AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ సిద్ధాంతాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 3rd Lesson డిమాండ్ సిద్ధాంతాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
డిమాండ్ సూత్రాన్ని వివరించి, దాని మినహాయింపులను వ్రాయండి.
జవాబు:
అర్ధశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక వస్తువును కొనాలనే కోరికతోపాటు కొనే శక్తి, కొనాలన్న ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కనుక డిమాండ్ను ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చు. “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అని బెన్హామ్ పేర్కొన్నాడు.

ఒక వస్తువుకున్న డిమాండ్ ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉండును.

  1. వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు
  2. వస్తువుల ధరలు
  3. వినియోగదారుల ఆదాయాలు
  4. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు మొదలైనవి.

డిమాండ్ సూత్రము: డిమాండ్ సూత్రం వస్తువు ధరకు, డిమాండ్కుగల సంబంధాన్ని తెలియజేస్తుంది. “ఇతర అంశాలు స్థిరంగా ఉంటే, వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది” అని మార్షల్ డిమాండ్ సూత్రాన్ని నిర్వచించెను. డిమాండ్ సూత్రాన్ని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చును.

Dn = f

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

డిమాండ్ పట్టిక
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 1

వినియోగదారుడు లేదా వినియోగదారులు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఏ పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది డిమాండ్ పట్టిక.

పట్టికననుసరించి వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని డిమాండ్ రేఖను గీయవచ్చును.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 2

పై రేఖాపటంలో ‘X’ అక్షముపై వస్తువు డిమాండ్ పరిమాణం, ‘Y’ అక్షముపై వస్తువు ధరను చూపినాము. ‘DD’ డిమాండ్ రేఖ. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రింది వైపుకు వాలి ఉంది. ఇది ఋణాత్మకమైన వాలు. వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య విలోమ సంబంధమున్నదని ఋణాత్మకమైన వాలు తెలియజేస్తుంది.

మినహాయింపులు: డిమాండ్ సూత్రానికి కొన్ని మినహాయింపులున్నాయి. అవి:
1. గిఫెన్ వైపరీత్యం: పేద కార్మికులు రొట్టె ధర పెరిగితే మాంసముపై వెచ్చించే డబ్బును కూడా రొట్టెపై ఖర్చు చేస్తారు. అనగా రొట్టె ధర పెరిగినా డిమాండ్ తగ్గదు. ఇది పేదవాళ్ళ ఆహారం కావటమే ఇందుకు కారణము. ఈ సత్యాన్ని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త 19వ శతాబ్దం మధ్య భాగంలో పరిశీలించాడు. కనుక దీనిని గిఫెన్ వైపరీత్యం అంటారు. పేదవారు ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో తక్కువ ధర గల వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వస్తువులనే గిఫెన్ వస్తువులంటారు. ఉదా: రాగులు, జొన్నలు మొదలైనవి.

2. గౌరవ సూచిక వస్తువులు: గౌరవ సూచిక వస్తువుల ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. వీటిని కొనుగోలు చేయటం వలన సమాజంలో గౌరవము, ప్రతిష్ఠ పెరుగుతాయని భావిస్తారు. వీటి ధర తగ్గితే గౌరవం, ప్రతిష్ఠ తగ్గుతాయని భావిస్తారు. ఉదా: విలువ గల వజ్రాలు, ఆభరణాలు మొదలైనవి. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకము. ఈ విషయాన్ని వెబ్లెన్ అనే అమెరికా ఆర్థికవేత్త తెలియజేసెను. అందువల్ల ఇటువంటి వస్తువులను వెబ్లెన్ వస్తువులంటారు.

3. అంచనా వ్యాపారం: ఒక వస్తువు ధర మరింత పెరగడానికి వ్యాపారస్తులు, కొనుగోలుదారులు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే సట్టా వ్యాపారం అని కూడా అంటారు. ఉదా: షేర్లు, బాండ్లు.

4. భ్రాంతి: కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగి ఉన్న వస్తువులు ఎక్కువ నాణ్యతతో కూడి ఉంటాయన్న భ్రాంతిలో ఉంటారు. అందువల్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇటువంటి వాటి విషయంలో డిమాండ్ సూత్రం వర్తించదు.

ప్రశ్న 2.
డిమాండ్ ఫలం అంటే ఏమిటి ? డిమాండ్ను నిర్ణయించే అంశాలను వివరించండి.
జవాబు:
“ఒక నిర్ణీతమైన కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అంటారు.

ఒక వస్తువు డిమాండ్ దాని ధరపైనే కాకుండా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వస్తువు డిమాండ్ను ప్రభావితము చేసే అంశాలు; ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలు, వినియోగదారుల ఆదాయం, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు మొదలైనవి. కనుక ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, దీనిని నిర్ణయించే కారకాలకు మధ్యగల సంబంధాన్ని తెలియజేసేదే డిమాండ్ ఫలము. దీనిని ఈ క్రింది సమీకరణం ద్వారా చూపవచ్చు.
Dn = f (Pn, P1, P2, …. Pn-1, y, T)
Dn = n వస్తువుల డిమాండ్ పరిమాణం
Pn = n వస్తువు ధర
Pn, P1, P2, …. Pn-1 = ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు
y = వినియోగదారుని ఆదాయం
T = వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు మొదలైనవి.
f = ప్రమేయ సంబంధము

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

డిమాండ్ను నిర్ణయించే కారకాలు లేదా అంశాలు:

  1. ఆదాయంలో మార్పు: ప్రజల ఆదాయాల మార్పును బట్టి వస్తువుల డిమాండ్లో మార్పు ఏర్పడుతుంది. ప్రజల ఆదాయం పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయాలు తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది.
  2. అభిరుచులు, అలవాట్లలో మార్పులు: ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పుల వలన వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది.
  3. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో మార్పులు: ప్రజల అభిరుచులలో అలవాట్లలో మార్పులవల్ల వస్తువు డిమాండ్ లో మార్పులు వస్తాయి.
  4. జనాభాలో మార్పు: జనాభా పెరుగుదల, తగ్గుదలను అనుసరించి కూడా వస్తువుల డిమాండ్లో మార్పులు వస్తాయి.
  5. వాతావరణంలో మార్పులు: వాతావరణంలో మార్పులు కూడా డిమాండ్లో మార్పులను తీసుకొని వస్తాయి. ఉదా: వేసవికాలంలో చల్లని పానీయాలకు డిమాండ్ పెరుగుతుంది.
  6. సాంకేతికాభివృద్ధి: సాంకేతికాభివృద్ధి వలన వస్తూత్పత్తి వ్యయం తగ్గి, వస్తు ధరలు తగ్గుతాయి. అందువల్ల పూర్వం కొనుగోలు చేయడానికి ఉపయోగించిన ద్రవ్య పరిమాణంలో వస్తువులను ఎక్కువగా డిమాండ్ చేయటానికి అవకాశం ఉంటుంది.
  7. ఆర్థిక స్థితిగతులు: వాణిజ్య విజృంభణ కాలంలో అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆర్థిక మాంద్య పరిస్థితులలో అన్ని వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.
  8. ప్రభుత్వ విధానము: ప్రభుత్వ పన్నుల విధానం, రాయితీ విధానము మొదలైనవి వస్తువు ధర తగ్గితే డిమాండ్ ప్రభావితం చేయును.
  9. వస్తువు ధర: ఒక వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉన్నది. కనుక వస్తువు ధర తగ్గితే, డిమాండ్ పెరుగుతుంది. వస్తువు ధర పెరుగుటచే డిమాండ్ తగ్గుతుంది.

