Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి సిద్ధాంతం Textbook Questions and Answers.
AP Inter 1st Year Economics Study Material 4th Lesson ఉత్పత్తి సిద్ధాంతం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
చరానుపాతాల సూత్రాన్ని వివరించండి. [Mar. ’17, ’16, ’15]
జవాబు:
చరానుపాత సూత్రం స్వల్పకాలానికి చెందినది. ఈ సూత్రాన్ని రికార్డో, మాల్టస్, మార్షల్ వంటి సంప్రదాయ ఆర్థికవేత్తలు విశేష ప్రాముఖ్యమిచ్చారు. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ సూత్రాన్ని వ్యవసాయ రంగానికే పరిమితం చేశారు. స్పిగర్ అనే ఆర్థికవేత్త ఒక ఉత్పాదకాన్ని సమాన పరిమాణంలో పెంచుతూ మిగతా కారకాలను స్థిరంగా ఉంచితే ఒక స్థాయి తరువాత ఉపాంత ఉత్పాదకత క్షీణిస్తుంది.
ఈ సిద్ధాంతం కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి, ఒక ఉత్పత్తి సాధనం పరిమాణంలో మార్పులు చేస్తూ ఉన్నప్పుడు ఏ అనుపాతంలో మారుతుందో తెలియజేయును.
చరానుపాత సూత్రం ప్రకారం మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తులు ప్రారంభంలో పెరిగి తరువాత అవి వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద గరిష్ట స్థాయికి చేరతాయి. మొదటగా ఉపాంత ఉత్పత్తి తరువాత సగటు ఉత్పత్తి, ఆ తరువాత మొత్తం ఉత్పత్తి క్షీణిస్తాయి.
ప్రమేయాలు:
- ఈ సూత్రం స్వల్పకాలానికి వర్తిస్తుంది.
- సాంకేతిక విజ్ఞానంలో మార్పు ఉండదు.
- ఉత్పత్తి కారకాల సమ్మేళనం మార్చడం సాధ్యమవుతుంది.
- శ్రమ మాత్రమే చరఉత్పత్తి కారకం మిగతా ఉత్పత్తి కారకాలన్నీ స్థిరం.
- ఉత్పత్తిని భౌతిక యూనిట్ల రూపంలో కొలవవచ్చు.
- శ్రమ సజాతీయంగా ఉంటుంది.
క్షీణ ప్రతిఫల` సూత్రాన్ని ఈ క్రింది ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. భూమిని స్థిరంగా ఉంచి మరొక సాధనం (శ్రమ)ను పెంచుకుంటూ పోతే, ఉత్పత్తిలో వచ్చే మార్పును మూడు దశలుగా వర్గీకరించవచ్చు. ఈ మూడు దశలలో మొత్తం ఉత్పత్తి, ఉపాంత, సగటు ఉత్పత్తుల మార్పులను పరిశీలించవచ్చు. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.
పై పట్టికలో మొత్తం ఉత్పత్తి ప్రారంభంలో పెరుగుతున్న రేటులో, తరువాత తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. 7వ శ్రామికుని ఉపయోగించినప్పుడు మొత్తం ఉత్పత్తి గరిష్టమై తరువాత క్షీణిస్తుంది. సగటు ఉత్పత్తి 3వ శ్రామికుడు వరకు పెరిగి 4వ శ్రామికుని దగ్గర గరిష్ట స్థాయికి చేరి తరువాత క్షీణిస్తుంది. 7వ శ్రామికుని దగ్గర మొత్తం ఉత్పత్తి గరిష్టమైనప్పుడు ఉపాంత ఉత్పత్తి శూన్యమైంది. 8వ శ్రామికుని వద్ద మొత్తం ఉత్పత్తి క్షీణించగా ఉపాంత ఉత్పత్తి ఋణాత్మకమైంది. దీనిని ఈ ప్రక్క రేఖా పటం ద్వారా వివరించవచ్చు.
రేఖాపటంలో TP రేఖ A బిందువు వరకు వేగంగా పెరుగుతూ C బిందువు వద్ద గరిష్టమై తరువాత క్షీణిస్తుంది. “E” బిందువు వద్ద AP, MP రేఖలు ఖండించుకోవడం జరిగింది. మొత్తం ఉత్పత్తి C వద్ద గరిష్టంకాగా AP క్షీణించగా, MP శూన్యమైనది. TP క్షీణించగా, MP ఋణాత్మకమైంది. చరానుపాత సూత్రంలోని ఉత్పత్తి దశలను మూడు దశలుగా విభజించవచ్చు.
- పెరుగుతున్న ప్రతిఫలాలు
- క్షీణ ప్రతిఫలాలు
- రుణాత్మక ప్రతిఫలాలు
ప్రమేయాలు :
- పెరుగుతున్న ప్రతిఫలాలు: ఈ దశలో మొత్తం ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి కంటే అధికంగాను, ఉపాంత ఉత్పత్తి సగటు కంటే ఎక్కువగాను ఉండును.
