AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతం Textbook Questions and Answers.

AP Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భాటకాన్ని నిర్వచించి, రికార్డో భాటక సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
ఉత్పత్తి కారకంగా భూమి వస్తూత్పత్తి ప్రక్రియలో అందించే సేవలకు లభించే ప్రతిఫలం భాటకము. డేవిడ్ రికార్డో భాటకాన్ని ఈ విధంగా నిర్వచించారు. “భూమికి ఉన్న సహజమైన, నశింపు కాని ఉత్పాదక శక్తులను ఉపయోగించుకొన్నందుకు పొందే ఫలసాయంలో భూస్వామికి చెల్లించే భాగమే భాటకము”.

రికార్డో భాటక సిద్ధాంతము: డేవిడ్ రికార్డో భాటకాన్ని వైవిధ్యం వల్ల ఏర్పడే మిగులుగా భావించాడు. భూసారాలలోని వైవిధ్యం వల్ల భాటకం జనిస్తుంది. ఈ భాటకం ఏ విధంగా ఉత్పన్నమవుతుందో రికార్డో ఈ విధంగా వివరించాడు. ఒక ఆర్థిక వ్యవస్థలోని భూములను వాటి సారాన్నిబట్టి 3 రకాలైన భూములున్నాయి అనుకుంటే భాటకం లేదా వైవిధ్యం మిగులు ఏ విధంగా ఏర్పడుతుందో ఈ విధంగా వివరించాడు.

ఒక కొత్త దేశానికి కొంతమంది వలస వెళ్లారనుకుందాం. వాళ్లు అతిసారవంతమైన భూములను సాగు చేస్తారనుకుంటే ముందుగా ‘A’ గ్రేడ్ భూములను సాగుచేస్తారు. ఈ భూమిపై 20 క్వింటాళ్ళు పండించటానికి ఉత్పత్తి వ్యయం 300 అనుకుందాం. అంటే యూనిట్ వ్యయం కౌ 15. ప్రతి వ్యవసాయదారుడు కనీసం ఉత్పత్తి వ్యయాన్ని రాబట్టుకోవటానికి యూనిట్ ధరను కూడా 15గా నిర్ణయించాల్సి ఉంటుంది. అప్పుడు ‘A’ గ్రేడ్ భూములపై మిగులు ఉండదు. కాని ఇంకా కొంతమంది ఆ దేశానికి వలస వస్తే లేదా ఆ దేశ జనాభా పెరిగి ధాన్యానికి డిమాండ్ పెరుగుతుంది. ‘A’ గ్రేడ్ భూములన్నీ సాగు చేశారనుకుంటే ‘B’ గ్రేడ్ కౌ 300 ఖర్చు చేస్తే 15 క్వింటాళ్ళ ధాన్యాన్ని మాత్రమే పండించగలుగుతారు. ‘B’ గ్రేడ్ భూమిపై చేసిన వ్యయాన్ని రాబట్టటానికి ధాన్యం యూనిట్ ధరను Rs. 20గా నిర్ణయించాల్సి ఉంటుంది. ఇప్పుడు ‘B’ గ్రేడ్ భూమిపై మిగులుండదు. కాని ‘A’ గ్రేడ్ భూమిపై భౌతిక రూపంలో భాటకం 5 క్వింటాళ్ళు. విలువ రూపంలో కౌ 100 ఇంకా జనాభా పెరిగితే ఆహారధాన్యాలకు డిమాండ్ పెరిగి ‘C’ గ్రేడ్ భూములను కూడా సాగుచేయవలసి ఉంటుంది. ‘C’ గ్రేడ్ భూములు, ‘B’ గ్రేడ్ భూముల కంటే ఇంకా తక్కువ సారవంతమైనవి కనుక Rs. 300 ‘C’ గ్రేడ్ భూములపై వ్యయం చేస్తే 10 క్వింటాళ్ళు మాత్రమే పండించటం జరుగుతుంది. వ్యయాన్ని రాబట్టుకోవటానికి యూనిట్ ధాన్యం ధరను గౌ 30గా నిర్ణయించాలి. అప్పుడు ‘C’ గ్రేడ్ భూమిపై మిగులు ఉండదు. ‘B’ గ్రేడ్ భూమిపై భౌతికంగా 5 క్వింటాళ్ళు మిగులుంటుంది. దాని విలువ Rs. 150. ‘A’ గ్రేడ్ భూమిపై భాటకం పెరుగుతుంది. ‘A’ గ్రేడ్ భూమిపై భౌతికంగా భాటకం 10 క్వింటాళ్ళు దాని విలువ Rs. 300. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా పరిశీలించవచ్చును.
AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం 1

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

పై పట్టికలో భాటకం లేని భూమిని ఉపాంత భూమి అంటారు. భాటకం భూసారంలోని వైవిధ్యం వల్ల ఏర్పడుతుంది. అన్ని ‘A’ గ్రేడ్ భూములైతే భాటకం ఉండదు. ‘B’ గ్రేడ్ భూములను సాగుచేస్తే ‘A’ గ్రేడ్ భూమిపై భాటకం ఏర్పడుతుంది. ‘C’ గ్రేడ్ భూములను సాగుచేస్తే ‘B’ గ్రేడ్ భూములపై భాటకం ఏర్పడుతుంది. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తిలో క్షీణప్రతిఫలాలు ఏర్పడతాయి.
AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం 2

పై రేఖాపటంలో షేడెడ్ ఏరియా వివిధ గ్రేడు భూములలో భాటకం లేదా మిగులును తెలియజేస్తుంది. ‘C’ గ్రేడ్ భూమి ఉపాంత భూమి. కాబట్టి ఈ భూమిలో భాటకం లేదు.

ప్రశ్న 2.
ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు ఏ విధంగా నిర్ణయించబడతాయో ఉపాంత ఉత్పాదకతా సిద్ధాంతం తెలియజేయును.