ప్రశ్న 3.
డిమాండ్ అంటే ఏమిటి ? వివిధ రకాల డిమాండ్లను తెలియజేయండి.
జవాబు:
అర్ధశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక వస్తువును కొనాలనే కోరిక దానితోపాటు కొనే శక్తి ఈ రెండూ జతకూడినప్పుడే ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. అందువల్ల “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు ఉన్న డిమాండ్” అంటారు.
డిమాండ్ను నిర్ణయించే కారకాలను బట్టి డిమాండ్ను మూడు రకములుగా విభజించవచ్చు.

  1. ధర డిమాండ్
  2. ఆదాయ డిమాండ్
  3. జాత్యంతర డిమాండ్.

1. ధర డిమాండ్: ఒక వస్తువు ధరకు, దాని డిమాండ్ పరిమాణానికి గల సంబంధాన్ని తెలియజేయునది ధర డిమాండ్. డిమాండ్ను ప్రభావితంచేసే ఇతర అంశాలలో మార్పులేదనే ప్రమేయంపై ఆధారపడి ధర డిమాండ్ నిర్వచించబడుతుంది. దీనిని ఈ విధంగా చూపవచ్చు.
D1 = f(Px)
డిమాండ్ పట్టిక: ఒక వస్తువును వివిధ ధరల వద్ద కొనుగోలు చేసే వస్తువు పరిమాణాలను తెలియజేయును. ఈ డిమాండ్ పట్టిక రెండు రకాలు.

  1. వైయుక్తిక డిమాండ్ పట్టిక
  2. మార్కెట్ డిమాండ్ పట్టిక

డిమాండ్ పట్టిక:
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 3AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 4
పై రేఖాపటంలో ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. కనుక DD రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంది. దీనిని ఋణాత్మక వాలు అంటారు. ఇది వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య ఉన్న విలోమ సంబంధాన్ని తెలియజేయును.

2. ఆదాయ డిమాండ్: వినియోగదారుని ఆదాయానికి, వస్తువు డిమాండ్కు మధ్యనున్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ అంటారు. వివిధ ఆదాయాల వద్ద వస్తువు డిమాండ్ పరిమాణం ఏ విధంగా ఉందో ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది.
Dx = f(y)

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ధరకు, ఆదాయంకు ధనాత్మక సంబంధం ఉంది. ఆదాయ డిమాండ్ను అనుసరించి వస్తువులలో మేలురకం లేదా నాసిరకం వస్తువులుగా గుర్తించవచ్చు.

మేలురకం వస్తువులు / సాధారణ వస్తువులు:
ఆదాయం పెరిగితే మేలురకం వస్తువులు లేదా సాధారణ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 5

పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై డిమాండ్ పరిమాణంను, ‘OY’ అక్షంపై ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ఆదాయం ‘OY’ నుంచి ‘OY1‘ కు పెరిగినప్పుడు మేలురకం వస్తువుల డిమాండ్ ‘OQ’ నుంచి ‘OQ1‘ కు పెరిగింది. ‘YD’ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంటుంది.

నాసిరకం వస్తువులు: మేలురకం వస్తువులకు భిన్నంగా వినియోగదార్ల ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 6

పై రేఖాపటంలో ‘OX’ అక్షం మీద డిమాండ్ పరిమాణాన్ని, ‘OY’ అక్షం మీద ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY1‘ నుంచి ‘OY’ కు పెరిగినప్పుడు డిమాండ్ పరిమాణం ‘OQ’ నుంచి ‘OQ1‘ కు తగ్గును. ‘YD’ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంది.

3. జాత్యంతర డిమాండ్: ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.
జాత్యంతర డిమాండ్ను ఈ విధంగా వ్రాయవచ్చు.
Dx = f(Py).

ప్రత్యామ్నాయ వస్తువులు: ఒక కోర్కెను తీర్చగల వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు.

ఉదా: కాఫీ, టీ. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ధనాత్మక సంబంధాన్ని తెలియజేయును. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా చూపవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 7
పై రేఖాపటంలో కాఫీ ధర ‘OY’ నుంచి ‘OY2‘ కు పెరిగినప్పుడు టీ, డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ‘CD’ రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

పూరక వస్తువులు: ఒకే కోరికను తీర్చగల సమిష్టి వస్తువులు.
ఉదా: కారు, పెట్రోలు, వీటి విషయంలో డిమాండ్ విలోమ సంబంధాన్ని తెలియజేయును.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 8

పై రేఖాపటంలో డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ధర ‘OP’ నుండి ‘OP’ కు తగ్గినప్పుడు ‘CD’ రేఖ ఋణాత్మక వాలు కలిగి ఉంది.

ప్రశ్న 5.
డిమాండ్ వ్యాకోచత్వ భావనను నిర్వచించి, ధర, ఆదాయ, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వాలను వివరించండి.
జవాబు:
ఆర్థికశాస్త్రంలో “డిమాండ్ వ్యాకోచత్వం” అనే భావనకు అధిక ప్రాధాన్యత ఉంది. ధరలో వచ్చిన మార్పుకు అనుగుణంగా డిమాండ్ ఎంత మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది.

శ్రీమతి జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో “ధరలో వచ్చిన అనుపాతపు మార్పు స్పందనకు బదులుగా డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాత మార్పు ప్రతిస్పందన ఏ మేరకు ఉంటుందో తెలియజేసే భావన డిమాండ్ వ్యాకోచత్వం”. డిమాండ్లో వచ్చిన అనుపాతపు మార్పు డిమాండ్ వ్యాకోచత్వం.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 9

ఈ వ్యాకోచత్వ భావన మూడు రకాలు.

  1. ధర డిమాండ్ వ్యాకోచత్వం
  2. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం
  3. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం

1. ధర డిమాండ్ వ్యాకోచత్వం: ఈ భావనను మార్షల్ అభివృద్ధిపరిచారు. ధర డిమాండ్ వ్యాకోచత్వం అనగా ధరలో వచ్చే అనుపాతపు మార్పు వల్ల డిమాండ్లో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో తెలియజేస్తుంది. వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉంటుంది. అందువల్ల ధర డిమాండ్ వ్యాకోచత్వం రుణాత్మకంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 10

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

2. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం : ఆదాయంలో వచ్చే మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో ఏ మేరకు స్పందన వస్తుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. వినియోగదారుని ఆదాయం కొంత శాతం మార్పు చెందినప్పుడు, వస్తువు డిమాండ్ పరిమాణం ఎంత శాతం మార్పు చెందుతుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేయును. ఈ ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం మేలు రకం వస్తువుల విషయంలో ధనాత్మకంగా, నాసిరకం వస్తువుల విషయంలో రుణాత్మకంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 11

3. జాత్యంతర వ్యాకోచ డిమాండ్: ఒక వస్తువుకున్న డిమాండ్ దాని ధరపైనే కాకుండా, దానికున్న ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరపైన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల్లో వచ్చే అనుపాతపు మార్పు లేదా శాతం మార్పు ఆ వస్తు డిమాండ్లో ఎంత అనుపాత మార్పు కల్గిస్తుందో జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేయును. ప్రత్యామ్నాయ వస్తువులైన టీ, కాఫీల విషయంలో ధనాత్మక సంబంధాన్ని, పూరక వస్తువుల విషయాలలో రుణాత్మక సంబంధాన్ని కలిగి ఉంటాయి.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 12

ప్రశ్న 6.
ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ? ధర డిమాండ్ వ్యాకోచత్వంలోని రకాలను వివరించండి. Mar, ’15
జవాబు:
ధర డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను ఆల్ఫ్రెడ్ మార్షల్ అభివృద్ధిపరిచారు. ధర డిమాండ్ వ్యాకోచత్వం అనగా ధరలో వచ్చే అనుపాతపు మార్పువల్ల డిమాండ్లో వచ్చే అనుపాత మార్పు ఎంత ఉంటుందో తెలియజేస్తుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 13

వ్యాకోచత్వ విలువ ఆధారంగా ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఐదు రకాలుగా చెప్పవచ్చు.