- క్షీణ ప్రతిఫలాలు: ఈ దశలో మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. సగటు, ఉపాంత ఉత్పత్తులు క్షీణిస్తాయి.
- రుణాత్మక ప్రతిఫలాలు: ఈ దశలో మొత్తం, సగటు ఉత్పత్తులు క్షీణించగా ఉపాంత ఉత్పత్తి ఋణాత్మకం అవుతుంది.
ప్రశ్న 2.
తరహాననుసరించిన ప్రతిఫలాల సూత్రాన్ని వివరించండి.
జవాబు:
దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి సాధనాలను ఒక అనుపాతంలో మార్చినప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో మార్పు చెందుతుందో తెలియజేసే దానిని తరహాననుసరించి ప్రతిఫలాలు అంటారు. మొత్తం ఉత్పత్తి కారకాలను మారిస్తే ఉత్పత్తిలో మూడు దశలు కనిపిస్తాయి.
- తరహాననుసరించి పెరుగుతున్న ప్రతిఫలాలు
- తరహాననుసరించి స్థిర ప్రతిఫలాలు
- తరహాననుసరించి క్షీణ ప్రతిఫలాలు
ప్రమేయాలు:
- ఉత్పత్తి కారకాలన్నీ చరం.
- సాంకేతిక పరిజ్ఞానం స్థిరం.
- ఉత్పత్తిని భౌతికరూపంలో కొలవవచ్చు.
- సంపూర్ణ పోటీ ఉంటుంది.
- శ్రామికులకు లభించే పనిముట్లు, సాధనాలు ఇవ్వబడ్డాయి.
పై ప్రమేయాలకు లోబడి అన్ని ఉత్పత్తి కారకాలను ఒకే నిష్పత్తిలో పెంచినప్పుడు ఉత్పత్తి తరహా విస్తరిస్తుంది. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.
పట్టికలో 1, 2వ శ్రామికులను వాడినప్పుడు మొత్తం ప్రతిఫలాలు రెండు రెట్లకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది పెరుగుతున్న ప్రతిఫలాలను తెలుపును. అంటే ఉత్పత్తిలో పెరుగుదల కన్నా ఉత్పాదకతలో పెరుగుదల ఎక్కువ. 3, 4 శ్రామికులను వినియోగిస్తే ఉపాంత ఉత్పత్తి 11 యూనిట్లుగా ఉంది. దీనిని స్థిర ప్రతిఫలాల దశ అంటారు. అంటే ఉత్పత్తిలో పెరుగుదల, ఉత్పాదకత పెరుగుదల రెండు సమానం. ఇక 5, 6 శ్రామికులను వాడినప్పుడు మొత్తం ప్రతిఫలాలు తగ్గగా ఉపాంత ప్రతిఫలాలు క్షీణించాయి. దీనిని క్షీణ ప్రతిఫలాల దశ అంటారు. అనగా ఉత్పత్తిలో పెరుగుదల రేటు ఉత్పాదకత పెరుగుదల రేటు కన్నా తక్కువ.
పై రేఖాపటంలో AD రేఖ తరహాననుసరించిన ప్రతిఫలాలు A నుండి B వరకు పెరుగుతున్న ప్రతిఫలాలు, B నుంచి C కి స్థిర ప్రతిఫలాలు, C నుంచి D కి క్షీణ ప్రతిఫలాలు ఉన్నాయి.
ఉత్పత్తిదారుడు వివిధ ప్రతిఫలాలు పొందడానికి కారణాలు
- శ్రమ విభజన, ప్రత్యేకీకరణ వల్ల పెరుగుతున్న ప్రతిఫలాలు ఏర్పడతాయి.
- సంస్థ విస్తరించడం వల్ల ఉత్పత్తి కారకాల అసమర్థత, అజమాయిషీ లోపం వల్ల క్షీణ ప్రతిఫలాలు ఏర్పడతాయి.
ప్రశ్న 3.
అంతర్గత ఆదాలు – బహిర్గత ఆదాలకు ఉన్న తేడాలను వ్రాయండి.
జవాబు:
పరిశ్రమ విస్తరణ వల్ల పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణం పెరిగి ఈ ఆదాలు సంస్థలకు లభిస్తాయి. పరిశ్రమలో ఉత్పత్తి తరహా పెరిగినప్పుడు ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలంటారు.
1. సాంకేతిక ఆదాలు: మూలధన పరికరాలు ఇవ్వబడినవిగా భావిస్తే స్వల్పకాలంలో సాంకేతిక ఆదాలను పొందవచ్చు. సంస్థ ఎక్కువ సామర్థ్యం కలిగిన మంచి, పెద్ద యంత్రాలను, అధునాతన ఉత్పత్తి పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ఉత్పత్తి బాగా పెరుగుతుంది.
