AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 7th Lesson డిమాండ్ సిద్ధాంతాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 7th Lesson డిమాండ్ సిద్ధాంతాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతీయాదాయాన్ని నిర్వచించి, వివిధ జాతీయాదాయ భావనలను వివరించండి.
జవాబు:
ఒక సంవత్సర కాలంలో ఆర్థిక కార్యకలాపాల వలన దేశంలో ఉత్పత్తయ్యే వస్తుసేవల ద్రవ్యరూపం జాతీయాదాయంగా భావించవచ్చు. ఆధునిక అర్థశాస్త్రంలో ‘జాతీయాదాయం’ అనే అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది.

జాతీయాదాయ భావనలు:
1) స్థూల జాతీయోత్పత్తి: ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల ద్రవ్యరూపాన్ని స్థూల జాతీయోత్పత్తి అంటారు. దీనికి విదేశీ వ్యాపారం వలన లభించే ఆదాయం కలపాలి. స్థూల జాతీయోత్పత్తిని అంచనా వేయడంలో (i) ప్రతి అంతిమ వస్తువు లేదా సేవల విలువలను ద్రవ్యరూపంలో చెప్పాలి. (ii) ఏ వస్తువు ‘విలువను రెండుసార్లు లెక్కపెట్టకుండా జాగ్రత్తపడాలి. (iii) ముడిపదార్థాలను పూర్తిగా తయారు కాని వస్తువుల విలువను జాతీయోత్పత్తిలో కలపాలి. వీటిని ఇన్వంటరీస్ అంటారు. వీటిలో తరుగుదల ఉంటే ఆ సంవత్సరపు జాతీయోత్పత్తి నుండి తీసివేయాలి.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

స్థూల జాతీయోత్పత్తిని ఈ క్రింది విధముగా చెప్పవచ్చు.

GNP లేదా GNI = C + I + G + (X – M)

2) స్థూల దేశీయోత్పత్తి: ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల ద్రవ్యరూపం మొత్తాన్ని స్థూల దేశీయోత్పత్తి అంటారు. స్థూల జాతీయోత్పత్తిలో వినియోగము, స్థూల దేశీయ పెట్టుబడి, ప్రభుత్వ వ్యయము, నికర విదేశీ ఆదాయం కలిసి ఉంటాయి. స్థూల దేశీయోత్పత్తిలో వినియోగం, స్థూల దేశీయ పెట్టుబడి, |ప్రభుత్వ వ్యయం మాత్రమే ఉంటాయి.

స్థూల దేశీయోత్పత్తి లేదా GDP = C + I + G

3) నికర జాతీయోత్పత్తి – నికర దేశీయోత్పత్తి: వస్తూత్పత్తిలో ఉత్పత్తి సంస్థలు, యంత్రాలు, భవనాలు, యంత్ర పరికరాలను ఇతర సామాగ్రి వినియోగిస్తాయి. వీటిని అవిచ్ఛిన్నంగా ఉపయోగించడం వలన అవి తరుగుదలకు లోనవుతాయి. దీనినే మూలధనం తరుగుదల అంటారు. ఈ తరుగుదలను స్థూల జాతీయోత్పత్తి లేదా స్థూల దేశీయోత్పత్తి నుండి తీసివేస్తే వచ్చేదే నికర జాతీయోత్పత్తి లేదా నికర దేశీయోత్పత్తి. నికర జాతీయోత్పత్తినే మార్కెట్ ధరలలో జాతీయాదాయం అని కూడా అంటారు. నికర జాతీయాదాయాన్ని అర్థశాస్త్ర పరిభాషలో ‘జాతీయాదాయం’ అంటారు.
నికర జాతీయోత్పత్తి = స్థూల జాతీయోత్పత్తి – మూలధనం పెరుగుదల
NNP = GNP – Depreciation
నికర దేశీయోత్పత్తి = స్థూలదేశీయోత్పత్తి – మూలధనం తరుగుదల
NDP = GDP – Depreciation
నికర జాతీయాదాయాన్ని మదింపు చేయటంలో ఈ క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకొనవలెను.