  1. పూర్తి వ్యాకోచ డిమాండ్ (Ep = o)
  2. పూర్తి అవ్యాకోచ డిమాండ్ (Ep = 0)
  3. ఏకత్వ వ్యాకోచ డిమాండ్ (Ep = 1)
  4. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ (Ep = >1)
  5. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ (Ep = <1)

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

1. పూర్తి వ్యాకోచ డిమాండ్: ధరలో స్వల్ప మార్పు వచ్చినా లేదా రాకపోయినా డిమాండ్లో ఊహించలేనంతగా మార్పు కలిగితే దానిని పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు. దీని వ్యాకోచ విలువ అనంతంగా ఉంటుంది. ఇక్కడ ‘ డిమాండ్ రేఖ ‘X’ అక్షంకు సమాంతరంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 13

పై రేఖాపటంలో డిమాండ్ రేఖ ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది.
Ed = ∞

2. పూర్తి అవ్యాకోచ డిమాండ్: ధర పెరిగినా లేదా తగ్గినా డిమాండ్లో ఎలాంటి మార్పు రాకుంటే దానిని పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. దీని విషయంలో వ్యాకోచత్వ విలువ ‘0’ గా ఉంటుంది. డిమాండ్ రేఖ ‘y’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 15

‘DD’ రేఖ ‘Y’ అక్షానికి సమాంతరంగా ఉంది. పూర్తి అవ్యాకోచ డిమాండ్ ఉన్నప్పుడు వ్యాకోచత్వం విలువ ‘0’ కు సమానం.
∴ Ed = 0

3. ఏకత్వ వ్యాకోచ డిమాండ్: వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పుకు, డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పుకు సమానమైతే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ‘1’ కి సమానంగా ఉంటుంది. ఈ డిమాండ్ రేఖ “లంబ అతిపరావలయంగా” ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 16
పై రేఖాపటంలో OQ1 = PP1 కి సమానం. అందువల్ల Ed = 1.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

4. సాపేక్ష వ్యాకోచ డిమాండ్: వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎక్కువగా ఉంటే దానిని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే ఎక్కువగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 17
పై రేఖాపటంలో ‘DD’ రేఖ సాపేక్ష వ్యాకోచ డిమాండ్ను సూచించును. OQ1 > PP1 గా ఉంది. ఇక్కడ వ్యాకోచత్వ విలువ 1 కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ΔP కంటే ΔQ ఎక్కువగా ఉంటుంది.

5. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్: వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చిన అనుపాత మార్పు తక్కువగా ఉంటుంది. దానిని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచ విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 18

‘DD’ రేఖ సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ను సూచిస్తుంది. ఇక్కడ వ్యాకోచత్వ విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 7.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే మూడు పద్ధతులను వివరించండి.
జవాబు:
డిమాండ్ సూత్రం కేవలం ధర మార్పు వల్ల డిమాండ్ దిశను తెలియజేస్తుందిగాని, డిమాండ్లో వచ్చే పరిమాణాత్మకమైన మార్పును తెలియజేయదు. ఈ మార్పును తెలియజేయటానికి “మార్షల్ డిమాండ్ వ్యాకోచత్వ భావనను అర్ధశాస్త్రంలో ప్రవేశపెట్టెను. వస్తువు ధరలో వచ్చిన మార్పు వలన డిమాండ్లో వచ్చే పరిమాణాత్మకమైన లేదా సంఖ్యాత్మకమైన మార్పును తెలియజేయునది డిమాండ్ వ్యాకోచత్వ భావన.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ధరలో వచ్చిన అనుపాతం మార్పుకు, డిమాండ్లో వచ్చిన అనుపాతం మార్పుకు మధ్యగల సంబంధాన్ని ధర డిమాండ్ వ్యాకోచత్వం అని అంటారు. వ్యాకోచత్వాన్ని ఈ క్రింది విధంగా కొలవటం జరుగుతుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 19

డిమాండ్ వ్యాకోచత్వము కొలిచే పద్ధతులు:
1. మొత్తం ఖర్చు పద్ధతి: వ్యాకోచత్వాన్ని కొలవటానికి మార్షల్ మొత్తం ఖర్చు పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఒక వస్తువు ధరలో మార్పు వల్ల మొత్తము ఖర్చు ఏ విధంగా మారుతుందో తెలుసుకోవటం వల్ల వ్యాకోచత్వాన్ని కొలవడం జరిగింది. వస్తువు పరిమాణాన్ని ధరతో గుణిస్తే మొత్తం ఖర్చు వస్తుంది. వస్తువు ధరకు, మొత్తం ఖర్చుకు విలోమ సంబంధం ఉంటే డిమాండ్ వ్యాకోచత్వం 1 కంటే ఎక్కువ, (వ్యాకోచ డిమాండ్); అనులోమ సంబంధం ఉంటే 1 కంటే తక్కువ (అవ్యాకోచ డిమాండ్) ధర మారినప్పటికీ మొత్తం ఖర్చులో మార్పు లేకపోయినట్లయితే 1 కి సమానం (ఏకత్వ వ్యాకోచ డిమాండ్). ఈ విషయాన్ని ఈ క్రింది ఊహాజనితమైన డిమాండ్ పట్టిక ద్వారా గ్రహించవచ్చును.

డిమాండ్ పట్టిక:
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 20

2. బిందు వ్యాకోచ పద్ధతి: మార్షల్ రేఖాగణిత పద్ధతిలో డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతిని తెలియచేసాడు. బిందు వ్యాకోచ పద్ధతిలో సరళంగా ఉన్న డిమాండ్ రేఖ రెండు చివరలు X మరియు Y అక్షాలను తాకునట్లుగా పొడిగించి, ఆ రేఖపై ఒక బిందువు వద్ద డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవటం బిందు వ్యాకోచపద్ధతిలో వ్యాకోచత్వాన్ని కొలవటమంటారు. పటములో AB సరళరేఖగా ఉంది. డిమాండ్ రేఖ X, Y అక్షాలను తాకుతుంది. AB డిమాండ్ రేఖపై గల ‘P’ అనే బిందువు వద్ద వ్యాకోచత్వాన్ని ఈ క్రింద ఇవ్వబడిన సూత్రం ద్వారా గణన చేయవచ్చును.
AB డిమాండ్ రేఖపై ‘P’ బిందువు వద్ద వ్యాకోచము.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 21

ఈ పద్దతిలో డిమాండ్ రేఖ పొడవును బట్టి ఆ రేఖపై ఉన్న వివిధ బిందువుల వద్ద డిమాండ్ వ్యాకోచత్వాన్ని గణన చేయవచ్చును.