2. మార్కెటింగ్ ఆదాలు: పెద్ద సంస్థలు అధిక మొత్తంలో ముడిపదార్థాలు కొనడం వల్ల తమకు అనుకూల షరతుల ప్రకారం నాణ్యతగల ముడిసరుకులను సమయానికి పొందడం, తక్కువ రవాణా ఖర్చులు లాంటి ప్రయోజనాలు ఏర్పడతాయి.
3. నిర్వహణ ఆదాలు: పెద్ద సంస్థలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకుంటున్నందువల్ల విధి సంబంధిత ప్రత్యేకీకరణ పెరిగి సంస్థలో ఉత్పాదక సామర్థ్యం పెరిగి, ఉత్పత్తి పెరిగి సగటు యాజమాన్యపు వ్యయం తగ్గుతుంది.
4. విత్తపరమైన ఆదాలు: పెద్ద సంస్థకు ఉన్న మంచి పేరు, అధిక ఆస్తులవల్ల రుణాలను, సులభంగా తక్కువ వడ్డీ రేటుకు సకాలంలో పొందుతుంది. సంస్థ మూలధనాన్ని మార్కెట్లో షేర్లు, డిబెంచర్లు అమ్మడం వల్ల కూడా సేకరిస్తుంది.
5. నష్టాన్ని భరించే ఆదాలు: పెద్ద సంస్థలు చిన్న సంస్థల కంటే సులభంగా నష్టాన్ని విస్తరించుకోగలవు. ఒకరకం వస్తూత్పత్తిలో వచ్చిన నష్టాన్ని ఇతర రకాల వస్తూత్పత్తిలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోవచ్చు. మార్కెట్లను విస్తరించుకోవడం వల్ల ఒక మార్కెట్లో ఉన్న తక్కువ డిమాండ్ను ఇతర మార్కెట్లో ఉన్న అధిక డిమాండ్ తో భర్తీ చేసుకోవచ్చు.
6. పరిశోధన ఆదాలు: చిన్న సంస్థ కంటే పెద్ద సంస్థకు అధిక వనరులుంటాయి. అందువల్ల స్వంతంగా పరిశోధన ప్రయోగశాలను కలిగి శిక్షణ పొందిన పరిశోధకులను నియమించుకుంటుంది. వారు కనుగొనే కొత్త విషయాలు సంస్థ ఆస్తి. సంస్థ వీటిని ఉపయోగించుకొని వ్యయాన్ని తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకుంటుంది.
7. సంక్షేమ ఆదాలు: సంస్థలు శ్రామికులకు సంక్షేమ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. పెద్ద సంస్థలు పనిచేయడానికి మంచి పరిస్థితులను, సంస్థ లోపల, బయట కల్పిస్తాయి. సంక్షేమ సౌకర్యాలకయ్యే వ్యయం ఎక్కువగా ఉన్నా దానివల్ల శ్రామికుల సామర్థ్యం పెరిగి, మొత్తం ఉత్పత్తి పెరగడానికి, ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంది.
బహిర్గత ఆదాలు: పరిశ్రమను ఒక ప్రాంతంలో స్థాపించినప్పుడు నవకల్పనలను ప్రవేశపెట్టడం వల్ల, ప్రత్యేకీకరణను ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడే ఆదాలే బహిర్గత ఆదాలు. వీటిని పరిశ్రమలోని సంస్థలన్నీ అనుభవిస్తాయి.
1) కేంద్రీకరణ ఆదాలు: ఒక పరిశ్రమ ఒక ప్రాంతంలో కేంద్రీకరణ జరిగితే కొన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. వీటిని సంస్థలన్నీ అనుభవిస్తాయి. నైపుణ్యం కలిగిన శ్రామికులు లభించటం, రవాణా, సమాచార సౌకర్యాలు ఏర్పరచడం, మెరుగుపరచటం, బ్యాంకులు, విత్త సంస్థలు, బీమా సంస్థలు తమ శాఖలను ఏర్పాటు చేసి సకాలంలో ఋణాలను తక్కువ వడ్డీ రేటుకు అందించడం, బీమా సౌకర్యాన్ని ఏర్పరచడం, సంస్థలకు విద్యుచ్ఛక్తిని సరిపడే పరిమాణంలో తక్కువ రేట్లకు సరఫరా చేయడం, ఇతర అవస్థాపనా సౌకర్యాలు ఏర్పరచడం, అనుషంగిక పరిశ్రమలు ఏర్పడి, కేంద్రీకృతమై పరిశ్రమకు కావలసిన వస్తువులను సరఫరా చేస్తాయి.
2) సమాచార ఆదాలు: ఒక సంస్థ కంటే పరిశ్రమలో ఎక్కువ వనరులు ఉన్నందువల్ల పరిశోధనా ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తుంది. పరిశ్రమకు చెందిన సమాచార కేంద్రం తమ ప్రచురణ ద్వారా ముడి సరుకుల లభ్యత, ఆధునిక యంత్రాలు, ఎగుమతి అవకాశాలు మొదలైన ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సంస్థలకు అందిస్తుంది.