ఒక ఉత్పత్తి కారకం అదనపు యూనిట్ ఉత్పత్తిలో పాల్గొన్నప్పుడు మొత్తం ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆ కారకం యొక్క ఉపాంత ఉత్పాదకత అంటారు. దీనిని అనుసరించి ఉత్పత్తిదారుడు కారకానికి ఇచ్చే ప్రతిఫలాన్ని నిర్ణయిస్తాడు. డేవిడ్ రికార్డో ఈ సిద్ధాంతాన్ని భూమికి మాత్రమే అన్వయించాడు. జె.బి. క్లార్క్ ఈ సిద్ధాంతానికి ఒక రూపాన్ని కల్పించి దానిని అభివృద్ధిపరిచారు. ఉపాంత ఉత్పాదకతను వస్తురూపంలో గాని, ద్రవ్యరూపంలో గాని లెక్కించవచ్చు.

ఒక కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతను ఈ క్రింది విధంగా వివరించవచ్చు. ఉదా: నలుగురు టైలర్లు రోజుకు పది చొక్కాలు కుట్టగలరని అనుకుందాం. అదే ఐదుగురు టైలర్లు 13 చొక్కాలు కుట్టగలరు. 5వ టైలర్ ఉపాంత భౌతిక ఉత్పత్తి మూడు చొక్కాలు. ఒక్క చొక్కా కుట్టినందుకు వేతనం Rs. 100/- అనుకుంటే 5వ శ్రామికునికి 3. చొక్కాలు కుట్టినందుకు Rs. 300/- వేతనం ఇవ్వవలసి వస్తుంది. ఈ Rs. 300/-ను ఉపాంత ఉత్పత్తి రాబడి అంటారు.

ఉపాంత భౌతిక ఉత్పత్తి సిద్ధాంతం సంపూర్ణ పోటీ మార్కెట్ ప్రమేయంపై ఆధారపడటం వల్ల ఒక ఉత్పత్తి కారకం సగటు వ్యయం దాని ఉపాంత వ్యయంకు సమానంగా ఉంటుంది. ఉత్పత్తి మొదటి దశలో శ్రామికుల సంఖ్య పెంచుతూపోతే తరహాననుసరించి పెరుగుతున్న ప్రతిఫలాల వల్ల అదనపు ఉత్పత్తి రాబడి పెరుగుతుంది. తరువాత ఇంకా శ్రామికులను పెంచితే క్షీణ ప్రతిఫలాలు వస్తాయి. అందువల్ల ఉపాంత ఉత్పత్తి రాబడి, సగటు ఉత్పత్తి రాబడి ఒక స్థాయి వరకు పెరిగి క్షీణిస్తాయి.

దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం 3

పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద ఉపాంత కారక వ్యయం (MFC), ఉపాంత కారక రాబడి (MFC) సమానంగా ఉండి సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. AFC, ARP ఇక్కడ సమానంగా ఉండటం వల్ల సాధారణ లాభాలు పొందుతుంది. శ్రామికులను OL1, యూనిట్లకు తగ్గిస్తే ‘E1‘ బిందువు వద్ద MFC, MRP సమానమైనాయి. ఈ బిందువు వద్ద ARP కంటే AFC తక్కువగా ఉండటం వల్ల లాభాలు వస్తాయి. అందువల్ల శ్రామికులను OL పెంచవచ్చు. కాని శ్రామికులను OL2 కు పెంచితే ‘E2‘ బిందువు వద్ద MFC, MRP సమానమైనాయి. ARP కంటే AFC ఎక్కువగా ఉండటం వల్ల సంస్థకు నష్టాలు వస్తాయి. అందువల్ల శ్రామికులను OL యూనిట్లకు తగ్గింటం జరిగింది. ఇక్కడ శ్రామికుల ఉపాంత ఉత్పత్తికి సమానంగా వేతనం ఉంటుంది.

ప్రమేయాలు :

  1. ఉత్పత్తి కారకాల మార్కెట్ పరిపూర్ణ పోటీ ఉంటుంది.
  2. ఉత్పత్తి కారకాలు అన్ని సజాతీయాలు.
  3. ఉత్పత్తి కారకాలకు పూర్తి గమనశీలత ఉంటుంది.
  4. సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది.
  5. ఒక ఉత్పత్తి కారకం ఉపాంత ఉత్పత్తిని కొలవవచ్చు.

ప్రశ్న 3.
వాస్తవిక వేతనం అంటే ఏమిటి ? వాస్తవిక నేతనాన్ని నిర్ణయించు అంశాలను పేర్కొనుము.
జవాబు:
శ్రామికులు వివిధ రంగాలలో వస్తూత్పత్తి ప్రక్రియలో తన సేవలను అందించారు. అందుకు ప్రతిఫల ఉత్పత్తిదారులిచ్చే ప్రతిఫలం లేదా ధరను వేతనం అంటారు. శ్రామికులకు ప్రతిఫలం లేదా ధరను ద్రవ్య రూపం చెల్లిస్తారు. ద్రవ్య రూపంలో ఇచ్చిన వేతనం కొనుగోలు శక్తిని వాస్తవిక వేతనం అంటారు. ఇది ద్రవ్యం కొనుగోలు ఆధారపడుతుంది. ఈ కొనుగోలు శక్తి సాధారణ ధర సూచికపై ఆధారపడి ఉంటుంది. ధరల స్థాయి మారుతున్నప్పుడు ద్రవ్యవేతనంలో మార్పులు లేకపోయినా వాస్తవిక వేతనంలో మార్పు వస్తుంది. వాస్తవిక వేతనమే శ్రామికుని ఓ ప్రమాణస్థాయిని నిర్ణయిస్తుంది. ప్రజలు వినియోగిస్తున్న వస్తువులు, వాటి పరిమాణాలు, నాణ్యతను అనుసరించి బాట జీవన ప్రమాణాలు నిర్ణయించబడతాయి.