డిమాండ్ రేఖ సరళరేఖ అయినప్పుడు డిమాండ్ వ్యాకోచత్వం: సరళరేఖగా ఉన్న డిమాండ్ రేఖపై ఏ బిందువు వద్దనైనా బిందు వ్యాకోచ పద్దతిని ఉపయోగించి వ్యాకోచత్వాన్ని కొలవవచ్చు.
ఉదా: AE డిమాండ్ రేఖ పొడవు 4 Cm పొడవని ఊహిద్దాం.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

క్రింది రేఖాపటంలో డిమాండ్ వ్యాకోచత్వం ఈ క్రింది విధంగా ఉంటుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 22

డిమాండ్ రేఖ వక్ర రేఖ అయితే: డిమాండ్ రేఖ వక్రరేఖ అయితే పై సూత్రాన్ని ఉపయోగించి ఏ బిందువు వద్దనైనా స్పర్శరేఖ సహాయంతో వ్యాకోచత్వాన్ని కొలవవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 23
పై రేఖాపటంలో DD డిమాండ్ రేఖ. AB రేఖ DD రేఖను ‘C’ బిందువు వద్ద తాకింది.
‘C’ బిందువు వద్ద వ్యాకోచం = CB/CA = 1

3. ఆర్క్ పద్ధతి: డిమాండ్ రేఖపై రెండు బిందువుల మధ్య దూరాన్ని ఆర్క్ అంటారు. డిమాండ్ రేఖపై ఏదో ఒక బిందువు వద్ద కాకుండా రెండు బిందువుల మధ్య భాగంలో ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి ‘ఆర్క్’ పద్ధతిని ఉపయోగిస్తారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 24

ఉదా: ఒక వస్తువు ధర 4/- ఉన్నప్పుడు 300 యూనిట్లు కొనుగోలు చేయబడ్డాయి. అదే ధర 3/- తగ్గినప్పుడు 400 యూనిట్లు కొనుగోలు చేయబడ్డాయి. అప్పుడు వ్యాకోచాన్ని ఈ విధంగా కొలవవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 25AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 26

దీనిని ఈ క్రింది పటం ద్వారా చూపవచ్చు.

ప్రశ్న 8.
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే అంశాలు ఏవి?
జవాబు:
ఒక వస్తువు ధరలో మార్పు కలిగినప్పుడు ఏ మేరకు డిమాండ్లో ప్రతిస్పందన వస్తుందో తెలియచేసేదే డిమాండ్ వ్యాకోచత్వము. ధర మార్పు శాతానికి, డిమాండ్లో వచ్చే మార్పు శాతానికి మధ్యగల నిష్పత్తినే వ్యాకోచత్వంగా నిర్వచించవచ్చును. డిమాండ్ వ్యాకోచత్వము అన్ని వస్తువులకు ఒకే విధంగా ఉండదు. ధర డిమాండ్ వ్యాకోచత్వ స్వభావాన్ని లేదా స్థాయిని ఈ క్రింది అంశాలు నిర్ణయిస్తాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే కారకాలు:
1. వస్తువు స్వభావము: వస్తువులలో కొన్ని అవసరాలు, మరికొన్ని సౌకర్యాలు, ఇంకొన్ని విలాసాలు ఉంటాయి. నిత్యావసర వస్తువులకు ధర పెరిగినా, డిమాండ్ తగ్గదు. కనుక వాటికి అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఇవి లేకపోతే మానవ మనుగడ కష్టం. సౌకర్యాలు, విలాసాలకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఇవి లేకపోయినా ప్రజలు బ్రతకగలరు. కనుక వీటి ధర మార్పు కంటే డిమాండ్లో వచ్చే మార్పు అధికంగా ఉంటుంది.

2. ప్రత్యామ్నాయ వస్తువులు: ప్రత్యామ్నాయ వస్తువులు అధిక సంఖ్యలో ఉన్న వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ వస్తువులు లేనప్పుడు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

3. కొనుగోలు వాయిదా వేయటానికి అవకాశం: కొనుగోలును వాయిదా వేయటానికి అవకాశం ఉన్న వస్తువుల విషయంలో ధర డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. కొనుగోలును వాయిదా వేయటానికి వీలులేని వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

4. బహుళ ప్రయోజనాలున్న వస్తువులు: బొగ్గు, విద్యుచ్ఛక్తి మొదలగు బహుళ ప్రయోజనాలు గల వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఒకే ప్రయోజనం లేక ఉపయోగం గల వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

5. కాలము: స్వల్ప కాలంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. దీర్ఘ కాలంలో వ్యాకోచత్వం ఎక్కువగా ఉంటుంది.

6. పూరక వస్తువులు: పూరక వస్తువుల విషయంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది.

7. ధరస్థాయి: ధర స్థాయి ఎక్కువగా ఉంటే వ్యాకోచమైన డిమాండ్ ఉంటుంది. ధర స్థాయి తక్కువగా ఉంటే అవ్యాకోచమైన డిమాండ్ ఉంటుంది.

8. వినియోగదారుని బడ్జెట్లో వస్తువుకు గల ప్రాధాన్యం: వినియోగదారుని ఆదాయంలో ఒక వస్తువుపై చేసే ఖర్చు శాతం తక్కువగా ఉంటే డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఆదాయంలో హెచ్చు శాతం ఖర్చు చేసే వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది.

9. వస్తువు మన్నికపై ఆధారపడును: మన్నికగల, నిల్వ చేయటానికి వీలైన అనశ్వర వస్తువులపై చేసే డిమాండ్ అవ్యాకోచంగాను, నశ్వర వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగాను ఉంటుంది.

10. పేదవారి వస్తువులు: పేదవారు వినియోగించే వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఈ వస్తువుల ధరలు తగ్గినపుడు వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 9.
ధర డిమాండ్ ‘వ్యాకోచత్వం ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు:
1. ఉత్పత్తిదార్లకు: ఉత్పత్తిదార్లు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని అనుసరించి ఉత్పత్తి చేస్తారు. ఏ వస్తువులకైతే డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుందో ఆ వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఎందుకంటే అటువంటి వస్తువుల ధరను పెంచి లాభం పొందగలుగుతారు.

2. సమిష్టి వస్తువుల ధర నిర్ణయం: జంటగా కొన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడతాయి. ఉదా: పంచదార, మొలాసిన్, ఈ వస్తువుల విషయంలో ఒక్కొక్క వస్తువు ఉత్పత్తి వ్యయాన్ని విడదీసి చెప్పడానికి వీలుండదు. అందువల్ల ఈ వస్తువుల ధర నిర్ణయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉన్న వాటికి తక్కువ ధరను, అవ్యాకోచంగా ఉన్న వాటికి ఎక్కువ ధర నిర్ణయించడం జరుగుతుంది.

3. ఏకస్వామ్యదార్లు: ఏకస్వామ్యదార్లు వస్తువుకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఆధారంగా ధర నిర్ణయిస్తారు. అవ్యాకోచత్వం ఉన్న వస్తువులకు ఎక్కువ ధరను, వ్యాకోచత్వం ఎక్కువ ఉన్న వస్తువులకు తక్కువ ధరను నిర్ణయిస్తారు.

4. ప్రభుత్వం: కొన్ని వస్తువులు ప్రజాసంక్షేమాన్ని పెంపొందిస్తాయి. అందువల్ల ఈ వస్తువులకు డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఉదా: మందులు, రైలు ప్రయాణం మొదలైనవి.

5. ఆర్థిక మంత్రికి పన్నులు విధించేటప్పుడు ఆర్థిక మంత్రికి వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వం ఉపయోగపడుతుంది. అంతేకాక ఆర్థిక మంత్రికి కోశ విధాన రూపకల్పనలో డిమాండ్ వ్యాకోచత్వ భావన తోడ్పడుతుంది.

6. అంతర్జాతీయ వ్యాపారం అంతర్జాతీయ వ్యాపారంలో వివిధ దేశాల మధ్య వస్తువుల మారకపు రేటును నిర్ధారించేటప్పుడు వస్తువులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదా: ఏ దేశమైనా మూల్యహీనీకరణ ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే ఎగుమతి చేసే వస్తువులకు దిగుమతి చేసుకొంటున్న వస్తువులకు ధర డిమాండ్ వ్యాకోచత్వం ‘1’ కంటే ఎక్కువగా ఉండాలి.

