + 20 + 15 + 15 = 96]. వినియోగదారుడు ఈ విధంగా 3 యూనిట్ల xని, 2 యూనిట్ల yని కొనుగోలు చేసినప్పుడు మాత్రమే వినియోగదారునికి గరిష్ట సంతృప్తి వస్తుంది. అప్పుడే తాను ఖర్చు చేసిన చివరి రూపాయివల్ల రెండు వస్తువులకు ఒకే ప్రయోజనం ద్వారా తెలియజేయవచ్చు. వస్తుంది. మరే రకంగా ఖర్చు చేసినా ప్రయోజనం గరిష్టంగా ఉండదు. దీనిని పటము ద్వారా తెలియజేయవచ్చు.
పై రేఖాపటములో X – అక్షముపై ద్రవ్య పరిమాణము, Y – అక్షముపై ఒక రూపాయి వల్ల వచ్చే X, Y ల ఉపాంత ప్రయోజనం సూచించటం జరిగింది. XY రేఖ X వస్తువు ప్రయోజన రేఖ (MUC], YY రేఖ Y వస్తువు ఉపాంత ప్రయోజన రేఖ [MUC]. X వస్తువుపై 3వ రూపాయి 15 యుటిల్స్ ప్రయోజనం ఇస్తుంది. Y వస్తువుపై 2వ రూపాయి 15 యుటిల్స్ ప్రయోజనం ఇస్తుంది.
వినియోగదారుడు సమతౌల్య స్థితిని నిర్ణయించుటకు ఈ క్రింది నిబంధనను సంతృప్తిపరచవలెను.
ప్రశ్న 4.
ఉదాసీనత వక్రరేఖల పద్ధతి ద్వారా వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు:
ఒక వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు రెండు వస్తువుల ధరలు నిలకడగా ఉండి పరిమిత ఆదాయ వనరులతో వీలైనంతగా రెండు వస్తువులను గరిష్టంగా కొనుగోలు చేయగలిగినట్లయితే వినియోగదారుడు సమతౌల్యస్థితికి చేరుకున్నాడని చెప్పవచ్చు.
ఈ క్రింది ప్రమేయాలను ఆధారంగా చేసుకొని ఉదాసీనత వక్రరేఖల సహాయంతో వినియోగదారుని సమతౌల్య స్థితిని వివరించవచ్చు.
- వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు.
- వినియోగదారుని ద్రవ్య ఆదాయంలో ఎలాంటి మార్పులు ఉండవు.
- వినియోగదారుడు కొనుగోలు చేయాలనుకునే వస్తువుల ధరలు మారవు.
- వినియోగదారుని అభిరుచులు ఉదాసీనత వక్రరేఖలు తెలుపుతాయి.
వినియోగదారుని సమతౌల్యం: వినియోగదారు పొందగోరే వస్తు సముదాయాలు, పొందగలిగిన వస్తు సముదాయాలు సమానంగా ఉన్నప్పుడు సమతౌల్యంలో ఉంటాడు. అంటే ఉదాసీనతా వక్రరేఖ, బడ్జెట్ రేఖకు స్పర్శ రేఖగా ఉన్నప్పుడు వినియోగదారు గరిష్ట సంతృప్తిని పొందుతూ సమతౌల్యంలో ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో ఉదాసీనత వక్రరేఖ వాలు, బడ్జెట్ఖ వాలు సమానంగా ఉంటాయి. వినియోగదారుని సమతౌల్యానికి ముఖ్యమైన నిబంధన MRSxy = Px/Py
వినియోగదారు సమతౌల్యాన్ని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
పై రేఖాపటంలో AB బడ్జెట్ ఖ. IC0, IC1, IC2, వివిధ ఉదాసీనత వక్రరేఖలు. IC0, రేఖ AB బడ్జెట్ రేఖను C, ఎదువుల వద్ద ఖండిస్తుంది. అందువల్ల వినియోగదారు C వద్ద లేదా D వద్ద సమతౌల్యంలో ఉండడు. AB బడ్జెట్ IC0 రేఖను ఖండిస్తుంది. అంటే ఇంకా వినియోగదారుడు అధిక సంతృప్తి స్థాయిని పొందటానికి వీలు ఉంటుంది. పొందువు వద్ద IC1, రేఖ, AB బడ్జెట్ రేఖకు స్పర్శరేఖగా ఉంది. అందువల్ల ‘E’ బిందువు వద్ద IC, రేఖవాలు, రేఖ వాలు సమానం. ఈ పరిస్థితిలో MRSxy = Px/Py. అందువల్ల వినియోగదారుడు ‘E’ బిందువు వద్ద OQ -వస్తువును, OP పరిమాణంలో ‘Y’ వస్తువును కొనుగోలు చేస్తూ IC1, పై గరిష్ట సంతృప్తిని పొందుతూ సమతౌల్యంలో డు. IC1, అతని ఆదాయం కన్నా ఎక్కువ రేఖ. అందువల్ల వినియోగదారుడు IC2 రేఖ పైననే ‘E’ బిందువు వద్ద శౌల్యంలో ఉంటాడు.