వాస్తవిక వేతనాన్ని నిర్ణయించే అంశాలు:
1) ద్రవ్యం కొనుగోలు శక్తి: సాధారణంగా ద్రవ్యానికుండే కొనుగోలు శక్తిపై వాస్తవిక వేతనాలు ఆధారపడి ఉంటాయి. ద్రవ్యానికి కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు శ్రామికులు తమ వేతనంలో ఎక్కువ సౌకర్యాలను సమకూర్చుకోగలరు. ద్రవ్యం కొనుగోలు శక్తి తగ్గినప్పుడు శ్రామికుల వాస్తవిక వేతనం తగ్గుతుంది.

2) వేతనమిచ్చే విధానము: శ్రామికులకు ఇచ్చే ద్రవ్య వేతనంతోపాటు యాజమాన్యం కొన్ని సదుపాయాలను కూడా కల్పిస్తుంది. ఉదా: ఉచిత వసతి సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు మొదలైనవాటివల్ల వారి వాస్తవిక వేతనాలు అధికమవుతాయి.

3) ఉద్యోగ స్వభావము: చేసే పని స్వభావం మీద కూడా వాస్తవిక వేతనాలు ఆధారపడతాయి. కొన్ని వృత్తులలో పని దుర్భరంగా ఉంటుంది. కొన్ని వృత్తులు ఆపదతో కూడినవిగా ఉంటాయి. అటువంటి వృత్తులలో ద్రవ్యవేతనాలు ఎక్కువగా ఉన్నా వాస్తవిక వేతనాలు తక్కువ. ఆహ్లాదకరమైన వృత్తులలో ద్రవ్యవేతనాలు తక్కువైనా వాస్తవిక వేతనాలు ఎక్కువని ఉద్యోగ స్వభావాన్నిబట్టి చెప్పవచ్చును. ఉదా: గనులలో పనిచేసేవారి వృత్తి దుర్భరంగా ఉంటుంది. కనుక ద్రవ్య వేతనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

4) పనిచేసే పరిస్థితులు: అనారోగ్యకరమైన పరిసరాలలో పనిచేసే శ్రామికుల వేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ గంటలు పనిచేసేవారి ద్రవ్యవేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం రేటు తక్కువగా ఉంటుంది.

5) ఆకస్మిక లాభాలు: యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, పోటీ సంస్థలు మూతపడుట మొదలైన కారణాల వల్ల ధరలు పెరిగి లభించే ఆకస్మిక లాభాలు నికరలాభంలో అంతర్భాగంగా ఉంటాయి.

ప్రశ్న 4.
స్థూల లాభం, నికరలాభంలో ఉన్న అంశాలను వ్రాయండి.
జవాబు:
మొత్తం రాబడి నుండి మొత్తం వ్యయం తీసివేయగా మిగిలినదానిని స్థూలలాభం అని అంటారు. స్థూలలాభంలో ఉన్న అంశాలు:
1) ఉద్యమదారుని సొంత మూలధనం మీద వడ్డీ: వ్యవస్థాపకుడు ఉత్పత్తి ప్రక్రియలో సొంత మూలధనం ఉపయోగిస్తే దానిమీద చెల్లించే వడ్డీని లెక్కలోకి తీసుకోవాలి.

2) సొంత భూమి మీద భాటకం: ఉత్పత్తి ప్రక్రియలో తన సొంత భూమిని ఉపయోగిస్తే దానికి భాటకం లెక్కగట్టాలి. దానిని లాభంగా అన్వయించకూడదు.

3) నిర్వహణ వేతనాలు: వ్యవస్థాపకుడే వ్యాపారాన్ని నిర్వహించి, అజమాయిషీ చేస్తే అతని సేవలకు వేతనం ఇవ్వాలి. అది స్థూలలాభంలో తీసివేయాలి.

4) బీమా ఖర్చులు: యంత్రాల తరుగుదల, బీమా వ్యయాలు మొదలైనవాటిని స్థూలలాభాల నుండి తీసివేయాలి.

5) నికరలాభం: వ్యవస్థాపనకు ఉత్పత్తికరమైన సేవలకు మాత్రమే వచ్చే ప్రతిఫలం నికరలాభం.

6) భవిష్యదవకాశాలు: భవిష్యత్తులో పదోన్నతి జరిగి ఎక్కువ సంపాదించుకునే అవకాశమున్న వృత్తులలో ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ, వాస్తవిక వేతనం ఎక్కువగా ఉంటుంది.

7) వృత్తి స్థిరత్వం: ప్రతి శ్రామికుడు ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ శాశ్వతమైన ఉద్యోగం కోరుకుంటాడు. కాని తాత్కాలికమైన ఉద్యోగంలో ద్రవ్యవేతనం ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో నిరుద్యోగిగా ఉండిపోవలసి వస్తుంది. కనుక వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది.

8) అదనపు రాబడి: అదనపు రాబడి ఆర్జించటానికి అవకాశమున్న వృత్తులలో ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ వారి వాస్తవిక వేతనం ఎక్కువగా ఉంటుంది. ఉదా: అధ్యాపకులు, టైపిస్టులు మొదలైనవారు అదనపు రాబడిని ఆర్జించగలరు.

నికరలాభంలో ఉన్న అంశాలు: స్థూలలాభంలో అంతర్భాగంగా ఉన్న వ్యవస్థాపక సేవలకు వచ్చే ప్రతిఫలాన్ని మాత్రమే నికర లాభం అంటారు.
ఎ) నష్టభయాన్ని భరించడం: వ్యాపారంలో బీమా చేయలేని నష్టభయాలను, అనిశ్చితాలను భరించినందుకు వచ్చే ప్రతిఫలం నికర లాభంలో అంతర్భాగంగా ఉంటుంది.