3) ప్రత్యేకీకరణ ఆదాలు: పరిశ్రమ పరిమాణం పెరిగితే సంస్థలు వివిధ ప్రక్రియలలో ప్రత్యేకీకరణను సాధిస్తాయి. ఫలితంగా పరిశ్రమ మొత్తానికి లాభం చేకూరుతుంది. ఉత్పత్తి పెరిగి, ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి.
4) సంక్షేమ ఆదాలు: సంస్థ కంటే పరిశ్రమే శ్రామికులకు, సంక్షేమ సౌకర్యాలు కల్పించడంలో ముందు ఉంటుంది. ఫలితంగా శ్రామికుల సామర్థ్యం పెరిగి, పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణాన్ని, నాణ్యతను పెంచవచ్చు. వీటివల్ల సంస్థ ఉత్పాదక సామర్థ్యం పెరిగి సగటు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది.
ప్రశ్న 4.
సంస్థలోని స్వల్పకాలిక వ్యయాలను గురించి వ్రాయండి.
జవాబు:
ఒక ఉత్పత్తిదారుడు ఉత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు రెండు కాలాల ఆధారంగా చేస్తాడు.
అవి 1. స్వల్పకాలం 2. దీర్ఘకాలం. స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలు అనగా శ్రామికులు,ముడిపదార్థాలను మార్చవచ్చు. అందువల్ల ఉత్పత్తిదారునికి స్వల్పకాలంలో స్థిర వ్యయాలు, చర వ్యయాలు ఉంటాయి.
1. స్థిర వ్యయాలు: ఉత్పత్తిదారుడు భవనాలు, యంత్రాలు, శాశ్వత కార్మికుల జీతాలు, బీమా మొదలైన వాటిపై చేసే వ్యయాలను స్థిర వ్యయాలు అంటారు. వస్తూత్పత్తిని పెంచినా, తగ్గించినా ఈ వ్యయాలు మారవు. వీటిని అనుబంధ వ్యయాలని, వ్యవస్థాపరమైన వ్యయాలని అంటారు.
2. చర వ్యయాలు: శ్రామికులు, ముడి పదార్థాలు మొదలైన వాటిపై చేసే వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఈ వ్యయాలు ఉత్పత్తితో పాటు మారతాయి. దీనిలో ముడి పదార్థాలకు చెల్లించే ధర, శ్రామికుల వేతనాలు, రవాణా మొదలైన చెల్లింపులు ఉంటాయి. వీటిని ప్రత్యక్ష వ్యయాలని లేదా ప్రధాన వ్యయాలని అంటారు.
మొత్తం వ్యయం: స్వల్పకాలంలో స్థిర మరియు చర వ్యయాలను కలుపగా మొత్తం వ్యయం వస్తుంది.
మొత్తం వ్యయం = స్థిర వ్యయం + చర వ్యయం
TC = FC + VC
వాటిని ఈ క్రింది పట్టిక ద్వారా చూపవచ్చు.
పై పట్టికలో ఉత్పత్తిని క్రమంగా పెంచుతూ పోయినపుడు స్థిర వ్యయాలు మారకుండా ఉన్నాయి. చర వ్యయాలు ఉత్పత్తితో పాటు మారుతున్నాయి. స్థిర, చర వ్యయాలను కలుపగా మొత్తం వ్యయం వస్తుంది. దీనిని క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
పై రేఖాపటంలో ‘X’ అక్షంపై ఉత్పత్తి యూనిట్లని, ‘Y’ అక్షంపై వ్యయాన్ని తీసుకోవడం జరిగింది. వివిధ వ్యయ రేఖల ఆకారం ఉత్పత్తికి, వివిధ వ్యయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేయును. స్థిర వ్యయరేఖ (TFC) ‘X’అక్షానికి సమాంతరంగా ఉంది. స్వల్పకాలంలో ఉత్పత్తి పెరగటం వల్ల స్థిర వ్యయంలో ఎలాంటి మార్పు ఉండదు. చర వ్యయరేఖ మూలబిందువు దగ్గర మొదలవుతుంది. దీనికి కారణం ఉత్పత్తి శూన్యమయితే చర వ్యయం కూడా శూన్యమౌతుంది. ఉత్పత్తి పెరిగేకొద్ది చర వ్యయం కూడా పెరుగుతుంది.
సగటు వ్యయం: మొత్తం వ్యయాన్ని మొత్తం ఉత్పత్తితో భాగిస్తే వచ్చేది సగటు వ్యయం.
AC = TC/Q
ఉపాంత వ్యయం: ఉత్పత్తి ప్రక్రియలో అదనంగా ఒక యూనిట్ని పెంచినప్పుడు ఆ అదనపు యూనిట్ వల్ల మొత్తం వ్యయంలో వచ్చే మార్పు.