ధర లేదా బడ్జెట్ రేఖను నిర్వచించండి. బడ్జెట్ రేఖలోని కదలికలను వివరించండి. వినియోగదారుని కొనుగోలు ముఖ్యంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:
- వినియోగదారుని ద్రవ్య ఆదాయం
- కొనుగోలు చేయాలనుకుంటున్న రెండు వస్తువుల ధరలు.
ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల ధరలు, ఆదాయాలు స్థిరంగా ఉండి, ఏ సముదాయాలలో ఎ వస్తువులను కొనుగోలు చేయగలుగుతాడో తెలియజేసే రేఖని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అంటారు. దీనిని ఈ ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. వినియోగదారుని ఆదాయం గౌ 5/-, X, Y వస్తువుల ధరలు వరుసగా కే 10.50 పై. కుందాం. దీంతో వినియోగదారుడు కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల వివిధ సముదాయాలు ఈ క్రింది గా ఉంటాయి.
వినియోగదారుడు మొత్తం ఆదాయాన్ని ‘X’ పైనే ఖర్చు చేస్తే 5X వస్తువులను మాత్రమే కొనుగోలు చేయగలుగుతాడు, స్తువులను కొనుగోలు చేయలేడు. Y వస్తువు మీద పూర్తిగా ఖర్చు చేస్తే 10 ‘Y’ లను, ‘0’ ‘X’ లను పొందగలుగుతాడు. విధంగా రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు తాను స్థిరమైన ఆదాయంతో కొనుగోలు చేయగలిగిన రెండు వుల వివిధ సముదాయాలకు సంబంధించిన బిందువులను కలిపినట్లయితే బడ్జెట్ రేఖ వస్తుంది. ఈ రేఖ వాలు వస్తువుల ధరల నిష్పత్తిని తెలుపుతుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా చూపించవచ్చు.
పై రేఖాపటంలో ‘X’ వస్తువు X అక్షంపై, ‘Y’ వస్తువు Y – అక్షంపై చూపించటం జరిగింది. PL అనేది బడ్జెట్ రేఖ. ఈ రేఖ వాలు XY వస్తువుల సాపేక్ష ధరల నిష్పత్తిని తెలియజేయును. ఏ ఆదాయ పరిమితికి లోబడి వినియోగదారుడు XY లను కొనుగోలు చేస్తున్నాడో బడ్జెట్ ఖ తెలియజేయును.
1) రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉండి, వినియోగదారుని ఆదాయం మార్పు చెందితే బడ్జెట్ రేఖ స్థితిలో మార్పు వస్తుంది. ఆదాయం పెరిగితే బడ్జెట్ రేఖ పైకి కదులుతుంది. అదే విధంగా ఆదాయం తగ్గితే, బడ్జెట్ రేఖ క్రిందికి కదులుతుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
పై రేఖాపటంలో A1B1 బడ్జెట్ఖ అనుకుందాం. రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉండి ఆదాయం పెరిగితే బడ్జెట్ రేఖ A2B2 పైకి కదులుతుంది. ఆదాయం తగ్గితే బడ్జెట్ రేఖ A0B0 కిందికి కదులుతుంది.