బి) ఉత్పత్తి కారకాల సమన్వయం: ఉత్పత్తి కారకాలను ఒకచోట చేర్చి అభిలషణీయ అనుపాతంలో కూర్చి, సమన్వయపరిచినందుకు వచ్చే ప్రతిఫలాలు నికరలాభంలో ఇమిడి ఉంటాయి.

సి) మార్కెటింగ్ సేవలు: ఉత్పత్తి కారకాలను కొనుగోలుచేసి తయారైన వస్తువులను విక్రయించటంలో వ్యవస్థాపకుని మార్కెటింగ్ సమర్థతకు ప్రతిఫలం నికరలాభంలో అంతర్భాగం.

డి) నవకల్పనలు ప్రవేశపెట్టడం: నూతన ఉత్పత్తి పద్ధతులు ప్రవేశపెట్టడం, నూతన మార్కెట్లు కనుక్కోవడం, నూతన వస్తువులను తయారుచేయడంలాంటి నవకల్పనలు ప్రవేశపెట్టినందుకు చెల్లించే పారితోషికం నికరలాభంలో అంతర్భాగం.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

ప్రశ్న 5.
వేతనం అంటే ఏమిటి ? వేతన సిద్ధాంతాలను వివరించండి.
జవాబు:
వేతనం – సిద్ధాంతాలు – భావనలు: శ్రామికులు ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొని ప్రతిఫలాన్ని ఆశించి చేసే పనిని శ్రమ అంటారు. ఈ శ్రమ శారీరకమైనదైనా లేదా మానసికమైనదైనా కావచ్చు. అంటే శ్రామికులు ఉత్పత్తికి అందించిన సేవలకు చెల్లించే ధరను వేతనం అంటారు.

ఆర్థికవేత్తలు అనేక వేతనసిద్ధాంతాలను రూపొందించారు.
1) జీవనాధార వేతన సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రకృతి ధర్మవాదులు రూపొందించారు. అయితే డేవిడ్ కార్డో ఈ సిద్ధాంతానికి ఒక స్పష్టమైన రూపాన్నిచ్చారు. ఈ సిద్ధాంతం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవించడానికి కొన్ని కనీస అవసరాలుంటాయి. కాబట్టి శ్రామికుని శ్రమని చెల్లించే వేతనం అతని కనీస అవసరాలు తీర్చుకోగలిగిన జీవన వ్యయానికి సరిపోయేటట్లు ఉండాలి. అయితే శ్రామికుని శ్రమకు ప్రతిఫలంగా చెల్లించే వేతనం అతనికి, అతని కుటుంబ పోషణకు సరిపడేటట్లుగా ఉండాలి. దీనినే జీవనాధార వేతన సిద్ధాంతం అంటారు.

2) వేతన నిధి సిద్ధాంతం: J.S. మిల్ తన గ్రంథమైన “The Principles of Political Economy” లో వేతన నిధి సిద్ధాంతాన్ని వివరించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఉద్యమదారుడు శ్రామికులకు వేతనాలు చెల్లించడానికి తన చర మూలధనంలో కొంత భాగాన్ని కేటాయిస్తాడు. ఉద్యమదారులందరూ ఈ విధంగా కేటాయించిన నిధిని వేతన
నిధి అంటారు.

3) వేతన పరిశిష్ట యోగ్యతా సిద్ధాంతం: వాకర్ అనే అమెరికా అర్థశాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తి ప్రక్రియలో భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అనే ఉత్పత్తి కారకాలనుపయోగించి చేసిన ఉత్పత్తిని అమ్మగా వచ్చిన రాబడిని భూమికి భాటకం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకునికి లాభం చెల్లించిన తరువాత మిగిలిన భాగాన్ని శ్రమకు వేతనంగా చెల్లించవలసి ఉంటుంది.

4) టాసిగ్ వేతన సిద్ధాంతం: టాసిక్ వేతన సిద్ధాంతం అభివృద్ధిపరచబడిన ఉపాంత ఉత్పాదకత వేతన సిద్ధాంతం, ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమైన తరువాత అంతిమ వస్తువులు రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి శ్రామికులకు ముందుగానే వేతనాలు చెల్లించాలి.

5) ఆధునిక వేతనాల సిద్ధాంతం: ఆధునిక వేతనాల సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్, J.R. హిక్స్లు ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం శ్రామికుల వేతనరేటు శ్రామిక మార్కెట్లో శ్రామికులకున్న డిమాండ్, సప్లయ్ల సమానత్వం వల్ల నిర్ణయించబడుతుంది. కాబట్టి శ్రామికుల డిమాండ్, సప్లయ్లు ఏ వేతనరేటు వద్ద సమానంగా ఉంటాయో అక్కడ సమతౌల్యం ఏర్పడి వేతనం నిర్ణయించబడుతుంది.

ప్రశ్న 6.
వివిధ లాభ సిద్ధాంతాలను తెల్పండి.
జవాబు:
వ్యవస్థాపకుడు చేసే ఉత్పత్తి నిర్వహణ కృషికి ఇచ్చే ప్రతిఫలమే లాభం.
లాభ సిద్ధాంతాలు:
1) చలన లాభ సిద్ధాంతం: J.R. క్లార్క్ ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈ సిద్ధాంతం ప్రకారం వస్తూత్పత్తి వ్యయం కంటే ధర ఎక్కువగా ఉంటే లాభం వస్తుంది. నిశ్చల ఆర్థిక వ్యవస్థలో పోటీ పరిస్థితుల వల్ల ఉత్పత్తి కారకం తన ఉత్పాదక శక్తికి సమానంగా వేతనం పొందుతుంది. అందువల్ల ఉద్యమదారులు లాభాలు పొందలేరు. కాని వేతనాలు
పొందుతారు.