a) అంతర్జాతీయ వ్యాపారం వలన సంభవించే లాభనష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి.
b) ప్రభుత్వ సంస్థలో ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవలను స్థూల, నికర జాతీయోత్పత్తులలోను, స్థూల, నికర దేశీయోత్పత్తులలోను భాగంగా పరిగణించాలి. సిబ్బందికి ప్రభుత్వం చేసే వ్యయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

4) వ్యష్టి ఆదాయం: ఒక సంవత్సర కాలంలో దేశంలోని వివిధ వ్యక్తులకు, సంస్థలకు లభించే ఆదాయం మొత్తము వ్యష్టి ఆదాయము. వ్యష్టి ఆదాయం, నికర జాతీయోత్పత్తి సమానం కాదు. సంస్థలు తమ లాభంలో కొంత భాగాన్ని ఆదాయ పన్నుగా ప్రభుత్వానికి చెల్లిస్తాయి. కొంత భాగాన్ని పంపిణీ కాని లాభాల రూపంలో “రిజర్వ్ ఫండ్”గా ఉంచుతారు. మిగిలిన భాగాన్ని డివిడెండ్గా వాటాదార్లకు పంపిణీ చేస్తారు. డివిడెండ్లు మాత్రమే వ్యక్తిగత ఆదాయంలో చేరతాయి. కనుక సాంఘిక భద్రతా విరాళాలు, కార్పొరేట్ పన్నులు, పంపిణీ కాని లాభాలు నికర జాతీయోత్పత్తి నుండి మినహాయించాలి. కొంతమంది వ్యక్తులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినప్పటికి ఆదాయం లభిస్తుంది. వీటిని జాతీయాదాయంలో చేర్చరాదు. వృద్ధాప్యపు పింఛనులు నిరుద్యోగ భృతి, వడ్డీలు మొదలైనవాటిని బదిలీ చెల్లింపులంటారు. ఇవి వ్యక్తిగత ఆదాయంలో చేరతాయి. ఈ బదిలీ చెల్లింపులను జాతీయాదాయంలో చేర్చరాదు.
వ్యష్టి ఆదాయం = జాతీయాదాయం – పంపిణీ కాని సంస్థల లాభాలు + బదిలీ చెల్లింపులు – సాంఘిక భద్రతా విరాళాలు కార్పొరేట్ పన్నులు

5) వ్యయార్హ ఆదాయం: వ్యక్తుల వినియోగానికి అందుబాటులో ఉండే ఆదాయాన్ని వ్యయార్హ ఆదాయం అంటారు. వ్యక్తులకు వివిధ రూపాలలో లభించే ఆదాయాలన్నింటిని ఖర్చు చేయడానికి వీలుండదు. ప్రభుత్వానికి వ్యక్తులు ప్రత్యక్ష పన్నులను చెల్లించవలసి ఉంటుంది. కనుక వ్యష్టి ఆదాయం నుండి ప్రత్యక్ష పన్నులను తీసివేస్తే వ్యయార్హ ఆదాయం వస్తుంది. వ్యయార్హ ఆదాయంలో కొంత భాగాన్ని మిగుల్చుకుంటే దానిని పొదుపు అంటారు. దీనిని ఈ క్రింది విధంగా చూపవచ్చును.
వ్యయార్హ ఆదాయం = వ్యష్టి ఆదాయం వ్యష్టి పన్నులు వ్యయార్హ ఆదాయం = వినియోగము + పొదుపు