MC = ΔTC/ΔQ
ఈ క్రింది రేఖాపటం ద్వారా MC మరియు AC సంబంధాన్ని తెలియజేయవచ్చు.
పై రేఖాపటంలో ‘X’ అక్షంపైన ఉత్పత్తిని, Y అక్షంపైన వ్యయాన్ని చూపినాము. SAC స్వల్పకాలిక వ్యయరేఖ, యూనిట్లు SMC స్వల్పకాలిక ఉపాంత వ్యయరేఖ. ఉత్పత్తి పెరుగుతుంటే మొదట సగటు వ్యయం తగ్గుతుంది. సగటు వ్యయం తగ్గుతున్నంత వరకు ఉపాంత వ్యయం, సగటు వ్యయంకన్నా తక్కువగా ఉంటుంది. ఉత్పత్తిని కొనసాగిస్తే సగటు వ్యయం కనిష్ట స్థాయికి వస్తుంది. ఉపాంత వ్యయం, సగటు వ్యయంతో సమానమౌతుంది. SAC మరియు SMC ఖండించుకున్న ‘A’ బిందువు వద్ద ఉత్పత్తి వ్యయం కనిష్టంగా ఉంటుంది.
అదనపు ప్రశ్నలు
ప్రశ్న 1.
సప్లయ్ సూత్రాన్ని వివరించండి.
జవాబు:
ఒక నిర్ణీత ధర వద్ద, నిర్ణీతకాలంలో మార్కెట్లో విక్రయదారుడు అమ్మడానికి ఇష్టపడే వస్తురాశిని సప్లయ్ అంటారు. సప్లయ్ సూత్రం వస్తు ధరకు, వస్తు సప్లయ్కి గల సంబంధాన్ని తెలియజేయును. ఇతర అంశాలు అన్ని స్థిరంగా ఉన్నప్పుడు వస్తుధర పెరిగితే సప్లయ్ పెరుగుతుంది. ధర తగ్గితే సప్లయ్ తగ్గుతుంది. ధరకి సప్లయి ్క అనులోమ సంబంధం ఉంటుంది. ఈ సప్లయ్ సూత్రాన్ని సప్లయ్ పట్టిక, సప్లయ్ రేఖ ద్వారా వివరించవచ్చు.
సప్లయ్ పట్టిక: ఒక నిర్ణీత సమయంలో వివిధ ధరలకు ఉత్పత్తిదార్లు ఎంతెంత వస్తు సరఫరా చేస్తారో సప్లయ్ పట్టిక తెలియజేయును.
ధర పెరుగుతుంటే వస్తు సప్లయ్ పెరుగుతుంది.
ధర తగ్గితే వస్తు సప్లయ్ తగ్గుతుంది. దీనిని ప్రక్క రేఖా పటం ద్వారా వివరించవచ్చు.
రేఖాపటంలో ‘X’ అక్షం మీద వస్తు సప్లయ్ పరిమాణాన్ని, ‘Y’ అక్షంపై వస్తు ధరను కొలుస్తాము. సప్లయ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలుతుంది. ప్రారంభంలో ధర 7 4 ఉంటే సప్లయ్ పరిమాణం 2000గా ఉంటుంది. ఇది SS సప్లయ్ రేఖపై ‘B’ బిందువు దగ్గర ఉంది. ధర గౌ 5 పెరిగితే సప్లయ్ పరిమాణం 3000 గా ఉంది. సప్లయేఖపై ‘B’ బిందువు నుండి C బిందువుకు కదలిక ఏర్పడింది. దీనినే సప్లయ్ విస్తరణ అంటారు. ఒకవేళ ధర ఔ 3 తగ్గితే సప్లయ్ పరిమాణం 1000గా ఉంది. సప్లయ్ రేఖపై ‘B’ బిందువు నుంచి ‘A’ బిందువుకు కదలిక ఏర్పడింది. దానిని సంకోచం అంటారు.
ప్రశ్న 2.
సగటు, ఉపాంత వ్యయరేఖల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించండి.
జవాబు:
వస్తువు ఉత్పత్తి కై ప్రక్రియలో చేసే వ్యయాన్ని ఉత్పత్తి వ్యయం అంటారు. ఉత్పత్తి మొత్తం మీద జరిగే వ్యయం మొత్తం వ్యయము. ఉత్పత్తి పెరిగితే మొత్తం వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి తగ్గితే మొత్తం వ్యయం తగ్గుతుంది.
సగటు వ్యయము: మొత్తం వ్యయాన్ని మొత్తం వస్తురాశితో భాగిస్తే సగటు వ్యయం వస్తుంది. ఇది వస్తువు ఒక యూనిట్కి అయ్యే వ్యయాన్ని తెలియజేస్తుంది.