2) ఆదాయం స్థిరంగా ఉండి X వస్తువు లేదా Y వస్తువు ధరలోగాని మార్పు వస్తే బడ్జెట్లేఖ వాలులో మార్పు వస్తుంది. దీనిని ఈ రేఖాపటాల ద్వారా వివరించవచ్చు.
A రేఖాపటంలో వినియోగదారుని ఆదాయం, Y వస్తువు ధర స్థిరంగా ఉండి X వస్తువు ధరలో మార్పు వస్తే బడ్జెట్ రేఖలో వచ్చే మార్పులను చూపించటం జరిగింది. X వస్తువు ధర తగ్గితే బడ్జెట్ రేఖ AB గాను, X వస్తువు ధర పెరిగితే బడ్జెట్ రేఖ AB0 గాను ఉంటుంది.
B రేఖాపటంలో వినియోగదారుని ఆదాయం, X వస్తువు ధర స్థిరంగా ఉండి, Y వస్తువు ధరలో మార్పు వస్తే బడ్జెట్ రేఖలో వచ్చే మార్పులను చూపటం జరిగింది. Y వస్తువు ధర తగ్గితే బడ్జెట్ రేఖ LP1 గాను, Y వస్తువు ధర పెరిగితే బడ్జెట్ రేఖ LP2 గాను ఉంటుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
కార్డినల్, ఆర్డినల్ ప్రయోజనాలను విభేదించండి.
జవాబు:
కార్డినల్ ప్రయోజన విశ్లేషణ: 18వ శతాబ్దంలో జీవాన్స్, వాల్రాస్ మొదలగువారు ప్రయోజన విశ్లేషణను అభివృద్ధిపరిచారు. ఆ తరువాత మార్షల్, క్లార్క్ మొదలగువారు దీనిని అభివృద్ధిపరిచారు. వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయటానికి కార్డినల్ ప్రయోజన విశ్లేషణను రూపొందించారు. వీరు ప్రయోజనాన్ని కొలవటానికి యుటిల్స్ అనే ఊహాత్మక కొలమానాన్ని ఉపయోగించారు. వీటి ద్వారా వివిధ వస్తువుల నుండి పొందగలిగే ప్రయోజనాన్ని కొలవవచ్చు, పోల్చవచ్చును అని నవ్య సంప్రదాయ ఆర్థికవేత్తలు భావించారు. 1, 2, 3 ……అనేవి కార్డినల్ సంఖ్యలు. ఈ విధమైన విశ్లేషణ కేవలం ఒక మానసిక భావన మాత్రమే.
ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ: జె.ఆర్. హిక్స్, అలెన్ అనే ఆర్థికవేత్తలు వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయుటలో ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణను రూపొందించారు. ఈ విశ్లేషణ ద్వారా ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో చెప్పటం సాధ్యం కాదు. వివిధ సముదాయాల నుంచి పొందే వివిధ సంతృప్తి స్థాయిలతో పోల్చి చెప్పడం జరుగుతుంది. అనగా ఒక వస్తు సముదాయం, మరొక వస్తు సముదాయం కంటే ఎంత ఎక్కువ లేదా ఎంత తక్కువ సంతృప్తి ఇస్తుందో చెప్పటానికి వీలు ఉన్నదనే అంశంపై ఉదాసీనత వక్రరేఖలు ప్రతిపాదించటం జరిగింది. 1వ, 2వ, 3వ ఆర్డినల్ సంఖ్యలు. వీరి ఉద్దేశ్యంలో ప్రయోజనం అనేది ఒక మానసిక భావన. దానిని కొలవలేము. కేవలం దేన్ని ఎంత కావాలో, ఎంత ఇష్టపడుతున్నారో మాత్రమే చెప్పగలం. దీనిని ఆర్డినల్ ప్రయోజనం అంటారు.
ప్రశ్న 2.
ఉదాసీనత వక్రరేఖల లక్షణాలు. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల వివిధ సమ్మేళనాలను తెలియజేసే బిందువులను కలుపగా ఏర్పడే రేఖను “ఉదాసీనత వక్రరేఖ” అని అంటారు.