2) నవకల్పన సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని షుంపీటర్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఉద్యమదారుని నవకల్పనా నైపుణ్యాలకు పారితోషికంగా లాభం చెల్లించబడుతుంది. ఉద్యమదారుడు ఉత్పత్తి కార్యక్రమంలో ప్రవేశపెట్టే నవకల్పన వల్ల ఉత్పత్తి వ్యయం ధరకంటే తక్కువగా ఉండి లాభం వస్తుంది.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

3) హాలే నష్టభయ లాభ సిద్ధాంతం: హాలే ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమదారుడు తప్ప మిగిలిన ఏ ఉత్పత్తి కారకం నష్టభయాన్ని భరించడు. అందువల్ల ఇతర ఉత్పత్తి కారకాలకు పంచగా మిగిలిన ఆదాయం ఉద్యమదారునికి చెందుతుంది.

4) అనిశ్చితత్వ లాభ సిద్ధాంతం: నైట్ ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఇది మెరుగుపరచబడిన నష్టభయ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొన్నందుకు ఉద్యమదారునికి చెల్లించే ప్రతిఫలమే లాభం.

5) వాకర్ సిద్ధాంతం: వాకర్ తన సిద్దాంతంలో ఉద్యమదారుని, పెట్టుబడిదారుని వేరుచేసి చూపాడు. వాకర్ ప్రకారం ఉద్యమదారుల సామర్థ్యానికి చెల్లించే ప్రతిఫలం లాభం. వాకర్ లాభ సిద్ధాంతం రికార్డో భాటక సిద్ధాంతాన్ని పోలి ఉంది.

ప్రశ్న 7.
వడ్డీ అంటే ఏమిటి ? వడ్డీ సిద్ధాంతాలను వివరించండి.
జవాబు:
అర్థశాస్త్రంలో మూలధనానికి చెల్లించే ధరని వడ్డీ అంటారు. రుణగ్రహీత మూలధన సేవలను ఉపయోగించు కున్నందుకు రుణదాతకు చెల్లించే ధరే వడ్డీ.
ఈ వడ్డీ భావనలు రెండు రకాలు 1. స్థూల వడ్డీ 2. నికర వడ్డీ

1) నిరీక్షణ వడ్డీ సిద్ధాంతం లేదా పరిత్యాగ వడ్డీ సిద్దాంతం ఈ సిద్దాంతాన్ని నాసా సీనియర్ ప్రతిపాదించారు. వ్యక్తులు తమ వినియోగాన్ని పరిత్యజించి, ఆదాయాన్ని పొదుపు చేసి మూలధన నిధులను సమకూర్చుతారు. ఈ విధంగా వ్యక్తులకు తమ ప్రస్తుత వినియోగాన్ని పొదుపు కోసం వాయిదా వేసిన త్యాగానికి ప్రతిఫలంగా కొంత పారితోషికం ఇవ్వాలి. ఈ పారితోషికం లేకపోతే వ్యక్తులు తమ ఆదాయాన్ని పొదుపుచేయరు. అందువల్ల నాసా సీనియర్ వడ్డీని త్యాగానికి ఇచ్చే ప్రతిఫలంగా భావించారు.

2) బోమ్బావర్క్ సిద్ధాంతం: ఆస్ట్రియన్ ఆర్థికవేత్త బోమ్బవర్క్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీన్ని మానసిక వడ్డీ సిద్ధాంతం అని కూడా అంటారు. ప్రజలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపుచేస్తే భవిష్యత్ వినియోగం కోసం వర్తమాన వినియోగం వాయిదా వేయాల్సి ఉంటుంది. ప్రజలు భవిష్యత్ వినియోగం కంటే వర్తమాన వినియోగంలో ఎక్కువ సంతృప్తి లభిస్తుంది అని భావిస్తారు. అంటే భవిష్యత్ సంతృప్తి వర్తమానంతో పోల్చితే డిస్కౌంట్ చేయబడుతుంది. అందువల్ల వర్తమాన వినియోగాన్ని వాయిదా వేసి పొదుపు చేసిన మొత్తాన్ని అప్పుగా ఇచ్చేటట్లు ప్రోత్సహించడానికి వడ్డీ చెల్లించాలి.

3) కాలాభిరుచి వడ్డీ సిద్ధాంతం: అమెరికన్ ఆర్థికవేత్త ఇర్వింగ్ ఫిషర్ కాలాభిరుచి వడ్డీ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈయన వడ్డీని నిర్ణయించడంలో కాలాభిరుచిని పరిగణనలోకి తీసుకున్నాడు. దీనిని బట్టి భవిష్యత్లో ఆదాయం నిశ్చితంగా ఉంటుందని భావిస్తే, వర్తమాన కాలాభిరుచి తక్కువగా ఉండి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్లో ఆదాయం అనిశ్చితంగా ఉంటుందని భావిస్తే వర్తమాన కాలాభిరుచి ఎక్కువగా ఉండి వడ్డీరేటు తక్కువగా ఉంటుంది.

4) కీన్స్ ద్రవ్యత్వాభిరుచి వడ్డీ సిద్ధాంతం: కీన్స్ తన గ్రంథమైన The General Theory of Employment, Interest and Money ద్రవ్యత్వాభిరుచి వడ్డీ సిద్ధాంతాన్ని వివరించారు. ద్రవ్యాన్ని ద్రవ్యరూపంలో తమ వద్ద ఉంచుకోవాలనే ప్రజల కోర్కెను “ద్రవ్యత్వాభిరుచి” అంటారు. ద్రవ్యానికి మాత్రమే అన్నిటికంటే ద్రవ్యత్వం ఎక్కువగా
ఉంటుంది.

ద్రవ్య డిమాండ్: ద్రవ్యత్వాభిరుచినే ద్రవ్యానికి గల డిమాండ్ అంటారు. ద్రవ్యానికి డిమాండ్ కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.