ఉపాంత వ్యయము: మొత్తం వ్యయము (TC) నుండి ఉపాంత వ్యయం (MC) లభిస్తుంది. మొత్తం వ్యయంలో తేడాను, వస్తు పరిమాణంలో వచ్చే తేడాతో భాగిస్తే ఉపాంత వ్యయం వస్తుంది.
ఈ క్రింది రేఖాపటం ద్వారా సగటు, ఉపాంత వ్యయాల సంబంధాన్ని పరిశీలించవచ్చు. రేఖాపటములో X – అక్షముపై ఉత్పత్తి యూనిట్లని, Y – అక్షముపై వ్యయాన్ని చూపాము. AC సగటు వ్యయరేఖ, MC ఉపాంత వ్యయరేఖ.
SAC స్వల్పకాలిక వ్యయరేఖ, SMC స్వల్పకాలిక ఉపాంత రేఖ. ఉత్పత్తి పెరుగుతుంటే మొదట సగటు వ్యయం తగ్గుతుంది. సగటు వ్యయం తగ్గుతున్నంత వరకు ఉపాంత వ్యయం, సగటు వ్యయంకన్నా తక్కువగా ఉంటుంది. ఉత్పత్తిని కొనసాగిస్తే సగటు వ్యయం కనిష్ట స్థాయికి వస్తుంది. ఉపాంత వ్యయం, సగటు వ్యయంతో సమానమౌతుంది. SAC మరియు SMC ఖండించుకున్న ‘A’ బిందువు వద్ద ఉత్పత్తి వ్యయం కనిష్టంగా ఉంటుంది.
- సగటు వ్యయం తగ్గుతూ ఉంటే ఉపాంత వ్యయం, సగటు వ్యయం కంటే ఎక్కువ తగ్గుతుంది. అందువల్ల సగటు వ్యయరేఖకు క్రిందివైపు ఉపాంత వ్యయరేఖ ఉంది.
- సగటు వ్యయం కనిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత వ్యయం సగటు వ్యయానికి సమానమైంది. కనుక సగటు వ్యయరేఖ కనిష్ట బిందువు వద్ద ఉపాంత వ్యయరేఖ క్రింద నుండి ‘N’ బిందువు వద్ద ఖండించింది.
- సగటు వ్యయం పెరుగుతూ ఉంటే ఉపాంత వ్యయం, సగటు వ్యయం కంటే ఎక్కువగా పెరుగుతోంది. అందువల్ల ఉపాంత వ్యయరేఖ సగటు వ్యయరేఖకు పైన ఉంది. ఈ విషయాలను పట్టిక, పటములో పరిశీలించవచ్చును. చరానుపాత సూత్రాల ప్రభావం, తరహాననుసరించి ప్రతిఫలాల ప్రభావము వలననే వ్యయరేఖలు ‘U’ ఆకారంలో ఉన్నాయి.
ప్రశ్న 3.
సప్లయ్ని నిర్ణయించే అంశాలు ఏవి ?
జవాబు:
1. వస్తుధర: ఉత్పత్తిదారుడు వస్తుసప్లయ్న నిర్ణయించడంలో ఆ వస్తువు ధరే ప్రధాన పాత్రను పోషిస్తుంది. వస్తుధర వల్ల సంస్థ లాభం నిర్ణయమవుతుంది. వస్తుధర పెరిగితే వస్తువుల పరిమాణాన్ని ఎక్కువగా సప్లయ్ చేస్తాడు. వస్తుధర తగ్గితే వస్తు సప్లయ్ తగ్గుతుంది.
2. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు: ప్రత్యామ్నాయ వస్తుధరలు ఎక్కువగా ఉంటే వాటిని ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారుడు ప్రయత్నం చేయవచ్చు. అందువల్ల ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేస్తున్న దాని సప్లయ్ పెంచవచ్చు. అలాగే పూరక వస్తువుల ధరలు వాటికి ఉండే డిమాండ్ ఆధారంగా కూడా ఉత్పత్తిదారుడు తాను చేసే వస్తు సప్లయ్న నిర్ణయించుకుంటాడు.
3. ఉత్పత్తి కారకాల ధరలు: ఉత్పత్తి కారకాల ధరలు ఎక్కువగా ఉంటే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అదే కారకాల ధరలు తక్కువగా ఉంటే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది.
4. సాంకేతిక స్థాయి: సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తి పద్ధతుల్లో మార్పులు వస్తే వస్తు సప్లయ్ మార్పులుంటాయి.
5. సంస్థ లక్ష్యం: సంస్థ లక్ష్యం ఆధారంగా కూడా వస్తు సప్లయ్ మారుతుంది.
6. ప్రభుత్వ విధానాలు: ప్రభుత్వం అధిక పన్నులను వస్తువులపై విధిస్తే వస్తు సప్లయ్ తక్కువగా ఉంటుంది. తక్కువగా పన్నులు విధిస్తే వస్తు సప్లయ్ ఎక్కువగా ఉంటుంది. వస్తూత్పత్తి రాయితీలను ఇస్తే వస్తువుల సప్లయ్ ఎక్కువగా ఉంటుంది.