లక్షణాలు / ధర్మాలు:
- ఉదాసీనత వక్రరేఖలు ఋణాత్మక వాలు కలిగి ఉంటాయి. అనగా ఎడమ నుండి కుడికి దిగువకు వాలుతాయి.
- ఉదాసీనత వక్రరేఖలు X- అక్షమునుగాని, Y – అక్షమునుగాని తాకవు.
- ఉదాసీనత వక్రరేఖలు పరస్పరం ఖండించుకొనవు.
- ఇవి మూలబిందువుకు కుంభాకారంలో ఉంటాయి. దీనికి కారణం ప్రతిస్థాపనోపాంత రేటు క్షీణించటం.
- ఎక్కువ స్థాయిలో ఉన్న ఉదాసీనత రేఖ ఎక్కువ సంతృప్తి, తక్కువ స్థాయిలో ఉన్న రేఖ తక్కువ సంతృప్తి స్థాయిని సూచిస్తాయి.
- పూర్తి ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో సరళరేఖలుగానూ, పూరక వస్తువుల విషయంలో ‘L’ ఆకారంలో ఉదాసీనత వక్రరేఖలు ఉంటాయి.
ప్రశ్న 3.
ఉపాంత ప్రత్యామ్నాయ రేటు
జవాబు:
ఉదాసీనతా వక్రరేఖ విశ్లేషణలో ప్రతిస్థాపనోపాంత రేటు అత్యంత ముఖ్యమైనది. అన్ని సముదాయాలు ఒకే స్థాయిలో సంతృప్తిని ఇవ్వడం వల్ల వినియోగదారుడు ఒక వస్తువు స్థానంలో మరొక వస్తువును ఏ రేటులో ప్రతిస్థాపన చేస్తున్నాడో దానిని ప్రతిస్థాపనోపాంత రేటు అంటారు.
ఉదా: వినియోగదారుడు X, Y వస్తువులను వినియోగిస్తాడు అనుకుందాం. ఈ రెండు వస్తువులు ఒకదానికి బదులు, మరో దానికి ప్రత్యామ్నాయం చేయటానికి వీలు ఉంటుంది. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.
పై పట్టికలో వినియోగదారునికి అందుబాటులో ఉన్న వివిధ సముదాయాలలో A నుండి F వరకు పరిశీలించగా సముదాయం Aలో వినియోగదారునికి X తక్కువగా పొందే అవకాశం ఉంది. X పరిమాణం తక్కువగా ఉండటం వల్ల వినియోగదారుడు X కోసం Y ని వదులుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. ఈ విధంగా అదనంగా 1 యూనిట్ X పరిమాణం పొందటానికి 5 యూనిట్ల Y ని వదులుకోవాలి. దీనినే ఉపాంత ప్రత్యామ్నాయ రేటు అంటారు.
ప్రశ్న 4.
ఉదాసీనత పటం
జవాబు:
వివిధ సంతృప్తి స్థాయిలను తెలిపే ఉదాసీనత వక్రరేఖల సముదాయాన్ని ఉదాసీనత పటం అందురు. ‘X’ వస్తువు, ‘Y’ వస్తువు వివిధ సముదాయాలను తెలియజేసే ఉదాసీనత రేఖల సముదాయమే ఉదాసీనత పటం. ఇందులో ఒక్కొక్క IC ఒక్కొక్క రకమైన సముదాయాన్ని తెలియజేయును.
పై రేఖాపటంలో ‘X’ అక్షంపై X వస్తువును, Y అక్షంపై Y వస్తువును చూపటం జరిగింది. IC,, IC2, IC3 అనేవి మూడు వేరువేరు ఉదాసీనత వక్రరేఖలు. ఈ రేఖలు వివిధ ఆదాయ స్థాయిల వద్ద పొందగలిగే సంతృప్తి స్థాయిలను తెలియజేస్తాయి. ఉదాసీనత వక్రరేఖలు కుడివైపుకు జరిగే కొద్ది సంతృప్తి స్థాయిలలో పెరుగుదల సూచిస్తుంది. IC, రేఖ, అన్ని రేఖల కంటే తక్కువ స్థాయి సంతృప్తిని తెలియజేయును.