  1. వ్యాపార వ్యవహారాల కోసం
  2. ముందు జాగ్రత్త కోసం
  3. అంచనా వ్యాపారం కోసం
  4. రుణాత్మక నిధుల సిద్ధాంతం

ఈ సిద్ధాంతాన్ని నట్విక్సెల్ అనే ఆర్థికవేత్త ముందుగా ప్రతిపాదించారు. దీనినే నవ్య సాంప్రదాయ సిద్ధాంతం అని కూడా అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం రుణాత్మక నిధుల డిమాండ్, సప్లయ్లు సమతౌల్యం వడ్డీ రేటును నిర్ణయిస్తాయి.

5) ఉపాంత ఉత్పాదకత సిద్ధాంతం ఈ సిద్ధాంతం ప్రకారం వడ్డీరేటు మూలధన ఉపాంత ఉత్పాదకతకు తక్కువ సమానంగా ఉండాలి. మూలధనానికి డిమాండ్ పెరిగే కొద్దీ దాని ఉపాంత ఉత్పాదకత క్షీణిస్తుంది. కాబట్టి తక్కువ వడ్డీరేటు చెల్లించబడుతుంది. కాబట్టి మూలధనానికున్న డిమాండ్, వడ్డీరేటు విలోమ సంబంధం కలిగి ఉంటాయి.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పంపిణీ భావనలను వివరించండి.
జవాబు:
అర్థశాస్త్రంలో పంపిణీ భావనను రెండు అర్థాలలో ఉపయోగించడం జరుగుతుంది. అంటే జాతీయాదాయ పంపిణీని రెండు విధాలుగా పరిశీలించవచ్చు.

  1. విధులననుసరించి పంపిణీ.
  2. వైయక్తిక పంపిణీ

1) విధులననుసరించి పంపిణీ: ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలు సేవలందించినందుకు గాను, అవి ప్రతిఫలాలుగా భాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో పొందుతాయి. ఒక ఉత్పత్తి కారకం ఏవిధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో విధులననుసరించి పంపిణీ తెలియజేస్తుంది. కొంతమంది. ఒకటికంటే ఎక్కువ ఉత్పత్తి కారకాలకు యజమానులుగా ప్రతిఫలాలను పొందవచ్చు. ఒక ఉత్పత్తి కారకం ఏవిధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో విధులననుసరించి పంపిణీ తెలుపుతుంది. విధులననుసరించి జరిగే పంపిణీని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

a) సూక్ష్మ పంపిణీ: సూక్ష్మ పంపిణీ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు ఒక ఉత్పత్తి కారకం ధర ఏవిధంగా ఎంత నిర్ణయించబడుతుందో వివరిస్తుంది.
ఉదా: శ్రామికుల వేతన రేటు నిర్ణయం.

b) స్థూల పంపిణీ: జాతీయాదాయంలో వివిధ ఉత్పత్తి కారకాల వాటా ఎంత ఉందో పంపిణీ స్థూల వివరిస్తుంది.
ఉదా: మొత్తం జాతీయాదాయంలో వేతనాల వాటా ఎంత ఉంది అనే విషయాన్ని స్థూల పంపిణీ తెలియజేస్తుంది.

2) వైయక్తిక పంపిణీ: దేశంలోని వ్యక్తుల మధ్య జాతీయాదాయాన్ని పంపిణీ చేయడాన్ని వైయక్తిక పంపిణీ అంటారు. ఇక్కడ వ్యక్తులు ఎంత ఆదాయం పొందుతున్నారు అనే విషయాన్ని పరిశీలిస్తారు. అంతేగాని ఏవిధంగా లేదా ఎన్ని విధాలుగా పొందారు అనే విషయ పరిశీలన ప్రధానం కాదు. వైయక్తిక పంపిణీ పరిశీలన ద్వారా ఆదాయ అసమానతలను అందుకు గల కారణాలను తెలుసుకోవచ్చు.

ప్రశ్న 2.
ఉత్పత్తి కారకాల ధరను నిర్ణయించే అంశాలను పేర్కొనండి. [Mar 16]
జవాబు:
ఉత్పత్తి కారకాల ధరలను వాటి డిమాండ్, సప్లయ్ లు కలసి నిర్ణయిస్తాయి. ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయించే అంశాలు:

  1. ఉత్పత్తి కారకాల డిమాండ్ ఉత్పన్న డిమాండ్ లేదా పరోక్ష డిమాండ్ అంటే ఉత్పత్తి కారకం డిమాండ్ అది ఉత్పత్తి చేసే వస్తువు డిమాండ్పై ఆధారపడి ఉంటుంది.
  2. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ దాని ధరపై ఆధారపడి ఉంటుంది.
  3. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ ఉత్పత్తి తనకు సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలపై ఆధారపడి ఉంటుంది.
  4. సాంకేతిక విజ్ఞానం ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయిస్తుంది.
    ఉదా: కంప్యూటరీకరణ వల్ల శ్రామికుల డిమాండ్ గణనీయంగా తగ్గింది.
  5. తరహాననుసరించి ప్రతిఫలాలు ఉత్పత్తి కారకం డిమాండ్ను నిర్ణయిస్తాయి. ఉత్పత్తిలో పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తుంటే ఉత్పత్తి కారకాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
  6. ఉత్పత్తి కారకాల సప్లయ్ని నిర్ణయించే అంశాలు.
    ఉదా: శ్రామికుల సప్లయ్

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

ప్రశ్న 3.
కొరత భాటకం అనే భావనను వివరించండి.
జవాబు:
కొరత భాటకం: కొరత భాటకం అనే భావనను మార్షల్ భూమి, సప్లయ్, డిమాండ్ ప్రాతిపదికగా వివరించాడు. భూమి, సప్లయ్ స్థిరంగా ఉంటుంది. కాని డిమాండ్ పెరుగుతుంది. అటువంటప్పుడు భూమి కొరత వల్ల దానికి మామూలు ధర కంటే ఎక్కువ ధరను ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా కొరత వల్ల భూమికి వచ్చే అధిక లేక అదనపు ధరను కొరత భాటకం అంటారు. భూమి, సప్లయ్ అవ్యాకోచంగా ఉండటం వల్ల ఈ కొరత భాటకం ఏర్పడుతుంది. ఇది డిమాండ్ పెరుగుతూ ఉంటే భాటకం పెరుగుతూ ఉంటుంది.