ప్రశ్న 4.
స్వల్ప కాలంలో స్థిర, చర వ్యయాలను వివరించండి.
జవాబు:
స్వల్ప కాలంలో ఉత్పత్తి వ్యయాన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి స్థిర వ్యయాలు మరియు చర వ్యయాలు.
1. స్థిర వ్యయాలు: ఉత్పత్తిలో వచ్చే మార్పుల వల్ల మారని వ్యయాలను స్థిర వ్యయాలు అంటారు. స్వల్పకాలంలో సంస్థ పెంచినా, తగ్గించినా, ఉత్పత్తి జరగకపోయినా ఈ వ్యయాలలో మార్పు ఉండదు.
ఉదా: శాశ్వత ఉద్యోగుల జీతాలు, బీమా, వడ్డీ మొదలగునవి. ఇవి స్థిరమైనవి. కనుక వీటి మీద చేసే వ్యయాలను స్థిర వ్యయాలు అంటారు.
2. చర వ్యయాలు: ఉత్పత్తితో పాటు మారే వ్యయాలను చర వ్యయాలు అంటారు. ఉత్పత్తిని పెంచితే వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తిని తగ్గిస్తే చర వ్యయం తగ్గుతుంది.
ఉదా: ముడి పదార్థాల కొనుగోలు, ఇంధనం, విద్యుచ్ఛక్తి మొదలగునవి వాటి మీద చేసే వ్యయం చర వ్యయంగా చెప్పవచ్చు.
ప్రశ్న 5.
ఒక సంస్థ యొక్క మొత్తం సగటు, ఉపాంత రాబడులను నిర్వచించండి.
జవాబు:
రాబడి అనేది ఉత్పత్తిదారునికి ఉత్పత్తిని నిర్ణయించటంలోను, లాభనష్టాలను తెలపటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. రాబడులలో మొత్తం, సగటు, ఉపాంత రాబడులుంటాయి.
మొత్తం రాబడి: మొత్తం ఉత్పత్తిని మార్కెట్లో ఒక ధర వద్ద విక్రయించగా వచ్చేది ఉత్పత్తిదారునికి రాబడి అవుతుంది. మొత్తం రాబడి మార్కెట్లో వస్తువు ధర మీద, విక్రయించిన వస్తురాశిమీద ఆధారపడి ఉంటుంది.
మొత్తం రాబడి = P x Q
సగటు రాబడి: మొత్తం రాబడిని విక్రయించిన వస్తురాశితో భాగిస్తే సగటు రాబడి వస్తుంది.
సగటు రాబడి = మొత్తం రాబడి / విక్రయించిన వస్తురాశి
ఉపాంత రాబడి: ఒక వస్తువును అదనంగా విక్రయిస్తే వచ్చే రాబడి ఉపాంత రాబడి.
ప్రశ్న 6.
సంపూర్ణపోటీలో, రాబడి రేఖల యొక్క స్వభావాన్ని వివరించండి.
(లేదా)
పరిపూర్ణ పోటీ మార్కెట్లో రాబడి రేఖల స్వభావాన్ని వివరించండి.
జవాబు:
పరిపూర్ణ పోటీ మార్కెట్లో అనేకమంది అమ్మకందార్లు, కొనుగోలుదార్లు ఉంటారు. ఈ మార్కెట్లో వస్తువులు సజాతీయాలు. రవాణా ఛార్జీలు, అమ్మకపు వ్యయాలు ఉండవు. కాబట్టి మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది. ఈ మార్కెట్లో రాబడుల యొక్క స్వభావాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
పై పట్టికలో ఉత్పత్తి పరిమాణం ఎంత ఉన్నా ఒకే ధరకు గౌ 10 అమ్మటం జరిగింది. ఉత్పత్తి ధరతో గుణించగా మొత్తం రాబడి వస్తుంది. మొత్తం రాబడి ఒకే మొత్తంలో పెరుగుతూ ఉంది. పట్టికలో సగటు, ఉపాంత రాబడి ఒకే సంఖ్యను కలిగి ఉన్నాయి. ఈ మార్కెట్లో వస్తువు ధర, సగటు, ఉపాంత రాబడులు ఒకటిగానే ఉన్నాయి. దీనిని ఈ క్రింది రేఖాపటాల ద్వారా చెప్పవచ్చు.