7. పేదరికం: సంపద మాటున దాగిఉన్న పేదరికంను అర్థం చేసుకోవడానికి డిమాండ్ వ్యాకోచత్వ భావన ఉపయోగపడుతుంది.

8. వేతనాలు: శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వం వారి వేతనాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల యాజమాన్యం వేతనాలను నిర్ణయించేటప్పుడు శ్రామికులకున్న డిమాండ్ వ్యాకోచత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
డిమాండ్ సూత్రాన్ని లేదా ధర-డిమాండ్ భావనను వివరించండి.
జవాబు:
అర్థశాస్త్రంలో డిమాండ్ భావనకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక వస్తువును కొనాలనే కోరికతోపాటు కొనేశక్తి, కొనాలన్న ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కనుక డిమాండ్ను ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చు. “ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధరవద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తువు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అని బెన్హమ్ పేర్కొన్నాడు.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ధర డిమాండ్-డిమాండ్ సూత్రము: డిమాండ్ సూత్రం వస్తువు ధరకు, డిమాండ్కు గల సంబంధాన్ని తెలియజేస్తుంది. “ఇతర అంశాలు స్థిరముగా ఉంటే, వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది.” అని మార్షల్ డిమాండ్ సూత్రాన్ని నిర్వచించెను. డిమాండ్ సూత్రాన్ని ఈ విధంగా పేర్కొనవచ్చును.
Dn = f[Pn]

డిమాండ్ పట్టిక:
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 27AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 28

వినియోగదారుడు లేదా వినియోగదారులు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఏ పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది డిమాండ్ పట్టిక. పట్టిక నుంచి వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని డిమాండ్ రేఖను గీయవచ్చును.

డిమాండ్ రేఖ: పటములో X – అక్షముపై వస్తువు డిమాండ్ పరిమాణం, Y – అక్షముపై వస్తువు ధరను చూపినాము. DD డిమాండ్ రేఖ. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందివైపుకు వాలి ఉంది. ఇది ఋణాత్మకమైన వాలు. వస్తువు ధరకు, డిమాండ్కు మధ్య విలోమ సంబంధమున్నదని ఋణాత్మకమైన వాలు తెలియజేస్తుంది.

ప్రశ్న 2.
డిమాండ్ సూత్రం మినహాయింపులను వివరించండి.
జవాబు:
డిమాండ్ సూత్రం ప్రకారం వస్తు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాని కొన్ని పరిస్థితులలో ధర, డిమాండ్ అనులోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ధర తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఈ పరిస్థితి డిమాండ్ సూత్రానికి మినహాయింపు.

ధర ‘OP’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ధర ‘OP’ నుంచి OP1 కు పెరగగా డిమాండ్ OQ నుంచి OQ1 కు పెరిగింది. ఈ పరిస్థితి డిమాండ్ సూత్రానికి విరుద్ధం.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 29

మినహాయింపులు:
1. గిఫెన్ వైపరీత్యం: పేద కార్మికులు రొట్టె ధర పెరిగితే మాంసముపై వెచ్చించే డబ్బును కూడా రొట్టెపై ఖర్చు చేస్తారు. అనగా రొట్టె ధర పెరిగినా డిమాండ్ తగ్గదు. ఇది పేదవాళ్ళ ఆహారం కావటమే ఇందుకు కారణము. ఈ సత్యాన్ని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త 19వ శతాబ్దం మధ్య భాగంలో పరిశీలించాడు. కనుక దీనిని గిఫెన్ వైపరీత్యం అంటారు. పేదవారు ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో తక్కువ ధర గల వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వస్తువులనే గిఫెన్ వస్తువులంటారు. ఉదా: రాగులు, జొన్నలు మొదలైనవి.

2. గౌరవ సూచిక వస్తువులు: గౌరవ సూచిక వస్తువుల ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. వీటిని కొనుగోలు చేయటం వలన సమాజంలో గౌరవము, ప్రతిష్ఠ పెరుగుతాయని భావిస్తారు. వీటి ధర తగ్గితే గౌరవం, ప్రతిష్ఠ తగ్గుతాయని భావిస్తారు. ఉదా: విలువ గల వజ్రాలు, ఆభరణాలు మొదలైనవి. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకము. ఈ విషయాన్ని వెబెన్ అనే అమెరికా ఆర్థికవేత్త తెలియజేసెను. అందువల్ల ఇటువంటి వస్తువులను వెబ్లెన్ వస్తువులంటారు.

3. అంచనా వ్యాపారం: ఒక వస్తువు ధర మరింత పెరగడానికి వ్యాపారస్తులు, కొనుగోలుదారులు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదే విధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే సట్టా వ్యాపారం అని కూడా అంటారు. ఉదా: షేర్లు, బాండ్లు మొదలైనవి.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

4. భ్రాంతి: కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగి ఉన్న వస్తువులు ఎక్కువ నాణ్యతతో కూడి ఉంటాయన్న భ్రాంతిలో ఉంటారు. అందువల్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇటువంటి వాటి విషయంలో డిమాండ్ సూత్రం వర్తించదు.

ప్రశ్న 3.
డిమాండ్ రేఖ ఎందుకని రుణాత్మక వాలు కలిగి ఉంటుంది. లేదా ఎందుకని ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతుంది ?
జవాబు:
ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తువు పరిమాణాన్ని డిమాండ్ అంటారు. “ఇతర పరిస్థితులు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది.” అని డిమాండ్ సూత్రం తెలియజేస్తుంది. దీనిని బట్టి వస్తువు థరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉందని తెలుస్తుంది. కనుక డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందివైపుకు వాలి ఉంటుంది. దీనికి అనేక కారణాలున్నాయి. అవి:

1. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం: క్షీణోపాంత ప్రయోజనాన్ని ఆధారంగా చేసుకొని డిమాండ్ సూత్రం చెప్పబడినది. వస్తువు పరిమాణం ఎక్కువైతే ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది. ఉపాంత ప్రయోజనం తక్కువగా ఉంటే వినియోగదారుడు ఆ వస్తువుకు ధర చెల్లించాలనుకున్నాడు. అందువల్ల ధర తక్కువగా ఉంటే ఎక్కువగానూ, ధర ఎక్కువగా ఉంటే తక్కువగాను వస్తు పరిమాణాన్ని బట్టి డిమాండ్ చేస్తాడు.

2. ఆదాయ ప్రభావము: ఒక వస్తువు ధర పెరిగితే వినియోగదారుని వాస్తవిక ఆదాయం ధర పెరిగిన మేరకు తగ్గుతుంది. అందువల్ల వాస్తవిక ఆదాయం తగ్గినమేరకు ఆ వస్తువును తక్కువ పరిమాణంలో డిమాండ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఒక వస్తువు ధర తగ్గితే ధర తగ్గిన మేరకు వాస్తవిక ఆదాయం పెరిగినట్లే అవుతుంది. కనుక ఆ మేరకు డిమాండ్ పెరుగుతుంది. దీనినే డిమాండ్పై ఆదాయ ప్రభావం అంటారు. ఉదా: ఒక వస్తువుకు వినియోగదారుడు 5 రూపాయలు కేటాయిస్తే వస్తువు ధర ఒక రూపాయిగా ఉంటే 5 యూనిట్లు కొనుగోలు చేస్తాడు. వస్తువు ధర అర్థ రూపాయికి తగ్గితే 10 యూనిట్లను కొనుగోలు చేస్తారు.