పై రేఖాపటంలో SL రేఖ భూమి అవ్యాకోచ సప్లయ్న సూచించును. DD రేఖ డిమాండ్ రేఖను, SL రేఖ E బిందువు వద్ద ఖండించుకున్నప్పుడు ధర ‘OR’ గా ఉంది. డిమాండ్ పెరగడం వల్ల నూతన డిమాండ్ రేఖ D D సప్లయ్ రేఖ SL ను E బిందువు వద్ద ఖండిస్తుంది. ఇక్కడ భూమి యొక్క ధర OR, గా ఉంది. ఈ విధంగా డిమాండ్ పెరిగే కొద్ది భూమి ధర OR నుంచి OR, కు, OR, నుంచి OR కు పెరిగింది.

ప్రశ్న 4.
కృత్రిమ భాటకం అనే భావనను వివరించండి.
జవాబు:
కృత్రిమ భాటకం అనే భావనను మార్షల్ ప్రవేశపెట్టాడు. స్వల్ప కాలంలో మానవ నిర్మితాలైన యంత్ర సామాగ్రి, భవనాలకు సప్లయ్ అవ్యాకోచంగా ఉంటుంది. వీటికి డిమాండ్ పెరిగితే ధర సగటు వ్యయం కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ అదనపు ధర లేదా వాటి నుండి వచ్చిన అదనపు రాబడినే కృత్రిమ భాటకమని మార్షల్ పేర్కొన్నాడు. స్వల్ప కాలంలో కొన్ని వస్తువులకు డిమాండ్ పెరిగినప్పటికి సప్లయ్ పెంచడానికి అవకాశం ఉండదు. కనుక ఆ వస్తువులకు కృత్రిమ భాటకం ఏర్పడుతుంది. సగటు చర వ్యయం కంటే అధికంగా వచ్చే ధర లేదా అదనపు రాబడినే కృత్రిమ భాటకం అంటారు. దీర్ఘకాల వ్యవధిలో వీటి డిమాండు అనుగుణంగా సప్లయ్న మార్చడానికి వీలుంటుంది. కనుక దీర్ఘ కాలంలో ఈ భాటకం ఉండదు.
AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం 4

పై రేఖాపటంలో ‘X’ అక్షంపై డిమాండ్, సప్లయ్లాను, OY అక్షంపై భాటకాన్ని తీసుకున్నాం. SPS స్వల్పకాలిక సప్లయ్ అవ్యాకోచరేఖ. LPS దీర్ఘకాలిక సప్లయ్ వ్యాకోచరేఖ. స్వల్పకాలంలో RR, మిగులు లేదా భాటకం లభ్యమవుతుంది. కాని దీర్ఘకాలంలో భాటకం అదృశ్యమవుతుంది.

స్థూలవడ్డీ, నికర వడ్డీ ఖాతలను వివిరిస్తూ, స్థూల వడ్డీలోని అంతర్భాగాలను పేర్కొనుము. అర్థశాస్త్రంలో మూలధనానికి చెల్లించే ధరే వడ్డీ అని పిలుస్తారు.
వడ్డీ భావనలు రెండు రకాలు:

  1. స్థూలవడ్డీ
  2. నికరవడ్డీ

1) స్థూలవడ్డీ: రుణం తీసుకొన్న వ్యక్తి తాను తీసుకొన్న మొత్తంతో పాటు ఎంత అదనంగా రుణదాతకు స్తున్నాడో ఆ మొత్తాన్ని స్థూలవడ్డీ అంటారు. స్థూలవడ్డీలో అనేక అంశాలు కలిసి ఉంటాయి.

2) నికరవడ్డీ: నికరవడ్డీ అంటే కేవలం మూలధన సేవలకు మాత్రమే ఇచ్చే ప్రతిఫలం. ఆర్థిక పరిభాషలో వడ్డీ వాస్తవికమైంది. ఉదా: ప్రభుత్వ బాండ్లు, ప్రభుత్వ రుణాల మీద చెల్లించే వడ్డీ.

స్థూలవడ్డీలోని అంతర్భాగాలు:
1) నష్టభయానికి చెల్లించే మూల్యం: రుణదాత రుణమివ్వటంలో రెండు రకాలైన నష్టభయాలను ఎదుర్కోవాలి. వ్యక్తిగత నష్టభయం, వ్యాపారరీత్యా నష్టభయం రుణం తీసుకొన్న వ్యక్తి సకాలంలో తిరిగి చెల్లించకపోవచ్చు. ఈ భయాలను తొలగించుకోవడానికి కొంత అదనంగా వడ్డీ రూపంలో వసూలు చేస్తాడు.

2) అసౌకర్యానికి చెల్లింపు: అప్పు ఇచ్చే వ్యక్తి ఆ డబ్బును తాత్కాలికంగా వదులుకోవడం వల్ల కొంత అసౌకర్యానికి అవుతాడు. రుణదాత తాను ఇచ్చిన రుణాన్ని సకాలంలో పొందలేకపోవచ్చు. ఇచ్చిన రుణం తిరిగి పొందేలోపు అవసరాలను వాయిదా వేసుకోవాలి. రుణమిచ్చిన కారణంగా ద్రవ్యం తన చేతిలో లేనందువల్ల ధరలు తగ్గి ద్రవ్యం గోలు శక్తి పెరగడం లాంటి అవకాశాలు వస్తే వదులుకోవాలి. రుణదాత ఈ అసౌకర్యాలను భరించినందుకు …గ్రస్తుని నుంచి కొంత అదనంగా వడ్డీ రూపంలో తీసుకుంటాడు.

