Students can go through AP Inter 1st Year Zoology Notes 2nd Lesson జంతుదేహ నిర్మాణం will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Zoology Notes 2nd Lesson జంతుదేహ నిర్మాణం
→ జీవుల నిర్మాణ క్రమంలో మౌలిక ప్రమాణాలు.
→ కణాలు చిన్నగా ఉండటం వల్ల పోషకాలు, వ్యర్థాల వినిమయానికి కావలసిన అధిక ఉపరితల వైశాల్య ఘనపరిమాణ నిష్పత్తి లభ్యమవుతుంది.
→ రైబోసోమ్లు ప్రోటీన్ల తయారీకి వర్క్ బెంచ్లు.
→ దీనిలో ప్రోటీన్లు ఐస్బర్గ్ వలె తేలియాడుతూ ఉంటాయి.
→ లిపిడ్ ఉత్పత్తి డ్రగ్స్ డిటాక్సిఫికేషన్ జరిగే స్థానం నునుపు ER.
→ ER నుంచి ఏర్పడిన పరివర్తన కోశాలు సిస్ తలంలో గాల్జీ పరికరంతో కలిసిపోతాయి.
→ గాయపడిన లేదా వ్యాధిగ్రస్తమైన కణాల లైసోసోమ్లను తరుచూ ఆత్మహత్యా కోశాలు అంటారు.
→ మైటోకాండ్రియాను కణం యొక్క శక్తి గృహాలు అని పిలుస్తారు.
→ మధ్యస్థ తంతువులు కణ ఆకారాన్ని, కణాంగాల స్థానాన్నీ కాపాడతాయి.
→ సూక్ష్మతంతువులు ఆక్టిన్ అణువులచే నిర్మితమైన ఘనంగా ఉండే తీగలు.
→ సూక్ష్మతంతువులు కండర సంకోచానికి సహాయపడతాయి.
→ సూక్ష్మ నాళికా వ్యవస్థీకరణ కేంద్రం (MTOC) నుంచి సూక్ష్మనాళికలు ఏర్పడతాయి.
→ కేంద్రకాంశం రైబోసోమ్ల జీవసంశ్లేషణలో పాల్గొంటుంది.
→ కేంద్రకం జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది.
→ ప్రతిస్కందకాలు (anticoagulants): రక్తం రక్తనాళాలలో ప్రవహించేటప్పుడు రక్తం గడ్డకట్టకుండా నిరోధించే పదార్ధాలు. ఉదా : హెపారిన్.
→ సంధి మృదులాస్థి (articular cartilage) : పొడవైన ఎముకల స్వేచ్ఛాతలంలో కీళ్ళు ఏర్పరచే భాగంలో మృదులాస్థి
→ బ్లబ్బర్ (thermal insulation): తిమింగలాలు, ఇతర జలచర క్షీరదాల చర్మం దిగువన గల మందమైన కొవ్వు పొర. ఇది ఉష్ణ నిరోధకం (thermal insulation) గా పనిచేస్తుంది.
→ కేంద్ర అక్షం: ఇది ఊహాజనిత నిటారు గీత. ఇది ఒక చివర మధ్యస్థానం లేదా ఉపరితలం. దాని వ్యతిరేక దిశలోని మధ్యస్థానం లేదా ఉపరితలాన్ని కలుపుతుంది. దీన్ని ప్రధాన అక్షం అంటారు.
→ డయాపెడిసిస్: రక్త కేశనాళికల కుడ్యం నుంచి ల్యూకోసైట్లు అమీబాయిడ్ కదలికలతో రక్తం నుంచి సంయోజక కణజాలం మాత్రికలోకి చేరడం.
→ అంతరస్తరం (ఎండోథీలియం): రక్తనాళాలు, హృదయం లోపలి తలాన్ని ఆవరించిన సాధారణ శల్కల ఉపకళ.
→ అధిబాహువులు (epiphyses): స్పంజికాస్థితో ఏర్పడిన పొడవు ఎముకల విస్తరించిన అంత్యభాగాలు.
→ లలాటికా తలం (frontal plane) : పూర్వ-పరాంతాలు, అడ్డు అక్షాల ద్వారా పోయే తలం.
→ రక్తకుహరం (haemocoel) : ఆర్థ్రోపొడా, మలస్కాజీవుల అంతరాంగ అవయవాల చుట్టూ గల క్రియాత్మక పర్యాంతరాంగ కుహరం. దీనిలో రక్తం (హీమోలింఫ్) నిండి ఉంటుంది.