3. ప్రత్యామ్నాయాల ప్రభావం రెండు వస్తువులు ప్రత్యామ్నాయ వస్తువులు అయితే ఒక వస్తువు ధర తగ్గి మరొక వస్తువు ధర స్థిరంగా ఉంటే ధర తగ్గిన వస్తువుకు ధర స్థిరంగా ఉన్న వస్తువుకు బదులుగా ప్రత్యామ్నాయం చేస్తారు. ఉదా: పెప్సి, థమ్సప్ శీతల పానీయాలు. పెప్సి ధర పెరిగితే వినియోగదార్లు దానికి ప్రత్యామ్నాయంగా థమ్సప్ కొనుగోలు చేస్తారు.

4. పాత, నూతన కొనుగోలుదార్లు: ఒక వస్తువు ధర తగ్గగానే ముందు నుంచి ఆ వస్తువును కొనుగోలు చేస్తున్న పాత వినియోగదారుల వాస్తవిక ఆదాయం పెరిగి ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఒక వస్తువు ధర తగ్గినప్పుడు ఆకర్షితులైన కొత్త వినియోగదార్లు ఆ వస్తువును ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అందువల్ల ధర తగ్గినప్పుడు వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది.

5. వస్తువుకున్న బహుళ ఉపయోగాలు: కొన్ని వస్తువులకు బహుళ ఉపయోగాలుంటాయి. మరికొన్ని వస్తువులు ఒక ప్రత్యేకమైన ఉపయోగానికి మాత్రమే వినియోగించబడతాయి. అనేక ఉపయోగాలున్న వస్తువులకు ధర తగ్గితే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఉదా: పాలు, బొగ్గు, విద్యుచ్ఛక్తి మొదలైనవి.

ప్రశ్న 4.
ఆదాయ డిమాండ్ భావనను వివరించండి.
జవాబు:
వినియోగదారుని ఆదాయానికి, వస్తువు డిమాండ్కు మధ్యనున్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ అంటారు. వివిధ ఆదాయాల వద్ద వస్తువు డిమాండ్ పరిమాణం ఏవిధంగా ఉందో ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది.
D1 = f(y)

ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉంటే ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ధరకు, ఆదాయంకు ధనాత్మక సంబంధం ఉంది. ఆదాయ డిమాండ్ను అనుసరించి వస్తువులలో మేలురకం లేదా నాసిరకం వస్తువులుగా గుర్తించవచ్చు.

మేలురకం వస్తువులు / సాధారణ వస్తువులు: ఆదాయం పెరిగితే మేలురకం వస్తువులు లేదా సాధారణ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 30

ప్రక్క రేఖాపటంలో ‘OX’ అక్షంపై డిమాండ్ పరిమాణంను, ‘OY అక్షంపై ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ ఉన్నప్పుడు ‘OQ’ వస్తు పరిమాణం డిమాండ్ చేయబడింది. ఆదాయం ‘OY’ నుంచి ‘OY1‘ కు పెరిగినప్పుడు మేలురకం వస్తువుల డిమాండ్ ‘OQ’ నుంచి ‘OQ1‘ కు పెరిగింది. ‘YD’ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

నాసిరకం వస్తువులు: మేలురకం వస్తువులకు భిన్నంగా వినియోగదార్ల ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ప్రక్క రేఖాపటంలో ‘OX’ అక్షం మీద డిమాండ్ పరిమాణాన్ని, ‘OY’ అక్షం మీద ఆదాయంను తీసుకొన్నాం. ఆదాయం ‘OY’ నుంచి ‘OY1‘ కు పెరిగినప్పుడు డిమాండ్ ‘OQ’ నుంచి ‘OQ1‘ కు తగ్గును. ‘YD’ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంది.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 31

ప్రశ్న 5.
జాత్యంతర డిమాండ్ భావనను వివరించండి.
జవాబు:
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును.

జాత్యంతర డిమాండ్ను ఈ విధంగా వ్రాయవచ్చు.
Dx = f(Py).

ప్రత్యామ్నాయ వస్తువులు: ఒక కోర్కెను తీర్చగల వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు. ఉదా: కాఫీ, టీ. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ధనాత్మక సంబంధాన్ని తెలియజేయును. దీనిని రేఖాపటం ద్వారా చూపవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 32

పై రేఖాపటంలో కాఫీ ధర ‘OY’ నుంచి ‘OY2‘ కు పెరిగినప్పుడు టీ డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ‘CD’ రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంది.

పూరక వస్తువులు: ఒకే కోరికను తీర్చగల సమిష్టి వస్తువులు. ఉదా: కారు, పెట్రోలు, వీటి విషయంలో డిమాండ్ విలోమ సంబంధాన్ని తెలియజేయును.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 33

పై రేఖాపటంలో డిమాండ్ ‘OQ’ నుండి ‘OQ2‘ కు పెరిగింది. ధర ‘OP’ నుండి ‘OP2‘ కు తగ్గినప్పుడు ‘CD’ రేఖ ఋణాత్మక వాలు కలిగి ఉంది.

ప్రశ్న 6.
డిమాండ్ నిర్ణయించే అంశాలను వివరించండి. [Mar. ’17, ’16]
జవాబు:
“ఒక నిర్ణీతమైన కాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్” అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

డిమాండ్ను నిర్ణయించే కారకాలు లేదా అంశాలు:
1. ఆధాయంలో మార్పు: ప్రజల ఆదాయాల మార్పును బట్టి పస్తువుల డిమాండ్లో మార్పు ఏర్పడుతుంది. ప్రజల ఆదాయం పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయాలు తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది.

2. అభిరుచులు, అలవాట్లలో మార్పులు: ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పుల వలన వస్తువు డిమాండ్ లో మార్పు వస్తుంది.

3. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో మార్పులు: ప్రజల అభిరుచులలో అలవాట్లలో మార్పుల వల్ల వస్తువు డిమాండ్లో మార్పులు వస్తాయి.

4. జనాభాలో మార్పు: జనాభా పెరుగుదల, తగ్గుదలను అనుసరించి కూడా వస్తువుల డిమాండ్లో మార్పులు వస్తాయి.

5. వాతావరణంలో మార్పులు: వాతావరణంలో మార్పులు కూడా డిమాండ్లో మార్పులను తీసుకొని వస్తాయి. ఉదా: వేసవికాలంలో చల్లని పానీయాలకు డిమాండ్ పెరుగుతుంది.

6. సాంకేతికాభివృద్ధి: సాంకేతికాభివృద్ధి వలన వస్తూత్పత్తి వ్యయం తగ్గి, వస్తు ధరలు తగ్గుతాయి. అందువల్ల పూర్వం కొనుగోలు చేయడానికి ఉపయోగించిన ద్రవ్య పరిమాణంలో వస్తువులను ఎక్కువగా డిమాండ్ చేయటానికి అవకాశం ఉంటుంది.

7. ఆర్థిక స్థితిగతులు: వాణిజ్య విజృంభణ కాలంలో అన్ని వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆర్థిక మాంద్య పరిస్థితులలో అన్ని వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది.

8. ప్రభుత్వ విధానము: ప్రభుత్వ పన్నుల విధానం, రాయితీ విధానము మొదలైనవి వస్తువు ధర తగ్గితే డిమాండ్ ప్రభావితం చేయును.

9. వస్తువు ధర: ఒక వస్తువు ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉన్నది. కనుక వస్తువు ధర తగ్గితే, డిమాండ్ పెరుగుతుంది. వస్తువు ధర పెరుగుటచే డిమాండ్ తగ్గుతుంది.