3) నిర్వహణావ్యయం: రుణదాత తన విధులు నిర్వహించడానికి కొంత ఖర్చు చేయాలి. రుణగ్రస్తుల ఖాతాలు చాలి. అందుకుగాను సిబ్బంది జీతాలను, అకౌంటు పుస్తకాల ఖర్చులను భరించాలి. అప్పు ఇచ్చేందుకు వీలుగా ఒకప్సు పొందాలి. కొన్నిసార్లు రుణాలను వసూలు చేసుకునేందుకుగాను సిబ్బందిని నియమించుకోవాల్సి రావడంతోపాటు సుస్థానాలకు కూడా వెళ్ళాల్సివస్తుంది. ఈ నిర్వహణా ఖర్చులను భరించినందుకుగాను అదనంగా కొంత మొత్తాన్ని రూపంలో తీసుకుంటాడు.
స్థూలవడ్డీ = నికరవడ్డీ + (నష్టభయానికి మూల్యం + అసౌకర్యానికి చెల్లింపు + నిర్వహణావ్యయం)

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒప్పంద భాటకం [Mar. ’16, ’15]
జవాబు:
ఒప్పంద భాటకం అంటే నిర్ణీతకాలానికి భూమి సేవలకు, గృహాలకు ముందుగా నిర్ణయించిన ఒప్పందం ప్రకారం చే ప్రతిఫలం.

ప్రశ్న 2.
ఆర్థిక భాటకం
జవాబు:
ఆర్థిక భాటకం కేవలం భూమికే పరిమితం కాకుండా మిగతా మూడు ఉత్పత్తి కారకాలైన శ్రమ, మూలధనం, వ్యవస్థాపనకు వర్తిస్తుంది. ఇది మూడు రకాలు

  1. కొరత భాటకం
  2. కృత్రిమ భాటకం
  3. బదిలీ సంపాదన

ప్రశ్న 3.
కొరత భాటకం [Mar. ’17]
జవాబు:
కొరత భాటం అనే భావనను అభివృద్ధి చేసింది మార్షల్. కొరత భాటకం అంటే అవ్యాకోచ సప్లయ్ ఉన్న భూమికి చెల్లించే ధర.

ప్రశ్న 4.
కృత్రిమ భాటకం
జవాబు:
కృత్రిమ భాటకం అను భావనను ప్రవేశపెట్టింది మార్షల్. కృత్రిమ భాటకం అంటే మానవ నిర్మిత యంత్రాలు, యంత్ర పరికరాలు అతి స్వల్ప కాలంలో ఆర్జించే మిగులు ధర.

ప్రశ్న 5.
బదిలీ సంపాదన
జవాబు:
ఒక ఉత్పత్తి కారకం తన అత్యుత్తమ ప్రత్యామ్నాయ ఉపయోగంలో ఆర్జించే మిగులు.

ప్రశ్న 6.
ద్రవ్య వేతనం
జవాబు:
ద్రవ్య వేతనం అంటే శ్రామికుని శ్రమకు నగదు రూపంలో చెల్లించే ధర లేదా ప్రతిఫలం.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

ప్రశ్న 7.
వాస్తవిక వేతనం [Mar, ’16]
జవాబు:
వాస్తవిక వేతనాన్ని అభివృద్ధి పరిచినది ఆడమస్మిత్. వాస్తవిక వేతనం అంటే శ్రామికుడి శ్రమకు ప్రతిఫలంగా పొందిన ద్రవ్యవేతనం కొనుగోలుశక్తి.

ప్రశ్న 8.
కాలాన్ని బట్టి వేతనం
జవాబు:
కాలాన్ని బట్టి వేతనం అంటే శ్రామికుల ఉత్పాదకతతో సంబంధం లేకుండా నిర్ణీత కాలానికి ఒక వృత్తిలో | పనిచేసే వారందరికి ఒకే వేతనం చెల్లించడం.

ప్రశ్న 9.
పనిని బట్టి వేతనం
జవాబు:
శ్రామికుల ఉత్పాదకత, నైపుణ్యం బట్టి చెల్లించే వేతనంను పనిని బట్టి వేతనం అంటారు.

ప్రశ్న 10.
స్థూల వడ్డీ
జవాబు:
రుణం తీసుకున్న వ్యక్తి తాను తీసుకొన్న మొత్తంతో పాటు అదనంగా ఋణదాతకు ఎంత చెల్లిస్తున్నాడో, మొత్తాన్ని స్థూల వడ్డీ అంటారు.

ప్రశ్న 11.
నికర వడ్డీ
జవాబు:
మూలధన సేవలకు మాత్రమే ఇచ్చే ప్రతిఫలం.
ఉదా: ప్రభుత్వ బాండ్లు, ప్రభుత్వ ఋణాలపై వడ్డీ.

ప్రశ్న 12.
స్థూల లాభం [Mar. ’15]
జవాబు:
రాబడి నుండి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు, తరుగుదల తీసివేయగా మిగిలినది స్థూల లాభం.
స్థూల లాభం = నికర లాభం + అప్రకటిత భాటకం + అప్రకటిత వేతనం+ అప్రకటిత వడ్డీ + తరుగుదల + భీమా చెల్లింపులు.

AP Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతం

ప్రశ్న 13.
నికర లాభం [Mar. ’17]
జవాబు:
వ్యవస్థాపకుని సేవలకు మాత్రమే వచ్చే ప్రతిఫలం నికర లాభం.
నికర లాభం = స్థూల లాభం – అప్రకటిత భాటకం + అప్రకటిత వేతనం + అప్రకటిత వడ్డీ + తరుగుదల + భీమా చెల్లింపులు.