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

6) ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం: వస్తూత్పత్తి ప్రక్రియలో వినియోగించిన ఉత్పత్తి సాధనాలకు ప్రతిఫలాలను చెల్లిస్తారు. వాటి మొత్తాన్ని ఉత్పత్తి వ్యయం అంటారు. దీనినే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం అని అంటారు. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తికి, నికర జాతీయోత్పత్తికి తేడా ఉంది. నికర జాతీయోత్పత్తి మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు. నికర జాతీయోత్పత్తి నుండి పన్నులను తీసివేస్తే మిగిలేదే ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ అయ్యేది. ప్రభుత్వం కొన్ని వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉత్పత్తి సంస్థలకు సబ్సిడీలు ఇస్తుంది. అప్పుడు వస్తువుల ధరలు సబ్సిడీల మేరకు తగ్గుతాయి. కనుక సబ్సిడీలను నికర జాతీయోత్పత్తికి కలపాలి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయము = నికర జాతీయోత్పత్తి + సబ్సిడీలు – పరోక్ష పన్నులు –
National Income at Factor Cost Net National Income + Subsidies – Indirect Taxes

7) తలసరి ఆదాయం: జాతీయాదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది.
తలసరి ఆదాయం = జాతీయాదాయం / దేశ జనాభా
ఒక దేశ ప్రజల సగటు జీవన ప్రమాణాన్ని తలసరి ఆదాయం నిర్ణయిస్తుంది.

ప్రశ్న 2.
జాతీయాదాయాన్ని గణించే వివిధ పద్ధతులను వివరించండి. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు, సేవల మొత్తం విలువను జాతీయాదాయం అంటారు.
జాతీయాదాయాన్ని గణించడానికి మూడు పద్ధతులు అమలులో ఉన్నాయి. అవి:

  1. ఉత్పత్తి పద్ధతి లేదా ఉత్పాదిత పద్ధతి
  2. వ్యయాల పద్ధతి
  3. ఆదాయాల పద్ధతి

కైరన్ క్రాస్ అభిప్రాయం ప్రకారం “జాతీయాదాయాన్ని మూడు పద్ధతులలో ఏ పద్ధతి ద్వారానైనా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఆదాయాలను కలపడం వల్ల, ప్రతి ఒక్క ఉత్పత్తిని కలపటం వల్ల, ప్రజలు కొనుగోలు చేసే అన్ని వస్తువుల | విలువలను వారి పొదుపులను కలపటం ద్వారా జాతీయాదాయాన్ని గణన చేయవచ్చు”.

1) ఉత్పత్తి మదింపు పద్ధతి: దీనిని ఇన్వెంటరీ పద్ధతి లేదా వస్తుసేవా పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో స్థూల జాతీయోత్పత్తి గణించడానికి ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల పరిమాణాన్ని వాటి మార్కెట్ ధరలతో గుణించి వాటి విలువను నిర్ణయిస్తారు.
మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి = (P1Q1 + P2Q2 + …….PnQ2)
P = ధర
Q = పరిమాణం
1, 2, ……., n = వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు

జాతీయాదాయం: ఈ పద్ధతిలో కేవలం అంతిమ వస్తువుల విలువలను మాత్రమే లెక్కించాలి. ముడిసరుకులు, | మాధ్యమిక వస్తువులు మొదలైనవాటి విలువలను లెక్కించకూడదు.

దీనిలో మదింపు చేసిన విలువలను వివిధ రంగాలైన వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాలకు ఆపాదిస్తారు. అందువల్ల దీన్ని మదింపు చేసిన విలువ లేదా వాల్యుయాడెడ్ పద్ధతి అని కూడా అంటారు.