ప్రశ్న 5.
ధర రేఖ
జవాబు:
వినియోగదారుని కొనుగోలు ముఖ్యంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:
- వినియోగదారుని ద్రవ్య ఆదాయం.
- కొనుగోలు చేయాలనుకుంటున్న రెండు వస్తువుల ధరలు.
ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల ధరలు, ఆదాయాలు స్థిరంగా ఉండి, ఏ సముదాయాలలో రెండు వస్తువులను కొనుగోలు చేయగలుగుతాడో తెలియజేసే రేఖని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అంటారు. దీనిని ఈ క్రింది ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. వినియోగదారుని ఆదాయం 5/-, X, Y వస్తువుల ధరలు వరుసగా * 10.50 పై. అనుకుందాం. దీంతో వినియోగదారుడు కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల వివిధ సముదాయాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
వినియోగదారుడు మొత్తం ఆదాయాన్ని ‘X’ పైనే ఖర్చు చేస్తే 5X వస్తువులను మాత్రమే కొనుగోలు చేయగలుగుతాడు, Y వస్తువులను కొనుగోలు చేయలేడు. Y వస్తువు మీద పూర్తిగా ఖర్చు చేస్తే 10 Y లను, ‘0’ ‘X’ లను పొందగలుగుతాడు. ఈ విధంగా రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు తాను స్థిరమైన ఆదాయంతో కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల వివిధ సముదాయాలకు సంబంధించిన బిందువులను కలిపినట్లయితే బడ్జెట్ రేఖ వస్తుంది. ఈ రేఖ వాలు రెండు వస్తువుల ధరల నిష్పత్తిని తెలుపుతుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా చూపించవచ్చు.
పై రేఖాపటంలో ‘X’ వస్తువు X – అక్షంపై, ‘Y’ వస్తువు Y – అక్షంపై చూపించటం జరిగింది. PL అనేది బడ్జెట్ రేఖ. ఈ రేఖ వాలు XY వస్తువుల సాపేక్ష ధరల నిష్పత్తిని తెలియజేయును. ఏ ఆదాయ పరిమితికి లోబడి వినియోగదారుడు XY లను కొనుగోలు చేస్తున్నాడో బడ్జెట్ రేఖ తెలియజేయును. వినియోగదారునికి ఈ క్రింది అవకాశాలు ఉన్నాయి.
- వినియోగదారుడు తన వద్దనున్న 5/- ను ‘X’ వస్తువుపై ఖర్చు చేసినట్లయితే ‘5’ X వస్తువులను మాత్రమే కొనుగోలు చేయగలడు. కాని Y వస్తువును కొనలేడు.
- వినియోగదారుడు తన వద్ద ఉన్న 5/- లను ‘Y’ వస్తువుపై ఖర్చు చేసినట్లయితే 10 ‘Y’ వస్తువును మాత్రమే కొనుగోలు చేయగలడు. కాని ‘X’ వస్తువును కొనలేడు.
- వాస్తవంగా వినియోగదారుడు రెండు వస్తువులను కోరుకుంటాడు కావున రేఖాపటంలో OPL అనేది అతనికి ఉండే అవకాశం తెలియజేయును.
- ‘PL’ బడ్జెట్ రేఖను దాటి వినియోగదారుడు ఒక్క వస్తువును కూడా కొనుగోలు చేయలేడు.
ప్రశ్న 6.
ఉదాసీనత వక్రరేఖల ప్రమేయాలు తెల్పండి.
జవాబు:
- వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు. తన పరిమిత ఆదాయంతో గరిష్ట సంతృప్తి పొందటానికి ప్రయత్నిస్తాడు.
- ప్రతి వినియోగదారునికి అభిరుచి తరహా ఉంటుంది.
- ఉపాంత ప్రతిస్థాపన రేటు క్షీణించును.
- ఇది ఆర్డినల్ ప్రయోజన భావన మీద ఆధారపడి ఉంది.
- వినియోగదారుడు మార్కెట్ ధరతో సంబంధం లేకుండా తన అభిరుచి తరహా రూపొందించుకుంటాడు. అంటే ఒకదానికంటే మరియొకటి మెరుగైన ఎంపిక.