ప్రశ్న 7.
డిమాండ్ వ్యాకోచత్వం అర్థాన్ని తెలిపి, నిర్వచించండి.
జవాబు:
అర్థశాస్త్రంలో డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనకు విశేష ప్రాధాన్యత ఉంది. ధరలో వచ్చిన మార్పు స్పందనకు ప్రతిస్పందనగా డిమాండ్లో ఎంత మేరకు మార్పు వస్తుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలుపుతుంది. ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎంత ఉంటుందో డిమాండ్ వ్యాకోచత్వ భావన తెలియజేయును. అంటే ధరలో వచ్చే శాతం మార్పుకు, డిమాండ్లో వచ్చే శాతం మార్పుకు మధ్య ఉన్న సంఖ్యాత్మక సంబంధాన్ని డిమాండ్ వ్యాకోచత్వం తెలుపుతుంది. డిమాండ్ వ్యాకోచత్వం అనే భావనను కీరనీట్, మిల్ రూపొందించినప్పటికీ, మార్షల్ అభివృద్ధిపరిచారు.

మార్షల్ అభిప్రాయంలో “ధర తగ్గినప్పుడు డిమాండ్ ఎక్కువ పెరిగిందా లేదా తక్కువ పెరిగిందా, ధర పెరిగినప్పుడు డిమాండ్ తక్కువ తగ్గిందా లేదా ఎక్కువ తగ్గిందా అనే దాని ఆధారంగా మార్కెట్ డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువగాని, తక్కువగాని ఉంటుంది.”

శ్రీమతి జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో “ధరలో వచ్చే అనుపాత మార్పు స్పందనకు బదులుగా డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పుకు ప్రతిస్పందన ఏ మేరకు ఉంటుందో తెలియజేసే భావన డిమాండ్ వ్యాకోచత్వం”.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 34

ప్రశ్న 8.
మొత్తం ఖర్చు పద్దతి ద్వారా ధర డిమాండ్ వ్యాకోచత్వాలను ఎలా కొలుస్తారు ?
జవాబు:
ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతులలో మొత్తం ఖర్చు పద్ధతి ఒకటి. ఈ పద్ధతిలో వస్తువు ధర మార్పు వల్ల ఆ వస్తువుపై వినియోగదారుని మొత్తం ఖర్చులో వచ్చిన మార్పులను పరిశీలించడం ద్వారా డిమాండ్ వ్యాకోచత్వం కొలవబడుతుంది. వస్తువు ధరకు, మొత్తం ఖర్చుకు విలోమ సంబంధం ఉంటే డిమాండ్ వ్యాకోచత్వం ఒకటికన్నా ఎక్కువగా ఉంటే దానిని వ్యాకోచిత డిమాండ్ అంటారు. వస్తువు ధరకు, మొత్తం ఖర్చుకు అనులోమ సంబంధం ఉంటే డిమాండ్ వ్యాకోచత్వం ఒకటి కన్నా తక్కువగా ఉంటే దానిని అవ్యాకోచిత డిమాండ్ అంటారు. వస్తువు ధర మారినప్పటికీ మొత్తం ఖర్చులో మార్పు లేకపోతే డిమాండ్ వ్యాకోచత్వం ఒకటికి సమానముగా ఉంటే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. ఈ విషయాన్ని ఈ క్రింది ఊహాజనిత డిమాండ్ పట్టిక ద్వారా గ్రహించవచ్చును.

డిమాండ్ పట్టిక:
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 35

పట్టికలోని విషయాన్ని క్రింది రేఖాపటం ద్వారా పరిశీలించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 36

పటములో Y – అక్షముపై వస్తువు ధరను, X – అక్షముపై మొత్తం ఖర్చును చూపటం జరిగింది. OP1 (60) ధర పెరిగినప్పుడు మొత్తం ఖర్చు తగ్గింది. కనుక డిమాండ్ వ్యాకోచితంగా ఉన్నది. అనగా Ep > 1. ధర OP (50) నుండి OP2 (40) కు తగ్గినపుడు మొత్తం ఖర్చులో మార్పు రాలేదు. కనుక ఏకత్వ వ్యాకోచ డిమాండ్ను సూచిస్తుంది. అనగా Ep = 1. ధర OP2(40) నుండి OP3 (30) కి తగ్గినపుడు మొత్తం ఖర్చు కూడా తగ్గింది. కనుక అవ్యాకోచ డిమాండ్ను సూచిస్తుంది. అనగా Ep < 1. డిమాండ్ రేఖ ABCD లో A నుండి B వరకు వ్యాకోచిత డిమాండ్, B నుండి C వరకు ఏకత్వ వ్యాకోచ డిమాండ్, C నుండి D వరకు అవ్యాకోచ డిమాండ్.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
డిమాండ్
జవాబు:
ఒక వస్తువును కొనాలనే కోరికతో పాటు కొనేశక్తి, ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. బెన్హామ్ అభిప్రాయంలో ఒక నిర్ణీతకాలంలో, నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని డిమాండ్గా పేర్కొనెను.

ప్రశ్న 2.
డిమాండ్ పట్టిక [Mar. ’17]
జవాబు:
వస్తువు ధరకు, వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే పట్టికను డిమాండ్ పట్టిక అంటారు. ఈ డిమాండ్ పట్టిక రెండు రకాలు. 1) వైయుక్తిక డిమాండ్ పట్టిక, 2) మార్కెట్ డిమాండ్ పట్టిక.

ప్రశ్న 3.
వైయుక్తిక డిమాండ్ పట్టిక.
జవాబు:
ఒక వినియోగదారుడు ఒక వస్తువును వివిధ ధరల వద్ద ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేస్తాడో తెలియజేయునది వైయుక్తిక డిమాండ్. దానిని పట్టిక రూపంలో తెలియజేస్తే అది వైయుక్తిక డిమాండ్ పట్టిక.

ప్రశ్న 4.
మార్కెట్ డిమాండ్ పట్టిక
జవాబు:
మార్కెట్లో అనేక మంది వినియోగదారులు ఉంటారు. వారందరి డిమాండ్ పట్టికలను కలిపితే మార్కెట్ డిమాండ్ పట్టిక వస్తుంది. మార్కెట్ డిమాండ్ వివిధ వినియోగదార్లు వస్తువులను వివిధ ధరల వద్ద ఒక వస్తువును ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేస్తుంది.

ప్రశ్న 5.
డిమాండ్ ఫలం [Mar. ’15]
జవాబు:
ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి, దానిని నిర్ణయించే కారకాలకు మధ్యగల సంబంధాన్ని డిమాండ్ ఫలం తెలియజేయును. డిమాండ్ ఫలాన్ని సమీకరణం ద్వారా తెలియజేయవచ్చు. Dx = f(Px, Py, Y, T).

ప్రశ్న 6.
గిఫెన్ వైపరీత్యం లేదా గిఫెన్ వస్తువులు [Mar. ’16]
జవాబు:
ధర పెరిగినప్పటికి డిమాండ్ తగ్గకపోగా, పెరగటం లేదా అదే విధంగా డిమాండ్ను కలిగి ఉండే వస్తువులను గిఫెన్ వస్తువులంటారు. నాసిరకపు వస్తువులను గిఫెన్ వస్తువులంటారు. వాటి ధర పెరిగితే ఇతర వస్తువులపై ఖర్చు తగ్గించి ఈ వస్తువులను కొనుగోలు చేస్తారు. దీనిని సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఆర్థికవేత్త పరిశీలించడం వల్ల దీనిని “గిఫెన్ వైపరీత్యం” అంటారు.