2) వ్యయాల మదింపు పద్ధతి: ఈ పద్ధతిలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తాలను, నికర ఎగుమతులు, విదేశీ నికర ఆదాయం కూడితే జాతీయాదాయం తెలుస్తుంది.
NI = EH + EF + EG + Net exports + Net income from abroad
ఇచ్చట,
EH = గృహరంగం చేసిన ఖర్చు
EF = సంస్థల వ్యయం
EG = ప్రభుత్వం వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తం

జాతీయాదాయం = ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం + ప్రభుత్వం అంతిమ వినియోగ వ్యయం + నికర దేశీయ మూలధన సంచయనం + నికర వినిమయం + నికర విదేశీ ఆదాయం

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

కేవలం అంతిమ వస్తుసేవలపై వ్యయాన్ని మాత్రమే గణనలో చేర్చే విధంగా జాగ్రత్త వహించాలి.

3) ఆదాయ మదింపు పద్ధతి: ఈ పద్ధతిలో దేశంలో వివిధ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించే భాటకం, వేతనం, వడ్డీ, లాభం, సంస్థలకు వచ్చిన ఆదాయాన్ని కలిపితే జాతీయాదాయం తెలుస్తుంది. ఈ పద్ధతిలో స్వయం ఉపాధి వల్ల ఆర్జించే ఆదాయాలను కలపాలి. బదిలీ చెల్లింపులను కలపకూడదు. ఇదియే ఉత్పత్తి కారకాల ఖరీదు | దృష్ట్యా జాతీయాదాయం,
జాతీయాదాయం = భాటకం + వేతనం + వడ్డీ + లాభం + నికర విదేశీ ఆదాయం

ఉద్యోగిత ఆదాయం:
– స్వయం ఉద్యోగిత ఆదాయం
+ కంపెనీల స్థూల వ్యాపార లాభాలు
+ జాతీయం చేయబడిన పరిశ్రమల స్థూల వ్యాపారం మిగుళ్ళు
+ సాధారణ ప్రభుత్వ సంస్థల స్థూల వ్యాపారం మిగుళ్ళు
+ భాటకం
+ వ్యాపారంలో ఉపయోగించని మూలధన వినియోగానికి ఆపాదించిన ఛార్జీ
= మొత్తం గృహరంగ ఆదాయం
– స్టాక్ ఆప్రిసియేషన్
+ శేషించిన పొరపాటు
= ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి

ఈ పద్ధతిలో జాతీయాదాయం గణించడానికి వివిధ ఆధారాల నుంచి వేల సంస్థలో దత్తాంశ సేకరణ అవసరం. ఆచరణలో ఆదాయానికి సంబంధించిన అన్ని వివరాలు ఖచ్చితంగా తెలియకపోవచ్చు.

ప్రశ్న 3.
జాతీయాదాయ భాగాలను వివరించండి.
జవాబు:
జాతీయాదాయం అనగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యే వస్తు సేవల నికర విలువను |జాతీయాదాయం అంటారు.
జాతీయాదాయం –భాగాలు: జాతీయాదాయంలో 5 ప్రధాన భాగాలున్నాయి. అవి:
ఎ) వినియోగం – C
బి) స్థూల దేశీయ పెట్టుబడి – I
సి) ప్రభుత్వ వ్యయం – G
డి) నికర విదేశీ పెట్టుబడి – (X-M)
ఇ) నికర విదేశీ ఆదాయం

ఎ) వినియోగం (C): మానవుని కోరికలను ప్రత్యక్షంగా సంతృప్తిపరచే వస్తుసేవలపై గృహరంగం చేసే మొత్తం ఖర్చును వినియోగం అంటారు. వినియోగ వస్తువులలో నశ్వర, అనశ్వర వస్తువులు ఉంటాయి. ఉదా: ఆహారధాన్యాలు, వస్త్రాలు, వైద్యసేవలు మొ||నవి. ఇది వ్యక్తుల ఆదాయ స్థాయిపై ఆధారపడి ఉంటుంది.

బి) పెట్టుబడి (I): ప్రస్తుత వినియోగానికి వీలుకాని వస్తువులను, సేవలను ఉత్పత్తి చేయడానికి ఉత్పాదక లేదా మూలధన వస్తువులపై సంస్థలు చేసే ఖర్చును పెట్టుబడి అంటారు. దీనిలో భవిష్యత్లో వినియోగ వస్తువుల ఉత్పత్తికి తోడ్పడే మూలధన వస్తువులపై చేసే ఖర్చు కలిసి ఉంటుంది.