- వినియోగదారుని అభిరుచులు, ప్రవర్తన స్థిరంగా ఉంటాయి.
- వినియోగదారుడు వివిధ వస్తు సముదాయాల మధ్య ఉదాసీనంగా ఉంటాడు.
ప్రశ్న 7.
ఉదాసీన వక్రరేఖల విశ్లేషణ ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
- ఇది బహుళ వస్తువుల విశ్లేషణ.
- ఇది ఆదాయ ప్రభావం, ధర ప్రభావం, ప్రత్యామ్నాయ ప్రభావాలని విశ్లేషించును.
- ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ అస్థిర వాస్తవికతను కలిగి ఉండును.
- ద్రవ్య ఉపాంత ప్రయోజనం స్థిరం అనే ప్రమేయం లేకపోవడం వల్ల ధరలో మార్పులను పరిగణిస్తుంది.
ప్రశ్న 8.
సమోపాంత ప్రయోజన సూత్ర పరిమితులను తెల్పండి.
జవాబు:
- ఈ సూత్రం మన్నిక కల్గిన వస్తువుల విషయంలో వర్తించదు.
- విభజించుటకు వీలుకాని వస్తువుల విషయంలో ఈ సిద్ధాంతం వర్తించదు.
- వినియోగదారుడు ఇష్టపడే వస్తువులను మార్కెట్లో లభ్యం కాని పరిస్థితిలో ఈ సూత్రం పనిచేయదు.
- వ్యక్తులు సంప్రదాయాలను నెరవేర్చటానికి వ్యయం చేస్తూ ఉంటారు.
ఉదా: వివాహం, కర్మకాండ మొదలగునవి. అటువంటి వాటి విషయాలలో ఈ సూత్రం వర్తించదు. - వినియోగదారుని ఆదాయం, వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడే ఈ సూత్రం వర్తిస్తుంది.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
కార్డినల్ ప్రయోజనం [Mar. ’17, ’15]
జవాబు:
ఆల్ఫ్రెడ్ మార్షల్ కార్డినల్ సంఖ్యా పద్ధతి ద్వారా ప్రయోజన విశ్లేషణ చేసాడు. వివిధ వస్తువుల నుంచి పొందే ప్రయోజనాలను యుటిల్స్ అనే ఊహాత్మక యూనిట్స్ ద్వారా కొలవడానికి వీలుంది అని నవ్య సంప్రదాయ ఆర్థిక వేత్తలు భావించారు. 1, 2, 3 వంటి సంఖ్యలు కార్డినల్ సంఖ్యలు.
ప్రశ్న 2.
ఉపాంత ప్రయోజనం
జవాబు:
ఒక వినియోగదారుడు అదనంగా ఒక వస్తువు యూనిట్ని వినియోగించినప్పుడు మొత్తం ప్రయోజనంలో వచ్చే మార్పును ఉపాంత ప్రయోజనం అంటారు. దీనిని ఈ క్రింది విధంగా కొలవవచ్చు.
MU = ΔTU/ΔQ
ΔTU = మొత్తం ప్రయోజనంలో మార్పు
ΔQ = వస్తు పరిమాణంలో మార్పు.
ప్రశ్న 3.
వినియోగదారుని సమతౌల్యం
జవాబు:
సమతౌల్యం అనగా ఒక నిశ్చల స్థితి. వినియోగదారుడు తన వద్దనున్న పరిమిత ద్రవ్యంతో ఎక్కువ తృప్తిని పొందటానికి ప్రయత్నిస్తాడు. ఉపయోగించే వస్తువు ఉపాంత ప్రయోజనాలు సమానమైనప్పుడు మొత్తం ప్రయోజనం గరిష్టమవుతుంది. మొత్తం ప్రయోజనం గరిష్టమైనప్పుడు వినియోగదారుడు సమతౌల్యంలో ఉంటాడు.
ప్రశ్న 4.