పటంలో (A), (B) లో X- అక్షంపైన వస్తు పరిమాణాన్ని, Y-అక్షంపైన ధరను, రాబడులను కొలుస్తున్నాం. పటం (A) లో DD-డిమాండ్ రేఖ, SS-సప్లయ్ రేఖ రెండు E దగ్గర ఖండించుకున్నప్పుడు పరిశ్రమలో సమలతౌల్యం ఏర్పడి OP ధర నిర్ణయించడింది. ఈ OP ధరకే సంస్థ వస్తువులను అమ్ముతుంది. అందుకే పటం (B) లో OP ధర ఉన్నప్పుడు AR రేఖ MR రేఖ కలిసిపోయి X అక్షానికి సమాంతరంగా రేఖ ఉంది.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఉత్పత్తి ఫలం
జవాబు:
ఉత్పాదకాలకు, ఉత్పత్తికి మధ్య ఉండే భౌతిక సంబంధాన్ని తెలుపుతుంది. ఉత్పత్తి కారకాలు రేటుకు, ఉత్పత్తి రేటుకు మధ్య ఉండే సంబంధాన్ని ఉత్పత్తి ఫలంగా స్పిగ్లర్ వర్ణించాడు. దీనిని ఈ క్రింది సమీకరణం ద్వారా తెలియజేయవచ్చు.
Q = f (N, I, C. O, T)
ఇక్కడ Q = ఉత్పత్తి; N, L, C, O, T వరుసగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక ప్రగతి
ప్రశ్న 2.
సప్లయ్ సూత్రం [Mar. ’16, ’15]
జవాబు:
ఇది వస్తువు ధరకు, వస్తు సప్లయ్కి గల సంబంధాన్ని తెలియజేయును. ఇతర అంశాలు మారకుండా ఉంటే వస్తుధర పెరిగితే వస్తు సప్లయ్ పెరుగును. ధర తగ్గితే వస్తు సప్లయ్ తగ్గుతుందని సప్లయ్ సూత్రం తెలియజేయును. అనగా సప్లయ్కి, ధరకు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది.
ప్రశ్న 3.
ఉత్పత్తి కారకాలు
జవాబు:
ఉత్పత్తికి దోహదపడే కారకాలను ఉత్పత్తి కారకాలు అంటారు. అవి
- భూమి
- శ్రమ
- మూలధనం
- వ్యవస్థాపన.
ప్రశ్న 4.
సగటు వ్యయం
జవాబు:
మొత్తం వ్యయాన్ని వస్తురాశితో భాగిస్తే సగటు వ్యయం వస్తుంది.
సగటు వ్యయం = మొత్తం వ్యయం / వస్తురాశి
ప్రశ్న 5.
ఉపాంత వ్యయం [Mar. ’17]
జవాబు:
ఒక వస్తువు అదనపు యూనిట్ను తయారు చేయడానికి అదనంగా అయిన వ్యయాన్ని ఉపాంత వ్యయం అంటారు.
ప్రశ్న 6.
ఉత్పత్తి
జవాబు:
ఉత్పత్తి కారకాలను, ఉత్పాదకాలను వినియోగించి వస్తువులుగా మార్చే ప్రక్రియను ఉత్పత్తి అంటారు. ఈ ప్రక్రియలో వనరులను ఉపయోగించి వినియోగ వస్తువులను లేదా మూలధన వస్తువులను తయారు చేస్తారు.
ప్రశ్న 7.
స్వల్ప కాలం
జవాబు:
సంస్థ, భూమి, మూలధనాన్ని, వ్యవస్థాపనను మార్పు చేయలేనటువంటి కాలాన్ని స్వల్ప కాలం అంటారు. శ్రమను మాత్రమే మార్చుటకు వీలుంది.
ప్రశ్న 8.
దీర్ఘకాలం
జవాబు:
సంస్థ నాలుగు ఉత్పత్తి కారకాలను మార్పుచేయగల కాలం.
ప్రశ్న 9.
సగటు ఉత్పత్తి
జవాబు:
మొత్తం ఉత్పత్తిని శ్రామికుల సంఖ్యతో భాగిస్తే వచ్చే విలువను సగటు ఉత్పత్తి అంటారు.
ప్రశ్న 10.
ఉపాంత ఉత్పత్తి
జవాబు:
ఉత్పత్తి ప్రక్రియలో అదనపు శ్రామికుని నియమించడం వల్ల మొత్తం ఉత్పత్తిలో ఏర్పడిన మార్పు.
ప్రశ్న 11.
స్థిర కారకాలు
జవాబు: స్వల్ప కాలంలో భూమి, మూలధనం, ఉద్యమిత్వం, స్థిర కారకాలు. వీటిని మార్చటానికి వీలు ఉండదు.
ప్రశ్న 12.
చర కారకాలు
జవాబు:
మార్చటానికి వీలు ఉన్న కారకాలు స్వల్పకాలంలో శ్రమ, చరకాలం, దీర్ఘకాలంలో అన్ని కారకాలు చర కారకాలే.
ప్రశ్న 13.
ఉత్పత్తి తరహా
జవాబు:
దీర్ఘకాలంలో ఉత్పత్తి కారకాల సమ్మేళనాన్ని మార్చడం ద్వారా ఉత్పత్తిలో వచ్చే మార్పులను ఉత్పత్తి తరహా అంటారు.