సి) ప్రభుత్వ వ్యయం (G): ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం వస్తుసేవలను ఉత్పత్తి చేస్తుంది. అవస్థాపనా సౌకర్యాలకు, విద్యా, వైద్య సౌకర్యాలు, నీటిపారుదల మొ॥వాటికి ప్రభుత్వం చేసే ఖర్చును ప్రభుత్వ వ్యయం అంటారు.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

డి) నికర విదేశీ పెట్టుబడి (X – M) (ఎగుమతులు దిగుమతులు): అంతర్జాతీయ వ్యాపారం ద్వారా ఒక దేశం ఆర్జించిన ఆదాయం నికర విదేశీ పెట్టుబడి. ప్రతి దేశం తాను ఉత్పత్తి చేసిన వస్తువులలో కొంత పరిమాణం ఎగుమతి చేస్తుంది. చౌకగా ఉన్న వస్తువులను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల ఒక దేశ జాతీయాదాయం గణనలో ఎగుమతుల విలువ, దిగుమతుల విలువల మధ్య వ్యత్యాసాన్ని పరిగణించాల్సి ఉంటుంది. విదేశీ వ్యాపారం వల్ల ఏర్పడిన మిగులును స్థూల జాతీయోత్పత్తికి కలుపుతారు. లోటు ఉంటే జాతీయాదాయంలో కొంత భాగాన్ని ఖర్చు పెడతారు.

ఇ) నికర విదేశీ ఆదాయం: ఒక దేశ ప్రజలు విదేశాలలో సంపాదించి స్వదేశానికి ఆదాయాలను పంపిస్తుంటారు. అదేవిధంగా ఒక దేశంలోని విదేశీయులు తమ దేశీయ ఆదాయాలను పంపిస్తారు. రాబడులు, చెల్లింపుల వ్యత్యాసాన్ని నికర విదేశీ ఆదాయం అంటారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతీయాదాయాన్ని నిర్ణయించే అంశాలు ఏవి ? [Mar. ’17, ’15]
జవాబు:
ఒక దేశ జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలలో ప్రభావితమై నిర్ణయింపబడుతుంది. జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైనవి.
ఎ) సహజ వనరులు: సహజ వనరులు, భౌగోళిక అంశాలు, సారవంతమైన నేలలు మొ||నవి అధికంగా, అనుకూలంగాను లభ్యమై దేశాలలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి జాతీయాదాయంను పెంచుకోవచ్చు.

బి) ఉత్పత్తి కారకాల నాణ్యత, లభ్యత: ఒక దేశంలో అధిక శక్తి సామర్థ్యం గల శ్రామికుల లభ్యత, చొరవ, సామర్థ్యం గల సమర్థవంతమైన వ్యవస్థాపకులు, మూలధనం పెరుగుదల రేటు జాతీయాదాయ పరిమాణాన్ని నిర్ణయిస్తాయి.

సి) సాంకేతిక విజ్ఞాన ప్రగతి: ఒక దేశ సాంకేతిక ప్రగతి ఉత్పత్తి, జాతీయాదాయమును నిర్ణయిస్తుంది. ప్రకృతి వనరులను పూర్తిగా వినియోగించుకొనుటకు ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపకరిస్తాయి.

డి) రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం: ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయ వృద్ధిరేటు పెంపుకు రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం దోహదం చేస్తాయి. ప్రభుత్వ విధానాలు, ఎగుమతి, దిగుమతి విధానాలు, పరిశోధనలపై పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా జాతీయాదాయాన్ని నిర్ణయిస్తాయి.