బడ్జెట్ రేఖ [Mar 16]
జవాబు:
ఒక వినియోగదారుడు కొనుగోలుచేసే రెండు వస్తువుల ధరలు, ఆదాయాలు స్థిరంగా ఉండి ఏ సముదాయాలలో రెండు వస్తువులను కొనుగోలు చేయగలుగుతాడో తెలియజేసే దానిని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అని అంటారు.
ప్రశ్న 5.
సమోపాంత ప్రయోజనం
జవాబు:
వినియోగదారుడు తన దగ్గర ఉన్న పరిమిత ద్రవ్యాన్ని వివిధ వస్తువుల మీద ఖర్చు చేసినప్పుడు ప్రతి చివరి రూపాయి నుంచి అతను పొందే ఉపాంత ప్రయోజనం సమానం అయ్యేటట్లు చూసుకోవాలి. అప్పుడు వినియోగదారుడు గరిష్ట సంతృప్తి పొందుతాడు. దీనినే సమోపాంత ప్రయోజన సూత్రం అంటారు.
ప్రశ్న 6.
ఉదాసీనత వక్రరేఖ
జవాబు:
వినియోగదారుడు కొనుగోలుచేసే రెండు వస్తువుల వివిధ సమ్మేళనాలను తెలియజేసే బిందువులను కలుపగా ఏర్పడే రేఖను “ఉదాసీనత వక్రరేఖ” అని అంటారు. దీనిని ఆర్డినల్ భావనపై ప్రతిపాదించటమైనది.
ప్రశ్న 7.
ప్రతిస్థాపనోపాంత రేటు
జవాబు:
అన్ని సముదాయాలు ఒకే స్థాయిలో సంతృప్తిని ఇవ్వటం వల్ల వినియోగదారుడు ఒక వస్తువు స్థానంలో మరొక వస్తువును ఏ రేటులో ప్రతిస్థాపన చేస్తున్నాడో దానిని ప్రతిస్థాపనోపాంత రేటు అంటారు. ఈ ప్రతిస్థాపనోపాంత రేటు ఉదాసీనత రేఖ స్వభావాన్ని, వాలును నిర్ణయించును.
అదనపు ప్రశ్నలు
ప్రశ్న 8.
ఉదాసీనత వక్రరేఖ పటం
జవాబు:
వినియోగదారుని అభిరుచి తరహాను తెలియజేసే అనేక ఉదాసీనతా వక్రరేఖల సముదాయం.
ప్రశ్న 9.
ఉదాసీనత పట్టిక
జవాబు:
వినియోగదారుడు ఉదాసీనంగా ఉండే వివిధ వస్తు సముదాయాలను తెలియజేయునది.
ప్రశ్న 10.
ఆర్డినల్ ప్రయోజనం
జవాబు:
హిక్స్, అలెస్ అనేవారు వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయుటలో ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణను సమర్థించారు. ఈ విశ్లేషణ ద్వారా ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో ఖచ్చితంగా చెప్పటం సాధ్యం కాదు. అయితే వివిధ సముదాయాల నుంచి పొందే వివిధ సంతృప్తి స్థాయిలతో పోల్చి చెప్పటం జరుగుతుంది. 1, 2, 3 అనేవి ఆర్డినల్ సంఖ్యలు.
ప్రశ్న 11.
ప్రయోజనం
జవాబు:
ఒక వస్తువుకు ఉండే మానవుని కోరికను తీర్చగలిగే శక్తి. ఇది నాలుగు రకాలు.
- ఆకార ప్రయోజనం
- స్థల ప్రయోజనం
- కాల ప్రయోజనం
- సేవా ప్రయోజనం
ప్రశ్న 12.
మొత్తం ప్రయోజనం
జవాబు:
ఒక వినియోగదారుడు ఒక వస్తువును వినియోగం చేసేటప్పుడు లభించే మొత్తం తృప్తిని మొత్తం ప్రయోజనం అంటారు. ఉదా: ఒక యూనిట్ వినియోగం చేసే 20 యుటిల్స్ ప్రయోజనం వచ్చింది, రెండు యూనిట్లు ఉపయోగిస్తే, 35 యుటిల్స్ వస్తే వచ్చే మొత్తం ప్రయోజనం 55 యుటిల్స్ (1 + 2 Utils).
∴ TUx = f(Qx)