→ హేవర్షియన్ కుల్య (haversian canal) : క్షీరదాల ఘానాలలో మజ్జా కుహరానికి సమాంతరంగా గల పొడవైన కుల్యలు. వీటిలో రక్తనాళాలు, శోషరస నాళాలు, నాడులు ఉంటాయి.
→ జలస్థితిక అస్థిపంజరం (hydrostatic skeleton) : సూడోసీలోమేట్, యూసీలోమేట్ జంతువులలో శరీరకుహరం ద్రవ్యంతో నిండి శరీరానికి అంతరాస్థిపంజరం లాగా సరియైన ఆకారాన్ని ఇస్తుంది.
→ స్నాయువు (ligament): సాధారణంగా ఒక ఎముకను ఇంకొక ఎముకను కలిపే సాంద్రమైన తంతుయుత కణజాల తీగ/తాడు. స్నాయువును అతిగా లాగినప్పుడు మంటతో కూడిన వాపు (sprain) సంభవిస్తుంది.
→ మద్య సమాయత తలం (median sagittal plane) : పూర్వ, పరాంత, సమాయత అక్షంలో పయనించే తలం.
→ స్థూలకారియో సైట్ : ఎర్ర ఎమకమజ్జలోని బృహత్కణాలు. ఇవి శకలీకరణంతో రక్తఫలకికలను ఉత్పత్తి చేస్తాయి.
→ కండర గ్లాని : వేగమైన శారీరక వ్యాయామం వల్ల అవాయు శ్వాసక్రియ జరిగి లాక్టిక్ ఆమ్లం పేరుకొనడం వల్ల కండర సంకోచాన్ని కొనసాగించలేని స్థితి.
→ ఎడిమా (oedema) : చర్మం దిగువ, ఒకటి లేదా రెండు కుహరాలలో అసాధారణ రీతిలో మధ్యాంతర ద్రవం పేరుకొంటుంది. రక్తంలో ప్లాస్మాప్రోటీన్లు ముఖ్యంగా నీరం ఆల్బుమిన్ స్థాయి పడిపోవడంతో ద్రవాభిసరణ పీడనం తగ్గడం వల్ల ఈ స్థితి కలుగుతుంది.
→ ఆస్టియోబ్లాస్టులు : పెరిగే ఎముక మాత్రికలో సేంద్రియ పదార్థాన్ని స్రవించే అపరిపక్వ కణాలు. ప్రౌడదశలో అపరిపక్వ కణాలు పరిపక్వ ఆస్టియోసైట్స్లో మారతాయి.
→ పర్యాంతరాంగ కుహరం (Perivisceral cavity) : అంతరాంగ అవయవాలను ఆవరించి కుహరం. నిమటోడా జీవుల పర్యాంతరాంగ కుహరాన్ని మిథ్యాశరీరకుహరం అంటారు. ఆనెలిడాలో ఉండే కుహరాన్ని యూసీలోమ్ అంటారు.
→ తలం (Plane) : ఏదైనా అక్షం ద్వారా పయనించే బల్లపరుపు తలం.
→ ప్రాథమిక ప్రేరేపణ (Primary induction): RBC సంఖ్య. అసాధారణంగా పెరిగిన స్థితి. ఎత్తైన ప్రాంతాలలో నివసించే వారిలో సాధారణంగా ఈ లక్షణం కనిపిస్తుంది. దీనికి కారణం అక్కడ ఆక్సిజన్ పాక్షిక పీడనం తక్కువగా ఉంటుంది.
→ ప్రాథమిక ప్రేరేపణ (Primary induction) : ప్రత్యేక కణజాలాల అభివృద్ధిలో వివిధ రకాలుగా ఆవిర్భవించిన కణజాలాల మధ్య ఒక రకమైన మధ్యాంతర చర్య (interaction).
→ మారిఫ్రాంకోల్స్ జేవియర్ చాట్
మారి ప్రాంకోల్స్ జేవియర్ చాట్ ఫ్రాన్కు చెందిన శరీరనిర్మాణ, శరీర ధర్మ శాస్త్రవేత్త. ఇతడికి నవీన కణ జాల శాస్త్ర. వ్యాధి విజ్ఞాన శాస్త్రవేత్త పితామహుడుగా గుర్తింపు ఉంది. ఇతడు కణజాలం అనే పదాన్ని మొట్ట మొదటగా ఉపయోగించిన వ్యక్తి. వ్యాధులు మొత్తం అవయవాలను కాకుండా కణజాలాన్ని దాడి చేస్తా యని ఈయన తెలిపాడు.