Students can go through AP Inter 1st Year Physics Notes 10th Lesson ఘనపదార్ధాల యాంత్రిక ధర్మాలు will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Physics Notes 10th Lesson ఘనపదార్ధాల యాంత్రిక ధర్మాలు
→ వస్తువు ఏ ధర్మం వల్ల తనలో కలిగిన మార్పులను ప్రతిఘటిస్తుందో మరియు దానిపై ప్రయోగించిన రూపాంతరం చెందించే బలాలను తీసివేయగానే తన తొలి స్థానాన్ని పొందుతుందో ఆ ధర్మాన్నే స్థితిస్థాపకత అంటారు.
→ వస్తువులో ప్రమాణ వైశాల్యంపై ఏర్పడిన పునఃస్థాపక బలాన్ని ప్రతిబలం అంటారు.
→ వస్తువు యొక్క ప్రమాణ పరిమాణంలో ఏర్పడే మార్పునే వికృతి అంటారు.
→ ఎంత గరిష్ఠ ప్రతిబలం లోపున ఒక వస్తువు రూపం మార్చే బలాలను తొలగించిన పిమ్మట పూర్తిగా తన తొలి స్థితిని పొందుతుందో, ఆ ప్రతిబలం విలువని స్థితిస్థాపక అవధి అంటారు.
→ హుక్ నియమం : అనుపాతక అవధి లోపల, వస్తువులోని ప్రతిబలం దానిలో ఏర్పడిన వికృతికి అనులోమాను పాతంలో ఉంటుంది.
→ ఒక తీగ పొడవులో కలిగే మార్పుకి, దాని తొలి పొడవుకి మధ్య గల నిష్పత్తినే అనుదైర్ఘ్య లేదా రేఖీయ వికృతి అంటారు.
రేఖీయ వికృతి = \(\frac{\Delta \mathrm{L}}{\mathrm{L}}=\frac{\mathrm{e}}{\mathrm{L}}\)
→ రెండు పొరల మధ్య, సాపేక్ష స్థానభ్రంశం మరియు ఆ రెండు పొరల మధ్య గల దూరం నిష్పత్తిని విరూపణ వికృతి (θ) అంటారు.
→ ప్రమాణ తొలి ఘనపరిమాణంలో కలిగే మార్పుని ఆయత లేదా స్థూల వికృతి అంటారు.
ఆయత వికృతి = \(\frac{\Delta v}{V}\)
→ అనుపాతక అవధి లోపల, అనుదైర్ఘ్య ప్రతిబలానికి, అనుదైర్ఘ్య వికృతికి మధ్య గల నిష్పత్తినే స్థితిస్థాపక యంగ్ గుణకం (Y) అంటారు.
Y = \(\frac{\mathrm{Fl}}{\mathrm{Ae}}\)
→ అనుపాతక అవధి లోపల, విరూపణ ప్రతిబలానికి, విరూపణ వికృతికి మధ్య గల నిష్పత్తినే స్థితిస్థాపక దృఢతా గుణకం (G) అంటారు.
G = \(\frac{F}{A \theta}\)
→ అనుపాతక అవధి లోపల, స్థూల ప్రతిబలానికి, స్థూల వికృతికి మధ్య గల నిష్పత్తినే స్థితిస్థాపక ఆయత గుణకం (B) అంటారు.
B = \(\frac{-\mathrm{PV}}{\Delta \mathrm{V}}\)
→ కొంతసేపు ఒక వస్తువు అవిచ్ఛిన్నంగా స్థితిస్థాపక వికృతికి లోనయితే అది తన స్థితిస్థాపక ధర్మాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది. కాని కొంతసేపు విశ్రాంతి పొందిన పిమ్మట తన యథాస్థితిని పొందుతుంది. ఈ ప్రవర్తనని స్థితిస్థాపక అలసట అంటారు.
→ పార్శ్వ సంకోచ వికృతికి, అనుదైర్ఘ్య వ్యాకోచ వికృతికి గల నిష్పత్తిని ఆ వస్తువు తయారయిన పదార్థం యొక్క పాయిజాన్ నిష్పత్తి అంటారు.
→ విమోటన వికృతి 2 × అనుదైర్ఘ్య వికృతి.
→ ఆయత వికృతి = 3 × అనుదైర్ఘ్య వికృతి.
→ ప్రతిబలం – వికృతి రేఖీయ భాగంలో మాత్రమే హుక్ నియమం వర్తిస్తుంది.
→ యంగ్ గుణకం, విమోటన గుణకం కేవలం ఘనపదార్థాలకు మాత్రమే వర్తిస్తాయి. ఆయత గుణకం ఘన, ద్రవ, వాయు పదార్థాలకు వర్తిస్తుంది.
→ మిశ్రమ లోహాలు, ఎలాస్టోమర్లు కంటే లోహాలకు యంగ్ గుణక విలువలు అధికంగా ఉంటాయి.
→ అమ్మ లోహాలకు ఉదాహరణ రాగి, అల్యూమినియమ్, సీసం, బంగారం. పెళుసు లోహాలకు ఉదాహరణ గాజు, సిరామిక్.
→ వస్తువులో విరూపణ వల్ల నిల్వయున్న శక్తిని వికృతి శక్తి అంటారు.
→ ప్రతిబలం సదిశరాశి కాదు.
→ రాబర్ట్ హుక్ (1635 – 1703 A.D.)
ఇంగ్లండ్లోని రైట్ (Wright) ద్వీపం, ఫ్రెష్ వాటర్ (Freshwater) లో 18 జూలై 1635వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ జన్మించాడు. 17వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల శాస్త్రవేత్తల్లో హుక్ విశిష్టమైన బహుముఖ ప్రజ్ఞాశాలి.