ప్రశ్న 2.
ఉత్పత్తికారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం అంటే ఏమిటి ? [Mar. ’16]
జవాబు:
ఒక ఆర్థిక వ్యవస్థలో నిర్ణీత సమయంలో ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన పొందే ద్రవ్యరూప ప్రతిఫలాలైన భాటకం, వేతనం, వడ్డీ, లాభం కలిపితే వచ్చే మొత్తాన్ని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తి లేదా జాతీయాదాయం అంటారు. దీనినే వస్తూత్పత్తిలో సేవలు లేదా వనరులు సప్లై చేసిన వ్యక్తులు పొందే ఆదాయాలుగా పేర్కొనవచ్చు. దీనిలో ఉద్యోగులు పొందే వేతనాలు, ప్రైవేటు వ్యక్తులకు చెల్లించిన వడ్డీ, భూస్వాములు పొందిన నికర భాటకం అన్ని రకాల వ్యాపార లాభాలు ఇమిడి ఉంటాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

నికర జాతీయోత్పత్తి మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు. ఎందుకంటే సంస్థలు ప్రభుత్వానికి పరోక్ష పన్నులు. ఉదా: ఎక్సైజ్ సుంకం, అమ్మకం పన్ను చెల్లిస్తారు. కాని ఉత్పత్తికారకాలకు కాదు. అదేమాదిరిగా ప్రభుత్వం కొన్ని రకాల వస్తుసేవలకు సబ్సిడీ చెల్లిస్తుంది. అంటే వస్తు ఉత్పత్తి కారకాలకు కాదు. అందువల్ల వాస్తవ ఉత్పత్తి
వ్యయాల కంటే తక్కువ ధరకే మార్కెట్లో వస్తువులు విక్రయింపబడతాయి. అందువల్ల సబ్సిడీల విలువను నికర జాతీయాదాయానికి కలపాలి. ఈ రోజులలో ప్రభుత్వ రంగం విస్తరించుటయే కాకుండా అనేక పరిశ్రమలను, సంస్థలను నిర్వహిస్తున్నందువల్ల అది పొందుతున్న లాభాలు ఉత్పత్తి కారకాలకు పంపిణీ కావు. అందువల్ల ప్రభుత్వ సంస్థల లాభాలను నికర జాతీయాదాయం నుంచి తీసివేయాలి.

ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి లేదా జాతీయాదాయం = మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి – పరోక్ష పన్నులు + సబ్సిడీలు – ప్రభుత్వ సంస్థల లాభాలు

ప్రశ్న 3.
ఏవేని మూడు జాతీయాదాయ నిర్వచనాలను తెలపండి.
జవాబు:
ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం నికర విలువను జాతీయాదాయంగా భావించవచ్చు. జాతీయాదాయం ఆ దేశంలోని ప్రజల జీవన స్థితిగతులకు, ప్రజల సంక్షేమానికి మధ్య ఉండే సంబంధాన్ని వివరిస్తుంది.

  1. పిగూ నిర్వచనం: ఆచార్య పీగూ నిర్వచనం ప్రకారం ద్రవ్యంలో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయాన్ని విదేశాల నుంచి లభించే నికర ఆదాయాన్ని జాతీయోత్పత్తి అనవచ్చు.
  2. ఫిషర్ నిర్వచనం: తుది వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుంచి పొందే సేవల సముదాయమే జాతీయాదాయం.
  3. మార్షల్ నిర్వచనం: ఒక దేశంలోని శ్రమ, మూలధనం, సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తుసేవలతో కూడుకున్న నికర వస్తుసేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం”.