ప్రశ్న 7.
అంచనా వ్యాపారం
జవాబు:
ఒక వస్తువు ధర పెరిగినప్పుడు, ఆ వస్తువు ధర భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని వ్యాపారస్తులు, కొనుగోలుదార్లు భావించినప్పుడు ఆ వస్తువును ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదే విధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోలు తగ్గిస్తారు. దీనినే అంచనా వ్యాపారం అంటారు. ఉదా: స్టాక్ మార్కెట్లో షేర్లు.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ప్రశ్న 8.
వెబ్లెన్ వస్తువులు లేదా గౌరవ సూచిక వస్తువులు
జవాబు:
దీనిని గూర్చి చెప్పిన ఆర్థికవేత్త వెబ్లెన్. గౌరవ సూచిక వస్తువులయిన వజ్రాలు, బంగారు నగలు మొదలైనవి. కలిగి ఉండటం సమాజంలో ప్రతిష్టగా భావిస్తారు ధనికులు. వీటి ధర తగ్గితే వారి గౌరవం, ప్రతిష్ట తగ్గుతాయని కొనుగోలు తగ్గిస్తారు. కనుక ఈ వస్తువుల విషయంలో ధర తగ్గితే డిమాండ్ కూడా తగ్గును.

ప్రశ్న 9.
ధర డిమాండ్
జవాబు:
ఒక వస్తువు ధరకు, దాని డిమాండ్ పరిమాణానికి గల సంబంధాన్ని ధర డిమాండ్ అంటారు. దీనిని ఈ విధంగా తెలియజేయవచ్చు. Dn = f(Pn).

ప్రశ్న 10.
ఆదాయ డిమాండ్ [Mar. ’17]
జవాబు:
ఆదాయానికి, కొనుగోలు చేసే వస్తు పరిమాణానికి ఉన్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ పరిశీలిస్తుంది. సాధారణంగా ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఆదాయ డిమాండ్ను బట్టి వస్తువులను మేలురకం అని, నాసిరకమని విభజించవచ్చు. ఆదాయ డిమాండ్ Dn = f(y)

ప్రశ్న 11.
జాత్యంతర డిమాండ్ [Mar. ’15]
జవాబు:
ప్రత్యామ్నాయ, పూరక వస్తువు ధరలకు, ఒక వస్తువు డిమాండ్కు ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ అంటారు. ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ తెలియజేయును. Dx = f(Py).

ప్రశ్న 12.
ప్రత్యామ్నాయాలు
జవాబు:
సన్నిహిత సంబంధం ఉన్న వివిధ వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులంటారు. ఉదా: కాఫీ, టీ. ఈ వస్తువుల విషయంలో ప్రత్యామ్నాయ వస్తువు ధరలో మార్పు వస్తే, మరో వస్తువు డిమాండ్లో మార్పు వస్తుంది. కనుక ఈ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది.

ప్రశ్న 13.
పూరకాలు
జవాబు:
సంయుక్త వస్తువులను పూరక వస్తువులంటారు. ఉదా: కారు, పెట్రోలు. వీటిలో ఒకటి లేకపోయినా మరొకటి ఉపయోగపడదు. పూరక సంబంధం ఉన్న వస్తువు ధర పెరిగితే, ఇతర వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గితే ఇతర వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. పూరక సంబంధం ఉన్న వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ క్రిందికి వాలి
ఉంటుంది.

ప్రశ్న 14.
నాసిరకం వస్తువులు
జవాబు:
ఆదాయం పెరిగేకొలది కొన్ని రకాల వస్తువులకు డిమాండ్ తగ్గును. ఆదాయం తగ్గితే డిమాండ్ పెరుగును. ఇటువంటి వస్తువులను నాసిరకం వస్తువులంటారు. ఈ వస్తువుల విషయంలో ఆదాయానికి, వస్తువు డిమాండ్కు విలోమ సంబంధం ఉంటుంది. ఉదా: సజ్జలు, రాగులు.

ప్రశ్న 15.
డిమాండ్ వ్యాకోచత్వం
జవాబు:
ఒక వస్తువు ధరలోని మార్పులు, ఆ వస్తువు కొనుగోలు పరిమాణంలో మార్పు ఏ విధంగా ఉంటుందో తెలియజేసే దానిని డిమాండ్ వ్యాకోచత్వం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ప్రశ్న 16.
ధర డిమాండ్ వ్యాకోచత్వం
జవాబు:
ఒక వస్తువు ధరలోని శాతం మార్పుకు, వస్తు డిమాండ్లో కలిగే శాతం మార్పుకు మధ్య ఉన్న నిష్పత్తిని “ధర డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 37

ప్రశ్న 17.
ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం
జవాబు:
వినియోగదారుని ఆదాయంలో వచ్చిన మార్పు శాతంకు, అతని డిమాండ్లో వచ్చిన శాతం మార్పును “ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 38

ప్రశ్న 18.
జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం
జవాబు:
ప్రత్యామ్నాయ, పూరక వస్తువుల ధరలలో వచ్చిన శాతం మార్పుకు, డిమాండ్లో కలిగే శాతం మార్పును “జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం” అంటారు.
AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు 39

ప్రశ్న 19.
పూర్తి వ్యాకోచ డిమాండ్
జవాబు:
ధరలో ఏ మార్పు వచ్చినా లేకున్నా డిమాండ్లో అనంతంగా మార్పు వస్తే దానిని పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ రేఖ ‘X’ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీని సంఖ్యాత్మక విలువ Ep = ∞

ప్రశ్న 20.
పూర్తి అవ్యాకోచ డిమాండ్ [Mar. ’16]
జవాబు:
ధరలో ఎంత మార్పు వచ్చినా డిమాండ్లో ఏ మాత్రము మార్పు ఉండదు. దీనినే పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ రేఖ Y- అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీని సంఖ్యాత్మక విలువ Ep = 0

ప్రశ్న 21.
ఏకత్వ వ్యాకోచ డిమాండ్
జవాబు:
ఒక వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు డిమాండ్ లో వచ్చిన అనుపాతపు మార్పుకు సమానమైతే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటారు. దీని విలువ ఒకటికి సమానము.
Ep = 1
ఇక్కడ డిమాండ్ రేఖ లంబ అతిపరావలయ ఆకారంలో ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 3 డిమాండ్ సిద్ధాంతాలు

ప్రశ్న 22.
సాపేక్ష వ్యాకోచ డిమాండ్
జవాబు:
ఒక వస్తువు ధరలో వచ్చే అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాతపు మార్పు ఎక్కువగా ఉంటే దానిని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 23.
సాపేక్ష అవ్యాకోచ డిమాండ్
జవాబు:
వస్తువు ధరలో వచ్చిన అనుపాతపు మార్పు కంటే డిమాండ్ పరిమాణంలో వచ్చిన అనుపాతపు మార్పు తక్కువగా ఉన్నట్లయితే దీనిని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ‘1’ కంటే తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 24.
ఆర్క్ పద్ధతిని ఎప్పుడు ఉపయోగిస్తారు ?
జవాబు:
డిమాండ్ రేఖపై రెండు బిందువుల మధ్య దూరాన్ని ఆర్క్ అంటారు. డిమాండ్ రేఖపై ఏదో ఒక బిందువు వద్ద కాకుండా రెండు బిందువుల మధ్య భాగంలో ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి ‘ఆర్క్’ పద్ధతిని ఉపయోగిస్తారు.

ప్రశ్న 25.
డిమాండ్ వ్యాకోచత్వం ఉపయోగాలు
జవాబు:
అర్థశాస్త్రంలో డిమాండ్ వ్యాకోచత్వానికి అధిక ప్రాధాన్యత ఉంది.

  1. వ్యాపారస్తులు దీని ఆధారంగా ధర నిర్ణయం చేయడం జరుగుతుంది.
  2. కోశ విధానాన్ని రూపొందించడానికి, ఉత్పత్తి వ్యయాన్ని తెలుసుకోడానికి ఇది ఉపయోగపడుతుంది.