ప్రశ్న 4.
జనాభా, తలసరి ఆదాయం మధ్యగల సంబంధం ఏమిటి ?
జవాబు:
జాతీయాదాయానికి, జనాభాకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండూ కలిసి తలసరి ఆదాయాన్ని నిర్ణయిస్తాయి. ఒకవేళ జాతీయాదాయం వృద్ధిరేటు 6%, జనాభా వృద్ధిరేటు 3%గా ఉన్నప్పుడు తలసరి ఆదాయం వృద్ధిరేటు 3% గా ఉంటుంది. దీన్ని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.
QPC = P-QP
ఇక్కడ QPC = తలసరి ఆదాయం వృద్ధిరేటు
Q = జాతీయాదాయ వృద్ధిరేటు
QP = జనాభా వృద్ధిరేటు

తలసరి ఆదాయ వృద్ధిరేటు = జాతీయాదాయ వృద్ధిరేటు – జనాభా వృద్ధిరేటు

తలసరి ఆదాయంలో పెరుగుదల జీవన ప్రమాణంలో పెరుగుదలను సూచిస్తుంది. జాతీయాదాయ వృద్ధిరేటు, పెరుగుదల కంటే జనాభా వృద్ధిరేటు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే తలసరి ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

ప్రశ్న 5.
భారతదేశంలో జాతీయాదాయ మదింపులతో సమస్యలు ఏవి ?
జవాబు:
1) ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు సంబంధించిన ఆదాయం లేదా ఉత్పత్తి లేదా వ్యయ రూపకంగా లభ్యమయ్యే గణాంక వివరాలు సమగ్రంగాను, విశ్వసనీయంగాను ఉండవు. ఇందుకు కారణాలు ప్రత్యేకించి శిక్షితులైన గణాంక సిబ్బంది కొరత, ప్రజల నిరక్షరాస్యత వల్ల అకౌంట్స్ను సరిగా నిర్వహించలేకపోవటం.

2) భారతదేశంలో ద్రవ్యేతర రంగం అధికంగా ఉంది. ద్రవ్య చెల్లింపులు లేని వస్తు సేవలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జాతీయాదాయ లెక్కలలో చేర్చబడనందున ఉత్పత్తి అయిన వస్తువులలో చాలాభాగం జాతీయాదాయ లెక్కల్లోకి రాకపోవచ్చు.
ఉదా: తల్లి తన కుటుంబానికి చేసే సేవలు.

3) వృత్తి ప్రత్యేకీకరణ తక్కువగా ఉంది. ఒక వ్యక్తికి ఆదాయం అనేక వృత్తుల నుండి లభిస్తుంది. అందుచేత ఆదాయ సమాచార వివరాలు సేకరించడం కష్టంగా మారుతుంది.

4) మార్కెట్ ధరలలో మార్పుల వల్ల జాతీయాదాయ మదింపులో సమస్యలు ఏర్పడతాయి.

5) జాతీయాదాయ లెక్కలలో చేర్చబడిన ప్రభుత్వ సేవల విలువ ఖచ్చితంగా లెక్కకట్టుట సాధ్యం కాదు.

ప్రశ్న 6.
జాతీయాదాయ అంచనాల ప్రాముఖ్యత తెలియజేయండి.
జవాబు:
జాతీయాదాయ అంచనాల ప్రాముఖ్యత: అనేక కారణాల వల్ల జాతీయాదాయ అంచనాల ప్రాముఖ్యత పెరుగుతుంది.

  1. ఆర్థిక ప్రణాళికల రచనకు జాతీయాదాయ అంచనాలు లేదా గణాంకాలు చాలా ముఖ్యమైనవి.
  2. దేశ ఆర్థిక విధానాలు రూపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి.
  3. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల పనితీరును అంచనా వేయడానికి ఇవి వీలు కల్పిస్తాయి.
  4. దేశ బడ్జెట్ తయారీ: బడ్జెట్ కేటాయింపులలో ఇవి అత్యంత ఉపయోగకరమైనవి.
  5. దేశంలో జీవన ప్రమాణస్థాయి వివరాలు తెలియజేస్తాయి.
  6. మనకు ఇతర దేశాల ఆర్థికవృద్ధిని పోల్చడంలో దోహదం చేస్తాయి.
  7. స్థూల ఆర్థిక విధానాల రూపకల్పనలో ప్రభుత్వాలకు సహాయం చేస్తాయి. 8) భారతదేశంలోని జాతీయాదాయ అకౌంట్స్ను వివరిస్తాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్థూల జాతీయోత్పత్తి (GNP)
జవాబు:
ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన వస్తుసేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి అంటారు. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి
(GNP) = C + I + G + (X – M).

ప్రశ్న 2.
తలసరి ఆదాయం [Mar. ’17, ’16, ’15]
జవాబు:
జాతీయాదాయాన్ని దేశంలో ఉన్న జనాభాతో భాగిస్తే వచ్చేది “తలసరి ఆదాయం”.
తలసరి ఆదాయం = జాతీయాదాయం / దేశ జనాభా
తలసరి ఆదాయం దేశ ప్రజల జీవన ప్రమాణాన్ని సూచిస్తుంది. ఆర్థికాభివృద్ధికి తలసరి ఆదాయమే ప్రధాన సూచిక.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

ప్రశ్న 3.
తరుగుదల
జవాబు:
యంత్రాలు నిరంతరం ఉపయోగించినప్పుడు అవి అరిగిపోయే అవకాశం ఉంది. వాటికయ్యే మరమ్మత్తు ఖర్చును తరుగుదల అంటారు.

ప్రశ్న 4.
వ్యయార్హ ఆదాయం
జవాబు:
వ్యక్తులకు, సంస్థలకు వచ్చే ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం అంటారు. అయితే వ్యక్తులకు, ఈ మొత్తాన్ని ఖర్చు చేసే అవకాశం ఉండదు. ఇందులోనుంచి ప్రత్యక్ష పన్ను, ఆస్తి పన్ను, ఆదాయ పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఆదాయం నుంచి ఈ మొత్తాన్ని తీసివేస్తే మిగిలేదే వ్యయార్హ ఆదాయం.
వ్యయార్హ ఆదాయం = వినియోగం + పొదుపు

ప్రశ్న 5.
చక్రీయ ఆదాయ ప్రవాహం
జవాబు:
ఒక ఆర్థిక వ్యవస్థలో సంస్థల నుంచి గృహ రంగానికి, గృహ రంగం నుంచి సంస్థలకు నిరంతరం ఆదాయం ప్రవహించడాన్ని చక్రీయ ఆదాయ ప్రవాహం అంటారు.

ప్రశ్న 6.
బదిలీ చెల్లింపులు
జవాబు:
కొందరు వ్యక్తులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినా ఆదాయంలో కొంత భాగాన్ని చెల్లించవలసి ఉంటుంది. అవి పెన్షన్లు, నిరుద్యోగభృతి, ప్రభుత్వ బాండ్లపై వడ్డీ మొదలగునవి. వీటిని బదిలీ చెల్లింపులు అంటారు.

ప్రశ్న 7.
జాతీయాదాయం
జవాబు:
ఒక దేశంలో నిర్ణీతకాలంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తుసేవల నికర మార్కెట్ విలువను జాతీయాదాయం అంటారు. జాతీయాదాయం వ్యాపార కుటుంబ రంగాల మధ్య జరిగే చక్రరూప ఆదాయ ప్రవాహాన్ని వివరిస్తుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 7 జాతీయాదాయం

ప్రశ్న 8.
నికర జాతీయోత్పత్తి
జవాబు:
వస్తుసేవల ఉత్పత్తిలో వినియోగించబడే యంత్రాలు, యంత్ర పరికరాలు కొంతకాలం తరువాత కొంత తరుగుదలకు, అరుగుదలకు గురికావచ్చు. అందువల్ల స్థూలజాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేయగా నికర జాతీయోత్పత్తి వస్తుంది. నికర జాతీయోత్పత్తి = స్థూల జాతీయోత్పత్తి – తరుగుదల.